Sunday, July 3, 2022

అల్లూరి ఇంటర్వూ

 అల్లూరి సీతారామరాజుతో జరిపిన ఏకైన ఇంటర్వ్యూ ఇది. 1923, ఏప్రిల్‌ 17న అన్నవరంలో చిలుకూరి నరసింహమూర్తి జరిపిన ముఖాముఖి ఇది. ఇది నాలుగు రోజుల తరువాత అంటే ఏప్రిల్‌ 21న పత్రికలో ప్రచురితమైంది.

నరసింహ : ఎంతకాలం మీరిక్కడ ఉంటారు?
అల్లూరి : రెండు గంటలు మాత్రమే. మేము ఉదయం 10 గంటలకు బయల్దేరతాం. కాకినాడ, నర్సీపట్నం పోలీసులకు నా సమాచారం పంపించడానికి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కు కనీసం అర్ధగంట సమయం పడుతుంది. వాళ్లంతా ఈ గ్రామం వచ్చేసరికి పది గంటలు కావచ్చు.
నరసింహ : ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?
అల్లూరి :
 నా తరువాత క్యాంపును నేనింకా నిర్ణయించుకోలేదు.
నరసింహ : ఈ ఉద్యమం వెనుక ఉన్న మీ ఆశయం ఏమిటి?
అల్లూరి :
 మన ప్రజలకు స్వాతంత్య్రం తీసుకురావడం.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీరెన్నుకున్న ఆయుధం ఏమిటి?
అల్లూరి : విప్లవం ద్వారా మాత్రమే మా లక్ష్యాన్ని సాధించగలం. రెండేళ్లలో స్వాతంత్య్రం సాధించగలమన్న నమ్మకం నాకు ఉంది.
నరసింహ: ఎలా సాధ్యం.. మీరెన్నుకున్న మార్గం ద్వారా?
అల్లూరి :
 కచ్చితంగా. నా అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. మాకు ఇప్పుడు ఆయుధాలు కావాలి. అందుకే నా పర్యటన.
నరసింహ: ప్రపంచం మొత్తం హింస, విప్లవాలతో విసిగిపోయింది. ప్రతి ఒక్కరూ అహింస వైపు మొగ్గు చూపుతున్నారు. మనం గాంధీజీ సిద్ధాంతాలను నమ్ముతున్నాము.
అల్లూరి : అహింసలో మాకు నమ్మకం లేదు. హింస ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. మేము చేపట్టిన ఐదు యుద్ధాలలో విజయాలే సాధించాం. ఈసారి మేము గాఢ విశ్రాంతిలో ఉండగా, పోలీసులు దాడి చేశారు. అప్పుడు మేము తప్పించుకోగలిగాము.
... చివరలో నరసింహమూర్తి రాస్తూ అల్లూరి సీతారామరాజు స్వచ్ఛమైన ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మాట్లాడారని ముగించారు.



ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆవిష్కరించారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుడి వీరోచిత పోరాటాన్ని జనులందరికీ చాటి చెప్పారు. అంతటి గొప్ప వీరుడిని ఆ ఒక్క రోజు గుర్తుచేసుకుంటే సరిపోతుందా..? ఆయన జ్ఞాపకాలను పదిలపరుచుకోవాల్సిన అవసరం లేదా..? మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు స్వహస్తాలతో రాసిన లేఖలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానికి లేదా..? ఆ లేఖలను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో పదిలపరిస్తే సరిపోతుందా..?

బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించిన అల్లూరి లాంటి గొప్ప దేశ భక్తుల గురుతులను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకూ సమంజసం..? విగ్రహ ఆవిష్కరణలో పాలుపంచుకున్న ప్రభుత్వం అల్లూరి స్వదస్తూరి లేఖలను, ఆయన జ్ఞాపకాలను విస్మరించడం బాధ్యతారాహిత్యం కాదా..? మన్నెం వీరుడు అల్లూరి సీతారామ రాజు జ్ఞాపకాలను ఇకనైనా సంరక్షించుకోవాల్సిన అవసరం లేదా..? అల్లూరి అభిమానులు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం నిరీక్షిస్తున్నారు.

తార్నాకలోని ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో అల్లూరి సీతారామరాజు రాసిన లేఖలు, ఆ సమయంలో అల్లూరిని అప్పగిస్తే పారితోషికం ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, జీవోలు కనీస గుర్తింపుకు నోచుకోకుండా అక్కడ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 14-06-1922న పైడిపుట్ట గ్రామం నుంచి శ్రీ చెక్కా లింగం దొరకు రాసిన లేఖ గురించి. అచ్చ తెలుగులో అల్లూరి రాసిన ఈ లేఖ చదివితే ఆయన దయా గుణం, ఔదార్యం ఏంటో అర్థమవుతుంది. తాను నేపాల్ వెళ్లాలని నిర్ణయించుకున్నానని, పైడిపుట్టలో తన 50 ఎకరాలను మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వవచ్చని తృణప్రాయంగా తన భూమిని ఇచ్చేసిన గొప్ప ఉదారవాది అల్లూరి సీతారామరాజు.

తన తల్లి, సోదరుడిని 1922 జూన్‌లో నర్సాపురానికి సీతారామరాజు పంపించారు. ఈ సందర్భంగా తన తల్లి ప్రయాణం గురించి అప్పటి గూడెం తాలూకా డిప్యూటీ తహసీల్దార్ బాస్టిన్‌కు ఆంగ్లంలో అల్లూరి లేఖ రాశారు. ఆ లేఖ కూడా ఆర్కైవ్స్‌లో ఉంది. పెన్సిల్‌తో ఆ లేఖ రాసినట్టుగా ఉంది.

అల్లూరి సీతారామరాజుని పట్టుకుంటె రూ 1500_0_0 యినాము, గనర్ణపాలెము గ్రామం కాపరస్తుడు గాంమల్లుదొర, గాంగంటం దొరను పట్టుకుంటె ఇద్దరికీ చెరో రూ 1000_0_0 చొప్పున యినాము ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన కూడా తార్నాకలోని ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో ఉంది.

1937లో పొన్నలూరి రాధాకృష్ణమూర్తి '1922 మన్యంలో రైతుల తిరుగుబాటు (అల్లూరి సీతారామరాజు) పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. అల్లూరికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పుస్తకం ద్వారా ఆయన వెలుగులోకి తెచ్చారు. అయితే.. ఈ పుస్తకంలోని అంశాలు మన్యం ప్రాంతంలోని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఈ పుస్తకాన్ని నిషేధిస్తూ ఆగస్ట్ 24, 1938న G.O. No.1451ను 'గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్' పేరుతో బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రకటన తాలూకూ జీవో కూడా ఆర్కైవ్స్‌లో అందుబాటులో ఉంది.

ఇంత విలువైన జ్ఙాపకాల సంపదను ఒక ప్రదర్శనశాలలో గానీ, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మరే విధంగానైనా చేరువచేసేలా చర్యలు తీసుకోవాలని అల్లూరి అభిమానులు కోరుకుంటున్నారు. మన్యం ప్రాంతంలో ఉండే వారికి అల్లూరి జ్ఙాపకాలను అందుబాటులో ఉంచాలని విశాఖ జిల్లాకు చెందిన ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.




*బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం స్వాతంత్య్ర సమరయోధుడు.*

*అలూరి సీతారామరాజు జయంతి: జులై 04*


🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹


అల్లూరికి తుపాకీ పేల్చడం / కాల్చడం నేర్పిన గురువు " షేక్ మదీనా " ను కూడా మర్చిపోయాం !!!

===

మన్యవిప్లవ యోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు కు తుపాకీ పట్టడం, గురిపెట్టి పేల్చడం / కాల్చడం నేర్పిన గురువు షేక్ మదీనా. 

అయన తూర్పుగోదావరి జిల్లా   పెద్దాపురం గ్రామస్థులు.  బ్రిటిష్ ప్రభుత్వం లోని పొలీసు శాఖలో అయన పనిచేశారు. పదవీ విరమణ చేసి 65 ఏండ్ల వయస్సులో పెద్దాపురంలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 

 షేక్ మదీనా గురించి తెలిసిన యువకులు  అల్లూరి సీతారామరాజు తన సహచరులు  రేగరాజు,  పేకేటి సుబ్బరాజు తదితరులతో కలసి పెద్దాపురం విచ్చేసారు. 


అల్లూరి సీతారామరాజు పెద్దాపురంలో షేక్ మదీనా వద్ద తుపాకీ పేల్చడం నేర్చుకున్నారు. ఆ విధంగా తుపాకి పేల్చడంలో / కాల్చడంలో మదీనా నుండి అల్లూరి పొందిన శిక్షణ ఆంగ్లేయ బలగాలకు నిద్రలేకుండా చేసిన  మన్యం పోరాటంలో ఎంతో ఉపయోగపడింది. 


===


షేక్ మదీనా నుండి అల్లూరి సీతారామరాజు తుపాకి కాల్చడం / పేల్చడం లో పొందిన శిక్షణ విశేషాలను ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు "ఆకుపచ్చ సూర్యోదయం - మన్యం వీరుడు అల్లూరి గాథ" శీర్షికన  రాసిన పరిశోధనాత్మక  గ్రంథంలో, దృశ్యమానంగా ప్రస్తావించారు. 

ఈ గ్రంథం నవంబర్ 2017లో ప్రచురితం.   

ఆ గ్రంథంలోని ఉటంకింపు ఇలాసాగింది. 

---

" ... మరునాడు పెద్దాపురంలో దిగారు. తెలతెలవారుతుండగా. 

పెద్దగా కష్టపడకుండానే అతడి (Shaik  Madina ) చిరునామా తెలిసింది. పేరు షేక్ మదీనా. ఊరు మొదట్లోనే చిన్న పెంకుటిల్లు. రిటైర్డ్ పొలీసు ఉద్యోగి  మదీనా. అరవై అయిదేల్లుంటాయి. 

వాళ్లలో రేగరాజు మహా చురుకు. మాటకారి. 

'నవాబుగారూ ! నమస్కారం. మాది తుని. క్షత్రియులం.' అన్నాడు. 


'నమస్కారం బాబూ !' అన్నాడతడు ఎంతో మృదువుగా

 'తుపాకీ కాల్చడంలో తమది అందే వేసిన చేయి అని విని వచ్చాం. ఇంతదూరం.  మా శ్రీరామరాజూకి వేటాడాలని కోరిక. మీరు తుపాకీ పట్టడం నేర్పించాలి. కాదనకూడదు.' అన్నాడు రేగరాజు

'ఎంతమాట బాబూ ! నేర్పిస్తాను. ఓ మూడు రోజులు ఉంటారా ? ఇంతకీ ఎక్కడుంటున్నారు?' అన్నాడు మదీనా 

'ఉంటాం. సత్రంలో బస'. మళ్ళీ అన్నాడు రేగరాజు

'అదిగో చూసారుగా. ఆ కొండ. ఆ గుడి. అదే  పాండవుల మెట్ట. మధ్యాహ్నం మూడు గంటలకి  వచ్చేయండి. నా తుపాకీ ఉంది. దానికి లైసెన్స్ కూడా ఉంది.  నేర్పించేద్దాం!', అన్నాడు మదీనా 

'ఇప్పుడైతే ఏం ?' అమాయకంగా  అడిగాడు పేకేటి సుబ్బరాజు.

 'లేడికి లేచిందే ప్రయాణం అంటే కాదు బాబూ!  ఈ ఊళ్ళోనే సారస్వత సంఘం అని ఉంది. దాన్లో పనిచేస్తున్నాను. మధ్యాహ్నం ఖాళీ.  పైగా ఆ వేళకి మెట్ట మీద ఎవరూ ఉండరు' అన్నాడు మదీనా .

సాయంత్రానికి నెమ్మదిగా వచ్చాడు మదీనా. రెండు భుజాల మీద రెండు రైఫిళ్లతో. 

అంత మృదుస్వభావిగా కనిపించిన మదీనా, శిక్షకుడిగా మారాక యుద్ధం చేయిస్తున్న సేనానిని మరిపించాడు. చిన్న తప్పిదం చేసినా కొట్టినంత పనిచేశాడు. కానీ రెండు రోజుల్లోనే గన్ లోడ్ చేయడం, గురి పెట్టడం, పేల్చడం నేర్పేశాడు..."

(పుటలు  53, 54)

=== 

బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఆంగ్లేయ అధికారులను గడగడ లాడించిన మన్య విప్లవ సారథి, వీరయోధులు, అమరజీవి శ్రీ అల్లూరి సీతారామరాజు ఉద్యమ / పోరాట జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర నిర్వహించిన షేక్ మదీనా గురించి, అయన అల్లూరికి తుపాకి కాల్చడంలో ఇచ్చిన శిక్షణ గురించిన కనీస ప్రస్తావనలు, ప్రచారం ఏమాత్రం లేకపోవటం విచారకరం.


నిష్కళంక స్వాతంత్ర్యసమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు


.

శ్రీ అల్లూరి సీతారామరాజు భూకబ్జాదారుడని, యాభై ఎకరాల భూమికొరకు అతను బ్రిటిష్ వారితో పోరాడాడని, దాన్ని కొద్దిమంది  స్వాతంత్ర్యపోరాటంగా చిత్రీకరించారంటూ ఒక పోస్టు ఇటీవల వాట్సప్ గ్రూపులలో వైరల్ గా సంచరిస్తోంది. 


శ్రీ అల్లూరి సీతారామరాజు జీవించి ఉండగా అతను జరిపిన పోరాటం పై వచ్చిన వార్తా కథనాలు, ఒక ఔత్సాహిక విలేఖరికి ఇచ్చిన అతని ఇంటర్వ్యూ ద్వారా – శ్రీ రామరాజు నిజాయితీగా, స్వాతంత్రపోరాటం జరిపినట్లు అర్ధమౌతుంది.  శ్రీ రామరాజు మరణించిన వెంటనే వచ్చిన కొన్ని వ్యాసాలలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవటం కూడా శ్రీ రామరాజు నిష్కళంకతను రుజువుచేస్తుంది.  


ఈ అంశానికి సంబంధించి ఆనాటి పత్రికా కథనాలు…. వాటి విశ్లేషణా


.

1. April 21, 1923 ఆంధ్రపత్రిక

.

శ్రీ అల్లూరి సీతారామరాజుతో శ్రీ చెరుకూరి నరసింహమూర్తి జరిపిన సంభాషణ  April 21, 1923 ఆంధ్రపత్రిక లో ప్రచురింపబడింది. శ్రీ మూర్తిగారు అప్పటికే దేశంలో ప్రబలంగా నడుస్తున్న సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు.  

 

శ్రీ అల్లూరి సీతారామరాజు 17 వ తారీఖు ఉదయం 6:30 కు అన్నవరం పోలీసు స్టేషనును ముట్టడించి, అక్కడి పోలీసు తుపాకులను స్వాధీనం చేసుకొని, అన్నవర సత్యనారాయణస్వామి దేవాలయ సత్రంలో స్నానపానాదులు కావించి; కాసేపు జపం చేసుకొని పది గంటల సమయంలో శంకవరం గ్రామం వైపు వెళిపోయారు. ఆ రోజు  మూర్తిగారు రాజు గారితో  జరిపిన సంభాషణ ఇలా ఉంది. 


మూర్తి:  మీ రే సంకల్పముతో నీ పితూరిని నడుపుతున్నారు 

రాజు:   ప్రజలకు స్వాతంత్ర్యము లభించుటకే

.

మూర్తి:  ఏ సాధనము వలన

రాజు:  దైర్జన్యము వలననే.  యుద్ధము చేసినగాని మనకు స్వరాజ్యము రాదు

.

మూర్తి: స్వాతంత్ర్యము బడయగలుగుదునను నమ్మకము మీకు కలదా?

రాజు:  రెండేండ్లలో స్వరాజ్యము తప్పక లభించునను నమ్మకము నాకు కలదు.

.

మూర్తి: రెండేండ్లలో స్వరాజ్యమెట్లు లభించును? మీ రవలంబించుచున్న పద్దతివలననే స్వరాజ్యము వచ్చునా?

రాజు: వచ్చును. తప్పక వచ్చును.  నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది.  జనము లోటేమియును లేదుగాని తుపాకులును మందుగుండ్లును కావలెను.  వానికొరకె సంచారము చేయుచున్నాను.  

.

మూర్తి: దౌర్జన్యముతో కూడిన యుద్ధములవలనను జన నష్టమువలనను ప్రపంచము విసుగు చెందియున్నది.  దౌర్జన్యముకూడదను సిద్ధాంతమునే యిపుడు ప్రపంచములోని అన్నిదేశముల వారును ఆదరించుచున్నారు.  జర్మనీవారుగూడా సాత్విక నిరోధమునే ప్రారంభించిరి.  గాంధి మహాత్ముడు బోధించిన దౌర్జన్యరాహిత్య శాంతి సాధనములందుమాత్రమే మాకు నమ్మకముకలదు.  సకలప్రపంచమునకు శాంతిమార్గమును బోధించుటకు దేవదూత గాంధిమహాత్ముని రూపమున వచ్చెనని ప్రపంచమువారందరును నమ్ముచున్నారు.

రాజు: నాకు దౌర్జన్యరాహిత్యమునందు నమ్మకము లేదు.  దౌర్జన్యమువలననే స్వరాజ్యమును బడయగలుగుదుమని నేను గట్టిగా నమ్ముచున్నాను.

***


పై వార్తా కథనంలో వర్ణించిన రాజుగారి ఆకృతి: వయసు 26 ఏండ్లు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు; బక్కపలచన, ఆరోగ్యముతో, అందమైన దేహం; ఎప్పుడు నవ్వుమొఖముతో, వినయసంపదకలిగి, మర్యాదతో వ్యవహరిస్తారు; యోగులవలె గెడ్డము, తలవెంట్రుకలను కలిగి ఉన్నారు.  ఖద్దరు ఖాకి పొట్టి నిక్కరు, ఖద్దరు చొక్కాను ధరించారు. చేతిలో పేనుబెత్తము కలదు.  కాలికి చెప్పులు లేవు.

***

పై ఇంటర్వ్యూ లో శ్రీ అల్లూరి సీతారామరాజు తన ఉద్యమ లక్ష్యం స్వాతంత్ర్యాన్ని సాధించటమే అని నిర్ద్వంద్వంగా పేర్కొన్నాడు. హింసా పద్దతుల ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించాలి అని నమ్మిన సుభాష్ చంద్రబోస్ కంటే ముందే ఆ లక్ష్యాన్ని  స్వప్నించటం గమనార్హం. 

***


2. ఆంధ్రపత్రిక 1922 అక్టోబరు 18 


రంపపితూరి మూలకారకుని వృత్తాంతము


నరసిపట్నం దగ్గరనున్న గూడెం కొండలలోనుండి బయలుదేరిన యేజన్సీ పితూరి (పితూరి-తిరుగుబాటు) విషయము ఇటీవల తెలియవచ్చు సంగతుల వలన తీవ్రముగా నున్నట్లు కనుపట్టుచున్నది.  మూడువందలవరకును పోలీసుదళము పితూరిదారులను పట్టుకొనవలెనని ప్రయత్నించుచున్నది.  ఇంతవరకు నిరువురు తెల్ల ఉద్యోగీయులు హతులైరి.  పోలీసులు కాన్సటబిల్సు కూడా కొంతమంది చంపబడిరి.  కొందరకు గాయములు తగిలెను.  మలబారు విప్లవ సందర్భములో ననుభవముగల యే ఆర్. న్యాపుగారు కూడా స్వయముగా వచ్చి పితూరి ప్రాంతములను పరీక్షించి పోయిరి.  పరిస్థితులు తీవ్రముగా నున్నట్లు ఇంతవరకు ప్రభుత్వముపయోగించిన బలము నిష్ప్రయోజనమగుట రుజువు చేయుచున్నది.  


ఈ పితూరిని నడుపుచున్నది అల్లూరి సీతారామరాజను క్షత్రియ యువకుడని ప్రచురింపబడినది.  ఆయన అద్భుతశక్తులు కలవాడని ప్రజలు చెప్పుకొందురు. 


//ఈయనకు 25 సంవత్సరముల వయస్సుండును.  ఆజాన బాహువు, విశాల వక్షస్కుడు, బలిష్ఠుడు, స్ఫురద్రూపి, పచ్చని దేహచ్ఛాయకలవాడు. నల్లనిగడ్డము పెంచెను. కాషాయవస్త్రములను ధరించి స్వరూపముచే నాకర్షించు బాలసన్యాసి.  జ్యోతిషము, సాముద్రికము, వైద్యము తెలిసినవాడు. ప్రశ్నచెప్పగలడు.  ఒక్కమారతనితో మాట్లాడువారు అతని వశులగుదురు.  వైద్యముకొరకును, ప్రశ్నలను తెలుసుకొనుటకును, కొండవారనేకమందితని యొద్దకు వత్తురట. వారి ప్రశ్నలకు సరియైన నిదర్శనములు కనుపడుటచేతను కొండవాండ్రకాయన భగవంతుండను మూఢభక్తి గలదు.


//ఇతను వీలగునంతవరకును ప్రజలకు సేవజేయుచు వారి విశ్వాసమునకు పాత్రుడయ్యెను.  ఎవరికే కష్ట్మౌలు గలిగినను సహానుభూతి చూపుచు తనకు వీలైన సహాయము చేయువాడట.  మందస్మిత వదనముతో పలుకు యీతని పలుకులు జనులనాకర్షించి అతని ప్రేమింపజేయును.  అతనికా చుట్టుపట్లనున్న గ్రామములలో చాల గౌరవము కలదు.  కృష్ణాదేవి పేట చుట్టుపట్లనున్న అయిదారు గ్రామములలో నీయన పంచాయితీ కోర్టులను స్థాపించి ప్రజలలో న్యాయమును నెలకొల్పెను.  ఏజెన్సీ యుద్యోగులా పంచాయతులను బ్రద్దలుగొట్టిరి.  ఈ సందర్భమునని రాజుగారు నిరాకరణవాది యను నెపమున వానిని ఆరువారములు కైదులో ఉంచి,  దోషిగ నెంచుటకు దగిన ఆధారములు లేక వదిలివేసిరి. 

.

పై వార్తా కథనముద్వారా శ్రీ అల్లూరి సీతారామరాజు వ్యక్తిత్వం అర్ధమౌతుంది. 

***


3. ఆంధ్రపత్రిక 1922, అక్టోబరు 4


ఇద్దరు పోలీసు ఉద్యోగులును, 28 మంది పోలీసులును గుడెం కొండలలో పితూరిదారుల కొరకు వెతుకుచుండగా సెప్టెంబరు 24 వ తేదీన పితూరిదారులదరిపాటున వారిపై బడిరి.  ఉద్యోగులగు స్కాటు కవర్డు, హయిటరు గార్లును ఒక కనిస్టెబును యీ ముగ్గురును మడసిరి (చనిపోయారు).  ఒక హెడుకనిస్టేబుకును, ఇంకొక కనిస్టేబుకును గాయములు తగిలెను.  మరియొక కనిస్టేబు కనబడనేలేదు.// ఉద్యోగుల మరణవార్త హతశేషులవలన విని వారి శవములను కొనితెచ్చుటకు కొండపైకేగుటకు ఆర్మిటేజి గారు ప్రయత్నింపగా అడవిలోనున్న పితూరిదారులు తుపాకులను కాల్చుటచే ఆర్మిటేజిగారు ముందుకు వెళ్లలేదు.  ఈ రెండవప్రయత్నమున మరలనొక కనిస్టేబు హతుడయ్యెను. చనిపోయినవారి శవములను, గాయములు తగిలినవారిని పిమ్మట గ్రామవాసులు తీసుకొని వచ్చిరి.


స్కాటుకవర్డు గారికి మన్యమంతయును బాగుగా తెలియును.  ఆయన చాలా సమర్ధుడు.  హయిటరు గారు టెంపరరీ పోలీసు అసిస్టెంట్ సూపర్నెంటు. జర్మని యుద్ధములో, 1914 ఏడెనులో,  1919  ఆఫ్ఘను యుద్ధములో పనిచేసెను.  ఈ యుద్యోగులిద్దరును హతులగుటవలన గొప్పనష్టముకలిగినది.  


పితూరి దారుల నాయకుడగు అల్లూరి సీతారామరాజును అతని ముఖ్యానుచరులనిద్దరిని గూర్చి తెలిపినవారికిని వారిని పట్టియిచ్చిన వారికిని బహుమానము లియ్యబడునని ప్రకటింపబడెను.  మన్యములో ముఠాదారులు (కౌలుదారులు) ఇట్టి తొందరలు కలిగినపుడు పోలీసులకు సహాయము చేయవలెనను షరతుకలదు గాన అట్లు సహాయము చేయవలెనని ముఠాదారులను నిర్భంధించుటకు ఏర్పాటులు చేయబడెను. 

.

పై సంఘటన ద్వారా శ్రీరామరాజు ఉద్యమం ఏ మేరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడో తెలుస్తుంది. 

***


4. ఆంధ్రపత్రిక 1923, మే 31 జూన్ 4, జూన్ 19


1922 అక్టోబరు నెలలో జరిగిన ఎదురుకాల్పులపై విశాఖపట్నం కోర్టులో జరిగిన విచారణ వివరాలు 1923, మే 31, జూన్ 4, జూన్ 19 వ తేదీల ఆంధ్రపత్రిక లో విపులంగా వచ్చాయి. ఈ విచారణలో దుశ్చర్తి గ్రామ కౌలుదారుడైన చొక్కలింగం దొర ఇచ్చిన సాక్ష్యంద్వారా శ్రీ రామరాజు భూకబ్జాదారుడని చేసిన ఆరోపణ పూర్తిగా సత్యదూరమని అర్ధమౌతుంది. 


శ్రీ రామరాజుకి  అసిస్టెంటు కమిషనరు గారు పైడిపుట్టలో 50 ఎకరముల భూమి ఇచ్చినట్లు; సదరు ఆర్డరు ప్రకారం ఈ చొక్కలింగం ఆ భూమిని శ్రీరామరాజుకు అప్పగించినట్లు; ఆయన ఆ భూమిని దున్నటము మొదలగునవి ఏమీ చేయక, వారు (రామరాజు) నేపాళదేశము వెళ్ళిపోతానని చెప్పేవారని చొక్కలింగం సాక్ష్యం చెప్పాడు.  

***

ఇదే విచారణలో అడపా నడిపిపడాలు అనే సాక్షి “బాస్టియన్ దొర (ఏజెన్సీ డి. తహసిల్ దారు) పెట్టు బాధలచేతనే యీ పితూరి లేచినదని ప్రజలు తరుచుగా అనుకొంటారు” అని చెప్పాడు.  అదే విధంగా క్రాస్ ఎగ్జామినేషను చేస్తున్న వకీలు “బేస్టియన్ దొరగారి మహా ఉద్రేకమయిన అల్లరులే ఈ పితూరీకి కారణము.  ఆయనను తీసివేస్తే ఈ పితూరీ లేకపోవును” అని వ్యాఖ్యానించాడు. 


బాస్టియన్ దొర దురాగతాలను గురించి ఖానుబహద్దరు అబ్దులు హజీజు సాహెబు (పోలవరం కలక్టరు) కూడా తన సాక్ష్యంలో ఇలా చెప్పాడు. “ బాస్టిన్ దొరగారిని నేను ఎరుగుదును. బాస్టిన్ గారు ప్రజలను బాధపెట్టెదరు.  ప్రజలచే 500 రూపాయీలు పనిచేయించుకొని పని బాగాచేయలేదను అబద్దపు మిషపై 100 రూపాయిలు మాత్రమే కూలీలకిచ్చేవారు. // కూలీలను తీసుకురాని ముఠాదారులకు మిరపకాయగుండను వారి మర్మస్థలములో బాస్టన్ గారు రాయించేవారు.  ఇటులనే అనేక బాధలు పెట్టేవారు.  నేను బాస్టిన్ గారి చర్యలను గూర్చి ఒక గట్టి రిపోర్టును వ్రాయగా బాస్టిన్ గారిని ఇప్పుడు పొట్టంగికి బదిలీ చేసినారు. సంతానం పిళ్ళై అను ఓవరుసీయరు గూడ ప్రజలను బాధపెట్టుటలో బాస్టను గారికి చాలా తోడుపడెను.  ఈయనను ఈ తరువాత బర్తరవు చేసిరి//.   

. 

మన్యంలో బాస్టిన్ దొర అతని అనుచరులు చేసిన విధ్వంసం వలన తిరుగుబాటు వచ్చింది, అనేవాదన శ్రీరామరాజు ఉద్యమానికి ఉన్న విశాల ప్రయోజనాలను పరిమితం చేస్తుంది.  బహుశా ఆ దురాగతాలు రామరాజును తక్షణం ప్రేరేపించిన అంశాలుగా భావించవచ్చు.  


***

ఈ విచారణలో అగ్గిదొర అనే ఒక సాక్షిని ప్లీడరు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ “రెండు సంవత్సరములలో బ్రిటిషు గవర్నమెంటు యుండదని రాజుగారు చెప్పుచుండెడివారని మీకు తెలియునా? అని ప్రశ్నించగా అతను “అట్లు రాజుగారు చెప్పుచున్నట్లు వదంతి గలదు” అని చెప్పటాన్ని బట్టి శ్రీ అల్లూరి సీతారామరాజు పోరాటం అంతా బ్రిటిషు గవర్నమెంటుకు వ్యతిరేకంగాచేసిన స్వాతంత్రపోరాటంగా విశ్వసించవచ్చును. 

***


ముంజేరి కౌలుదారుడైన శరభం నాయుడు తన సాక్ష్యంలో – పితూరిదారులు సెప్టెంబరు నెలలో మా వూరు వచ్చారు.  వారి చేతులలో తుపాకులు కత్తులు వగైరాలు కలవు.  సర్కారుపై పోట్లాటకు కుమ్ముకు రావలెనని రాజుగారు మమ్ములనడుగగా మేము రామన్నాము.  “దెబ్బలాట జరుగును గనుక మీ గ్రామములో ఎవరిని ఉంచకండి దెబ్బలు తగులుతవి అని నాతో రాజుగారు చెప్పగా భయముతో నేనుపోయి మావాళ్ళనందరిని మా వూళ్ళోనుంచి పంపివేస్తిని.  

పై ఉదంతం ద్వారా శ్రీ రామరాజు బ్రిటిష్ ప్రభుత్వంతో చేస్తున్న పోరాటంలో, తనకు సహకరించని వ్యక్తులకు కూడా ఏ నష్టం జరగకూడదని కోరుకొనేవాడని అర్ధమౌతుంది.   ఇది ఆయన ఉదాత్త వ్యక్తిత్వంగా భావించాలి. 

***


***

5. శ్రీ రామరాజు గురించి స్వైరు దొర ఒక  రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించాడు.  అది ఇలా ఉంది.


“నేను అల్లూరి శ్రీ రామరాజుగారిని పిలిపించి మాటలాడితిని.  అతని వయసు 25 ఏండ్లు-ఆయన విద్యాధికుడు.  ఆంగ్లమున చాలా బాగుగా మాటలాడగలడు.  ఆయన తనచరిత్ర నిటుల తెలిపెను.  కృష్ణాజిల్లా మోగల్లు గ్రామమున నేను జననమై 14 వ ఏడు వచ్చువరకు నచటనేయుండి పిమ్మట కొంతకాలము రాజమంద్రిలోను తరువాత రామచంద్రపురమున, జాతీయపాఠశాలలోను విద్యనభ్యసించితిని.  విరాగినై యరణ్యవాసముచేసి తరువాత సన్యసించునుద్దేశముతో నాలుగేండ్లక్రితమీ మన్యప్రాంతమునకు వచ్చితిని” అని రాజుగారు నాతో చెప్పిరి.  అది మొదలుగా నరశీపట్నము మున్నగుచోట్లకు వెళ్ళుచున్నను తరుచు మన్యములోనే కొండలలోను అడవులలోను ఆయన తిరుగుచుండెను-ప్రజలలో చిన్న చిన్న సివిలు దావాలను పరిష్కరించుటకు ఆరునెలలక్రితము పంచాయితీ కోర్టులనేర్పరచెను.  


// “నాకు దివ్యశక్తులు కలవని అవివేకముచే ప్రజలు తలంచు చున్నారు- నేను పితూరి ప్రారంభించెదనను వదంతులు బయలుదేరినవి-నాకు అసహాయోద్యమముతో సంబంధమేమియును లేదు” అని రాజుగారే నాతో చెప్పిరి.  మీరు మన్యమును వదిలి నరిశీపట్నం వెళ్లవలెనని నేను తెలుపగా వెంటనే ఆయన అంగీకరించెను-అసిస్టెంటు కమీషనరు 31 వ తేదీని నరిశీపట్నమునకు రాగా ఆయన యెదుట రాజుగారు వ్రాతమూలమున గూడనిచ్చెను-ఇపుడితడు ప్రభుత్వమునకు వ్యతిరేకముగా నేమియును చేయదలచినట్లగుపడలేదు గాన ఇతనిపై చర్యజరుపుటనవసరము- అని ఆ రిపోర్టులో నున్నది.  

.

1922 లో శ్రీరామరాజును అరస్టుచేసి, ఆరువారాలపాటు బంధీగా ఉంచి,  రాజద్రోహం చేసినట్లు ఏ రకమైన ఆధారాలు లభించక విడిచిపెట్టినప్పుడు విచారణాధికారిగా స్వైరు దొరగారు రాసిన రిపోర్టు అది. 


ఈ సందర్భంగా ఈ పోలీసు చెరనుండి నన్ను విడిపించమని శ్రీ రామరాజు పోలవరం డివిజను కలక్టరైన ఫజులా సాహెబు గారికి అర్జీ పెట్టగా, ఆయన రాజుకు ముప్పది యకరాల భూమిఇప్పించి పైడిపుట్టి గ్రామములో ఉండి వ్యవసాయము చేసుకొని జీవించమని ఆజ్ఞాపించాడు.  దుశ్చర్తి కౌలుదారుడైన చొక్కలింగం కు ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసాడు.   (రి. శ్రీ రామరాజు ప్రశంస - మద్దూరి అన్నపూర్ణయ్య  ఆంధ్రభారతి జూలై, 1928


ఆ నేపథ్యంలో బహుసా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయను అని కాగితాలపై సంతకాలు పెట్టించుకొని ఉంటారు. కానీ శ్రీ అల్లూరి సీతారామరాజు లక్ష్యం, గమ్యం వేరే ఉన్నప్పుడు ఆ సంకల్పాన్ని సంతకాలు నిలువరించగలవా? 

ఆ తదనంతరం ఆ భూమినాకు అవసరం లేదు అంటూ, మీ ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకోవచ్చును అంటూ 14-06-1922 న ఒక ఉత్తరం ద్వారా శ్రీ రామరాజు చొక్కలింగంకు తెలియచేసాడు.  ఈ సంఘటన ద్వారా కూడా శ్రీ రామరాజు తృణప్రాయమైన సంపదలకొరకు   తన వ్యక్తిత్వాన్ని, లక్ష్యాన్ని అమ్ముకొనే వ్యక్తి కాదని నిరూపితమౌతుంది.   

***

6. శ్రీ రామరాజు ప్రశంస - మద్దూరి అన్నపూర్ణయ్య  ఆంధ్రభారతి జూలై, 1928


స్వరాజ్యమే అతని లక్ష్యము

…. కానీ అది పితూరీ కాదు.  అది స్వాతంత్ర్య యుద్ధము.  బాష్టియను దుండగములు భూముల రిజర్వేషను వలన ప్రభుత్వముపై కోయదొరలలో జనించిన ద్వేషమును శ్రీ రామరాజు ఊతగాగొని స్వరాజ్యము లభించినగాని శాశ్వతసౌఖ్యము జేకూరదని అతడు నిష్కర్షగా బోధించియుండవలెను. 


//స్వరాజ్యమే తన పరమావధియైనటుల తనకు కుడిభుజములైన గాం సోదరులతో స్పష్టముగా చెప్పినట్లు ఒక పితూరీదారుడు కోర్టులో చెప్పెను.  సిఐడి సబినస్పెక్టరు గుండాల శ్రీనివాసరావు గారు కూడా కోర్టులో స్వరాజ్యముకొరకే యుద్ధముజేస్తున్నానని రాజు తనతో చెప్పినట్లు తెలిపినాడు. కాన ముమ్మాటికిని ఆయన వుద్దేశం స్వరాజ్యస్థాపనమే అని రూఢియగుచున్నది. 


***


7. శ్రీ అల్లూరి రామరాజు గారు -  భోగరాజు పట్టాభిసీతారామయ్య, భారతి 1-7-1928


//శ్రీ రామరాజుగారు దోపిడి చేయలేదు. పితూరిగావింపలేదు.  స్వార్ధముకొరకు ఘోరకృత్యములు సలుపలేదు.  తన దేశవిముక్తికొరకు బ్రిటిషువారిపై యుద్ధము చేసెను.  ఆనాడు నానాఫర్నవీసు, రాణీలక్ష్మీభాయి మున్నగువారు భారత స్వాతంత్ర్య యుద్ధముకొరకు యెటుల పోరాడిరో అటులనే 3 సంవత్సరములకాలము, బ్రిటిషు ప్రభుత్వోద్యోగులకు పూర్వసూచనలు గావించి, బహిరంగ యుద్ధములకై స్థల కాలనిర్ణయములతో నాహ్వానములనంపుచు, యుద్ధమును జరిపెను.

.

8. ముగింపు


శ్రీ రామరాజును బ్రిటిష్ వారితో సహా ఆయన సమకాలీనులు సరిగానే అర్ధం చేసుకొన్నప్పటికీ నేడు కొందరు ఆయన భూకబ్జా దారుడని, సొంత భూమికోసం బ్రిటిష్ వారితో చేసిన పోరాటాన్ని స్వాతంత్ర్యపోరాటంగా చిత్రీకరిస్తున్నారంటూ దుర్మార్గమైన కట్టుకథలను ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరించబూనటం గర్హనీయం. 


కొన్ని వార్తాకథనాలలో చెప్పినట్లు కేవలం ఎనిమిది వందలమంది అనుచరులతో, అరకొర ఆయుధసంపత్తితో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించబూనటాన్ని అవగాహనా రాహిత్యంగా కాక మాతృదేశ దాస్యశృంఖలాలను విడిపించాలన్న తీవ్రమైన జ్వలించే కాంక్షగానే చూడాలి.  ప్రాక్టికల్ గా ఆలోచించే నేటి తరానికి అలా పోరాడటం వెనుక నిప్పులాంటి నిష్కల్మషమైన చిత్తశుద్ధి,  నిజాయితీ ఉండేవనే విషయం నమ్మబుద్ధికాక ఏవో స్వార్ధప్రయోజనాలు ఉండే ఉంటాయని సరిపెట్టుకోచూడటం, ఆ మేరకు వక్ర భాష్యాలు చెప్పటం నేటికాలపు విషాదం.  


శ్రీ రామరాజు ఉదంతంలో భిన్న వ్యవస్థలు కలవరపడిన వైనం ఆనాటి వార్తాకథనాలద్వారా స్పష్టంగా అర్ధమౌతుంది


కాంగ్రెస్ పార్టీ అప్పటికి సహాయనిరాకరణోద్యమం పేరిట మెత్తమెత్తగా స్వాతంత్ర్యపోరాటం జరుపుతోంది.  శ్రీ రామరాజు  మన్యంలో జరుపుతున్న ఈ సాయుధ పోరాటం అనేది తమపీకకు ఎక్కడ చుట్టుకొంటుందో అని- మన్యం అనేది దుర్గమమైన కీకారణ్యం.  అక్కడకు కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఆ ప్రజలను ప్రభావితం చేసి పితూరీ లేవదీసే అవకాసమే లేదు అని ప్రకటించి చేతులు దులుపుకొంది.


బ్రిటిష్ ప్రభుత్వం ఈ పితూరి బ్రిటిష్ ప్రభుత్వంపై కాదని, ఏదో స్థానిక బాస్టిన్, సంతానం వంటి స్థానిక అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేగిన చెదురుమదురు అల్లర్లని ప్రకటించుకోవటానికి ఆరాటపడింది. 


అంతే కాక పితూరీదారులు ఊర్లను దోచుకొన్నారని వైజాగ్ లో జరిగిన కోర్టు విచారణలో పదే పదే సాక్షులతో చెప్పించినప్పటికీ, చాలామంది సాక్షులు పితూరి దారులు బియ్యం, వంట సామాగ్రి, పడుకోవటానికి మంచాలు ఎత్తుకుపోయారని చెప్పారు తప్ప ధనకనక వస్తువులు దోచుకొన్నట్లు ఎవరూ చెప్పలేదు.  అంతే కాక స్త్రీలను చెరిచిన దాఖలాలు కూడా కానరావు.  ఇది శ్రీ రామరాజు నాయకత్వ పటిమగా అర్ధం చేసుకోవాలి.

 

శ్రీ రామరాజుకు 50 ఎకరాలు భూమి ఆశచూపి ఉద్యమాన్ని నీరుకార్చాలని చూడటం కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన ఒక ప్రయత్నం.  


ఇక అన్ని ప్రయత్నాలు విఫలమై, ఈ ఉద్యమం దావానలమై ప్రజలలో విస్తరిస్తున్నదన్న సంగతి గ్రహించిన ప్రభుత్వం, చివరకు ఎన్కౌంటర్ రూపంలో శ్రీరామరాజును మట్టుబెట్టటం జరిగింది. తనను ప్రశ్నించేవారిపై రాజ్యం చేసే చివరి దరహాసమని అనాదిగా పదే పదే రుజువయ్యే పరమ సత్యమది. 


బొల్లోజు బాబా

9/7/2022







అల్లూరి చరిత్రలో వాస్తవాలు:

------------------------------  బర్ల వెంకటరావు


అల్లూరి చరిత్రలో కట్టుకథలు (మే 6, ఆంధ్రజ్యోతి) అనే శీర్షిక పడాల వీరభద్రరావు (రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు) రాసిన వ్యాసం చదివాను. ఆ తర్వాత నాకు కూడా అల్లూరి సీతారామరాజు గురించి నేను విన్నవి, చదివినవి రాయాలని అనిపించింది.చిన్నతనంలోను, వయసులో ఉన్నప్పుడు, ప్రతి తెలుగువాడిలాగా నేనూ అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన మీద వచ్చిన ప్రతి పుస్తకం చదివాను.నేను సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా, 1985లో తూర్పుగోదావరి జిల్లా, అడ్డతీగల ప్రాంతంలో గల తిరుమలవాడ ఏఓపీ (ఆర్మ్‌డ్ అవుట్ పోస్ట్) కేంప్ ఇంచార్జ్‌గా ఉన్నాను.

అప్పుడు అల్లూరి సీతారామారాజు మీద ఆయన బంధువే రాసిన పుస్తకం చదవడం జరిగింది. ఆ పుస్తకంలో విషయం నాకు గుర్తున్నంత వరకు-అల్లూరి సీతారామరాజు తన తండ్రి మరణానంతరం, తన తల్లితో, సోదరునితో తుని వచ్చి, తుని తాహసిల్దార్‌గా పనిచేస్తున్న తన పినతండ్రి ఆశ్రయం పొందాడు. తర్వాత సీతారామరాజు (నిజానికి శ్రీరామరాజు, సౌలభ్యం కోసం సీతారామరాజు) పినతండ్రి సలహాపై పైడిపుట్ట గ్రామం చేరి, అక్కడ ఒక అరవై ఎకరాల ప్రభుత్వ అటవీ భూమిని, వ్యవసాయం చేయడానికి అనువుగా తయారు చేయడానికి అందులో ఉన్న చెట్టు చేమలను నరికి పారేసి, ఆ భూమిని ఆక్రమించి అందులో ఓ ఆశ్రమం నిర్మించాడు.


దానికి 'శ్రీరామ విజయనగరం' అని పేరు పెట్టాడు. ఆ తర్వాత తాను వ్యవసాయానికి అనుగుణఃగా మార్చుకొన్న సదరు భూమి అరవై ఎకరాలను, తన పేరున పట్టా ఇప్పించాలని అప్పటి జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్ దొరకి అల్లూరి సీతారామరాజు స్వహస్తాలతో అర్జీ పెట్టుకున్నాడు. ( ఆ అర్జీ ఫోటో ప్రింటు ఆ పుస్తకంలో ముద్రించడమైంది. ఆ అర్జీ ఇప్పటికీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పదిలంగా ఉంది అని రచయిత ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది). ఎప్పుడో పాతికేళ్ళ నాడు చదివిన పుస్తకంలో అర్జీ యథాతథంగా అనలేను గాని, భాష, భావం, ఈ క్రింది విధంగా,,, శ్రీరామ -విజయనగరం, తారీఖు...., మహా ఘనత వహించిన జిల్లా కలెక్టర్ శ్రీశ్రీశ్రీ రూథర్ ఫర్డ్ దొరవారి దివ్య సముఖమునకు, తమకు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన అల్లూరి శ్రీరామరాజు వ్రాసుకొను అర్జీ విన్నపములు..


అయ్యా!

నేను పైడిపుట్ట గ్రామంలో గల అరవై ఎకరాల ప్రభుత్వ అటవీ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా చెట్టూ చేమలు తొలగించి, మార్చుకొని, ఒక ఆశ్రమం నిర్మించుకొని, ఈ ప్రాంతానికి శ్రీరామ విజయ నగరం అని పేరు పెట్టుకొని, ఇక్కడ నివసిస్తున్నాను. తమరు నాయందు దయ ఉంచి పెద్దమనసుతో ఈ భూమి నా పేరున పట్టా ఇప్పించినచో, తమ పేరు చెప్పుకొని, వ్యవసాయం చేసుకొంటూ జీవింగలవాడను.....ఇట్లు-తమకు మిక్కిలి విధేయుడు-అల్లూరి శ్రీరామరాజు.


దాంతో అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి, నాశనం చేసినందుకుగాను (చెట్టు చేమలు తొలగించడం) సీతారామరాజు మీద పోలీసు కేసు పెట్టింది ప్రభుత్వం. ఆ కేసు వాయిదాలకు నర్సీపట్నం కోర్టుకి సీతారామరాజుకి హాజరు అయ్యే నేపథ్యంలో, అతనికి అక్కడ గాము సోదరులతో (గాము గంటన్న దొర, గాము మల్లు దొర) పరిచయం ఏర్పడింది. 1992లో నేను రాజవొమ్మంగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినప్పుడు చదివిన స్టేషన్ హౌజ్ రొటీన్ పార్ట్ 4 ప్రకారం, గాము సోదరులకి, వారి దాయాదులకి మధ్య గల భూమి తగాదాల్లో కోర్టు చుట్టూ తిరిగేవారు.


సక్రమంగా కోర్టుకి హాజరు కాకపోవడంతో, కోర్టువారు, సీతారామరాజు, గాము సోదరుల మీద నాన్ బెయిలబుల్ వారంట్ల జారీ చేయడం జరిగింది. వారంట్లు ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించిన సందర్భంలో సీతారామరాజు అనుచరుడు విడిచిన బాణానికి ఓ పోలీసు బలి అయ్యాడు. జరిగింది తీవ్రంగా తీసుకొని బ్రిటీష్ ప్రభుత్వం, సీతారామరాజు, అతని అనుచరుల మీద, అడవుల్లో తిరగడంలో అనుభవం ఉన్న మలబార్ స్పెషల్ పోలీసులను ప్రయోగించింది. ఇక్కడ నుంచి మొదలయింది అసలు గొడవ.

నిజానికి నాన్ బెయిలబుల్ వారంట్ల జారీకి ముందు అల్లూరి సీతారామరాజు పోలీసువారితో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని, వాళ్ళు ఇచ్చిన దుస్తులు ధరించేవాడని, సీతారామరాజుని గుడాల్ కాల్చి చంపినపుడు సీతారామరాజు పోలీసులు ఇచ్చిన ఖాకీ నిక్కరే ధరించి ఉన్నాడని అంటారు. నిజం చెప్పాలంటే సీతారామరాజు తన జీవితంలో ఎన్నడూ కాషాయ దుస్తులు ధరించ లేదు. ఎప్పుడైతే మలబార్ స్పెషల్ పోలీసు షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌తో రంగంలోకి దిగిందో, సీతారామరాజు, అతని అనుచరులకు ఆత్మరక్షణకోసం తుపాకులు అవసరం అయ్యాయి.


వాళ్ళు పోలీసు స్టేషన్లు లూటీ చేసి, తుపాకులు, తూటాలు పట్టుకు పోవడం మొదలైంది. అలాగే అడవిలో తిరుగుతూ తిండికి కటకటలాడుతున్న సీతారామరాజు, అతని అనుచరులు సంత బండ్లను కొల్లగొట్టి ఆహార ధాన్యాలను దోచుకుపోయేవారని, వాళ్ల మీద రాజవొమ్మంగి స్టేషన్‌లో దారిదోపిడీ కేసులు నమోదు అయినాయి. ఈ విషయాలు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పార్ట్ 4లో సవివరంగా రాసి ఉన్నాయి.


సీతారామరాజుగురించి ఓ ప్రస్తావనలో టంగుటూరి ప్రకాశం గారు 'హి ఈజ్ ఎ డెకాయిట్' (అతను ఒక దోపిడీ దొంగ) అని అభివర్ణించారంటారు. నేతాజీ అల్లూరిని పొగిడారు అని కొందరంటారు. అల్లూరి సీతారామరాజు మీద నేతాజీ అవగాహన కంటే ప్రకాశం గారి అవగాహనకే విశ్వసనీయత ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మీద రిజిష్టరు అయిన కేసులన్నీ దొంగతనం, దోపిడీల క్రిందే కాని కుట్ర రాజద్రోహం లాంటి కేసులు ఎక్కడా రిజిష్టరు కాలేదు.


బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజుని రాజద్రోహిగా, కుట్రదారునిగా కాకుండా దోపిడీ దొంగగా తన రికార్డుల్లో పేర్కొంది. రాజద్రోహం, కుట్ర కేసులు నమోదు చేసే అవకాశాన్ని ఏ ప్రభుత్వం, ముఖ్యంగా వలసవాద ప్రభుత్వం వదలు కోదు. ఎందుకంటే అటువంటి చర్యలకు పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌లో అయినా చంపవచ్చు లేదా ఉరిశిక్ష అయినా విధించవచ్చు. తన సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే హక్కు ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది.


మరి అటువంటి అవకాశం బ్రిటీష్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు విషయంలో ఎందుకు వదలుకొంది? అదే బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ అజాద్‌ల మీద ఎందుకు కుట్ర, రాజద్రోహం కేసులు నమోదు చేసింది? అలా వ్యత్యాసం చూపాల్సిన అవసరం బ్రిటీష్ ప్రభుత్వానికి ఎందుకుంటుంది? మరి విచారిస్తే భగత్ సింగ్ త్రయం, ఆజాద్‌ల పోరాటం దేశం కోసం, సీతారామరాజుది అరవై ఎకరాల పొలం కోసం.


ఆయుధాల కోసం అడ్డతీగల పోలీసు స్టేషన్ లూటీ చేసిన సీతారామరాజు, పోలీసు స్టేషన్ రికార్డుల్లో తాను ఎన్ని తుపాకులు, ఎన్ని తూటాలు పట్టుకు పోతున్నది రాశాడుగాని, బ్రిటీష్ వారు దేశం విడిచి పోవాలని కాని, దేశానికి స్వాతంత్య్రం కావాలని కానీ, అవకాశం ఉన్నా రాయలేదు. అక్కడే కాదు తాను విజిట్ చేసిన అడ్డతీగల తహసిల్దార్ కార్యాలయం రికార్డుల్లోనే కాదు మరెక్కడా రాయలేదు. మరి ఆయన చక్కని లేఖకుడు కదా!


అలాగే పడాల వీరభద్రరావుగారు మల్లు దొర 1923 సెప్టెంబర్ 17న కౌర్సన్ అనే దొర సేనానికి దొరికినట్లుగా రాసారు. నిజానికి పోలీసు రికార్డుల ప్రకారం మల్లు దొర లాగ్వయి గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్న మహిళ ఇంట్లో తప్పతాగి నిద్రపోతుండగా స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు రికార్డులు చెబుతాన్నాయి. ఇది గుడ్డిగా మల్లుదొరని హీరోని చేసే ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు.


సీతారామరాజు పితూరి అంతా అయిదారు పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగింది. ఆయన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నానని ఏ ప్రభుత్వ రికార్డులలో గాని, మరే ఉత్తరాలలో గాని తన స్వహస్తాలతో రాసినట్లు చూపించగలరా? పడాల రామారావుగారు సీతారామరాజు చేసిన పరిశోధనలో, సీతారామారాజు గురించి ఆయనకు చెప్పగిలగే వారు అతి తక్కువ మంది అయి ఉంటారు. పడాల రామారావుగారు సీతారామరాజు గురించి ప్రభుత్వ రికార్డులలో ఉన్నది అసలు పరిశీలించకుండా/గణనకు తీసికోకుండా రచనలు చేయడం పాడి కాదు. రాజమండ్రివాసి అయిన పడాల రామారావు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ పార్ట్ 4 పరిశీలించి అసలు సీతారామారావు గురించి ఏమి రాసి ఉందో కనీస మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

అలా చేయకపోగా సీతారామరాజును దేశభక్తుడిగా, వీరుడిగా చిత్రించారు. బ్రిటీష్ వారు మన్యం ప్రజల్ని దోచేస్తుంటే అల్లూరి సీతారామరాజు అడ్డుకునేవాడు అనేవారికి, బ్రిటీష్ వారు మొత్తం దేశాన్నే దోచారని, మన్య ప్రజల్ని ఒక్కర్నే కాదని తెలియదా? బిట్రీష్ వాళ్ళు మన్యంలో చింతపండు, శీకాయ వ్యాపారం చేయలేదు అని మనవి. మనం దండలు వేసి గౌరవించే సీతారామరాజు విగ్రహం దేశభక్తుడిదా, భూకబ్జాదారుడిదా, లేదా ప్రకాశం పంతులు అన్నట్లు బందిపోటు దొంగదా? అని తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది.



Saturday, June 25, 2022

సముద్రపు నత్త

 ఇటు జంతువులా ఆహారాన్ని ఆరగిస్తూనే.. మరోవైపు మొక్కల్లా శరీరంలోనే ఆహారాన్ని తయారు చేసుకుంటోందని గుర్తించారు. దాని గుట్టు తెలిస్తే మానవాళి భవిష్యత్తే మారిపోతుందని అంటున్నారు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా.. మొక్కలకు.. జంతువులకు మధ్య..

అదో సముద్రపు నత్త (సీ స్లగ్‌). చూడటానికి ఆకుపై పాకుతున్న నత్తలా ఉంటుంది. కానీ దాని శరీరమే అచ్చం ఆకులా ఉంటుంది. అలా కనిపించడమే కాదు.. నిజంగానే
అది సగం జంతువులా, మరో సగం మొక్కలా బతికేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా తూర్పు తీరంలో మాత్రమే కనిపించే ఈ సముద్రపు నత్తలకు 'ఎలిసియా క్లోరోటికా' అని పేరుపెట్టారు.



నాచు నుంచి పత్ర హరితాన్ని సంగ్రహించి.. మొక్కలు భూమి నుంచి నీరు, పోషకాలనుగ్రహించి.. సూర్యరశ్మి సాయంతో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో మొక్కల ఆకుల్లో ఉండే 'పత్ర హరితం (క్లోరోప్లాస్ట్‌)' చాలా కీలకం. ఈ క్లోరోప్లాస్ట్‌ కణాల వల్లే ఆకులకు ఆకుపచ్చ రంగు వస్తుంది. సాధారణంగా 'ఎలిసియా క్లోరోటికా' నత్తలు సముద్రాల్లో ఉండే నాచు (ఆల్గే)ను తిని బతుకుతుంటాయి. ఈ క్రమంలో నత్తలు నాచులోని క్లోరోప్లాస్ట్‌లను తమ శరీరంలో విలీనం చేసుకుంటున్నాయని.. వాటి సాయంతో ఆహారాన్ని ఉత్పత్తి (ఫొటో సింథసిస్‌) చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఆ 'గుట్టు' తేల్చితే ఎన్నో అద్భుతాలు
'ఎలిసియా క్లోరోటికా' నత్తలు క్లోరోఫిల్‌ను ఎలా సంగ్రహించగలుగుతున్నాయి, ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయనేది తేల్చితే..ఎన్నో అద్భుత టెక్నాలజీలను రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సౌరశక్తిని ఉపయోగించి నేరుగా ఆహారం తయరుచేయగల సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు. అడవుల
నరికివేత తగ్గిపోతుందని, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని.. పర్యావరణాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. చంద్రుడు, ఇతర గ్రహాలపైకి వెళ్లే మనుషులకు ఆహారం సమస్య ఉండదని అంటున్నారు






తేల్చాల్సిన అంశాలెన్నో!

'ఎలిసియా క్లోరోటికా' నత్తలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వాటి సంఖ్య చాలా తక్కువని, అంతరించిపోయే దశలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే వాటి 'గుట్టు' తేల్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొన్ని అంశాలపై దృష్టి సారించారు.
మొక్కలు, జంతువులు కణాలు పూర్తిగా వేరుగా ఉంటాయి.
అలాంటిది వీటి మధ్య జీవ, రసాయనపరంగా అనుసంధానం ఎలా కుదిరింది?

మొక్కల క్లోరోప్లాస్ట్‌లను ఈ నత్తలు ఎలా వినియోగించుకో గలుగుతున్నాయి?
ఏదైనా తిన్నప్పుడు కడుపులో జీర్ణమైపోతాయి.
అలాంటప్పుడు ఈ నత్తల కడుపులో క్లోరోప్లాస్ట్‌లు దెబ్బతినకుండా ఎలా ఉంటున్నాయి?






Sunday, June 19, 2022

music day

 కర్ణాటక అటు హిందుస్తానీ సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై కూర్చుని జుగల్‌బందీ కచేరీలతో శ్రోతలను అలరించిన సందర్భాలు నిన్నటితరం సంగీతాభిమానులకు తెలిసిన ముచ్చటే! ఇప్పటికీ తరచుగా జుగల్‌బందీ కచేరీలు దేశ విదేశాల్లో విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలోని భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు మాత్రమే కాదు, విదేశీ విద్వాంసులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యూజన్‌ ఆల్బమ్స్‌కు అన్ని ప్రాంతాల్లోనూ శ్రోతల ఆదరణ పెరుగుతోంది. ఫ్యూజన్‌ ప్రయోగాలు సంగీతం విశ్వజనీనమని చాటుతున్నాయి.

జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం...

మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది.


ఇటు కర్ణాటక అటు హిందుస్తానీ సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై కూర్చుని జుగల్‌బందీ కచేరీలతో శ్రోతలను అలరించిన సందర్భాలు నిన్నటితరం సంగీతాభిమానులకు తెలిసిన ముచ్చటే! ఇప్పటికీ తరచుగా జుగల్‌బందీ కచేరీలు దేశ విదేశాల్లో విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలోని భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు మాత్రమే కాదు, విదేశీ విద్వాంసులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యూజన్‌ ఆల్బమ్స్‌కు అన్ని ప్రాంతాల్లోనూ శ్రోతల ఆదరణ పెరుగుతోంది. ఫ్యూజన్‌ ప్రయోగాలు సంగీతం విశ్వజనీనమని చాటుతున్నాయి.
జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం...

మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది.

ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్‌కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు.

హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్‌బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్‌ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్‌ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ అలీ అక్బర్‌ఖాన్‌ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్‌ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్‌ ఎన్‌ రోల్‌ బృందాలతో కలసి ఫ్యూజన్‌ కచేరీలు చేశారు.

సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం
భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్‌ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్‌ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్‌ శంకరాభరణ రాగంలో రచించిన 'నోట్టు స్వరాలు' పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి.

ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్‌ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్‌ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి.

ఫ్యూజన్‌ ప్రయోగాలు
హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్‌బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్‌ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్‌ రాక్‌బ్యాండ్‌ 'బీటిల్స్‌' బృందానికి చెందిన గిటారిస్ట్‌ జార్జ్‌ హారిసన్, అమెరికన్‌ వయోలినిస్ట్‌ యెహుది మెనుహిన్‌ వంటి వారితో కలసి పండిట్‌ రవిశంకర్‌ 1960 దశకంలోనే ఫ్యూజన్‌ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్‌ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్‌ హారిసన్‌ స్వయంగా పండిట్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ నేర్చుకుని, 'బీటిల్స్‌' పాట 'నార్వేజియన్‌ వుడ్‌'లో సితార్‌ స్వరాలను పలికించాడు. పండిట్‌ రవిశంకర్‌ కృషి ఫలితంగా ప్రాక్‌ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది.

తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి 'కలోనియల్‌ కజిన్స్‌' పేరుతో ఫ్యూజన్‌ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్‌ బ్యాండ్స్‌ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్‌ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌.శంకర్, మాండోలిన్‌ శ్రీనివాస్, రాజేష్‌ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్‌ షాహిద్‌ పర్వేజ్, సితారా దేవి, జాకీర్‌ హుస్సేన్‌ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్‌ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్‌ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం.
కూత ఘనం

పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్‌.రెహమాన్, అద్నాన్‌ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్‌ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్‌ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్, హరిప్రసాద్‌ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్‌ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.

నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్‌ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్‌ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్‌ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్‌ పాయ్‌ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు.

ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్‌ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్‌ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. 'యూట్యూబ్‌'ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్‌ పాయ్‌ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్‌ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు.

మన సంగీతంలో పాశ్చాత్యవాద్యాలు
మన సంగీత కచేరీల్లోకి పాశ్చాత్యవాద్య పరికరాలు బ్రిటిష్‌ హయాంలోనే ప్రవేశించాయి. కర్ణాటక సంగీత కచేరీలకు క్లారినెట్‌ను తొలిసారిగా మహాదేవ నట్టువనార్‌ పరిచయం చేశారు. తర్వాతి కాలంలో ఎ.కె.సి. నటరాజన్‌ వంటివారు క్లారినెట్‌ను కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువ చేశారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మహాదేవ నట్టువనార్‌ తంజావూరు మరాఠా రాజుల ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. అప్పట్లోనే ఆయన పాశ్చాత్య పరికరమైన క్లారినెట్‌పై ఆయన అద్భుతమైన స్వరవిన్యాసాలు చేసి, పండిత పామరులను అలరించారు. తర్వాతి కాలంలో క్లారినెట్‌ కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువైంది. తంజావూరు ఆస్థానానికి చెందిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్‌ సోదరుడు బాలస్వామి దీక్షితార్‌ పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో కర్ణాటక సంగీతానికి వయోలిన్‌ను పరిచయం చేశారు. ద్వారం వెంకటస్వామినాయుడు వయోలిన్‌ను కర్ణాటక సంగీతంలో అవిభాజ్య వాద్యం స్థాయికి చేర్చారు.

ద్వారం వెంకటస్వామినాయుడు ప్రభావంతో కర్ణాటక సంగీత కచేరీలలో వయోలిన్‌ ఒక తప్పనిసరి పక్కవాద్యం స్థాయికి చేరుకుంది. అంతేకాదు, వయోలిన్‌తో సోలో కచేరీలిచ్చే ఉద్దండులు కర్ణాటక సంగీతంలో చాలామందే ఉన్నారు. కదిరి గోపాలనాథ్‌ తొలిసారిగా శాక్సోఫోన్‌ను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో మరికొన్ని పాశ్చాత్య వాద్యపరికరాలు కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలకు పరిచయమయ్యాయి. పాశ్చాత్య వాద్యపరికరమైన శాక్సోఫోన్‌కు కొద్దిపాటి మార్పులు చేసి, దానిని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని గమకాలన్నీ పలికేలా తీర్చిదిద్దారు.

మాండోలిన్‌ను శ్రీనివాస్‌ బాలుడిగా ఉన్నప్పుడే కర్ణాటక సంగీతానికి పరిచయం చేసి, 'మాండోలిన్‌ శ్రీనివాస్‌'గా ప్రఖ్యాతి పొందారు. సుకుమార్‌ ప్రసాద్‌ తొలిసారిగా గిటార్‌ను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. అనిల్‌ శ్రీనివాసన్‌ పియానోను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. పాశ్చాత్య వాద్యపరికరమైన హార్మోనియం పంతొమ్మిదో శతాబ్దం నాటికి మన దేశంలో బాగా జనాదరణ పొందింది. పరిమాణంలో కొన్ని మార్పులకు లోనై, హిందుస్తానీ గాత్ర కచేరీలకు పక్కవాద్యంగా చక్కగా ఇమిడిపోయింది. పాశ్చాత్య వాద్యపరికాలు మన సంప్రదాయ సంగీతంలోని నిశితమైన గమకాలను, సంగతులను పలికించలేవనే విమర్శలు ఉన్నా, వాటిని తమవిగా చేసుకుని కచేరీలు చేసిన కళాకారులు ఆ విమర్శలన్నింటినీ వమ్ము చేశారు.

ఆధునిక కాలంలో మన భారతీయ సంగీత విద్వాంసులు పలువురు ప్రపంచ స్థాయిలో మన్ననలు అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై కచేరీలు చేసి, శ్రోతలను ఉర్రూతలూపారు. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన వారిలో అటు హిందుస్తానీ, ఇటు కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. శైలీ సంప్రదాయాలు వేర్వేరు అయినా, సంగీతం అంతా ఒక్కటేననే భావనతో భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు జుగల్‌బందీ కచేరీలతో భారతీయ సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. భీమ్‌సేన్‌ జోషి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, పండిట్‌ జస్‌రాజ్, ఎల్‌.సుబ్రమణ్యం తదితరుల జుగల్‌బందీలు భారతీయ సంగీతానికే వన్నె తెచ్చేవిగా నిలుస్తాయి. హిందుస్తానీ సంగీతకారుల్లో సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్, షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్, సరోద్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ అమ్జద్‌ అలీ ఖాన్, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్‌ చౌరాసియా, సంతూర్‌ విద్వాంసుడు శివకుమార్‌ శర్మ, తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

ఆధునిక కర్ణాటక సంగీతకారుల్లో చెంబై వైద్యనాథ భాగవతార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మధురై మణి అయ్యర్, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి, జి.ఎన్‌.బాలసుబ్రమణ్యం, టి.ఎన్‌.శేషగోపాలన్‌ తదితర గాయకులు చెరగని ముద్ర వేశారు. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్‌.వసంతకుమారి కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా గుర్తింపు పొందారు.

ద్వారంవారి తర్వాత వయొలినిస్టుల్లో లాల్గుడి జయరామన్, కన్నకుడి వైద్యనాథన్, ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్, అన్నవరపు రామస్వామి, ఎల్‌.వైద్యనాథన్, ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌. శంకర్, అవసరాల కన్యాకుమారి, వైణికుల్లో ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, దొరైస్వామి అయ్యంగార్, ఇ.గాయత్రి, జయంతి కుమరేశ్, వేణుగానంలో టి.ఆర్‌.మహాలింగం, ఎన్‌.రమణి, ప్రపంచం సీతారాం, నాదస్వరంలో షేక్‌ చినమౌలానా, టి.ఎన్‌.రాజరత్నం పిళ్లె తదితరులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించిన వారిలో ప్రముఖులు. ఇప్పటి తరంలో టి.ఎం.కృష్ణ, సిక్కిల్‌ గురుచరణ్, పాల్ఘాట్‌ రామ్‌ప్రసాద్, అక్కారయ్‌ శుభలక్ష్మి, అమృతా మురళి, విద్యా కళ్యాణరామన్‌ తదితరులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాణిస్తున్నారు.

సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం
భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్‌ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్‌ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది.

ముత్తుస్వామి దీక్షితార్‌ శంకరాభరణ రాగంలో రచించిన 'నోట్టు స్వరాలు' పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్‌ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్‌ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి.

ఫ్యూజన్‌ ప్రయోగాలు
హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్‌బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్‌ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్‌ రాక్‌బ్యాండ్‌ 'బీటిల్స్‌' బృందానికి చెందిన గిటారిస్ట్‌ జార్జ్‌ హారిసన్, అమెరికన్‌ వయోలినిస్ట్‌ యెహుది మెనుహిన్‌ వంటి వారితో కలసి పండిట్‌ రవిశంకర్‌ 1960 దశకంలోనే ఫ్యూజన్‌ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్‌ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్‌ హారిసన్‌ స్వయంగా పండిట్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ నేర్చుకుని, 'బీటిల్స్‌' పాట 'నార్వేజియన్‌ వుడ్‌'లో సితార్‌ స్వరాలను పలికించాడు.

పండిట్‌ రవిశంకర్‌ కృషి ఫలితంగా ప్రాక్‌ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి 'కలోనియల్‌ కజిన్స్‌' పేరుతో ఫ్యూజన్‌ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్‌ బ్యాండ్స్‌ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్‌ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌.శంకర్, మాండోలిన్‌ శ్రీనివాస్, రాజేష్‌ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్‌ షాహిద్‌ పర్వేజ్, సితారా దేవి, జాకీర్‌ హుస్సేన్‌ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్‌ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్‌ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం.
కూత ఘనం
పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్‌.రెహమాన్, అద్నాన్‌ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్‌ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్‌ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్, హరిప్రసాద్‌ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్‌ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.

ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్‌ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్‌ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. 'యూట్యూబ్‌'ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్‌ పాయ్‌ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్‌ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు.



Sunday, June 12, 2022

పులి

 





ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై అధ్యయనం

ఇది ఒడిశా అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న అటవీ శాఖ

దాని రూటు, ఆ ప్రాంతంలో ఉన్న పులుల గురించి తెలుసుకునేందుకు కసరత్తు

ఏపీ-ఒడిశా మధ్య పులుల కొత్త కారిడార్‌పై ఊహాగానాలు

సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది

దాన్ని పట్టుకోవడంతోపాటు అది ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందో తెలుసుకోవడం సవాలుగా మారింది. గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. తొలుత.. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు గ్రామాల్లో పశువులు మాయమవడంతో మొదట ఏదో అడవి జంతువు వచ్చినట్లు భావించారు.

వరుసగా పశువులు మాయమవుతుండడం, వాటి కళేబరాలు కనబడుతుండడంతో స్థానికులు పులి తిరుగుతున్నట్లు చెబుతూ వచ్చారు. దీంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అడుగుల ముద్రలు ఇతర గుర్తుల ఆధారంగా దాన్ని పులిగా నిర్థారించారు. మొదట్లో అది పోలవరం ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో తిరిగింది. ఆ తర్వాత ఆహారం, నీరు దొరికే ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ వచ్చింది.

దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు కెమెరాలు ఏర్పాటుచేశారు. కొన్నిచోట్ల బోన్లు పెట్టినా అది చిక్కలేదు. పులుల సంచారం, వాటిని దారి మళ్లించడంలో నిష్ణాతులైన శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టు సిబ్బంది అక్కడికి వెళ్లి పులిని పట్టుకోవడం లేదా దారి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఆ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేసినట్లు కాకినాడ డీఎఫ్‌ఓ ఐకేవీ రాజు తెలిపారు.

ఒడిశా నుంచే వచ్చిందా?
3-4 ఏళ్ల వయసున్న ఈ పులి ఒడిశా అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు, విశాఖ అటవీ ప్రాంతం మీదుగా ఇది ప్రత్తిపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీ శాఖ అంచనా వేస్తోంది. పాపికొండల అభయారణ్యంలో నాలుగైదు పులులు ఉన్నా ఇది అక్కడి నుంచి వచ్చింది కాదని చెబుతున్నారు.

ఇది కచ్చితంగా ఒడిశా నుంచి వచ్చిందే అయ్యుంటుందనే ఉద్దేశంతో అటువైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని గురించి తెలుసుకునేందుకు అటవీ శాఖ ఇప్పటికే ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ)ని సంప్రదించారు. ఒడిశాలోని సత్‌కోసియా, సిమిల్‌పాల్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతాలు, వాటికి ఆనుకుని ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో ఉన్న పులుల వివరాలను సేకరిస్తున్నారు.

అక్కడి నుంచి ఇది ఏపీకిలోకి ప్రవేశించిందా అన్న కోణంలో విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా దేశంలోని టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లో ఉన్న పులుల వివరాలన్నీ ఎన్‌టీసీఏ వద్ద ఉంటాయి. కెమెరాల ట్రాప్‌ ద్వారా ఆ టైగర్‌ రిజర్వులోని ప్రతి పులికి ఒక కోడ్‌ ఇచ్చి గుర్తిస్తారు. అలా అక్కడి జాబితాలో ఉన్న పులులతో ఇక్కడ తిరుగుతున్న పులిని పోల్చి చూస్తారు.

ఇది ఆ జాబితాలోని పులేనా!?
ఒకవేళ ఇక్కడ తిరుగుతున్న పులి ఆ జాబితాలోనిది అయితే అది ఏ మార్గంలో వచ్చిందో అధ్యయనం చేస్తారు. అదే జరిగితే ఈ మార్గం గుండా కొత్త పులుల కారిడార్‌ ఏర్పడినట్లే. అంటే ఏపీ, ఒడిశా మధ్య కొత్త పులుల కారిడార్‌ ఏర్పడినట్లు నిర్థారిస్తారు. ఇటీవల నల్లమల నుంచి శేషాచలం అడవులకు ఇలాగే కొత్త పులుల కారిడార్‌ ఏర్పడింది.

ఇదే తరహాలో కొత్త కారిడార్‌ ఏర్పడిందా అనే అనుమానాలు అటవీ శాఖాధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ, దీన్ని నిర్థారించడం అంత సులువు కాదని, ఎన్నో అధ్యయనాలు, ఆధారాలు కావాలని చెబుతున్నారు. అక్కడి పులుల జాబితాలో ఇది లేకపోతే ఈ పులి ఎక్కడిదో అన్నది మిస్టరీగానే ఉండే అవకాశం ఉంది. లేకపోతే అక్కడి కెమెరా ట్రాప్‌లకు దొరక్కుండా అయినా ఉండాలి. ఇవన్నీ తెలియాలంటే చాలా సమయం పడుతుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అందుకే ఎన్‌టీసీఏ ద్వారా ఈ పులి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు

శంఖవరం, జూన్‌ 12: ఇరవై రోజులుగా సంచలనం సృష్టిస్తున్న పెద్ద పులి కత్తిపూడి నల్లకొండపై తిష్టవేసింది. సబ్‌ప్లాన్‌ మైదాన ప్రాంతం నుంచి రిజర్వు ఫారెస్టు దాటుకుంటూ హైవేకు కూతవేటు దూరంలో ఉన్న నల్లకొండపై శనివారం రాత్రి వజ్రకూ టం శివార్లలో ఆటోకి అడ్డుపడింది పెద్దపులే అని అటవీ అధికారులు గుర్తించారు.

వర్షంవల్ల పాదముద్రలు అక్కడ కనిపించకపోయినా పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో దాని ముద్రితమై ఉన్నాయి. కత్తిపూడి ట్రక్కులేబై సమీపంలోను, రామన్నపాలెం సమీపం కొండల్లోను వీటి ముద్రలు అధికంగా కనిపించాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోనే పెద్దపులి రాత్రి బస చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పెద్దపులి తిరిగాడే ప్రాంతం, అది తిరిగే అవకాశం ఉన్న ఐదు కీలక ప్రదేశాలను గుర్తించి ట్రాఫికింగ్‌ కెమెరాలను అధికారులు అమర్చారు.

బోనులకు చిక్కకుండా తప్పించుకుంటూ..

పెద్దపులి వారంరోజులుగా ఏ జంతువునూ వేటాడకపోయినా పాదముద్రల ఆధారంగానే తన ఉనికిని చాటుతోంది. వాటి ద్వారానే అధికారులూ దాన్ని వెంబడిస్తున్నారు. ఎక్కడికక్కడ బోనులు ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఎక్కడా వాటికి చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. మత్తుమందు ఇచ్చే ప్రయత్నమే చేయాలని ఎన్‌ఎస్‌ఆర్‌ అధి కారి ఒకరు అభిప్రాయపడ్డారు. అలా మత్తు మందు ద్వారా పులిని పట్టాలంటే అను కూల ప్రదేశం కావాలని, చెరువులు, పోలవరం పెద్దకాలువలూ ఉండకూడదని ఆయన చెప్తున్నారు. శని, ఆదివారాల్లో పెద్దపులి తి రిగాడిన ప్రదేశం మైదాన ప్రాంతంగా గు ర్తించారు. ఈ ప్రాంతంలో మత్తు ఇవ్వడానికి అనుకూలంగానే ఉంటుందంటున్నారు.

భయాందోళనలో ప్రజలు

కత్తిపూడి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతుందనే సమాచారంతో కత్తిపూడి, వజ్రకూటం, నెల్లిపూడి పరిసర ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పులి పాదముద్రలు కనిపించడంతో పరిసర ప్రాంత రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు. పులి సంచరించే ప్రాంతంలో ప్రజలు కలియ తిరగకుండా ఉండాలని, దానివల్ల పులి దాని రూటు మార్చుకుంటుందని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు



ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : జూన్ 12 ( హిం స)

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ మర్రి చెట్టు వద్ద పులి సంచరిస్తోంది.


శనివారం రాత్రి వజ్రకూటం నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో పైకి పెద్ద పులి దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. పులి పాదముద్రలను సేకరించిన అటవీ శాఖ అధికారులు.. తొందరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు. పులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు.





Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజలను పులి భయం ఇంకా వీడడం లేదు. పులి ఏదో దిక్కున కనిపించి హడలెత్తిస్తుంది.


అటవీశాఖ అధికారులకు చిక్కకుండా జనాలకు కనిపిస్తూ గుండెల్లో గుబులురేపుతోంది. తాజాగా శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ వద్ద బెంగాల్ టైగర్ సంచారం చేసినట్లు తెలుస్తోంది. వజ్రకూటం నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ కి పెద్దపులి కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తోంది.




కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజలను పులి భయం వీడడం లేదు. పులి ఏదో దిక్కున కనిపించి హడలెత్తిస్తోంది. అటవీశాఖ అధికారులకు చిక్కకుండా జనాలకు కనిపిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.


లేటస్ట్‌గా శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ దగ్గర ఈ బెంగాల్ టైగర్ సంచారం చేసినట్లు తెలుస్తోంది. వజ్రకూటం నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ కి పెద్దపులి కనిపించింది.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తున్నారు.





Bengal tiger: ఈ మధ్య కాలంలో పులులు జనవాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి. అడవులను వదిలి పరిసర ప్రాంతాలు, పొలాల్లోకి రావడంతో భయాందోళన వ్యక్తం అవుతోంది.


ఇక ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ మర్రి చెట్టు వద్ద బెంగాల్ టైగర్ (పులి) సంచరిస్తోంది. తాజాగా శనివారం రాత్రి వజ్రకూటం నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో పైకి పెద్ద పులి దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారు.

పులి పాదముద్రలను సేకరించిన అటవీ శాఖ అధికారులు.. తొందరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు. బెంగాల్‌ టైగర్‌ సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఎవ్వరు కూడా బయటకు రాకూడదని అటవీ శాఖ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.




మూడు నుంచి అయిదేళ్ల లోపు వయసు ఉన్న రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఇరవై రోజులుగా అటవీ ప్రాంతానికి కూతవేటు దూరంలోని మైదాన ప్రదేశాల్లో తిరగడం విశేషమే.


యవ్వనంలో ఉన్న ఈ బెబ్బులి ఇక్కడ ఇన్ని రోజులు ఎందుకు ఉంది? ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఎందుకు తిరుగుతోందన్నది ఆసక్తికరంగా మారింది.

పాదముద్రలే ఆనవాళ్లు

పెద్దపులి ఒక చోటకు పరిమితం కావడం లేదు. శనివారం రాత్రి వజ్రకూటం సమీపంలోని రెండు కొండల మధ్య ఆటోలో వెళ్తున్నవారి కంటపడి అలజడి రేపింది. వజ్రకూటం, రామన్నపాలెం, కత్తిపూడి గ్రామాల పరిధిలోని కొండల్లో పలుచోట్ల దాని పాదముద్రలు గుర్తిచారు. జాతీయ రహదారికి 5 కి.మీ. లోపే సంచరించడంతో యంత్రాంగంలోనూ మరింత ఆందోళన పెరిగింది. ఎన్‌ఎస్‌టీఆర్‌ డీఆర్‌వో ప్రసాద్‌రెడ్డి బృందం ఆ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.

20 రోజులుగా ఇక్కడే...

జిల్లా కేంద్రం కాకినాడకు 40 కిలోమీటర్ల దూరంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, గొల్లప్రోలు మండలాల మధ్య 20 రోజులుగా పులి సంచరిస్తోంది. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, కొడవలి, వజ్రకూటం ప్రాంతాలు కొండలు, వాగులు, పుష్కర, ఏలేరు కాలువలతో ఉంటాయి. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు, చెట్లతో ఉన్న మెట్టలు అడవిని తలపిస్తాయి. ఇదే అనువుగా బెబ్బులి భావించి ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆకలికి మించి వేటాడని, బోనులో ఎరవేసినా.. లొంగని వ్యాఘ్రం ఇప్పటికి అయిదు పశువులను వధించింది. దాన్ని తిరిగి అడవిలోకి పంపాలనే మంత్రాంగాన్ని తిప్పికొడుతూ ఇక్కడిక్కడే తిరుగుతోంది.

ఎందుకు ఉందంటే..?

* పులి ఇన్ని రోజులు అటవీప్రాంత సమీప మైదానంలో తిష్ఠ వేయడానికి కారణాలను వన్యప్రాణి, అటవీ అధికారులు విశ్లేషించుకుంటున్నారు.

* పులి కౌమారదశకు చేరినపుడు అదో ప్రత్యేక భూభాగాన్ని (టెరిటరీ) ఖాయపరుచుకుంటుంది. మగ పులి 25 నుంచి 40 చ.కి.మీ. విస్తీర్ణాన్ని తన రాజ్యంగా భావిస్తుంది. తన కదలికలు, ఉంచే ఆనవాళ్లతో మిగతా జంతువులు పులి ఉనికిని గుర్తిస్తాయని చెబుతున్నారు. వేటకు అనువుగా ఉన్న పరిస్థితులను అది చూసుకుంటుంది.

* పులి ఉండే తన సహజ ఆవాసంలో పరిస్థితులకు విఘాతం కలిగి ఉండవచ్ఛు అడవుల్లోనూ ఏదో రూపేణా జనం చేసే చప్పుళ్లు కారణం కావచ్ఛు రిజర్వు ఫారెస్టులనే ఖనిజ తవ్వకాలకు, ఇతర క్వారీలకు కేటాయిస్తున్నారు. విశాఖ మన్యం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపప్రణాళిక మన్యం వంతాడ, ఏజెన్సీ వరకూ జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం కాగా..వన్యప్రాణులు జనం బాట పట్టడానికి ఇదో కారణం.

* ఆహార పిరమిడ్‌లో ప్రాథమిక లబ్ధిదారులు శాకాహార జంతువులు, వాటిపై ఆధారపడే మాంసాహారులు వీటిని నియంత్రించే పులి, చిరుత, సింహం. ఆహార సైకిల్‌కు భంగం అనిపించిన పరిస్థితుల్లోనూ వన్యప్రాణులు పక్కచూపు చూస్తాయి. మన్యం చేరువగా ఉన్న ఈ ప్రాంతంలో పాడిపశువులు, అడవి పందులు, కణుజులు, గొర్రగేదెలు పులి పరిశీలనలో ఉండడం వల్లే ఇన్నిరోజులు తిష్ఠ వేసిందనుకుంటున్నారు.

* బైనాక్యులర్‌లో కనిపించినంత కంటి దృష్టి ఉండే పెద్దపులి చురుకుదనమూ అంతే.. తనచుట్టూ జరుగుతున్న అలికిడిని ఎంతదూరంలో ఉన్నా పసిగడుతోందని భావిస్తున్నారు.




అడవికి మళ్లేలా...

పులి అని గుర్తించినప్పటి నుంచి దానిని అడవిలోకి పంపే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. యుక్త వయసులో ఉన్న మగ పులి అది. తెలివిగానూ తిరుగుతోంది. ఒక ప్రాంతానికి పరిమితమై సంచరించడం లేదు. అందుచేత దాని గమనాన్ని పరిశీలిస్తూ ఊళ్లలోకి రాకుండా పెట్రోలింగ్‌ చేయడమే కీలకం. ఇప్పటివరకు అది పశువులనే వేటాడింది. ప్రజలకు హాని కలగకుండా చూస్తాం.

-సెల్వం, వన్యప్రాణి విభాగం డీఎఫ్‌వో









Friday, June 10, 2022

వయాగ్రా

 లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు వయాగ్రా తీసుకుంటూ ఉంటారు ఎక్కువమంది. అంతేకాకుండా లైంగిక సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఎక్కువగా వయాగ్రా వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. అది కూడా వైద్యుల సూచన మేరకు మాత్రమే అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా లైంగిక సామర్థ్యం పెంచడంలో ఎంతో పాపులర్ అయిన వయాగ్రా పొరపాటున తయారుచేయబడిన ఒక ఔషధం అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.


శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఏదో ఒక వ్యాధికి మందు కనుగొనడానికి ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సమయంలో పొరపాటున మరో ఔషధాన్ని కనుగొనడం లాంటివి ఎన్నో సార్లు జరిగాయి. ఇప్పటి వరకు చాలా ప్రొడక్ట్స్ ని కూడా పొరపాటున కనుగొన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. అలాగే ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వయాగ్రాని కూడా పొరపాటున కనుగొన్నారట శాస్త్రవేత్తలు.

ఆంజైన అనే ఒక హృదయ రోగానికి మెడిసిన్ తయారు చేసేందుకు బ్రిటన్ ఫైజర్ సంస్థ శాస్త్రవేత్తలు రెండు దశాబ్దాల క్రితం ఒక పరిశోధన ప్రారంభించారట. ఈ క్రమంలోనే ఒక ఔషధాన్ని కనుగొని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారట. ఇక క్లినికల్ ట్రయల్స్ లో యువకుల జననాంగం అసాధారణ రీతిలో ఉద్రేకం కావడం గమనించి ఇక దీని పై మరింత ప్రత్యేకమైన దృష్టి పెట్టి చివరికి వయాగ్రా తయారు చేశారట. పొరపాటున తయారు చేయబడిన ఈ ఔషధం 1998 లో ఫైజర్ సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది అని చెప్పాలి.

Sunday, June 5, 2022

కోతుల మరణం



సహజంగా సృష్టిలోని జీవరాసులు ఏవి చనిపోయిన వాటి కళేబరాలను మనం చూస్తుంటాము. వాటి షవశేషాలను చూస్తుంటాము. కాని కోతుల కళేబరాలు ఎక్కడ క


నిపించవు. ఎందుకు ? ... అవి మరణిస్తాయని వాటికి వారం ముందే తెలిసిపోతుంది అంట. అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఏ ఆహారం తీసుకోకుండా, తనకు కావలసిన గుంతను తవ్వి అందులో పడుకుండి పోతాయట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది. ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి. సాధారణంగా ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాము. ఒక్క నిమిషం ఒకచోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని. అలాంటిది కోతులు ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది.



 ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద అడిగి పొందిన వరం అని... మరణం ముందుగా గ్రహించి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా... పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి. నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు. ఆ హనుమయ్య, అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతలు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి దేహం పూర్తిగా కప్పబడేవరకు కదలిరావట. అందుకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని అంటారు. అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రత్యక్షమౌతుందని విన్నాను. అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ. మీరే

నాడులు

 సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

వెన్నెముక పొడవునా ఉండే శ క్తి కేంద్రాలను చక్రాలు అంటారు. ఇవి నాడీ వ్యవస్థ ఆధారితంగా ఉంటాయి. కటిభాగం నుంచి మొదలై కపాలానికి చేరతాయి. వీటిలో సహస్రార చక్రం అన్నింటికన్నా కీలకమైనది. వెన్నెముకలో సుషుమ్న, ఇడ , పింగళ అనే ప్రధాన కేంద్రాలు ఉంటాయి. జీవ శక్తికీ, ప్రాణశక్తికీ కేంద్రంగా ఈ చక్రాలను పరిగణిస్తారు. స్థూల శరీరానికి సంబంధించిన ఒక మౌలిక అంశమే ప్రాణం. ప్రాణశక్తిని చైతన్యపరిచే ఈ చక్రాలే జీవితానికి మూలం.



ఈ సప్త చక్రాలు ఎక్కడ ఉంటాయి? వాటి పేర్లేమిటి?

ఈ ఏడు ప్రధాన చక్రాలలో మొదటిది మూలాధారం. ఇది వెన్నెముక అట్టడుగు పూసకు దగ్గరగా ఉంటుంది. జననాంగానికీ, పురీషనాళానికీ మధ్య ప్రదేశంలో ఉంటుంది. రెండవది, స్వాధిష్ఠానం. జననాంగానికి కొంచెం పైన ఉంటుంది. మూడవది మణిపూరం. అది బొడ్డుకింద ఉంటుంది. నాలుగు అనాహతం. ఇది ఉరఃపంజరంలో పక్కటెముకలు కలిసే ప్రాంతంలో ఉంటుంది. అయిదవ చక్రం విశుద్ధి. అది కంఠం కింద ఉండే గుంట ప్రాంతంలో ఉంటుంది. ఆజ్ఞా చక్రం ఆరవది. అది కనుబొమల మధ్య ఉంటుంది. ఏడవ చక్రం సహస్రార చక్రం. దీన్ని బ్రహ్మ రంధ్రం అని కూడా అంటారు. నడినెత్తి మీద ఉంటుంది. శిశువు జన్మించినప్పుడు ఇది మెత్తటి ప్రాంతంగా ఉంటుంది.

యోగా సాధకుడు ఏఏ చక్రాల్లో ఉన్నాడో... ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి. అవేమిటంటే..

1. మూలాధార చక్రము - మన దగ్గర లేని పదార్థాల వాసనలు రావడం, రతిక్రీడ దృశ్యాలు

2. స్వాధిష్ఠాన చక్రము - ఇష్టపదార్ధాల రుచులు గుర్తుకి రావడం, గుప్తనిధుల దృశ్యాలు

3.మణిపూరక చక్రము - అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4. అనాహత చక్రం - ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం

5. విశుద్ధి చక్రము - వివిధ రకాల శబ్దాలు వినబడటం

6.ఆజ్ఞా చక్రము - ఓంకార నాదం వినబడటం

7. గుణ చక్రం - త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావడం

8. కర్మచక్రం - వివిధ రకాల ఆయుధాలు కనబడటం త్రిశూలం, ఖడ్గం ,రామ బాణం, చక్రం ,బ్రహ్మదండం సందర్శనం

9. కాలచక్రం- ప్రేత ఆత్మ దర్శనాలు, త్రికాల జ్ఞానం

10. బ్రహ్మ చక్రం-దశ మహా విద్య దేవతల దర్శనం

11. సహస్రార చక్రం - కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం

12. హృదయ చక్రం- హనుమాన్/అనంత పద్మనాభుని దర్శనాలు, ఇష్టలింగం రావటం

13. బ్రహ్మరంధ్రము - కపాలం దర్శనాలు, త్రి గ్రంధులు - త్రిమూర్తులు దర్శనాలు

అలాగే మనము ఏఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి.

1. మూలాధార చక్రము - మనకు సంబంధం లేకుండా కామ విషయాలలో ఇరుక్కోవటం, శరీరం తేలికగా గాలిలో ఎగరడం

2. స్వాధిష్ఠాన చక్రము -వాంతులవడం, ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం, నీళ్ల విరోచనాలు అవ్వడం

3. మణిపూరక చక్రము - విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నొప్పి, అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4. అనాహత చక్రం - విపరీతమైన ధ్యానం చేయడం, జపాలు పూజలు చేయాలని అనిపించటం

5. విశుద్ధి చక్రము - చెవిలో సముద్ర హోరు,గాలి హోరు, నీటి సవ్వడి, నీటి అలల శబ్దాలు వినిపించడం, ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంఛలు కలగడం

6. ఆజ్ఞా చక్రము - కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం

7. గుణ చక్రం - పరోపకారార్ధం ఇదంశరీరం - ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించడం

8. కర్మచక్రం - ధర్మం పాటించాలి అని అనిపించటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం

9. కాలచక్రం- చావు మరణ, మృత్యు భయాలు భయపడటం, ప్రేతఆత్మ దర్శనాలు పొందుట

10. బ్రహ్మ చక్రం- వివిధ రకాల తత్వం, ఆత్మ, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపించడం భూమండలం వివిధ లోకాల దర్శనం

11. సహస్రార చక్రం - మలము నుండి కర్పూర వాసన, శరీరం నుండి సుగంధ పరిమళం వాసన

12. హృదయ చక్రం- ఏకైక ఇష్ట కోరిక ఏమిటో తెలియటం, ఏకైక కోరిక జిజ్ఞాస

13. బ్రహ్మరంధ్రము - మహా మృత్యు దర్శన జిజ్ఞాసలు కలగడం. త్రి గ్రంధులు - ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మ లోకాల దర్శనం.

సిద్దాంతపు

సిద్దాంతపు ఇంటి పేరు ఎలా ఏర్పడింది ? సిద్దాంతపు ఇంటిపేరు వైదిక బ్రాహ్మణులలో వందలాది సంవత్సరాలుగ ఉంది బహుశ బ్రాహ్మణ స్ర్తీ కి మాదిగ పురుషుడి...