Monday, January 12, 2026

 హరిదాసు


సంక్రాంతి తెలుగువారి పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలలోని అనుభూతిని పొందాలంటే పల్లెలో జరిగే సంక్రాంతి సంబరాలను చూడవలసిందే. సంక్రాంతి పండుగ రెండు నెలల ముందు నుండి జానపదుల పలకరింపులతో మొదలవుతుంది. సంక్రాంతి పండుగలో కనిపించే సాంప్రదాయాలు, సంబరాలు, వేడుకలు అన్ని ఇన్నీ కావు అందుకేనేమో దీనిని పెద్ద పండుగని కూడా అంటారు. నెలగంట పుట్టారంటే ఆడపడుచులు వేసే ముత్యాల ముగ్గులు, బంతిపూల దండలు, ముగ్గుల మధ్యన గొబ్బమ్మలలో వీధి వీధి సుందరంగా తయారవటం చూడముచ్చటగా ఉంటుంది. సులి వెచ్చని సూర్యకిరణాలు మనలను తాకకముందే తెల తెల వారు తుండగా వచ్చే బుడబుక్కల వాడి డక్కా నినాదాలు మేలుకొలుపుతాయి. గంగిరెద్దుల వారి వివ్యాసాలు, జంగం దేవర గంట శబ్దాలు, పగటి వేషగాళ్ళ మనోహర పద్యాలు జానపదులలోని మన తెలుగుదనాన్ని గుర్తు చేస్తూ మనజాతి ప్రాచీనతను మనకు కళ్ళకుకట్టిన్నట్లు చూపిస్తాయి. వీటన్నిటి కంటే ముందుగా మనం గుర్తు చేసుకుని హమయ్య సంక్రాంతి వచ్చేసిందిరోయ్ అనుకునే సందర్భం ఎదయా అంటే మన హరిదాసు చిడతల శబ్దాల మధ్య హరిలోరంగహరి పడుకుంటూ వేగంగా మన వీధిలోంచి నడిచిపోతున్నప్పుడే అంతటి ఘనమైన సంబంధం ఉంది సంక్రాంతికి మన హరిదాసుకు హరిదాసు మన తెలుగు వారి గొప్పదనాన్ని చాటే జానపదుడే.


సంక్రాంతికి శోభను తీసుకు వచ్చే హరిదాసును గూర్చి మన తెలుగు సాహిత్యంలో గుర్తుచేసుకోని కవివర్యులు లేరంటే అతిశయోక్తికాదు. తుమ్మల సీతారామమూర్తి పరిగపంటలోను, పల్లా దుర్గయ్య గంగిరెద్దు కార్యలలోను హరిదాసును గూర్చి సవివరంగా మనకి వర్ణించి చూపారు. హరిదాసు హరినామకీర్తనలు గానం చేస్తూ చక్కని ఆహార్యం కలిగి ఉంటాడు. హరిదాసు తన తలపై అక్షయ పాత్ర నుదుటిపై తీర్చిదిద్దిన తీరునామాలు, చేతిలో చిడతలు అందంగా నేలవరకూ జీరాడే పట్టులెల్లా పంచె, కాళ్ళకు గజ్జెలు, మెదలో పూలహారం, ఎరుపురంగు పల్లెవాటును కలిగి ఉంటాడు. హరిదాసు చేతిలో చెక్కలో చేసిన చిడతలను చక్కని లయగా వాయిస్తూ చక్కటి హరినామకీర్తనకు శృతిగా తంబూర వాయిస్తూ చక్కటి గాత్ర శబ్దాలతో పాడుతూ ఉంటాడు.


ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతూ వస్తున్న హరిదాసుకు పళ్ళెంలో బియ్యం ఫలమారాలు హరిదాసు అక్షయపాత్రలో వేయాలని ఆడపిల్లలు చక్కగా ముస్తాబై ఆ రోజుల్లో వీధులో బారులు తీరేవారని మన తెలుగు కావ్యాలలో స్పష్టంగా చెప్పబడింది కూడా. సంక్రాంతి లక్ష్మికి సాహిత్యం పాడే హరిదాసు రాక మంగళప్రదమని తెలుగు మహిళలు భావిస్తూ ఉంటారు. హరిదాసు ఇంటి దగ్గర ఆగి మోకాళ్ళపై కూర్చొని ఆడపడుచులు వేసే బియ్యాన్ని బిక్షగా స్వీకరించి పైకిలేస్తూ కృష్ణార్పణం, అంటూ మరలా మరో ఇంటికి కీర్తన పాడుకుంటూ పోతు ఉంటాడు. సంక్రాంతి పర్వదినాలలోనే మనకు కనిపించే హరిదాసులు సాధారణంగా వైష్ణవ మతానుమాయిలైన సాకములు, జియ్యరులు, దాసరులు ఈ హరిదాసులుగా కీర్తనలు పాడుతూ బిక్షాటన చేస్తూ ఉంటారు. మన తెలుగు వారి సంక్రాంతి పండగను నిండుగా చూపించే అపురూప జానపదుడు మన హరిదాసుడు.

No comments:

Post a Comment

 NTR గారి ఈ ఫేమస్ డైలాగ్ చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ప్రతీ స్టేజీ మీద ఈ డైలాగ్ వినిపించేది. మిమిక్రీ కళాకారుల నోటిలో దడదడలాడేది...