Thursday, March 19, 2026

 1874  ప్రాంతంలో మిషనరీలు వచ్చే వరకు విద్య సామాన్య జనానికి చేరువకాలేదని తెలిసిందే .అనేక అసమానతలు మబ్బుపట్టినట్లు కమ్ముకున్న సమయం. వీధి బడులు నిర్వహిస్తున్న చదువు ఎందుకు అవసరమేంటి అనే ఆలోచన బలంగా ఉన్న రోజుల్లో చదువుకి ప్రాధాన్యత లేని కాలంలో మిషనరీలు ఉవ్వెత్తున భారతావనిపై దండెత్తినట్టు నలుదిశలా తెలుగు నేలపై అడగిడడం ఓ నూతన శకారంభంగానే భావించాలి.మిషనరీలైన జాన్ మెక్లారిన్ మరియు స్మిత్ లు తూర్పుగోదావరిలో సామర్లకోట,పెద్దాపురం,పిఠాపురం,కాకినాడ,రామచంద్రాపురంలలో పాఠశాలలు  చర్చిలు స్దాపించారు.1925 లో కొత్తపల్లి మండలంలో అమినాబాదలో పాఠశాల ను హానోకు మాస్టారుచే ప్రారంబించారు.

మెకంజీ సేకరించిన కఫియత్తుల్లో తొండంగి మండలం మనకు స్పష్టంగ కనబడుతుంది.11 వ శతాబ్దం నుండి అక్కడ గ్రామాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది.శైవ వైష్ఞవ గొడవల్లో తమిళనాడు నుండి బ్రాహ్మణులు రావడం వారికి పెరూమాళ్ళపురంలో ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తుంది.సర్పవరం లో గల ఆలయంలో అర్చకత్వం వహించడానికి వారికి అనుమతి వచ్చినట్లు తెలుస్తుంది.ఇక పిఠాపురం సంస్దానం ఆధీనంలో ఉన్న రోజుల్లో అద్దరిపేట మొదలు మూలపేట వరకు గల ప్రాంతాన్ని కోనఫారెస్టుగ నమోదైయినట్లు కైఫియత్తుల్లో కగొనవచ్చు. కోనఫారెస్టును ఏనుగుల పుంత అని కూడా పిలిచేవారు.పిఠాపురం సంస్దానం వారి సైనిక పఠాలం ఇక్కడే ఉండేది



 


No comments:

Post a Comment

బైబిల్ ప్రకారం ఆడమ్ నుండి మహాజలప్రళయం వరకు 1656 సంవత్సరాలు  జలప్రళయం నుండి అబ్రహాం పుట్టుకవరకూ 292 ఏళ్ళు  అబ్రహాం నుండి జాకబ్ ( యాకోబు) మిగత...