Saturday, October 12, 2024
నలబై అయిదు దాటాకా మగవారి లైఫ్ లో సెక్స్ పట్ల ఉత్సాహం తగ్గడం, డబ్బుపట్ల ఆపేక్ష పెరగడం మనం గమనించవచ్చు..
ఆ ఇంకేం ఉందిలే.. యాబై వస్తున్నాయి..
పిల్లలు పెద్దోళ్ళయారు.. అనే ఆలోచనలతో ఉన్న కాస్త యవ్వనం ని చేజేతులా సంకనాకించుకోవడం మగాడి అలవాటు..
మగాడి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటాయి ఆడవారి ఆలోచనలు ఇక్కడ.
నలబై దాటాకా యుక్తవయసు కన్నా ఎక్కువగా స్పందించడం మొదలవుతుంది స్త్రీల శరీరం.. వత్తిడి మొత్తం యుక్తవయస్సు లోనే తట్టుకుని,
ఈ వయసుకు రాగానే రాఠుదేలిపోతుంది.
ఆటుపోట్లు తట్టుకునే దైర్యం మగాడికన్నా స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది.. నలబై దాటాక అది మరింత పరిణితి చెందుతుంది.
దానివలన తన మనసు ప్రశాంతంగా ఉంటుంది.. భావ వ్యక్తీకరణ చేయగల దైర్యం.. ఎదిరించగల సత్తా మొత్తం పుణికిపుచ్చుకుంటుంది.
(ఎపుడైనా గమనించండి ఇరవైలోపు ఆడపిల్లలు స్వేచ్చ కోసం పోరాడరు..
పెళ్ళయి , పిల్లలు పుట్టాక మాత్రమే స్త్రీ కి స్వేచ్చ అవసరం అవుతుంది.)
"పోయేటపుడు మూటలు మోసుకుపోము
ఎప్పుడూ డబ్బుపిచ్చి తప్ప ఓ సరసం సరదా ఉండదు తనకి"
అని కొందరంటే... " డబ్బు సంపాదించడం చేతకాదుగాని కోపమెక్కువ..
నువు సంపాదించి చస్తే నాకీఖర్మ ఎందుకు" అని కొందరు..
కనీసం నిద్రలొకూడ చేయి వేయడు ఈడేం మొగుడు"
అని ఒకామె అంటే...
" పడుకోగానే గురకపెట్టి నిద్రపోవడం,
లేచాక తినడం పనికి పోవడం తప్ప మరో మనిషినంటూ నేనున్నానని ఏనాడైనా గుర్తించావా " అని మరో వనిత నిలదీస్తుంది.
ఇలా రకరకాలుగా ఆలోచించడం స్త్రీ నైజం..
తన కోరిక తీరకపోతే కొట్టే స్త్రీలు ఉన్నారు...
తాము కష్టపడి భర్తను పోషించే మహిళలు ఉన్నారు..
ఆడది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం ఎవరివల్ల కాదు..
తన మూడ్ ని గుర్తిస్తూ తనకు అనుకూలంగా మారి, ఆడదాన్ని తనవైపు తిప్పుకునే మగవారు చాలా కొద్దిమంది ఉంటారు..
అలా స్త్రీ కి లొంగిన మగాడిని " వాడు వాడి పెళ్ళాం కాళ్ళకాడ కుక్క " అనే సాటి మహిళలు ఉన్నారు..
మగవాడి పొగరు తాత్కాలికం..
మగవాడు సగం అనుమానం తో నాశనం అవడమేకాక భార్యనూ నాశనం చేస్తాడు,
కుటుంబం నూ నాశనం చేసుకుంటాడు,
చివరికి ఎటూకాకుండా ఏకాకి అవుతాడు.
స్త్రీ అలా కాదు బాధ్యత స్వీకరిస్తుంది,
భర్త ను వంటరిని చేయడానికి ఓ పెద్ద ప్రణాళిక రూపొందించుకుని నెమ్మదిగా వాడిని అనాథ ను చేస్తుంది నచ్చకపోతే...
ఇంతకీ నేనేం రాసానో నాకు అర్థం కాలేదు
మీకేమైనా అర్థం అయితే చెప్పి తగలాడండి..
నేను పనికిపోవాలి మళ్ళీ....🙄🙄
సేకరణ
Sunday, September 29, 2024
మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం
మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి జీవిత కథలు పద్యంలో రాసిన వారిలో జాషువా అగ్రగణ్యుడు. ఆయన జీవిత కథకి, ‘పిరదౌసి’ కథకి ఎంతో సారూప్యం ఉన్నందువల్ల ‘పిరదౌసి’లో కూడా ఆయన జీవిత కథనాన్ని వినిపించాడు.
జాషువా కవి నీటి అలల్లో నుంచి,శృతిని వినిపించగల సంగీతజ్ఞుడు.ఆయన కవిత్వంలో సంగీతం వుంది. సంగీత సాహిత్య సమన్వయుడు ఆయన. ఆయన కవిత్వంలో ఉన్న సంగీతం కృత్రిమమైనది కాదు. ప్రకృతి లోంచి వస్తున్న ‘ఝుంకార ధ్వని’. అందుకే అడవిలో సింహ నాదం కొన్నిసార్లు వినిపిస్తుంది. పక్షుల గువ్వల మోతలు కొన్నిసార్లు వినిపిస్తాయి. సాలీడుల జీవన సౌందర్యాన్ని ఒకసారి చూపిస్తాయి. ఆయన ఏ చిత్రం గీసిన అది మన కళ్ల ముందు దృశ్యీకృతమవుతుంది. ఆయన రచనలు అన్నింటిలో కూడా ‘నా కథ’ చాలా గొప్ప కావ్యం. సత్యభాషణా చాతుర్యంతో దానిని రచిస్తాడు. ఆయనకి అసత్యం రాదు. జీవిత రహస్యాలను ఆయన ప్రకృతిలో మేళవించి చెప్పు చాతుర్యం కలవాడు. ‘జాషువా’ తన ఆత్మ కథను రాస్తూ ఇలా విశ్లేషిస్తాడు.
సాధారణంగా విఖ్యాత మహాపురుషులు స్వీయ చరిత్రలు వ్రాసుకొంటూ యుంటారు. అట్టివారి మనుగడలు సమగ్రంగా తెలిసి కోవలెనని ప్రజలుబలాటపడుతూ యుంటారు.అందుత్తమ గ్రంథాలకు సాహిత్య రంగంలో అర్హస్థానం కూడా యుంటుంది. ఆత్మకథాకర్తలు పెక్కురు ప్రాయికంగా వారి వార్ధక్యంలో కథారచనకు పూనుకోవడం అప్పటి వారి హోదాకు, పలుకుబడికి, పదవికి తగిన యుదాత్త ఘట్టాలే వ్రాసికొంటూ తమదొక విశిష్ట జన్మగా నిరూపించుకొంటూ, సత్యగోపనం చేస్తూ కథ సాగించడం పరిపాటి.అట్టి రచనలు పాఠక లోకాన్ని ఆకర్షించలేవు సరికదా కొంత అనుమానాలకు, హాస్యానికి గుణియై నిరుపయోగాలౌతాయి. మహాపురుషులు నిత్య జీవితంలో వారనుభవించిన కష్టసుఖాలు పొందిన గౌరవాగౌరవాలు, వయ:పరిపాకంలో నెదుర్కొన్న క్లిష్టసమస్యలు యథాతథంగా చిత్రించి, తాము నడచిన త్రోవ సర్వజన సులభమని వారార్జించిన కీర్తి ప్రతిష్ఠ అనన్య సాధ్యాలు గావని నిరూపిస్తూ ఒక ఆశాకిరాణాన్ని వెలిగిస్తూ యుంటారు.ప్రపంచ మహాపురుషుల జీవిత చరిత్రల్ను పరిశీలిస్తే ఈ సత్యం ఋజువౌతుంది. గాంధీ,నెహ్రూ, బోసు,టాగోరు ప్రభతుల ఆత్మకథ లీకోవలోవి. వారి బాల్య యౌవన కౌమార ఘట్టా లాదర్శాలవలె స్వచ్ఛమై ఆయా కాలాలలో వారి మూర్తులను కన్నుల గట్టుతూ హృదయంగమంగా యుంటయి. గౌరవ భంగ భయంతో వారు దాచుకొన్న స్వీయదోషా లందుండవు.స్వీయ చరిత్రలకీ లక్షణా లాయుర్ధాయాలు- అలంకారాలు.
అట్టి ప్రసిద్ధ పురుషుల జాబితాలో చేరవలెననే ఆశతో నేనీ గ్రంథ రచన చేయడం లేదు.
‘క్షుభిత మనశ్శాంతికి గత చరిత్ర ధ్యానంకన్న బ్రహ్మానందం లేద’న్న ఒకానొక ఆంగ్ల కవి వాక్రుచ్చినట్లు ఏకాంతంగా నేను నా జీవిత గ్రంథాన్ని మనస్సులో చదువు కొంటూ సింహావలోకనం చేసుకొంటూ మైమఱచిన నిశీథాల సంఖ్యాకాలు. దాదాపు నలుబదేండ్ల నా భాషా పరిశ్రమలో అనుభవమిది. ప్రసిద్ధాంధ్ర కవులు మ్రోయించిన కవితావీణెలు నా పసితనంలో నన్నాకర్షించినయి. ఊగించినయి, ఊరించినయి. నేనూ ఒక వీణెమ్రోయించాలి అనుకొన్నాను. ప్రయత్నం మీద నాకు లభించింది. వీణె కాదు.సితార,అది నా కవిత. దాన్ని మ్రోయిస్తున్నాను. వినిపించింది. ప్రజలకు కాని ప్రభువులకు కాదు. అట్లు నే సాగించిన కవితా ప్రవాసంలో కొన్ని తీగెలు తెగినయి. ముడులు పడ్డాయి,బెట్లు తప్పినయి, మూగవోయినయి. కాని నిరుత్సాహిని మట్టుకు కాలేదు. పైపెచ్చు పూర్ణోత్సాహ వంతుణ్ణయి మ్రోయిస్తూనే యున్నాను. లోకం నా వంక కోరగా వారగా చూచింది. అనాదరించింది. అసత్కరించింది. సత్కరించింది. దూరపర్చింది, చేరదీసింది.ఇతరేతర ఘర్షణోన్ముఖాలైన అభిరుచులు, ఆశయాలు, దృక్పథాలు అడుగడుగున వర్ణాభిమాన వర్గాభిమాన మతాభిమానాలతో స్వేచ్ఛావిహారం చేసే నేలలో అకలంక కళాకల్యాణులకు న్యాయం జరుగుతుందని ఆశించడం శశవిషాణ ప్రాయం, పర రాజ్యం పోయి,ప్రజా రాజ్యమై పాముకున్నది లేదు.కొందరికి ప్రజారాజ్యంగా కొందరికి మజా రాజ్యంగా కొందరికి క్షుధా రాజ్యంగా తయారై అష్టకష్టాల కాలవాలమైంది. విద్యాభివృద్ధి తప్ప విజ్ఞాన వృద్ధి శూన్యమై వింత ప్రకృతులతో విఱ్ఱవీగు తుంది. నిజాయితి నిండుకొన్నది.మూఢతా జలనిధి జడనిధియై స్తంభించి పోయింది. మేడలు పెరిగి మేధస్సు తరిగింది. ఫలశూన్యాలైన పైపై నవ్వులు, పల్కరింపులు, ప్రణామాలు సభ్యతా చిహ్నాలైనయి. వన ప్రతిష్ఠలు, శిథిల శిలాఖండ పునరుద్ధరణలు, ఉరుసులు, ఉత్సవాలు, దేశాభ్యుదయ సాధనాలై బక్కపేదల డొక్కల నూరించి కారిస్తూయున్నయి. పురోగమనం తిరోగమనమైంది. ఆంధ్రకవు లంత: పురాంగన కలరు.మాలలల్లి యలంకరణలు చేస్తూ పాతపుంతలో పల్లటీలు కొడుతూ పచార్లు సారిస్తూన్నారు. ఎవరికివారై యమునా తీరాన మున్ను కట్టుకొన్న గుడిసె లిప్పుడున్నత సౌధాలై కంచెలు వైచికొన్నయి. పూర్వమన్నాదమ్ములు,నేడు బ్రదర్లు, భాయీలు భాషలో మార్పు తప్ప ప్రకృతిలో మార్పు లేదు.
ఈ నవ్య యుగం చేసే విచిత్ర నగ నాట్య రభసచే నాలో రేగిన వృథా వాత్యకుక్కిరి బిక్కిరై ఒకానొక రాత్రి నాజీర్ణ జీవిత గ్రంథాన్ని సింహావలోకనం చేసికొన్నాను. జన్మస్థలాన్ని, జననీజనకుల్ని నాటి నేటి రాజకీయ సాంఘిక వ్యవస్థల్ని పరిశీలించి చూచుకొన్నాను. మనశ్శాంతికై కలము పట్టుకొన్నాను. అందలి ప్రథమ నిశ్వాసమే.
జీవిత చరిత్ర రాయడం చాలా కష్టం. అది సత్య నిష్టతో కూడుకున్నది. చాలామంది తన జీవిత చరిత్రను రాసి ప్రజలను మెప్పించ లేకపోయారు. కారణం వారు జీవితాన్ని అనుభవించలేకపోవడం. జీవితాన్ని అనుభవిస్తేగాని పవలరించ లేము. అందుకే ‘నా కథ’ జగత్ ప్రసిద్ధమైనది. ఆయన తన ఊరిని తల్లి అని సంబోధించాడు. ఊరిలో వున్న అన్ని దేవాలయాల గురించి ప్రస్తావించాడు. తల్లిదండ్రులకు నేను గారాల సుతుడను అని పేర్కొంటాడు.ఏనుగు మీద గండపెండెరంతో ఊరేగించారని ఆత్మగౌరవంతో చెప్పాడు. వినుకొండ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పాడు. టిప్పు సుల్తాన్ కట్టించిన మసీదు విశిష్టతను వివరించాడు. కనకదుర్గను పొగిడాడు. శివాలయాన్ని దర్శింపచేశాడు. చివరకు వినుకొండ ఊరును మనకు దృశ్యీకరింప చేశాడు.
కం. ననుగాంచి పెంచి నాలో
గొనబుం గవనమును, పాదుకొల్పిన తల్లీ!
నను మరచిన నిను మరవను
వినుకొండా! నీకు నా పవిత్ర ప్రణతుల్.
కం. వీరయకు లింగమాంబకు
గారాల సుతుండ కవిని గంధగజముపై
నూరేగి చరణమున పెం
డారంబు ధరించినాడ నలువురు మెచ్చన్.
ఆయన ఊరిని ఎంత ప్రేమించాడో దేశాన్ని అంత ప్రేమించాడు.ప్రపంచాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆయన తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టాడు. ఆయన కేవలం అక్షర విద్య వలన జ్ఞానం రాదు అన్నాడు. జ్ఞానం నిరంకారులకు,జీవన సత్యాలు తెలుసుకునేవారికి మానవతా స్ఫూర్తి కలిగిన వారికి, మాత్రమే వస్తుంది అన్నాడు. మొదటి నుంచి ఆయన మతోన్మాదాన్ని నిరసిస్తూ మతద్వేషాన్ని నిరసిస్తూ, మనవతా సౌజన్యాలు విరజిమ్ముతూ కవిత్వాన్ని నడిపించాడు. ఆయన జీవిత కథలోకి వెళ్దాం.
కం. గొరియల మేకల నెత్తుటి
ఝరముల నిర్దోషమునను జర్జరితంబై
కరిగినవి గిరులు శ్రుతగిరి
కరుగదనిన అపయశంబు గాదే మనకున్.
సీ. కృపలేని నీదు కొంచెపు దృష్టి బాధింప కన్నీరు చిందిన కవనపటిమ
దరిలేని నీ యనాదరణ మాటున మ్రగ్గి మంటి పాలైన సమత్వ సుఖము
ముక్కిపోయిన నీదు మూఢతా జడనిధి మునిగి యిప్పటికి కోల్కొనని చదువు
ఫలమింతలేని నీ భజన కూటములచే ఖర్చైన యౌవన కాల నియతి.
ఇకపోతే మహాకవి జాషువాకి నవయుగ చక్రవర్తి అనే బిరుదు రావడం గురించి కొండవీటి వేంకట కవి నాతో ఇలా చెప్పారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి కవిరాజు బిరుదునిచ్చారు.తుమ్మల సీతారామమూర్తి గారికి తెలుగు లెంక బిరుదునిచ్చారు. కొత్త సత్యన్నారాయణ చౌదరి గారికి మహాపండిత్ బిరుదునిచ్చారు. నాకు కూడా కవిరాజు బిరుదునిచ్చారు. అయితే మహాకవి గుర్రం జాషువా గారికి మాత్రం నవయుగ కవి చక్రవర్తి అని బిరుదునిచ్చారు. మేము శూద్ర కవులం. ఆయన పరిచయ కవి అయినా ఆయనకి నవయుగ చక్రవర్తి అనే బిరుదు వచ్చింది. ఆయనను ఏనుగు మీద ఊరేగించారు అని చెప్పారు. అప్పటి శూద్ర కవుల కంటే కూడా జాషువా గారికి గొప్ప కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఆయన కవిత్వంలో ‘ఊరు’, ‘వాగు’, ‘కొండలు’, ‘పక్షులు’, ‘జీవితం’, ‘దు:ఖం’, ‘నీతి’, ‘వ్యక్తిత్వం’ ఉంటాయి అని కొండవీటి వేంకట కవి చెప్పారు.
జాషువా కవిత్వంలో శిల్ప రహస్యాలున్నాయి. ముఖ్యంగా ఆయన తెలుగు నుడికారాన్ని పలుకుబడినీ, సామెతనీ, కవిత్వంలో మేళవించారు. ఆయన సామాన్యంగా పద్యాన్ని పూర్తి చేయడు. ఆయన పద్యం రాసే పద్ధతి గురించి ‘పిరదౌసి’ కావ్యంలో ఇలా చెప్పారు.
ఒక్కొక పద్దియంబునకు నొక్కొక నెత్తురుబొట్టు మేనిలో
దక్కువగా రచించి వృథాశ్రమ యయ్యె గులీనుడైన రా
జిక్కరణిన్ మృష ల్వలుకునే? కవితాఋణ మీయకుండునే
నిక్క మెఱుంగనైతి గజనీసులతాను మహమ్మదగ్రణీ.
నిజానికి ‘పిరదౌసి’ జీవితం గుఱ్ఱం జాషువా జీవితానికి దగ్గరగా వుంది. జాషువా జీవితం సుసంపన్నమైంది. కథనాత్మకమైంది.ఆదర్శ ప్రాయమైంది. అందులో దు:ఖం ఉంది. నైతికత ఉంది.పోరాటం ఉంది.ఆవేదన ఉంది. సందేశం ఉంది.అందుకే ఆయన జయంతి రోజున మనమందరం ఘన నివాళి అర్పిద్దాం.
వ్యాసకర్త : డా|| కత్తి పద్మారావు సెల్ : 9849741695
Tuesday, September 24, 2024
మనకు మార్కెట్‌లో అనేక రకాల ఆయిల్స్ లభిస్తున్నాయి. వాటిల్లో ఫెన్నెల్ ఆయిల్ కూడా ఒకటి. ఇది ఎసెన్షియల్ ఆయిల్‌లాగా మనకు లభిస్తుంది. దీన్ని వాడితే స్త్రీ, పురుషులు ఇరువురిలోనూ శృంగార కాంక్ష, సామర్థ్యం పెరుగుతాయి. దీంతో పడకగదిలో రెచ్చిపోతారు. అలాగే శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో జాస్మిల్ ఆయిల్ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. దంపతులు ఈ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది జననావయవాలకు రక్త సరఫరాను పెంచి శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది.
ఇక రోజ్ ఆయిల్, నెరోలి ఆయిల్, క్లారీ సేజ్ ఆయిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మనకు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటిని వాడినా కూడా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆ కార్యం పట్ల ఆసక్తి కలుగుతుంది. దీంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.
Monday, September 23, 2024
💐 *తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు* 💐
●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
●మహాప్రస్థానం - శ్రీశ్రీ
●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం
●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ
●చివరకు మిగిలేది - బుచ్చిబాబు
●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి
●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
●కళాపూర్ణోదయం - పింగళి సూరన
●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
●గబ్బిలం - గుఱ్ఱం జాషువా
●వసు చరిత్ర - భట్టుమూర్తి
●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
●చదువు - కొడవగంటి కుటుంబరావు
●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి
●వేమన పద్యాలు – వేమన
●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
●అల్పజీవి – రావిశాస్త్రి
●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
●ఆంధ్ర మహాభాగవతం – పోతన
●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
●మొల్ల రామాయణం – మొల్ల
●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
●మైదానం – చలం
●వైతాళికులు – ముద్దుకృష్ణ
●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి
●సౌందర నందము - పింగళి, కాటూరి
●విజయవిలాసం - చేమకూర వేంకటకవి
●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
●మ్యూజింగ్స్ – చలం
●మనుచరిత్ర- అల్లసాని పెద్దన
●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి
●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు
●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర
●దిగంబర కవిత - దిగంబర కవులు
●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ
●పానశాల - దువ్వూరి రామిరెడ్డి
●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు
●అంపశయ్య – నవీన్
●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య
●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
●జానకి విముక్తి – రంగనాయకమ్మ
●స్వీయ చరిత్ర – కందుకూరి
● మహోదయం - కెవి రమణారెడ్డి
●నారాయణరావు - అడవి బాపిరాజు
●విశ్వంభర – సినారె
●దాశరథి కవిత – దాశరథి
●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య
●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం
●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి
●పారిజాతాపహరణం - నంది తిమ్మన
●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు
●రాజశేఖర చరిత్ర – కందుకూరి
●రాధికా సాంత్వనము - ముద్దు పళని
● స్వప్న లిపి – అజంతా
●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి
●శృంగార నైషధం – శ్రీనాథుడు
●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
●అను క్షణికం - వడ్డెర చండీదాస్
●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ
●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి
●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్
●గద్దర్ పాటలు – గద్దర్
●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి
●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్
●కుమార సంభవం - నన్నే చోడుడు
●మైనా - శీలా వీర్రాజు
●మాభూమి - సుంకర, వాసిరెడ్డి
●మోహన వంశీ – లత
●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి
●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి
●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు
●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి
●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం
●స్వేచ్ఛ – ఓల్గా
●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి
●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
●తృణకంకణం – రాయప్రోలు
●హృదయనేత్రి - మాలతీ చందూర్
●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్
●నీతి చంద్రిక - చిన్నయ సూరి
●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు
●నీలిమేఘాలు – ఓల్గా
●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల
●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
●కొయ్య గుర్రం – నగ్నముని
●నగరంలో వాన – కుందుర్తి
●శివారెడ్డి కవిత – శివారెడ్డి
Sunday, September 22, 2024
మాదిగలు చర్మకారులు. జంబూద్వీప మూలవాసులు. దక్షిణాన హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ దాకా చర్మకార సమూహాలు అతి పెద్ద జనాభాగా విస్తరించి ఉన్నాయి.
మాదిగలు, చక్కిలియార్లు, మాద్గి, మాంగ్, మాతంగ, చమార్, జాతవ్, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మాదిగదాసు, ఆది జాంబవ, అరుంధతీయ, మోచి, సమగర - ఇలా అనేక పేర్లతో భారతదేశంలో చర్మకార కులాల వారు పిలవబడుతున్నారు.
చర్మకార మాదిగ సమూహాలు ప్రకృతి జీవులు. ప్రకృతి ఆరాధకులు. అమ్మ తల్లిని పూజించే మాతృస్వామ్యాన్ని అనుసరించేవారు. ఎల్లమ్మ, మాతంగి, మాతమ్మ, జోగులాంబ, బసవమ్మ వీరి దేవతలు. మాతృస్వామిక సంస్కృతికి ప్రతీకగా మాతంగి దేవత జనించింది. పునరుత్పత్తి సహజావసరంగా, సగౌరవంగా యోని ఆరాధన జరుగుతున్నది. ఆహార సేకరణ, వేట సమాజాలకు మహిళలు నాయకత్వం వహించారు. విపత్తులను ఎదుర్కోవడంలో, కుటుంబంలో, గుంపు జీవితంలో మహిళలు వీరోచితమైన, ప్రేమైక పాత్ర నిర్వహించి, నాటి మాతృస్వామ్య సమాజాల్లో ఆదర్శనీయులు, పూజనీయులు అయినారు.
వివిధ పురాణాల, మతాల, చరిత్ర, సంస్కృతులను పరిశీలిస్తే, మహారాష్ట్ర, గుజరాత్ లలో మాతంగ కులం ఉన్నది. మాతంగ మహర్షి ఉన్నాడు. మాతంగ కన్యా మనసా స్మరామి అని మహాకవి కాళిదాసు కాళీమాతను పూజించాడు. మాతంగి పర్యాయ పదాలుగా ఆదిశక్తి, అఖిల జనని, మహా విద్యాధరి, ఎల్లమ్మ, సుందత్తి ఎల్లమ్మ, ఏకవీర, లజ్జగౌరి, సవరేశ్వరీదేవి, దుర్గ, కాళి, కాళీమాత, పార్వతి, మాతంగిదేవి, చాముండి, చండాలిక, ఉచ్చిష్ట చండాలిని, రాజమాతంగి, సుముఖ మాతంగి మొదలగు అనేక పేర్లతో భరత ఖండంలో పూజలందు కొంటున్నది. దీనిని బట్టి మన సమాజంలో మాతృస్వామ్య సమాజం జాడలు ఎంతగా విస్తరించి, వ్యాపించి ఉన్నాయో విశదమౌతున్నది. బిడ్డలను, సమూహాలను, సమాజాన్ని ధీరోదాత్తంగా కాపాడి, బతికించే మానవోన్నత మాతృస్వామిక ధర్మమే మాతంగిది అని తెలుస్తున్నది.
పోశమ్మ, మైసమ్మ, మాంకాళమ్మ, ఏకవీర, కాకతమ్మ, సమ్మక్క, సారలమ్మ మొదలగు దేవతలను పరిశీలించినా, బోనాల పండుగ సందర్భంలో ఇప్పటికీ భవిష్యవాణి వినిపిస్తున్న మహిళా సాంప్రదాయాన్ని గమనించినా - మానవ విపత్తులు, అంతకు మించిన ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే వేట, వ్యవసాయ, విద్య, వైద్య, వైజ్ఞానిక యుద్దరంగం మొదలగు రంగాల మేటి మహిళలు పూజనీయరాళ్ళు అయ్యారని, వారి వాణి సమాజ హితమైనదని మనకు అర్థమవుతుంది. మరి ఇంత గొప్ప మాతస్వామ్య వ్యవస్థ ఎప్పుడు ప్రమాదంలో పడింది?
ప్రాచీన భారత ఉపఖండంలో భిన్న మానవ సమూహాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, మాతృస్వామిక సంస్కృతీ సమాజాలే మనుగడ సాగించాయి అనేదానికి ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి. గుణగణాల ఆధారంగా మనుషులను ప్లేటో వర్గీకరించిన విధానానికి, ఆర్యులు ప్రవేశ పెట్టిన వ్యవస్థీకృత వర్ణ వ్యవస్థకు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఆర్యుల దండయాత్రలు, వలసలతో భారతఖండంలో వర్ణ వ్యవస్థ, నిర్బంధ వృత్తి బానిస వ్యవస్థలూ మొదలయ్యాయి. పితృస్వామ్యం, అంచెల వారీ ఆధిపత్య కుల వ్యవస్థ ఏర్పడింది. దీంతో మాతృస్వామ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడింది. దీనితో ప్రాచీన మాతృ పాలనా సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన మాతంగి వ్యవస్థ ఇప్పటి ఆర్య పితృస్వామ్యం కారణంగా తన దైవిక ప్రాభవం ఒకవైపు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు బ్రష్టత్వానికి, దోపిడికీ గురవుతున్నది నేడు.
ఆది జాంబవంతుని నివాస, నియంత్రణా ప్రాంతమే జంబూద్వీపం. ఆది జాంబవంతుని వారసులే చర్మకార సమూహాల వారు. నేడు పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం, అత్యాచారాలు, కులహింసలు, వెట్టి చాకిరి, బాలకార్మిక వ్యవస్థ, పారిశుద్ధ్య వృత్తి వ్యవస్థ, భూమి లేకపోవడం, ఇళ్ళు లేకపోవడం, కనీస వేతనాలు పొందలేకపోవడం, క్వాలిటీ చదువులు లేకపోవడం, నిరుద్యోగం, మార్జినలైజేషన్, మూఢనమ్మకాలు మొదలగు అనేక రూపాల్లో మాదిగలు దోపిడీ, పీడనలకు గురవుతూనే ఉన్నారు.
మాదిగ బాలికలను ఈ దేవతలకు అంకితమిచ్చి, పెళ్లిళ్లు చేసి, వారిని విద్యా వికాసాలకు, కుటుంబ జీవనానికి దూరం చేసి, అణిచివేతలు కొనసాగించే దురాచారాలు గ్రామ సమాజంలో ఇప్పటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి.
మాదిగ ఆడపిల్లలను మాతంగి, మాతమ్మ, జోగిని, బసివిని, దేవదాసీలుగా అంకితం ఇచ్చినా, ప్రోత్సహించినా, వినోదించిన, ఇలాంటి వారికి మూడేళ్లు జైలు శిక్ష, ఐదువేల రూపాయలు జరిమానా అని 1988లో వచ్చిన, ఏపీ దేవదాసి వ్యవస్థ రద్దు చట్టం చెబుతున్నది. కానీ, ఇంతవరకు ఈ చట్టం అమలుకు ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ఇంకా అమలు కానేలేదు. ఇదొక చారిత్రక వ్యవస్థీకృత విషాదం.
ఏ సమాజంలోనైనా స్త్రీల విద్య, అభివృద్ధిల స్థాయిలను ఆ సమాజం సామాజిక అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటారు. అణగారిన సమూహాల మహిళల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సాంస్కృతిక, నాయకత్వ పరిస్థితులను పెంపొందించు కోవలసిన అవసరం మరింత ఏర్పడింది. వివక్షలకు తావు లేని, సాధికారాన్ని, మెరుగైన జీవనాన్ని అణగారిన మహిళల హక్కుగా దాఖలు చెయ్యాల్సిన అవసరం, బాధ్యత, సమాజం పై, ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్నది.
ఈ నేపథ్యంలో బాధిత సమాజం నుంచి వచ్చి, కాకతీయ విశ్వ విద్యాలయంలో, చరిత్ర విభాగంలో విశేష పరిశోధన చేసిన విద్యార్థిని డాక్టర్ ఇ.వసంత 'తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మాతంగి సాంప్రదాయం ఒక పరిశీలన' అను అంశంపై పిహెచ్ డి కోసం పరిశోధన చేశారు. ఈ పరిశోధన కోసం ఆమె మారుమూల గ్రామాల్లో ఉన్న మాతంగి క్షేత్రాలను, చారిత్రక కట్టడాలను, మాజీ మాతంగి మహిళలను, మాతంగి పురా గాథలను గురించి వివరించే బైండ్ల కళాకారులను, సంబంధిత కమ్యూనిటీ ప్రజలను కలిసి ఎన్నో ఆధారాలను, విశేష అంశాలను సేకరించారు. పుస్తక భాండాగారాలను దర్శించి, ఎన్నో విలువైన చరిత్ర గ్రంథాలను, పరిశోధనా గ్రంథాలను పరిశీలించారు. యీ గ్రంథంలో దక్షిణ భారతదేశ మాదిగల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో వున్న చర్మకార సమూహాల్లో మాతంగి వ్యవస్థ ఎంత ప్రాచీన కాలం నుంచి, ఎలా వేళ్ళూనుకొని ఉన్నదో విస్తృతమైన, లోతైన అధ్యయనం, ఆంతరిక విశ్లేషణతో తన పరిశోధనా గ్రంథంలో వెల్లడించారు. మాతంగి ఒకనాటి మాతృస్వామిక వ్యవస్థ సంస్కృతికి ఎలా ప్రతీకగా నిలిచిందో యీ పరిశోధకురాలు చక్కగా విశ్లేషించారు. అలాగే ప్రస్తుత పితృస్వామిక వ్యవస్థ ఒకప్పటి ఉన్నత, సదాచారమైన మాతంగి వ్యవస్థను వ్యవస్థీకృత దురాచారంగా ఎలా మార్చివేసిందో విశ్లేషించారు. చారిత్రక ఆచారాల్లో మహిళల నిమ్నోన్నతాలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పరిశోధక గ్రంథాన్ని తప్పక చదివి తీరాలి. తాను చేసిన కృషికి డాక్టర్ వసంత చాలా అభినందనీయురాలు.
కృపాకర్ మాదిగ
Thursday, September 19, 2024
అదెలాగో పరిశీలిద్దాం! క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో ఇరాన్లో 'హఖీమని' వంశం ఒకటి ఉండేది. ఆ వంశంలో ప్రసిద్ధుడు మొదటి డేరియాస్.ఆయన సెప్టెంబర్ 550-అక్టోబర్ 436 BCE సాధారణ శకానికి ముందు కాలంలో సుమారు 64 ఏండ్లపాటు జీవించాడు. ఈ హఖీమని వంశాన్ని అఖియమినిడ్ వంశం అని కూడా అంటారు. ఆ పదాన్ని అనుసరించుకుంటే- 'స్నేహితుని హృదయంలో ఉండేవారు' అని చెప్పుకోవచ్చు. డేరియస్ ద గ్రేట్గా చరిత్రలో నమోదయిన ఈ చక్రవర్తి (Emperor) అతి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యం ఇరాన్ నుండి మన సింధూ ప్రాంతం వరకు విస్తరించింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమంటే ఈ ఇరాన్ వంశం వారే తాము 'ఆర్యపుత్రుల'మని గర్వంగా చెప్పుకునేవారు. ఈ విషయం వారి శిలాశాసనాల ద్వారా తెలిసింది. వీరే భారతదేశంలోకి ప్రవేశించారన డానికి చారిత్రక ఆధారాలు దొరికాయి. ఈ హఖీమని వంశం వారు మన భారతదేశంలోకి వచ్చినపుడు కొన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ భారతదేశంలో బావులున్నాయి. అక్కడ వారి అరబ్ ప్రాంతంలో లేవు. ఇక్కడ ఏనుగులున్నాయి. వారి ప్రాంతంలో లేవు. ఇక్కడ మనదేశంలో పెద్దపెద్ద చింతచెట్లున్నాయి. వారి ప్రాంతంలోలేవు. ఇవన్నీ వారికి సంభ్రమాశ్చర్యాలు కలిగించే విషయాలయ్యాయి.
అరబ్ దేశాల వారు నీటికొరకు వర్షాల మీద ఆధారపడతారు. వర్షాలు పడ్డప్పుడు పర్వతాల నుండి ప్రవా హంగా వచ్చే నీటిని నిలువ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటారు. మనకు ఇక్కడ సింధూ నాగరికత నాటినుండే బావులున్నాయి. అందువల్ల ఇక్కడి వారికి అవి కొత్తకాదు. ఇరాన్ వారికి కొత్త వర్షం కురిపించే దేవుడు ఇంద్రుడు అనే భావన ఉందికదా? అది వారి పుగార్ కొయి శిలాశాసనాలలో ఉంది. అయితే వారు ఇంద్రుణ్ణి 'ఇందర్' అన్నారు. ఇందర్ అన్నా నీరే, సముందర్ (సముద్రం) అన్నా నీరే. బందర్ గాహ్ అంటే సముద్రపు ఒడ్డు. అంటే బందర్ కూడా నీటికి సంబంధించిన మాటే, ఇక్కడ బందర్ అంటే కోతి కాదు. (బహుశా, మన తెలుగు రాష్ట్రంలో ఉన్న బందరుకు కూడా పేరు ఆ విధంగానే వచ్చి ఉంటుంది) అందువల్ల ఇక్కడ భారతదేశంలో బావుల్ని చూసి వారు, వాటిని ఇంద్రాగార్ (ఇంద్ర-ఆగార్) అని అన్నారు. ఆగార్ అంటే ఖజానా. బావులంటే నీటి ఖజానాలని వారు భావించారు. ఇంద్రాగార్ అపభ్రంశమై అనేక రకాలుగా మార్పులు చెందింది.ఉత్తర భారతదేశంలో చాలాచోట్ల బావులను బోజ్పురి ఇంకా ఇతర ప్రాంతీయ మాండలికాల్లో ఇనారా/ఇనార్/ఇందారా అని అంటున్నారు.ఇవన్నీ ఇంద్రాగార్కు మారు రూపాలే (వికృతి)
తొలిసారి హఖీమని వంశం వారు భారతదేశంలో ఏనుగులను చూసి 'హస్తీమృగ' అన్నారు. హస్తం ఉన్న జంతువు అని అర్థం.తొండాన్ని వారు చేయిగా భావించారు. అలాంటి అవయవం మరే జంతువుకు లేదు.ఇరాక్, ఇరాన్ ప్రాంతాలలో ఏనుగులు ఉండవు గనక అది వారికి ఒక చిత్రమైన ప్రాణి (మృగహస్తీన్) మృగ అని ఎందుకు అన్నారంటే- మృ అంటే మట్టి గ అంటే గమనం. మట్టి మీద తిరిగేవి. మనిషితో పాటు భూమి మీద సంచరించేవన్నీ మృగాలే. చెట్లమీద తిరిగే కోతులను శాఖామృగ అని అన్నారు. అలాగే ఖగ-ఖ అంటే ఆకాశం. గ అంటే గమనం. ఆకాశంలో విహరించేవి. పక్షులు అలాగే చూడండి.భూగోళానికి ఎదురుగా ఉన్నది. ఖగోళం అని అంటు న్నాం కదా? ఇది మట్టి గోళమయితే, అది ఆకాశగోళమని అర్థం. వాడుకలో ఏనుగు 'హాథీ (చేయగలది) అయిపోయింది.
ఇరాన్ ప్రాంతంలో ఖర్జూర (తమరే) చెట్టు తప్ప, చింతచెట్లు ఉండవు. ఆర్యులు మొదటిసారి ఇంత పెద్ద చెట్టు చూసి విన్మయ చకితులయ్యారు. దాని పండు రుచిచూస్తే తియ్యగా, పుల్లపుల్లగా ఉంది. అది వారికి ఖర్జూరం లాగా అనిపించింది. అందుకే 'తమరే ఐ హింద్' (ఇండియా ఖర్జూరం) అని పేరు పెట్టారు. ఖర్జూర ఫలాలను వారు తమరే అని పిలుస్తారు కాబట్టి. తమరే ఐ హింద్ అన్నారు. ఇరాన్ ప్రాంతం నుండి ఇంగ్లీషు వారు ఆ పదాన్ని తీసుకుని 'టామర్-ఇండ్' (ఇండియా ఖర్జూరం) అని అన్నారు. ఆ పదమే వాడుకలో టామరిండ్' (TAMAR- IND) అయ్యింది.
దేశంలోకి ఆర్యులు చొరబడ్డాక, వారు చేస్తూ వచ్చిన అరాచకాలకు లెక్కలేదు. అయితే కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుకుందాం! చాలామంది ఇంటి ముఖద్వారానికి గుమ్మడికాయ కట్టుకుంటారు. ఎందుకూ? దిష్టి తగల కుండా అని చెపుతారు. దిష్టి అనేది నమ్మకం మాత్రమే. అది నిరూపణ కాలేదు. అది ఒక మూఢనమ్మకంగా కొనసాగుతోంది. అసలు ఆచారం ఎలా మొదలైంది? అని గతంలోకి వెళ్లి చూస్తే వళ్లు గగుర్పొడిచే నిజం బయట పడుతుంది. శృంగ వంశం వారు (185-72 BCE ) బౌద్ధాన్ని నాశనం చేయడం ప్రారంభించారని మనకు తెలుసు. బౌద్ద భిక్షుల తలలు నరికి తెచ్చిన వారికి పుష్యమిత్ర శృంగుడు (185-149 BCE) బహుమానాలు అందించే వాడని కూడా మనకు తెలుసు. ఆ సాంప్రదాయాన్నే ఆ తర్వాత వచ్చిన వైదిక మతాభిమానులైన రాజులు కొన సాగించారు. వీరి ఆగడాలు తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడానికి బౌద్ధులు చుట్టుపక్కల దేశాలకు పారి పోయారు. అదంతా మళ్లీ వేరే విషయం. ఆ సమయం నుండే తాము ఒక బౌద్ధ భిక్షువు తల నరికామని గర్వంగా ప్రకటించుకోవడానికి కొందరు తమ ఇండ్ల ముఖద్వారాలకు తల ఆకారంలో ఉండే గుమ్మడికాయను కట్టుకునేవారు. తాము తమ పాలకుల దృష్టిలో పడాలనీ, వారి గుర్తింపు పొందాలనీ తాపత్రయపడేవారన్నమాట! ఆ విధంగా అది ఒక ఆనవాయితీ అయ్యింది. తలలు నరకడమనే హింసాత్మకమైన కారణాన్ని కప్పిపుచ్చడానికి ఆర్య బ్రాహ్మణులు దిష్టిని ప్రవేశపెట్టారు. ఇతరుల దిష్టి తగలకుండా తమ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవాలన్న ఒక ముఢాచారాన్ని వారు ప్రచారం చేశారు. అదే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఈ కాలానికి అవసరం లేనివి పాటించడం అవసరమా? అన్నది సమకాలీనంలో మనం ఆలోచించుకోవాలి కదా?
గతంలో కొన్ని వందల యేండ్ల క్రితం రాజులు, జమిందారులు, దేశ్ముఖులు, సమాజంలోని ప్రముఖులు వేటకు వెళ్లేవారు. వారు వేటలో చంపిన జంతువుల గుర్తులు అంటే జింక చర్మాలు, దుప్పికొమ్ములు వగైరా తెచ్చి దివాన్ ఖానాలోనో, ముందు హాల్లోనో డాబుగా ప్రదర్శించుకునేవారు. పులిగోరు లభిస్తే దాన్ని బంగారు గొలుసుకు అమర్చి, ఒక మెడల్లా మెడలో ధరించేవారు. ఇంటికొచ్చిన అతిధులు తమ ఘనతను గుర్తించాలని అలా చేసేవారు. అదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కదా? ఎవరైనా, ఏదో ఒక విషయంలో విజయం సాధిస్తే, దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేదా ఫొటో, డ్రాయింగ్ రూంలో పెట్టుకుంటున్నాం కదా?అలాగేనన్నమాట! ఒకా నొకప్పుడు బౌద్ధ భిక్షు తలనరికామని గర్వంగా చెప్పుకోవడానికి సంకేతంగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టు కునేవారు. లక్షలాది బౌద్ధ సన్యాసుల రక్తంతో ఈనేల ఇంకిపోయిందని గుర్తుచేస్తున్నట్టుగా ఉంది- ఇంటి ముఖ ద్వారానికి వేలాడుతున్న గుమ్మడికాయ!
బౌద్ధుల కాలంలో సిద్ధార్థుడి తల్లి మహామాయ శిల్పాల్ని ఆనాటి శిల్పులు చెక్కుకున్నారు. ఆ మహా మాయ శిల్పంలో ఆమె పద్మాసనంపై కూర్చుని ఉంటుంది. రెండు వైపుల నుండి రెండు ఏనుగులు తొండాలు ఆర్చ్లాగా ఎత్తి ఆమె మీద నీళ్లు పోస్తుం టాయి. అంటే అభిషేకమన్నమాట! మహా మాయ కాళ్ల దగ్గర పెద్ద కాడలున్న పువ్వులు చెక్కి ఉంటాయి. పూర్తిగా ఆ శిల్పాన్ని కాపీకొట్టి, వైదిక మతస్థులు శ్రీలక్ష్మి చిత్రపటానికి రూపకల్పన చేసుకున్నారు. లక్ష్మీదేవి చిత్రపటాలు కానీ, పెయింటింగ్స్ కానీ 120 ఏండ్లకు ముందు లేవు. అంతకు ముందు లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు-మహామాయ శిల్పంలోలాగే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని ఉంటుంది. దూరం నుండి రెండు ఏనుగులు చెంబులతో లక్ష్మీదేవి మీద నీళ్లుపోస్తుంటాయి. ఆ విధంగా విదేశీ ఆర్య బ్రాహ్మ ణులు ఒక పెద్ద కుంభకోణం చేసి మొత్తం భారతదేశాన్ని మోసం చేశారు. మీరు ఎప్పుడైనా హిందూ దేవీ దేవతల ఆలయాలకు వెళ్లినపుడు ముఖద్వారానికి పైన మహామాయ శిల్పం కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించండి, తెలుస్తుంది. ఎందుకంటే తొలి శిల్పులు బౌద్ధులు, మొదట కట్టబడ్డవి బౌద్ధరామాలు. వాటిని శివాలయాలు, విష్ణు ఆల యాలుగా మార్చుకున్నారనడానికి నూటికి నూరుశాతం ఆధారాలు కనిపిస్తున్నాయి. 120 ఏండ్లకు ముందు లక్ష్మీదేవి శిల్పాలు, పెయింటింగ్స్, చిత్రపటాలు ఏవైనా ఉన్నాయని వైజ్ఞానిక పద్ధతుల ద్వారా నిరూపిస్తే, తప్పదు మనం ఒప్పుకోవాల్సిందే- కానీ, వాళ్లు ఆ పని చేయలేరు. కారణం అవి లేనేలేవు గనక!
బుద్ధుని తల్లి మహామాయ కోసం కట్టుకున్న పద్దెనిమిది మందిరాలను 'అష్టాదశ శక్తి పీఠాలు'గా మార్చు కున్నారు. అలాగే బుద్ధుడి పన్నెండు మందిరాలను 'జ్యోతిర్లింగాలు'గా మార్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చిట్టా చాలా పెద్దదే అవుతుంది. శ్రీలంకలోని మహామాయను కూడా హిందూ దేవతగా మార్చుకుని 'శక్తిమాత మట్టెలుండే చోటు' అని ప్రచారం చేసుకుంటున్నారు.
ఇలాంటిదే మరో విషయం ఉంది. ఆలయ నిర్మాణ వైశిష్ట్యం గూర్చి గొప్పగా చెపుతారు. పూజారులు ఉచ్ఛరించే వేద మంత్రాలు గాలీ, వెలుతురూ చొరబడని గర్భగుడిలోని నాలుగు గోడల్ని తాకి-మధ్యలో ఉన్న దేవతా విగ్రహాన్ని లేదా శివలింగాన్ని తాకి, ఒక శక్తి ఉత్పన్నమౌతుందనీ, అది బయటికి వచ్చి భక్తుల మీద ప్రస రించి పాజిటివ్ ఎనర్జీ అందిస్తుందనీ-సూడోసైన్స్ ప్రచారం చేస్తున్నారు. ఇలా మాటలు చెప్పేవారు ఉట్టి మాటలు కట్టి పెట్టి-వైజ్ఞానిక పరికరాలు ఉపయోగించి నిరూపించాల్సి ఉంటుంది. దాంతో వారు మూర్ఖులు కారు. వైజ్ఞానిక ఆవగాహన ఉన్నవారేనని మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది.
బ్రాహ్మణార్యులు ప్రతి విషయంలో మోసం చేస్తూనే వచ్చారు. బుద్ధుడి జన్మస్థలమైన లుంబినిని అశోకుడు దర్శించాడనీ, అక్కడ ఒక స్థూనం నిర్మించాడని చరిత్ర చెపుతోంది. ఇప్పటికీ ఆ స్థూపం అక్కడ ఉంది. స్థూపం దగ్గర ఉన్న ఫలకం మీద 'దేవానాం పియ పియ దస్సి' అని రాసి ఉంది. 'పియదస్సి' అంటే అశోకుడు. దేవతలకు ప్రియమైన రాజు. ఆశోకుడు King Piyadassi The belved of Gods అని. అర్థం మార్చి ప్రచారం చేశారు! అసలైతే, ఆఫ్ఘనిస్తాన్ నంచి ఇక్కడ దక్షిణ భారతదేశం దాకా ఉన్న లక్షలాది అశోక స్థంబాల మీదగానీ, అశోకుని శిలా శాసనాలలో గానీ, చారిత్రక గ్రంథాలలో గాని ఎక్కడా ఇతర దేవీ దేవతల పేర్లు కనబడవు. ఇక్కడ దేవా అంటే బుద్ధ దేవుడనే అర్థం. పాలిభాషలో వాళ్లు దేవ- అని రాసుకున్నారంటే, ఆది బుద్ధ దేవుడిని ఉద్ధేశించి రాసుకున్నదే! అందువల్ల 'దేవానం పియ పియదస్సి' అంటే బుద్ధ దేవుడికి ప్రియమైన రాజు ఆశోకుడుగా మనం అర్థం చేసుకోవాలే తప్ప - అక్కడ ఇతర దేవీదేవతల ప్రసక్తి ఉన్నట్టు కాదు. ఇతర దేవతలకు ప్రియమైన రాజు అని వైదిక మతస్థులు చెసింది కేవలం దుష్ప్రచారమే!
- సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్ నుంచి)
- డాక్టర్ దేవరాజు మహారాజు
సిద్దాంతపు
సిద్దాంతపు ఇంటి పేరు ఎలా ఏర్పడింది ? సిద్దాంతపు ఇంటిపేరు వైదిక బ్రాహ్మణులలో వందలాది సంవత్సరాలుగ ఉంది బహుశ బ్రాహ్మణ స్ర్తీ కి మాదిగ పురుషుడి...
-
సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర) రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్ స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం...
-
పండరీ భజన మన ఆంధ్రదేశంలో ఆ మూభాగం చుట్టివచ్చినవి, అందరినీ కదిలించినవీ భజన దళాలే అంటారు. ఇవి జానపద కళారూపాలకు చెందుతాయి. అందులో పండరీభజనకు ప...
-
దొమ్మరాట గ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ఈల వేస్తూ హౌరియా, హౌరియా అంటూ వేగంగా మొగ్గలు వేస్తూ వినోదాన్ని వంచే వారు పలురకాలుగా చేసే ...

