Saturday, June 24, 2023

స్టోరు లైన్లు

 హీరో లోయలో పడిపోతాడు

ఆ లోయలో పడ్డవారు త్వరత్వరగా ముసలి వారై చనిపోతారు

లోయనుండి బయటకు రాగానే పోయిన యవ్వనం వస్తుంది


హీరో తిరిగి తన యవ్వనాన్ని ఎలా పొందాడో

అన్నది స్టోరీ లైన్


వేలాది డ్రోన్లు ఒక్కసారిగి

శత్రులపైకి రావడం



గ్రహాంతర వాసులు భూమిని చేరుకునే క్రమంలో

భూమిపైన శాటిలైట్స్ సిగ్నల్ ని ఆపి భూమిని చేరుకుంటారు. ఈ విషయం సైన్టిస్ట్ జాన్సన్ కు తెలుస్తుంది హెచ్చరిస్తాడు పట్టించుకోరు. కాని తనను వ్యతిరేకించే మరో సైన్ టిస్ట్ సపోర్టు చేస్తాడు . ప్రభుత్వం పని అప్పగిస్తుంది. గ్రహాంతరవాసులు ఎందుకు వచ్చారు? తిరిగి వెళ్ళారా?వారిని జాన్సన్ చూసాడా?గ్రహాంతరవాసులను ప్రభుత్వం నిర్భందిస్తే వారిని క్షేమంగా ఎలా తిరిగి పంపాడు?



హీరో హీరోయిన్ ట్రావెల్ టూర్ లో తుఫాను వలన దారి తప్పి భయంకరమైన దీవిలో చిక్కుకుపోతారు

అక్కడ గుహలో వారికి ఒక ముసలి వ్యక్తి నివసించడం చూస్తారు 

ఆ వ్యక్తి జబ్బుపడి ఉంటే సపర్యలు చేస్తారు

అతను బాగుపడిన తరువాత వారికి వివరాలు చెబుతూ తనో సైన్టిస్ట్ నని time mission


కనుగొన్నానని దానిద్వారా ప్రయాణిస్తూ ఉంటే వేరే గ్రహానికి పొరపాటున చేరుకున్నానని

ఆగ్రహాంతర వాసులు టైమిషను వివరాలు చెప్పమని వేదిస్తే వారి నుండి తప్పించుకుని వచ్చి ఈ దీవిలో వారికి దొరక కుండా నివసిస్తున్నానని అంటాడు.

హీరోయిన్ సైన్టిస్ట్ ను ఉబ్బించి టైంమిషనులో తను కోరుకున్న రోజుల్లోకి తీసుకెళ్ళమని అడుగుతుంది

వాళ్ళందరు వెళ్ళి వస్తారు


ఒకరోజు సైంటిస్ట్ కనబడడు

అతనిని గ్రహాంతరవాసులు తుసుకుపోతారు

టైమిషను ఉపయోగించి హీరో సైంటిస్ట్ ను ఎలా కాపాడాడనేదే సినిమా




007  చేతికి ఓ నీటి బాటిల్ దొరకుతుంది

అది పరిశీలనకు లాబ్ కు పంపిస్తే ఆ నీరు చంద్రమండలంపై దొరికే నీరని

అది అమృతంతో సమానం అని

ఆ నీరు తాగితే మనుషులకు మరణం లేదని తేలుతుంది


పురాణహితిహాసం

స్తుతం మనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవం మీదకు చేరబోతోంది. చంద్రుని దక్షిణ ధృవం లో ఎలాంటి కొత్త విషయాలు అన్వేషించ బోతున్నాము?



, అక్కడ నీటి లభ్యత ఎలా ఉంటుంది?, దాని లక్షణాలు. అలాగే చంద్రుని పై మట్టి పొరలు వాటి లక్షణాలు, సాంకేతికంగా, మానవాళికి వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వంటి అంశాలను తెలుసుకుంటాం.

చారిత్రకంగా చూస్తే , ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు పంపిన చంద్రయాన్ ఉపగ్రహాలన్నీ చంద్రుని ఉత్తర ధృవం మీదకు మాత్రమే చేరగలిగాయి . దక్షిణ ధృవం మీదకు కొన్ని ఉపగ్రహాలు పంపగలిగినా అక్కడ పరిశోధనలేమీ జరగలేదు. ఇప్పుడు మనం పంపిన చంద్రయాన్-3.. దక్షిణ ధృవం మీద దిగుతూ, రోవర్ సహాయంతో 14 రోజుల పాటు జరపబోయే ప్రయోగాల మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.

మన భారతీయ వేద విజ్ఞానం, పురాణాలూ ఇతిహాసాలు , యజ్ఞ యాగాదులలో కూడా ఖగోళ రహస్యాలను, గ్రహగతులు, లక్షణాల గురించిన విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు మన భారతీయ సాంప్రదాయంలో జరుపుకునే యజ్ఞ యాగాదులలో , సత్యనారాయణ స్వామి వ్రతంలో నవగ్రహ పూజ జరుపుతాము . ఆ సందర్భంలో చంద్రుని గురించి ఈ క్రింద మంత్రం చెబుతాం (నవ గ్రహ సూక్తం). ప్రస్తుతం మన ఆసక్తి అంతా చంద్రుడు కావున, దాని గురించి ఏమి చెప్పారో పరిశీలిద్దాం
నవ గ్రహ సూక్తం లో చంద్రుని గురించిన శ్లోకం యిలా ఉంటుంది

• ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥
సూర్య గ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్ర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి

• అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥
చంద్ర గ్రహస్య దక్షిణతః అధి దేవతాం ఆపః సాంగం సవాహనం సాయుధం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి

• గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ ॥
చంద్ర గ్రహస్య ఉత్తరతః ప్రత్యధి దేవతా గౌరి సాంగం సవాహనం సాయుధం సశక్తి , సపతి, పుత్ర పరివార సమేతం గౌరి ఆవాహయామి స్థాపయామి పూజయామి

ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ సోమా॑య॒ నమః॑ ॥ 2 ॥

ఈ క్రింద యిచ్చిన చిత్రాన్ని పరిశీలిస్తే , సూర్యునికి ఆగ్నేయ దిక్కులో చంద్ర గ్రహాన్ని చూడగలము . ప్రతి గ్రహానికి దేవత మూడు ప్రధాన స్థాయిలు ఉన్నాయి. గ్రహ దేవత, అధి దేవత, ప్రత్యధి దేవత. గ్రహం ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అధి దేవత మీకు సహాయం చేస్తుంది. అవేమిటో ఒక్కక్కటి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము.

ముందుగా గ్రహ దేవత అయిన చంద్రుని గురించి ఏమి చెప్పారంటే

• ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥
ఆప్యా॑యస్వ (దయచేయండి ), సమే॑తు (ఒక చోటికి చేర్చు ) , తే (మీరు) , వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ (విశ్వ వ్యాప్తంగా వరాలను దీవెనలను అందించి ప్రయోజనం కలిగించే చంద్రుడు ), భవా॒ వాజ॑స్య సంగ॒థే (మీరే మా బలంగా మారండి )
చంద్రుని అధి దేవత - ఆపః (నీరు), యిది చంద్రునికి దక్షిణ దిక్కులో ఉంటుంది, ఈ నీటి గురించి ఇంకేమి చెప్పారంటే

• అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥
అప్సుమే (ఈ నీటిలో ), సోమో॑ (చంద్రుని అంశ ) , అబ్రవీదం (చెప్పబడినది ), అంతర్విశ్వా॑ని (సమస్త - యూనివర్సల్ ) భేషజా (నివారణ )

ఈ ప్రకారం చంద్రునికి దక్షిణ దిక్కులో నీరు వున్నది, ఆ నీటి మీద జరిపే పరిశోధనల మూలంగా చంద్రుడి స్వభావాన్ని, పూర్వోత్తరాలను అర్థం చేసుకోగలం అని స్పష్ట మవుతుంది ఈ నీటి కి ఔషధ లక్షణాలు ఉండటం వలన ఇది వైద్య రంగంలో సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది అని చెప్పారు.

తరువాత చంద్రుని ప్రత్యధి దేవత గౌరి, ఉత్తర దిక్కులో వున్న ప్రత్యధి దేవత గౌరి గురించి ఏమి చెప్పారంటే

• గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్
మిమాయ (సృష్టించు), సలి॒లాని (నీళ్లు , ద్రవాలు), తక్ష॒తి (ఆధారం ) , ఏక॑పదీ (ఒక పాదం )... నవ॑పదీ (9 పాదాలు) , బభూ॒వుషీ (ఆమె అవుతుంది ), స॒హస్రా᳚క్షరా (అనంత నేత్రాలు కలది ), పరమే (సుప్రీం ), వ్యో॑మన్ (ఆకాశం, అంతరిక్షం )

ఈ శ్లోకం గౌరీ దేవత వైవిధ్యమైన రూపాలను వివరిస్తుంది, అలాగే సృష్టి, విశ్వం వివిధ అంశాలలో ఆమె ఉనికిని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది.
ఇప్పటి వరకు చంద్రుని మీదకు చేరిన వివిధ దేశాల ఉపగ్రహాలను ఈ క్రింది చిత్రంలో చూడగలరు. దాదాపు అన్నీ చంద్రుని ముందు భాగం, పై అర్థ భాగంలోనే ఉన్నాయి. చైనా 2019 లో ప్రయోగించిన చేంజ్-4 మాత్రమే చంద్రుని వెనుక భాగం వైపు దించారు.

చంద్రునిపై నీటి ఆనవాళ్లు:
చంద్రునిపై నీరు ఉందని సూచించడానికి ఆధారాలు ఉన్నాయి, ఆ నీరు భూమిపై మనకు కనిపించే నీటికి భిన్నంగా ఉండే రూపాల్లో ఉంది. NASA వాళ్ళు 2018 లో విడుదలచేసిన మ్యాప్‌లు చంద్రుని నీడ ఉన్న ప్రాంతాలలో చాలా చల్లగా ఉంటాయి. గడ్డ కట్టడానికి (-157 డిగ్రీల సెల్సియస్) వీలు కల్పిస్తాయి. అలానే 2020 లో NASA విడుదల చేసిన మ్యాప్‌లు , సూర్యరశ్మి ఉన్న ప్రాంతాలలో కూడా నీరు ఉన్నట్లు ధృవీకరించింది.

ఇప్పటికి వరకు చంద్రుని పైన లభించిన ప్రకారం Lunar Regolith (లూనార్ రెగోలిత్) లో ఘనమైన శిలలను కప్పి ఉంచే వదులుగా ఉండే పొరల లోపల నీరు చిక్కుకుపోవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచించాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ అణువులు (హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక) కనుగొనబడ్డాయి. ఇలాంటి నీరు భవిష్యతుల్లో మంచి వనరులుగా ఉపయోగమున్నప్పటికీ వీటి వెలికితీత సవాళ్లు తో కూడుకున్న పని. అలాగే ఈ చంద్రుని నీటిని అధ్యయనం చేయడం వలన చంద్రుని నిర్మాణం, సౌర వ్యవస్థ రహస్యాలను, అస్థిరతలను తెలుసుకునే గొప్ప అవకాశం లభిస్తుంది .

ఈ రకంగా మన ఋషులు ద్రష్టలు వేదవాఙ్మయం ద్వారా అందించిన ఖగోళ శాస్త్ర రహస్యాలను, ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో క్రోడీకరించి , ప్రపంచ మానవాళి మనుగడకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతారని ఆశిద్దాం.

Chandrayaan 3 Mission Details: చంద్రయాన్‌-3.. త్రీ ఇన్‌ వన్‌





Saturday, June 17, 2023

భైఫర్ కేషన్

 

ఉప్పాడ—కొత్తపల్లి హైస్కూల్ చరిత్ర

వ్యాసకర్త
సిద్దాంతపు బెన్ జాన్ సన్
ఆంగ్ల ఉపాధ్యాయులు
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత

68 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి వేలమంది సరస్వతీ పుత్రులకు జన్మనిచ్చి నిరంతరంగా విద్యాసౌరభాలను  విరబూస్తున్న ఉప్పాడ— కొత్తపల్లి వీర్రాజు జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ త్వరలో బాలురు మరియు బాలికల ఉన్నత పాఠశాలలుగా అభివృద్ది చెందుతున్న  అపూర్వ ఘడియలను తన చరిత్రలో లిఖించుకొనుచున్న శుభసందర్బంలో పాఠశాల చరితాక్షరాలను లిఖించే భాగ్యం, మహత్తర అవకాశం నాకు కలిగించిన పాఠశాలమ్మ తల్లికి పాదాభివందనం చేసి పరమానందబరితుడనవుతూ లిఖిస్తున్న సువర్ణాక్షరాలు.

కొత్తపల్లి, నాగులాపల్లి,మూలపేట, ఎండపల్లి,ఉప్పాడ,అమీనాబాద,కొమరగిరి,  వాకతిప్ప, ఊరు ఏదైతేనో  ఉప్పాడ కొత్తపల్లి హైస్కూల్ వద్దకు చదవడానికి రావలసిందే. అప్పర్ ప్రైమరీ పాఠశాలగా కొనసాగుతున్న పాఠశాల ది.29—6—1952 నాడు కీ॥శే అల్లక సన్యాసయ్యగారి రెండున్నర ఎకరముల భూదాన ఫలితముగాను మరియు స్వాతంత్ర్య సమరయోధుడు, MLC  కీ॥శే రావు అచ్చారావుగారి నిర్విరామ కృషి ఫలితముగ ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాల స్దాపించబడింది. అప్పర్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా శ్రీ కె. వెంకటరత్నం B.A L.L.T గారు పనిచేస్తున్న కాలంలో హైస్కూల్ గా అప్ గ్రేడ్ అయ్యింది. 1954 వ సంవత్సరంలో 4వ ఫారం ప్రారంబించుకొనుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలకు మొదటి ప్రధానోపాధ్యాయులుగా శ్రీ ఉమ్మెత్తాల బిందు మాధవరావు B.A BED ది 6—8—1954 తేదీనాడు నియమితులైనారు. 1956 సంవత్సరంలో  పాఠశాల స్దాపకులు శ్రీ రావు అచ్చారావుగారి నిర్విరామ కృషితో హైస్కూల్ భవనం నిర్మించబడింది.బిందుమాధవరావు గారి ఆధ్వర్యంలో నడిచిన పాఠశాల దశ దిశలా పేరు ప్రఖ్యాతులు పొందింది. అది ఒక స్వర్ణయుగం పాఠశాలకు. మొదటగా హైస్కూల్ నాలుగు సెక్షన్ లతో ప్రారంబమయ్యింది. తరువాత బిందుమాధవరావుగారు పదకొండు సెక్షన్లుగా అభివృద్ది చేసారు.ఆ రోజుల్లోనే 400 మంది విధ్యార్ధులు కలిగి ఉండేది కొత్తపల్లి హైస్కూల్ . హెచ్ యమ్ బిందు మాధవరావుగారు 18—6—1964 సంవత్సరంలో పదవీవిరమణ చేసారు. కీ॥శే శ్రీ మంగళంపల్లి రామనృసింహమూర్తి B.A BED ది.2—7—1964 న ప్రధానోపాధ్యాయునిగా భాధ్యతలు చేపట్టారు. ది. 4—8—1964 నాడు పదవీవిరమణ చేసిన బిందుమాధవరావుగారికి  భాధ్యతలు చేపట్టిన రామనృసింహమూర్తి గారికి శ్రీ క్రోవి సోమసుందర శాస్త్రి B.A BED రిటైర్డు ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు ఆహ్వన వేడుకలు జరిగాయి. మొదటి SSLC బ్యాచ్ 25% మంది మాత్రమే ఉత్తీర్ణులైతే రాను రాను బిందు మాధవరావుగారి పర్యవేక్షణలో 1964 మార్చి నెలలో SSLC పరీక్షలలో 80% ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ఉన్నత పాఠశాలల చరిత్రలో రికార్డు సృష్టించింది ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. పాఠశాల ఈ ఘనత వహించడానికి కారకులు బిందుమాధవరావుగారే. ఆనాడే వీరు తల్లిదండ్రుల సమావేశాలు తరచూ నిర్వహించి విద్యావ్యవస్దలో నూతన ఒరవడి సృష్టించారు.1964 విద్యాసంవత్సరంలో పాఠశాలలో  స్లిప్ టెస్ట్ లు, క్వార్టర్లీ పరీక్షలకు ప్రశ్నాపత్రములు తొలిసారిగా ముద్రించి విద్యార్దులకు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకూ ప్రశ్నాపత్రం బోర్డుమీదే రాసేవారు.18/12/1964  కాకినాడలో MSN చార్టీస్ నందు జరిగిన సైన్సు ఫెయిర్ నందు మొదటి సారిగా పాఠశాల విధ్యార్దులు పాల్గొన్నారు. ఆనాడు 20 పాఠశాలలు పాల్గొన్నాయి. క్రాప్ట్ , డ్రాయింగ్ సబ్జక్టులను పాఠశాలలో గొప్పగా భోధించేవారు.. 1964 లో 450 మంది విద్యార్దులతో పాఠశాల నడిచింది.SSLC పరీక్షలు రాయడానికి పిఠాపురం ప్రభుత్వ హైస్కూల్ కు విద్యార్దులు ఇక్కడ నుండి వెళుతుండేవారు. ఆ రోజుల్లో హైస్కూల్ నందు మిడ్ డే మీల్స్ పథకం అమలుపరచబడింది.గోధుమ ఉప్మా, పాలపిండితో చేసిన మజ్జిగ ఇచ్చేవారు. హాస్టలు, మధ్యహాన్నభోజన పథకాన్ని రావు సత్యనారాయణగారు నిర్వహించేవారు.72 మంది విద్యార్దులతో స్కౌటుదళం ప్రారంబించబడింది.శ్రీ M. ఖండేశ్వరరావు,శ్రీ M. వెంకట్రాజు, శ్రీ తాతపూడి భానోజీ విశ్వేశ్వరరావు( వ్యాసకర్త వీరి స్కౌటు శిష్యుడే) అలహాబాదు నందు జరిగిన జంబురే స్కౌటు వేడుకలలో పాఠశాల తరుపున పాల్గొన్నారు. స్కౌటే కాకుండా A.C.C ట్రూపులు నిర్వహించబడ్డాయి.వీటిని BL వరప్రసాదరావు, R. ప్రకాశరావు నిర్వహించేవారు.1978 లో పదవతరగతి పరీక్షాకేంద్రంగా గుర్తించబడినా అదే సంవత్సరం వివిద కారణాలతో రద్దయ్యింది.  కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉజ్వలంగా ప్రకాశించేలా నడిపించిన ఎందరో ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. వారిలో 1982 లో పనిచేసిన
పి ఎల్ ఎన్ దీక్షితులు గారు ఒకరు. ఈ మహానుభావుడి గురించి చెప్పకపోతే పాఠశాల క్షమించదు.ఆనాడు ప్రధానోపాధ్యాయుని గదిలోనే ఉండేవారు. అక్కడే మడికట్టుకుని వంటచేసుకొనేవారు. చండశాసనుడికి మరోపేరు .పిల్లలను దండించడానికి ఏకంగా సర్వీసు చెట్లు పెంచేవారు. అటెండరు వీరాస్వామి అసెంబ్లీ సమయానికి బెత్తాలు విరిచి పట్టుకునేవాడు. కనీసం పది బెత్తాలైనా విరిగిపోయేవి. అప్పుడే శంకరాభరణం సినిమా రిలీజైయ్యింది. దీక్షతులుగారిని చూస్తే అచ్చు శంకరశాస్త్రిని చూసినట్లుండేది. పొట్టి పొట్టి చేతులు,పంచెకట్టు, కాళ్ళకు జోడు ఉండేది కాదు. కాళ్ళజోళ్ళు ఉంటే  చప్పుడు వస్తుందని దాని వలన క్లాసులో టీచర్లకు తను వస్తున్నట్టు తెలుస్తుందని జోళ్ళు వేసుకునేవారు కాదు. అంతలా పర్యవేక్షణ చేసేవారు పాఠశాలను. వీరి ఆధ్వర్యంలో కూడా పాఠశాల ఉన్నతంగా వెలిగింది. అంతేకాదు వీరి హయాంలోనే 1982 లో తిరిగి పదవతరగతి పరీక్షాకేంద్రం ప్రారంబించబడింది. ఈ హైస్కూల్ నందు
వందలాది  గొప్ప గొప్ప సబ్జక్టు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పనిచేసారు. కొత్తపల్లి  హైస్కూల్లో ఒక్కసారైనా పనిచేయాలని ప్రతీ ఉపాధ్యాయుడూ ఉవ్విళ్ళూతూవుంటారు.1952లో  రెండు ఎకరముల స్దలంలో వెలసిన హైస్కూల్ రాను రాను 7 ఎకరముల స్దలమును సమకూర్చుకుంది.అయితే  2013లో ప్రధానోపాధ్యాయులు కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి ఆధ్వర్యంలో  పర్యాటకశాఖ వారి కోరికమేరకు ఇంటర్నేషనల్  ఫేషన్ టెక్నాలజీ మరియు హోటలు మేనేజ్ మెంటు కాలేజీ ఏర్పాటుకు  రెండున్నర ఎకరములు ఇవ్వడం జరిగింది. మిగతా కొంత భాగం ఆటస్దలమునకు కేటాయించడం జరిగింది. 2012  విద్యాసంవత్సరంలో ప్రధానోపాధ్యాయులు కె బి మార్కండేయులు వారి ఆధ్వర్యంలో పిఠాపురం శాసన సభ్యురాలు వంగా గీతావిశ్వనాధ్ మరియు కాకినాడ పార్లమెంటు సభ్యులు పళ్ళంరాజు గారు పాఠశాలకు 1కోటి 30 లక్షలు నిధులు మంజూరు చేయడంతో శ్రీ రావు చిన్నారావు గారి  కృషితో ప్రస్తుతం ఉన్న 28 గదుల మూడంతస్తుల భవన నిర్మాణం జరిగింది.  కేంద్ర పర్యాటకశాఖ మంత్రి పద్మవిభూషన్ చిరంజీవి గారు11_5_2013 న ప్రారంభించారు.
                                                           
2017 సెప్టెంబరు నెలలో ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సి హెచ్ వి రమణమూర్తి గారి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు యావన్మంది  సహకారం అందించగా SMC  చైర్మన్ తిక్కాడ తాతారావుగారు సత్ సంకల్పం , 68 యేళ్ళ చరిత్రలో పాఠశాలలో పనిచేసిన వారు ఎవ్వరూ స్వీకరించని అత్యున్నత  రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన ఆంగ్ల ఉపాధ్యాయులు  సిద్దాంతపు బెన్ జాన్ సన్ గారి అకుంఠిత దీక్ష, దాసరి సతీష్ రాజా, సత్యనారాయణగార్ల ప్రొద్బలంతో ,పూర్వవిద్యార్దుల సహకారంతో,పిఠాపురం శాసన సభ్యులు శ్రీ SVSN వర్మగారు 2017 విద్యాసంవత్సరంలో పాఠశాలను బాలురు బాలికల పాఠశాలలుగా మార్చాలని విద్యార్ధినుల విన్నపాల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాలను సందర్శించి పాఠశాల రోలు అధికం కావడంతో అనేక సమస్యలు వస్తున్నాయని నిర్ధారించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుత పిఠాపురం శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారి సిఫార్సుతో  పాఠశాలను భైఫర్ కేట్ చేస్తూ సెక్రెటరీయేట్  ఆమోద ముద్రవేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో 800 మంది బాలికలతో మరికొద్ది రోజులలోనే గరల్స్ హైస్కూల్ ఏర్పడనుంది. ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన రెండుకోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణం మాదిరెడ్డి దొరబాబు గారు, రావు చిన్నారావుగారు,ఉమ్మిడి జాను గారు, SMC  చైర్మన్ మేరుగు ప్రసాదు గారు చేపట్టనున్నారు.



భైఫర్ కేషన్ ప్రక్రియలో హ్యూమన్ రైట్స్ వారి పాత్ర మరువలేనిది 

ఫైలు స్దబ్దుగా ఉండిపోయిందన్న సమయంలో హ్యూమన్ రైట్స్ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ జాన్ బొంకే గారి ఆధ్వర్యం హ్యూమన్ రైట్స్ యంగ్ లీడర్స్  కొత్తపేటకు చెందిన ధోని సంసోను రామిచిట్టిపేటకు చెందిన చొక్కా ప్రసాదు

సూరాడపేటకు చెందిన పిరమళ్ళ పౌల్ రాజు, మాయపట్నంకు చెందినచోక్కా సంజీవి  అమినాబాదకు చెందిన 

మడదా పోలబ్బాయి  వారి వారి గ్రామాలలో విధ్యార్దుల తల్లిదండ్రుల నుండి

గ్రామస్తుల నుండి సంతకాలు సేకరించి డి ఇ ఓ గారికి అందజేసి  ఆర్డరు వచ్చేలా చేసారు

వీరికి కృతఙ్ఞతలు 


గౌరవనీయ జిల్లా విద్యాశాఖాధికారి వారికి,


కొత్తపల్లి పేరెంట్ కమిటీ చైర్మన్ అభ్యర్దన మేరకు


కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

భైఫర్ కేట్ అయి ఉత్తర్వులు పొంది విజయవంతంగా నడుస్తున్నా  

 దిద్దుబాటు ఉత్తర్వులు రాక పాలనాపరంగా అనేక సమస్యలు పరిష్కారం కావటం లేదని, నెలలు గడుస్తున్నా దిద్దుబాటు ఉత్తర్వులు జారీ జరగటం లేదని విచారణ చేసి తక్షణమే జిల్లా విద్యాశాఖ ద్వారా ఉత్తర్వులు ఇప్పించాలని   మా మానవహక్కుల  జిల్లా కార్యాలయాన్ని కొత్తపల్లి బాలికల పేరెంట్ కమిటీ చైర్మన్ సంప్రదించడం జరిగింది. 

దిద్దుబాటు ఉత్తర్వులు ఆలస్యం కావడంతో

పాలనాపరమైన సమస్యలు వస్తున్నట్టు విచారణలో గ్రహించినాము. 

డి డి ఓ  ఐడి రాక ఇంకా ఉమ్మడి పాఠశాల కోడ్ ద్వారానే జీతాల చెల్లింపు జరుగుందని విచారణలో గ్రహించడం జరిగింది .

NHRD డైస్ కోడ్ బాలికల పాఠశాలకు కేటాయించినా విద్యాశాఖ ఏక్టివేట్ చేయక ఇంకా బాలికలందరూ కొత్త డైస్ కోడ్ లోనికి రానట్టు విచారణలో గ్రహించడం జరిగింది.

పాఠశాలలో  ఐదు నెలలు గడుస్తున్నా బాలికల పాఠశాల స్వతంత్రంగా నడచుటకు

దిద్దుబాటు ఉత్తర్వులు ఎంతో అవసరమని గ్రహించడం జరినది.

బాలికల పాఠశాల ఇ మెయిల్ ఐడి నకు ఎటువంటి సమాచారం పాఠశాలకు చేరవేయనందున పాలనాపరమైన సమస్యలు రావటం గ్రహించాము.

పాఠశాల ఏర్పడిన తరువాత పాఠశాలను జిల్లాస్దాయి అధికారి ఎవరూ సందర్శించి తగిన సూచనలు ఇవ్వలేదని విచారణలో గ్రహించడం జరిగింది .

ఇంకా ఉమ్మడిగానే మధ్యహాన్నభోజనం, హాజరు, స్టాఫ్ మీటుంగులు జరుగుతుండటం, బాలుర పాఠశాల ఫ్రధానోపాధ్యాయుడు ఒక్కడే జిల్లా  మీటింగులకు హాజరవటం, బాలికల పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు హాజరు కాకపోవడం వంటి విషయాలు విచారణలో గ్రహించడం జరిగింది.

వెంటనే జిల్లా విధ్యాశాఖ కొత్తపల్లి బాలికల పాఠశాల స్వతంత్రంగా నడుచునట్లు చర్యలు తీసుకోవలసిందిగా  కోరుతూ దిద్దుబాటు ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను


నకు ;—
జిల్లా విద్యాశాఖాధికారి,
తూర్పుగోదావరి జిల్లా,
కాకినాడ.
నుండి :—
మేరుగు ప్రసాదు,
స్కూల్ పేరెంట్ కమిటీ చైర్మన్ ,
కొత్తపల్లి బాలికల పాఠశాల                కొత్తపల్లి గ్రామం
సెల్ నెం :
విషయం ;— కొత్తపల్లి ఉన్నత  పాఠశాల భైఫర్ కేషన్ దిద్దుబాటు ఉత్తర్వులు విడుదల చేయమని కోరుట గురించి,బాలికల పాఠశాల స్వతంత్రంగా నడచుటకు తగిన సూచనలు కోరుటగురించి

అయ్యా !
ఈ క్రింది తెలిపిన అంశములను పరిశీలించి వెంటనే పరిష్కరించగలరని కోరుచున్నాను.
1 భైఫర్ కేషను ఆర్దరులో వచ్చిన చిన్ని చిన్న సవరణలు కోరుతూ ఉత్తర్వులు ఇవ్వమని కార్యాలయమును కోరి మూడు నెలలకు పైగా గడుస్తున్నా దిద్దు బాటు ఉత్తర్వులు విడుదల కాలేదు తక్షణమే విడుదల చేయగలరని కోరుతున్నాను.
3 భైఫర్ కేషన్ జరిగిన తరువాత ఏ అధికారి ఇంత వరకూ సందర్శించి తనిఖీ నిర్వహించలేదు.తనిఖీ నిర్వహించి అభివృద్దికి సూచనలు ఇవ్వగలరు..
2.పాఠశాల ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా స్వతంత్రగా నడిచే ఏర్పాట్లు పూర్తికాలేదు. బాలికల పాఠశాల నుంఢి ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిని HM మీటుంగులకు హాజరుకమ్మని ఎటువంటి మెసేజ్ లు రావటంలేదు. పాఠశాల ఇ మెయిల్ అప్ డేట్ కాలేదు. అందువలన ఏ విషయములు తెలియుటలేదు.
4 .బాలికల పాఠశాలకు డైస్ కోడ్ NHRD  వారు పంపినా ఇంతవరకూ ఏక్టివేట్ కాలేదు. కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగినా ఫలితంలేదు.
5.బాలికల పాఠశాలకు పదవతరగతి విధ్యార్దులకు నామినల్ రోలు పంపుటకు ,విధ్యార్దుల మార్కుల నమోదుకు , మధ్యహాన్న భోజన వివరాల,ఉపాధ్యాయుల వివరాల  నమోదుకు  డైస్ కోడ్ ఏక్టివేషను ఎంతో అవసరమైయున్నది తక్షణమే ఏక్టివేషను చేయగలరు.
6. డైస్ కోడ్ కొత్తది రెండు రోజులు పనిచేయడంతో 105 మంది పదవతరగతి  విద్యార్దులను షిప్ట్ చేరటం జరిగింది .మరలా వెంటనే పనిచేయడం మానివేసింది. దీనివలన 105  మంది విద్యార్దులకు హాజరు పడటంలేదు. అమ్మవడి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నామినల్ రోలుకు ఆటంకం ఏర్పడింది.
7.డైస్ కోడ్ ఏక్టివేట్ కాక SPC నిధుల విడుదలకు సాంకేతిక సమస్య ఏర్పడినది.
8 దిద్దుబాటు ఉత్తర్వులు విడుదల కాక ప్రత్యేక మైన డి డి ఓ ఐడి కొరకు జిల్లా ట్రజరీ వారిని కోరుటకు ఆటంకముగా ఉన్నది. దీనివలన ఇంకనూ పాత డిడిఓ ద్వారానే ఉపాధ్యాయులు జీతాలు పొందుతున్నారు. దీని వలన పాలనా పరమైన సమస్యలు వస్తున్నవి.బాలికల పాఠశాల స్వతంత్రంగా నడునట్లు ఉత్తర్వులు విడుదల చేయగలరు.
9 బాలికల పాఠశాల ,బాలుర పాఠశాల స్టాఫ్ మీటుంగులు విడివిడిగా నిర్వహించులాగున ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు ఇవ్వగలరు .
10  బాలికల పాఠశాలకు కేటాయించిన స్దలములో  నిర్మితమగుచున్న 16  గదుల భవనమును బాలికల పాఠశాలకు ఇప్పించగలరని కోరుతున్నాను.
11 బాలికలు 750 మందికి సరపడా టాయిలెట్లులేవు .ఆయాలు లేరు .మంచినీటి సధుపాయంలేదు.
  పై సమస్యలను సానుకూల దృక్పదముతో వెంటనే పరిష్కరించగలరు
ఇట్లు
మీ విశ్వాసనీయ

స్కూల్ ఫేరెంటు కమిటీ చైర్మన్
కొత్తపల్లి బాలికల ఉన్నత పాఠశాల


గౌరవనీయులైన


కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూలు

భైఫర్ కేషను నాలుగు సంవత్సరములు

గడుస్తున్నా పూర్తికాలేదు.మీరు ఇంతవరకు ఎంతో సహకరించారు.800 మంది అమ్మాయిల భవిష్యత్తు మీరు ఇచ్చే తుది ఉత్తర్వలమీద ఆధారపడి వున్నది. గ్రామస్తులు,తల్లిదండ్రులు ఎంతో ఎదురుచుస్తూన్నారు. ప్రజాప్రతినిధులు భైఫర్ కేషన్ జరగాలని కోరుకుంటున్నారు.

అప్పుడే ఐదవ విధ్యాసంవత్సరం ప్రారంభమవుతుంది కూడా . కావున తక్షణమే స్పందించి స్టాఫ్ భైఫర్ కేషన్ ఉత్తర్వలు ఇవ్వగలరు.తమరి ప్రతిస్పందన తెలుపగలరు.


‌Respected 

District Educational officer

East Godavari District


 Kottapalli Zilla Parishad High School

 Biffercation four years

 The future of 800 girls depends on the final orders you give.  The villagers and parents are looking forward to it.  Deputies want the bifurcation to take place.

 Even then the fifth school year begins.  So staff bifurcation orders can be issued immediately. Tamari can respond.




జిల్లా విద్యాశాఖాధి వారికి
తూర్పు గోదావరి జిల్లా,

పిఠాపురం నియోజక వర్గం ,కొత్తపల్లి మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బాలురు బాలికల పాఠశాలలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము జి.ఓ యమ్ యస్ నెం 44 ద్వారా ఉత్తర్వులు స్దానిక శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి మేరకు ఇచ్చియున్నది. తదనంతర ఉత్తర్వులు సి.యస్ సి, మరియు ఆర్ జె డి ఇచ్చియున్నారు. భైఫర్ కేషన్ ప్రక్రియ ప్రారంబించి నాలుగు విద్యాసంవత్సరముల సుదీర్ఘకాలం కావచ్చుచున్నది. కొత్తపల్లి హైస్కూల్ నందు 1200 మంది విధ్యార్దులు మత్స్యకార కుటుంబాలకు చెందినవారు.ప్రభుత్వం మత్స్యకారుల సంక్షక్షేమమునకు అధికప్రాధాన్యత ఇచ్చుచున్నది. రాష్ట్రంలోనే ఏ పాఠశాలలో లేనివిధంగా కొత్తపల్లి హైస్కూల్ నందు 800 మంది బాలికలు చదువుచున్నారు. బాలికల సంక్షేమానికి భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చుచున్నది. కావున కొత్తపల్లి హైస్కూల్  1550 మంది విధ్యార్దులకు పైగా అధిక సంఖ్యతో  నిర్వహణ భారముతో పాఠశాల కుంటుపడుచున్నది. ప్రభుత్వ పధకములు సక్రమంగా అమలు చేయుటకు ఇబ్బందులు తలేత్తుచున్నవి. కావున విధ్యాశాఖాధికారి వారు వెంటనే స్టాఫ్ భైఫర్ కేషన్ ఉత్తర్వలు విడుదల చేసి బాలురు, బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయవలసినదిగా కోరుచున్నాను.

శాసనసభ్యులు
పిఠాపురం నియోజకవర్గం




పాఠశాల భౌతిక స్వరూపం

ఉప్పాడ  అమీనాబాద కొత్తపల్లి పంచాయితీ గ్రామాలు
కొత్తపల్లి  పంచాయితీ హేబిటేషన్లు
రవీంద్రపురం  కొత్తపల్లి  sc కోలనీలనుండి
సుమారు 60 మంది పిల్లలు వస్తారు
రెండు ఎలమెంటరీలు ఉన్నాయి.రవీంద్రపురం ఎలిమెంటరీ నిర్మాణంలో ఉండటంతో ప్రస్తుతం బాయిస్ హైస్కూల్ నందు ఒక గదిలో నడప బడుతుంది  దూరం  అర కిలోమీటరు.

2 ఉప్పాడ పంచాయితీ నుండి 350 మంది పిల్లలు వస్తారు. హేబిటేషన్లు  సుబ్బంపేట( 1.5 km).బర్మాకోలనీ, కొత్తకోలనీ.నాయకర్ కోలనీ, ఉప్పాడ అనంతలక్ష్శి కోలనీ,మాయాపట్నం, పాత ఉప్పాడ, ఉప్పాడ sc colony.ఎక్కువ మత్య్సకారులు,వీవర్స్ ఉంటారు.
6 ఎలిమెంటరీలు ఉన్నాయి.

అమీనాబాద పంచాయితీ 300 మంది పిల్లలు హాజరవుతారు.ఎక్కువ మత్స్యకారులు

కార్యక్రమాలకు
ముగ్గురు సర్పంచులు
నక్కా మణికంఠ  అమీనాబాద
ఉమ్మిడి జాను ఉప్పాడ సర్పంచ్
కొత్తపల్లి సర్పంచ్ పిలవాలి
MPTCలు
పిలవాలి.
కొత్తపల్లినందు రావుచిన్నారావుగారు,మాదిరెడ్డి దొరబాబు, ఆనాల సూదర్శన్ , వైయస్ ఆర్ సి పి నాయకులు వీరిని పిలవాలి.
స్దానిక MLA  పెండెం దొరబాబుగారు
పిఠాపురం లో ఉంటారు






Sunday, December 4, 2022

నిశిరాత్రి

 


కథనం

మిట్టమధ్యహ్నం ఇంటిముందు సైకిలు దిగిన దేవయ్యకి రోజూలాగే పోరు పెడుతున్న కొడుకు కనబడతాడు.పిల్లాడిని ఎత్తుకుని అటూ ఆటూ తిరుగుతున్న భార్యచేతిలోనుండి పిల్లాడిని తీసుకుని ఊరుకోబెట్టాలని ప్రయత్నిస్తాడు.మరలా పిల్లాడిని చేతిలోకి తీసుకుంటుంది భార్య. తలబాదుకుంటూ పాలు పడని పెళ్ళాన్ని కట్టుకున్నాను అంతా మా అమ్మ చేసింది అని అరుస్తాడు. భార్య ఇదిగో నిన్ను కట్టుకుని కరెంటులేని మందులు షాపులేని ఊరుకు వచ్చి నేను నా కొడుకు అన్యాయమయిపోయామని అరుస్తుంది. పొరిగింటి బాలింత దగ్గరకు పోయి పాలిమ్మంటుంది భార్య. అయినా పిల్లాడు ఏడుపు ఆపడు. వీళ్ళ గొడవ విని పొరింటి ముసలది పోలేరమ్మ చెంబులో నీళ్ళుతో దిష్టి తీస్తుంది. పొరిగింటి యాకోబు  కొడవలి కాల్చి దిష్టితీసి చెంబులో ముంచి చూపిస్తాడు. కొడవలి చల్లగా ఉంటుంది. గాలి పట్టుకుంది అని చెప్పి ఊరవలత చెంబులో నీరు పోసి వత్తానని పోతాడు.

అయినా ఏడుపు ఆపడు పిల్లాడు.

దేవయ్య తన మందుల పెట్టె వెతుకుతాడు. మందులు అరుకుసీసా ఖాళీగా కనబడతాయి.

దూరాన అన్నవరం పోయి మందులు తెస్తానని బయలు దేరతాడు. 

ముసలి పోలేరమ్మ వద్దంటుంది.భార్య చీకటి పడితే ఇసకపర్రంట రావటం కష్టమంటుంది .అయినా బిడ్డ ఏడుపు చూడలేని దేవయ్య సైకిలు పై బయలు దేరతాడు.కాకులు గేదెలు కుక్కలు ఉన్నపళంగా అరుస్తాయి.ఊరు బయట యాకోబు పరిగెత్తుకుని వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తాడు. సైకిలు ఆపకుండా పోతాడు దేవయ్య.

సుమారు 20 కిలోమీటర్లు దూరంలోని అన్నవరం చేరుకుని మందులు తీసుకుంటాడు. మందులు షాపు అతను చీకటి పడింది వెళ్ళవద్దంటాడు.

అయినా బయలు దేరతాడు.చీకటి పడినా బయలు దేరిన దేవయ్యకి దారి సరిగా కనబడదు. దారి తప్పి పుంత దారిలోకి పోతాడు. దూరంగా మంట కనబడుతుంది. ఆ మంట వచ్చే వైపు వెడతాడు. మంట మాయమై మరో దిక్కున కనబడుతుంది.మరలా ఆ వైపుకి వెడతాడు. మంట చేరుకునేలోపు మరలా మంట మరో దిక్కున కనబడుతుంది.ఇలా తిరుగుతున్న దేవయ్య వెనకాల ఓ నల్లటి దుప్పటి కప్పుకున్న వ్యక్తి కనబడతాడు. దేవయ్య హడలిపోతాడు. ఆ వ్యక్తి బయపడవద్దని నిన్ను కొరివి దెయ్యం తిప్పుతుందని. రాత్రికి మా ఇంటి దగ్గర పడుకుని పొద్దన్న వెడుదువుగానని వెంటరమ్మంటాడు. దేవయ్య చేసేది లేక సరే అని అతని వెంట వెడతాడు. అతను నడిపించి నడిపించి ఓ తెల్లటి ఇంటి ముందు ఆగి లోపలికి రమ్మని గెంజి ఇచ్చి పడుకోమంటాడు. దేవయ్యకు నిద్రవచ్చేస్తుంది .కొన్ని నిమిషాలకే నిద్రలోకి పోతాడు.

పిల్లల అరుపులు విన్న దేవయ్య కళ్ళు తెరుస్తాడు. సుర్రుమంటు ఎండ కళ్ళల్లో పడుతుంది. కళ్ళు నులుముకిని లేచి చూసుకున్న దేవయ్యకు తను ఉన్న చోటు చూసి మతిపోతుంది. అది తెల్లటి సమాది. గేదెలు కాసే పిల్లలు కొరివి దెయ్యం నిన్ను ఏడిపించిందని చాలా మంది ఆలాగే మోసపోయారని చెపుతారు. మందులు పేకెట్టు వెతుకుని గబగబా సైకిలు మీద ఇంటికి బయలు దేరతాడు దేవయ్య.

Wednesday, November 30, 2022

కాంతారా

 ముఖ్యంగా కన్నడ సినిమా పరిశ్రమలో అయితే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క బెంగళూరులోనే 20 వేల షోలు నడిపించారంటే సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 17వేల షో లతో కే జి ఎఫ్ 2 పేరిట రికార్డు ఉండేది.. ఈ సినిమా రికార్డు ఎవరూ బీట్ చేయలేరు అనుకున్నారు. కేవలం ఆరు నెలల్లో ఆ రికార్డు బ్రేక్ అయింది. అయితే చాలామంది కూడా కాంతారా సినిమాలో వరాహ రూపం ఎపిసోడ్ కు కనెక్ట్ అయ్యారు. రిపీటెడ్ గా థియేటర్లలోకి వెళ్తున్నారు. కానీ ఈ సినిమాని అంత ఆషామాషీగా తీయలేదు. దీని వెనుక బోలెడు కథ ఉంది. అన్నింటికీ మించి మన పురాణాల్లో ఉన్న నీతి దాగి ఉంది.

Kantara Movie

దేవుళ్ల గురించి కొత్తగా చెప్పారు

కాంతారా సినిమా ప్రారంభంలోనే ఒక రాజు ఒక రాయిని చూసి తన్మయత్వం పొందుతాడు. ఆ రాయి మరెవరో కాదు కంజుర్లీ దేవ.. తులు నాడు ప్రాంతంలో ప్రజలు విశిష్ట దైవంగా కొలుస్తారు. అయితే ఈ దేవుడికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం పార్వతి దేవి కైలాసంలో ఒక వరాహాన్ని పెంచుకుంటూ ఉండేది. అయితే అది తన చేష్టలతో కైలాసాన్ని చిందరవందర చేసేది.. ఇది ఒకసారి శివుడు ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయనకు ఇబ్బంది కలిగించింది. దీంతో శివుడు ఆ వరాహాన్ని చంపేస్తాడు.. ఈ ఘటనతో పార్వతి చాలా బాధపడుతుంది.. అయితే శివుడు తన తపోశక్తితో వరాహాన్ని మరలా బతికిస్తాడు. తన సేవకుడిగా ఉండాలని భూమి మీదికి పంపిస్తాడు. అలా భూమి మీదకి వచ్చిన వాడే కంజుర్లి దేవ. వరాహరూపంలో ఈ దేవుడు ఉంటాడు. అయితే ఈ సినిమాలో శివపాత్రధారి వరాహాన్ని చంపినప్పుడల్లా అతడి తల్లి కొడుతుంది. వరాహాన్ని వేటాడేందుకు వెళ్లినప్పుడల్లా 'ఓ' అని వింత శబ్దం వస్తుంది.. శివకు వచ్చే కలలో కూడా వరాహ రూపం కనిపిస్తుంది.

గుళిక దైవ

ఒకసారి కైలాసంలో బూడిదలో ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయిని పార్వతి దేవి శివుడికి ఇస్తుంది. ఆ శివుడు దానిని భూమి మీదకు విసిరేస్తాడు. దాని నుంచి గుళిక దైవ పుడతాడు.. ఆ గుళిక దైవ ను శ్రీమహావిష్ణువు సేవలో తరించాలని శివుడు ఆదేశిస్తాడు. కానీ గుళిక దైవ విష్ణువు సేవలో ఉండకుండా చిందరవందర చేస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీమహావిష్ణువు గుళిక దైవను నెలవుల సంఖ్య తక్కువగా ఉన్న మహిళకు జన్మించాలని శపిస్తాడు. అయితే ఆమె 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు.. గుళిక దైవ తాను ఎలా బయటకు రావాలని తల్లిని అడుగుతాడు.. అందరి పిల్లలాగే నువ్వు బయటికి వస్తావని ఆమె బదులిస్తుంది. తర్వాత గుళిక దైవ తల్లి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన ఆకలితో ఉంటాడు. ఏది కనిపిస్తే అది తింటాడు. చివరకు మహావిష్ణువు ప్రత్యక్షమై తన చిటికెన వేలు ఇస్తే దానిని తిని తన ఆకలిని సంతృప్తి పరచుకుంటాడు.

Kantara Movie

పార్వతి దేవి సేవకుడిగా ఉంటాడు

తులునాడు ప్రాంతంలో శివలింగం రూపంలో పార్వతి దేవి అవతరిస్తుంది. అయితే తనను కన్న బిడ్డ లాగా చూసుకున్న పార్వతి దేవికి సేవకుడిలా ఉండేందుకు గుళిక దైవ కూడా భూమి మీద అవతరిస్తాడు. అయితే ఈ సినిమాలో మొదటి సీన్ లో చూపించే ఆ రాయి మీద త్రిశూలం ఉంటుంది..ఆ రాయి మరెవరో కాదు గుళిక దైవ.. అయితే ఆ రాయిని తనకు ఇవ్వాలని రాజు కోరినప్పుడు… దైవం పూనిన వ్యక్తి ఇలా అంటాడు ' ఈరోజు నువ్వు ఇచ్చిన భూమిని మళ్లీ నీ వారసులు తిరిగి అడిగితే రక్తం కక్కుకుని చచ్చిపోతారు. అది కూడా క్షేత్రపాలకుడి చేతిలో' అని హెచ్చరిస్తాడు. దీంతో రాజు కూడా దానికి సమ్మతిస్తాడు.. రాజు వారసులు తిరిగి ఆ భూమిని దక్కించుకునేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతారు.. అటవీవాసులను చంపుతారు.. ఈ క్రమంలో గుళిక దైవ శివ పాత్రధారిని పూనినప్పుడు అదే విషయాన్ని చెప్పి, తాను క్షేత్ర పాలకుడైన గుళిక దేవను అని చెప్పి చంపేస్తాడు. తర్వాత మాయమవుతాడు.

ఎన్నో పోలికలు

ఈ సినిమాలో శివపాత్ర ధారికి శివుడికి ఎన్నో పోలికలు ఉన్నాయి. శివుడు ముక్కోపి అయినట్టు… ఇందులో శివ పాత్రధారి కి కూడా ముక్కు మీద కోపం ఉంటుంది. అదే సమయంలో ఎప్పటికీ మత్తులో ఉంటాడు. ఆ మత్తులోనే గురువను చంపిన విషయం తెలుసుకుంటాడు. కంజుర్లి దైవ , గుళిక దైవ మాదిరే ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు. చివరకు భూత కోల ఆడి రాజు వారసుడిని చంపేస్తాడు. అయితే ఇందులో శివ వేటకు వెళ్ళిన ప్రతిసారి ఒక రకమైన అరుపు వినిపిస్తుంది. ఆ అరుపే గుళిక దైవ హెచ్చరిక. అయితే ఈ సినిమాలో శివ పాత్రధారి క్లైమాక్స్ లో మాయమవుతాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది పార్ట్ 2 లో చూపిస్తారు కావచ్చు. మొత్తానికి హిందూ మైథాలజీ ఆధారంగా సినిమా తీయడం, దానిని ఇప్పటి నేటివిటీ కి కనెక్ట్ చేయడం మాత్రం గొప్ప విషయం.

Monday, November 28, 2022

అశీతి

 అశీతి మహోత్సవం

80 పూర్తయి 81

అసలు 83


1000 పౌర్ణమిలు 

వేయిసార్లు పూన్నమి చంద్రులు చూసినవారు


సన్మాన పత్రం సుగుణక్క

 ఓ  ముగ్ద సుఖుమార సుగుణ సుసంపన్నరాశి మృదు మధుర సంభాషిణీ నిర్మలహృదయ గురుకులమణి దీప్తి , మా మనో  స్పూర్తి నేత్రి ,ఆదర్శమార్తీమణి మన అందరి ప్రే...