Thursday, January 15, 2026

 గారడీ నృత్యం


పెద్దదోళ్ళము కర్రలతో లయగా పెద్ద శబ్దంతో వాయిస్తుంటే కాళ్ళకు ఇనుప అండేలు నాలుగు, అయిదు వరుసలతో కట్టుకుని పాటకు అనుగుణంగా చేసే నృత్యకు గారడీ నృత్యం. ఈ నృత్యం చేయడు మాలకులస్థుం ప్రత్యేకతై యున్నది. ఈ గారడీలను ఉత్సవాలకూ ఉరేగింపులకూ పల్లెల్లో పెడుగుంచారు. గారడీ అంటే మోళీ ఆటకు సంభందంచివరి కాదు. ఇది ప్రత్యేకమైన నృత్య జానపదకళారూపం


'బేరీలు' అనిపి౦చే పర్వతాల వంటి డోళ్ళను మధ్యలో పెట్టుకుని, కాళ్ళకు గడ్డి పరకలు చుట్టుకుని ఆపై ఇనుప అందెలు తొడిగి 30 మంచి వరకు గళాకారులు విలయంగా విలబడి పాటలు, వెన్నెల సదాులు వగైరా జానపద గీతాలు పాడుతూ శబ్దాలకు అణుగుణంగా పైకి కిందకీ ఎగురుతుంటే ప్రదర్శన ఊరంతా ప్రతిధ్వనిస్తుంది. గ్రామదేవతల సంబరాలు, జాతరలలోను, ముఖ్యంగా గొంతెలమ్మ సంబరానికి చేసే ఈ నృత్యం చూసి తీరవలసిందే.


కళాకారులు ఎరుపురంగు చొక్కా నీలం పేంటు ధరించి, చేతిలోని కర్రకు రెండంచుల రంగురంగుల జెండా కట్టుకుంటారు. మొలకు గజ్జెలు కూడా కట్టుకుంటారు. రెండు 'తసా' వాయిద్యాలు కూడా మ్రోగుతూ ఉంటాయి. ఏలే ఏల ఏలేయాల పై లేస్సో ఓహో అని గాని, "శ్రీరామయ్య రామరామయ్య, సదండమానించి మయ్యగా కోడంద రామయ్య అంటూ పాడుతూ చిందేస్తూ ఈ గారడీ నృత్యం చేస్తూంటారు. వీరు సినిమా పాటలకు తగినట్లు నృత్యం చేయడం ఈ మధ్య వీరి కళా ప్రదర్శనలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రదర్శనకు పసలపూడి గ్రామస్థులు పెద్ద పేరు. వీరు గాలిండియా రేడియోలో కూడా ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన మధ్యలో రంగురంగు దమ్మీ వ్యస్త్రాలలో వేషాలు చేసుకుని కొందరు డాన్సు చేయడం బలే సరదాగా వుంటుంది.

No comments:

Post a Comment

 దొమ్మరాట గ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ఈల వేస్తూ హౌరియా, హౌరియా అంటూ వేగంగా మొగ్గలు వేస్తూ వినోదాన్ని వంచే వారు పలురకాలుగా చేసే ...