ఏప్రిల్ 17, 2023న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారు కడ్డీలు, విదేశీ కరెన్సీని మోసుకెళ్లే ఎయిర్‌కార్గో కంటైనర్‌లో నకిలీ పత్రాలను ఉపయోగించి సురక్షిత నిల్వ కేంద్రం నుంచి దొంగిలించబడిందని పోలీసులు తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి టొరంటోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీలు వచ్చింది. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన కాసేపటికే, కార్గోను ఆఫ్ లోడ్ చేసి ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. కానీ ఆ మరుసటి రోజే అది కనిపించకుండా పోయిందని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఆరోజున 6600 బార్‌ల 9999 శాతం స్వచ్ఛమైన బంగారం 400 కిలోగ్రాములు.. 20 మిలియన్ కెనడా డాలర్లు, 5 మిలియన్ల విదేశీ కరెన్సీని ఎయిర్‌పోర్ట్‌లోని ప్రత్యేక ప్రదేశానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
No comments:
Post a Comment