NTR గారి ఈ ఫేమస్ డైలాగ్ చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ప్రతీ స్టేజీ మీద ఈ డైలాగ్ వినిపించేది. మిమిక్రీ కళాకారుల నోటిలో దడదడలాడేది.
ఇది జననాల గురించే
ఎందుకనో అప్పుడు మనుభావాలు దెబ్బ తినలేదు.
నిజాలకు ఇప్పుడు భయమెందుకో? కల్పిత గాథల విదేశీ ఆర్యన్ మనువాదుల మనుభావాలు ఏమిటో?
NTR గారి డైలాగ్ మానవవాది కొండవీటి వెంకటకవి గారి విరచితం.
ఆచార్య దేవా!
ఏమంటివి ఏమంటివి
జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట??? ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము? ఇంత యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించాలేదా. ఈయనది యే కులము? నాతో చెప్పింతువేమయ్య మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతి నందు శక్తినీ ఆ శక్తి చండాలంగన యందు పరాశరునీ, ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసునీ ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అయిన అంబాలికతో మా పిన తండ్రి పాండుడరాజునూ, మా ఇంటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా? సంధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమెందులకు?
-- సురేందర్ ఉయ్యాల
No comments:
Post a Comment