Thursday, January 15, 2026

 బుడబుక్కల వారు


శివుని చేతిలో కనిపించే భీమరుకమే బుడబుడక అంటేను. కోడికూత జామునే బుడబుడక చేతిలో పట్టుకుని ఊపుతూ పల్లెప్రజలను మేలుకొల్పే ప్రాచీన జానపద గాయకుడు బుడబుక్కల వాడు భక్తిని ప్రతిపాదిస్తూ పురాణ సంభంధమైన అనేక అంశాలను చెబుతూ ప్రజలకు సీతిభోధ చేయడం ఈ బుడబక్తుల వేషగాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ వేషంలోని పాత్రపేరు 'రామజోగి'. సంక్రాంతి వస్తుందంటే నెది ముందు నుంచే ప్రతీ బటివీ పటుకరిస్తూ బంటాడు. రామజోగీలు, సాయిలవారు, బుడబుక్కల వాళ్ళు అని పిలువబడే వీరు క్రీడాకుళం. తూర్పుగోదావరి.. గుంటూరు, ప్రకాశం, సల్లగొండ జిల్లాలలో అధికంగా కనిపిస్తూ ఉంటారు.


'అంబ పలుకు జగదాంబ వెలుకు, ఉంచిలోని రామాక్ష్మి పలుకు అని పాడుతూ వచ్చే బుడబుక్కల వాడు చరిత్ర కందినంత ప్రాచీనకాలం. వాడే వీరి కధనం ప్రకారం మహరాష్ట్ర నుంచి వారి పూర్వీకుల ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడదినట్టుగా చెబుతారు. వీరి వాయిత్యం బుదేక("మేరకం), ఉడుక్క, పొందుక, డుక్క దుబ్డక్కా మొదలైన పేర్లతో పిలుస్తారు కూడాను. తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు మొదలు ఆధునిక కవి జాషువా బాకా ఎందరికార్యాలలోనే బుడబుక్కలవారి ప్రస్తావన వుంది.


బుడబుక్కల వేషధారణ ఆసక్తిని కలిగిస్తుంది. వీరి వేషధారణను గురించి వివరంగా అయ్యలరాజు రామభుద్రుని హంసవింశతి' కావ్యంతో ఉంది. నేటి బుడబుక్కల వాడు బిగుతుగా ధోవతని కట్టుకుంటాడు. తెల్లని చొక్కాపై రంగుల కోటు వేసుకుంటాడు. తలకు రుమాలు చుట్టుకుని, ప్రాతిగుడుగు లేదా కర్ర భుజానవేసుకుని దానికి జోలెలు తగిలిస్తాడు. నుదుటి పై నల్లని బోట్లు పెట్టుకుంటాడు. చెవులకు రంగు రంగుల చెవిదిద్దులు పెడతాడు. ఎడమ భుజాలపై జరికతోలును, భుజాలనుండి క్రిందివరకు వెనుకవైపు పులి చర్మాన్ని కూడా కట్టుకుంటాడు. సదుముకు ఒక గంట కట్టుకుంటాడు. ఈ వేషధారణతో వీధులలో తిరిగే బుడబుక్కలవాడు ఓ ప్రత్యేక ఆకర్షణ కలిగి వుంటాడు. తాను వాయించే వాద్యం నుండి మంద్ర మధ్యను, తారస్వరాలు పలికిస్తాడు.


మహరాజరాజ మార్తాండతేజ


చవికల్ప భుజరాజ సూత్రమా


శుభోజ్ఞయం కల్లవలె


మీ పని జయం వుండాలి.


మా పని నయం వుండాలి అంటూ ఎక్కడా ఆగకుండా మహభారతం నందుగల వీరులందరినీ వరుస కలుపుతూ చెబుతుంటే అతని ధారణ తల్లికి ముగ్ధులు కావలసిందే.


భూమి కంటే ముందుపుట్టినది ఉదకం, ఉదకంలో సంచరించినది మత్యం, మత్యకతు కల్గినవాడు మన్మథుడు, మన్మధుని అన్న బ్రహ్మ, బ్రహ్మ భార్య సరస్వతి, సరస్వతి పతి కవులు, శుక్రులు, శుక్రులు వారిచేత సకల పురాణములు గైకొనినివాడు పరీక్షితు మహరాజుల పురాణాలకు చెందిన వారి సంబంధాలను వివరిస్తూ పోతుంటే పండితులు కూడా ఆశ్చర్యానంధాలలోను కాక మానరు.


బుడబుక్కలవారి రాకను గ్రామాలకు శుభసూచికంగాను, లాభదాయకంగాను పల్లె ప్రాంతంవారు భావిస్తూ ఉంటారు. బుడబుక్కల వాయిద్యం సంద్రరేగి కర్రతో చేసి దానికి మేక, లేక జింక లేదా బావురు కప్ప చర్మాన్ని రెండువైపులా చిక్కని తాడుతో కుట్టి అంచులు, తంగడి, కర్రతో దుడతారు. ఈ వాయిద్యానికి చెరోవైపునా చిన్నతాదులకు తారువుందరులు బుడబుదమంటూ వచ్చే విచిత్ర శబ్దం మన ప్రాచీన చరిత్రను తనదైన రూపంలో పలుకుతూ ఇంకా కొనసాగించడం ఆనందించవలసిన విషయం.

No comments:

Post a Comment

 దొమ్మరాట గ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ఈల వేస్తూ హౌరియా, హౌరియా అంటూ వేగంగా మొగ్గలు వేస్తూ వినోదాన్ని వంచే వారు పలురకాలుగా చేసే ...