Sunday, June 12, 2022

పులి

 





ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై అధ్యయనం

ఇది ఒడిశా అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న అటవీ శాఖ

దాని రూటు, ఆ ప్రాంతంలో ఉన్న పులుల గురించి తెలుసుకునేందుకు కసరత్తు

ఏపీ-ఒడిశా మధ్య పులుల కొత్త కారిడార్‌పై ఊహాగానాలు

సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది

దాన్ని పట్టుకోవడంతోపాటు అది ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందో తెలుసుకోవడం సవాలుగా మారింది. గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. తొలుత.. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు గ్రామాల్లో పశువులు మాయమవడంతో మొదట ఏదో అడవి జంతువు వచ్చినట్లు భావించారు.

వరుసగా పశువులు మాయమవుతుండడం, వాటి కళేబరాలు కనబడుతుండడంతో స్థానికులు పులి తిరుగుతున్నట్లు చెబుతూ వచ్చారు. దీంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అడుగుల ముద్రలు ఇతర గుర్తుల ఆధారంగా దాన్ని పులిగా నిర్థారించారు. మొదట్లో అది పోలవరం ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో తిరిగింది. ఆ తర్వాత ఆహారం, నీరు దొరికే ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ వచ్చింది.

దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు కెమెరాలు ఏర్పాటుచేశారు. కొన్నిచోట్ల బోన్లు పెట్టినా అది చిక్కలేదు. పులుల సంచారం, వాటిని దారి మళ్లించడంలో నిష్ణాతులైన శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టు సిబ్బంది అక్కడికి వెళ్లి పులిని పట్టుకోవడం లేదా దారి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఆ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేసినట్లు కాకినాడ డీఎఫ్‌ఓ ఐకేవీ రాజు తెలిపారు.

ఒడిశా నుంచే వచ్చిందా?
3-4 ఏళ్ల వయసున్న ఈ పులి ఒడిశా అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు, విశాఖ అటవీ ప్రాంతం మీదుగా ఇది ప్రత్తిపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీ శాఖ అంచనా వేస్తోంది. పాపికొండల అభయారణ్యంలో నాలుగైదు పులులు ఉన్నా ఇది అక్కడి నుంచి వచ్చింది కాదని చెబుతున్నారు.

ఇది కచ్చితంగా ఒడిశా నుంచి వచ్చిందే అయ్యుంటుందనే ఉద్దేశంతో అటువైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని గురించి తెలుసుకునేందుకు అటవీ శాఖ ఇప్పటికే ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ)ని సంప్రదించారు. ఒడిశాలోని సత్‌కోసియా, సిమిల్‌పాల్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతాలు, వాటికి ఆనుకుని ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో ఉన్న పులుల వివరాలను సేకరిస్తున్నారు.

అక్కడి నుంచి ఇది ఏపీకిలోకి ప్రవేశించిందా అన్న కోణంలో విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా దేశంలోని టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లో ఉన్న పులుల వివరాలన్నీ ఎన్‌టీసీఏ వద్ద ఉంటాయి. కెమెరాల ట్రాప్‌ ద్వారా ఆ టైగర్‌ రిజర్వులోని ప్రతి పులికి ఒక కోడ్‌ ఇచ్చి గుర్తిస్తారు. అలా అక్కడి జాబితాలో ఉన్న పులులతో ఇక్కడ తిరుగుతున్న పులిని పోల్చి చూస్తారు.

ఇది ఆ జాబితాలోని పులేనా!?
ఒకవేళ ఇక్కడ తిరుగుతున్న పులి ఆ జాబితాలోనిది అయితే అది ఏ మార్గంలో వచ్చిందో అధ్యయనం చేస్తారు. అదే జరిగితే ఈ మార్గం గుండా కొత్త పులుల కారిడార్‌ ఏర్పడినట్లే. అంటే ఏపీ, ఒడిశా మధ్య కొత్త పులుల కారిడార్‌ ఏర్పడినట్లు నిర్థారిస్తారు. ఇటీవల నల్లమల నుంచి శేషాచలం అడవులకు ఇలాగే కొత్త పులుల కారిడార్‌ ఏర్పడింది.

ఇదే తరహాలో కొత్త కారిడార్‌ ఏర్పడిందా అనే అనుమానాలు అటవీ శాఖాధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ, దీన్ని నిర్థారించడం అంత సులువు కాదని, ఎన్నో అధ్యయనాలు, ఆధారాలు కావాలని చెబుతున్నారు. అక్కడి పులుల జాబితాలో ఇది లేకపోతే ఈ పులి ఎక్కడిదో అన్నది మిస్టరీగానే ఉండే అవకాశం ఉంది. లేకపోతే అక్కడి కెమెరా ట్రాప్‌లకు దొరక్కుండా అయినా ఉండాలి. ఇవన్నీ తెలియాలంటే చాలా సమయం పడుతుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అందుకే ఎన్‌టీసీఏ ద్వారా ఈ పులి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు

శంఖవరం, జూన్‌ 12: ఇరవై రోజులుగా సంచలనం సృష్టిస్తున్న పెద్ద పులి కత్తిపూడి నల్లకొండపై తిష్టవేసింది. సబ్‌ప్లాన్‌ మైదాన ప్రాంతం నుంచి రిజర్వు ఫారెస్టు దాటుకుంటూ హైవేకు కూతవేటు దూరంలో ఉన్న నల్లకొండపై శనివారం రాత్రి వజ్రకూ టం శివార్లలో ఆటోకి అడ్డుపడింది పెద్దపులే అని అటవీ అధికారులు గుర్తించారు.

వర్షంవల్ల పాదముద్రలు అక్కడ కనిపించకపోయినా పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో దాని ముద్రితమై ఉన్నాయి. కత్తిపూడి ట్రక్కులేబై సమీపంలోను, రామన్నపాలెం సమీపం కొండల్లోను వీటి ముద్రలు అధికంగా కనిపించాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోనే పెద్దపులి రాత్రి బస చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పెద్దపులి తిరిగాడే ప్రాంతం, అది తిరిగే అవకాశం ఉన్న ఐదు కీలక ప్రదేశాలను గుర్తించి ట్రాఫికింగ్‌ కెమెరాలను అధికారులు అమర్చారు.

బోనులకు చిక్కకుండా తప్పించుకుంటూ..

పెద్దపులి వారంరోజులుగా ఏ జంతువునూ వేటాడకపోయినా పాదముద్రల ఆధారంగానే తన ఉనికిని చాటుతోంది. వాటి ద్వారానే అధికారులూ దాన్ని వెంబడిస్తున్నారు. ఎక్కడికక్కడ బోనులు ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఎక్కడా వాటికి చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. మత్తుమందు ఇచ్చే ప్రయత్నమే చేయాలని ఎన్‌ఎస్‌ఆర్‌ అధి కారి ఒకరు అభిప్రాయపడ్డారు. అలా మత్తు మందు ద్వారా పులిని పట్టాలంటే అను కూల ప్రదేశం కావాలని, చెరువులు, పోలవరం పెద్దకాలువలూ ఉండకూడదని ఆయన చెప్తున్నారు. శని, ఆదివారాల్లో పెద్దపులి తి రిగాడిన ప్రదేశం మైదాన ప్రాంతంగా గు ర్తించారు. ఈ ప్రాంతంలో మత్తు ఇవ్వడానికి అనుకూలంగానే ఉంటుందంటున్నారు.

భయాందోళనలో ప్రజలు

కత్తిపూడి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతుందనే సమాచారంతో కత్తిపూడి, వజ్రకూటం, నెల్లిపూడి పరిసర ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పులి పాదముద్రలు కనిపించడంతో పరిసర ప్రాంత రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు. పులి సంచరించే ప్రాంతంలో ప్రజలు కలియ తిరగకుండా ఉండాలని, దానివల్ల పులి దాని రూటు మార్చుకుంటుందని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు



ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : జూన్ 12 ( హిం స)

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ మర్రి చెట్టు వద్ద పులి సంచరిస్తోంది.


శనివారం రాత్రి వజ్రకూటం నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో పైకి పెద్ద పులి దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. పులి పాదముద్రలను సేకరించిన అటవీ శాఖ అధికారులు.. తొందరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు. పులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు.





Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజలను పులి భయం ఇంకా వీడడం లేదు. పులి ఏదో దిక్కున కనిపించి హడలెత్తిస్తుంది.


అటవీశాఖ అధికారులకు చిక్కకుండా జనాలకు కనిపిస్తూ గుండెల్లో గుబులురేపుతోంది. తాజాగా శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ వద్ద బెంగాల్ టైగర్ సంచారం చేసినట్లు తెలుస్తోంది. వజ్రకూటం నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ కి పెద్దపులి కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తోంది.




కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజలను పులి భయం వీడడం లేదు. పులి ఏదో దిక్కున కనిపించి హడలెత్తిస్తోంది. అటవీశాఖ అధికారులకు చిక్కకుండా జనాలకు కనిపిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.


లేటస్ట్‌గా శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ దగ్గర ఈ బెంగాల్ టైగర్ సంచారం చేసినట్లు తెలుస్తోంది. వజ్రకూటం నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ కి పెద్దపులి కనిపించింది.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తున్నారు.





Bengal tiger: ఈ మధ్య కాలంలో పులులు జనవాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి. అడవులను వదిలి పరిసర ప్రాంతాలు, పొలాల్లోకి రావడంతో భయాందోళన వ్యక్తం అవుతోంది.


ఇక ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ మర్రి చెట్టు వద్ద బెంగాల్ టైగర్ (పులి) సంచరిస్తోంది. తాజాగా శనివారం రాత్రి వజ్రకూటం నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో పైకి పెద్ద పులి దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారు.

పులి పాదముద్రలను సేకరించిన అటవీ శాఖ అధికారులు.. తొందరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు. బెంగాల్‌ టైగర్‌ సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఎవ్వరు కూడా బయటకు రాకూడదని అటవీ శాఖ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.




మూడు నుంచి అయిదేళ్ల లోపు వయసు ఉన్న రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఇరవై రోజులుగా అటవీ ప్రాంతానికి కూతవేటు దూరంలోని మైదాన ప్రదేశాల్లో తిరగడం విశేషమే.


యవ్వనంలో ఉన్న ఈ బెబ్బులి ఇక్కడ ఇన్ని రోజులు ఎందుకు ఉంది? ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఎందుకు తిరుగుతోందన్నది ఆసక్తికరంగా మారింది.

పాదముద్రలే ఆనవాళ్లు

పెద్దపులి ఒక చోటకు పరిమితం కావడం లేదు. శనివారం రాత్రి వజ్రకూటం సమీపంలోని రెండు కొండల మధ్య ఆటోలో వెళ్తున్నవారి కంటపడి అలజడి రేపింది. వజ్రకూటం, రామన్నపాలెం, కత్తిపూడి గ్రామాల పరిధిలోని కొండల్లో పలుచోట్ల దాని పాదముద్రలు గుర్తిచారు. జాతీయ రహదారికి 5 కి.మీ. లోపే సంచరించడంతో యంత్రాంగంలోనూ మరింత ఆందోళన పెరిగింది. ఎన్‌ఎస్‌టీఆర్‌ డీఆర్‌వో ప్రసాద్‌రెడ్డి బృందం ఆ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.

20 రోజులుగా ఇక్కడే...

జిల్లా కేంద్రం కాకినాడకు 40 కిలోమీటర్ల దూరంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, గొల్లప్రోలు మండలాల మధ్య 20 రోజులుగా పులి సంచరిస్తోంది. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, కొడవలి, వజ్రకూటం ప్రాంతాలు కొండలు, వాగులు, పుష్కర, ఏలేరు కాలువలతో ఉంటాయి. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు, చెట్లతో ఉన్న మెట్టలు అడవిని తలపిస్తాయి. ఇదే అనువుగా బెబ్బులి భావించి ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆకలికి మించి వేటాడని, బోనులో ఎరవేసినా.. లొంగని వ్యాఘ్రం ఇప్పటికి అయిదు పశువులను వధించింది. దాన్ని తిరిగి అడవిలోకి పంపాలనే మంత్రాంగాన్ని తిప్పికొడుతూ ఇక్కడిక్కడే తిరుగుతోంది.

ఎందుకు ఉందంటే..?

* పులి ఇన్ని రోజులు అటవీప్రాంత సమీప మైదానంలో తిష్ఠ వేయడానికి కారణాలను వన్యప్రాణి, అటవీ అధికారులు విశ్లేషించుకుంటున్నారు.

పులి కౌమారదశకు చేరినపుడు అదో ప్రత్యేక భూభాగాన్ని (టెరిటరీ) ఖాయపరుచుకుంటుంది. మగ పులి 25 నుంచి 40 చ.కి.మీ. విస్తీర్ణాన్ని తన రాజ్యంగా భావిస్తుంది. తన కదలికలు, ఉంచే ఆనవాళ్లతో మిగతా జంతువులు పులి ఉనికిని గుర్తిస్తాయని చెబుతున్నారు. వేటకు అనువుగా ఉన్న పరిస్థితులను అది చూసుకుంటుంది.

పులి ఉండే తన సహజ ఆవాసంలో పరిస్థితులకు విఘాతం కలిగి ఉండవచ్ఛు అడవుల్లోనూ ఏదో రూపేణా జనం చేసే చప్పుళ్లు కారణం కావచ్ఛు రిజర్వు ఫారెస్టులనే ఖనిజ తవ్వకాలకు, ఇతర క్వారీలకు కేటాయిస్తున్నారు. విశాఖ మన్యం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపప్రణాళిక మన్యం వంతాడ, ఏజెన్సీ వరకూ జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం కాగా..వన్యప్రాణులు జనం బాట పట్టడానికి ఇదో కారణం.

ఆహార పిరమిడ్‌లో ప్రాథమిక లబ్ధిదారులు శాకాహార జంతువులు, వాటిపై ఆధారపడే మాంసాహారులు వీటిని నియంత్రించే పులి, చిరుత, సింహం. ఆహార సైకిల్‌కు భంగం అనిపించిన పరిస్థితుల్లోనూ వన్యప్రాణులు పక్కచూపు చూస్తాయి. మన్యం చేరువగా ఉన్న ఈ ప్రాంతంలో పాడిపశువులు, అడవి పందులు, కణుజులు, గొర్రగేదెలు పులి పరిశీలనలో ఉండడం వల్లే ఇన్నిరోజులు తిష్ఠ వేసిందనుకుంటున్నారు.

బైనాక్యులర్‌లో కనిపించినంత కంటి దృష్టి ఉండే పెద్దపులి చురుకుదనమూ అంతే.. తనచుట్టూ జరుగుతున్న అలికిడిని ఎంతదూరంలో ఉన్నా పసిగడుతోందని భావిస్తున్నారు.




అడవికి మళ్లేలా...

పులి అని గుర్తించినప్పటి నుంచి దానిని అడవిలోకి పంపే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. యుక్త వయసులో ఉన్న మగ పులి అది. తెలివిగానూ తిరుగుతోంది. ఒక ప్రాంతానికి పరిమితమై సంచరించడం లేదు. అందుచేత దాని గమనాన్ని పరిశీలిస్తూ ఊళ్లలోకి రాకుండా పెట్రోలింగ్‌ చేయడమే కీలకం. ఇప్పటివరకు అది పశువులనే వేటాడింది. ప్రజలకు హాని కలగకుండా చూస్తాం.

-సెల్వం, వన్యప్రాణి విభాగం డీఎఫ్‌వో









No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...