Sunday, April 18, 2021

సర్దార్ గౌతు లచ్చన్న జీవిత చరిత్ర

 



🙏 *జోహార్ సర్ధార్ గౌతు లచ్చన్న*🙏                                             🔥 *ముల్కీ నిబంధనల రద్దు ముఖ్యమా? ముఖ్యమంత్రి పదవి ముఖ్యమా? అని అడిగితే ముల్కీ నిబంధనల రద్దే ముఖ్యమన్న!  తెలుజాతి ముద్దు బిడ్డ...💪                                                                                                 🔥 జై ఆంధ్ర ఉద్యమం చేపట్టిన యోధుడు💪                                                                              🔥 1938 లోనే రైతుల కష్టాల పై సిక్కోలు నుండి చెన్నపట్నం(చెన్నై) వరకు 2400 కిలోమీటర్ల సుదీర్ఘ రైతు రక్షణ మహా పాదయాత్ర  చేసిన రైతు బాంధవుడు💪*                                                   🔥 *భారత దేశంలో సర్దార్ బిరుదాంకితులలో ప్రముఖుడు💐*                                        🔥 *ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు స్వర్గీయ సర్ధార్ గౌతు లచ్చన్న గారి వర్దంతి..(19/04/2006)సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ...*.                                         👏👏👏👏👏👏👏👏👏👏👏         ---------------------------------------------                          ♦️ *సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవితం పై ఒక విశ్లేషణాత్మక సమచారం*                ---------------------------------------------                 👉జననం: *ఆగస్ట్-16,1909*   ---------------------------------------           👉స్థలం: *నాటి గంజాం జిల్లా&నేటి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం,బారువ అనే గ్రామంలో*  -----------------------------------------------                         👉తల్లిదండ్రులు: *చిట్టయ్య, రాజమ్మ*                                       👉భార్య: *యశోదా దేవి*                    👉  పిల్లలు: *శ్యాం సుందర్ శి  వాజీ,ఝాన్సీ లక్ష్మీ,సుశీలా దేవి*  ---------------------------------------                                         👉చదువు: *మెట్రిక్యలేషన్*    ---------------------------------------------                            ♦️ *స్వాతంత్రోద్యమంలో       సర్దార్  గౌతు లచ్చన్న గారి   ప్రస్థానం*  ---------------------------------------------          🔥 *1930- ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం* ------------------------------------------               *21 సంవత్సరాల వయసులో* గాంధీజీ గారి పిలుపును అందుకొని ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం నడిపారు.                    *ఫలితంగా అరెస్ట్ అయ్యి టెక్కలి,నరసన్నపేట, బరంపురం లలో 70 రోజులు పాటు జైలు జీవితం గడిపారు*  ----------------------------------------------                         🔥 *1932-శాసనోల్లంఘన ఉద్యమం*              ---------------------------------------------          *23 సంవత్సరాల వయసులో* ఈ ఉద్యమాన్ని ఉధృతస్థాయిలో నడుపుచున్న *సర్దార్  గౌతు లచ్చన్న ను  అరెస్ట్ చేసి 6 నెలలు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిర్బంధించారు*                        -------------------------------------------         🔥 *1938-రైతు రక్షణ మాహా పాదయాత్ర*  -------- ----------------------------------   *జమీందారి, ఇనాం వ్యస్థల రద్దు కోరుతూ  ----------------------------------------------                                సర్దార్  గౌతు లచ్చన్న గారు 29 సంవత్సరాల వయసులో*        ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో             బారువ(ఇచ్ఛాపురం) నుండి మద్రాస్ వరకు  *2,400 కిలోమీటర్ల  సుధీర్ఘ పాదయాత్ర* నిర్వహించి పెను సంచలనం సృష్టించారు       *ఫలితం:జమీందారి,ఇనాం వ్యస్థల రద్దు*       ---------------------------------------------     🔥 *1940*-సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో పలాస లో *ఆల్ ఇండియా కిసాన్ సభ ను నిర్వహించారు*                         -----------------------------------------------   🔥 *అంటరానితనం పై కత్తి ఝుళిపించిన  సర్దార్ గౌతు లచ్చన్న*                            --------------------------------------------- సర్దార్  గౌతు లచ్చన్న నడిపిన *హరిజన సేవా సంఘాలు,హరిజన రక్షణ యాత్రలు* ప్రజలను బాగా ప్రభావితం చేశాయి.                     *రాత్రి పాఠశాలలు* నిర్వహించి బహుజనులు విద్యాభివృద్ధికి కృషి చేసారు.           *హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించుటలో* విశేష పోరాటం చేశారు.  -----------------------------------------------  🔥 *1942-క్విట్ ఇండియా ఉద్యమం* ----------------------------------------------   ఈ ఉద్యమ సమయంలో నాటి మద్రాస్ ప్రభుత్వం *33 సంవత్సరాల వయసున్న సర్దార్ గౌతు లచ్చన్న గారిని అతి ప్రమాదకరమైన వ్యక్తి గా ప్రకటించింది*                  వారి ఆచూకీ తెలిపిన వారికి *10,000/- బహుమానం ప్రకటించింది*                                 అతనిని పట్టుకోవడం సాధ్యం కాకపోతే కనిపిస్తే కాల్చి వేయండి అని *SHOOT AT SIGHT ఆర్డర్స్ ఇచ్చినది*                చివరికి ప్రభుత్వమే 1942 లో లచ్చన్న గారిని బంధించి *1945 అక్టోబర్ వరకు జైలులో(దాదాపు 3 సంవత్సరాలు)* ఉంచి తదుపరి విడుదల చేసినది.  --------------------------------------------- 🔥 *1948 లో *BACKWARD CLASSES CONFERENCE*   -----------------------------------------                                👉మొట్టమొదటిసారిగా  *గుంటూరు లో సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో *BACKWARD CLASSES CONFERENCE* ను నిర్వహించారు.                                      తదుపరి అన్ని జిల్లాలు పర్యటించి ఆయా *జిల్లాల్లో BACKWARD CLASSES ASSOCIATIONS ను నిర్మించారు*      ---------------------------------------------   🔥 *1948-1983- సర్దార్ గౌతు లచ్చన్న గారు 5 సార్లు M.L.A గా ఒకసారి M.L.C గా సుదీర్ఘ కాలం చట్టసభలలో ప్రజా గొంతుకై  ప్రాతినిధ్యం వహించారు*   ----------------------------------------------    ♦️ *1953* టంగుటూరి ప్రకాశం పంతులు&బెజవాడ గోపాలరెడ్డి  గారి *మంత్రివర్గాలలో సర్దార్ గౌతు లచ్చన్న గారు రాష్ట్ర వ్యవసాయ,కార్మిక శాఖా మంత్రి గా పనిచేశారు*        ---------------------------------------------   🔥 *సర్దార్ లచ్చన్న గారు 1967 లో ఒకేసారి శ్రీకాకుళం జిల్లా నుంచి M.P గా,M.L.A గెలిచారు* ------------------------------------------                                              👉 తన రాజకీయ గురువు గారైన *ఆచార్య N.G.రంగా గారు* ఆ ఎన్నికలలో చిత్తూర్ నుండి MP గా పోటీ చేసి ఒడిపోవడంతో , *సర్దార్ లచ్చన్న గారు తన M.P పదవికి రాజీనామా చేసి రంగా గారిని  శ్రీకాకుళం నుండి MP గా గెలిపించుకొన్నారు*                      -----------------------------------------------   🔥 *1972-జై ఆంధ్ర ఉద్యమం-ముల్కీ నిబంధనలను వ్యతిరేకిస్తూ సర్దార్ గౌతు లచ్చన్న గారు పోరాటం చేశారు.     -------------------------------------------                 🔥  *1975- ఇండిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీని లచ్చన్న గారి నాయకత్వంలోవ్యతిరేకిస్తూ ఆందోళనలు*                  ఫలితగా సర్దార్ గౌతు లచ్చన్న గారిని *1975 అరెస్ట్ చేసి 1977 లో ఎమర్జెన్సీ ఉపసంహరణ అనంతరం విడుదల చేశారు*        ----------------------------------------------   ♦️ *1978- సర్దార్ గౌతు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ లో ప్రతిపక్ష నేత గా వ్యవహరించారు&పబ్లిక్ ఆకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు*     ---------------------------------------------   ♦️ *1997-ఆంధ్రా విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతు లచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు*                           *1999-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతు లచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు*        --------------------------------------------  ♦️ *2001*- *సర్దార్ గౌతు లచ్చన్న గారి *ఆటోబయోగ్రఫీ*                    🙏 *నా జీవితం* పేరుతో ఆవిష్కరించారు.   ----------------------------------------------   ♦️ *2006,ఏప్రిల్-19  న సర్దార్ గౌతు లచ్చన్న గారు 97 సంవత్సరాల వయసులో మరణించారు*       -------------------------------------------  🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, April 14, 2021

ARTOZ DRINK

 శతవసంతాల 'ఆర్టోస్‌'





ఎన్నేళ్లయినా ఈ శీతల పానీయానికి అదే క్రేజ్‌

ఉగాది పర్వదినాన ప్రారంభమైన రెండో యూనిట్‌

ఆర్టోస్‌.. ఇది పక్కా లోకల్‌.. ఈ సాఫ్ట్‌ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ 'వహ్వా' అనక మానదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని కోరకా మానదు. 'రామచంద్రపురం రాజుగారి డ్రింకు'గా పేరొందిన ఈ శీతల పానీయం గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్‌ కూల్‌డ్రింక్‌ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం 'ఆర్టోస్‌' వందేళ్లకు పైగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఉగాది సందర్భంగా విస్తరణ బాట పట్టిన ఈ సంస్థ..

మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది.మూడు తరాల కృషి

ఆర్టోస్‌ పరిశ్రమ ఈ స్థాయికి రావడం వెనుక మూడు తరాల కృషి ఉంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొనుగోలు చేశారు. దానిని ఇక్కడికి తెచ్చి, విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్‌ నుంచి స్పేర్‌ పార్టులు తెప్పించి, మరమ్మతులు చేయించారు. ఆ మెషీన్‌తో పట్టణంలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గోలీసోడా ద్వారా వస్తున్న గ్యాస్‌ను చూసి ప్రజలు దానిలో భూతం ఉందని, ఎవ్వరూ తాగకూడదని చెప్పుకొనేవారు. దీంతో అప్పట్లో అంతంత మాత్రంగానే సోడాలు అమ్ముడు పోయేవి. అప్పట్లో రాజుగారు ఒక్కరే వెల్ల ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పట్టణంలో సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్‌ మిలిటరీ సైనికులకు ఈ గోలీసోడాను అందించేవారు. దీంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది.

1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు తన చదువు ముగించుకున్న అనంతరం అప్పట్లో మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్‌ డ్రింక్‌ తాగి, అటువంటి సాఫ్ట్‌ డ్రింక్‌ తయారు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసే విధానాన్ని, ముడి సరకును లండన్, జర్మనీ ప్రాంతాల నుంచి రప్పించారు. అదే ఏడాది ఏఆర్‌ రాజు డ్రింక్స్‌ పేరుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తయారీ ప్రారంభమైంది. ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్‌ మెషీన్‌ అమర్చి మరింతగా డ్రింకులను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

1955లో ఇంగ్లండ్‌ నుంచి పూర్తి స్థాయి ఆటోమెటిక్‌ మెషీన్‌ రప్పించారు. డ్రింక్స్‌కు 'ఆర్టోస్‌'గా పేరు మార్చారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే అదే ఏడాది పేటెంట్‌ హక్కులు కూడా పొందారు. తరువాత ఆయన కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణరాజులు ఆర్టోస్‌ డ్రింక్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. 1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్‌ రూపాంతరం చెందుతూ వచ్చింది. 1955లో 30 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 150కి పెరిగింది. అప్పటి నుంచీ మన జిల్లాతో పాటు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆర్టోస్‌ డ్రింక్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రపురం పరిసర గ్రామాలకు ఆర్టోస్‌ వాటర్‌ బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.


వందేళ్ల తరువాత రెండో యూనిట్‌
ఆర్టోస్‌ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న తరువాత మూడో తరం వారైన ఆర్టోస్‌ బ్రదర్స్‌ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇక నుంచి 1.25, 250, 200 మిల్లీలీటర్ల ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్‌ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయనున్నారు. అలాగే సోడాలు కూడా తయారు చేస్తున్నారు.

రామచంద్రపురం: 'ఏంటీ గోలీ సోడానా? అయ్యబాబోయ్‌! ఎవ్వరూ తాగకండి. అందులో భూతం ఉంది' అంటూ ఒకప్పుడు అందులో నుంచి వచ్చే గాలికి జనం హడలిపోయే స్థాయి నుంచి.. 'ఆర్టోసా! ఏదీ మరోటి ఇవ్వండి తాగుతాం' అనే స్థాయిలో ఆర్టోస్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ ప్రాచుర్యం పొందింది. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి సీమకు వచ్చేసరికి మాత్రం ఆర్టోస్‌ తాగి వెళ్లాల్సిందే. అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి చూడాల్సిందే.


Monday, February 1, 2021

పెదమేస్టారు

 అది 1874  మార్చి 12 కెనడియన్ బాప్టిష్ట్ మిషన్ (సి బి యమ్ ) మిషన్ కార్యక్రమాలు కాకినాడలో ప్రారంబించాలని జాన్ మెక్లారన్   సి బి యమ్ చర్చిని కాకినాడలో ప్రారంబించాడు. మెక్లారన్ పర్యవేక్షణలో మిషనరీలు చర్చిలే కాకుండా దానికి అనుబందంగా పాఠశాలలు, ఆసుపత్రులు  శర వేగంగా తూర్పుగోదావరి జిల్లా అంతటా వివిధ ప్రాంతాలలో స్దాపించారు.పిఠాపురం,కాకినాడ మెక్లారన్ హైస్కుల్ , సామర్లకోట, రామచంద్రపురం పేరు పడ్డాయి. పిఠాపురంలో మిషనరీలు పరిచర్య ప్రారంబించిన తొలినాళ్ళలోనే 1876 ఆగస్టు 23 తారీఖున   అగ్రహారం  బండిరేవులో నాగులాపల్లికి చెందిన తాతపూడి సుబ్బయ్య పిఠాపురానికి చెందిన మేరి నరస్సయ్య  జాన్ మెక్లారన్ దొర గారి చేతుల మీదుగా బాప్తీస్మము పొందారు.తాతపూడి సుబ్బయ్య భార్యది చేబ్రోలు  దొండపాటి వారి అల్లుడు. ఇతనికి ముగ్గురు కొడుకులు. 

అందరిలో పెద్దవాడు హానోకు . తమ్ముడు గుర్రయ్య ,మరో తమ్ముడు ( పేరు తెలియాలి). హానోకు భార్య శీలి మరియమ్మ . పండూరు స్వగ్రామం.మరియమ్మ సోదరుడు శీలి సామ్యేలు.  అంటురోగాలైన కలరా ,మసూచి  జనాలను పట్టి పీడిస్తున్న రోజులవి. మిషనరీలు ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి వైద్యసేవలు అందిస్తున్న గొప్పరోజులు. డేరాలలో వెైద్యసేవలుతో పాటు చర్చి నడిపేవారు. పిఠాపురంలో 1901 లో ఈటన్ దొర ఫీల్డ్ మిషనరీగా నియమించబడ్డాడు. స్మిత్ దొర 

ఆసుపత్రి సూపర్ డెంట్ గా నియమించబడ్డాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో పిఠాపురం పరిసర పరిసరప్రాంతాలలో విద్య ఆరోగ్యం, తో పాటు క్రైస్తవమత వ్యాప్తి ఊపందుకుంది. 1903 లో పిఠాపురం సి బి యమ్ ఆసు పత్రి  ఆ తరువాత కాలంలో ఇదే క్రీస్టియన్ మెడికల్ సెంటరు సి యమ్ సి ఆసుపత్రిగా పిలవబడుతుంది.1905 లో పిఠాపురంలోనే సి బి యమ్ చర్చిని నియమించారు. దీనికి మొదటి పాస్టరుగా 

రాచపల్లి అప్పలస్వామి నియమించబడ్డాడు.నాగులాపల్లిలో  సి బి యమ్ చర్చి నెలకొల్పాడు ఈటన్ దొర.

తాతపూడి హానోకు సామర్లకోట సి బియమ్ స్కూల్లో 8 వతరగతి వరకూ చదివి కాకినాడ సి బి యమ్ బోర్డింగ్ హాయ్యర్ గ్రేడు చదివి ఉపాధ్యాయవృత్తికి అర్హత సాధించాడు. పండూరు నుండి శీలి మరియమ్మ కూడా  8 వతరగతి పూర్తిచేసి

ఇదే చోట బోర్డింగ్ హర్యర్ గ్రేడ్ లో చేరింది. ఆ రోజుల్లో హయ్యర్ గ్రేడు ట్రైనింగ్ పొందాలంటే ఒక సంవత్సరం సెమినార్ లలో పనిచేయాలి. అలా పనాచేసేటప్పుడే హానోకు మరియ్యమ్మల మనస్సులు కలిసాయి. పెద్దల అంగీకారంతో పెళ్ళి కూడా జరిగిపోయింది. ఇద్దరి జంటనూ ఆశీర్వదించిన ఈటన్ దొర నాగులాపల్లి నుండి ఇద్దరినీ ఉప్పాడలో  పరిచర్య చేయమని చెపుతూ   పాఠశాల స్దాపించి 

తొలి ఉపాధ్యాయులుగా నియమించాడు. 

మొదటగా అమీనాబాదలో వీరు పాఠశాల స్దాపించారు. వీరిని పెదమేష్టారు. పెద పంతులమ్మగారని పిలుస్తూ ఊరంతా మురిసిపోయేది.




 అది 1874  మార్చి 12 కెనడియన్ బాప్టిష్ట్ మిషన్ (సి బి యమ్ ) మిషన్ కార్యక్రమాలు కాకినాడలో ప్రారంబించాలని జాన్ మెక్లారన్   సి బి యమ్ చర్చిని కాకినాడలో ప్రారంబించాడు. మెక్లారన్ పర్యవేక్షణలో మిషనరీలు చర్చిలే కాకుండా దానికి అనుబందంగా పాఠశాలలు, ఆసుపత్రులు  శర వేగంగా తూర్పుగోదావరి జిల్లా అంతటా వివిధ ప్రాంతాలలో స్దాపించారు.పిఠాపురం,కాకినాడ మెక్లారన్ హైస్కుల్ , సామర్లకోట, రామచంద్రపురం పేరు పడ్డాయి. పిఠాపురంలో మిషనరీలు పరిచర్య ప్రారంబించిన తొలినాళ్ళలోనే 1876 ఆగస్టు 23 తారీఖున   అగ్రహారం  బండిరేవులో నాగులాపల్లికి చెందిన తాతపూడి సుబ్బయ్య పిఠాపురానికి చెందిన మేరి నరస్సయ్య  జాన్ మెక్లారన్ దొర గారి చేతుల మీదుగా బాప్తీస్మము పొందారు.తాతపూడి సుబ్బయ్య భార్యది చేబ్రోలు  దొండపాటి వారి అల్లుడు. ఇతనికి ముగ్గురు కొడుకులు. 

అందరిలో పెద్దవాడు హానోకు . తమ్ముడు గుర్రయ్య ,మరో తమ్ముడు ( పేరు తెలియాలి). హానోకు భార్య శీలి మరియమ్మ . పండూరు స్వగ్రామం.మరియమ్మ సోదరుడు శీలి సామ్యేలు.  అంటురోగాలైన కలరా ,మసూచి  జనాలను పట్టి పీడిస్తున్న రోజులవి. మిషనరీలు ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి వైద్యసేవలు అందిస్తున్న గొప్పరోజులు. డేరాలలో వెైద్యసేవలుతో పాటు చర్చి నడిపేవారు. పిఠాపురంలో 1901 లో ఈటన్ దొర ఫీల్డ్ మిషనరీగా నియమించబడ్డాడు. స్మిత్ దొర 

ఆసుపత్రి సూపర్ డెంట్ గా నియమించబడ్డాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో పిఠాపురం పరిసర పరిసరప్రాంతాలలో విద్య ఆరోగ్యం, తో పాటు క్రైస్తవమత వ్యాప్తి ఊపందుకుంది. 1903 లో పిఠాపురం సి బి యమ్ ఆసు పత్రి  ఆ తరువాత కాలంలో ఇదే క్రీస్టియన్ మెడికల్ సెంటరు సి యమ్ సి ఆసుపత్రిగా పిలవబడుతుంది.1905 లో పిఠాపురంలోనే సి బి యమ్ చర్చిని నియమించారు. దీనికి మొదటి పాస్టరుగా 

రాచపల్లి అప్పలస్వామి నియమించబడ్డాడు.నాగులాపల్లిలో  సి బి యమ్ చర్చి నెలకొల్పాడు ఈటన్ దొర.

తాతపూడి హానోకు సామర్లకోట సి బియమ్ స్కూల్లో 8 వతరగతి వరకూ చదివి కాకినాడ సి బి యమ్ బోర్డింగ్ హాయ్యర్ గ్రేడు చదివి ఉపాధ్యాయవృత్తికి అర్హత సాధించాడు. పండూరు నుండి శీలి మరియమ్మ కూడా  8 వతరగతి పూర్తిచేసి

ఇదే చోట బోర్డింగ్ హర్యర్ గ్రేడ్ లో చేరింది. ఆ రోజుల్లో హయ్యర్ గ్రేడు ట్రైనింగ్ పొందాలంటే ఒక సంవత్సరం సెమినార్ లలో పనిచేయాలి. అలా పనాచేసేటప్పుడే హానోకు మరియ్యమ్మల మనస్సులు కలిసాయి. పెద్దల అంగీకారంతో పెళ్ళి కూడా జరిగిపోయింది. ఇద్దరి జంటనూ ఆశీర్వదించిన ఈటన్ దొర నాగులాపల్లి నుండి ఇద్దరినీ ఉప్పాడలో  పరిచర్య చేయమని చెపుతూ   పాఠశాల స్దాపించి 

తొలి ఉపాధ్యాయులుగా నియమించాడు. 

మొదటగా అమీనాబాదలో వీరు పాఠశాల స్దాపించారు. వీరిని పెదమేష్టారు. పెద పంతులమ్మగారని పిలుస్తూ ఊరంతా మురిసిపోయేది.


Monday, November 30, 2020

కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం


 కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం




వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

బాలసాహితీ రచయిత

9908953245


జిల్లాలోనే సువిశాలతీరప్రాంతం కలిగిన మండలం తొండంగి మండలం ప్రత్యేకత కలిగి ఉంది. తీరప్రాంతం చోడిపల్లిపేట మొదలు /. యాదవులు,మత్య్సకారులు నివశిస్తా ఉన్నారు.1785 లో మెకంజీ సేకరించిన కైఫియ్యత్తుల్లో ఈ తీరప్రాంతం గురించి వివరంగా ఉంది. కాకినాడకు చెందిన బల్లోజి బాబా రాసిన తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో 

ఒక కైఫియత్తు అంతా దీనిగురించే ఉంది. బల్లోజిబాబా చరితార్దుడు అనడంలో సందేహం లేదు. 

1814 లో రాజమహేంద్రవరం జిల్లాగా ఉండే సమయంలో పిఠాపురం తాలుకాలో కోన అడవి గురించిన ప్రస్ధావన సంబరం కలిగిస్తుంది. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లో కూడా కోనఫారెస్టు అనే పిలుస్తున్నారు కూడా.ఈ కోనఫారెస్టు తూర్పున సముద్రం,పడమర పొన్నాడ, ఉత్తరంలో తొండంగి,వేమయి ( వేమవరం) గ్రామాలు ఉండేవి.ఈ కోన అడవిలో తిరిగే ఎడ్లు మామూలు ఎడ్లుకంటే బలిష్టంగా ఉండే కొమ్ములు తిన్నగా వంకరలేకుండా ఉండేవి. చప్పుడైతే చెంగు చెంగున పరుగులు తీస్తూ ఉండేవి. ఈ ఎడ్లు పగలు అడవిలో మేసి(గడ్డిపేట) రాత్రులు సముద్రపు కెరటాలు తగిలేలా పడుకుని సేదతీరుతూ ఉండేవి. వీటిని వేటాడం ఓ వినోదంగా ఉండేది. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడు, కపిలేశ్వరపురం జమిందారులు, ఫ్రెంచి,బ్రిటీషు కలెక్టర్లు తుపాకీలతో వేటాడేవారు. ఈ అడవిలో పుశిణిగ,దొర్నిగ,గొల్లు లాంటి గుబురు చెట్లు, కుంకుడు చెట్లు( పాత పెరుమళ్ళపురం ప్రాంతంలో చూడవచ్చు) పాలచెట్లు ఉండేవి.

చిన్ని చెట్లు అని పొదలు ఉండేవి. పాలచెట్లు చాలా పొడవుగా వుండేవి. పాలచెట్ల తొర్రలు మనిషి కూర్చునేంత ఉండేవి.ఆ రోజుల్లో ఈ పాలచెట్లు నరికి రైతులు తూములుగా చేసి వ్యవసాయం చేసుకునేవారు. ఈ అడవి అంతా పిఠాపురం జంమిందారు ఏలుబడిలో వుండేది. తేనెపట్లు అధికంగా ఉండేవి.అడవిలోకి వెళ్ళడానికి బయపడేవారు. తేనెటీగల ఝంకారంచేస్తూ గుంపులు గుంపులుగా అడవి అంతా పెద్ద శబ్దం చేస్తూ ముసురుతూ వుండేవి.

            చిన్నపూలచెట్లు పూలు బలే గమ్మతైన పూలు మంచి సువాసన భరితమైన పూలు. తేనెటీగలు ఈ పూలనుండి వరి చేల పువ్వారు నుండి తేనె సేకరించి పాలచెట్లతొర్రల్లో తేనెతుట్టలను పెట్టేవి. అడవి అంతా తేనె తుట్టలే . ఈ తేనె సువాసన భరితమై మహా రుచిగా ఉండేది.ఈ చిన్నపూల చెట్లతేనె నవంబరు మాసంలో దొరికేది. పిఠాపురం జమిందారులు  తేనె సేకరించేవారిని మకాం పెట్టించి తేనె పట్టుకెళ్ళేవారు. అయితే ఈ తేనె ఇప్పటి తేనెలా ఉండేది కాదు దీపావళి సామానుల్లో కలిపే సూరేకారంలా ఉండేది. పలుకులు పలుకులుగా ఉండేది. జమిందారులు మహా ఇష్టంగా తినేవారు. 

    తొండంగి, వేమవరం, పొన్నాడ పరిసరాల్లో వరి బాగా పండేది.  ఆ రోజుల్లో తొండంగి నువ్వుల పంటకు ప్రసిద్ది చెందింది. దేశం నలు మూలలనుండి నువ్వుల కొనుగోలుకు వ్యాపారులు వచ్చేవారు.కోనఫారెస్టులో ఇండ్లకు ఉపయోగించే కలపదొరికేది కాదు. చింతచెట్లు ( చింతకాయలపేట పేరు అందుకే వచ్చి ఉండవచ్చు ), వేపచెట్లు,తుమ్మచెట్లు,అడవి ఎద్దులు,గుబురుగా ఉన్న ముళ్ళపొదలు,తుప్ప అడవి విస్తారంగా ఉండేవి. ఈ వివరాలన్నీ బల్లోజి బాబా రాసిన మెకంజీ తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో దొరుకుతున్నాయి.ఇలాంటి మంచి పుస్తకాలను అందరూ చదవాలి ఆదరించాలి. పాఠశాలల లైబ్రరీలలో తప్పక ఉంచవలసిన పుస్తకం.


తీర గ్రామాలు ఎప్పుడు వచ్చాయి?

మెకంజీ 1814—1815 ఈ కైఫియ్యత్తులు సేకరించాడు. అప్పటికి ఇవి ఓ పదేళ్ళు వెనక రాసి ఉండవచ్చు. అంటే 1800 సంవత్సరానికి కోనప్రాంతం అడవిగానే ఉంది. సువిశాలమైన భూభాగం ,తీరప్రాతం ఉండటంతో దేశంలోని మత్య్సకారుల దృష్టి ఈ ప్రాంతం పై పడింది. ఆ క్రమంలో మెల్లగా వలసలు బర్మా, ఒరిస్సా,పూరి,మచిలీపట్నం,యానం,పాండిచ్చేరి,తమిళనాడు, ఇలా తీరప్రాంతాలనుండి వలసలు పెరిగాయి. మెల్లగా 1850  తరువాత మనం చూస్తున్న గ్రామాలుగా ఏర్పడ్డాయనుకోవచ్చు. ఎడ్లు లెక్కకు మిక్కిలి సహజంగా దొరుకుతున్నాయి కాబట్టి యాదవులు వచ్చి చేరి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఆవులమంద,గడ్డిపేట లాంటి గ్రామాలు ఏర్పడ్డాయనుకోవచ్చు.



 


కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం*


 *కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం*

వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ (జనశ్రీ)

ఆంగ్ల ఉపాధ్యాయులు

బాల సాహితీ రచయిత


  తన నివసిస్తున్న చోటు ఏ నాటిదో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరికీ వెంటాడుతూ ఉంటుంది.తాతముత్తాతల గురించి వింటేనే మనసు పులకరిస్తుంది.ఓ ఉద్వేగం ముసుకుంటుంది. దాని ఆత్మీయత బావన స్పర్శ దేనికీ సాటిరాదు మరి.కొత్తపల్లి మండలం వేల సంవత్సరాల నాటిదే అంటే ఓ క్షణం దిగ్బ్రమ కలగకమానదు. కాని కొంత మంది అవును అంటారు కాని ఏమీ చెప్పలేరు. అయితే మన పూర్వీకులు ఎంత గొప్పవారంటే తాటాకుల పత్రాలలోను, రాగిరేకుల్లో, శాసనాలలోను స్ధానిక చరిత్రలు రాసుకునేవారు. వాటిని దండకవిలెలు అనేవారు. వీటికి విలువ వుండేది కాదు. ఆనాటి సంస్కృతాంధ్ర కవితాఘోషలో వీటి శబ్దం అస్సలు వినిపించేది కాదు. అయినా కరణాలు, జమిందారులు వారి వంశ చరిత్రకోసం రాయించుకునేవారు. అయితే అవి కొంత కాలానికి కనుమరుగయ్యేవి. అవ్వవా  మరి గ్రంధాలయాలు ఉన్నాయా ఏమిటి ఆరోజుల్లో  అయితే ఓ మహానుబావుడుకి ఆ విలువ తెలిసింది అవి అపురూపమనిపించింది. అంతే తన జీతభత్యాలు త్యాగంచేసి వీటిని సేకరించాడు. మామూలుగా కాదు ప్రపంచంలో  ఇప్పటి వరకూ మానవమాత్రుడు ఎవరూ  చేయనంత సేకరణ. ఇప్పటికీ కొన్ని వేల సేకరణలు అలాగే వున్నాయి. పరిశోధకులు నిత్యం పనిచేస్తున్నా తరగడం లేదు. ఆయన ఎవరో కాదు మెకంజీ .స్కాట్లాండు దేశస్దుడు. 1783లో సర్వేయరుగా భారతదేశం వచ్చాడు. ఆయనికి ఈ దండకవిలెలు ఆశ్చర్యమనిపించింది. వీటి సేకరణకు ముందు బ్రిటీష్ వారు నిదులిచ్చినా  ఆ తరువాత ఆపేశారు. సమకాలీకులు పనికిరాని వస్తు సేకరణ అన్నారు. అయితేనో బుర్రయ్య అనే బహుబాషా కోవిదుడిని ప్రక్కన పెట్టుకుని ఊరూర పంపించి సేకరించాడు. ఈదండకవిలలనే  మహ్మదీయులు ఆ తరువాత కఫీయ్యత్తులుగా పిలిచేవారు. ఇది ఉర్దూ పదం నుండి వచ్చింది. కఫియ్యత్ అంటే సంగతులు, విశేషాలు అని అర్దం  వీటికి ఆ పేరే వాడుకలో ఉండి పోయింది.

      మెకంజీ 1784—1790 ప్రాంతంలో రాయలసీమలో ఉన్నాడు. అక్కడ నుండే కఫియ్యత్తులు సేకరించాడు.వాటిలో తూర్పుగోదావరివి 10 ఉన్నాయి. 

వీటిని 600 సంవత్సరంలో కొంకిపర్రు అని,1700 సంవత్సరంలో కాకినాడు అని ఇప్పుడు కాకినాడ  అని పిలిచే కాకినాడలో ఉండే మహానుబావుడు బల్లోజి బాబా వెలుగులోకి తెచ్చాడు.తూర్పుగోదావరి కఫియ్యత్తులు పిఠాపురం,పెద్దాపురం,కాకినాడ పరిసర ప్రాంత గ్రామాల చరిత్రలను జమిందారుల చరిత్రలు  తెలుపుతుంది. ఇందులో కొత్తపల్లి గ్రామం గురించి పెద్దగా తెలియకపోయినా మండలానికి సంబందించి ఓ స్పష్టత మరి కొంత సమాచారం దొరకడం నిజంగా కొత్తపల్లి వాసులం అందరం మెకంజీ మహాశయునికి ఋణపడి వున్నాం.  


         మనం త్రిలింగదేశం మధ్యలో ఉండే ఆంధ్ర ప్రాంతవాసులం.ఈ ప్రాంతం ప్రొలునాడు(పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు,తుని, పెద్దాపురం)  కిమ్మూరులోపరగణాలో ఇసుకపల్లి కొత్తపల్లి.చెల్లూరు పరగాణాలో పొన్నాడ, కొమరిగిరి ఉండేవి. 

     అంతకుముందు చూసుకుంటే1087నుండి 1093 వీరచోడుడు పరిపాలనలో వేంగీరాజ్యంలో ( శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం) మనం ఎక్కువగా పరిపాలించబడ్డాం. 

1182 నాటికే సంపర పేరు కనబడుతుంది. పిఠాపురం కుంతీమాదవస్వామి ఆలయంలోని శాసనంలో 1187 లో నవఖండ్రవాడ,కొండెవరం గ్రామాలను ఏర్పరచి కుంతీ మాధవస్వామికి దానంగా ఇచ్చినట్టుఉంది. బహుశా ఇవి ప్రొలునాడుకు దగ్గరగా ఉండటం వలన కాబోలు.అయితే పూర్వం సంపర నియోకవర్గం అక్కడ కొంత ఇక్కడ కొంత ఎలా ఉండేదో పూర్వం కొత్తపల్లి మండలం కూడా అలాగే వున్నట్టు కనబడుతుంది. ఇసుకపల్లి పూర్తిగా వేరే పరగణాలో ఉండేది. ఉప్పాడ గ్రామం గురించి ఆఖరున తెలుసుకుందాం.


కొమరిగిరి

   1353 లో వేమారెడ్డి తరువాత పెద వెంకప్ప జమిందారీ ఏలుబడిలో కొవ్వాడ ,కొత్తపల్లి,  పొన్నాడ ఉన్నాయి. పెద వెంకప్ప తరువాత విస్సామ అనే మహిళ పరిపాలించింది.1399 లో కొమరగిరికి చెందిన గోగ్గయ రాజు పిఠాపురం కుంతీమాదవస్వామికి బృందావనం చేయించి ఇచ్చాడు. వేంగీరాజ్య పాలకుడు రెడ్డిపరిపాలకుడు కాటమవేమారెడ్డి అతని కుమారుడు కుమారగిరి రెడ్డి పేరు మీద కొమరగిరి 1422 లో ఏర్పడింది. చెల్లూరు పరగణాలో ఉన్న కొమరగిరిని కూమారగిరిరెడ్డి విష్ణుభట్టారకుడు అనే బ్రాహ్మణుడికి కరణీకంగా ఇచ్చాడు.అతను అగ్రహారం కట్టించాడు. ఓ ఐదు బ్రాహ్మణ కుటుంబాలు శొంటివారు,ఆదిరాజు వారు ,వెదురూరు వారు,కంభంపాటి వారు ఉండేవారు. కొండెవరంలో కొంత భూమిని దానం చేసి తామ్రపత్రాలు రాసి వంశపారంపర్య హక్కులిచ్చాడు. ఆంధ్రాకు బ్రాహ్మణులు తమిళనాడు నుండి ఎక్కువగా వచ్చారు. వంద సంవత్సరాల తరువాత అగ్రహారం అగ్నికి ఆహుతి అయ్యింది.మద్దాల అప్పలరాజు అనే ఆయన మరలా ఇళ్ళుకట్టించాడు.కొమరగిరికి ఉత్తరాన చెరువు తవ్వించాడు. దక్షిణం వైపు తమ్మవరం కూడా ఆనాటి నుండి ఉంది. తమ్మసాని ఉండేది మేడలో అందుకే తమ్మవరం అని పేరు వచ్చింది.కొమరగిరి మాదన్న అనే వెలమవారు విష్ణుఆలయాన్ని కట్టించాడు. కొమరగిరిలో మల్యాల వెంకట్రావు ఒక శివాలయం కట్టించాడు.అరవైపుట్ల భూమి కేటాయించి ఉత్సవాలు చేసేవాడు.కొమరగిరిని కుమారగిరిరెడ్డి 14 సంవత్సరాలు పరిపాలించాడు.ఒకప్పుడు మండలానికి తలమానికమై భాసిల్లన గ్రామం మండలం మూలలో నిశ్శబ్దంగా మనుగడ సాగించడం కాలం మార్పుగా భావించవచ్చు. ఈ కఫీయ్యత్తును  చెల్లూరు కరణం శీతన్న రాయిస్తే వెంకటశాస్త్రి రాసినట్లుంది.

నిస్సంకుల నాయన


కపిలేశ్వరపురం రాజు దేవుమహారాజు అనుగ్రహంతో నిస్సంకులనాయన అనే బ్రాహ్మణుడు పొన్నాడ,ఇసుకపల్లి కలిపి 21 గ్రామాలు కరణీకం రాయించుకున్నాడు. అతని దగ్గర గుమాస్తాలుగా పనిచే ముగ్గురు గుమాస్తాలు వడ్డావు మారకొండయ్య,నండూరి తిమ్మరాజు,తోలేటి వీర్రాజు, మోసంచేసి రాజమండ్రికి చెందిన కాటంపల్లి వీరయ్య తో చేతులుకలిపి 21 గ్రామాలను నిస్సంకుల నాయన నుంచి లాక్కుని పంచుకుంటారు. పంపకంలో 1573 లో అయ్యపటనేని మార్కండ్రాజు పొన్నాడకు కరణీకం రాయించుకున్నాడు.

1671—79 లో పిఠాపురం జంమిందారు తెలుగు రాయినంగారు

ప్రోలునాడు పరిపాలిస్తున్నపు అతని ఆఖరి కొడుకు రంగసాయి గొల్కొండ నవాబు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. మంచి చదరంగం ఆటగాడు. ఒకరోజు ఆటలో నవాబు అబ్దుల్ హుస్సేన్ ఓడిపోతే రంగసాయి కత్తితో పొడుకుని స్వామి భక్తిని ప్రదర్శిస్తాడు.హుస్సేన్ రంగసాయి ప్రేమకు ముగ్దుడై అతని అన్నలు రావుచందర్రావు,రావు జగ్గారావు ప్రొలునాడు అప్పగిస్తూ పిఠాపురం కోటను ఇస్తాడు. వీరి హయాంలోనే ఏలేరు నదీ నీళ్ళు కిమ్మూరులో పరగణాలో ఉన్న కొత్తపల్లి, ఇసుకపల్లికి ప్రొలునాడు( పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు) మండలాలకు పంచారు. ఆనాటి నుండి మనం ఏలేరు నీళ్ళు సాగుకు ఉపయోగిస్తున్నాం.


కొత్తపల్లి గ్రామం


కొత్తపల్లి గ్రామం కాకినాడ డివిజన్ లో ఎలా అయితే ఉందో ఆశ్చర్యంగా 1080ఆనాటి నుండి కొంకిపర్రు(కాకినాడ), 1420 చెల్లూరు పరిగణాలోను ఉంటూ వస్తుంది. గజపతులు బెజవాడలో రావు వంశీకులను గానుగ ఆడించి చంపడంతో  పిఠాపురం,పెద్దాపురం సంస్దానాలకు వచ్చేస్తారు.  వీరి చరిత్రను పిఠాపురం పెద్దాపురం, చిత్రాడ  రావు వంశీకుల క్రమాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే కొత్తపల్లి వేయి సంవత్సరాల నుండి ఉన్నా వేంగీ పరిపాలనలోనే ఉంది. ఇక పిఠాపురం పెద మహీపతిరావు పెద్దాపురం వత్సవాయిని ఆడపిల్లలకు కట్నకానుకలుగా కోరడంతో బహుశా కొత్తపల్లిని పెద్దాపురం వత్సవాయి ఇచ్చి ఉండవచ్చు అక్కడ నుండి కొన్ని రావు వారి కుటుంబాలు కొండెవరం, కొమరగిరి, కొత్తపల్లికి17 వ శతాబ్దం మొదటిలో తరలి వచ్చాయి. వీరి రాకతో కొండెవరం పిఠాపురం సంస్దానానికి దగ్గరగా ఉండటంతో కొండెవరం ఒ వెలుగు వెలిగింది. అది చెలికాని రామారావు వరకూ సాగింది.క్రమంగా అక్కడ ప్రభావం చూపేవారు తగ్గిపోవడంతో కొత్తపల్లి 1900 దశకంలో వెలుగులోకి వచ్చింది. ఇసుకపల్లి, పొన్నాడ, కొమరగిరి మెల్లగా ప్రాభవం కోల్పొయాయి. వీరి వంశీకుల చరిత్ర పిఠాపురం, పెద్దాపురం రావు వారి క్రమాన్ని చూస్తే తెలుస్తుంది.

ఉప్పాడ గ్రామం

ఇది కైఫియ్యత్తులో ఎక్కడా కనబడదు. సముద్రతీర ప్రాంతమైన కొమరగిరి అనే కనబడుతుంది.అయితే కైఫియతుల ప్రకారం

కొత్తపల్లి తరువాత సముద్రపు తీర ప్రాంతం వరకు దట్టమైన కీకారణ్యం అని చెప్పబడింది.

ఇది 1700 వరకు కీకారణ్యంగానే ఉంది. పిఠాపురం జంమిందారు ,కలెక్టర్లు తుపాకీతో వేటకు వచ్చేవారని చినపువ్వు తెనే కైఫియత్తులో తెలుస్తుంది. కోన ఫారెస్టు అంటే ఉప్పాడ మొదలు వేమవరం వరకూ అతి భయంకరమైన కీకారణ్యం అని చెప్పబడింది. 17 వ శతాబ్దం చివరలో గ్రామం ఏర్పడినట్లుంది నిర్దారించవచ్చు. బ్రాహ్మణులు కొత్తపల్లి నందు ఆయుర్వేద వైద్యం చేస్తుండేవారు వారిలో పాలంకి వారు ఆయుర్వేదం, సన్నిది రాజు

 వారు పౌరహిత్యం చేస్తూ ఉప్పాడలో స్ధిరపడి వుండవచ్చు. వీరితొ పాటే గ్రామం అభివృద్ది చెంది వుండవచ్చు. ఎందుకంటే 17 వ శతాబ్దం చివరలో సన్నిదిరాజు జగ్గకవి రచించిన కురవంజీ అనే తిన్నడు కధను స్వయంగా రాసి వీధి నాటకంగా ప్రదర్శింపచేసేవాడు. వీరి వంశీకులు ఇప్పటికీ పౌరహిత్యం చేస్తున్నారు.ఇక మత్య్సకారులు 1700 శతాబ్దంలో నుండి పూరి, మచిలీపట్నం, బర్మా,ఒరిస్సా,విశాఖ ప్రాంతాలనుండి వలసలు వస్తూ కొనఫారెస్టు వెంబడి స్దిర నివాసం ఏర్పరచుకున్నట్టు ఖాయంగా కనబడుతుంది.


కృతఙ్ఞతలు

బల్లోజు

తూర్పుగోదావరి జిల్లా

కైఫియ్యత్తులు నుండి




సన్మాన పత్రం సుగుణక్క

 ఓ  ముగ్ద సుఖుమార సుగుణ సుసంపన్నరాశి మృదు మధుర సంభాషిణీ నిర్మలహృదయ గురుకులమణి దీప్తి , మా మనో  స్పూర్తి నేత్రి ,ఆదర్శమార్తీమణి మన అందరి ప్రే...