బైటో భజన
దేశంలో లేని ఎల్ల పట్టణం లేనేలేదు ఆలయం ఉన్నచోట భజన కార్యక్రమాలు జరుగుతుంటాయన్లు సంగతి ప్రత్యేకిం చప్పదన్నరలేదు. పంద్ర సాంప్రదాయానికి ఆంధ్రదేశం పెట్టింది పేరు ఆలయాలలో రామాలయంటిని వోటేలేదు. కులానికో, రామాలయం. రామాలయం కూడా ఉంటాయి. రాత్రివేళల్లోనూ, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి, శివరాత్రి వంటి పుణ్యదినాలలో ఈ భక్తులు ఆలయ నుండిపాలలో మార్చుని, దేవుని ఫోటో ఎదురుగా పెట్టుకుని ఉత్తడి తాళాలతో భగవంతునిపై గూర్చిన పాటలు పద్యాలు పాడుతూ భజనలు చేస్తూంటారు:
ఆలయంలో పదిమందీ కూర్చుని భజన చేస్తూ భగవన్నామ సంకీర్తనలకే ఈ భజన సంప్రదాయం పరిమితం కాలేదు. వగలంతా కాయకష్టం చేసి రాత్రిపూట మానసిక, శారీరక విశాంత్రి కోసం భజన కార్యక్రమంలో పాల్గోనడం ఒకవంతు దీనిద్వారా మనస్సు నిర్మలమువుతుంది. కొద్దో గోప్పో పుణ్యభావన కలుగుతుంది. భజనలలో వివిధరకాలు ఉన్నప్పటికీ వైటో భజన సర్వసాధారణంగా అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది.
రైటో భజన'లో హర్మోనియం, మద్దెల శృతివాయిధ్యం, కంజీర, ఇత్తడి తాళాలు 6 జతలు వుంటాయి. మండపంలో భజనబ్పందం వలయంగా కూర్చుని మైకుముందు ప్రధాన గాయకుడు కీర్తన అలపిస్తుంటే ఆ వెనుక అందరూ అదే చరణాన్ని పాడుతూవుంటారు. సాధారణంగా ప్రధాన నాయుకుడు మంచి కందమాధుర్యం కలిగి వుంటాడు. అందరూ కూర్చుని చేస్తారు. కాబట్టి దీనిని బైటో భజన అన్నారు.
ఈ భజనల్లో పాడేవారితో పాటు చూడడానికి వచ్చిన వారు కూడా వాదితో కలిసి భక్తి భావంతో ఉత్తిచోతులనే తాళాలుగా అనుకుంటూ. పాడుతూ కనిపిస్తారు. ఈ భజనల్లో పాల్గోనేవారు సంగీత పాండిత్యం కలవారై ఉంటారు. ఈ భజనలోని కీర్తనలునే కాకుండా కాళహస్తీశ్వర శతకం, దాశరధీ శతకం, ఇతర శతకాలలోని పద్యాలను కూడా రాగయుక్తంగా పాడుతుంటారు. ఆడవారు, మగవారు కూడా కలిసి ఈ భజనలో పాల్గొంటారు.
ఈ భజనలు ఏలాహలు, గుప్తాహలుగా కూడా సాగుతాయి. ఏడాహలు అంటే ఉదాహరణకు 'రామరామసీత' అనే కావ్యంలోనే రోజంతా భజన చేస్తారు. 7 రోజులు పాటూ ఒక వాక్యంతో చేస్తే దానిని సప్తాహం అంటారన్న మాట. ఈ భజనల్లో రామదాసు కీర్తనలు. తాగ్యరాజుకీర్తనలు కూడా చోటు చేసుకుంటాయి. దానివలనే త్యాగరాజు, అన్నమయి, రామదాసు కీర్తనలు వాడవాడలా వ్యాపించాయి. గణపతి ప్రార్థనలో ప్రారంభమయ్యే భజనను విని ఊరిలోని ముత్తయివులందరూ అరటిపండ్లు, కొబ్బరికాయలు, శెనగపప్పు, బెల్లం పళ్ళాలలో పుచ్చుకుని భజనదగ్గర దేవుని ముందు పెడతారు. భజన పూర్తవగానే ఆ పండ్లను, సెనగపప్పు, బెల్లం లను కలిపి ప్రసాదంగా పెడతారు.
ఈ భజనల్లో సులవైన పాట 'రామరామరామసీత' అనేది ఒకటి. సీతారామ్ సీతారామ్ జయసీతారామ్ పట్టాభిరామ్ పట్టాభిరామ్ జయసీతారామ్ అని రాముని గూర్చి తెలిపిన విశేషకాలంలో చేంతాడులా సాగదీసుకుంటూ ఏకతాళంతో పాడుతూ భజన చేస్తారు. ఈ భజనలను కొందరు. యిండ్లలోనూ కూడా ఏర్పాటు చేస్తారు. "మేటి మైచను భక్త కూపములందు పాటలుగా గట్టి పాడిదివారు" అని పాల్కూరికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర నందు వ్రాయడం చూస్తే ఈ భజన కళ ఈనాటిది కాదని తెలుస్తున్నది. గొల్లలమామిడాడ రామచంద్రపురం, సామర్లకోట. పిఠాపురం, మండపేట, కొంకుదురు, కొవ్వూరు, ఏలేశ్వరంలో ఉన్న భజన మేళాలు బహు పేరుపొందినవి.
No comments:
Post a Comment