Thursday, March 19, 2026

కొండేపూడి

 ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి  ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజర్వేషను ఫలాలు ఏభై ఏళ్ళుగ  56 ఉపకులాలు కలిగిన షెడ్యూల్డ్ కులంలో ఒక వర్గమే ఎక్కువభాగం పొందుతుంటే రిజర్వేషను ఫలాలను పెరియార్ మహాశయుని స్పూర్తితో వెనుకబడిన కులాలు( బి సి )  వర్గీకరించుకున్న రీతిగానే మాకు వర్గీకరించండని మాదిగ జాతిలో కొందరు అరవైయవ దశకంలో గొంతు సవరించుకున్నప్పుడు అప్పుడే అడవుల్లో ప్రతిధ్వనించే ఓ కేక  మందకృష్ణ రూపంలో శంఖారావం పూరిస్తుంటే యువ నాయకత్వం హృదయచెవులకు బలంగా వినపడింది. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర జిల్లాలన్నిటిలో సువిశాలమైనది.అమలాపురం నుండి కోటనందూరు వరకునూ,రాజమండ్రి నుండి రంపచోడవరం వరకు రాజకీయ చైతన్యం కలిగిన ప్రసిద్దజిల్లా.ఈ జిల్లా నుండి ఎందరో దోశోద్దారకులు జన్మించారు.కాని వారితొ పాటు  ఓ జాతోద్దారుకుడు జన్మిస్తాడని కాలం కలగనలేదు.సాతంత్ర్య సముపార్జనలో భగత్ సింగ్ బాంబులు వేసినందుకు.అల్లూరి బ్రిటీష్ వారిని ఎదురించినందుకు.నెహ్రు జైలు జీవితం గడిపినందుకు వారు చేసిన ఒక్కొక్క త్యాగానికి వారిని స్మరిస్తుఉన్నాం మరి ఒక   జాతోద్దరణకు జీవితం అర్పించి ముప్పై ఏళ్ళు కుటుంబాన్ని వదిలి లక్షలాది కీలోమీటర్లు పయనించి మిలెటెంటుగ మారి బస్సు దహనాలలో పాల్గొని జైలు జీవితం గడిపి అన్నీ అనుభవించిన మహోన్నతమూర్తిని ఆ జాతి ఎంత హృదయంలో పెట్టుకుంటుంది.మాదిగ జాతోద్దారకుడు కొండేపూడి శ్యాంబాబును యావత్తు మాదిగజాతి దిగ్గజనేతగ తమ గుండెల్లో నిలుపుకున్న చరిత్రను చదవడం ప్రతీ మాదిగ బిడ్డల కర్తవ్యం. కీ॥శే కొండేపూడి శ్యాంబాబు ( శ్యామన్న)చరిత చిరస్మరణీయం

కుటుంబ చరిత్ర

స్వతంత్ర వ్యక్తిత్వం గల నాయకుడు

దృశ్యాల దొంతర

ఉత్తణ్ణ



ఈదిమూడిలో మాన్య మందకృష్ణ రూపంలో రగిలిన నిప్పురవ్వ 
ఉమ్మడి రాష్ట్రాలలో sc వర్గీకరణపై దావానలమై రగిలిపోతుంటే  
దిమ్మెరపోయిన భారత జనం విస్తుపోయి వీక్షిస్తున్న క్షణాలను ఓ వీరుడూ వీక్షించాడు.
  మాదిగ జాతిమహసముద్రం ఓ సునామిగా మారబోతుందని అది sc  ఉప కులాల దోపిడీని సమూలంగా పెకిలించివేస్తుందని
 రానున్నకాలం మాదిగజనసమూహానిదే విజయమని 
ముందే గ్రహించిన వీరుడు కొండేపూడి శ్యాంబాబు 
అన్న   పద్మశ్రీ మందకృష్ణ  1994 లో స్దాపించిన MRPS  దండోరా ఉద్యమంలో మరో ఆలోచన లేకుండా   చేరిపోయాడు
అణగారిన sc  కులాలు దోపిడీకి గురవుతున్న
తీరును ప్రశ్నిస్తూ పరుగెడుతున్న ఉద్యమకారుడికి
తన వంతుగ  స్పూర్తిగా పూర్తి జీవితాన్ని అర్పించాడు శ్యాంబాబు . 
కొండేపూడి శ్యాంబాబు మాదిగగా ప్రకటించుకున్నాడు. 
మందకృష్ణ ఆశీస్సులతో  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు MRPS  అధ్యక్షునిగ ఎంపికైనది మొదలు తనదైన శైలిలో ఉద్యమించి 
అగ్నికి వాయువు తోడైన  తీరుగ   ఉద్యమాన్ని ఉరుకులెత్తించిన తీరు   ఏ మాదిగ బిడ్డ మరువలేడు.  ప్రతీ దండోరా  కార్యకర్త నోరార శ్యామన్నా అంటూ పిలుచుని  సొంత ఇంటిలో సోదరుని వలె సంబరపడిపోయేవారు. వృద్దులు శ్యామన్నా అని పిలుచుకుంటూ మురిసిపోయేవారు.

ఉద్యమాల కాగడా కాకినాడలో కొండెపూడి రాఘవులు ణా మరియమ్మల ఇంటి  జన్మించిన   పంచపాండవులులా ఐదుగురు అన్నతమ్ములలో రెండవవాడుగా   1961 సంవత్సరంలో జన్మించాడు మన శ్యాంబాబు .చిన్నతనాంలోనే ధీరత్వలక్షణాలు కలిగిన శ్యాంబాబు కాకినాడలోనే చదువులు ముగించి  ఆర్ &bకాంట్రాక్టరు బిల్డరుగ  ప నిచేస్తూ   ప్రజా ఉద్యమాలలో పాల్గొనేవాడు. మోయ్యేటివారి అమ్మాయి ఉమాకుమారిని అర్దింగిగా స్వీకరించాడు. ఉమాకుమారి భర్తకు తగిన భార్యగ భర్త పోరాటాలలో నిమగ్నమయితే యింటి భాధ్యతను తన భుజాలపై మోసిన ఉత్తమ గృహిణి ఉమాకుమారి.భుజం తట్టి పోరాటలకు పంపిన వీరనారి మన ఉమాకుమారి   ముచ్చటగ ఇద్దరు మగబిడ్డలు రాజాజీ రాయ్ ,రాహుల్ రాయ్  లకు జన్మనిచ్చి ఒకరు ప్రభుత్వ డాక్టరుగ మరోకరు ప్రభుత్వ ఇంజనీరుగ స్దిరపరచి
ఉత్తమ కుటుంబస్తునిగ కూడా నిరూపించి  మనందరికీ ఆదర్శవంతంగా నిలిచాడు మన కొండేపూడి శ్యాంబాబు .



మాదిగ హృదయ స్పందన
మాదిగ జాతి ఇంటి చిరునామ
ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 
 ఇంటింటికి ధన ధనా మ్రోగిన దండోరా శబ్దం
ఆకుపచ్చని జీపుపై దండోరా జెండా
రెప రెప లాడుతూ దూసుకువస్తుంటే
జీపు దిగిన మాదిగ గంభీర ధీరత్వం 
 నిలువెత్తు మానవత్వంతో
 పల్లెలోకి
 నడచివస్తుంటే 
రెప్పవాల్చకుండా తన్మయత్వంతో
ఉక్కిరిబిక్కిరైన మాదిగ ఆనందం
అన్న మందకృష్ణను గుండెనిండా నింపుకుని
అదే ధైర్యంతో అదే తెగువతో ఎదుటవారి గుండెలు దడదడలాడేలా చేసిన డప్పుల నిప్పుల మోత  
 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మందకృష్ణన్న పేరు మారుమ్రోగేలా చేసిన ఉద్యమనినాదం
 మాదిగ బిడ్డలకు sc వర్గీకరణ ఫలాలు అందించిన వెను వెంటనే  
ఏ లోకాలలో ఉద్యమించడానికో ఇక్కడ అస్తమించి 
 ఏ శిఖరాలల ఉదయించడానికో వెళ్ళి పోయిన 
ఉద్యమ సూరీడు మన ప్రియతమ దండోరా MRPS  నాయకుడు దివంగత  ఉద్యమకారుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగకు ప్రతీ మాదిగ పల్లె  హృదయ భారంతో ఘన నివాళి అర్పిస్తుంది





ఉద్యమాలే ఊపిరిగ sc వర్గీకరణే అంతిమ లక్ష్యంగాని నదించి
అన్న మందకృష్ణ ఆదేశాలను 
నూటికి నూరుపాళ్ళు అ







oo



oo...మలుచేస్తూ ఉద్యమాన్ని ఇంటింటికి చేరవేసి 

లక్షలాది మందితో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో విశ్వరూపసభలే కాదు 
అమలాపురం మొదలు జిల్లానలుమూలలా లక్షలాది మందితొ నభూతో నభవిష్యతి గా సభలు నిర్వహించి జాతిని మేల్కొల్పిన ఘనత మన శ్యామన్నదే
 మాన్యశ్రీ మందకృష్ణ అన్నగారు అమాలాపురం నుండి ప్రారంభించిన పాదయాత్ర ప్రత్యర్దుల శిబిరాలలో కలవరం పుట్టించినప్పుడు 
అన్నను కంటికి రెప్పలా కాస్తూ పాదయాత్రను దిగ్వోజయం చేసిన క్షణాలు ఏ మాదిగ నాయకుడు మరులేడు.

 సోదరుడు కొండేపూడి ఉదయ్ తన అన్న శ్యామన్న వెన్నంటే ఉంటూ కార్యక్రమాల రూపకర్తగ అనేక కార్యక్రమాల విజయాలలో 
పాల్గొన్న తీరు రాముడికి లక్ష్ముడిలెక్కన అండదండలు అందించిన సంగతి మరువరానిది.
మిలిటెంటు ఉద్యమాలు చేసినప్పుడు జైలు జీవితాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉన్న జైలు జీవితానికి
 వెరువక ఎదురునిలిచి 86 రోజులు రిజర్వేషను సాధనలో జైలు జీవితం గడిపి  28 కేసులు ఎదుర్కొన్న సమరయోదుడు  మన శ్యామన్న. 


తన శ్రమ వృధాపోకుండా తొలిదశ ఉద్యమంలో రిజర్వెషను సాధనా ఫలాలను అందించడంలో 
అన్నగారితొ కలసి విజయం సాధించిన క్షణాలను శ్యామన్న ఎప్పుడూ నెమరువేసుకునేవారు తన MRPS  దండోరా కార్యకర్తలతో .

ప్రధాని మోడి సభ అనంతరం జాతి మరోసారి విజయతీరాలను చేరుతున్న క్షణాలలో పాలు పొందాలని ,మందకృష్ఞ అడుగుజాడలలోనే ఇక తన శేషజీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు మన శ్యామన్న.
 అన్న మందకృష్ణను కలవాలని పరితపించిన తీరు హృదయాలను కదిలించకమానదు.
అన్నను  పలు మార్లు కలసి తన మనసులో కోరికను బలంగా తెలిపిన క్షణాలు ఉద్వేగం కలిగిస్తాయి
.యావత్ మాదిగ జాతికి మంద కృష్ణన్న ఒక్కడే మహత్ముడు అని  తెలుపుతూ
కార్యకర్తలతొ లక్షడప్పుల కార్యక్రమాలకు కార్యకర్తలను సన్నద్దపరిచిన క్షణాలను కార్యకర్తలు మరచిపోలేకపోతున్నారు కార్యకర్తలు

తునిలో వేలాది మందిలాది మందితో కృష్ణన్నకు జేజేలు పలుకుతూ నిర్వహించిన కార్యక్రమం కార్యకర్తలకు కలగానే మిగిలిపోయింది.

ఏఫ్రియల్  18 యావత్ మాదిగ జాతి ఓ వీరుడిని కోల్పోతుందని ఎవరికీ తెలియదు .
అన్నమంద కృష్ణగారిని మరోసారి కలిసి
రావాలని  కార్యకర్తలతో మాటమంతి నిర్వహించి చేయి ఊపి సాగనంపుతూ వెనుతిరిగి  జారిపడి మరోలోకంలో పడిపోయాడు శ్యామన్న ..నెలరోజులు కోమాలో ఉండి చివరకు తిరిగిరాని  లోకాలకు తరలిపోయాడు వర్గీకరణ సమరయోదుడు కొండెపూడి శ్యాంబాబు మాదిగ మన శ్యామన్న


No comments:

Post a Comment

కొండేపూడి

 ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి  ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజ...