Monday, February 1, 2021

పెదమేస్టారు

 అది 1874  మార్చి 12 కెనడియన్ బాప్టిష్ట్ మిషన్ (సి బి యమ్ ) మిషన్ కార్యక్రమాలు కాకినాడలో ప్రారంబించాలని జాన్ మెక్లారన్   సి బి యమ్ చర్చిని కాకినాడలో ప్రారంబించాడు. మెక్లారన్ పర్యవేక్షణలో మిషనరీలు చర్చిలే కాకుండా దానికి అనుబందంగా పాఠశాలలు, ఆసుపత్రులు  శర వేగంగా తూర్పుగోదావరి జిల్లా అంతటా వివిధ ప్రాంతాలలో స్దాపించారు.పిఠాపురం,కాకినాడ మెక్లారన్ హైస్కుల్ , సామర్లకోట, రామచంద్రపురం పేరు పడ్డాయి. పిఠాపురంలో మిషనరీలు పరిచర్య ప్రారంబించిన తొలినాళ్ళలోనే 1876 ఆగస్టు 23 తారీఖున   అగ్రహారం  బండిరేవులో నాగులాపల్లికి చెందిన తాతపూడి సుబ్బయ్య పిఠాపురానికి చెందిన మేరి నరస్సయ్య  జాన్ మెక్లారన్ దొర గారి చేతుల మీదుగా బాప్తీస్మము పొందారు.తాతపూడి సుబ్బయ్య భార్యది చేబ్రోలు  దొండపాటి వారి అల్లుడు. ఇతనికి ముగ్గురు కొడుకులు. 

అందరిలో పెద్దవాడు హానోకు . తమ్ముడు గుర్రయ్య ,మరో తమ్ముడు ( పేరు తెలియాలి). హానోకు భార్య శీలి మరియమ్మ . పండూరు స్వగ్రామం.మరియమ్మ సోదరుడు శీలి సామ్యేలు.  అంటురోగాలైన కలరా ,మసూచి  జనాలను పట్టి పీడిస్తున్న రోజులవి. మిషనరీలు ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి వైద్యసేవలు అందిస్తున్న గొప్పరోజులు. డేరాలలో వెైద్యసేవలుతో పాటు చర్చి నడిపేవారు. పిఠాపురంలో 1901 లో ఈటన్ దొర ఫీల్డ్ మిషనరీగా నియమించబడ్డాడు. స్మిత్ దొర 

ఆసుపత్రి సూపర్ డెంట్ గా నియమించబడ్డాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో పిఠాపురం పరిసర పరిసరప్రాంతాలలో విద్య ఆరోగ్యం, తో పాటు క్రైస్తవమత వ్యాప్తి ఊపందుకుంది. 1903 లో పిఠాపురం సి బి యమ్ ఆసు పత్రి  ఆ తరువాత కాలంలో ఇదే క్రీస్టియన్ మెడికల్ సెంటరు సి యమ్ సి ఆసుపత్రిగా పిలవబడుతుంది.1905 లో పిఠాపురంలోనే సి బి యమ్ చర్చిని నియమించారు. దీనికి మొదటి పాస్టరుగా 

రాచపల్లి అప్పలస్వామి నియమించబడ్డాడు.నాగులాపల్లిలో  సి బి యమ్ చర్చి నెలకొల్పాడు ఈటన్ దొర.

తాతపూడి హానోకు సామర్లకోట సి బియమ్ స్కూల్లో 8 వతరగతి వరకూ చదివి కాకినాడ సి బి యమ్ బోర్డింగ్ హాయ్యర్ గ్రేడు చదివి ఉపాధ్యాయవృత్తికి అర్హత సాధించాడు. పండూరు నుండి శీలి మరియమ్మ కూడా  8 వతరగతి పూర్తిచేసి

ఇదే చోట బోర్డింగ్ హర్యర్ గ్రేడ్ లో చేరింది. ఆ రోజుల్లో హయ్యర్ గ్రేడు ట్రైనింగ్ పొందాలంటే ఒక సంవత్సరం సెమినార్ లలో పనిచేయాలి. అలా పనాచేసేటప్పుడే హానోకు మరియ్యమ్మల మనస్సులు కలిసాయి. పెద్దల అంగీకారంతో పెళ్ళి కూడా జరిగిపోయింది. ఇద్దరి జంటనూ ఆశీర్వదించిన ఈటన్ దొర నాగులాపల్లి నుండి ఇద్దరినీ ఉప్పాడలో  పరిచర్య చేయమని చెపుతూ   పాఠశాల స్దాపించి 

తొలి ఉపాధ్యాయులుగా నియమించాడు. 

మొదటగా అమీనాబాదలో వీరు పాఠశాల స్దాపించారు. వీరిని పెదమేష్టారు. పెద పంతులమ్మగారని పిలుస్తూ ఊరంతా మురిసిపోయేది.

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...