Monday, February 21, 2022

ఆత్మ

 ఎదైనా సరే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ సంఘటన జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ తన కేసునే తానే సాల్వ్ చేసుకున్నది. అమెరికాలో వెస్ట్ వర్జీనియాకు చెందిన గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఎల్వా జోనా హీస్టెర్ షుయ్ అనే కొత్తగా పెళ్లైన యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రెగ్నెన్సీ సమస్యలతో మృతి చెందినట్లు ప్రకటించారు. చనిపోయిన యువతిని కుటుంబసభ్యుల ముందే ఖననం చేశారు. 1896లో అంటే ఆమె చనిపోవడానికి ముందు ఎల్వాజో లోహాలతో తయారు చేసే ఎరాస్మస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ వివాహం జరిగిన మూడు నెలలకు ఆమె చనిపోయింది.

Read: Air India: ఎయిర్ ఇండియా కు మాలేలో ఘన స్వాగతం.ఎందుకంటే.

భర్త ఇంట్లోనే ఆమె చనిపోయింది. అయితే, ప్రెగ్నెన్సీ సమస్యల కారణంగా మరణించిందని అంతా అనుకున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తాను నిద్రపోతున్న సమయంలో తన కూతురు బెడ్ వద్దకు వచ్చిందని, హఠాత్తుగా లేచి చూస్తే ఆత్మరూపంలో తన కూతురు కనిపించిందని ఆమె తల్లి పేర్కొన్నది. తాను ప్రెగ్నెన్సీ వలన చనిపోలేదని, తన భర్త తనను హత్యచేశాడని చెప్పినట్లు తల్లి మేరీ తెలిపింది. షాకైన మేరి వెంటనే స్థానికి ప్రాసిక్యూటర్ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేసింది. కేసును రీ ఓపెన్ చేయించింది.

Read: Saif AliKhan : తన నలుగురు పిల్లలతో 'ఆదిపురుష్' విలన్

స్థానిక ప్రజల అభిప్రాయం, పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ అభిప్రాయం తీసుకున్న ప్రాసిక్యూటర్ జాన్ కేసులు రీఓపెన్ చేశారు. 1897 జనవరి 23న ఎల్వా చనిపోగా, 1897 ఫిబ్రవరి 22న ఎల్వా డెడ్‌బాడీని తిరిగి తీసి పోస్ట్‌మార్టమ్ చేశారు. దాదాపు 3 గంటలపాటు ఈ పోస్ట్‌మార్టమ్ జరిగింది. మార్చి 9, 1897లో రిపోర్ట్ బయటకు వచ్చింది. మెడ విరిచేసి, గొంతుపై తోక్కేశాడని, దీంతో ఆమె ఆహారనాళం పగిలిపోయినట్లు నిర్ధారించారు. ఫలితంగా ఎల్వా మరణించిందని నిర్ధారించారు. ఎల్వాను హత్యచేశారని నిర్దారించుకున్న పోలీసులు ఆమె భర్త ఎరాస్మస్‌ను అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో ఎరాస్మస్ విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. ఎల్వా కంటే ముందు మరో ఇద్దరిని వివాహం చేసుకున్నాడని, మొదటి భార్య విడాకులు తీసుకోగా, రెండో భార్య ఏడాదిలోపే మరణించిందని పేర్కొన్నారు. అయితే, ఎరాస్మస్ ఎలాగైనా ఏడుగురిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టు విచారణలో తేలింది. విచారణ అనంతరం జులై 11, 1897లో కోర్టు తీర్పు వచ్చింది. ఎరాస్మస్‌కు జీవితఖైదు విధించారు. అయితే, మార్చి 13, 1900 సంవత్సరంలో ఎరాస్మస్ అంతుచిక్కని వ్యాధితో చనిపోయాడు. ఎల్వా ఆత్మ ద్వారానే ఈ కేసు పరిష్కారం అయిందని చెప్పి ఆమె సమాధిపై అధికారులు శిలాఫలకం ఏర్పాటు చేశారు.

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...