Thursday, January 8, 2026

 సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర)


రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్


స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం/ ఆహ్....... సంకెళ్ళు, సంకెళ్ళు.. ఇశ్రాయేలీ జనాంగములోని మహాబలిశాలి సంసోనుకు సంకెళ్ళు, సంకెళ్ళు.... సంకెళ్ళు/ కబోధి, కబోధి..... దాను వంశీయుడు, న్యాయాధిపతి సంసోను ఈరోజుకబోధి కబోధి, సంసోను కబోధి/ ఆహ్..... ఆహ్..... అపహాస్యం, అపహా స్యం... ఓరి పిరికి ఫిలిస్తీయులారా అపహాస్యం చేస్తున్నారా..... మీ దేవాలయంలో సంబరాలు చేసుకుంటున్నారా? ఎందుకురా మీ నవ్వులు ఏమి సాధించారని సంబరాలు చేసుకుంటున్నార్రా? దొంగదెబ్బ తీసి, బంధిం చినందుకురా మీ సంబరాలు?/ సిగ్గులేని జనాంగమా నాదేవదేవుని పట్ల నేను చేసిన మహాపరాధ ఫలితమే ఈ దుస్థితే గాని, మీ దేవత గొప్పదనంరా, మీదేవత గొప్పతనము రాఇది?/


మీ దేవత గొప్పతనం. అనా మీ ప్రగల్భాలు? నా దేవదేవుని శక్తి ముందర... నా దేవదేవుని శక్తి ముందర, మీ దేవతలు ఏ పాటివిరా? మూర్ఖులారా! వాటి శక్తి ఏ పాటిదిరా? నా దేవుని శక్తి ముందు./


అయ్యో.... అయ్యో... ఈదుస్థితి, ఈ దుస్థితి. పాపానికి అమ్ముడుపోయి న పాపినైన నాకు ఆ దేవదేవుడు వేసిన శిక్షరా ఇది? ఆ దేవదేవుడు వేసిన శిక్ష. / ఆజ్ఞాతిక్రమం మహాపాపమని తెలిసి మధాందుడనై నా ప్రభువు పట్ల చేసి మహాపరాధ ఫలితమేరా ఇది ఆ ప్రభువు పట్ల చేసిన మహాపరాధ ఫలితమే./ ఓరి న్నతి లేని జనాంగమా అపుడే మరిచిపోయి నవ్వుతున్నారా? అప్పుడే

No comments:

Post a Comment

 సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర) రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్ స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం...