Monday, April 18, 2022

రాజ్యాంగ రచన

 రాజ్యాంగ రచన ప్రక్రియ రాజ్యాంగ సభ ద్వారా జరగాలని డిమాండ్‌ చేసిన తొలి వ్యక్తి మానవేంద్ర నాథ్‌ రాయ్‌. ఈ తరహా డిమాండ్‌నే కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా 1935లో చేసింది. ఈ సభకు ఎన్నికయ్యే అభ్యర్థులను వయోజన ఓటింగ్‌ పద్ధతి ద్వారా ఎన్నుకోవాలని 1938లో జవహర్‌లాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పక్షాన కోరారు. రాజ్యాంగ పరిషత్తు డిమాండ్‌ను తొలిసారిగా ఆగస్ట్‌ ఆఫర్‌ రూపంలో బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించింది. క్రిప్స్‌ రాయభారం ద్వారా సైద్ధాంతికంగా అధికారిక ప్రకటన చేయగా, క్యాబినెట్‌ మిషన్‌ పథకం ప్రకారం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అయింది. ఇతర ముఖ్య అంశాలు..

  • జనాభా ప్రాతిపదికన ప్రతి ప్రావిన్స్‌కు, స్వదేశీ సంస్థానాలకు రాజ్యాంగ పరిషత్తులో స్థానాలను కేటాయించారు.
  • దేశ విభజనకు ముందు ఇందులో మొత్తం 389 మంది సభ్యులు ఉండగా, విభజన తర్వాత 299కి తగ్గింది.
  • 1946 డిసెంబర్‌ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం నిర్వహించారు. దీనికి 211 మంది హాజరయ్యారు.
  • తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను, ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్‌ ఆంటోనిని ఎన్నుకున్నారు. సచ్చిదానంద సిన్హాను ఎన్నుకోవడానికి కారణం, అందరికంటే ఆయన సీనియర్‌ సభ్యుడు కావడం. దీనిని ఫ్రాన్స్‌ నుంచి స్వీకరించారు.
  • ప్రొటెం స్పీకర్‌ నియామకంలో నేటికి ఈ పద్ధతిని వినియోగిస్తున్నాం
  • రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల, 11 నెలల 18 రోజల సమయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 22 కమిటీలు ఏర్పడ్డాయి.
  • కీలకమైన మూసాయిదా కమిటీకి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వం వహించారు.
  • అన్నింటికంటే పెద్ద కమిటీ అయిన సలహా సంఘానికి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వం వహించారు.
  • రాజ్యాంగ పరిషత్‌ చేసిన విధులు: జాతీయ జెండా ఆవిష్కరణ, కామన్‌వెల్త్‌లో భారత సభ్యత్వం ఆమోదం, కేంద్ర ప్రభుత్వ భాషగా దేవనాగరి లిపిలో హిందీని గుర్తించడం, జాతీయ గీతాన్ని, గేయాన్ని ఆమోదించడం, భారత తొలి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్‌ను ఎన్నుకోవడం.
  • దేశ విభజనకు ముందు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లో ఉన్న జెస్సోర్‌-ఖుల్న నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. అక్కడ నుంచి నామినేట్‌ అయిన జోగేంద్రనాథ్‌ మండల్‌ తన స్థానాన్ని త్యాగం చేసి, అంబేద్కర్‌కు అప్పగించారు. అయితే దేశ విభజనతో అంబేద్కర్‌ స్థానాన్ని కోల్పోయారు.
  • తర్వాత ఎం.ఆర్‌.జయకర్‌ రాజీనామాతో ఖాళీ అయిన బాంబే రాష్ట్రం నుంచి మరోసారి రాజ్యాంగ పరిషత్‌కు ఆయన ఎన్నికయ్యారు.
  • భారత రాజ్యాంగ నిర్మాత, ఆధునిక మనువుగా అంబేద్కర్‌ పేరు పొందారు.
  • రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగ నిర్మాణ విధులకు సమావేశం అయినప్పుడు రాజేంద్ర ప్రసాద్‌ నేతృత్వం వహించారు. కాగా శాసనాల విధిని నిర్వర్తించినప్పుడు మాత్రం జి.వి.మౌలాంకర్‌ అధ్యక్షత వహించారు. ఈయనే తర్వాత లోక్‌సభకు తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
  • రాజ్యాంగ పరిషత్తుపై పలు విమర్శలు కూడా ఉన్నాయి.
  • అవి.. ఇందులో సభ్యులు పరోక్షంగా ఎన్నికయ్యారు. వయోజన ఓటుహక్కు ప్రాతిపదికన ఎన్నిక కాలేదు.
  • అలాగే సమావేశాల నిర్వహణకు బ్రిటిష్‌ అనుమతి ఉండాలి. అంటే సార్వభౌమాధికారం లేదు. అయితే స్వాతంత్య్రం తర్వాత పూర్తి సార్వభౌమ సంస్థగా మారింది.
  • న్యాయవాదులు, రాజకీయ నాయకుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది.
  • భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్తు 11 సార్లు సమావేశమైంది.
  • రాజ్యాంగ రచనలో భాగంగా 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు.
  • రాజ్యాంగ రచనకు చేసిన వ్యయం రూ.64 లక్షలు
  • మౌలిక రాజ్యాంగాన్ని ఇటాలిక్‌ తరహాలో రాసింది ప్రేమ్‌ బెహారి నారాయణ్‌ రైజా.్ధ
  • రాజ్యాంగానికి హిందీ భాషలో కాలిగ్రఫి చేసింది వసంత్‌ కృష్ణన్‌ వైద్య.
  • మౌలిక రాజ్యాంగ ప్రతిలో జాతీయ చిహ్నాన్ని చిత్రించింది దీనానాథ్‌ భార్గవ.
  • చేతితో రాసిన రాజ్యాంగాన్ని ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో భద్రపర్చారు. జడవాయువు అయిన
  • హీలియంతో నింపిన పెట్టెలో దాన్ని ఉంచారు. ఈ వాయువు చర్య జరపదు కాబట్టి రాజ్యాంగ ప్రతి అలాగే ఉంది.
  • రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారుగా వ్యవహరించిన బెనెగల్‌ నరసింగరావు, తర్వాత హేగ్‌లోని
  • అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే.
  • రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక అయిన తెలుగువాళ్లు-ఎన్‌జీ రంగా, ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, మోటూరి సత్యనారాయణ, కళా వెంకట్రావ్‌, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు.
  • రాజ్యాంగ పరిషత్తుకు ఉపాధ్యక్షులుగా హెస్‌సీ ముఖర్జిని, వి.టి. కృష్ణమాచారిని ఎన్నుకున్నారు.
  • మూసాయిదా కమిటీ మొత్తం 141 రోజులు విధులు నిర్వహించగా, రాజ్యాంగ పరిషత్‌ డ్రాఫ్ట్‌ను 114 రోజులపాటు పరిశీలించింది.

మాదిరి ప్రశ్నలు

1. కింది వానిలో సరైనవి ఏవి? (సి)
1. రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు
2. రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారు గా బెనెగల్‌ నర్సింగరావు వ్యవహరించారు
3. రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారుగా బీఆర్‌ అంబేద్కర్‌ వ్యవహరించారు
ఎ. 1 సరైంది బి. 1, 3 సరైనవి
సి. 1, 2 సరైనవి డి. 3 సరైంది

2. కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? ( బి)
ఎ. రాజ్యాంగ రచన క్రమంలో రాజ్యాంగ పరిషత్తు అన్ని అంశాలను ఓటింగ్‌ ద్వారా నిర్ణయించింది
బి. రాజ్యాంగ పరిషత్తు సమ్మతి, సమన్వయ పద్ధతిని వినియోగించింది
సి. ఓటింగ్‌, సమ్మతి, సమన్వయ పద్ధతిని వినియోగించింది డి. పైవేవి కాదు

3. పట్టాబి సీతారామయ్య నేతృత్వం వహించిన కమిటీలు ఏవి? (సి)
1. సభా కమిటీ
2. క్రిడెన్షియల్‌ కమిటీ
3. చీఫ్‌ కమిషనర్ల ప్రావిన్స్‌ల కమిటీ
ఎ. 1, 2 బి. 2, 3
సి. 1, 3 డి. 1, 2, 3

4. కింది వానిలో రాజ్యాంగ పరిషత్తు నిర్వహించిన విధులు ఏవి? (డి)
ఎ. రాజ్యాంగ రచన
బి. పార్లమెంట్‌గా వ్యవహరించడం
సి. జాతీయ జెండా ఆమోదం
డి. పైవన్నీ

5. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వం వహించిన మూసాయిదా కమిటీకి సంబంధించి కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి? (డి)
1. ఈ కమిటీ ఆగస్ట్‌ 29, 1947న ఏర్పాటైంది
2. మూసాయిదా కమిటీ మొత్తం 141 రోజులు పనిచేసింది
3. ఇందులో ఆరుగురు సభ్యులు ఉన్నారు
4. బెనెగల్‌ నర్సింగరావు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నారు
ఎ. 1, 2 సరైనవి
బి. 1, 3, 4 సరైనవి
సి. 1, 2, 3, 4
డి. 1, 2, 3 సరైనవి

6. వివిధ కమిటీలు, వాటి చైర్మన్లతో జతపర్చండి. (సి)
1. సారథ్య కమిటీ ఎ. వరదాచారి
2. రాష్ర్టాల రాజ్యాంగాల కమిటీ బి. మోటూరి సత్యనారాయణ
3. భాషా కమిటీ సి. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌
4. పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ డి. రాజేంద్రప్రసాద్‌
ఎ. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
సి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

7. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వం వహించిన మూసాయిదా కమిటీలో భాగం కానివారుఎవరు? (డి)
ఎ. గోపాలస్వామి అయ్యంగార్‌
బి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
సి. కె.ఎం. మున్షి
డి. గోపీనాథ్‌ బర్దోలాయ్‌

8. కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి? (బి)
1. రాజ్యాంగ సభలో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని అంబేద్కర్‌ ప్రవేశపెట్టారు
2. రాజ్యాంగ సభలో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రవేశపెట్టారు
3. 1947 జనవరి 22వ తేదీన లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు
ఎ. 1, 3 సరైనవి
బి. 2 సరైనది
సి. 2, 3 సరైనవి
డి. 1 సరైంది

9. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కింది వానిలో సరికానిది ఏది? (సి)
ఎ. ఇది పరోక్ష పద్ధతిలో ఎన్నికైంది
బి. ఇది సార్వభౌమ సంస్థ కాదు
సి. ఇది ప్రత్యక్షంగా ఎన్నికైంది
డి. ఇందులో కొందరు నామినేటెడ్‌ సభ్యులు కూడా ఉన్నారు

10. దేశ విభజన మూలంగా రాజ్యాంగ పరిషత్తులో స్థానం కోల్పోయిన వారిని గుర్తించండి? (డి)
1. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌
2. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
3. సోమ్‌నాథ్‌ లహరి
ఎ. 1, 2 బి. 2
సి. 2, 3 డి. 1, 3

11. కింది వాటిని కాలక్రమం ఆధారంగా అమర్చండి? (ఎ)
1. క్యాబినెట్‌ మిషన్‌ ప్రణాళిక
2. ఆగస్ట్‌ ఆఫర్‌
3. క్రిప్స్‌ రాయభారం
4. ముసాయిదా కమిటీ ఏర్పాటు
ఎ. 2, 3, 1, 4 బి. 2, 1, 3, 4
సి. 2, 4, 1, 3 డి. 2, 3, 4, 1

12. రాజ్యాంగ పరిషత్తుకు ఏ ప్రావిన్స్‌ నుంచి ఎక్కువ మంది ప్రతినిధులు ఉన్నారు? ( సి)
ఎ. మద్రాస్‌
బి. పశ్చిమబెంగాల్‌
సి. యునైటెడ్‌ ప్రావిన్స్‌
డి. సెంట్రల్‌ ప్రావిన్స్‌-బేరర్‌

13. కింది సంఘటనలు, తేదీలను జతపర్చండి. (బి)
1. లక్ష్యాలు-ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టిన రోజు ఎ. జనవరి 26, 1950
2. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు బి. ఆగస్ట్‌ 29, 1947
3. ముసాయిదా కమిటీ ఏర్పాటైన రోజు సి. డిసెంబర్‌ 13, 1946
4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు డి. నవంబర్‌ 26, 1949
ఎ. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
బి. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

14. రాజ్యాంగ పరిషత్తుకు ఏ స్వదేశీ సంస్థానం నుంచి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు? (ఎ)
ఎ. మైసూర్‌ బి. హైదరాబాద్‌
సి. గ్వాలియర్‌ డి. ట్రావెన్‌కోర్‌

15. రాజ్యాంగ పరిషత్తులో హిందూ మహాసభకు ప్రాతినిథ్యం వహించింది ఎవరు? (సి)
1. శ్యామప్రసాద్‌ ముఖర్జి
2. హెచ్‌పీ మోడి
3. ఎం.ఆర్‌.జయకర్‌
ఎ. 1, 2 బి. 1
సి. 1, 3 డి. 1, 2, 3

16. కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (ఎ)
ఎ. రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది ఎన్నిక కాగా, కొంతమంది నామినేట్‌ అయ్యారు
బి. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు అందరూ ఎన్నికైన వారే ఉన్నారు
సి. రాజ్యాంగ పరిషత్తులో మహిళలు లేరు డి. రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికైన వారి కంటే నామినేట్‌ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది

17. బేగం ఎయిజాజ్‌ రసూల్‌కు సంబంధించి కింది వానిలో సరైనది ఏది? (బి)
ఎ. రాజ్యాంగ పరిషత్తుకు ఆమె ఉపాధ్యక్షురాలు
బి. రాజ్యాంగ పరిషత్‌లో సభ్యురాలిగా ఉన్న ఏకైక ముస్లిం మహిళ
సి. రాజ్యాంగ పరిషత్తు పార్లమెంట్‌ రూపంలో సమావేశం అయినప్పుడు అధ్యక్షత వహించిన మహిళ
డి. ఏదీ కాదు

18. న్యాయవిద్య చదవకుండా మూసాయిదా కమిటీలో సభ్యుడిగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు? (సి)
ఎ. కృష్ణ స్వామి అయ్యర్‌
బి. బీఎల్‌ మిట్టర్‌
సి. టి.టి. కృష్ణమాచారి
డి. కె.ఎం. మున్షి

19. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజే అమల్లోకి వచ్చిన అంశాలు కింది వానిలో ఏవి? (డి)
ఎ. పౌరసత్వం బి. ఎన్నికలు
సి. తాత్కాలిక పార్లమెంట్‌
డి. పైవన్నీ




ప్రపంచ దేశాల్లో ఆధునిక రాజ్యాల అవతరణకు మూలాధారం రాజ్యాంగం. ఆధునిక రాజ్యాల రాజకీయ ప్రక్రియా విధానాన్ని సూచించే నియమ నిబంధనల సముదాయ రూపంలో ఒక అత్యున్నత చట్టం ఉంటుంది


దీన్నే రాజ్యాంగం అంటారు.
-క్రీ.పూ. 384-322 కాలానికి చెందిన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అప్పటికే ఉన్న 156 రాజ్యాంగాలను అధ్యయనం చేసి రాజ్యాంగ భావనను వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వాలను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించి రాజనీతిశాస్త్ర పితామహుడు అయ్యాడు. భారత రాజ్యాంగ ఆవిర్భావానికి కొన్ని చట్టాలు దోహదపడ్డాయి. రాజ్యాంగ నిర్మాణ పరిణామ క్రమాన్ని బీసీ రావత్ 6 దశలుగా అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. అవి..

Iవ దశ (1600-1773)
-మొదటి ఎలిజబెత్ మహారాణి 1600, డిసెంబర్ 31న ఈస్టిండియా కంపెనీకి వ్యాపారం చేసుకునేందుకు రాయల్ చార్టర్ (ఏదైనా ఒక సంస్థ లేదా సంఘాల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీచేసే అనుమతిపత్రాన్ని చార్టర్ అంటారు) ద్వారా అనుమతించారు. దీంతో దేశంలో వ్యాపారం చేసుకునే క్రమంలో దేశంపై కంపెనీ పాలనాధికారాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కంపెనీ బెంగాల్, బొంబాయి, మద్రాసు రాష్ర్టాలను స్వాధీనం చేసుకుంది.
-ఈస్టిండియా కంపెనీ చేస్తున్న అవినీతిని బయటపెట్టేందుకు బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బుర్గాయిక్ అధ్యక్షతన ఒక కమిటీని రహస్యంగా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కంపెనీ అవినీతి పెరిగిపోయిందని నివేదిక ఇచ్చి, కంపెనీ కార్యక్రమాలను క్రమబద్దం చేయమని సిఫారసు చేసింది.

IIవ దశ (1773-1858)
రెగ్యులేటింగ్ చట్టం (1773):
రెగ్యులేటింగ్ అంటే క్రమబద్దం చేయడం. వ్యాపారరీత్యా భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీని క్రమబద్దం చేయడంతో పాటు దాని కార్యక్రమాలను నియంత్రించడానికి చేసిన మొదటి చట్టం కాబట్టి దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. దీన్ని దేశానికి సంబంధించి మొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా కూడా పేర్కొంటారు. అంతవరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్టిండియా కంపెనీకి మొదటిసారిగా రాజకీయ, పరిపాలన, అధికారాలు లభించాయి.
-ఈ చట్టాన్ని 1773, మే 18న అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వహణ మండలిని ఏర్పాటు చేశారు.

-ఆ విధంగా మొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులైనవారు వారెన్ హేస్టింగ్స్. కార్యనిర్వహణ మండలిలోని నలుగురు సభ్యులు 1) క్లావెరింగ్ 2) బార్‌వెల్ 3) ఫిలిప్ ఫ్రాన్సిస్ 4) మాన్‌సన్.
-1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్‌ను కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఎంఫే, న్యాయమూర్తులు రాబర్ట్ చాంబర్స్, సీజర్ లైమెస్టర్, జాన్ హైడ్.

పిట్స్ ఇండియా చట్టం (1784):
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ ఈ చట్టాన్ని ప్రతిపాందించడంతో దీన్ని పిట్స్ ఇండియా చట్టం అని వ్యవహరిస్తారు. ఈ చట్టాన్ని చేసిన సమయంలో గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్.

-ఇంగ్లండ్‌లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని ఆరుగురు సభ్యులతో ఏర్పాటుచేసి కంపెనీ రాజకీయ, సైనిక, రెవెన్యూ వ్యవహారాలను దీనికి అప్పగించారు. ముగ్గురు డైరెక్టర్లతో నియమించిన ఒక రహస్య కమిటీ ఈ బోర్డు ఆదేశాలను భారతదేశానికి చేరవేసేది. ఈ కోర్ట్ ఆఫ్ డెరెక్టర్స్ వాణిజ్య వ్యవహారాలకే పరిమితమైంది.

చార్టర్ చట్టం (1793):
ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేశారు. కంపెనీకిగల వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరో 20 ఏండ్లు పొడిగించారు. బోర్డు కార్యదర్శిని పార్లమెంట్‌లో కూర్చోవడానికి అనుమతించారు. ఈ చట్టం సమయంలో గవర్నర్ జనరల్ కారన్‌వాలీస్.
-భారతీయుల హక్కులు, ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ చేసే నిబంధనలకు చట్టాలతోపాటుగా సమాన విలువు ఉంటుంది.

చార్టర్ చట్టం (1813):
దీని ద్వారా ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో 20 ఏండ్లు పొడిగించారు. తేయాకు, చైనాతో వ్యాపారం మినహా కంపెనీకి వర్తకంపైగల గుత్తాధిపత్యాన్ని తొలగించి ప్రతి బ్రిటన్ పౌరుడికి వర్తకం చేసుకునే అవకాశం కల్పించి కంపెనీని కేవలం పరిపాలనాపరమైన సంస్థగా మార్చారు.
-భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి ఏడాది రూ. లక్ష కేటాయించేలా ఏర్పాటు చేశారు. సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. ఈస్టిండియా కంపెనీలో భారతీయులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
-ఈ చట్టం ద్వారా భారత్‌కు క్రిస్టియన్ మిషనరీలు రావడానికి అనుమతించడంతో చర్చిలు, విద్యాలయాలు, ఆస్పత్రులు స్థాపితమయ్యాయి. దీంతో మతమార్పిడులకు అవకాశం ఏర్పడింది.

చార్టర్ చట్టం (1833):
దీని ద్వారా ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో 20 ఏండ్లు పొడిగించారు. ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి భారత్ గవర్నర్ జనరల్‌గా మారింది. దీంతో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారత మొదటి గవర్నర్ జనరల్ అయ్యాడు.
-ఈస్టిండియా కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి పరిపాలనా సంస్థగా మార్చారు. యూరోపియన్లు భారత్‌కు వలసవచ్చేందుకు, భూమి, ఆస్తులు సంపాదించుకునేందుకు ఉన్న నియంత్రణలను తొలగించి వారికి పూర్తిస్వేచ్ఛ కల్పించారు. దీంతో బ్రిటిష్ వలసరాజ్య స్థాపనకు చట్టబద్దత కల్పించినట్లయ్యింది.

-భారతీయ పాలనలో కోవనెంటెడ్ పోస్టుల్లో మెరిట్ కలిగిన భారతీయులను నియమించాలని రాజారామ్మోహన్ రాయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సివిల్ సర్వీసుల నియమకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డెరెక్టర్స్ వ్యతిరేకించడంతో కొంతమేరకు పురోగతి సాధించింది.
-భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్‌ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.

చార్టర్ చట్టం (1853):
చార్టర్ చట్టాల్లో ఇది చివరిది. ఈసారి కంపెనీ పాలనను పొడిగించలేదు. బ్రిటన్ పార్లమెంట్ అనుమతి ఉన్నంతవరకు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం కల్పించారు. దీంతో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయ్యింది.
-గవర్నర్ జనరల్ సాధారణ మండలి అధికారాలను శాసన, కార్యనిర్వహణ విధులుగా విభజించారు. శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం మొదటిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని మినీ పార్లమెంట్ అంటారు.






No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...