Wednesday, April 13, 2022

ఛందస్సు

 పద్య లక్షణాలు తెలిపే శాస్త్రం.

(గేయ లక్షణాలు కూడా)

  • ఛందస్సు ఛద్‌ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది.
  • ఛద్‌ అంటే చదీ ఆహ్లాదనే, చదీ సంవరణేః
  • ఛందస్సు = జ్ఞానం + వేదం
  • ఛందస్సు రుషులకు పాదం వంటిది.
  • ఛందస్సు అనే పదం మొదట వాల్మీకి నోటివెంట వచ్చింది.
  • ఛందస్సు అంటే గాయత్రిమాత అని అర్థం.
  • చదీ ఆహ్లాదనే : ఒక విధమైన లయ కలిగి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
  • చదీ సంవరణే : మనస్సులోని భావాలకు ఒక విలక్షణమైన ఆకృతి కలిగిస్తుంది.
  • ఛందస్సు శాస్త్ర పితామహుడు, మూల పురుషుడు పింగళుడు. (పింగళ ఛందము – రచన).
  • పింగళ ఛందము సంస్కృతంలో ప్రామాణిక గ్రంథం.
  • తెలుగులో ప్రామాణికమైన గ్రంథం (ఛందోగ్రంథం)- కవిజనాశ్రయ
  • అనంతామాత్యుడు రాసిన ఛందోగ్రంథం – ఛందోదర్పణం
  • కవిజనాశ్రయ గ్రంథం రచించింది – మల్లియ రేచన .
  • ఏకాక్షర గణాలతో గణ విభజన చేసే పద్యం ఏది ?
  • ఇంద్రగణాల సంఖ్య మాత్రలన్నింటిని అనురాధ అనే పద్యంలోని వర్ణాల సంఖ్యలో సగం సంఖ్యను
  • తీసివేసి మత్తకోకిల పద్యంలో మూడవ గణం మాత్రలను తీస్తే వచ్చే సంఖ్య ఎంత ? – 6/2

ఛందస్సు రెండు రకాలు
1. మార్గ ఛందస్సు 2. దేశీ ఛందస్సు
1) మార్గ ఛందస్సు – సంస్కృతం నుంచి తెలుగులోకి చేరిన పదాలు (ఉత్పలమాల+ చంపకమాల+మత్తేభం+శార్దూలం+మత్తకోకిల)
2) దేశీ ఛందస్సు – అచ్చమైన తెలుగు పద్యాలతో ఏర్పడిన పద్యాలు (జాతి, ఉపజాతి పద్యాలు)

పద్యాలు – రకాలు
పద్యాలు మూడు రకాలు.


1. వృత్త 2. జాతి 3. ఉపజాతి
1) వృత్త పద్యాలు – ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, మత్తకోకిల
2) జాతి పద్యాలు – కందం, ద్విపద
3) ఉపజాతి పద్యాలు – తేటగీతి, ఆటవెలది, సీసం
[అరే మామ తే ఆ సీస – CODE]
అక్షరాల సంఖ్యను అనుసరించి పద్యాల పేర్లు
10 అక్షరాలు – పంక్తి
15 అక్షరాలు – అతిశక్వరి
18 అక్షరాలు – ధృతి
19 అక్షరాలు – అతిధృతి
20 అక్షరాలు – కృతి
21 అక్షరాలు – ప్రకృతి
22 అక్షరాలు – ఆకృతి

మాత్రల ఆధారంగా గతులు
3 మాత్రలు – త్రిసగతి
4 మాత్రలు – చతురస్రగతి
5 మాత్రలు – ఖండగతి
7 మాత్రలు – మిశ్రగతి
9 మాత్రలు – సంకీర్ణగతి

1. వృత్త పద్యాలు – ఒకే విధమైన గణనియమం, యతిస్థాననియమం, అక్షర సంఖ్యానియ మం కలిగిన పద్యాలు వృత్త పద్యాలు.
ఈ పద్యాల్లో సాధారణంగా ఉండే లక్షణాలు ఇవి : ఇది వృత్త పద్యం, ప్రాసనియమం కలిగి ఉంటాయి, నాలుగు పాదాలు ఉంటాయి.
ఉత్పలమాల
ఉత్పలమాలలోని గణాలు
భ, ర, న, భ, భ, ర, వ
యతి స్థానం 10వ అక్షరం
20 అక్షరాలు ఉంటాయి

చంపకమాల
చంపకమాలలోని గణాలు న, జ, భ, జ, జ, జ, ర
యతిస్థానం 11వ అక్షరం
21 అక్షరాలు ఉంటాయి.

శార్దూలం
శార్దూలంలోని గణాలు మ, స, జ, స, త, త, గ
యతిస్థానం 13వ అక్షరం
19 అక్షరాలు ఉంటాయి.

మత్తేభం
మత్తేభంలోని గణాలు స, భ, ర, న, మ, య, వ
యతిస్థానం 14వ అక్షరం
20 అక్షరాలు ఉంటాయి

1. ఉత్పలమాల పద్యంలో మొత్తం ఎన్ని లఘువులు ఉంటాయి ?
ఎ) 20 బి) 24
సి) 48 డి) 54
వివరణ- భ, ర, న, భ, భ, ర, వ = 12 x 4 = 48

2. శార్దూల విక్రీడిత పద్యంలో గురువుల సంఖ్య ఎంత ?
ఎ) 44 బి) 48 సి) 54 డి) 38
వివరణ – మ, స, జ, స, త, త, గ x 4 = 11 x 4 = 44

3. ధృత్యుండాతడు మూడులోకములలో బెంపొం దు సర్వేశ్వరా ! యతి అక్షరం ఏంటి?
ఎ) ము బి) పొ సి) బెం డి) లో
వివరణ – శార్దూలం – 13వ అక్షరం
మత్తేభ పద్యంలో లఘువు, గురువుల సంఖ్య- 80
వివరణ – స, భ, ర, న, మ, య, వ x 4 = 20 x 4= 80

జాతి పద్యం :-
ద్విపద, కంద పద్యాలు (దేశీ ఛందస్సు)
ద్విపద – ద్వి + పద = ద్విపద
జాతి పద్యాలకు తల్లి వంటిది ఈ పద్యం.
కన్నడ భాషలో రగడ అనే పద్యానికి సమాన పద్యం
తెలుగులో ద్విపద పద్యాలకు ఆద్యులు పాల్కురికి సోమనాథుడు.
బిరుదులు – కవితాచార్య, తత్వ విద్యా కలాపి, ప్రత్యక్షవృంగీశావధాన,
ద్విపద అనే ప్రక్రియ కనుమరుగవుతున్న సందర్భంలో పునఃజీవం పోసింది గోరన. అంతేకాకుండా తన రచనలు ఎక్కువ ద్విపదలోనే ఉంటాయి.
ద్విపదకి ఆధునిక కాలంలో మిక్కిలి
ప్రజా దరణ కల్పించింది తాళ్లపాక కవులు.

జవాబులు
1-సీ, 2-ఏ, 3-సీ

లఘువు-గురువు లక్షణాలు
పద్య పాదంలో దీర్ఘం లేని అక్షరాలు లఘువులు.
ఉదాహరణకు- I I I
అ, ఇ, ఎ
పద్యపాదంలో దీర్ఘం ఉన్న అక్షరాలు గురువులు
ఉదాహరణకు- U U U
ఆ, ఈ, ఏ
అరసున్నాతో కూడుకొని ఉన్నది లఘువు.
I I I I
ఉదా. – అ | టc | జ | ని
O నిండు సున్నాతో కూడి ఉన్నది గురువు
U U
ఉదా. – అం | దం
పొల్లు అక్షరంతో కూడుకున్నది గురువు
U U
ఉదా. – శం | కర్‌
విసర్గతో కూడుకున్నది గురువు
U U I U
ఉదా. – అంతః | పురం
ఐ త్వ అక్షరాలు వాటంతటవే గురువులు
U U I U
ఉదా. – ఐరావతం
ఔ త్వ అక్షరాలు వాటంతటవే గురువులు
U I U
ఉదా. – ఔషధం
ద్విత్వాక్షరానికి ముందు ఉన్నది గురువు
U I
ఉదా.- అమ్మ
సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం గురువు
I U I
ఉదా. – అపర్ణ

గణాల వర్గీకరణ
గణాల వర్గీకరణ నాలుగు రకాలు
1. ఏకాక్షర గణాలు : ఇవి రెండు ల – I , గ – U
2. ద్వయాక్షర గణాలు : ఇవి నాలుగు లల- II, లగ -IU , గగ – UU, గల – UI
3. త్రయాక్షర గణాలు : ఇవి ఎనిమిది భ- UII, జ- IUI, స- IIU, య- IUU, ర- UIU, త- UUI, మ- UUU, న- III
4. చతురాక్షర గణాలు :
ఇవి మూడు నల-IIII, నగ-IIIU, సల- IIUI
లగ – IUకు మరో పేరు వగణం
గల – UIకు మరో పేరు హగణం
త్రయాక్షర గణాలను విసర్గ గణాలు అంటారు.

ఇంద్రగణాలు (6)-
నల-IIII, నగ-IIIU, సల-IIUI, భ-UII, ర-UIU, త-UUI
[చతురాక్షరాల భరతం పడుతా – CODE]
సూర్యగణాలు
(2) :- నగణం-III, హగణం-UI

code
ఉ – భ – UUI – 20
చ – న – III – 21
శా – మ – UUU – 19
మ – స – IIU – 20

పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) నల్గడం బెదరగా బి) ప్రతతుల్‌
సి) బాఱెన్‌ మనోవేగుడై డి) సాల్పడి

నల్గడం బెదరగా | ప్రతతుల్‌ | బాఱెన్‌ మనోవేగుడై | సాల్పడి
U I U I I I I U I I U U U I U U I U U I I

అక్షరం – 20
స, భ, ర, న, మ, ర, వ – IIU
భ, ర, న, భ, భ, ర, వ – UII
UII పునారావృతం కాలేదు కనుక స, భ, ర, న, మ, ర, వ
ప్రతతుల్‌ | సాల్పడి | నల్గడం | బెదర | గాబాఱెన్‌ | మనోవే | గుడై
I I U U I I U I U I I I U U U I U U I U
స భ ర న మ ర వ

పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) తపసులెం బి) బారదో
సి) బ్రోవంగనానీవోపవో డి) పూరంబేరుల
వివరణ –
తపసులెం బారదో బ్రోవంగనీవోపవో పూరంబేరుల
I I I U UIU U U I U U I U U U U I I

మ, స, జ, స, త, త, గ (డి బి ఎ సి) – శార్దూలం
పూరంబే | రుల బా | రదో త | పసులెం | బ్రోవంగ | నీవోప | వో
UUU I I U I U I I I U U U I U U I U

పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) మైనసకు బి) వాచివికింజెడిపోయె
సి)వనకరిచిక్కె డి) మీనుతా
వివరణ : సి ఎ డి బి
మైనసకు వాచివికింజెడిపోయె వనకరిచిక్కె మీనుతా
U I I I U I I U I I U I I I I I U I UIU
న,జ,భ,జ,జ,జ,ర
వనక | రిచిక్కె | మైనస | కువాచి | వికింబె | డిపోయె | మీనుతా
III IUI UII IUI IUI IUI UIU

ఆతత పక్షమారుతరయప్రవికంపితఫరార్ణితాచల ఏ పద్య పాదం ?
ఈ పద్య పాదం ఉత్పలమాల పద్యం
l ఉత్పలమాల పద్యంలోని మాత్రల సంఖ్య ?(డి)
ఎ) 20 బి) 80 సి) 27 డి) 28
వివరణ –
ఏక మాత్ర కాలంలో పలికేది – లఘువు (I)
ద్విమాత్ర కాలంలో పలికేది – గురువు (U)
భ ర న భ భ ర వ
UII UIU III UII UII UIU IU

l శార్దూల పద్యంలోని మాత్రల సంఖ్య : మ స జ స త త గ
11 x 2 = 22
1 x 8 = 8
30 x 4 = 120




No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...