రచన రంగవల్లులు RACHANA RANGAVALLULU
JANASRI
Wednesday, September 16, 2026
Wednesday, June 24, 2026
సన్మాన పత్రం సుగుణక్క
ఓ ముగ్ద సుఖుమార సుగుణ సుసంపన్నరాశి
మృదు మధుర సంభాషిణీ నిర్మలహృదయ
గురుకులమణి దీప్తి , మా మనో స్పూర్తి నేత్రి ,ఆదర్శమార్తీమణి మన అందరి ప్రేమామయి శ్రీమతి కొమ్ము మేరి సుగుణ మణి గారు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా గవర్నమెంటు నర్శింగ్ కాలేజి కాకినాడ నందు సుదీర్ఘకాలం పనిచేసి పదవీవిరమణ చేస్తున్న సందర్బంగా మీపై జల్లుతున్న పరిమళభరిత అక్షర గులాబి రేకులు , అభినందన స్వర్ణ మల్లెల అక్షింతలు ,గంభీర స్వర ధ్వని పొగడ్త రాగ రంజితాలు
ఓ, నిరాడంబర సేవా రూపమా !
శ్రీకరంబు, శుభకరంబు, అభిషక్తుని సన్నిది' నందు తొలకరి జల్లుల ఆషాడ మాసమందు మీ పదవీ విరమణ ఆనందదాయకం శోభాయమానం
గోదావరి తరగల చీరకుచ్చిళ్ళలో ఓ పాయ చింతపల్లి లాకుల గ్రామం. ఓ గురు తరుణీ ! మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరెన్నికగన్న శ్రీ కొమ్ము జోసఫ్ మరియు శ్రీమతి దయామణి గార్ల గర్భఫలశుక్తిగ తొమ్మిది మంది సంతానంలో నాల్గవ సంతానమైన మీరు కొమ్మువంశ గారాలపుత్రికగా పెరిగారు మీరు. లాకుల గలగల సవ్వడులు వింటునే ప్రాధమిక విద్యను పూర్తి చేసుకొన్నారు ., ఫ్లొరెన్సు నైటింగేలును స్పూర్తిగ నిలుపుకొని, కింగ్ జార్జ్, స్విమ్స్ తిరుపతి నందు "నర్సింగ్ " విద్యను పూర్తి చేసుకొని వైద్య సేవలపై మీ గల మక్కువను చాటుకున్నారు మీరు..
1985 లో కృష్ణాజిల్లా నందిగామలో ప్రభుత్వ స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ తల్లిలా అనారోగ్య ,,అభాగ్యులకు మీరందించిన సేవలు మరువలేనివి. చిన్ననాటి నుండి చదువుల్లో మేటిగా వుండే మీకు పదవులు వరించడం పెద్ద విశేషం కాదు, పదవులే వాటిని అవి గౌరవించుకున్నాయంటే అతిశయోక్తి కాదు
ఓ అభినవ నైటింగేల్ సుగుణవతీ !
వృత్తి పట్ల ప్రేమ నిబద్దత,అంకితభావం ఉపాధ్యాయులైన తల్లితండ్రుల స్పూర్తి ,భోధన పట్లగల ఆసక్తి మిమ్మును నర్సింగ్ విభాగంలో లెక్చరర్ను చేసాయి.రోగులకు సేవలు అందించే అతి పవిత్రమైన వృత్తిని చేపట్టడమే భాగ్యమనుకుంటే వేల మంది ఫ్లొరెన్సు నైటింగేలులను తయారుచేసే వృత్తిని ఎంచుకోవడం వృత్తి పట్ల మీ అచంచల అనురక్తికి నిదర్శనం. నర్సింగ్ లెక్చరర్ గా సేవలు అందిస్తూనే కాకినాడ నర్సింగ్ కళాశాల ఏర్పడాలని కలలుకని ఓ తపస్వీ లా కృషిచేసి అనుకున్నది సాధించడం సామాన్యంకాదు . అందుకు అభినందనీయురాలు మీరు! కాలేజీ ఏర్పాటులో అవంతరాలెన్నో దాటుకుని కాకినాడ జి జి హెచ్ నందు నర్సింగ్ కాలేజి ఏర్పడినప్పుడు కాలేజికి తొలి ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా వ్యవహరించి రికార్డు సృష్టించినమీకు నర్సింగ్ లోకం జెజేలు పలుకుతుంది. అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పదోన్నతి పొంది అత్యుత్తమ అధ్యాపకురాలిగా మీరందించిన సేవలు వైధ్యశాఖకు వన్నెతెచ్చాయి.
సహృదయం, సద్భావం, సచ్చీలత, సౌశీల్యం స్వయం కృషి, సమన్యయ తత్వం, జీవిత నడవడికలో నిబద్ధత, , సేవాస్పూర్తి, సేవా భావం రంగరించిన మెరిసే 'జువ్వలా" మిమ్మును ఆస్దానంలో నిలబెట్టాయంటే అతిశయోక్తి కాదు.
నిరంతర విధ్యార్దినిలా, ప్రజ్ఞాశీలురై, దార్మిక చింతనతో, మంచి భోధకురాలిగా, జ్ఞాన సాగరంలో, ఎందరో నర్శింగు విద్యార్ధులను తీర్చి దిద్దిన 'స్వర్ణ శిల్పి" లా దైర్యాన్ని చెప్పే సంజీవిని లా" "జ్ఞాన దాతలా " విధ్యార్దుల ముందు నిలిచి విధ్యార్దుల హృదయాలలో చిరస్దాయిగా నిలిచిపోయిన మీరు మీకు మీరే సాటి. అందుకే అందుకోండి మా ఆత్నీయ అభినందన మందార మాలల దండలూ దండాలు .
ఓ అగ్ర గురు నారీశిరోమణీ !
ఉత్తమ స్టాఫ్ నర్సుగా బెస్ట్ సర్వీసెస్ అవార్డులు ఎన్నో పొందారు. బెస్ట్ ఫెర్మార్మెన్స్ అవార్డులే కాదు ,అత్యుత్తమ నర్సింగ్ టీచింగ్ అవార్డులూ వరించాయంటే అవి మీ అంకితభావానికి అందిన అందలాలు అభినందన నీరాజనాలు.
ఓ ఉత్తమ గృహిణీ
వైధ్యశాఖలో పనిచేయడమంటే ఆషామాషీకాదు ఇల్లాలుగా ఇంటిని చక్కదిద్దుకుని సమయంతో పనిలేని నర్సింగ్ వృత్తిని చేపట్టి ,ఓ ప్రక్క భర్తకు తగిన భార్యగ,తల్లిగ మీ కుమారుడిని లండన్ నగరంలో ఎం బి ఎ చదివేలా తీర్చిదిద్దడం మీరు ఉత్తమ గృహిణిగాను నర్సింగ్ విభాగంలో పనిచేసే ప్రతీ గృహిణికీ ఆదర్శం మీరు.వేలాదిమందిని తీర్చిదిద్దే టీచింగ్ భాధ్యతలు చేపట్టి విజయవంతంగా పదవీ విరమణ చేయడం వృత్తి పట్ల గల మీ ప్రేమానురాగాలకు అంకితభావానికి నారీలోకం వైధ్యశాఖ చేతులెత్తి నమస్కరిస్తుంది
.పదవీ విరమణ మనసుకు భారమైనా తప్పని క్షణాలను భరిస్తూ మీ భావి శేషజీవితకాలం ఆ దేవాదిదేవుని సన్నిధిలో గడవాలని మీకు మీ కుటుంబానికి ఆ ప్రేమామయుని కృపాకటాక్షములు దీవెనలు కలగాలని మీ భావి జీవితకాలం నిండూ నూరేళ్ళు సుఖసంతోషాలతో గడవాలని కోరుకుంటూ
Sunday, April 5, 2026
Saturday, April 4, 2026
జయహో అమరావతి
జయహో అమరావతి
గీత రచన
బెన్ జాన్సన్
బాలసాహితీ రచయిత
ఆంధ్రుడా అదిగదిగో
చూడవోయి
మన ఆంధ్రుల రాజధాని అమరావతీ
జయహో
జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధానీ
మా అమరావతి
జయహో జయ జయహో
జయహో జయజయహో
అమరావతీ
ఆంధ్రుల పురోగతి నీవే
ఓ పూర్ణకుంభం ధారి
మా అమరావతి
నీ పేరు నిలవాలి
ఆ చంద్రతారార్కం
నీ కీర్తి అజరామరం
నీ కీర్తి ఇక అజరామరం
తరతరాల నీ పాలన
ఆంధ్రులకు నవజీవనం
జయహో
జయ జయహో అమరావతి
ఆంధ్రుల విజయశిఖరం
మా అమరావతి
జయహో
జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధాని
మా అమరావతి
ఆంధ్రుల పురోగతి
మా అమరావతి
అభిమాన ధని
మా అమరావతి
నీ పేరు నిలవాలి
ఆ చంద్రతారార్కం
నీ కీర్తి అజరామరం
నీ కీర్తి ఇక అజరామరం
తరతరాల నీ పాలన
ఆంధ్రులకు నవజీవనం
జయహో జయ జయహో
జయహో జయ జయహో
నాగార్జునగిరి సిగన
మా మల్లె పూదండ
మా అమరావతి
నాగార్జునగిరి సిగన
మా మల్లె పూదండ
మా అమరావతి
కృష్ణవేణి పాదాల
విరిబోణి మా అమరావతి
కృష్ణవేణి పాదాల
విరిబోణి మా అమరావతి
ఆంధ్రుల రాజధాని
మా అమరావతి
మా రాజధాని
అమరావతి
జయహో జయజయహో
అమరావతి
జయహో జయహో అమరావతి
వర్దిల్లు వర్దిల్లు అమరావతి
ఆంధ్రుల అన్నపూర్ణ అమరావతీ
తెలుగుజాతి అక్షరమై
చిరకాలం వర్దిల్లు వర్దిల్లు
బుద్దుని శాంతి పలుకులతల్లి
మా అమరావతి
రండి ఆంధ్రులారా
మన అమారావతి కీర్తిని పాడుదాం
రండి ఆంధ్రులారా
మన అమరావతి కీర్తిని పాడుదాం
జయహో జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధాని మా అమరావతి
Thursday, March 19, 2026
కొండేపూడి
ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజర్వేషను ఫలాలు ఏభై ఏళ్ళుగ 56 ఉపకులాలు కలిగిన షెడ్యూల్డ్ కులంలో ఒక వర్గమే ఎక్కువభాగం పొందుతుంటే రిజర్వేషను ఫలాలను పెరియార్ మహాశయుని స్పూర్తితో వెనుకబడిన కులాలు( బి సి ) వర్గీకరించుకున్న రీతిగానే మాకు వర్గీకరించండని మాదిగ జాతిలో కొందరు అరవైయవ దశకంలో గొంతు సవరించుకున్నప్పుడు అప్పుడే అడవుల్లో ప్రతిధ్వనించే ఓ కేక మందకృష్ణ రూపంలో శంఖారావం పూరిస్తుంటే యువ నాయకత్వం హృదయచెవులకు బలంగా వినపడింది. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర జిల్లాలన్నిటిలో సువిశాలమైనది.అమలాపురం నుండి కోటనందూరు వరకునూ,రాజమండ్రి నుండి రంపచోడవరం వరకు రాజకీయ చైతన్యం కలిగిన ప్రసిద్దజిల్లా.ఈ జిల్లా నుండి ఎందరో దోశోద్దారకులు జన్మించారు.కాని వారితొ పాటు ఓ జాతోద్దారుకుడు జన్మిస్తాడని కాలం కలగనలేదు.సాతంత్ర్య సముపార్జనలో భగత్ సింగ్ బాంబులు వేసినందుకు.అల్లూరి బ్రిటీష్ వారిని ఎదురించినందుకు.నెహ్రు జైలు జీవితం గడిపినందుకు వారు చేసిన ఒక్కొక్క త్యాగానికి వారిని స్మరిస్తుఉన్నాం మరి ఒక జాతోద్దరణకు జీవితం అర్పించి ముప్పై ఏళ్ళు కుటుంబాన్ని వదిలి లక్షలాది కీలోమీటర్లు పయనించి మిలెటెంటుగ మారి బస్సు దహనాలలో పాల్గొని జైలు జీవితం గడిపి అన్నీ అనుభవించిన మహోన్నతమూర్తిని ఆ జాతి ఎంత హృదయంలో పెట్టుకుంటుంది.మాదిగ జాతోద్దారకుడు కొండేపూడి శ్యాంబాబును యావత్తు మాదిగజాతి దిగ్గజనేతగ తమ గుండెల్లో నిలుపుకున్న చరిత్రను చదవడం ప్రతీ మాదిగ బిడ్డల కర్తవ్యం. కీ॥శే కొండేపూడి శ్యాంబాబు ( శ్యామన్న)చరిత చిరస్మరణీయం
కుటుంబ చరిత్ర
స్వతంత్ర వ్యక్తిత్వం గల నాయకుడు
దృశ్యాల దొంతర
ఉత్తణ్ణ
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
నీ మెడలో నల్లని వస్త్రం
అది ఉరుములు ఉరిమే కంఠం
నీ మెడలో నల్లని వస్త్రం
అది ఉరుములు ఉరిమే కంఠం
మందకృష్ణ రారా
మా మాదిగ విజయం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా ప్రేమను మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా.
మా ప్రేమను మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా.
మా గుండెల నిండా విజయం
ఉప్పొంగెను చూతువు రారా
మందకృష్ణ రారా
మా మాదిగ విజయం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్యకృష్ణ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
నుదుటిన తిలకం దిద్ది
నీ చేతికి గంధం పూసి
వీధి వీదుల హారతి పట్టి
నీ పల్లకి మోస్తాం రారా
నీ పల్లకి మోస్తాం రారా
మా నవ్వులు దండగ గుచ్చి
నీ మెడలో వేసేద రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పొగడి పాడెదరా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పొగడి పాడెదరా
కేరింతల గజ్జెలు కట్టి
మా నవ్వును దరువుగ చరిచి
కేరింతల గజ్జెలు కట్టి
మా నవ్వును దరువుగ చరిచి
నిను దీవిస్తున్నాం రారా
మా నవ్వులు పూలుగ జల్లి
నిను దీవిస్తున్నాం రారా
వీధి వీధిన హారతి పట్టి
నీ పాదం మా నెత్తిన పెట్టి
వీధి వీధిన హారతి పట్టి
నీ పాదం నెత్తిన పెట్టి
డప్పుల దరువులు వేసి
నిను దీవిస్తున్నం రారా
వీరబాహు చిందులు తొక్కి
నిను దీవిస్తున్నాం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్యకృష్ణ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా మాదిగ విజయం రారా
మా మాదిగ విజయం నీవేరా
మా మాదిగ విజయం నీవే నీవే నీవేరా
1874 ప్రాంతంలో మిషనరీలు వచ్చే వరకు విద్య సామాన్య జనానికి చేరువకాలేదని తెలిసిందే .అనేక అసమానతలు మబ్బుపట్టినట్లు కమ్ముకున్న సమయం. వీధి బడులు నిర్వహిస్తున్న చదువు ఎందుకు అవసరమేంటి అనే ఆలోచన బలంగా ఉన్న రోజుల్లో చదువుకి ప్రాధాన్యత లేని కాలంలో మిషనరీలు ఉవ్వెత్తున భారతావనిపై దండెత్తినట్టు నలుదిశలా తెలుగు నేలపై అడగిడడం ఓ నూతన శకారంభంగానే భావించాలి.మిషనరీలైన జాన్ మెక్లారిన్ మరియు స్మిత్ లు తూర్పుగోదావరిలో సామర్లకోట,పెద్దాపురం,పిఠాపురం,కాకినాడ,రామచంద్రాపురంలలో పాఠశాలలు చర్చిలు స్దాపించారు.1925 లో కొత్తపల్లి మండలంలో అమినాబాదలో పాఠశాల ను హానోకు మాస్టారుచే ప్రారంబించారు.
మెకంజీ సేకరించిన కఫియత్తుల్లో తొండంగి మండలం మనకు స్పష్టంగ కనబడుతుంది.11 వ శతాబ్దం నుండి అక్కడ గ్రామాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది.శైవ వైష్ఞవ గొడవల్లో తమిళనాడు నుండి బ్రాహ్మణులు రావడం వారికి పెరూమాళ్ళపురంలో ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తుంది.సర్పవరం లో గల ఆలయంలో అర్చకత్వం వహించడానికి వారికి అనుమతి వచ్చినట్లు తెలుస్తుంది.ఇక పిఠాపురం సంస్దానం ఆధీనంలో ఉన్న రోజుల్లో అద్దరిపేట మొదలు మూలపేట వరకు గల ప్రాంతాన్ని కోనఫారెస్టుగ నమోదైయినట్లు కైఫియత్తుల్లో కగొనవచ్చు. కోనఫారెస్టును ఏనుగుల పుంత అని కూడా పిలిచేవారు.పిఠాపురం సంస్దానం వారి సైనిక పఠాలం ఇక్కడే ఉండేది
బైబిల్ ప్రకారం ఆడమ్ నుండి మహాజలప్రళయం వరకు 1656 సంవత్సరాలు జలప్రళయం నుండి అబ్రహాం పుట్టుకవరకూ 292 ఏళ్ళు అబ్రహాం నుండి జాకబ్ ( యాకోబు) మిగత...
-
సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర) రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్ స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం...
-
పండరీ భజన మన ఆంధ్రదేశంలో ఆ మూభాగం చుట్టివచ్చినవి, అందరినీ కదిలించినవీ భజన దళాలే అంటారు. ఇవి జానపద కళారూపాలకు చెందుతాయి. అందులో పండరీభజనకు ప...
-
దొమ్మరాట గ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ఈల వేస్తూ హౌరియా, హౌరియా అంటూ వేగంగా మొగ్గలు వేస్తూ వినోదాన్ని వంచే వారు పలురకాలుగా చేసే ...













.jpg)






