Tuesday, October 15, 2024


భార్య, భర్తల మధ్య వాగ్వాదాలు మామూలే. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో భార్య మాత్రం ఓ నాలుగు విషయాల్లో భర్తని దూషించినట్లు మాట్లాడకూడదు
మీ మాటలు ఎప్పుడూ మీ భర్త ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మీ సంబంధాన్ని ప్రశ్నించేలా ఉండకూడదు.

నీ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు

వివాహిత మహిళల్లో ఇప్పటికీ చాలా మంది అత్తమామల పట్ల సానుకూలంగా వ్యవహరించరు. వారితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే మీరు మీ భర్తతో గొడవపడే సమయంలో మీ వాళ్లతో నేను ఇక వేగలేను అని భర్తతో చెప్పకూడదు. అతని కుటుంబాన్ని మీరు ఇష్టపడటం లేదని చెప్పడాన్ని ఏ భర్త అంగీకరించడు. అలా కాకుండా మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మీ భాగస్వామితో కలిసి కూర్చుని మాట్లాడండి. పరిష్కారాన్ని సూచించమని కోరండి.

నువ్వు నాకు కరెక్ట్ కాదు

మీ భర్త ఏదైనా తెలియకుండా పొరపాటు చేసినా లేదా గొడవ సందర్భంలో మాట జారినా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు కరెక్ట్ కాదు అనే మాట అనకూడదు. అది మీ భర్త అహాన్ని దెబ్బతీస్తుంది. అలానే అసహనంలో పాత బంధాన్ని గుర్తు చేయడం, వేరొకరిని చేసుకుని ఉండింటే బాగుండేది లాంటి మాటల్ని అస్సలు అనకూడదు. అలానే మీ భర్తని మీకు ఆ పని చేతకాదని చెప్పడం అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వారు దాన్ని స్పోర్టీవ్‌గా తీసుకుంటే ఓకే.. కానీ నెగటివ్‌గా తీసుకుంటేనే మీకు ఇబ్బందులు వస్తాయి.

నీ కంటే అతను బెస్ట్

మీ భర్తని ఎట్టి పరిస్థితుల్లో వేరొకరితో పోల్చవద్దు. అతను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నించడం అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏ మనిషి మరొక మనిషితో పోల్చడాన్ని ఇష్టపడడు. ఇది వారి అహంకారాన్ని దెబ్బతీయడమే కాకుండా వేరొకరితో కంటే మిమ్మల్ని చిన్నచూపుగా చూడటంతో వాళ్లు నిరాశకి గురవుతారు.

నువ్వు నాకు అవసరం లేదు..

మీ భర్తతో వాదించే సమయంలో ఇకపై నీ గురించి నేను పట్టించుకోను.. నువ్వు నాకు అవసరం లేదు అనే మాట ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. మీరు అతడ్ని ప్రేమించడం లేదని మీ భాగస్వామికి చెప్పడం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది, అలానే అతని మనస్సులో సందేహాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఆ మాట తర్వాత మీ బంధాన్ని ప్రశ్నించడం ప్రారంభించవచ్చు లేదా అతను సందేహంలో ఉండిపోతారు.

భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ఎవరో ఒకరు సర్దుకోవాలి. మాటకి మాట పెంచుకోవడం ఇద్దరికీ మంచిది కాదు. మీ భర్త మాట పట్టింపులకి వెళ్తున్నప్పుడు మీరే కాస్త అర్థం చేసుకుని అక్కడితో గొడవకి పుల్‌స్టాప్ పెట్టడం ఉత్తమం. ఆ తర్వాత ఆ సమస్య గురించి అతనికి కోపం తగ్గిన తర్వాత చర్చించి పరిష్కరించుకోవచ్చు. ఏ సమస్య కూడా వాగ్వాదంతో పరిష్కారం కాదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
*కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు....👨‍👩‍👧‍👦

అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు. ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు  అలెర్జీ పుడుతుంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.

*కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు:*

1.అతి తెలివి,
2.చిన్న తప్పును కూడా భరించే శక్తి , సహనం లేకపోవడం,
3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).
4.పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.
5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈ రోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లో వారు ఎప్పుడు  ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.
6.చిన్న దానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.
7.ఎవరో ఒకరి నోటి దురుసు తనం కుటుంబం మొత్తం చిన్నా భిన్నం కావడానికి కారణం అవుతుంది.
8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా ,దృఢంగా ,బలంగా మేనేజ్ చేయలేకపోవడం కూడా ఒక కారణం.
9.ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు.
😔
అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా , ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థ పై నమ్మకం పోయింది.
😣
అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే  లేదు. గత 30,40 ఏళ్ళల్లో  మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగా నే చెబుతున్నారు.
10.ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండా పోతుంది.
11.మనుష్యులు అంటేనే విలువ లేదు.మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.
12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు.దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.
13.కుటుంబ నిర్వహణ ఒక కళ.ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.
14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది.మొరటుగా ప్రవర్తిస్తున్నారు.
☘️
నేను నా భార్య/ భర్త అనే సిద్దాంతం పోయి "నేనే నేను "" నేను నేనే"
పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచు కోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరంగా కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు.
☘️
కుటుంబ విలువలు, కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి. అన్నా దమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ , భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే  లేవు.
🤓
సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ఇక్కడ అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో, ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు. దీనికి అందరూ అతీతులే. ఇక్కడ ఎవ్వరూ శ్రీ రామచంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటు ఇటు గానీ వింత జాతి. ఇది ఇంతే. అది అంతే. ఎవ్వరూ ఏమీ చేయ లేరు.
🙃
ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప మనo మాత్రం మారం కదా...?

Saturday, October 12, 2024

 


 నలబై అయిదు దాటాకా మగవారి లైఫ్ లో సెక్స్ పట్ల ఉత్సాహం తగ్గడం, డబ్బుపట్ల ఆపేక్ష‌ పెరగడం మనం గమనించవచ్చు.. 


ఆ ఇంకేం ఉందిలే.. యాబై వస్తున్నాయి..

పిల్లలు పెద్దోళ్ళయారు.. అనే ఆలోచనలతో  ఉన్న కాస్త యవ్వనం ని చేజేతులా సంకనాకించుకోవడం మగాడి అలవాటు.. 


మగాడి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటాయి ఆడవారి ఆలోచనలు ఇక్కడ.


నలబై దాటాకా యుక్తవయసు కన్నా ఎక్కువగా స్పందించడం మొదలవుతుంది స్త్రీల శరీరం.. వత్తిడి మొత్తం యుక్తవయస్సు లోనే తట్టుకుని,

ఈ వయసుకు రాగానే రాఠుదేలిపోతుంది.


ఆటుపోట్లు తట్టుకునే దైర్యం మగాడికన్నా స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది.. నలబై దాటాక అది మరింత పరిణితి చెందుతుంది.


దానివలన తన మనసు ప్రశాంతంగా ఉంటుంది..  భావ వ్యక్తీకరణ చేయగల దైర్యం.. ఎదిరించగల సత్తా మొత్తం పుణికిపుచ్చుకుంటుంది.


(ఎపుడైనా గమనించండి ఇరవైలోపు ఆడపిల్లలు స్వేచ్చ కోసం పోరాడరు..

పెళ్ళయి , పిల్లలు పుట్టాక మాత్రమే స్త్రీ కి స్వేచ్చ అవసరం అవుతుంది.)


"పోయేటపుడు మూటలు మోసుకుపోము

ఎప్పుడూ డబ్బుపిచ్చి తప్ప ఓ సరసం సరదా ఉండదు తనకి"

అని కొందరంటే... " డబ్బు సంపాదించడం చేతకాదుగాని కోపమెక్కువ.. 

నువు సంపాదించి చస్తే నాకీ‌ఖర్మ ఎందుకు" అని కొందరు.. 

కనీసం నిద్రలొ‌కూడ చేయి వేయడు ఈడేం మొగుడు"

అని ఒకామె అంటే...


" పడుకోగానే గురకపెట్టి నిద్రపోవడం,

లేచాక తినడం పనికి పోవడం తప్ప మరో మనిషినంటూ నేనున్నానని ఏనాడైనా గుర్తించావా " అని మరో వనిత నిలదీస్తుంది.

ఇలా రకరకాలుగా ఆలోచించడం స్త్రీ నైజం.. 

తన కోరిక తీరకపోతే కొట్టే స్త్రీలు ఉన్నారు... 

తాము‌ కష్టపడి భర్తను పోషించే మహిళలు ఉన్నారు..


ఆడది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం ఎవరివల్ల కాదు..

తన మూడ్ ని గుర్తిస్తూ తనకు అనుకూలంగా మారి, ఆడదాన్ని తనవైపు తిప్పుకునే మగవారు చాలా కొద్దిమంది ఉంటారు..

అలా స్త్రీ కి లొంగిన మగాడిని " వాడు వాడి పెళ్ళాం కాళ్ళకాడ కుక్క " అనే సాటి మహిళలు ఉన్నారు..

మగవాడి పొగరు తాత్కాలికం..


మగవాడు సగం అనుమానం తో నాశనం అవడమేకాక భార్యనూ నాశనం చేస్తాడు,

కుటుంబం నూ నాశనం చేసుకుంటాడు,

చివరికి ఎటూకాకుండా ఏకాకి అవుతాడు.

స్త్రీ అలా కాదు బాధ్యత స్వీకరిస్తుంది,

భర్త ను వంటరిని చేయడానికి ఓ పెద్ద ప్రణాళిక రూపొందించుకుని నెమ్మదిగా వాడిని అనాథ ను చేస్తుంది నచ్చకపోతే...


ఇంతకీ నేనేం రాసానో నాకు అర్థం కాలేదు

మీకేమైనా అర్థం అయితే చెప్పి తగలాడండి.. 

నేను పనికిపోవాలి మళ్ళీ....🙄🙄


సేకరణ

భార్య, భర్తల మధ్య వాగ్వాదాలు మామూలే. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో భార...