శక్తి వేషం
భయానక రసాన్ని అద్భుతంగా మనకళ్లముందు ప్రదర్శించే కళారూపాలలో శక్తి వేషం ఒకటి కాళికా మాత శక్తి రూపాన్ని ధరించి రాక్షసుణ్ణి లేదా మాంత్రికుడిని మనమధ్యన కకలావికలంగా పరిగెత్తించి కింద పడేసి తనచేతిలోని త్రిసూలంతో పొడవడం అనే కథాంశంగా ఈ ప్రదర్శన సాగుతుంది. జాతరలు, సంబరాలలో ఈ శక్తి వేషం మనకి కనబడుతుంది. సత్తెమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, సంబరాలు జరిగే పెద్దాపురం, కాకినాడ, కాండ్రకోట, చింతలూరు వంటి దేవతల సంబరాలు జరిగే చోట ఈ ప్రదర్శనను మనం తిలకించవచ్చు. శక్తి వేషం కట్టే కళాకారుడు అజానుబాహుడై ఉంటాడు. ఇందు ముందు ఆరడుగులపైగా వుండి బలిష్టంగా వున్న వ్యక్తి తనముఖాన్ని
కాళికామాతలా మేకప్ చేసుకుంటాడు. నోటిలో నుండి ఎర్రని నాలుక బయటకు వచ్చినట్లు రేకుతో చేసిన నాలుకను పళ్ళ కింద బిగించుకుంటాడు. కోరపళ్ళను రంగులతో అటూ ఇటూ దిద్దుకుంటాడు. పొడవైన వెంట్రుకలు కలిగిన జత్తును విరగబూసుకున్నట్లు విగ్గు పెట్టుకుంటాడు. దానిపై రేకుతో చేసిన కిరీటం పెట్టుకుంటాడు. నుదిటిపై ఎర్రని పొడవైన బొట్టు ఉంటుంది. నల్లని కాటుకను కనుబొమ్మలకు కళ్ళ కింద పెట్టుకుంటాడు. ముఖానికి రామనీలా రంగును పులుముకుని అదేరంగుగల సాగే బనేమను చేతుల పొడవునా మొత్తం శరీరమంతా వేసుకుంటాడు. మెడలో నిమ్మకాలదండలు వేసుకుంటాడు చేతిలో త్రిశూలం రేకుతో చేసినది పట్టుకుంటాడు. సడుముకు జనపనార లేదా, వేపరొట్టలు చుట్టూ కుట్టుకుంటాడు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటాడు. మెడలో రేకు డబ్బాలను లేదా ప్లాస్టిక్ డబ్బాలను వంగ కొట్టి వాటికి తెల్లటిరంగు పులిమి పుర్రెల్లాగా వ్రేలాడేసుకుంటాడు. దీనికి ఆరు చేతులు కలిగిన కళ్ళను గిర గిరా తిప్పుతూ నాలికను వేగంగా కట్టుకుంటాడు. ఆడిస్తూ డప్పుల మోతకు తగినట్లు ఊగుతూ ఒక్కసారిగా జనాలను జడిపిస్తూ ప్రదర్శన చూసేవారు భయంతో పరుగులు తీయవలసిందే.
ఈ శక్తి వేషంతో పాటు సహకవేషాలుగా మాంత్రికుడు నాట్యకత్తిలుకుగా ఉంటారు. మొత్తం కళారూపాన్నీ పరుషులే వేస్తారు. మాంత్రికుడు ఒత్తుగా ఉన్న చిలిపిరి జత్తును పెట్టుకుంటాడు. ముఖానికి ఎర్రని తెల్లని రంగు రంగు చీరలు పూసుకుంటాడు నల్లటి నిలువు అంగీవేసుకుని చేతిలో వేపరొట్టలు మెడలో శక్తి చేషంలోలాగా పుర్రెల దండ వేసుకుంటాడు. నాట్య కత్తిలుగా నలుగురు మగవాళ్ళు సింగారించుకుని ఆడవారివలె చక్కగా డప్పులు, తానా వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తు ఉంటారు. ఆశ్చర్య పోవలసిందే వారి మధ్య మాంత్రికుడు శక్తి ముందుకు. వేపరొట్టలు ఝుళిపిస్తూ వెడుతూ మరలా వెనక్కి వస్తూ ఉంటే శక్తి వేషం ఊగుతూ, ఉంటుంది. మాంత్రికుడు దగ్గరకు రాగానే శక్తి వేషం శూలం ఎత్తి కనులు ఎర్రగా చేసి నాలిక ఆడిస్తూ మాంత్రికుడుని తరుముతూ భీకరంగా చుట్టూ పరిగెత్తుస్తుంది. అంతలోనే మరలా శాంతించి దప్పుల మోతలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. ఈ శక్తి వేషానికి అనుబంధంగా ఎలుగుబంట్లు వేషం కూడా కడతారు. గొల్లప్రోలుకు చెందిన నేరూరి అప్పారావు, గుర్రల అప్పారావు ఈ శక్తి వేషాన్ని గత పది సంవత్సరాల నుండీ కడుతూ పిఠాపురం పరిసరప్రాంతాలలో మంచి పేరు సంపాదించుకుంటూ ఇతని బృందంలో మాంత్రికుడిగా పొట్లకాయల చిట్టిబాబు, నాట్యకరైలుగా సప్పారపు యాకోబు, పొట్లకాయల సుబ్రహ్మణ్యం, పొట్ల కాయల రత్నకుమార్, దాకీ సింహాచలం ఉంటూ ఈ శక్తి వేషాన్ని రక్తి కట్టిస్తున్నారు.
No comments:
Post a Comment