Saturday, January 17, 2026

 అది 1971  తారు రోడ్లు అంతగాలేని కాలం.

అమీనాబాద మా అమ్మమ్మగారి ఊరు .అమ్మ తొండంగిలో టీచరుగా పనిచేసేది.వేసవి సెలవులకు నన్ను తీసుకుని ఉప్పాడ శివారు అమీనాబాద అమ్మమ్మ ఇంటికి తీసుకు వచ్చేది. అమీనాబాద గ్రామం మొదల్లో రెండు నుయ్యిలు , రెండు దేవతల గుళ్ళు, మధ్యలో రావిచెట్టు ఉండేవి.ఎక్కడైనా మాదిగపేట ఊరు చివరన ఉంటుంది.ఇక్కడ ఊరు మొదల్లోనే ఉండేది. అందువలనేమో అమీనాబాద మాదిగపేటటంటే చుట్టు ప్రక్కల గ్రామాలకు గౌరవం ఉండేది. ఊరులోకి వెళ్ళేప్పుడు ఎడమ ప్రక్క మామిడి తోట ఉండేది. అందులో సీతాఫలం చెట్లు అక్కడక్కడ రెండు కొబ్బరిచెట్లు.జిల్లేడు, రక్కీసు,సీతమ్మోరు పొదలు,పల్లేరు పాదులు ఉండేవి.తోట మధ్యలో నీటి గుంటలు ఉండేవి. చుట్టూ అంతా ఇసకక్షక్ష





క్ష

క్ష

క్షహక్ష

ౄ కోరడి ఉండేది.దాని మీద బ్రహ్మజెమ్ముడు మట్టలు గుచ్చి ఉండేవి అవి చాలా ఎత్తుగా పెరిగేవి. వాటికి కమల పువ్వులాంటి పూలు గుత్తు గుత్తులుగా ఉండేవి. వాటి వాసన బలే గమ్మత్తుగా ఉండేది.అక్కడక్కడ  కనకంబరం పొదలు కొరడి వారల్లో ఉండేవి.కుడి ప్రక్కన మాదిగపేట ఉండేది.మధ్యలో ఇసకబాట ఉండేది.మాదిగ పేటకు అమీనాబాద వాడపేటకు మద్యలో బారికి వీరన్న జామతోట ఉండేది. రాత్రి ఏడు ఎనిమిది అయ్యిందంటే మాదిగపేట దాటి వాడపేటలోని వెళ్ళడానికి బయపడేవారు.మాదిగపేటదాటి సీకోటి భూలోకు ఇంటివరకు దెయ్యాల్లాంటి తాటి చెట్లతో నిర్మానుష్యంగా బిక్కు బిక్కుమంటూ ఉండేది. కిరసనాయిలు బుడ్డీ పెట్టిన లాంతర్లు పట్టుకుని వెడితే కాని దారి కనబడేది కాదు అప్పటికి కరెంటు లేదు.ఉప్పాడలో కరెంటు స్ధంబాలు ఉన్నా 60 వాట్ల గాజు బల్బులు వెలుగుతూ ఉండేది. ఆ వెలుగు ఆ స్ధంబం కిందే ఉండేది.నేను నా వయస్సు వారైన  రక్థసంబందీకుల స్నేహితులతో ఆడుకునేవాడిని. ఆ రోజుల్లో వెన్నెల పట్టపగలంత కాంతి వంతంగా ఉండేది. చందమామ వెలుగు కళ్ళల్లో జిగేలు మనేది.స్వచ్చమైన కాలుష్యం ఎరుగని వాతావరణం అది . మంచుకి వెన్నెల వెలుగుకూ చలివేసేది.దానికి తోడు పాదాలు మునిగేంత లోతైన ఇసక ఊరంతా ఉండేది.ఆ ఇసకలో పిల్లలం గూళ్ళు కట్టుకుని ఆడుకునేవాళ్ళం.ఆకలి మరచి ఆడుకునేవాళ్ళం ఊరంతా తాటాకు ఇళ్ళే ఇళ్ళమద్యన పరిగెడెతూ ఆడుకునేవాళ్ళం.ఇళ్ళమధ్య పరిగెడుతూంటే ప్రతీ ఇంటి దగ్గర కూరల పులుసుల వాసన గుమాయించేది. చేపల పులుసు, ఎండు చేపల పులుసు, ఎండుకక్కల కూర,కరుగులు సమురు వాసన ముక్కుపుటాలను అదరగొట్టేవి. ఒకొ ఇంటి దగ్గర కమ్మటి కల్లు వాసన వచ్చేది. ఆడపిల్లలు మగపిల్లలం కలసి ఆడుకునేవాళ్ళం.చాలా సేపు ఆడుకునేవాళ్ళం. నేను ఊరునుండి వచ్చేవాడిని కాబట్టి ప్రతీ కుటుంబం ప్రేమగా చూసేవారు. పెద్దవాళ్ళయితే ముద్దలు తినిపించేవారు. ఎవరో ఒకరి ఇంటి దగ్గర తినేసేవాడిని.అప్పుడప్పుడు మాదిగ మాష్టీల ఆడపిల్లల డాన్సు ప్రొగ్రాం ఉంటుండేది. హర్మోనియం, డోలుకుతో మగాడు పాట పాడుతుండే ఆడపిల్ల మోకాళ్ళు దాకా గౌను వేసుకుని బలే ఢాన్సు చేసేది.తరువాత మాదిగలు పెట్టే భోజనం తినే పోయేవారు.

   నేను ఆడుకుని ఆడుకుని ఇంటికి పోయేవాడిని మా ఇల్లు పేటకు చివరన పుంతకు ఆనుకుని ఉండేది.నేను పుంతలోకి చూసేవాడిని కాదు ఎందుకంటే పుంతలో కొండికికాయల చెట్టు ఉండేది.దాని మీద దెయ్యం ఉంటుందేమోనని భయం వేసేది.వెన్నెల వెలుగుకి చెట్టు నీడతో పుంత చీకటిగా ఉండేది. ఆడవారు ఇద్దరు ముగ్గురు కలసి చెంబులు పట్టుకుని మరుగుదొడ్డిగి పుంతంటే వెళ్ళేవారు. వెడుతూ వెడుతూ బయట నులకమంచం మీద కుర్చుని తలదువ్వించుకునే  మా అమ్మను పలకరించి పోతుండేవారు. రాత్రి పది దాటిందంటే ఊరంతా నిద్రలోకి జారుకునేది. రెండు నులక మంచాలు వేసి ఇంటి ముందు వాకిట్లోనే వెన్నెల చల్లదనంలో పడుకునే వాళ్ళం. దోమలు లేని కాలం అది. హాయిగా గురకపెట్టి పడుకునే కాలం. అమ్మ త్వరగానే నిద్రలోకి జారుకునేది .నేను మా అమ్మమ్మ గంగమ్మ మంచంలోకి పోయి పడుకునేవాడిని. ఎందుకంటే మా మామ్మ మంచం క్రింద వెచ్చటి కుంపటి ఉండేది .దాని వెచ్చదనం  బలే ఉండేది. తొందరగా నిద్రవచ్చేది. మా మామ్మ చుట్ట కాల్చేది. ఆ లంక పొగాకు వాసన బలే మత్థుగా ఉండేది.మా మామ్మ మా అమ్మ చూడకుండా చుట్ట కాల్చమని ఇచ్చేది . నేను గబ గబా పొగలాడేవాడిని .పొగ ఎలా వదలాలో తెలియక ఉక్కరి బిక్కిరి అయ్యోవాడిని. కళ్ళవెంట నీళ్ళు వచ్చేవి. మామ్మ కంగారు పడి చేవండి చెంబుతో నీరు తాగించేది. మెల్లగా ముసుగు వేసి పడుకునే లోగా ఎక్కడి నుండో అరుస్తూ అరుస్తూ  తీతుకు పిట్ట కీచుపెట్టుకుంటు ఇంటి మీద నుండి ఎగురుతూ అటూ ఇటూ తిరిగేది.దాని అరుపంటే ఆ రోజుల్లో అందరూ భయపడి చచ్చేవారు. అది ఇంటి మీదనుండి  ఎగిరితే

ఆ ఇంటిలో కాని ఆ పేటలోకాని ఎవరో ఒకరు చనిపోతారని నమ్మకం. మా అమ్మమ్మ దాని అరుపు విని తుళ్ళి పడిలేచి ఆ తీతుకు పిట్టను నానా భూతులు తిట్టేది. నానా శాపనార్దాలు పెట్టేది.మా అమ్మమ్మ తిడుతుంటే దుప్పట్లో భయపడి దాకునేవాడిని. భయంతో హడలిపోయేవాడిని. నా ఇల్లే దొరికిందంటే దొంగముండా నీకు, నా మనవడు లేకలేక వస్తే మా మంచం మీద ఎగురుతున్నావు నీకు పోయేకాలం వచ్చిందంటే అని తిడితూ నన్ను ఒడిలో పొదిమికొని దుప్పటి కప్పి పడుకొబెట్టేది మా అమ్మమ్మ. ఇఫ్పుడు తీతీకు పిట్టలేదు. దాని అరుపు విందామన్నా లేదు.ఎక్కడికి పోయాయో ఎంటో .ఆ జాతి పిట్టలు అది నల్లగా ఉంటుందంట.దాని తోక పొడపుగా ఉండి చివర కత్తెరలా ఉంటుందట. దానిని కత్తిరి పిట్టఅని కూడా అనేవారు ఆ రోజుల్లో.





No comments:

Post a Comment

 అది 1971  తారు రోడ్లు అంతగాలేని కాలం. అమీనాబాద మా అమ్మమ్మగారి ఊరు .అమ్మ తొండంగిలో టీచరుగా పనిచేసేది.వేసవి సెలవులకు నన్ను తీసుకుని ఉప్పాడ శి...