Wednesday, October 1, 2025

సినీ కథ లైనులు

 యాక్సడెంట్ లో ప్రాణాలు పోతాయి ఇద్దరికీ

స్నేహితుడే సాక్షి ఇద్దరి చావుకు

కాలంలో ఆస్ట్రెలియా పోతాడు ఫ్రెంఢు

ఓ ముప్పై సంవత్సరాల తరువాత బిజినెస్ మీద వచ్చేప్పటికి యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళతాడు స్మృతిగ 

అక్కడ ట్రాఫిక్ జామ్ లో యాక్సిడెంట్ అయి చనిపోయి మరు జన్మ ఎత్తిన ఇద్దరిని చూస్తాడు

వారు చెరువైపు పోతారు

కలా నిజమో తెలుసు కోవాలనుకుని మొత్తం తిరిగి ఇద్దరినీ వెతికి పట్టుకుని ఇద్దరి మధ్య ప్రెమను పుట్టించి పెళ్ళి చేసి తిగిరి తన దేశం పోతాడు ఫ్రెండు

Tuesday, September 30, 2025

 #అంటరానితనం.. #వెలివేయటం.. 

#మూడురూపాయిలు.. #ఎనిమిదిన్నర_రూపాయల జీతం..

#ఓ_బస్తాడు_ఒడ్లు..#ఓ_బీడీ_ట్ట. #చివరికి_ద్మభూషణ్అ_వార్డ్.

. #గడ్డ కట్టిన_మనుషుల_మధ్యన_జీవించిన #ఒక #మహోన్నతుడి_చరిత్ర.#చదవండి.

◆◆◆

#వడగాడ్పు_జీవితం

*మహాకవి గుఱ్ఱం జాషువా ప్రజ్ఞ బహుముఖీనం. ఆయన కవి, నాటక రచయిత, నేత్రావధాని, చిత్రకారుడు. ఈయన తండ్రి గుఱ్ఱం వీరయ్య యాదవ కులానికి చెందినవాడు. తల్లి లింగమాంబది మాదిగ కులం. మిషను హాస్టల్లో చాట్రగడ్డపాడుకు చెందిన లింగమాంబతో గుర్రం వీరయ్యకు పరిచయం ఏర్పడిరది. లింగమాంబను పెళ్ళి చేసుకొంటానంటే యిరుపక్షాల పెద్దలు అంగీకరించలేదు. 

క్రైస్తవ మతం స్వీకరించాలని షరతు పెట్టి, స్వీకరించిన తరువాత క్రైస్తవ మతాధికారులు వీరి వివాహం జరిపించారు. హిందూమతం, యాదవ కులం రెండూ వదిలేసి ప్రేమకోసం క్రైస్తవ మతాన్ని, మాదిగ కులాన్ని స్వీకరించాడు గుర్రం వీరయ్య. కులాంతర వివాహం చేసుకొన్న ఈ దంపతులు పేదరికం, కులవివక్ష, బంధువుల నిరాదరణలకు గురయ్యారు. నెల్లూరు దగ్గర రామాయపట్నంలో పాస్టరు శిక్షణ పొంది వినుకొండలో పాస్టరుగా పనిచేశాడు వీరయ్య. 

పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోతుండగా 1895 సెప్టెంబర్‌ 28వ తేది ఉదయం వినుకొండలో వూరికి దూరంగా వున్న మిస్సమ్మ తోటలో ఒక మూలన వున్న ఇంట్లో పుట్టాడు జాషువా. జాషువా అంటే ‘‘యెహోవాయే రక్షణ’’ అని అర్థం.

 జాషువాను తల్లిదండ్రులిద్దరూ అబ్బరంగా పెంచారు. చుట్టుపక్కల వాళ్ళు జాషువా కొంటెచేష్టల్ని భరించలేక ఇంత అల్లరి పిల్లవాణ్ణి ఎలా కన్నావమ్మా? యెప్పటికైనా బాగు పడతాడా అంటే తల్లి లింగమాంబ నా కొడుకును మీరు పెంచడం లేదుగా మీకెందుకా బాధ అని సమర్థించుకొనేది.

 వీరయ్యకు గొల్లసుద్దులు వింటే పూనకం వచ్చేది. కరియావలరాజు, పాగ్మ్యం వంటి గొల్లసుద్దుల్ని విని ఉద్వేగానికి లోనయ్యేవాడు. పలనాటి కథలంటే చెవికోసుకొనేవాడు. తండ్రి పాడిన గొల్లసుద్దులు, పలనాటి వీరగాధలు జాషువా మీద ప్రభావం చూపినాయి.

 హరిజనుల పిల్లలకు, సవర్ణుల పిల్లలకు మధ్య ఒక బల్లను అడ్డుగా వుంచిన పరిస్థితుల మధ్య జాషువా హైస్కూలు విద్యాభ్యాసం గడిరచాడు. హైస్కూల్‌ విద్య ముగిసిన తరువాత గుంటూరు జిల్లా బాపట్లలో అమెరికన్‌ బాపిస్టు మిషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో హయ్యర్‌ గ్రేడు టీచర్‌ శిక్షణ పొందాడు. ఆ తరువాత ‘ఉభయ భాషా ప్రవీణ’ చదివాడు.

జాషువా పుట్టిన పదేళ్ళ తరువాత తమ్ముడు ఇజ్రాయేల్‌ పుట్టాడు. జాషువా 15వ ఏట మేనమామ మందా వెంకటస్వామి రెండో కూతురు మేరిని వివాహం చేసుకొన్నాడు. భార్యల్ని అంత మర్యాదగా పిలిచే రోజులు కావవి. కానీ జాషువా తన భార్య మేరిని మెరాయ్‌ అని ప్రేమగా పిలిచేవాడు.

కవితా పరిశ్రమ

భాష మీద పట్టుకోసం ‘‘కంటబడ్డ పద్యకావ్యంబు సాధించి చదువకుండ వదలలేదు’’ ‘‘కవిత చెప్పువాడు గనుపింపనేయంబు సేయకుండ వెడలనీయ లేదు!’’ అని చెప్పుకొన్నాడు జాషువా. అధ్యయనంలో భాగంగా హిందూ పురాణాలు, పద్య కావ్యాలు చదవడం స్వమతస్థుల ఆగ్రహానికి కారణమైంది. హిందూ మతాన్ని ప్రచారం చేసే కథలు, నాటకాలు రాస్తున్నాడని క్రైస్తవ మతాధికారులు ఇంకా కొందరు కలిసి జాషువాను కులం నుండి వెలివేశారు. అందువల్ల తల్లిదండ్రులను, భార్యా బిడ్డలను కూడా విడిచి వూరికి దూరంగా వుండవలసి వచ్చింది. కులం కట్టుబాటు పాటించకపోతే చేస్తున్న ఫాదరీ ఉద్యోగం యెక్కడ పోతుందోనని తండ్రి వీరయ్య కొడుకును ఇంటికి కూడా రావద్దని చెప్పాడు. పగలంతా వూరికి దూరంగా వున్న పాడుబడ్డ మసీదులో వుండి రాత్రి చీకటి కాగానే రహస్యంగా ఇంటికి వచ్చి తల్లి పెట్టిన భోజనం తిని మళ్ళీ మసీదుకు చేరుకొనేవాడు.

రహస్యంగా మిత్రుల సహాయంతో మసీదులో పురాణాలను, ఇతిహాసాలను చదివి భాషను సుసంపన్నం చేసుకొన్నాడు.

 జూపూడి హనుమచ్ఛాస్త్రి అనే బ్రాహ్మణ పండితుడు జాషువాకు కాళిదాస త్రయం బోధించి సంస్కృతం నేర్చుకోవాలనే తపన తీర్చాడు. కాళిదాస త్రయం అంటే మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం.

ఉద్యోగాలూ ` అవమానాలు

 జాషువా తన సొంత ఊరు చాట్రగడ్డ పాడులో టీచరుగా నెలకు మూడు రూపాయల జీతానికి పనిచేశాడు. హిందూ గ్రంథాలను చదవడం, ఆ కథలనే నాటకాలుగా రాయడం మొదలైన కారణాలతో పాటు ఆయన ప్రణయ కలాపాలను కారణంగా చూపి ఆ ఉద్యోగం నుండి తొలగించారు.

 కొప్పరపు కవుల్లో ఒకరైన కొప్పరపు సుబ్బారావు వినుకొండ వచ్చినప్పుడు జరిగిన సభలో ఆయనమీద జాషువా ఒక పద్యం రాసి వినిపించినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. కానీ సభలోని అగ్రకులాల వాళ్ళు అంటరానివాడు యీ సభకు రావడమేమిటని సభనుండి వెళ్ళిపోయారు.

శ్రీశ్రీ రాతల్లోను, మాటల్లోను కిందకులాలను అవమానించడానికి సంకోచించేవాడు కాదు. ముస్లింలను అవమానిస్తూ కసాయిబు అనడం మాల కులాన్ని గురించి మాలవాళ్ళు రెండు రకాలు ` డ్రామాల వాళ్ళు, సినిమాల వాళ్ళు అనడం మనకు తెలిసిందే. జాషువాను ఉపకవి, ద్వితీయ శ్రేణి కవి అన్నాడు శ్రీశ్రీ. ఆయన దృష్టిలో ప్రధమ శ్రేణి కవులంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాధ సత్యన్నారాయణ. వీళ్ళిద్దరి లోనూ వాస్తవికత లేదని, వీరిది వూహాప్రాధాన్యం కలిగిన కవిత్వం అని హేళన చేస్తూ ప్రణయ కవి యొకండు, పాషాణకవి యొకండు అని జాషువా విమర్శించాడు. అందుకే నవ్య సాహిత్య సమితి ప్రచురించిన కవితా సంకలనం ‘‘వైతాళికులు’’లో జాషువా కవిత్వానికి చోటు లేకుండా చేశారు.

 ఇప్పటికీ సాహిత్యకారులు వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో చెళ్ళ పిళ్ళవారు, విశ్వనాధ వారు, దేవులపల్లివారు అని అగ్రకుల కవులను సంబోధిస్తారు. కాని గుర్రంవారు అని ఒక్కడూ అనడు.

1933లో ‘‘కవితా విశారద’’ బిరుదు స్వీకరించడానికి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అందరికీ లోపల భోజనాలు ఏర్పాటు చేసి జాషువాను వరండాలో వేరుగా విస్తరి వేసి భోజనం పెట్టారు. 1957`59 మధ్య కాలంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో స్పోకెన్‌ వర్డ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసినప్పుడు రేడియో కేంద్రంలోని బ్రాహ్మణులు జాషువా ఉనికినే భరించలేక పోయేవారు. చివరకు బీడీలు తాగుతున్నాడనే నెపంతో ఆ ఉద్యోగంలో నుండి తొలగించారు.

ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు అంటరానివారికి ప్రవేశం లేదు అని డప్పుకొట్టి చెప్పేవారు. ఇది తెలిసినా నాటకాల మీద వున్న మోజు కొద్దీ ఒకసారి నాటకానికి వెళ్ళి టిక్కెట్‌ కొనబోతే ‘నువ్వు అంటరాని వాడివి నాటకానికి రాకూడదు’ అని అవమానించారు. ఆ తరువాత రోజుల్లో మహానటుడు, పండితుడు బండారు రామారావు జాషువా రాసిన స్మశాన వాటిక ఖండకావ్యంలోని యెనిమిది పద్యాలను ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలోని కాటిసీనులో పాడినప్పుడు నిరక్షరాస్యులకు కూడా జాషువా కవితా సౌందర్యం తెలిసిపోయింది. కేవలం జాషువా పద్యాలకోసమే తెల్లవార్లు ప్రేక్షకులు ఎదురు చూస్తారు. డి.వి.సుబ్బారావు కాటిసీను పద్యాలతో గ్రామ్‌ ఫోను రికార్డు విడుదల చేసినప్పుడు మరింత ప్రాచర్యుం లభించింది. బండారు బాణీలను జోడిరచి చీమకుర్తి నాగేశ్వరరావు ప్రేక్షకులను జాషువా పద్యాలతో రంజింపచేశాడు.

బండారు రామారావు నీ పద్యాలను చెడగొడుతున్నాడు అని జాషువాకు ఎవరో చాడీలు చెప్పారు. నిజమేమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకుల మధ్యలో వుండి నాటకం చూశాడు. బండారు కమ్మని కంఠం నుండి అద్భుతమైన నటనతో జాలువారిన పద్యాలను విని జాషువా పులకించి పోయాడు. అప్పటికప్పుడు బండారు మీద పద్యం రాసి వినిపించాడు. బండారును ఆయన గురువు అద్దంకి మాణిక్యారావును గట్టిగా కౌగిలించుకొని ‘ఎంత సొగసుగా వున్నాయిరా మీ ముక్కులు. నాకొడకల్లారా ఇంత అందంగా ఎట్టపుట్టార్రా’’ అని ముద్దు పెట్టుకొన్నాడు. ఆ తరువాత వినుకొండలో బండారు రామారావుకు గండ పెండేరం తొడిగి సన్మానించాడు జాషువా.

ఒకరోజు హరిశ్చంద్ర పాత్రధారి డి.వి.సుబ్బారావు విజయవాడలో జాషువా కుమార్తె హేమలతను కలుసుకొని అమ్మా! మీ నాన్నగారి పద్యాలు పాడుకొంటూ పేరు తెచ్చుకొన్నాను. బాగుపడ్డాను. ఈ ఐదువందలూ పుచ్చుకోమ్మా అని చేతిలో పైకం పెట్టాడు.

ఘంటసాలగా పేరొందిన ఘంటసాల వెంకటేశ్వరరావు జాషువా రాసిన ‘‘శిశువు’’ పద్యాలను గ్రామ్‌ఫోన్‌ రికార్డులో పాడాడు. ఒకసారి మద్రాసులో ఘంటసాల ఇంటికి వెళ్ళాడు జాషువా. ఎవరండీ మీరు అని అడిగిన ఘంటసాల భార్యతో గుఱ్ఱం జాషువా వచ్చాడని చెప్పమ్మా అన్నాడు. లోపలికి వెళ్ళి ఘంటసాలకు చెప్పడంతో ఆయన బయటకు వచ్చి ఇక్కడే కూర్చున్నారే లోపలికి రండి అన్నాడు. నేను లోపలికి రాను. నేను బయటే ఉంటాను. ఎందుకంటే నేను అంటరాని వాడిని అన్నాడు జాషువా. భలేవారే అని గట్టిగా కౌగిలించుకొని జాషువాను లోపలికి తీసుకెళ్ళాడు ఘంటసాల.

పేదరికంలో సచేల స్నానం

మిషను స్కూల్లో ఉద్యోగం పోయిన తరువాత రాజమండ్రిలో మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశాడు జాషువా. మొదట నెలకు పదిహేను రూపాయల జీతం యివ్వడానికి ఒప్పుకొన్న సినిమా హాలు యజమాని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండుపూటలా భోజనం వరకు యేర్పాటు చేశాడు. సినిమా హాల్లో పనిచేసే వాళ్ళల్లో జాషువా ఒక్కడే దళితుడు. దళితులకు హోటల్‌లో భోజనం పెట్టరు ఒక స్నేహితుడు భోజనం తీసుకొచ్చేవాడు. చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. కట్టుకున్న జత మినహా రెండో జత బట్టలు లేవు. సెకండ్‌ షో అయిపోయిన తరువాత వెళ్ళి గోదావరినదిలో ఉన్న ఒక్కజతా ఉతుక్కొని అవి ఆరిపోయేదాకా వుండి వాటినే మళ్ళీ వేసుకొనేవాడు. ఆ వుద్యోగం మానుకొన్న తరువాత రాజమండ్రి కోటిలింగాల పాఠశాలలో శ్రీపాద కృష్ణమూర్తి సిఫారసుతో నెలకు ఎనిమిదిన్నర రూపాయల వేతనంతో తెలుగు టీచరుగా చేరాడు.

తాకట్టులో గండపెండేరం

గుంటూరు జిల్లా కొలకలూరులో నూతక్కి అబ్రహం కవి వుండేవాడు. జాషువా గబ్బిలం రాస్తే అబ్రహాం మత్కుణం (నల్లి) పద్య కావ్యం రాశాడు. ‘‘నా అనుంగు శిష్యుడబ్బు రామబ్బురముగా రాసిన మత్కుణం’’ అని జాషువా ముందు మాట రాశాడు. అబ్రహాం కూడా చాలా పేదవాడు. ఒకసారి గుంటూరు జిల్లా రేపల్లెలో శ్రీశ్రీకి, నూతక్కి అబ్రహంకు సన్మానం జరిగింది. శాలువతో సత్కరించారు. సన్మానానికి కృతజ్ఞతలు చెబుతూ... నన్ను సన్మానించినందుకు మీకు నా వందనాలు. కాని ఈ శాలువా ఎంత ఖరీదు చేస్తుందో నాకు తెలీదు. శాలువా కాకుండా ఆ డబ్బులేవో నాకిస్తే కనీసం తెల్లకాగితాలైనా కొనుక్కొనేవాడిని. నాలాంటి పేదవాడికి కావలసింది దుప్పట్లు చప్పట్లు కాదు. ఆ శాలువా ఖరీదు నాకు ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది అన్నాడు నూతక్కి అబ్రహం.

'కమెండో’ ఎడిటర్‌ వినుకొండ నాగరాజు శ్రీశ్రీని రైలు ఎక్కిస్తూ హైదరాబాదులో మీ విగ్రహం వెయ్యాలనుకొంటున్నాను గురువు గారూ అన్నాడు. దానికి శ్రీశ్రీ నువ్వు విగ్రహం ఎక్కడ వేస్తావో చెప్పు అక్కడ నేనే నిలబడతా ఆ విగ్రహం డబ్బు లేవో నాకివ్వు అన్నాడు. శ్రీశ్రీ దగ్గర డబ్బులేక పోవచ్చుకాని జాషువా నూతక్కి అబ్రహంల వంటి పేదవాడు కాదు. వీళ్ళది దుర్భరమైన పేదరికం. ‘రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడెము’ కావాలన్నాడు అల్లసాని పెద్దన. అంటే, అవి కనీస సౌకర్యాలు వారికి, నాకు అవి కూడా చాలవు అన్నాడు కృష్ణశాస్త్రి. కాని ఇంట్లో బస్తా బియ్యం బీడికట్ట ఉంటే చాలు కలాన్ని పరుగులు పెట్టించగలనన్నాడు జాషువా. ఒకసారి నూతక్కి అబ్రహం, జాషువా తెనాలిలో తిరుగుతూ డబ్బు దొరికే మార్గం లేక నీరసించిపోయారు. చివరికి గండపెండేరం తీసుకెళ్ళి తాకట్టుపెట్టి డబ్బు తీసుకురమ్మని అబ్రహంను పురమాయించాడు జాషువా. ‘‘అయ్యా! చూస్తూచూస్తూ గండపెండేరం ఎట్లా తాకట్టు పెట్టాలయ్యా! అన్నాడు అబ్రహం. మన ఆకలి కూడా తీర్చడానికి అది ఉపయోగపడనప్పుడు మనకెందుకురా అది అన్నాడు జాషువా. గండపెండేరం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో అవసరం తీరింది. ఆ తరువాత అబ్రహం కవి మూడు బస్తాలు ధాన్యం అమ్మి గండపెండేరం విడిపించుకొని జాషువాకు అప్పగించాడు.

చిత్రకారుడూ ` నఖచిత్రకారుడు

 ఒకసారి అష్ఠావధానం జరుగుతున్నప్పుడు అవధానికి ఒక సమస్య ఇచ్చాడు జాషువా. సంస్కృతంలో దాని భావం ` ఒక జంతువు నాలుగు రోడ్ల కూడలిలో               వుంది. దానికి ఎనిమిది కాళ్ళు, రెండు ముఖాలు. దానికి సిగ్గు, భయం లేవు. కామంతో ఉంది. ఈ సమస్యను పూరించమన్నాడు జాషువా. ఈ సమస్యను అవధానితో సహా అక్కడున్న వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. చివరకు జాషువా లేచి చాక్‌పీస్‌ తీసుకొని బోర్డుమీద చిత్తకార్తె పిలుపు నందుకొని ప్రణయంలో మునిగి ఉన్న ఆడకుక్క మగకుక్క బొమ్మగీసాడు. అప్పుడు అర్థమయింది అందరికి, రెండు ముఖాలు ఎనిమిది కాళ్ళ జంతువు అంటే.

1952లో ఒక రోజు సాయంత్రం గుంటూరులో మాధవరెడ్డి రాజయ్యగారి ఇంటికి వెళ్ళాడు జాషువా. అక్కడ పిల్లల్ని వెంటతీసుకొని తిరుగుతున్న తల్లికోడి కనిపించింది. టేబుల్‌పైనున్న కార్డు ముక్క తీసుకొని గోటితో కదులుతున్న పిల్లల కోడి దృశ్యాన్ని చిత్రీకరించాడు జాషువా. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. రాజయ్య చూసి కవిగారూ! మీకు నఖచిత్ర కళలో సైతం ప్రావీణ్యమున్నట్లు చాలామందికి తెలియదే! అన్నాడు సంతోషంగా.

భార్య మరణం

 భార్య పిల్లలను ప్రాణంగా చూసుకొనేవాడు జాషువా. భార్య మేరీని ప్రేమగా మెరాయ్‌ అని పిలిచేవాడు. ‘‘ఆమె శరీర వర్ణం పసిడి కాంతులీనుతుంది. ఆమెను భరతమాతగా నటింపచెయ్యాలంటే కిరీటం ధరింపజేస్తే చాలు అని రాశాడు జాషువా శిష్యుడు పెద్ది సత్యనారాయణ. జాషువా యెక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు మంచి జరగాలని భార్య యెదురొచ్చేది. నాకు రైలు అందకపోయినా, దొంగ జేబుకొట్టినా నీవే జవాబు దారీ అని హాస్యమాడేవాడు జాషువా.

భీమవరం సన్మానానికి బయల్దేరి వెళుతున్నప్పుడు నన్నుకూడా తీసుకెళ్ళండి అని భార్య మేరీ అడిగింది. ఈసారి తప్పకుండా తీసుకు వెళ్తాను మెరాయ్‌. ఇప్పుడు ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో అని నచ్చ చెప్పి వెళ్ళాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సన్మానసభలో తన పద్య పఠనంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న సమయంలోనే మేరీ మరణించిదన్న దుర్వార్త జాషువాకు తెలిసింది. భార్య మరణవార్త వినడంతోనే కన్నీరు కట్టలు తెంచుకొంది.

 ‘‘నీ వటు కాటిదిక్కు పనయనించిన నాటి మరుక్షణాన 

 సర్వావయ సంధిబంధనములన్నియు వీడె కవిత్వ భారతీ

 దేవత మూగవోయె సుదతీమణి నాదు కళా స్రవంతియున్‌

 నీ వెనుకన్‌ శ్మశాన ధరణిన్‌ నిదురించినదో ! సతీమణీ !’’

పిల్లలందరిలో హేమలత అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఆమెకు చిన్నప్పుడే సాహిత్యంతో పాటు భరతనాట్యం కూడా నేర్పించాడు. గుంటూరు ఏ.సి. కాలేజీ అసెంబ్లీ హాలులో కనకాభిషేకం చేసిన సన్మానసభకు ముందుగా హేమలత భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఆమె నాట్యం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె లవణం (విజయవాడ నాస్తిక కేంద్రం వ్యవస్థాపకుడు గోరా కుమారుడు) ను కులాంతర వివాహం చేసుకున్నది.

 అయిదవ కుమార్తె !

 లవణం గారికి అర్థాంగి

 సహజ కరుణాన్విత !

 దివ్యాదర్శ భరిత !

 హేమలత !

 మిత్ర ప్రలాప

 ధర్మజ్ఞ సుమా !

 అని తన కుమార్తె గురించి జాషువా రాశాడు.

 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించింది. కానీ అంతలోనే జాషువాకు పక్షవాతం వచ్చింది. కదలలేని స్థితిలో ఉండగా గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఆ బిరుదుకు సంబంధించిన పత్రం ` బహుమతులు చేర్చారు. సిల్కు లాల్చి, పంచె ధరించి జరీ కండువా వల్లె వాటుగా జారవిడిచి పెద్ద పెద్ద అంగలు వేస్తూ మీసాలను సవరించుకొంటూ యెప్పుడూ శిష్యులూ అభిమానులు వెంట రాగా హుందాగా తిరిగిన జాషువా మాట పడిపోయి మంచం పట్టాడు. ఎవరైనా యెలా ఉన్నారూ అని అడిగితే జవాబుగా మీసం మీద చెయ్యివేసి మెలి తిప్పేవాడు. కవితాభిమానులు, బంధువులు, స్నేహితులు జాషువా 75వ జన్మదినాన్ని వైభవంగా జరిపారు.

 ‘‘నరజన్మంబను వ్యాధి బాధల కమోఘంబైన దివ్యౌషధం బరయన్‌ మృత్యువు’’ అని రాసుకొన్న జాషువా జులై 24 ` 1975న గుంటూరులో మరణించినా ప్రజల నాల్కలపై నిలిచే ఉన్నాడు.

◆◆◆

#గుర్రం_జాషువా జీవితాన్ని, కృషిని, కల్పనాశక్తిని, సామాజిక అడ్డంకులను అధిగమించిన దారిని, అలాగే ఆయన కవిత్వ, నాటక, చిత్రకళ, ఉపాధ్యాయతలో చేసిన ప్రతిభను మనం పరిశీలించవచ్చు. దీనిని ఒక సమగ్ర, పాఠక సౌకర్యానికి అనుగుణమైన రూపంలో ఇలా సారాంశంగా చెప్పవచ్చు:

గుర్రం జాషువా: అంటరానితనం గల మహోన్నత వ్యక్తి

#పుట్టినది_కుటుంబ నేపథ్యం

1895 సెప్టెంబర్ 28న వినుకొండలో మిస్సమ్మ తోటలో పుట్టిన జాషువా, అర్థం “యెహోవాయే రక్షణ”. తండ్రి గుఱ్ఱం వీరయ్య (యాదవ కులం), తల్లి లింగమాంబ (మాదిగ కులం) కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమకథ క్రమంలో వారు పేదరికం, సామాజిక నిరసనలు ఎదుర్కొన్నారు.

#విద్యాభ్యాసం

చిన్నప్పటినుంచి జాషువా అల్లరి, అంగవైకల్యంతో కూడిన శక్తివంతమైన మనసున్న వాడు. హైస్కూల్‌ విద్యను పూర్తి చేసి, అమెరికన్ బాపిస్టు మిషన్ ట్రైనింగ్ స్కూల్‌లో హయ్యర్ గ్రేడు టీచర్‌గా శిక్షణ పొందాడు. ఆ తరువాత ‘ఉభయ భాషా ప్రవీణ’ అని భాషాపరంగా ప్రావీణ్యం సంపాదించాడు.

#కవితా_సాహిత్య పరిశ్రమ

భాషాపట్ల ఆసక్తితో కవి, నాటక రచయిత, ఉపన్యాసకారుడు, చిత్రకారుడు అయ్యాడు. భిన్న మత, కులాల మీద నిరసనలు, ప్రణయకళాపాల కారణంగా కులం, మతం పరిమితులు పాటించకపోవడం వల్ల, కుటుంబం నుండి, ఉద్యోగం నుండి కొన్ని సందర్భాల్లో విడిపోయే పరిస్థితి వచ్చింది.

కాళిదాస త్రయం (మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం) ను జూపూడి హనుమచ్ఛాస్త్రి బోధించి సంస్కృతంలో అవగాహన కల్పించాడు. పద్య రచన, నాటక ప్రదర్శనల ద్వారా సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. డి.వి. సుబ్బారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి కళాకారులు జాషువా రచనలను ప్రసిద్ధం చేశారు.

#ఉద్యోగాలు_అవమానాలు

చాట్‌ర్గాడ్డపాడు, వినుకొండ వంటి ప్రాంతాల్లో టీచర్‌గా, సినిమా వ్యాఖ్యాతగా, రేడియో స్పోకెన్‌వర్డ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. క్రీడల వంటి సామాజిక, మత, కుల-based అవమానాలు, జీతాలు తక్కువగా ఉండడం, ఇతర అసౌకర్యాలను అధిగమిస్తూ తన కృషితో జీవనం కొనసాగించాడు.

#చిత్రకళలో_ప్రతిభ

అష్టావధానం, నఖచిత్రకళ, జంతు, పిల్లల దృశ్యాల చిత్రీకరణలలో ప్రతిభ చూపాడు. ప్రత్యేకంగా అబ్రహం కవి, నూతక్కి అబ్రహం వంటి ఇతర కవులతో కలసి కవిత్వ పరస్పర కృషిని ప్రదర్శించాడు.

#వైద్య_కుటుంబ_పరిణామాలు

భార్య మేరీతో ప్రేమగా జీవించాడు. ఆమె మరణం, పక్షవాతం వంటి వ్యక్తిగత కష్టాలను అధిగమించి, కవిత్వం, విద్యాభ్యాసం కొనసాగించాడు. కుమార్తె హేమలతను సాహిత్యం, నాట్యంతో పెంచి, ఆమెను సాహిత్య, నృత్య ప్రతిభతో సన్మానింపజేశాడు.

#పద్మభూషణ్‌_అవార్డు

1970లో భారత ప్రభుత్వం జాషువాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కానీ ఆ సమయంలోనే పక్షవాతం కారణంగా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ, బిరుదుకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.

#మరణం

1975 జులై 24న గుంటూరులో మరణించాడు. కవిత్వ, సాహిత్య ప్రావీణ్యం, సామాజిక ధైర్యం కారణంగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయాడు.

సారాంశం:

గుర్రం జాషువా చిన్న వయస్సు నుండి కవిత్వ, నాటక, చిత్రకళల్లో అసాధారణ ప్రతిభ చూపించిన మహోన్నతుడు. సామాజిక, మత, కుల-based అవమానాలను ఎదుర్కొని, సాహిత్య, విద్యా, కళారంగాల్లో స్థిరమైన గుర్తింపును సంపాదించాడు. అతని జీవితము పేదరికం, వ్యక్తిగత నష్టాల మధ్యన కూడా సృజనాత్మకతను, ధైర్యాన్ని ప్రదర్శించింది.

Tuesday, September 23, 2025

 ఇది కధ కాదు చరిత్ర "రొమ్ము పన్నుకి" వ్యతిరేకంగా గళం విప్పిన నంగేలీ వ్యధ.. ములక్కరం! మొదటి పతి సహాగమనం కూడా ఇదే 👇

          - డా.జడా సుబ్బారావు


జల్లెడలో నిప్పులు పోసి చెరుగుతున్నాడు సూర్యుడు!


ప్రముఖుడి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నట్లుగా కదలకుండా నుంచున్నాయి చెట్లు.


గుడిసె పక్కనున్న చావిట్లో పరధ్యానంగా కూర్చుంది నంగేలి. ఆమె చూపు చేసే పనిమీద లేదు. చేతులు మాత్రం యథాలాపంగా వెదురు బుట్టకు ఒక రూపాన్నివ్వడానికి ఆరాటపడుతున్నాయి.


దగ్గు తెరలుతెరలుగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసినట్లు జ్ఞాపకాలు ఆమె కళ్లముందు మసకమసగ్గా కదలాడుతున్నాయి. మనసంతా గతకాలపు జ్ఞాపకాలతో చేదుగా అయిపోయింది. చేస్తున్న పనిని ఒక్కక్షణం ఆపి పక్కింటి వైపు చూసింది. ఉండీ లేనట్లుగా ఉన్న గుడిసె ముందు అర్ధనగ్నంగా ఉన్న ఆడవాళ్లూ, వాళ్ల కాళ్లచుట్టూ తిరుగుతూ కొంతమంది చిన్నపిల్లలూ కనిపించారు.


పుష్పవతి అయిన పదకొండేళ్ల పిల్లను పీటమీద కూర్చోబెట్టి కాళ్లకూ, చేతులకూ పసుపు రాస్తున్నారు. ముసలివాళ్లు చిన్నగొంతుతో ఏవో పాటలు పాడుతున్నారు. మొలకు చుట్టిన వస్త్రం తప్ప వాళ్ల ఒంటిమీద ఏ విధమైన ఆచ్ఛాదనా లేదు. పందిరి లేకుండా పెరిగే జాజితీగల్లా జుట్టు ఎలా పడితే అలా గాలికి ఎగురుతోంది. డొక్కల్లో నుంచి ఎముకలు బయటకు పొడుచుకొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.


పుష్పవతి అయిన పిల్లవైపు చూసింది నంగేలి. తనకు జరుగుతున్న వేడుక ఏంటో తెలియనట్లు అయోమయంగా అందరివైపూ చూస్తోంది. బురదలో పుట్టిన తామరపువ్వుల్లా మెరిసే కళ్లతో, దేహంలో అప్పుడప్పుడే కొత్తగా పుడుతున్న అవయవాలను చూసుకుంటూ బిడియం కలగలసిన చూపులతో అందరివైపూ చూస్తున్న ఆ పిల్లనలా చూడగానే నంగేలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ వేడుక తర్వాత ఆ పిల్లకు జరగబోయే 'మర్యాదలు' ఎంత ఘనంగా ఉంటాయో, వయసు తారతమ్యం మరిచిన తోడేళ్ల గుంపు చేసే దాడి ఆ పసితనం మీద ఎంత దారుణమైన ముద్రవేస్తుందో తలచుకుంటున్న కొద్దీ నంగేలి దేహం కంపించిపోతోంది.


పెళ్లై భర్త ఉన్న తనే నిత్యమూ ఏదో ఒక అవమానాన్ని ఎదుర్కొంటోంది. ఇష్టంతో పనిలేకుండా అవమానాల కాష్ఠాన్ని భరిస్తోంది. ఇక రేపటి నుంచి ఆ పిల్ల కూడా తమతో పాటే ఈ అవమానాల్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. గుండెలోతుల్లోకి గుచ్చుకుపోయే ముళ్లను తొలగించుకుని నవ్వుకుంటూ బతకడం అలవాటు చేసుకోవాలి. ఎదురుతిరిగితే అవమానాలు భరించాలి. పెళ్లికాకపోతే తల్లిదండ్రుల ముందూ, పెళ్లైతే భర్త ముందూ చేసే అత్యాచారాల్ని సహించాలి. ఊరంతా తిప్పుతూ, కొడుతూ, తిడుతూ, ముఖాన ఉమ్మేస్తూ సాగించే క్రతువులో బలిపశువుగా తలొంచాలి. చిన్నపిల్లలా, పడుచువాళ్లా, ముసలివాళ్లా అనే తేడా లేదు. స్త్రీలైతే చాలు... పాలుతాగిన రొమ్ముల్లో నుంచి పన్నులు రాబట్టడానికి ఎగబడుతుంటారు!


ఆలోచన నుంచి బయటపడి సగం పూర్తైన వెదురుబుట్టను పక్కన పెట్టింది. దాన్ని చూస్తుంటే తనకూ, వెదురు బుట్టకూ తేడా లేదనిపించి దీర్ఘంగా నిట్టూర్చి పైకి లేచి నిలబడింది నంగేలి.


తనవంక నవ్వుతూ చూస్తున్న చిరుకందన్‌ కనిపించాడు. ఒక్క క్షణం నంగేలి తత్తరపడింది. ''ఎంత సేపయింది వచ్చి'' అంది అతని వంక చూస్తూ.


''రాణీగారి చూపులు దిక్కుల్ని గాలిస్తున్నప్పుడే వచ్చాను'' అన్నాడు చిరుకందన్‌. నంగేలిని ఏడిపించడానికి అప్పుడప్పుడూ ఇలా మాట్లాడతాడని ఆమెకు తెలుసు. ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడింది.

''దేని గురించో ఆలోచిస్తున్నావు?'' అన్నాడు. నంగేలి ఏమీ మాట్లాడకుండా పక్కింటివైపు చూసింది. చిరుకందన్‌ ఆమె మనసు గ్రహించాడు. దగ్గరగా చేరి ''మనకూ ఒక అమ్మాయి ఉంటే బాగుండేది కదా'' అన్నాడు. అతడి వైపు విస్మయంగా చూసిన నంగేలి ''వొద్దొద్దు... ఆడపిల్లను కని రాబందులకు ఎరవేయడం కంటే పిల్లల్లేకుండా ఇలా ఉండడమే మేలు'' అంది గుడిసెలోకి నడుస్తూ.


మౌనంగా ఆమెను అనుసరించాడు చిరుకందన్‌. భర్తకు అన్నం పెట్టి ఎదురుగా ఏమీ మాట్లాడకుండా కూర్చుంది నంగేలి. ఆమె మౌనం చిరుకందన్‌ భరించలేకపోతున్నాడు. ఏదైనా మాట్లాడితే బాగుండనిపించింది. కాసేపయ్యాక ''నాకు కూడా జాకెట్‌ వేసుకోవాలని ఉంది'' అంది నంగేలి భర్తవైపు చూస్తూ. తింటున్న ముద్ద గొంతులో ఇరుక్కున్నట్లుగా ఉక్కిరిబిక్కిరయ్యాడు చిరుకందన్‌. ''ఆడదానికి మానం, అభిమానం రెండు కళ్లలాంటివి. ఏ కంటికి శుక్లం వచ్చినా చూపు మందగిస్తుంది. ఏది ఏమైనా నేను జాకెట్‌ వేసుకుంటాను'' అంది స్థిరంగా నంగేలి.


''ఎదను కప్పుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా శ్రమను రెట్టింపు చేయాలి. జాకెట్టు వేసుకున్న ప్రతిసారీ ఆ శ్రమను పన్నుగా చెల్లించాలి. ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం మంచిదే అయినా ఎదిరించి బతకడం ఎంత కష్టమో తెలిసిన దానివి. నీ నిర్ణయాన్ని నువ్వే పునరాలోచించుకోవాలి'' అన్నాడు చిరుకందన్‌.


భర్తవంక బాధగా చూసింది నంగేలి. జాకెట్‌ ధరించి, పన్ను కట్టలేక వసూలు గుంపు చేతిలో అసువులు బాసిన ఆడవాళ్లు గుర్తొచ్చారు. గేలిచేస్తూ కర్రలతో కొడుతూ ఊరంతా తిప్పుతుంటే కళ్లల్లో నీళ్లు కళ్లల్లోనే కుక్కుకుని వాళ్లవంక జాలిగా చూడగలిగారే తప్ప ఎదిరించే సాహసం చేయలేకపోయారు. ఎదిరిస్తే తమకూ అదే గతి పడుతుందని తెలుసు. కళ్లముందు పుట్టి పెరిగిన వాళ్లూ, కలిసి తిరిగినవాళ్లూ, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని దుర్భర బతుకులు బతికి మట్టిలో కలిసిపోయారు. ఈ హింసకు కారణమెవరైనా దాన్ని భరించేవాళ్లకే ఆ బాధ తెలుసు.


నంగేలి మనసులో ఆవేదన సుడులు తిరగసాగింది. కాసేపు ఆలోచనలతో సతమతమయింది. ఆ తర్వాత చిరుకందన్‌ను చూస్తూ ''ఇలా ఎంతకాలం?'' అంది.


''మన బొందిలో ప్రాణం ఉన్నంతకాలం, మనకీ భూమ్మీద నూకలున్నంత కాలం'' అన్నాడు.


''అంతకుమించి ఏమీ చేయలేమా?'' అడిగింది నంగేలి.


''బలవంతుడు బాకు విసిరితే బలహీనుడు ఎంతదూరం పరిగెత్తగలడు? ఎంత దూరం పరిగెత్తినా అదే ఆకాశం... అదే ఆచారం! వాళ్ల భోగాలకోసం బొక్కసాలు నింపడమే మన బతుకులోని పరమార్థంగా మారిపోయింది. మట్టిలో కలిసిన మన పూర్వీకులంతా ఇలా సగం బట్టతోనే బతుకులు గడిపారు. ఈ వివక్ష మనతోనే ఆగిపోవచ్చు. లేదా పేర్లూ, రూపాలూ మార్చుకుంటూ మన జాతిని వెంటాడుతూనే ఉండొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకో... నలుగురూ నడిచే దారిలో వెళ్తే తినే బియ్యం గింజలమీద మన పేరు రాసి ఉంటుంది. సొంత దారిలో వెళ్లాలనుకుంటే అవే బియ్యం గింజల్ని మన దేహంపైన చల్లుతారు.''


భర్తవంక విస్మయంగా చూసింది నంగేలి.


''చావుకీ పన్నుకీ భయపడి ఎంతకాలం తలవంచుతాం! బయటకి వెళ్తే అర్ధనగ్నంగా ఉన్న మా దేహాలపైన వాళ్లు చూపుల శూలాల్ని గుచ్చుతున్నారు. స్త్రీలు ఏ కులంలో పుట్టినా స్త్రీలే! పుట్టిన పసిబిడ్డకు కూడా నలుగురి ముందూ పాలివ్వాలంటే తల్లి ఎంతో సిగ్గుపడుతుంది. అలాంటిది మొలకు చిన్న వస్త్రాన్ని చుట్టుకుని ఎదభాగాన్ని వదిలేయడమంటే బతికుండగానే రాబందులు పీక్కుతిన్నట్లుగా ఉంది. తమ ఎదను కప్పుకోవడానికి ఉన్నత కులాల స్త్రీలకు అనుమతులిచ్చిన రాజులు, కింది కులాల ఆడవాళ్ల రొమ్ములపైన పన్నులు వేసి మనుగడ సాగించడం నీచకరం. నాకోసం కాకపోయినా నా తర్వాతి తరాల విముక్తి కోసమైనా ఏదో ఒకటి చేయాలి'' నంగేలి మాటల్లో దుఃఖపు సుడులేవో తిరుగుతున్నాయి.

ఏమీ మాట్లాడకుండా చేయి కడుక్కోవడానికి బయటకు వెళ్తున్న భర్తను చూస్తూ కిందకు జారిన చీర చెంగును ఎదచుట్టూ కప్పుకుంది నంగేలి. చేతులకున్న మట్టిగాజులు గలగలమని చప్పుడు చేశాయి. నుదుట పెట్టుకున్న ఎర్రని తిలకం ఆమె ముఖానికి మరింత అందాన్నిచ్చింది. భుజాల మీదుగా ఎదచుట్టూ పైట కప్పుకోవటం ఆమెకెంతో ఆనందంగా ఉంది. అలా జీవితాంతం ఉండాలంటే- వచ్చే కూలీ మొత్తం పన్నుగా చెల్లించాలి. రోజంతా గొడ్డుచాకిరీ చేస్తున్నా వచ్చే కూలీ తక్కువ. దాన్ని తీసుకెళ్లి పన్నుగా చెల్లిస్తే పూట గడవడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. లోపలికి వస్తున్న భర్తను చూస్తూ ''ఇలా కప్పుకుంటే బాగున్నానా'' అంది నంగేలి. ఆమె వైపు ఆశ్చర్యంగా చూసిన చిరుకందన్‌కు అందం రంగులోనే కాదు, ఆత్మవిశ్వాసంలో కూడా ఉంటుంది అనిపించింది. ఒక్క క్షణం కన్నార్పకుండా ఆమె వంక చూసి ''కట్టుకున్న వాడిని కనుక కప్పుకుంటే బాగున్నావని అనగలను. కానీ విప్పుకుని తిరగమని రాజాజ్ఞలు చెబుతుంటే మనస్ఫూర్తిగా ఆ మాటెలా అనగలను'' అన్నాడు. నంగేలి కళ్లు జలపూరితాలయ్యాయి. రెండు కన్నీటిబొట్లు ఆమె చెంపలపై జారాయి.


కప్పుకున్న పైటను కిందికి జారుస్తూ ''ఆ భగవంతుడు స్త్రీలకు మానం, అభిమానం పెట్టకుండా ఉంటే బాగుండేది. భర్తకు మాత్రమే చూపించాల్సిన ఎదభాగాన్ని అందరికీ చూపిస్తూ తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది'' అంది.

చిరుకందన్‌ ఆమెకు దగ్గరగా జరిగాడు. ఆమె తలను పైకెత్తి బుగ్గలపై కన్నీటిని తుడిచి తల నిమిరాడు.


''చూడు నంగేలీ... పాలకులు విషం చిమ్మే పాముల్లాంటివాళ్లు. అదనుచూసి కాటేస్తారు. మనలాంటి విధివంచితులు చెదలాంటి వాళ్లు. కుప్పలు కుప్పలుగా పుడుతుంటారు, చస్తుంటారు. ప్రపంచం తీరే అంత... కాటేసే పాముల్ని వదిలేసి చెద పురుగుల్ని చంపడం పైనే రాజుల దృష్టి ఉంటుంది. రాజ్యాల మనుగడ ఆధారపడి ఉంటుంది. నా ముందో నాలుగ్గోడల మధ్యో నీకు నచ్చినట్టుగా ఉండు. గుమ్మం బయటకెళ్తే మాత్రం నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించకు. ఎందుకంటే అది వాళ్లకు గర్వంలా, అహంభావంలా కనిపిస్తుంది...'' అన్నాడు చిరుకందన్‌.


''మనసులో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకోడానికే ఇంత భయపడుతున్నాం. గుండెలమీద ఏ ఆచ్ఛాదనా లేకుండా అందరి ముందూ తిరగాలంటే నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించారా'' అంది నంగేలి.


''మనిషిగా గుర్తించని చోట మానాభిమానాల ప్రసక్తి ఎందుకు? అయినా నువ్వొక్కదానివే కాదుగా... కింది కులాల్లో పుట్టిన ఆడవాళ్లంతా అలాగే చేస్తున్నారు. బతుకుతూ చస్తున్నారు. జుట్టూ, గెడ్డం పెరిగాయని మగవాళ్లంతా 'తలక్కరం' (పెరిగిన జుట్టు, గెడ్డం మీద విధించే పన్ను) కడుతుంటే, ఆడవాళ్లంతా 'ములక్కరం' చెల్లిస్తున్నారు. ఇదేంటని అడిగితే అమానుషాలు జరుగుతుంటాయి. నోరిప్పితే సమాధులు మొలుస్తుంటాయి. కళ్లముందు జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా గుడ్డోళ్లుగా బతికితేనే ఈ దేశంలో మన కన్ను శాశ్వతంగా మూతపడకుండా ఉంటుంది'' అన్నాడు చిరుకందన్‌.


'అటువంటి దేహం ఉన్నా ఒకటే పోయినా ఒకటే' నంగేలి మనసు లోలోపలే ఉడికిపోసాగింది. భర్త మాటలతో సమాధాన పడలేకపోయింది. అందరూ స్త్రీలే... అయినా కులాన్నిబట్టి హెచ్చుతగ్గులు, అంతస్తుల్ని బట్టి హెచ్చుతగ్గులు, అవయవాలను బట్టి హెచ్చుతగ్గులు... తన కళ్లముందే తన జాతివాళ్లంతా ఎదను కప్పుకోకుండా మానాన్ని బహిర్గతం చేయడం నంగేలికి రుచించట్లేదు. నిమ్నకులాల స్త్రీలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ అర్థంలేని పన్నులు వసూలు చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. తన బతుకు ఏమైనా సరే... జాకెట్‌ వేసుకోవాల్సిందే. చన్నుల మీద పన్నులు వేసి ఆనందిస్తున్న పాలకులకు గుణపాఠం నేర్పాల్సిందే!

ఆమెలో ఏదో పట్టుదల...!


* * *


మర్నాడు ఉదయమే లేచి పెందలకడే పనంతా పూర్తి చేసుకుంది నంగేలి. చిరుకందన్‌ పనికి వెళ్లగానే గుడిసెలోకి వెళ్లి తడికె దగ్గరగా వేసుకుంది. తెల్లటి వస్త్రాన్ని తీసుకుని ఎదనిండుగా కప్పుకుని అద్దం ముందు నిలబడింది. సగం పగిలిన అద్దంలో రెండు ప్రతిరూపాలుగా కనిపిస్తున్న తన దేహాన్ని చూసి మురిసిపోయింది. బయటకి వచ్చి తడిక దగ్గరగా వేసి పొలం పనికి బయలుదేరింది.


రోజూ నడిచే దారే అయినా ఆ రోజెందుకో ఆ దారి నంగేలికి కొత్తగా ఉంది. దారి వెంట నడుస్తున్న మిగతా స్త్రీలందరూ నంగేలి వంక కొత్తగానూ, వింతగానూ మెరిసే కళ్లతోనూ చూడసాగారు. అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు నంగేలి. ఆత్మనూనతను జయించాలన్న ఆత్మవిశ్వాసమేదో ఆమె అడుగుల్లో ప్రతిఫలించసాగింది.


ఉత్సాహంగా నడుస్తున్న నంగేలి ఎదురుగా కనిపించిన పన్ను వసూలు చేసే అధికారిని చూసి ఒక్క క్షణం పాటు తడబడింది. పైనుంచి కిందకీ, కిందనుంచి పైకీ చూస్తూ పాములా బుసకొడుతున్న అతణ్ణి పట్టించుకోకుండా అడుగు ముందుకేసింది.


''ఏయ్‌... ఆగు... నువ్వు చేస్తున్న పనేమిటో నీకు తెలుస్తోందా?'' గర్జించాడతను.


''మీ విధానాల మీద నిరసన ప్రకటిస్తున్నాను.''


''అందుకు పన్ను చెల్లించాలి. ఒక్కోసారి ప్రాణాల్ని కూడా ఫణంగా పెట్టాలి.''


''ఏ జాతిలో పుట్టినా స్త్రీకి ప్రాణంకంటే మానమే విలువైనది'' అంది నంగేలి.


''నువ్వు రాజాజ్ఞను ధిక్కరిస్తున్నావు. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాలి.''


''రాజాజ్ఞలు ప్రజల్ని రక్షించాలి. బలహీనుల్ని దోచుకుంటూ స్త్రీల మానాల్ని హరించకూడదు'' చెప్పి ముందుకు కదిలింది నంగేలి.


పన్ను వసూలు అధికారి అహం దెబ్బతింది. 'ఇంతకింతా అనుభవిస్తావ్‌' అని మనసులో అనుకుని... ''సాయంత్రం ఇంటికి వస్తాను. నువ్వు చేస్తున్న పనికి పన్ను ఎంత చెల్లించాలో అక్కడే చెబుతాను'' అన్నాడు వికృతంగా నవ్వుతూ.

నంగేలి వెనక్కి చూసింది. అతని చూపుల్లో నిద్రలేచి బుసలు కొడుతున్న కోరికల అగ్నిగుండాలు కనిపించాయి. మాటువేసి మట్టుబెట్టే పెద్ద పులి నిశ్శబ్దం తాండవించింది. 'దేహం నాది కాదు' అనుకుంటే పన్ను రద్దవుతుంది. ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తే ఊపిరి ఆగిపోతుంది! నంగేలి ఆలోచనలు ముళ్లకంచెలో చిక్కుకున్న వస్త్రపు చెంగులా చీరుకుపోతున్నాయి.


* * *


సూర్యుడు పడమటి కొండలవైపు నడక సాగించాడు. పెద్దగా మాట్లాడుకుంటూ గుంపును వెంటేసుకుని వస్తున్న పన్నుల వసూలు అధికారిని చూడగానే పల్లె గడపల్లో కలవరం బయల్దేరింది. అమాయకుల ముఖాల్లో ఆందోళన తొంగిచూసింది. వాళ్ల అడుగుల ధాటికి పైకిలేస్తున్న ధూళి కళ్లల్లో పడకుండా చేతుల్ని అడ్డు పెట్టుకుంటూ వాళ్లు వెళ్తున్న వైపు చూడసాగారు.


నంగేలి గుడిసె ముందు ఆగి తడికెమీద దబదబమని కొడుతూ ''నంగేలీ... బయటకురా'' పిలిచాడు అధికారి.


తడికె తెరిచి బయటకి చూసింది నంగేలి. జింకను వేటాడ్డానికొచ్చిన పులుల గుంపులా కనిపించారు.చేయి ముందుకు చాపి ''పన్ను డబ్బులు...'' గర్జించాడు అధికారి.


''ఒక్క నిమిషం'' లోపలికి వెళ్లబోయింది నంగేలి.


''అప్పుడేనా... రొమ్ములు పట్టి చూడాలి కదా, కొలత వెయ్యకుండా ఎంత పన్ను కట్టాలో ఎలా తెలుస్తుంది'' అన్నాడు వెకిలిగా నవ్వుతూ.


అధికారితో వచ్చిన కళ్ల జతలన్నీ కోరికతో కాలిపోతూ నంగేలి దేహం వైపు దృష్టి సారించాయి. అవమానం, ఆక్రోశం, అసహ్యభావన... అన్నీ కలగలసిన వైరాగ్యమేదో ఆమెను నిలువునా దహించసాగింది. గుండె గట్లను దాటుకుని కళ్లల్లో పొంగి ప్రవహిస్తున్న బాధను పంటి బిగువున భరించింది. ఏదో చేయాలన్న కోపం వేడివేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బయటకు రాసాగింది. ఏమీ చేయలేని నిస్సహాయత పదునైన కత్తిగా మారి గుండెల్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లుగా అనిపించింది.


ఏదో చేయాలి... ఈ డేగ చూపుల నుంచీ, ఉక్కు పిడికిళ్ల నుంచీ శాశ్వతంగా విముక్తి పొందడానికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాలి. ఇన్నేళ్లుగా భరిస్తున్న శారీరక, మానసిక రంపపుకోతకు ఈనాటితో సమాధి కట్టాలి. పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మెల్లగా నడుస్తూ అధికారి ముందుకు వచ్చింది నంగేలి.


తనివితీరా తడిమి చూసి తన అహాన్ని సంతృప్తి పరుచుకోవాలని ఎదురుచూస్తూ చుట్టూ ఉన్న గుంపును చూసి మీసాన్ని మెలేశాడు అధికారి.


ఎదపైనున్న వస్త్రాన్ని విప్పినట్లే విప్పి ఒక్క ఉదుటున గుడిసె లోపలికి వచ్చి తడిక వేసేసింది నంగేలి. ఊహించని ఈ హఠాత్పరిణామానికి ఆ అధికారి బిత్తరపోయాడు. చుట్టూ చేరి చూస్తున్న వాళ్లముందు తల కొట్టేసినట్లయింది. దవడలు బిగుసుకున్నాయి. కోపంగా తడిక మీద కొట్టాడు.


కాసేపటికి తడిక తెరుచుకుని బయటకి వచ్చింది నంగేలి. ఆమె చేతుల్లో అరిటాకు, అందులో రక్తంతో నిండిన రెండు మాంసం ముద్దలు కనిపించాయి. కొండనుంచి దూకుతున్న జలపాతాల్లా ఆమె వక్షోజాల నుంచి స్రవిస్తున్న రక్తధారల్ని చూసి పన్ను వసూలు గుంపు భీతిల్లిపోయింది.


ఆ దృశ్యాన్ని చూడలేక కళ్లకు చేతుల్ని అడ్డుపెట్టుకుంటూ పారిపోతున్న వాళ్లను పిలుస్తూ ''బాబూ... రండి... వీటికోసమేగా వచ్చింది. తీసుకెళ్లి కొలత వేయండి. వచ్చిన డబ్బులతో మీ రాజ్యానికి రత్నాల తొడుగూ, మీ రాజుకి ముత్యాల గొడుగూ పట్టండి. ఇన్ని దారుణాలకు సాక్షిగా ఉన్న ఆ దేవుడికి రక్తాభిషేకం చేయించండి. విభజించి పాలిస్తూ ఆడదాన్నీ మానాన్నీ అభిమానాన్నీ అర్ధనగ్నంగా నిలబెట్టి పన్నులు వసూలు చేస్తున్న మీ రాజుకి ఇవి నా బహుమతిగా చెల్లించండి. అమ్మ పాలు తాగి పెరిగిన మీరు రాక్షసుల్లా మారకండి. కొంచెం మానవత్వాన్ని చూపించండి. ఎదను కప్పుకున్నందుకు ఏడుస్తూ పన్ను కడుతున్న మా దయనీయ బడుగుజాతి స్త్రీల మానాభిమానాలతో ఆడుకునే దాష్టీకాన్ని ఆపమని చెప్పండి...''


నేలకు వాలిన మహావృక్షంలా పడిపోయింది నంగేలి. ఎదనుండి పొంగి దేహమంతటా వ్యాపిస్తున్న రక్తం- చుట్టూచేరిన స్త్రీల కళ్లల్లో ఎరుపుజీరగా మారింది. ములక్కరానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించేలా చేసింది. నంగేలి త్యాగాన్ని చరిత్రలో లిఖితం చేసింది. భార్యపై అవ్యాజమైన ప్రేమతో ఆమె చితిలోకి దూకి ప్రాణత్యాగం చేసిన మొదటి 'పతీ సహగమనాన్ని' నమోదు చేసింది.


* * *


(18వ శతాబ్ది ప్రారంభంలో- కేరళలోని ట్రావెన్కోర్‌ సంస్థానాధీశులు విధించిన అసంబద్ధమైన, అమానవీయమైన 'రొమ్ముపన్ను'కు వ్యతిరేకంగా చైతన్యగళాన్ని వినిపించి ప్రాణత్యాగం చేసిన 'నంగేలి' వ్యథ... ఇది చరిత్ర చెప్పిన కథ...!)


@ఈనాడు దినపత్రిక నుండి సేకరణ

Monday, September 22, 2025

 💐 *తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు* 💐

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

●మహాప్రస్థానం - శ్రీశ్రీ

●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ

●చివరకు మిగిలేది - బుచ్చిబాబు

●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి

●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

●కళాపూర్ణోదయం - పింగళి సూరన

●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

●గబ్బిలం - గుఱ్ఱం జాషువా

●వసు చరిత్ర - భట్టుమూర్తి

●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు

●చదువు - కొడవగంటి కుటుంబరావు

●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి

●వేమన పద్యాలు – వేమన

●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి

●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

●అల్పజీవి – రావిశాస్త్రి

●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

●ఆంధ్ర మహాభాగవతం – పోతన

●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

●మొల్ల రామాయణం – మొల్ల

●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

●మైదానం – చలం

●వైతాళికులు – ముద్దుకృష్ణ

●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి

●సౌందర నందము - పింగళి, కాటూరి

●విజయవిలాసం - చేమకూర వేంకటకవి

●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

●మ్యూజింగ్స్ – చలం

●మనుచరిత్ర- అల్లసాని పెద్దన

●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి

●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర

●దిగంబర కవిత - దిగంబర కవులు

●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

●పానశాల - దువ్వూరి రామిరెడ్డి

●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

●అంపశయ్య – నవీన్

●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

●జానకి విముక్తి – రంగనాయకమ్మ

●స్వీయ చరిత్ర – కందుకూరి

● మహోదయం - కెవి రమణారెడ్డి

●నారాయణరావు - అడవి బాపిరాజు

●విశ్వంభర – సినారె

●దాశరథి కవిత – దాశరథి

●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం

●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

●పారిజాతాపహరణం - నంది తిమ్మన

●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర – కందుకూరి

●రాధికా సాంత్వనము - ముద్దు పళని

● స్వప్న లిపి – అజంతా

●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

●శృంగార నైషధం – శ్రీనాథుడు

●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

●అను క్షణికం - వడ్డెర చండీదాస్

●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి

●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

●గద్దర్ పాటలు – గద్దర్

●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి

●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్

●కుమార సంభవం - నన్నే చోడుడు

●మైనా - శీలా వీర్రాజు

●మాభూమి - సుంకర, వాసిరెడ్డి

●మోహన వంశీ – లత

●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం

●స్వేచ్ఛ – ఓల్గా

●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

●తృణకంకణం – రాయప్రోలు

●హృదయనేత్రి - మాలతీ చందూర్

●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్

●నీతి చంద్రిక - చిన్నయ సూరి

●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●మొలకల పున్నమి - డా.వేంపల్లి గంగాధర్

●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల

●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

●కొయ్య గుర్రం – నగ్నముని

●నగరంలో వాన – కుందుర్తి

●శివారెడ్డి కవిత – శివారెడ్డి

Tuesday, October 15, 2024


భార్య, భర్తల మధ్య వాగ్వాదాలు మామూలే. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో భార్య మాత్రం ఓ నాలుగు విషయాల్లో భర్తని దూషించినట్లు మాట్లాడకూడదు
మీ మాటలు ఎప్పుడూ మీ భర్త ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మీ సంబంధాన్ని ప్రశ్నించేలా ఉండకూడదు.

నీ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు

వివాహిత మహిళల్లో ఇప్పటికీ చాలా మంది అత్తమామల పట్ల సానుకూలంగా వ్యవహరించరు. వారితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే మీరు మీ భర్తతో గొడవపడే సమయంలో మీ వాళ్లతో నేను ఇక వేగలేను అని భర్తతో చెప్పకూడదు. అతని కుటుంబాన్ని మీరు ఇష్టపడటం లేదని చెప్పడాన్ని ఏ భర్త అంగీకరించడు. అలా కాకుండా మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మీ భాగస్వామితో కలిసి కూర్చుని మాట్లాడండి. పరిష్కారాన్ని సూచించమని కోరండి.

నువ్వు నాకు కరెక్ట్ కాదు

మీ భర్త ఏదైనా తెలియకుండా పొరపాటు చేసినా లేదా గొడవ సందర్భంలో మాట జారినా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు కరెక్ట్ కాదు అనే మాట అనకూడదు. అది మీ భర్త అహాన్ని దెబ్బతీస్తుంది. అలానే అసహనంలో పాత బంధాన్ని గుర్తు చేయడం, వేరొకరిని చేసుకుని ఉండింటే బాగుండేది లాంటి మాటల్ని అస్సలు అనకూడదు. అలానే మీ భర్తని మీకు ఆ పని చేతకాదని చెప్పడం అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వారు దాన్ని స్పోర్టీవ్‌గా తీసుకుంటే ఓకే.. కానీ నెగటివ్‌గా తీసుకుంటేనే మీకు ఇబ్బందులు వస్తాయి.

నీ కంటే అతను బెస్ట్

మీ భర్తని ఎట్టి పరిస్థితుల్లో వేరొకరితో పోల్చవద్దు. అతను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నించడం అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏ మనిషి మరొక మనిషితో పోల్చడాన్ని ఇష్టపడడు. ఇది వారి అహంకారాన్ని దెబ్బతీయడమే కాకుండా వేరొకరితో కంటే మిమ్మల్ని చిన్నచూపుగా చూడటంతో వాళ్లు నిరాశకి గురవుతారు.

నువ్వు నాకు అవసరం లేదు..

మీ భర్తతో వాదించే సమయంలో ఇకపై నీ గురించి నేను పట్టించుకోను.. నువ్వు నాకు అవసరం లేదు అనే మాట ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. మీరు అతడ్ని ప్రేమించడం లేదని మీ భాగస్వామికి చెప్పడం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది, అలానే అతని మనస్సులో సందేహాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఆ మాట తర్వాత మీ బంధాన్ని ప్రశ్నించడం ప్రారంభించవచ్చు లేదా అతను సందేహంలో ఉండిపోతారు.

భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ఎవరో ఒకరు సర్దుకోవాలి. మాటకి మాట పెంచుకోవడం ఇద్దరికీ మంచిది కాదు. మీ భర్త మాట పట్టింపులకి వెళ్తున్నప్పుడు మీరే కాస్త అర్థం చేసుకుని అక్కడితో గొడవకి పుల్‌స్టాప్ పెట్టడం ఉత్తమం. ఆ తర్వాత ఆ సమస్య గురించి అతనికి కోపం తగ్గిన తర్వాత చర్చించి పరిష్కరించుకోవచ్చు. ఏ సమస్య కూడా వాగ్వాదంతో పరిష్కారం కాదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
*కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు....👨‍👩‍👧‍👦

అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు. ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు  అలెర్జీ పుడుతుంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.

*కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు:*

1.అతి తెలివి,
2.చిన్న తప్పును కూడా భరించే శక్తి , సహనం లేకపోవడం,
3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).
4.పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.
5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈ రోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లో వారు ఎప్పుడు  ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.
6.చిన్న దానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.
7.ఎవరో ఒకరి నోటి దురుసు తనం కుటుంబం మొత్తం చిన్నా భిన్నం కావడానికి కారణం అవుతుంది.
8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా ,దృఢంగా ,బలంగా మేనేజ్ చేయలేకపోవడం కూడా ఒక కారణం.
9.ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు.
😔
అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా , ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థ పై నమ్మకం పోయింది.
😣
అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే  లేదు. గత 30,40 ఏళ్ళల్లో  మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగా నే చెబుతున్నారు.
10.ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండా పోతుంది.
11.మనుష్యులు అంటేనే విలువ లేదు.మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.
12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు.దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.
13.కుటుంబ నిర్వహణ ఒక కళ.ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.
14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది.మొరటుగా ప్రవర్తిస్తున్నారు.
☘️
నేను నా భార్య/ భర్త అనే సిద్దాంతం పోయి "నేనే నేను "" నేను నేనే"
పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచు కోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరంగా కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు.
☘️
కుటుంబ విలువలు, కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి. అన్నా దమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ , భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే  లేవు.
🤓
సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ఇక్కడ అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో, ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు. దీనికి అందరూ అతీతులే. ఇక్కడ ఎవ్వరూ శ్రీ రామచంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటు ఇటు గానీ వింత జాతి. ఇది ఇంతే. అది అంతే. ఎవ్వరూ ఏమీ చేయ లేరు.
🙃
ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప మనo మాత్రం మారం కదా...?

సినీ కథ లైనులు

 యాక్సడెంట్ లో ప్రాణాలు పోతాయి ఇద్దరికీ స్నేహితుడే సాక్షి ఇద్దరి చావుకు కాలంలో ఆస్ట్రెలియా పోతాడు ఫ్రెంఢు ఓ ముప్పై సంవత్సరాల తరువాత బిజినెస్...