Saturday, June 17, 2023

భైఫర్ కేషన్

 

ఉప్పాడ—కొత్తపల్లి హైస్కూల్ చరిత్ర

వ్యాసకర్త
సిద్దాంతపు బెన్ జాన్ సన్
ఆంగ్ల ఉపాధ్యాయులు
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత

68 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి వేలమంది సరస్వతీ పుత్రులకు జన్మనిచ్చి నిరంతరంగా విద్యాసౌరభాలను  విరబూస్తున్న ఉప్పాడ— కొత్తపల్లి వీర్రాజు జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ త్వరలో బాలురు మరియు బాలికల ఉన్నత పాఠశాలలుగా అభివృద్ది చెందుతున్న  అపూర్వ ఘడియలను తన చరిత్రలో లిఖించుకొనుచున్న శుభసందర్బంలో పాఠశాల చరితాక్షరాలను లిఖించే భాగ్యం, మహత్తర అవకాశం నాకు కలిగించిన పాఠశాలమ్మ తల్లికి పాదాభివందనం చేసి పరమానందబరితుడనవుతూ లిఖిస్తున్న సువర్ణాక్షరాలు.

కొత్తపల్లి, నాగులాపల్లి,మూలపేట, ఎండపల్లి,ఉప్పాడ,అమీనాబాద,కొమరగిరి,  వాకతిప్ప, ఊరు ఏదైతేనో  ఉప్పాడ కొత్తపల్లి హైస్కూల్ వద్దకు చదవడానికి రావలసిందే. అప్పర్ ప్రైమరీ పాఠశాలగా కొనసాగుతున్న పాఠశాల ది.29—6—1952 నాడు కీ॥శే అల్లక సన్యాసయ్యగారి రెండున్నర ఎకరముల భూదాన ఫలితముగాను మరియు స్వాతంత్ర్య సమరయోధుడు, MLC  కీ॥శే రావు అచ్చారావుగారి నిర్విరామ కృషి ఫలితముగ ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాల స్దాపించబడింది. అప్పర్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా శ్రీ కె. వెంకటరత్నం B.A L.L.T గారు పనిచేస్తున్న కాలంలో హైస్కూల్ గా అప్ గ్రేడ్ అయ్యింది. 1954 వ సంవత్సరంలో 4వ ఫారం ప్రారంబించుకొనుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలకు మొదటి ప్రధానోపాధ్యాయులుగా శ్రీ ఉమ్మెత్తాల బిందు మాధవరావు B.A BED ది 6—8—1954 తేదీనాడు నియమితులైనారు. 1956 సంవత్సరంలో  పాఠశాల స్దాపకులు శ్రీ రావు అచ్చారావుగారి నిర్విరామ కృషితో హైస్కూల్ భవనం నిర్మించబడింది.బిందుమాధవరావు గారి ఆధ్వర్యంలో నడిచిన పాఠశాల దశ దిశలా పేరు ప్రఖ్యాతులు పొందింది. అది ఒక స్వర్ణయుగం పాఠశాలకు. మొదటగా హైస్కూల్ నాలుగు సెక్షన్ లతో ప్రారంబమయ్యింది. తరువాత బిందుమాధవరావుగారు పదకొండు సెక్షన్లుగా అభివృద్ది చేసారు.ఆ రోజుల్లోనే 400 మంది విధ్యార్ధులు కలిగి ఉండేది కొత్తపల్లి హైస్కూల్ . హెచ్ యమ్ బిందు మాధవరావుగారు 18—6—1964 సంవత్సరంలో పదవీవిరమణ చేసారు. కీ॥శే శ్రీ మంగళంపల్లి రామనృసింహమూర్తి B.A BED ది.2—7—1964 న ప్రధానోపాధ్యాయునిగా భాధ్యతలు చేపట్టారు. ది. 4—8—1964 నాడు పదవీవిరమణ చేసిన బిందుమాధవరావుగారికి  భాధ్యతలు చేపట్టిన రామనృసింహమూర్తి గారికి శ్రీ క్రోవి సోమసుందర శాస్త్రి B.A BED రిటైర్డు ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు ఆహ్వన వేడుకలు జరిగాయి. మొదటి SSLC బ్యాచ్ 25% మంది మాత్రమే ఉత్తీర్ణులైతే రాను రాను బిందు మాధవరావుగారి పర్యవేక్షణలో 1964 మార్చి నెలలో SSLC పరీక్షలలో 80% ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ఉన్నత పాఠశాలల చరిత్రలో రికార్డు సృష్టించింది ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. పాఠశాల ఈ ఘనత వహించడానికి కారకులు బిందుమాధవరావుగారే. ఆనాడే వీరు తల్లిదండ్రుల సమావేశాలు తరచూ నిర్వహించి విద్యావ్యవస్దలో నూతన ఒరవడి సృష్టించారు.1964 విద్యాసంవత్సరంలో పాఠశాలలో  స్లిప్ టెస్ట్ లు, క్వార్టర్లీ పరీక్షలకు ప్రశ్నాపత్రములు తొలిసారిగా ముద్రించి విద్యార్దులకు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకూ ప్రశ్నాపత్రం బోర్డుమీదే రాసేవారు.18/12/1964  కాకినాడలో MSN చార్టీస్ నందు జరిగిన సైన్సు ఫెయిర్ నందు మొదటి సారిగా పాఠశాల విధ్యార్దులు పాల్గొన్నారు. ఆనాడు 20 పాఠశాలలు పాల్గొన్నాయి. క్రాప్ట్ , డ్రాయింగ్ సబ్జక్టులను పాఠశాలలో గొప్పగా భోధించేవారు.. 1964 లో 450 మంది విద్యార్దులతో పాఠశాల నడిచింది.SSLC పరీక్షలు రాయడానికి పిఠాపురం ప్రభుత్వ హైస్కూల్ కు విద్యార్దులు ఇక్కడ నుండి వెళుతుండేవారు. ఆ రోజుల్లో హైస్కూల్ నందు మిడ్ డే మీల్స్ పథకం అమలుపరచబడింది.గోధుమ ఉప్మా, పాలపిండితో చేసిన మజ్జిగ ఇచ్చేవారు. హాస్టలు, మధ్యహాన్నభోజన పథకాన్ని రావు సత్యనారాయణగారు నిర్వహించేవారు.72 మంది విద్యార్దులతో స్కౌటుదళం ప్రారంబించబడింది.శ్రీ M. ఖండేశ్వరరావు,శ్రీ M. వెంకట్రాజు, శ్రీ తాతపూడి భానోజీ విశ్వేశ్వరరావు( వ్యాసకర్త వీరి స్కౌటు శిష్యుడే) అలహాబాదు నందు జరిగిన జంబురే స్కౌటు వేడుకలలో పాఠశాల తరుపున పాల్గొన్నారు. స్కౌటే కాకుండా A.C.C ట్రూపులు నిర్వహించబడ్డాయి.వీటిని BL వరప్రసాదరావు, R. ప్రకాశరావు నిర్వహించేవారు.1978 లో పదవతరగతి పరీక్షాకేంద్రంగా గుర్తించబడినా అదే సంవత్సరం వివిద కారణాలతో రద్దయ్యింది.  కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉజ్వలంగా ప్రకాశించేలా నడిపించిన ఎందరో ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. వారిలో 1982 లో పనిచేసిన
పి ఎల్ ఎన్ దీక్షితులు గారు ఒకరు. ఈ మహానుభావుడి గురించి చెప్పకపోతే పాఠశాల క్షమించదు.ఆనాడు ప్రధానోపాధ్యాయుని గదిలోనే ఉండేవారు. అక్కడే మడికట్టుకుని వంటచేసుకొనేవారు. చండశాసనుడికి మరోపేరు .పిల్లలను దండించడానికి ఏకంగా సర్వీసు చెట్లు పెంచేవారు. అటెండరు వీరాస్వామి అసెంబ్లీ సమయానికి బెత్తాలు విరిచి పట్టుకునేవాడు. కనీసం పది బెత్తాలైనా విరిగిపోయేవి. అప్పుడే శంకరాభరణం సినిమా రిలీజైయ్యింది. దీక్షతులుగారిని చూస్తే అచ్చు శంకరశాస్త్రిని చూసినట్లుండేది. పొట్టి పొట్టి చేతులు,పంచెకట్టు, కాళ్ళకు జోడు ఉండేది కాదు. కాళ్ళజోళ్ళు ఉంటే  చప్పుడు వస్తుందని దాని వలన క్లాసులో టీచర్లకు తను వస్తున్నట్టు తెలుస్తుందని జోళ్ళు వేసుకునేవారు కాదు. అంతలా పర్యవేక్షణ చేసేవారు పాఠశాలను. వీరి ఆధ్వర్యంలో కూడా పాఠశాల ఉన్నతంగా వెలిగింది. అంతేకాదు వీరి హయాంలోనే 1982 లో తిరిగి పదవతరగతి పరీక్షాకేంద్రం ప్రారంబించబడింది. ఈ హైస్కూల్ నందు
వందలాది  గొప్ప గొప్ప సబ్జక్టు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పనిచేసారు. కొత్తపల్లి  హైస్కూల్లో ఒక్కసారైనా పనిచేయాలని ప్రతీ ఉపాధ్యాయుడూ ఉవ్విళ్ళూతూవుంటారు.1952లో  రెండు ఎకరముల స్దలంలో వెలసిన హైస్కూల్ రాను రాను 7 ఎకరముల స్దలమును సమకూర్చుకుంది.అయితే  2013లో ప్రధానోపాధ్యాయులు కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి ఆధ్వర్యంలో  పర్యాటకశాఖ వారి కోరికమేరకు ఇంటర్నేషనల్  ఫేషన్ టెక్నాలజీ మరియు హోటలు మేనేజ్ మెంటు కాలేజీ ఏర్పాటుకు  రెండున్నర ఎకరములు ఇవ్వడం జరిగింది. మిగతా కొంత భాగం ఆటస్దలమునకు కేటాయించడం జరిగింది. 2012  విద్యాసంవత్సరంలో ప్రధానోపాధ్యాయులు కె బి మార్కండేయులు వారి ఆధ్వర్యంలో పిఠాపురం శాసన సభ్యురాలు వంగా గీతావిశ్వనాధ్ మరియు కాకినాడ పార్లమెంటు సభ్యులు పళ్ళంరాజు గారు పాఠశాలకు 1కోటి 30 లక్షలు నిధులు మంజూరు చేయడంతో శ్రీ రావు చిన్నారావు గారి  కృషితో ప్రస్తుతం ఉన్న 28 గదుల మూడంతస్తుల భవన నిర్మాణం జరిగింది.  కేంద్ర పర్యాటకశాఖ మంత్రి పద్మవిభూషన్ చిరంజీవి గారు11_5_2013 న ప్రారంభించారు.
                                                           
2017 సెప్టెంబరు నెలలో ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సి హెచ్ వి రమణమూర్తి గారి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు యావన్మంది  సహకారం అందించగా SMC  చైర్మన్ తిక్కాడ తాతారావుగారు సత్ సంకల్పం , 68 యేళ్ళ చరిత్రలో పాఠశాలలో పనిచేసిన వారు ఎవ్వరూ స్వీకరించని అత్యున్నత  రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన ఆంగ్ల ఉపాధ్యాయులు  సిద్దాంతపు బెన్ జాన్ సన్ గారి అకుంఠిత దీక్ష, దాసరి సతీష్ రాజా, సత్యనారాయణగార్ల ప్రొద్బలంతో ,పూర్వవిద్యార్దుల సహకారంతో,పిఠాపురం శాసన సభ్యులు శ్రీ SVSN వర్మగారు 2017 విద్యాసంవత్సరంలో పాఠశాలను బాలురు బాలికల పాఠశాలలుగా మార్చాలని విద్యార్ధినుల విన్నపాల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాలను సందర్శించి పాఠశాల రోలు అధికం కావడంతో అనేక సమస్యలు వస్తున్నాయని నిర్ధారించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుత పిఠాపురం శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారి సిఫార్సుతో  పాఠశాలను భైఫర్ కేట్ చేస్తూ సెక్రెటరీయేట్  ఆమోద ముద్రవేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో 800 మంది బాలికలతో మరికొద్ది రోజులలోనే గరల్స్ హైస్కూల్ ఏర్పడనుంది. ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన రెండుకోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణం మాదిరెడ్డి దొరబాబు గారు, రావు చిన్నారావుగారు,ఉమ్మిడి జాను గారు, SMC  చైర్మన్ మేరుగు ప్రసాదు గారు చేపట్టనున్నారు.



భైఫర్ కేషన్ ప్రక్రియలో హ్యూమన్ రైట్స్ వారి పాత్ర మరువలేనిది 

ఫైలు స్దబ్దుగా ఉండిపోయిందన్న సమయంలో హ్యూమన్ రైట్స్ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ జాన్ బొంకే గారి ఆధ్వర్యం హ్యూమన్ రైట్స్ యంగ్ లీడర్స్  కొత్తపేటకు చెందిన ధోని సంసోను రామిచిట్టిపేటకు చెందిన చొక్కా ప్రసాదు

సూరాడపేటకు చెందిన పిరమళ్ళ పౌల్ రాజు, మాయపట్నంకు చెందినచోక్కా సంజీవి  అమినాబాదకు చెందిన 

మడదా పోలబ్బాయి  వారి వారి గ్రామాలలో విధ్యార్దుల తల్లిదండ్రుల నుండి

గ్రామస్తుల నుండి సంతకాలు సేకరించి డి ఇ ఓ గారికి అందజేసి  ఆర్డరు వచ్చేలా చేసారు

వీరికి కృతఙ్ఞతలు 


గౌరవనీయ జిల్లా విద్యాశాఖాధికారి వారికి,


కొత్తపల్లి పేరెంట్ కమిటీ చైర్మన్ అభ్యర్దన మేరకు


కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

భైఫర్ కేట్ అయి ఉత్తర్వులు పొంది విజయవంతంగా నడుస్తున్నా  

 దిద్దుబాటు ఉత్తర్వులు రాక పాలనాపరంగా అనేక సమస్యలు పరిష్కారం కావటం లేదని, నెలలు గడుస్తున్నా దిద్దుబాటు ఉత్తర్వులు జారీ జరగటం లేదని విచారణ చేసి తక్షణమే జిల్లా విద్యాశాఖ ద్వారా ఉత్తర్వులు ఇప్పించాలని   మా మానవహక్కుల  జిల్లా కార్యాలయాన్ని కొత్తపల్లి బాలికల పేరెంట్ కమిటీ చైర్మన్ సంప్రదించడం జరిగింది. 

దిద్దుబాటు ఉత్తర్వులు ఆలస్యం కావడంతో

పాలనాపరమైన సమస్యలు వస్తున్నట్టు విచారణలో గ్రహించినాము. 

డి డి ఓ  ఐడి రాక ఇంకా ఉమ్మడి పాఠశాల కోడ్ ద్వారానే జీతాల చెల్లింపు జరుగుందని విచారణలో గ్రహించడం జరిగింది .

NHRD డైస్ కోడ్ బాలికల పాఠశాలకు కేటాయించినా విద్యాశాఖ ఏక్టివేట్ చేయక ఇంకా బాలికలందరూ కొత్త డైస్ కోడ్ లోనికి రానట్టు విచారణలో గ్రహించడం జరిగింది.

పాఠశాలలో  ఐదు నెలలు గడుస్తున్నా బాలికల పాఠశాల స్వతంత్రంగా నడచుటకు

దిద్దుబాటు ఉత్తర్వులు ఎంతో అవసరమని గ్రహించడం జరినది.

బాలికల పాఠశాల ఇ మెయిల్ ఐడి నకు ఎటువంటి సమాచారం పాఠశాలకు చేరవేయనందున పాలనాపరమైన సమస్యలు రావటం గ్రహించాము.

పాఠశాల ఏర్పడిన తరువాత పాఠశాలను జిల్లాస్దాయి అధికారి ఎవరూ సందర్శించి తగిన సూచనలు ఇవ్వలేదని విచారణలో గ్రహించడం జరిగింది .

ఇంకా ఉమ్మడిగానే మధ్యహాన్నభోజనం, హాజరు, స్టాఫ్ మీటుంగులు జరుగుతుండటం, బాలుర పాఠశాల ఫ్రధానోపాధ్యాయుడు ఒక్కడే జిల్లా  మీటింగులకు హాజరవటం, బాలికల పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు హాజరు కాకపోవడం వంటి విషయాలు విచారణలో గ్రహించడం జరిగింది.

వెంటనే జిల్లా విధ్యాశాఖ కొత్తపల్లి బాలికల పాఠశాల స్వతంత్రంగా నడుచునట్లు చర్యలు తీసుకోవలసిందిగా  కోరుతూ దిద్దుబాటు ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను


నకు ;—
జిల్లా విద్యాశాఖాధికారి,
తూర్పుగోదావరి జిల్లా,
కాకినాడ.
నుండి :—
మేరుగు ప్రసాదు,
స్కూల్ పేరెంట్ కమిటీ చైర్మన్ ,
కొత్తపల్లి బాలికల పాఠశాల                కొత్తపల్లి గ్రామం
సెల్ నెం :
విషయం ;— కొత్తపల్లి ఉన్నత  పాఠశాల భైఫర్ కేషన్ దిద్దుబాటు ఉత్తర్వులు విడుదల చేయమని కోరుట గురించి,బాలికల పాఠశాల స్వతంత్రంగా నడచుటకు తగిన సూచనలు కోరుటగురించి

అయ్యా !
ఈ క్రింది తెలిపిన అంశములను పరిశీలించి వెంటనే పరిష్కరించగలరని కోరుచున్నాను.
1 భైఫర్ కేషను ఆర్దరులో వచ్చిన చిన్ని చిన్న సవరణలు కోరుతూ ఉత్తర్వులు ఇవ్వమని కార్యాలయమును కోరి మూడు నెలలకు పైగా గడుస్తున్నా దిద్దు బాటు ఉత్తర్వులు విడుదల కాలేదు తక్షణమే విడుదల చేయగలరని కోరుతున్నాను.
3 భైఫర్ కేషన్ జరిగిన తరువాత ఏ అధికారి ఇంత వరకూ సందర్శించి తనిఖీ నిర్వహించలేదు.తనిఖీ నిర్వహించి అభివృద్దికి సూచనలు ఇవ్వగలరు..
2.పాఠశాల ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా స్వతంత్రగా నడిచే ఏర్పాట్లు పూర్తికాలేదు. బాలికల పాఠశాల నుంఢి ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిని HM మీటుంగులకు హాజరుకమ్మని ఎటువంటి మెసేజ్ లు రావటంలేదు. పాఠశాల ఇ మెయిల్ అప్ డేట్ కాలేదు. అందువలన ఏ విషయములు తెలియుటలేదు.
4 .బాలికల పాఠశాలకు డైస్ కోడ్ NHRD  వారు పంపినా ఇంతవరకూ ఏక్టివేట్ కాలేదు. కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగినా ఫలితంలేదు.
5.బాలికల పాఠశాలకు పదవతరగతి విధ్యార్దులకు నామినల్ రోలు పంపుటకు ,విధ్యార్దుల మార్కుల నమోదుకు , మధ్యహాన్న భోజన వివరాల,ఉపాధ్యాయుల వివరాల  నమోదుకు  డైస్ కోడ్ ఏక్టివేషను ఎంతో అవసరమైయున్నది తక్షణమే ఏక్టివేషను చేయగలరు.
6. డైస్ కోడ్ కొత్తది రెండు రోజులు పనిచేయడంతో 105 మంది పదవతరగతి  విద్యార్దులను షిప్ట్ చేరటం జరిగింది .మరలా వెంటనే పనిచేయడం మానివేసింది. దీనివలన 105  మంది విద్యార్దులకు హాజరు పడటంలేదు. అమ్మవడి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నామినల్ రోలుకు ఆటంకం ఏర్పడింది.
7.డైస్ కోడ్ ఏక్టివేట్ కాక SPC నిధుల విడుదలకు సాంకేతిక సమస్య ఏర్పడినది.
8 దిద్దుబాటు ఉత్తర్వులు విడుదల కాక ప్రత్యేక మైన డి డి ఓ ఐడి కొరకు జిల్లా ట్రజరీ వారిని కోరుటకు ఆటంకముగా ఉన్నది. దీనివలన ఇంకనూ పాత డిడిఓ ద్వారానే ఉపాధ్యాయులు జీతాలు పొందుతున్నారు. దీని వలన పాలనా పరమైన సమస్యలు వస్తున్నవి.బాలికల పాఠశాల స్వతంత్రంగా నడునట్లు ఉత్తర్వులు విడుదల చేయగలరు.
9 బాలికల పాఠశాల ,బాలుర పాఠశాల స్టాఫ్ మీటుంగులు విడివిడిగా నిర్వహించులాగున ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు ఇవ్వగలరు .
10  బాలికల పాఠశాలకు కేటాయించిన స్దలములో  నిర్మితమగుచున్న 16  గదుల భవనమును బాలికల పాఠశాలకు ఇప్పించగలరని కోరుతున్నాను.
11 బాలికలు 750 మందికి సరపడా టాయిలెట్లులేవు .ఆయాలు లేరు .మంచినీటి సధుపాయంలేదు.
  పై సమస్యలను సానుకూల దృక్పదముతో వెంటనే పరిష్కరించగలరు
ఇట్లు
మీ విశ్వాసనీయ

స్కూల్ ఫేరెంటు కమిటీ చైర్మన్
కొత్తపల్లి బాలికల ఉన్నత పాఠశాల


గౌరవనీయులైన


కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూలు

భైఫర్ కేషను నాలుగు సంవత్సరములు

గడుస్తున్నా పూర్తికాలేదు.మీరు ఇంతవరకు ఎంతో సహకరించారు.800 మంది అమ్మాయిల భవిష్యత్తు మీరు ఇచ్చే తుది ఉత్తర్వలమీద ఆధారపడి వున్నది. గ్రామస్తులు,తల్లిదండ్రులు ఎంతో ఎదురుచుస్తూన్నారు. ప్రజాప్రతినిధులు భైఫర్ కేషన్ జరగాలని కోరుకుంటున్నారు.

అప్పుడే ఐదవ విధ్యాసంవత్సరం ప్రారంభమవుతుంది కూడా . కావున తక్షణమే స్పందించి స్టాఫ్ భైఫర్ కేషన్ ఉత్తర్వలు ఇవ్వగలరు.తమరి ప్రతిస్పందన తెలుపగలరు.


‌Respected 

District Educational officer

East Godavari District


 Kottapalli Zilla Parishad High School

 Biffercation four years

 The future of 800 girls depends on the final orders you give.  The villagers and parents are looking forward to it.  Deputies want the bifurcation to take place.

 Even then the fifth school year begins.  So staff bifurcation orders can be issued immediately. Tamari can respond.




జిల్లా విద్యాశాఖాధి వారికి
తూర్పు గోదావరి జిల్లా,

పిఠాపురం నియోజక వర్గం ,కొత్తపల్లి మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బాలురు బాలికల పాఠశాలలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము జి.ఓ యమ్ యస్ నెం 44 ద్వారా ఉత్తర్వులు స్దానిక శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి మేరకు ఇచ్చియున్నది. తదనంతర ఉత్తర్వులు సి.యస్ సి, మరియు ఆర్ జె డి ఇచ్చియున్నారు. భైఫర్ కేషన్ ప్రక్రియ ప్రారంబించి నాలుగు విద్యాసంవత్సరముల సుదీర్ఘకాలం కావచ్చుచున్నది. కొత్తపల్లి హైస్కూల్ నందు 1200 మంది విధ్యార్దులు మత్స్యకార కుటుంబాలకు చెందినవారు.ప్రభుత్వం మత్స్యకారుల సంక్షక్షేమమునకు అధికప్రాధాన్యత ఇచ్చుచున్నది. రాష్ట్రంలోనే ఏ పాఠశాలలో లేనివిధంగా కొత్తపల్లి హైస్కూల్ నందు 800 మంది బాలికలు చదువుచున్నారు. బాలికల సంక్షేమానికి భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చుచున్నది. కావున కొత్తపల్లి హైస్కూల్  1550 మంది విధ్యార్దులకు పైగా అధిక సంఖ్యతో  నిర్వహణ భారముతో పాఠశాల కుంటుపడుచున్నది. ప్రభుత్వ పధకములు సక్రమంగా అమలు చేయుటకు ఇబ్బందులు తలేత్తుచున్నవి. కావున విధ్యాశాఖాధికారి వారు వెంటనే స్టాఫ్ భైఫర్ కేషన్ ఉత్తర్వలు విడుదల చేసి బాలురు, బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయవలసినదిగా కోరుచున్నాను.

శాసనసభ్యులు
పిఠాపురం నియోజకవర్గం




పాఠశాల భౌతిక స్వరూపం

ఉప్పాడ  అమీనాబాద కొత్తపల్లి పంచాయితీ గ్రామాలు
కొత్తపల్లి  పంచాయితీ హేబిటేషన్లు
రవీంద్రపురం  కొత్తపల్లి  sc కోలనీలనుండి
సుమారు 60 మంది పిల్లలు వస్తారు
రెండు ఎలమెంటరీలు ఉన్నాయి.రవీంద్రపురం ఎలిమెంటరీ నిర్మాణంలో ఉండటంతో ప్రస్తుతం బాయిస్ హైస్కూల్ నందు ఒక గదిలో నడప బడుతుంది  దూరం  అర కిలోమీటరు.

2 ఉప్పాడ పంచాయితీ నుండి 350 మంది పిల్లలు వస్తారు. హేబిటేషన్లు  సుబ్బంపేట( 1.5 km).బర్మాకోలనీ, కొత్తకోలనీ.నాయకర్ కోలనీ, ఉప్పాడ అనంతలక్ష్శి కోలనీ,మాయాపట్నం, పాత ఉప్పాడ, ఉప్పాడ sc colony.ఎక్కువ మత్య్సకారులు,వీవర్స్ ఉంటారు.
6 ఎలిమెంటరీలు ఉన్నాయి.

అమీనాబాద పంచాయితీ 300 మంది పిల్లలు హాజరవుతారు.ఎక్కువ మత్స్యకారులు

కార్యక్రమాలకు
ముగ్గురు సర్పంచులు
నక్కా మణికంఠ  అమీనాబాద
ఉమ్మిడి జాను ఉప్పాడ సర్పంచ్
కొత్తపల్లి సర్పంచ్ పిలవాలి
MPTCలు
పిలవాలి.
కొత్తపల్లినందు రావుచిన్నారావుగారు,మాదిరెడ్డి దొరబాబు, ఆనాల సూదర్శన్ , వైయస్ ఆర్ సి పి నాయకులు వీరిని పిలవాలి.
స్దానిక MLA  పెండెం దొరబాబుగారు
పిఠాపురం లో ఉంటారు






No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...