బైబిల్ ప్రకారం ఆడమ్ నుండి మహాజలప్రళయం వరకు 1656 సంవత్సరాలు
జలప్రళయం నుండి అబ్రహాం పుట్టుకవరకూ 292 ఏళ్ళు
అబ్రహాం నుండి జాకబ్ ( యాకోబు) మిగతా ఇజ్రాయేలు ప్రజలతో ఈజిప్ట్ బానిసత్వానికి వెళ్ళేవరకు 290 ఏళ్ళు
ఈజిప్టులో మొత్తం బానిసత్వపు దినాలు 430 ఏళ్ళు.
అనగా ఆడమ్ నుండి మహాప్రయాణం ( ఎక్సోడస్) - బానిసత్వ విడుదల వరకు 2666 ఏళ్ళు.
మహాప్రయాణాన్ని నడిపించిన నాయకుడు మోజెస్
మహాప్రయాణం మొదలయ్యేనాటికి మోజెస్ వయసు 80 ఏళ్ళు
మోజెస్ 80 ఏళ్ళవాడిగా ఉండగా యెహోవా మొట్టమొదటిసారి మోజెస్ కు క్యాలెండర్ ఒకటి ఇచ్చాడు ( నిర్గమకాండం 12:2 ) . ఇకనుండి ఈ నెల సంవత్సరానికి మొదటినెల అవుతుంది అని క్యాలెండర్ ప్రస్తావన జరిగింది
అంటే ఆడమ్ సృష్టించబడిన 2600 ఏళ్ళ తరవాత మొదటి క్యాలెండర్ యూదులకు లభించింది .
మరి అలాంటప్పుడు ఆడమ్ 930 ఏళ్ళు బ్రతికాడని ఎలా లెక్కకట్టారు ?
ఆడమ్ సృష్టి జరిగే సమయానికి ( 4000 BCE) ఇండస్ వ్యాలీ చుట్టుపక్కల వ్యవసాయ సమూహాలు ఏర్పడటం ప్రారంభం అయ్యింది . ఆడం మరణించే సమయానికి ( ఇంచుమించు 1000 ఏళ్ళు) ఇండవ్ వ్యాలీ నాగరికత ఆల్మోస్ట్ మొదలయ్యింది ( 3300- 1900 BCE ) .
అప్పటికే ఈజిప్షియన్ నాగరికతకు అంకురాలు పడ్డాయి. ఆడమ్ చనిపోయేనాటికి ఫారో సామ్రాజ్యం మొలకెత్తుతూ ఉంది.
ఇన్ని నాగరికతలు, ప్రజలు ఎక్కడికక్కడ అభివృద్ధి చెందుతూ ఉండగా ఈ భూమిని, మనుషుల్ని సృష్టించింది యెహోవానే అని వాదించడానికి కాస్త బిడియం ఉండాలా వద్దా
No comments:
Post a Comment