Sunday, December 4, 2022

నిశిరాత్రి

 


కథనం

మిట్టమధ్యహ్నం ఇంటిముందు సైకిలు దిగిన దేవయ్యకి రోజూలాగే పోరు పెడుతున్న కొడుకు కనబడతాడు.పిల్లాడిని ఎత్తుకుని అటూ ఆటూ తిరుగుతున్న భార్యచేతిలోనుండి పిల్లాడిని తీసుకుని ఊరుకోబెట్టాలని ప్రయత్నిస్తాడు.మరలా పిల్లాడిని చేతిలోకి తీసుకుంటుంది భార్య. తలబాదుకుంటూ పాలు పడని పెళ్ళాన్ని కట్టుకున్నాను అంతా మా అమ్మ చేసింది అని అరుస్తాడు. భార్య ఇదిగో నిన్ను కట్టుకుని కరెంటులేని మందులు షాపులేని ఊరుకు వచ్చి నేను నా కొడుకు అన్యాయమయిపోయామని అరుస్తుంది. పొరిగింటి బాలింత దగ్గరకు పోయి పాలిమ్మంటుంది భార్య. అయినా పిల్లాడు ఏడుపు ఆపడు. వీళ్ళ గొడవ విని పొరింటి ముసలది పోలేరమ్మ చెంబులో నీళ్ళుతో దిష్టి తీస్తుంది. పొరిగింటి యాకోబు  కొడవలి కాల్చి దిష్టితీసి చెంబులో ముంచి చూపిస్తాడు. కొడవలి చల్లగా ఉంటుంది. గాలి పట్టుకుంది అని చెప్పి ఊరవలత చెంబులో నీరు పోసి వత్తానని పోతాడు.

అయినా ఏడుపు ఆపడు పిల్లాడు.

దేవయ్య తన మందుల పెట్టె వెతుకుతాడు. మందులు అరుకుసీసా ఖాళీగా కనబడతాయి.

దూరాన అన్నవరం పోయి మందులు తెస్తానని బయలు దేరతాడు. 

ముసలి పోలేరమ్మ వద్దంటుంది.భార్య చీకటి పడితే ఇసకపర్రంట రావటం కష్టమంటుంది .అయినా బిడ్డ ఏడుపు చూడలేని దేవయ్య సైకిలు పై బయలు దేరతాడు.కాకులు గేదెలు కుక్కలు ఉన్నపళంగా అరుస్తాయి.ఊరు బయట యాకోబు పరిగెత్తుకుని వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తాడు. సైకిలు ఆపకుండా పోతాడు దేవయ్య.

సుమారు 20 కిలోమీటర్లు దూరంలోని అన్నవరం చేరుకుని మందులు తీసుకుంటాడు. మందులు షాపు అతను చీకటి పడింది వెళ్ళవద్దంటాడు.

అయినా బయలు దేరతాడు.చీకటి పడినా బయలు దేరిన దేవయ్యకి దారి సరిగా కనబడదు. దారి తప్పి పుంత దారిలోకి పోతాడు. దూరంగా మంట కనబడుతుంది. ఆ మంట వచ్చే వైపు వెడతాడు. మంట మాయమై మరో దిక్కున కనబడుతుంది.మరలా ఆ వైపుకి వెడతాడు. మంట చేరుకునేలోపు మరలా మంట మరో దిక్కున కనబడుతుంది.ఇలా తిరుగుతున్న దేవయ్య వెనకాల ఓ నల్లటి దుప్పటి కప్పుకున్న వ్యక్తి కనబడతాడు. దేవయ్య హడలిపోతాడు. ఆ వ్యక్తి బయపడవద్దని నిన్ను కొరివి దెయ్యం తిప్పుతుందని. రాత్రికి మా ఇంటి దగ్గర పడుకుని పొద్దన్న వెడుదువుగానని వెంటరమ్మంటాడు. దేవయ్య చేసేది లేక సరే అని అతని వెంట వెడతాడు. అతను నడిపించి నడిపించి ఓ తెల్లటి ఇంటి ముందు ఆగి లోపలికి రమ్మని గెంజి ఇచ్చి పడుకోమంటాడు. దేవయ్యకు నిద్రవచ్చేస్తుంది .కొన్ని నిమిషాలకే నిద్రలోకి పోతాడు.

పిల్లల అరుపులు విన్న దేవయ్య కళ్ళు తెరుస్తాడు. సుర్రుమంటు ఎండ కళ్ళల్లో పడుతుంది. కళ్ళు నులుముకిని లేచి చూసుకున్న దేవయ్యకు తను ఉన్న చోటు చూసి మతిపోతుంది. అది తెల్లటి సమాది. గేదెలు కాసే పిల్లలు కొరివి దెయ్యం నిన్ను ఏడిపించిందని చాలా మంది ఆలాగే మోసపోయారని చెపుతారు. మందులు పేకెట్టు వెతుకుని గబగబా సైకిలు మీద ఇంటికి బయలు దేరతాడు దేవయ్య.

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...