Thursday, March 19, 2026

 మా అనురాగ దీపం

అమరుడా మా అప్పలస్వామి

నీవు లేని రోజుంటుందని

ఊహించలేదు 

మేము ఊహించలేదు

నీ చల్లని  సాన్నిహిత్యం

నీ నులి వెచ్చని ఆదరణ

మేమెలా మరతుము

ఓ ఆపద్బాందవా

ఓ ప్రేమామయి ఓ స్వామి

నినీ మరువలేమయా

నిను విడువలేమయా

ఓ అనురాగదీపమా

మా అప్పలస్వామి


ఆనందానికి రూపం మా అప్పలస్వామి

మా కుటుంబ కాపరి ఓ స్వామి నేస్తమా

బందువులంటే నీకెంతో ఆపేక్ష

అన్నదమ్ములనిన తరగని ప్రేమ

నీతో గడిపిన క్షణాలు

మేము మరువం

నీ ఙ్ఞాపకాలు మా మదిలో

పదిలం పదిలం


ఓ ఆపద్బాందవా

ఓ ప్రేమామయి ఓ స్వామి

నినీ మరువలేమయా 

నిను విడువలేమయా

ఓ అనురాగదీపమా

మా అప్పలస్వామి


నిను ప్రేమించిన భార్యకు ప్రేమను పంచావు

నిను ప్రేమించే బిడ్డలకు ఆదర్శ తండ్రివైనావు

నీ నిస్వార్ద ప్రేమకు సాక్ష్యాలే మేము

నీవెక్కడ ఉన్నా చల్లగా ఉండు తండ్రి

నీ చల్లని చూపులు నీ దీవెన హస్తాలు

మా వంశాలకు వెలుగు నింపాలి

ఓ ఆపద్బాందవా

ఓ ప్రేమామయి ఓ స్వామి

నినీ మరువలేమయా 

నిను విడువలేమయా

ఓ అనురాగదీపమా

మా అప్పలస్వామ









 చాకలి వాళ్ళ మీద రెడ్ల దాడి

3 నెలల పసికందును కాళ్ళతో త్రొక్కి

చంపిన సంఘటన దిగ్బ్రమ కలిగిస్తుంది

సాధించాం సాధించాం అనుకుటుంన్నాం

ఈ సంఘటన మన భాధ్యతను గుర్తు చేస్తుంది

ఈ సంఘటన నా చిన్నతనంలో జరిగిన నా బాల్యపు మరకను గుర్తు చేస్తుంది.ఇది 1977 లో జరిగింది.నేను దివిలి గ్రామంలో ఉండేవాళ్ళం. హైస్కూల్లో ఆరవతరగతి చదువుతున్న రోజులు

హైస్కూలు విడిచిపెట్టారు .అందరం ఇంటికి వస్తున్నాం దివిలి గ్రామం నడిబోడ్డున పెద్ద కాలువ ఉంటుంది ఆ కాలువ గట్టునుండి ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఆ రోజు ఊరి జనం అంతా నిలబడి ఉన్నారు ఏదో సినిమా సీనులా అక్కడ తెల్ల పంచులు కట్టుకున్న ఓ ఐదుగురు చెక్క కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.అందులో మధ్యలోని వ్యక్తి అస్తమాను మీసం తిప్పుకుంటున్నాడు.ఆ ఐదుగురు చేతుల్లో చేతికర్రలున్నాయి.కొంత సేపటికి ఊరులో నుండి ఇంటికి పోవడానికి బట్టలమూట పట్టుకుని ఓ ముసలమ్మ వచ్చింది వాళ్ళను దాటుకుని వెళతా ఉంటే మధ్యలోని వ్యక్తి ఉన్నపళంగా లేచి బంలంగా బాదేసాడు ముసలిదాన్ని వెర్రి కేకలు పెట్టుకుంటూ ఏడుస్తూ పారిపోయింది.ఇంతలో ఓ వ్యక్తి సైకిలు పై మూటను పట్టుకు వచ్చాడు ముగ్గురు లేచి ఇష్టవచ్చినట్లు కొట్టారు.అతను దణ్ణం పెడుతున్నా వినలేదు.అలా చీకటి పడేవరకు బయటకు వెళ్ళి ఇళ్ళకు వస్తున్న చాకలి కుటుంబాలను చితకబాదారు లంజాకొడుకులు

తలుచుకుంటుంటే అప్పుడు భయంతో కొట్టుకున్న గుండే ఇప్పుడు ఆవేశంతో కొట్టుకుంటుంది ఎంత దురాగతాలను భరించారు 

యాభై ఏళ్ళైనా చాకళ్ళ పరిస్దితి మారలేదు.మందకృష్ణే లేకపోతే మన జాతి పరిస్దితి ఏంటి. ఏంత ధైర్యంగా ఉన్నాం మహానుభావుడువలన

 తమ్మయ్యపేట చింతచెట్టు

సినిమారంగానికి  ప్రత్యేకమైన ప్రదేశాలంటే ఎంతో తగని మక్కువ.స్దానికులకు కూడా ఆ ప్రాంత గొప్పదనం తెలియదు కాని సినిమా పరిశ్రమ ఆ ప్రాంత గొప్పదనాన్ని గుర్తించడమే కాదు అక్కున చేర్ఛుకోవడమే కాదు ప్రసిద్ది పొందేలా చేస్తుంది   .అటువంటి అరుదైన ప్రదేశమే తమ్మయ్యపేట చింతచెట్టు.కొత్తపల్లి మండలంలో ఓ మారు మూల కుగ్రామం తమ్మయ్యపేట.కాని సినీ పరిశ్రమకు ప్రకృతి ప్రసాదించిన అరుదైన అపురూపమైన సహజ సుందర సినీ సెట్టింగు మన తమ్మయ్యపేట చింతచెట్టు   .సినీ పరిశ్రమ తమ్మయ్యపేట చింత చెట్టును  తమ కెమెరాలలో ఎంతో అందంగ చిత్రీకరిస్తూన్నాయి. పురాతన చింత చెట్టు ఆ చింత చెట్టు చుట్టూ రచ్చబండ, పారే ఉప్పుటేరు,వందల పడవలు పయనిస్తూ వెళ్ళటం ,చిన్న పడవల పై చేపలు పట్టే జాలరులు , ఆ సుందర దృశ్యం చూసి తీరవలసిందే.అందుకే ప్రముఖ దర్శకులు క్రిష్ లాంటివారిని వెబ్ సీరిస్ తీసేలా చేసింది.మత్య్సకారుల జీవన విధానం పై చిత్రీకరణ జరపాలంటే తమ్మయ్యపేట చింత చెట్టు ప్రాంతానికి మించినదిలేదు.ఎందరో ప్రముఖనటులు ఈ చింతచెట్టుక్రింద రచ్చబండ సీనుల్లో నటించి పేరుతెచ్చుకున్నారు. తమ్మయ్యపేట గ్రామస్తులు మెల్లగ షూటింగులకు అలవాటు పడ్డారు.నటులకు సహకరించడం, షూటింగు అవసరాలు తీర్చడం,పడవులు వలలు సమకూర్చడం చేస్తూ  కాస్తో కూస్తో షూటింగుల ద్వారా సంపాదించడం నేర్చుకున్నారు.షూటింగులకు వచ్చే వారికి చేపల కూరలు వండి పంపిస్తూ ఆనందిస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ హిరో శాసన సభ్యులుగ ఉన్న నియోజకవర్గంలోనే ఉంది తమ్మయ్యపేట.ఇటువంటి ప్రసిద్ది పొందిన తమ్మయ్యపేట చింతచెట్టు మరికొద్ది రోజుల్లో కనుమరుగు కానుండటం విచారించవలసిన విషయం.ఉప్పుటేరు కోత వలన తమ్మయ్యపేట చింతచెట్టు ప్రమాదంలో పడింది.యేటిగట్టు ఇసుక ఉప్పుటేరు ఆటు పోట్లకు అండలు అండలుగ జారిపోతుంది.స్దానిక ప్రజా ప్రతినిధులకు,అధికారులు కళాపోషకులు కాకపోవడం వలన తమ్మయ్యపేట చింత చెట్టు ప్రాధాన్యత తెలియటం లేదని సినీ పరిశ్రమకు చెందినవారు వాపోతున్నారు.స్దానిక సినీ కళాకారులు ముక్తకంఠంతో పిఠాపురం శాసన సభ్యులు ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి యేటి గట్టు రక్షణకు నిధులు మంజూరు చేయవలసినదిగ విఙ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు షూటింగు చేయడానికి మాత్రమే పనికి వస్తుందని అదే యేటిగట్టును బలపరచడం వలన చింత చెట్టు చుట్టూ షూటింగ్ చేయడానికి వీలు పడుతుందని సినీ దర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రహదారి మార్గం అభివృద్ది చేయవలసినదిగ కోరుతున్నారు. దీనివలన పెద్ద సినిమాలు కూడా షూటింగులు జరుపుకునే అవకాశం ఉందని తెలుపుతున్నారు.


మహర్

 మహర్  అంటే మాల  ఏది నిజం

అంబేద్కర్ రాసిన అంటరానివారు ఎవరు

పుస్తకంలో  మహారాష్ట్రలో మహర్ లు  చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉన్నారు క్రీ శ 600 వందల సంవత్సరం నుండి ఇది ఉంది.అక్కడ మహర్లు చచ్చిన గొడ్డు గురించి తగువులాడి మరీ తీసుకునేవారు.ఇక్కడ ఆంధ్రలో మాదిగలు ఇదే హక్కు కలిగి ఉన్నారు.అయితే అంబేద్కర్ నిర్దారించిన దాని ప్రకారం ఆవు మాంసమే అంటరాని తనాన్ని సృష్టించింది.యఙ్ఞాలలో ఆవులను పరిశుభ్రమైన తాజా మాంసాన్ని తినే బ్రాహ్మణులు క్రీ శ 600 నుండి తినడం మానివేసారు.కాని ఊరు చివర పేదరికంలో బ్రతికే వారు దీనిని మానుకోలేదు సరికదా తాజ మాంసం తినే సంపద వారి దగ్గరలేదు.అందుకని చనిపోయీన గొడ్డు గురించి గొడవ పడి అది హక్కుగ పొందే లా చేసుకున్నారు.అది అపరిశుభ్రత అసహజం నుండి అంటరాని తనానికి దారి తీసింది.ఆపును మరింత పవిత్ర జంతువును చేయడంతో ఈ అంటరాని తనం మరింత ముదిరింది.మహరాష్ట్రలో మహర్ లు దీనిని హక్కుగ కలిగి ఉన్నారని అంబేద్కర్ రాసారు.అయితే మహర్ లు కూలీలుగ కుల వృత్తిలేని వారిగలేరు.వారు చర్మశుద్ది చేసారు.ఇక్కడ మాదిగలు అదే హక్కు కలిగి చర్మ వృత్తి కలిగి ఉన్నారు.ఇక్కడ మాలలు కుల వృత్తిలేకుండా వుండి కూలీలుగ ఉన్నారు. అంబేద్కర్  పశుమాంశ భక్షణను తీవ్రంగ వ్యతిరేకించారు.తినవద్దని మహర్ లను కోరారు.ఆయనకు దక్షిణాది రాష్ట్రాలలో ఏం జరుగుతుందో తెలియదు అని రాసారు.ఆయనకు అన్ని రాష్ట్రాల షెడ్యూలు తెగల జీవన విధానంపై స్పష్టమైన అవగాహనలేదని అన్నారు.ఎందుకంటే సమాచార వ్యవస్ద అప్పటికి ఏం మాత్రం అభివృద్ది చెందలేదని మనకు తెలియందు కాదు.ఆయనకు మహర్ లు పశుభక్షణ చేయటం ఇష్టంలేదు.మరి మాలలు ఎందుకు మహర్ లు మాలలు అంటున్నారో అర్దం కాలేదు.అంబేద్కర్ తన కులాన్ని చర్మకార వృత్తి కలిగినదిగా చెప్పుకుంటానికి ఒకరకంగా ఒప్పుకోలేదు.అందుకే మాలలు మహర్లను ఒక గాటిన కట్టి అందులో ఉంచాడు.అందుకే మాలలు ఆయనను మా వాడు మా మాల వాడు అంటున్నారు.కాని అంబేద్కర్ మహర్ లు చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉన్నారు అన్నారు.మరి మాలలు చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉండటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.లేదంటే మహర్లు మాదిగలు ఒకటే అని ఒప్పుకుంటే బాగుంటుంది

ఓ మనస్సా

 ఓ మనస్సా ఎందుకు 

తలపులలో తూగుతున్నావు

తొలిగాయపు ఆనవాలును

 గాలిపటంలా ఎందుకు

వెతుకుతున్నావు

ఓ మనస్సా ఎందుకు 

తలపులలో తూగుతున్నావు

తొలిగాయపు ఆనవాలును

 గాలిపటంలా ఎందుకు

వెతుకుతున్నావు



ఆకులు రాలిన అడవిని

ఎందుకు గురుతు చేస్తున్నావు

సోలిన పూలదారిన

ఓ మనస్సా ఎందుకు నడుస్తున్నావు

ఆకులు రాలిన అడవిని

ఎందుకు గురుతు చేస్తున్నావు

సోలిన పూలదారిన

ఓ మనస్సా ఎందుకు నడుస్తున్నావు

ఓ మనస్సా ఎందుకు 

తలపులలో తూగుతున్నావు

తొలిగాయపు ఆనవాలును

 గాలిపటంలా ఎందుకు

వెతుకుతున్నావు

ఓ మనస్సా ఎందుకు 

తలపులలో తూగుతున్నావు

తొలిగాయపు ఆనవాలును

 గాలిపటంలా ఎందుకు

వెతుకుతున్నావు


చిరునవ్వుల పలువరసను

చిరునవ్వుల పలువరసను

పలువరసల పదాలతో కొలుస్తున్నావు

ఓ మనస్సా నీకెందుకంత ముస్తాబు

ఓ మనస్సా నీకెందుకంత ముస్తాబు





మంచుకలసిన మకరందంలా

ఊహలపల్లకి తిరిగిన చోటును

 ఓ మనస్సా ఎందుకు పలవరిస్తావు

మంచుకలసిన మకరందంలా

ఊహలపల్లకి తిరిగిన చోటును

 ఓ మనస్సా ఎందుకు పలవరిస్తావు

 ఓ మనస్సా ఎందుకు పలవరిస్తావు


మరచిన వలపు చల్లని మేఘంలా

నా మనసును ఎందుకు పిలుస్తుంది

పదాలు ఆవిరైన చీకటి దారిలో

పెదవులు తడుపుతున్న తుషారబిందువులా

నా మనస్సెందుకు ఉరుకుతుంది

మరచిన వలపు చల్లని మేఘంలా

నా మనసును ఎందుకు పిలుస్తుంది

పదాలు ఆవిరైన చీకటి దారిలో

పెదవులు తడుపుతున్న తుషారబిందువులా

నా మనస్సెందుకు ఉరుకుతుంది


దేనిని వెతుకుపోతుందీ ఈ నడక

మతిలేని నడకకు నిదురేలేదు

పచ్చని కొనలు  కునుకుతీస్తున్నాయి

దేనిని వెతుకుపోతుందీ ఈ నడక

పచ్చని కొనలు  కునుకుతీస్తున్నాయి

లోయ దారి హాయిని పరిచి రమ్మంది

వనదేవత నా నడకను చూసి మురిస్తుంది

వనదేవత నా నడకను చూసి మురిస్తుంది


 తొలి తలపు లేవకముందే

తెలవారుతున్న తీరానికి

చేరుకుంటానులే మనస్సా



తొలి తలుపు తెరవకముందే

ఏ తూనీగలు ఎగరకముందే

తెనే చుక్కలు రాలకముందే

తొలి కిరణం చేరకముందే

నిశ్శబ్దంగా నడుస్తు చేరుకుంటానులే

నిశ్శబ్దంగా నడుస్తు నిను చేరుకుంటానులే








మాదిగల పై చివరి సందేశం

 మాదిగ జనమా వర్దిల్లు

వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు

ప్రపంచ పటమే నీ రూపం

ఇక వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు

మాదిగ జనమా వర్దిల్లు

వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు

ప్రపంచ పటమే నీ రూపం

ఇక వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు



మాదిగ జాతి ఎగబాకు

దిగువ నుంచి ఎగువకు ఎగబాకు

ఎగబాకు పై పైకి ఎగబాకు

  నీ తెగువే నీ ఊతం 

ఎగబాకు ఎగబాకు ఎగబాకు

విద్య నీ పాదాక్రాంతం కావాలి

విద్యలన్నీ నీ పాదాక్రాంతం కావాలి

వింద్య హిమాచలం కావాలి

సంపదలో సాగరాన్ని మించిపోయ్ 

లే లే  మాదిగ జనమా లే లే

నీ చరిత్రను నువ్వే తవ్వి తీసేయ్ 

నీ చరిత్రను నువ్వే రాస్తూ పోవోయ్


మాదిగ జనమా వర్దిల్లు

వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు

ప్రపంచ పటమే నీ రూపం

ఇక వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు

మాదిగ జనమా వర్దిల్లు

 నీ చూపు ఇక సంపాదనపై నిలవాలి

బంగారంపు గనులలో నువు వాలాలి

నీ ఇల్లు ధనరాశులతో తులతూగాలి

మాదిగ జాతి వర్దిల్లు వర్దిల్లు

వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు 



ఈ దేశపు భూమి నీదేనోయ్ నీదేనోయ్

ఈ భూమి మన జాంభవునిది

ఈ కొండలు కోనలు చేలు చెలములు

ఆక్రమించు ఆక్రమించు ఆక్రమించు

శ్రమిస్తూ ఆక్రమించు ఆక్రమణకై శ్రమించు

ఈ దేశపు మట్టి నీదేనోయ్ నీదేనోయ్



మాదిగ జనమా లే లే లే

తిను తిను తిను కావలసినంతా తిను

ఈ దేశపు పంట నీదేనోయ్ నీదేనోయ్

మాదిగ జనమా లే లే లే

తిను తిను తిను కావలసినంతా భుజించు

ఈ దేశపు పంట నీదేనోయ్ నీదేనోయ్



ఈ పండ్లు గింజలు  నీవేనోయ్ నీవేనోయ్

పొదుపుతో ఆక్రమించు క్రమంగా ఆక్రమించు

పొదుపే నీ పని నీ ధ్యాస నీ శ్వాస

ఆక్రమించెయ్ ఈ దేశం నీదే 

ఆక్రమించు శ్రమిస్తూ తపిస్తూ

ఆక్రమించు క్రమంగా ఆక్రమించెయ్


రాజులలో ప్రధముడివి

శూరత్వం నీ ఇంటిపేరు

చేపట్టెయ్ చేపట్టేయ్ 

అందిన పదవులు చేపట్టేయ్ 

అందినంతా అదిమి పట్టేయ్ 

మాదిగ జాతి వర్దిల్లు వర్దిల్లు

నిలబడు నిలబడు నిలుస్తు కలబడు

అంతా నీదే అంతా నీదే 

ఓ మాదిగ జాతి వెలుగులు చిందేయ్ 

వెలుగుల్లో నీ జాతిని వెలిగించేయ్

వెలుగుల్లో నీ జాతిని వెలిగించేయ్







ఉగాది 2026 కవిత

 పరాశురభాణం

ఉగాది కవిత

రచన బెన్ జాన్సన్ 

బాల సాహితీ రచయిత


పరాభవం పరాభవం

మానవజాతి మానవత్వానికి

అహింసా చేతి కర్రకు పరాభవం

ప్రపంచ లేత చిగురుల మొలకలను

యుద్దోన్మాదపు కారుమేఘాలు కాల్చేస్తున్నాయి

పనిలేని ఆక్రమణ ఉన్మాదం గీతలు దాటేస్తుంది

పరాభవం మానవ హితిహాసాల 

 పరాభవాలకు ట్రంకు (ట్రంపు ) పెట్టె దొరికింది

దాని తాళం తగులబెట్టే తాండవం ఎక్కడుంది

మహానుభావులందరు ఆదిమానవులై

అడవుల్లో రాతిగుహల్లో దాకున్నారేమో

రాజ్యోన్మాదపు నగలు గలగలలాడుతూ

వికృత రూపంలో గజ్జెల శబ్దం చేస్తున్నాయి

మేధావుల పిడికిలి పిరికిదైపోయిందేమో

గర్జలను గెద్దలు ఎత్తుకు పోయాయేమో

ఓ ప్రపంచ గొంతుకా బొంగురు గొంతుకతొ

దురాక్రమణలపై గీతాలు అల్లుకో

గ్రీష్మపు ఎండల  గీరలు తెరలు తెరలుగ గీరెక్కి

 ముందుగానే ప్రపంచాన్ని గీరేస్తున్నాయి

ఆకులు పూలు రాలే కాలంలో

మత విధ్వంసాలు ప్రపంచమంతా

 హోలీ రంగులు పులుము కుంటున్నాయి

పరాభవం ప్రేమభావనకు పరాభవం

పరాభవం సోదర ప్రేమకు పరాభవం

దిక్కులు పిక్కటిల్లే బాంబుల మోతలకు 

శాంతికపోతాలు ఏ దిక్కులకో ఎగిరిపోతున్నాయి

పరాభవం శాంతిని కోరే మనసులకు

మనుషులకు మమతలకు ఘోర పరాభవం 

ఏ పరా శురుడో  రావాలి 

ఏ పరాశురభాణమో సంధించాలి

ప్రపంచ అశాంతి రాకాసి మూకల

కుత్తుకలు తెగనరికి వేల వేల కాంతి 

సంవత్సరాల దూరాలకు  విసిరి పారేయాలి

సామ్రాజ్యవాదపు దురాశల దుర్నీతిని

పచ్చడి పచ్చడి చేసేయాలి

మానవ వికాస ఆనందాలకోసం

ప్రపంచ శాంతిని జన్మింపజేయాలి

పావన నవజీవన బృందావన

 సౌందర్యం వెల్లివిరియాలి

అదే ఉన్నతమైన జన్మ

అదే అసలైన పరాభవనామ సంవత్సరం

అదే అసలైన పరాభవ నామ సంవత్సరం


మిత్రులందరికీ

ఉగాది శుభాకాంక్షలు











సన్మాన పత్రం సుగుణక్క

 ఓ  ముగ్ద సుఖుమార సుగుణ సుసంపన్నరాశి మృదు మధుర సంభాషిణీ నిర్మలహృదయ గురుకులమణి దీప్తి , మా మనో  స్పూర్తి నేత్రి ,ఆదర్శమార్తీమణి మన అందరి ప్రే...