Monday, August 26, 2024

 *నేను చరిత్రకారుడిని*

*నేను మాదిగ చరిత్రకారుడిని*

నన్ను చరిత్రకారుడిని చేసిన మందకృష్ణకు వందనం పాదాభివందనం

అరకోటి మాదిగలలో నేను చరిత్రకారుడిని బక్కపలచని వ్యక్తి కంచు కంఠంతో రిజర్వేషను దోపిడీని ప్రశ్నిస్తూ ఎ బి సిడి అంటుంటే మాదిగ వెలుగులు ఊహించిన చరిత్రకారుడిని నేను

డమ డమ డప్పుల శబ్దం దేశం నలుమూలలా మ్రోగిస్తున్నప్పుడే గొంతు సవరించుకున్న చరిత్రకారుడిని నేను 

నేను మాదిగ చరిత్రకారుడిని నేను

మాదిగ పదం మలినం అంటున్న రోజుల్లో మాదిగ పల్లెల్లో ఎండుకక్కలవాసన,మూలగుల జుర్రుడు చప్పుడు వినటానికి ఎదురెళ్ళిన చరిత్రకారుడిని నేను  నేను మాదిగ చరిత్రకారుడిని నేను

చిమ్మ చీకటిలో చుట్ట కాలుస్తూ దిగులుగా పడుకున్న సమాజానికి మహానీయుడు కబురును చెప్పి లేపి నడిపించిన చరిత్రకారుడిని నేను

నేను మాదిగ చరిత్రకారుడిని నేను

తొలితరం నాయకుల గొంతులకు చప్పట్లుకొట్టి పాటలు కట్టి డప్పు చరిచి చిందులు వేయించిన చరిత్రకారుడిని నేను నేను మాదిగ చరిత్రకారుడిని

పొరాటం పోతూ ఉంటే సిగ్గుపడి ఇంటిలో దూరిన వాడిని కాను,రూపాయి దాచుకున్న మనిషినీ కాదు నేను మాదిగ చరిత్రకారుడిని నేను

నన్ను చరిత్రకారుడిని చేసిన మందకృష్ణ అన్నకు వందనం పాదాభివందనం

సుప్రీంకోర్టు తీర్పులో నా శ్రమకావ్యం ఉందన్న  ఊహ పులకించిపోతుంది నేను నా రూపాయిని దాచుకోలేదు అందుకునేను చరిత్రకారుడిని నేను

నేను మాదిగ చరిత్రకారుడిని

నెలల పిల్లాడిని బాలింత భార్యను వదిలి

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్దిల్లాలి

అంటూ  ఉరుకురికి పోయిన చరిత్రకారుడి నేను 

నేను మాదిగ చరిత్రకారుడిని

కారు చీకటి ఇరవై యేళ్ళు కమ్మేస్తే ఎదిగన నా కొడుకునీ  నాతో పోరాటానికి తీసుకుపోయిన చరిత్రకారుడిని నేను

 *నేను మాదిగ చరిత్రకారుడిని నేను*







 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...