బుట్టబొమ్మలు
తెలుగు నాట గ్రామదేవతల జాతరలలోను, సంబరాలలోను, తీర్థాలకు కూడా ఈ బుట్టబొమ్మలు కనిపిస్తుంటాయి. బుట్టబొమ్మలు కూడా జానపదాకళారూపానికి చెందినవే. దూరం నుండి ఈ బొమ్మలను చూడగానే చటక్కున ఆకర్షితులవకమానరు గబగబా అంగలు వేసుకుంటూ ఈ ప్రదర్శన జరిగే చోటికి చేరనివారు వుండరు. అంత అకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ బుట్టబొమ్మలు: బుట్టబొమ్మలు ఉత్సవాలకే పడుతుంటారు సాధారణంగా ఈ బుట్టబొమ్మలు ప్రదర్శనలో పాములవాడు, పాములవాడి భార్య రాధ, కృష్ణుడు మొదలైనవి ఉంటాయి. ఇందులోనే గుర్రాలాట, గొర్రగేదెలు వంటి బుట్టబొమ్మలు కూడా మనకు కనువిందు చేస్తాయి.
బుట్టబొమ్మలు తయారీకి వెదురుగడలు, చింతగింజల గుజ్జు, రకరకాల రంగులు ఉపయోగిస్తారు. వెదురుగడలను బద్దలుగా చీరి చక్కుని నైపున్యంతో బద్దతన్నిటిని ఒకదానికి ఒకటి చేర్చి బొమ్మలను తయారు చేస్తారు. దానికి చింతగింజల గుజ్జును పూయడంతో రూపాన్ని తీర్చుదిద్దుతారు. దీనికి చక్కని రంగులు పూసి ఆకర్షిణీయంగా తీర్చుదిద్దుతారు. ఈ బొమ్మలను ఎత్తుకుని ఆడే కళాకారుడు తన బొడ్డు కింది వరకూ బొమ్మ విచ్చేట్టు బొమ్మను తయారు చేసుకుంటాడు. ఈ బొమ్మలు పెద్దపెద్దగా ఉంటాయి. కళాకారుడు ఒక పరికిణీని కాళ్ళ వివర వంట కుపెట్టుంచుకుంటాడు, పరికిణీ ధరించిన తరువాత బుట్టబొమ్మను ఎత్తుకుని తలకిందనుండి తగిలించుకుని బొడ్డు దగ్గర రంధ్రాలనుండి 'చూస్తూ బొమ్మను దరువులకు అణుగుణంగా ఆడిస్తుంటాడు. ఈ బొమ్మలు ఎత్తుకున్న కళాకారుడు నృత్యంచేయడానికి వీలుగా రామడోలు వేళందారు వాయిద్య సహకారం అందిస్తారు. ఇందులో భాగంగానే గుర్రాల బొమ్మలు కూడా వుంటాయి. గుర్రాల ముఖాలు వెదురు తడికలతో తయారుచేసి ఆ గుర్రాల బొమ్మలు తగిలించుకున్న వ్యక్తి తన పాదాలకు రెండు మూడు అడుగుల పొడవుగల కర్రలను కట్టుకుని గుర్ర మెద వద్దగల కన్నం నుండి పైకి వచ్చి గుర్రం నడుస్నున్నట్లు కట్టుకున్న కర్రలతో వాయిద్యాలకునుగుణంగా నడుస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. పిల్లలను బాగా ఆకర్షించి ఆనందింపచేసే కళారూపం బుట్టబొమ్మలు.
No comments:
Post a Comment