Thursday, January 15, 2026

 కోలాటం


శతాబ్దాల నుండి తెలుగు వారు పోషించుకుంటూ వస్తున్న జానపద కళారూపాలలో కోలాటం ఒకటి దేవాలయాలలో జరిగే ఉత్సవాల సంధర్భంగా కోలాటం ప్రత్యేకాకర్షణ, ఆధ్యాత్మిక కీర్తనలను, భజనలను ఆలపిస్తూ కోలలు వేయడం ఈ ప్రక్రియ ప్రధాన లక్షణం. కోలాటం ఇరువురు వ్యక్తుల మధ్య సాగే కళారూపం ఇరువురు వ్యక్తులు రెండు చేతులలో కర్రలు పట్టుకుని ఎదురెదురుగా నిలబడి పాటలు పాడుతూ తాళానికి అనుగుణంగా గతిభేదాన్ని పాటిస్తూ అభినయిస్తూ వుంటారు. ఈ కోలాటాన్ని గూర్చి విజయనగర రాజుల కాలంలోనూ, పాల్కురికి సోమనాథుని బసలపురాణం నందు కూడా చెప్పబడింది..


పసలపూడికి చెందిన కోలాటం కళాకారుడు, గురువు అల్లు సింహచలం దశాబ్దాలుగా కోలాటదళాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రదేశమంతా ప్రదర్శనలు ఇచ్చారు. వీరి కోలాటం నృత్యాన్ని సినిదర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాధ్ తన సిరిసిరి మువ్వ, సినిమాలో చిత్రీకరించారు కూడాను. ఉత్సవాలు జరిగే దేవీనవరాత్రులు, గణపతినవరాత్రులు, మరిడమ్మ జాతరలు వంటి సంధర్భాలలో ఈ కోలాట కళాకారుల ప్రదర్శన తిలకించి. తీరవలసిందే


30 మంది వరకు కళాకారులు రలయంగా నిలబడి చేతిలో రూళ్ళకర్రలు (గీతలు గీసుకునే కర్రలు) గుండ్రంగా సాపు చేయిబడి ఒక అడుగు 'పోదవ కర్రలను ప్రతీ ఒక్కరూ రెండేసి చొప్పున రెండు చేతుల్లో పట్టుకుని కర్రను తాగిస్తూ లయిబద్ధంగా అడుగులేస్తూ తెయ్యిక్కడ తాజనుతా అంటూ జానపదగీతం అందుకుంటారు.


ఓ చిన్నదానా విడువనె కొంగు" వంటి జానపద గీతాలు భక్తిగీతాలూ గురువు పాడుతుంటే కోలాటం వేసేవారు. ఆ పల్లవిని వంతగా పాడుతూ గెంతుతుంటే వినదానికి చూడటానికి వినోదంగా ఉంటుంది. ఈ కోలాటాలు పల్లెలలోని ఆయా పేటల యువరులు విరామకాలంలో ఒక గురువును పెట్టుకుని నేర్చుకుంటారు. నేర్చుకున్న కోలాటాన్ని సంబరాలలో సరదాగా వేస్తూంటారు. కోలాటం ఆడవారు, మగవారు కూడా ఆడతారు.


కోలాటం ఆడేవారు ఐనేను, నిర్వరు, తలకు రిబ్బన్లు, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. వీరి మధ్యలో వాయిధ్యలు బృందం హర్మనియం, డోలక్, తాళాలు, డప్పు వంటి సహకారంతో వీరి కీర్తనలకు సంగీతమందిస్తుంది. ప్రధాన గాయకుడు పాటపాడుతూ అడుగు మాడేలా తనచేతిలోని కోలాగకర్రలలో లయిమార్చగానే అందరూ అడుగులు మారుస్తూ నృత్యం చేస్తారు. వీరు భక్తిగీతాలు, రామకీర్తనలు, సప్తతరంగాలు, కృష్ణ తరంగాలు వంటివి అలపిస్తారు.


ఈ కోలాటంలో జానపదులకు ఉత్తేజాన్ని, ఉత్సాహన్ని వర్ణచలనం, వేషసామరస్యం, గమన సామరస్యం, మువ్వల మోత, కోలల లయి, రాగ సరళి కంఠకుళ, కళాసౌందర్యలు వుక్కుడిగా ఏకమయి మనలను ఆలపిస్తారు. కోలాటంలో జడల కోలాటం అనే ప్రక్రియ చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అందరూ చేతిలో తాడుల వంటివి పట్టుకుని కోలాటం చేస్తూ జడలా అల్లుతారు. మరలా అలానే పాడుతూ అడుగును మార్చుకుని ఆ జడను విప్పేస్తారు. "వీరు కీర్తనలలో శరణు శ్రీ గణనాథ దేవా శరణు శరణు శంకరతనయా, పాలనచేసే పార్వతి తనయ, బొజ్జనిందా ఉండ్రాళ్ళు పోసేద, బుజ్జగింపుము మరి మరి బ్రోసి" అంటూ గణపతి గీతంతో ప్రారంభించి కరిళింగు మడుగులోపల వాడలో కృష్ణుడు వాడదుగో, అల్లడుగో కృష్ణుడు, నల్ల నల్లనివాడు నామంబు కలవాడు" అంటూ సాగే కోలాటం మన జానపదకళలకు సుసంపన్నం చేసిందనడంలో సందేహంలేదు. ఇటువంటి కళారూపాలను యువకులు అభ్యసిస్తే ప్రత్యేకమైన వ్యాయామాలు అభ్యసించకుండానే చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు.

No comments:

Post a Comment

 దొమ్మరాట గ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ఈల వేస్తూ హౌరియా, హౌరియా అంటూ వేగంగా మొగ్గలు వేస్తూ వినోదాన్ని వంచే వారు పలురకాలుగా చేసే ...