Sunday, September 29, 2024

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం


మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి జీవిత కథలు పద్యంలో రాసిన వారిలో జాషువా అగ్రగణ్యుడు. ఆయన జీవిత కథకి, ‘పిరదౌసి’ కథకి ఎంతో సారూప్యం ఉన్నందువల్ల ‘పిరదౌసి’లో కూడా ఆయన జీవిత కథనాన్ని వినిపించాడు.


జాషువా కవి నీటి అలల్లో నుంచి,శృతిని వినిపించగల సంగీతజ్ఞుడు.ఆయన కవిత్వంలో సంగీతం వుంది. సంగీత సాహిత్య సమన్వయుడు ఆయన. ఆయన కవిత్వంలో ఉన్న సంగీతం కృత్రిమమైనది కాదు. ప్రకృతి లోంచి వస్తున్న ‘ఝుంకార ధ్వని’. అందుకే అడవిలో సింహ నాదం కొన్నిసార్లు వినిపిస్తుంది. పక్షుల గువ్వల మోతలు కొన్నిసార్లు వినిపిస్తాయి. సాలీడుల జీవన సౌందర్యాన్ని ఒకసారి చూపిస్తాయి. ఆయన ఏ చిత్రం గీసిన అది మన కళ్ల ముందు దృశ్యీకృతమవుతుంది. ఆయన రచనలు అన్నింటిలో కూడా ‘నా కథ’ చాలా గొప్ప కావ్యం. సత్యభాషణా చాతుర్యంతో దానిని రచిస్తాడు. ఆయనకి అసత్యం రాదు. జీవిత రహస్యాలను ఆయన ప్రకృతిలో మేళవించి చెప్పు చాతుర్యం కలవాడు. ‘జాషువా’ తన ఆత్మ కథను రాస్తూ ఇలా విశ్లేషిస్తాడు.


సాధారణంగా విఖ్యాత మహాపురుషులు స్వీయ చరిత్రలు వ్రాసుకొంటూ యుంటారు. అట్టివారి మనుగడలు సమగ్రంగా తెలిసి కోవలెనని ప్రజలుబలాటపడుతూ యుంటారు.అందుత్తమ గ్రంథాలకు సాహిత్య రంగంలో అర్హస్థానం కూడా యుంటుంది. ఆత్మకథాకర్తలు పెక్కురు ప్రాయికంగా వారి వార్ధక్యంలో కథారచనకు పూనుకోవడం అప్పటి వారి హోదాకు, పలుకుబడికి, పదవికి తగిన యుదాత్త ఘట్టాలే వ్రాసికొంటూ తమదొక విశిష్ట జన్మగా నిరూపించుకొంటూ, సత్యగోపనం చేస్తూ కథ సాగించడం పరిపాటి.అట్టి రచనలు పాఠక లోకాన్ని ఆకర్షించలేవు సరికదా కొంత అనుమానాలకు, హాస్యానికి గుణియై నిరుపయోగాలౌతాయి. మహాపురుషులు నిత్య జీవితంలో వారనుభవించిన కష్టసుఖాలు పొందిన గౌరవాగౌరవాలు, వయ:పరిపాకంలో నెదుర్కొన్న క్లిష్టసమస్యలు యథాతథంగా చిత్రించి, తాము నడచిన త్రోవ సర్వజన సులభమని వారార్జించిన కీర్తి ప్రతిష్ఠ అనన్య సాధ్యాలు గావని నిరూపిస్తూ ఒక ఆశాకిరాణాన్ని వెలిగిస్తూ యుంటారు.ప్రపంచ మహాపురుషుల జీవిత చరిత్రల్ను పరిశీలిస్తే ఈ సత్యం ఋజువౌతుంది. గాంధీ,నెహ్రూ, బోసు,టాగోరు ప్రభతుల ఆత్మకథ లీకోవలోవి. వారి బాల్య యౌవన కౌమార ఘట్టా లాదర్శాలవలె స్వచ్ఛమై ఆయా కాలాలలో వారి మూర్తులను కన్నుల గట్టుతూ హృదయంగమంగా యుంటయి. గౌరవ భంగ భయంతో వారు దాచుకొన్న స్వీయదోషా లందుండవు.స్వీయ చరిత్రలకీ లక్షణా లాయుర్ధాయాలు- అలంకారాలు.

అట్టి ప్రసిద్ధ పురుషుల జాబితాలో చేరవలెననే ఆశతో నేనీ గ్రంథ రచన చేయడం లేదు. 


‘క్షుభిత మనశ్శాంతికి గత చరిత్ర ధ్యానంకన్న బ్రహ్మానందం లేద’న్న ఒకానొక ఆంగ్ల కవి వాక్రుచ్చినట్లు ఏకాంతంగా నేను నా జీవిత గ్రంథాన్ని మనస్సులో చదువు కొంటూ సింహావలోకనం చేసుకొంటూ మైమఱచిన నిశీథాల సంఖ్యాకాలు. దాదాపు నలుబదేండ్ల నా భాషా పరిశ్రమలో అనుభవమిది. ప్రసిద్ధాంధ్ర కవులు మ్రోయించిన కవితావీణెలు నా పసితనంలో నన్నాకర్షించినయి. ఊగించినయి, ఊరించినయి. నేనూ ఒక వీణెమ్రోయించాలి అనుకొన్నాను. ప్రయత్నం మీద నాకు లభించింది. వీణె కాదు.సితార,అది నా కవిత. దాన్ని మ్రోయిస్తున్నాను. వినిపించింది. ప్రజలకు కాని ప్రభువులకు కాదు. అట్లు నే సాగించిన కవితా ప్రవాసంలో కొన్ని తీగెలు తెగినయి. ముడులు పడ్డాయి,బెట్లు తప్పినయి, మూగవోయినయి. కాని నిరుత్సాహిని మట్టుకు కాలేదు. పైపెచ్చు పూర్ణోత్సాహ వంతుణ్ణయి మ్రోయిస్తూనే యున్నాను. లోకం నా వంక కోరగా వారగా చూచింది. అనాదరించింది. అసత్కరించింది. సత్కరించింది. దూరపర్చింది, చేరదీసింది.ఇతరేతర ఘర్షణోన్ముఖాలైన అభిరుచులు, ఆశయాలు, దృక్పథాలు అడుగడుగున వర్ణాభిమాన వర్గాభిమాన మతాభిమానాలతో స్వేచ్ఛావిహారం చేసే నేలలో అకలంక కళాకల్యాణులకు న్యాయం జరుగుతుందని ఆశించడం శశవిషాణ ప్రాయం, పర రాజ్యం పోయి,ప్రజా రాజ్యమై పాముకున్నది లేదు.కొందరికి ప్రజారాజ్యంగా కొందరికి మజా రాజ్యంగా కొందరికి క్షుధా రాజ్యంగా తయారై అష్టకష్టాల కాలవాలమైంది. విద్యాభివృద్ధి తప్ప విజ్ఞాన వృద్ధి శూన్యమై వింత ప్రకృతులతో విఱ్ఱవీగు తుంది. నిజాయితి నిండుకొన్నది.మూఢతా జలనిధి జడనిధియై స్తంభించి పోయింది. మేడలు పెరిగి మేధస్సు తరిగింది. ఫలశూన్యాలైన పైపై నవ్వులు, పల్కరింపులు, ప్రణామాలు సభ్యతా చిహ్నాలైనయి. వన ప్రతిష్ఠలు, శిథిల శిలాఖండ పునరుద్ధరణలు, ఉరుసులు, ఉత్సవాలు, దేశాభ్యుదయ సాధనాలై బక్కపేదల డొక్కల నూరించి కారిస్తూయున్నయి. పురోగమనం తిరోగమనమైంది. ఆంధ్రకవు లంత: పురాంగన కలరు.మాలలల్లి యలంకరణలు చేస్తూ పాతపుంతలో పల్లటీలు కొడుతూ పచార్లు సారిస్తూన్నారు. ఎవరికివారై యమునా తీరాన మున్ను కట్టుకొన్న గుడిసె లిప్పుడున్నత సౌధాలై కంచెలు వైచికొన్నయి. పూర్వమన్నాదమ్ములు,నేడు బ్రదర్లు, భాయీలు భాషలో మార్పు తప్ప ప్రకృతిలో మార్పు లేదు.


ఈ నవ్య యుగం చేసే విచిత్ర నగ నాట్య రభసచే నాలో రేగిన వృథా వాత్యకుక్కిరి బిక్కిరై ఒకానొక రాత్రి నాజీర్ణ జీవిత గ్రంథాన్ని సింహావలోకనం చేసికొన్నాను. జన్మస్థలాన్ని, జననీజనకుల్ని నాటి నేటి రాజకీయ సాంఘిక వ్యవస్థల్ని పరిశీలించి చూచుకొన్నాను. మనశ్శాంతికై కలము పట్టుకొన్నాను. అందలి ప్రథమ నిశ్వాసమే.

జీవిత చరిత్ర రాయడం చాలా కష్టం. అది సత్య నిష్టతో కూడుకున్నది. చాలామంది తన జీవిత చరిత్రను రాసి ప్రజలను మెప్పించ లేకపోయారు. కారణం వారు జీవితాన్ని అనుభవించలేకపోవడం. జీవితాన్ని అనుభవిస్తేగాని పవలరించ లేము. అందుకే ‘నా కథ’ జగత్‌ ప్రసిద్ధమైనది. ఆయన తన ఊరిని తల్లి అని సంబోధించాడు. ఊరిలో వున్న అన్ని దేవాలయాల గురించి ప్రస్తావించాడు. తల్లిదండ్రులకు నేను గారాల సుతుడను అని పేర్కొంటాడు.ఏనుగు మీద గండపెండెరంతో ఊరేగించారని ఆత్మగౌరవంతో చెప్పాడు. వినుకొండ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పాడు. టిప్పు సుల్తాన్‌ కట్టించిన మసీదు విశిష్టతను వివరించాడు. కనకదుర్గను పొగిడాడు. శివాలయాన్ని దర్శింపచేశాడు. చివరకు వినుకొండ ఊరును మనకు దృశ్యీకరింప చేశాడు.


కం. ననుగాంచి పెంచి నాలో

గొనబుం గవనమును, పాదుకొల్పిన తల్లీ!

నను మరచిన నిను మరవను

వినుకొండా! నీకు నా పవిత్ర ప్రణతుల్‌.


కం. వీరయకు లింగమాంబకు

గారాల సుతుండ కవిని గంధగజముపై

నూరేగి చరణమున పెం

డారంబు ధరించినాడ నలువురు మెచ్చన్‌.


ఆయన ఊరిని ఎంత ప్రేమించాడో దేశాన్ని అంత ప్రేమించాడు.ప్రపంచాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆయన తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టాడు. ఆయన కేవలం అక్షర విద్య వలన జ్ఞానం రాదు అన్నాడు. జ్ఞానం నిరంకారులకు,జీవన సత్యాలు తెలుసుకునేవారికి మానవతా స్ఫూర్తి కలిగిన వారికి, మాత్రమే వస్తుంది అన్నాడు. మొదటి నుంచి ఆయన మతోన్మాదాన్ని నిరసిస్తూ మతద్వేషాన్ని నిరసిస్తూ, మనవతా సౌజన్యాలు విరజిమ్ముతూ కవిత్వాన్ని నడిపించాడు. ఆయన జీవిత కథలోకి వెళ్దాం.


కం. గొరియల మేకల నెత్తుటి

ఝరముల నిర్దోషమునను జర్జరితంబై

కరిగినవి గిరులు శ్రుతగిరి

కరుగదనిన అపయశంబు గాదే మనకున్‌.


సీ. కృపలేని నీదు కొంచెపు దృష్టి బాధింప కన్నీరు చిందిన కవనపటిమ

దరిలేని నీ యనాదరణ మాటున మ్రగ్గి మంటి పాలైన సమత్వ సుఖము

ముక్కిపోయిన నీదు మూఢతా జడనిధి మునిగి యిప్పటికి కోల్కొనని చదువు

ఫలమింతలేని నీ భజన కూటములచే ఖర్చైన యౌవన కాల నియతి.


ఇకపోతే మహాకవి జాషువాకి నవయుగ చక్రవర్తి అనే బిరుదు రావడం గురించి కొండవీటి వేంకట కవి నాతో ఇలా చెప్పారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి కవిరాజు బిరుదునిచ్చారు.తుమ్మల సీతారామమూర్తి గారికి తెలుగు లెంక బిరుదునిచ్చారు. కొత్త సత్యన్నారాయణ చౌదరి గారికి మహాపండిత్‌ బిరుదునిచ్చారు. నాకు కూడా కవిరాజు బిరుదునిచ్చారు. అయితే మహాకవి గుర్రం జాషువా గారికి మాత్రం నవయుగ కవి చక్రవర్తి అని బిరుదునిచ్చారు. మేము శూద్ర కవులం. ఆయన పరిచయ కవి అయినా ఆయనకి నవయుగ చక్రవర్తి అనే బిరుదు వచ్చింది. ఆయనను ఏనుగు మీద ఊరేగించారు అని చెప్పారు. అప్పటి శూద్ర కవుల కంటే కూడా జాషువా గారికి గొప్ప కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఆయన కవిత్వంలో ‘ఊరు’, ‘వాగు’, ‘కొండలు’, ‘పక్షులు’, ‘జీవితం’, ‘దు:ఖం’, ‘నీతి’, ‘వ్యక్తిత్వం’ ఉంటాయి అని కొండవీటి వేంకట కవి చెప్పారు.


జాషువా కవిత్వంలో శిల్ప రహస్యాలున్నాయి. ముఖ్యంగా ఆయన తెలుగు నుడికారాన్ని పలుకుబడినీ, సామెతనీ, కవిత్వంలో మేళవించారు. ఆయన సామాన్యంగా పద్యాన్ని పూర్తి చేయడు. ఆయన పద్యం రాసే పద్ధతి గురించి ‘పిరదౌసి’ కావ్యంలో ఇలా చెప్పారు.


ఒక్కొక పద్దియంబునకు నొక్కొక నెత్తురుబొట్టు మేనిలో

దక్కువగా రచించి వృథాశ్రమ యయ్యె గులీనుడైన రా

జిక్కరణిన్‌ మృష ల్వలుకునే? కవితాఋణ మీయకుండునే

నిక్క మెఱుంగనైతి గజనీసులతాను మహమ్మదగ్రణీ.


నిజానికి ‘పిరదౌసి’ జీవితం గుఱ్ఱం జాషువా జీవితానికి దగ్గరగా వుంది. జాషువా జీవితం సుసంపన్నమైంది. కథనాత్మకమైంది.ఆదర్శ ప్రాయమైంది. అందులో దు:ఖం ఉంది. నైతికత ఉంది.పోరాటం ఉంది.ఆవేదన ఉంది. సందేశం ఉంది.అందుకే ఆయన జయంతి రోజున మనమందరం ఘన నివాళి అర్పిద్దాం.


 వ్యాసకర్త : డా|| కత్తి పద్మారావు సెల్‌ : 9849741695

Tuesday, September 24, 2024

 

మనకు మార్కెట్‌లో అనేక రకాల ఆయిల్స్ లభిస్తున్నాయి. వాటిల్లో ఫెన్నెల్ ఆయిల్ కూడా ఒకటి. ఇది ఎసెన్షియల్ ఆయిల్‌లాగా మనకు లభిస్తుంది. దీన్ని వాడితే స్త్రీ, పురుషులు ఇరువురిలోనూ శృంగార కాంక్ష, సామర్థ్యం పెరుగుతాయి. దీంతో పడకగదిలో రెచ్చిపోతారు. అలాగే శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో జాస్మిల్ ఆయిల్ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. దంపతులు ఈ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది జననావయవాలకు రక్త సరఫరాను పెంచి శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది.

ఇక రోజ్ ఆయిల్‌, నెరోలి ఆయిల్‌, క్లారీ సేజ్ ఆయిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మనకు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటిని వాడినా కూడా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆ కార్యం పట్ల ఆసక్తి కలుగుతుంది. దీంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Monday, September 23, 2024

 💐 *తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు* 💐

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

●మహాప్రస్థానం - శ్రీశ్రీ

●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ

●చివరకు మిగిలేది - బుచ్చిబాబు

●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి

●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

●కళాపూర్ణోదయం - పింగళి సూరన

●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

●గబ్బిలం - గుఱ్ఱం జాషువా

●వసు చరిత్ర - భట్టుమూర్తి

●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు

●చదువు - కొడవగంటి కుటుంబరావు

●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి

●వేమన పద్యాలు – వేమన

●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి

●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

●అల్పజీవి – రావిశాస్త్రి

●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

●ఆంధ్ర మహాభాగవతం – పోతన

●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

●మొల్ల రామాయణం – మొల్ల

●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

●మైదానం – చలం

●వైతాళికులు – ముద్దుకృష్ణ

●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి

●సౌందర నందము - పింగళి, కాటూరి

●విజయవిలాసం - చేమకూర వేంకటకవి

●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

●మ్యూజింగ్స్ – చలం

●మనుచరిత్ర- అల్లసాని పెద్దన

●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి

●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర

●దిగంబర కవిత - దిగంబర కవులు

●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

●పానశాల - దువ్వూరి రామిరెడ్డి

●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

●అంపశయ్య – నవీన్

●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

●జానకి విముక్తి – రంగనాయకమ్మ

●స్వీయ చరిత్ర – కందుకూరి

● మహోదయం - కెవి రమణారెడ్డి

●నారాయణరావు - అడవి బాపిరాజు

●విశ్వంభర – సినారె

●దాశరథి కవిత – దాశరథి

●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం

●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

●పారిజాతాపహరణం - నంది తిమ్మన

●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర – కందుకూరి

●రాధికా సాంత్వనము - ముద్దు పళని

● స్వప్న లిపి – అజంతా

●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

●శృంగార నైషధం – శ్రీనాథుడు

●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

●అను క్షణికం - వడ్డెర చండీదాస్

●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి

●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

●గద్దర్ పాటలు – గద్దర్

●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి

●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్

●కుమార సంభవం - నన్నే చోడుడు

●మైనా - శీలా వీర్రాజు

●మాభూమి - సుంకర, వాసిరెడ్డి

●మోహన వంశీ – లత

●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం

●స్వేచ్ఛ – ఓల్గా

●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

●తృణకంకణం – రాయప్రోలు

●హృదయనేత్రి - మాలతీ చందూర్

●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్

●నీతి చంద్రిక - చిన్నయ సూరి

●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●నీలిమేఘాలు – ఓల్గా

●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల

●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

●కొయ్య గుర్రం – నగ్నముని

●నగరంలో వాన – కుందుర్తి

●శివారెడ్డి కవిత – శివారెడ్డి

Sunday, September 22, 2024

 



మాదిగలు చర్మకారులు. జంబూద్వీప మూలవాసులు. దక్షిణాన హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ దాకా చర్మకార సమూహాలు అతి పెద్ద జనాభాగా విస్తరించి ఉన్నాయి.


మాదిగలు, చక్కిలియార్లు, మాద్గి, మాంగ్, మాతంగ, చమార్, జాతవ్, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మాదిగదాసు, ఆది జాంబవ, అరుంధతీయ, మోచి, సమగర - ఇలా అనేక పేర్లతో భారతదేశంలో చర్మకార కులాల వారు పిలవబడుతున్నారు.


చర్మకార మాదిగ సమూహాలు ప్రకృతి జీవులు. ప్రకృతి ఆరాధకులు. అమ్మ తల్లిని పూజించే మాతృస్వామ్యాన్ని అనుసరించేవారు. ఎల్లమ్మ, మాతంగి, మాతమ్మ, జోగులాంబ, బసవమ్మ వీరి దేవతలు. మాతృస్వామిక సంస్కృతికి ప్రతీకగా మాతంగి దేవత జనించింది. పునరుత్పత్తి సహజావసరంగా, సగౌరవంగా యోని ఆరాధన జరుగుతున్నది. ఆహార సేకరణ, వేట సమాజాలకు మహిళలు నాయకత్వం వహించారు. విపత్తులను ఎదుర్కోవడంలో, కుటుంబంలో, గుంపు జీవితంలో మహిళలు వీరోచితమైన, ప్రేమైక పాత్ర నిర్వహించి, నాటి మాతృస్వామ్య సమాజాల్లో ఆదర్శనీయులు, పూజనీయులు అయినారు.

వివిధ పురాణాల, మతాల, చరిత్ర, సంస్కృతులను పరిశీలిస్తే, మహారాష్ట్ర, గుజరాత్ లలో మాతంగ కులం ఉన్నది. మాతంగ మహర్షి ఉన్నాడు. మాతంగ కన్యా మనసా స్మరామి అని మహాకవి కాళిదాసు కాళీమాతను పూజించాడు. మాతంగి పర్యాయ పదాలుగా ఆదిశక్తి, అఖిల జనని, మహా విద్యాధరి, ఎల్లమ్మ, సుందత్తి ఎల్లమ్మ, ఏకవీర, లజ్జగౌరి, సవరేశ్వరీదేవి, దుర్గ, కాళి, కాళీమాత, పార్వతి, మాతంగిదేవి, చాముండి, చండాలిక, ఉచ్చిష్ట చండాలిని, రాజమాతంగి, సుముఖ మాతంగి మొదలగు అనేక పేర్లతో భరత ఖండంలో పూజలందు కొంటున్నది. దీనిని బట్టి మన సమాజంలో మాతృస్వామ్య సమాజం జాడలు ఎంతగా విస్తరించి, వ్యాపించి ఉన్నాయో విశదమౌతున్నది. బిడ్డలను, సమూహాలను, సమాజాన్ని ధీరోదాత్తంగా కాపాడి, బతికించే మానవోన్నత మాతృస్వామిక ధర్మమే మాతంగిది అని తెలుస్తున్నది.

పోశమ్మ, మైసమ్మ, మాంకాళమ్మ, ఏకవీర, కాకతమ్మ, సమ్మక్క, సారలమ్మ మొదలగు దేవతలను పరిశీలించినా, బోనాల పండుగ సందర్భంలో ఇప్పటికీ భవిష్యవాణి వినిపిస్తున్న మహిళా సాంప్రదాయాన్ని గమనించినా - మానవ విపత్తులు, అంతకు మించిన ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే వేట, వ్యవసాయ, విద్య, వైద్య, వైజ్ఞానిక యుద్దరంగం మొదలగు రంగాల మేటి మహిళలు పూజనీయరాళ్ళు అయ్యారని, వారి వాణి సమాజ హితమైనదని మనకు అర్థమవుతుంది. మరి ఇంత గొప్ప మాతస్వామ్య వ్యవస్థ ఎప్పుడు ప్రమాదంలో పడింది?

ప్రాచీన భారత ఉపఖండంలో భిన్న మానవ సమూహాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, మాతృస్వామిక సంస్కృతీ సమాజాలే మనుగడ సాగించాయి అనేదానికి ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి. గుణగణాల ఆధారంగా మనుషులను ప్లేటో వర్గీకరించిన విధానానికి, ఆర్యులు ప్రవేశ పెట్టిన వ్యవస్థీకృత వర్ణ వ్యవస్థకు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఆర్యుల దండయాత్రలు, వలసలతో భారతఖండంలో వర్ణ వ్యవస్థ, నిర్బంధ వృత్తి బానిస వ్యవస్థలూ మొదలయ్యాయి. పితృస్వామ్యం, అంచెల వారీ ఆధిపత్య కుల వ్యవస్థ ఏర్పడింది. దీంతో మాతృస్వామ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడింది. దీనితో ప్రాచీన మాతృ పాలనా సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన మాతంగి వ్యవస్థ ఇప్పటి ఆర్య పితృస్వామ్యం కారణంగా తన దైవిక ప్రాభవం ఒకవైపు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు బ్రష్టత్వానికి, దోపిడికీ గురవుతున్నది నేడు.

ఆది జాంబవంతుని నివాస, నియంత్రణా ప్రాంతమే జంబూద్వీపం. ఆది జాంబవంతుని వారసులే చర్మకార సమూహాల వారు. నేడు పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం, అత్యాచారాలు, కులహింసలు, వెట్టి చాకిరి, బాలకార్మిక వ్యవస్థ, పారిశుద్ధ్య వృత్తి వ్యవస్థ, భూమి లేకపోవడం, ఇళ్ళు లేకపోవడం, కనీస వేతనాలు పొందలేకపోవడం, క్వాలిటీ చదువులు లేకపోవడం, నిరుద్యోగం, మార్జినలైజేషన్, మూఢనమ్మకాలు మొదలగు అనేక రూపాల్లో మాదిగలు దోపిడీ, పీడనలకు గురవుతూనే ఉన్నారు.

మాదిగ బాలికలను ఈ దేవతలకు అంకితమిచ్చి, పెళ్లిళ్లు చేసి, వారిని విద్యా వికాసాలకు, కుటుంబ జీవనానికి దూరం చేసి, అణిచివేతలు కొనసాగించే దురాచారాలు గ్రామ సమాజంలో ఇప్పటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి.

మాదిగ ఆడపిల్లలను మాతంగి, మాతమ్మ, జోగిని, బసివిని, దేవదాసీలుగా అంకితం ఇచ్చినా, ప్రోత్సహించినా, వినోదించిన, ఇలాంటి వారికి మూడేళ్లు జైలు శిక్ష, ఐదువేల రూపాయలు జరిమానా అని 1988లో వచ్చిన, ఏపీ దేవదాసి వ్యవస్థ రద్దు చట్టం చెబుతున్నది. కానీ, ఇంతవరకు ఈ చట్టం అమలుకు ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ఇంకా అమలు కానేలేదు. ఇదొక చారిత్రక వ్యవస్థీకృత విషాదం.

ఏ సమాజంలోనైనా స్త్రీల విద్య, అభివృద్ధిల స్థాయిలను ఆ సమాజం సామాజిక అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటారు. అణగారిన సమూహాల మహిళల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సాంస్కృతిక, నాయకత్వ పరిస్థితులను పెంపొందించు కోవలసిన అవసరం మరింత ఏర్పడింది. వివక్షలకు తావు లేని, సాధికారాన్ని, మెరుగైన జీవనాన్ని అణగారిన మహిళల హక్కుగా దాఖలు చెయ్యాల్సిన అవసరం, బాధ్యత, సమాజం పై, ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్నది.

ఈ నేపథ్యంలో బాధిత సమాజం నుంచి వచ్చి, కాకతీయ విశ్వ విద్యాలయంలో, చరిత్ర విభాగంలో విశేష పరిశోధన చేసిన విద్యార్థిని డాక్టర్ ఇ.వసంత 'తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మాతంగి సాంప్రదాయం ఒక పరిశీలన' అను అంశంపై పిహెచ్ డి కోసం పరిశోధన చేశారు. ఈ పరిశోధన కోసం ఆమె మారుమూల గ్రామాల్లో ఉన్న మాతంగి క్షేత్రాలను, చారిత్రక కట్టడాలను, మాజీ మాతంగి మహిళలను, మాతంగి పురా గాథలను గురించి వివరించే బైండ్ల కళాకారులను, సంబంధిత కమ్యూనిటీ ప్రజలను కలిసి ఎన్నో ఆధారాలను, విశేష అంశాలను సేకరించారు. పుస్తక భాండాగారాలను దర్శించి, ఎన్నో విలువైన చరిత్ర గ్రంథాలను, పరిశోధనా గ్రంథాలను పరిశీలించారు. యీ గ్రంథంలో దక్షిణ భారతదేశ మాదిగల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో వున్న చర్మకార సమూహాల్లో మాతంగి వ్యవస్థ ఎంత ప్రాచీన కాలం నుంచి, ఎలా వేళ్ళూనుకొని ఉన్నదో విస్తృతమైన, లోతైన అధ్యయనం, ఆంతరిక విశ్లేషణతో తన పరిశోధనా గ్రంథంలో వెల్లడించారు. మాతంగి ఒకనాటి మాతృస్వామిక వ్యవస్థ సంస్కృతికి ఎలా ప్రతీకగా నిలిచిందో యీ పరిశోధకురాలు చక్కగా విశ్లేషించారు. అలాగే ప్రస్తుత పితృస్వామిక వ్యవస్థ ఒకప్పటి ఉన్నత, సదాచారమైన మాతంగి వ్యవస్థను వ్యవస్థీకృత దురాచారంగా ఎలా మార్చివేసిందో విశ్లేషించారు. చారిత్రక ఆచారాల్లో మహిళల నిమ్నోన్నతాలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పరిశోధక గ్రంథాన్ని తప్పక చదివి తీరాలి. తాను చేసిన కృషికి డాక్టర్ వసంత చాలా అభినందనీయురాలు.

కృపాకర్ మాదిగ

Thursday, September 19, 2024

 

అదెలాగో పరిశీలిద్దాం! క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో ఇరాన్లో 'హఖీమని' వంశం ఒకటి ఉండేది. ఆ వంశంలో ప్రసిద్ధుడు మొదటి డేరియాస్.ఆయన సెప్టెంబర్ 550-అక్టోబర్ 436 BCE సాధారణ శకానికి ముందు కాలంలో సుమారు 64 ఏండ్లపాటు జీవించాడు. ఈ హఖీమని వంశాన్ని అఖియమినిడ్ వంశం అని కూడా అంటారు. ఆ పదాన్ని అనుసరించుకుంటే- 'స్నేహితుని హృదయంలో ఉండేవారు' అని చెప్పుకోవచ్చు. డేరియస్ ద గ్రేట్గా చరిత్రలో నమోదయిన ఈ చక్రవర్తి (Emperor) అతి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యం ఇరాన్ నుండి మన సింధూ ప్రాంతం వరకు విస్తరించింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమంటే ఈ ఇరాన్ వంశం వారే తాము 'ఆర్యపుత్రుల'మని గర్వంగా చెప్పుకునేవారు. ఈ విషయం వారి శిలాశాసనాల ద్వారా తెలిసింది. వీరే భారతదేశంలోకి ప్రవేశించారన డానికి చారిత్రక ఆధారాలు దొరికాయి. ఈ హఖీమని వంశం వారు మన భారతదేశంలోకి వచ్చినపుడు కొన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ భారతదేశంలో బావులున్నాయి. అక్కడ వారి అరబ్ ప్రాంతంలో లేవు. ఇక్కడ ఏనుగులున్నాయి. వారి ప్రాంతంలో లేవు. ఇక్కడ మనదేశంలో పెద్దపెద్ద చింతచెట్లున్నాయి. వారి ప్రాంతంలోలేవు. ఇవన్నీ వారికి సంభ్రమాశ్చర్యాలు కలిగించే విషయాలయ్యాయి.
అరబ్ దేశాల వారు నీటికొరకు వర్షాల మీద ఆధారపడతారు. వర్షాలు పడ్డప్పుడు పర్వతాల నుండి ప్రవా హంగా వచ్చే నీటిని నిలువ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటారు. మనకు ఇక్కడ సింధూ నాగరికత నాటినుండే బావులున్నాయి. అందువల్ల ఇక్కడి వారికి అవి కొత్తకాదు. ఇరాన్ వారికి కొత్త వర్షం కురిపించే దేవుడు ఇంద్రుడు అనే భావన ఉందికదా? అది వారి పుగార్ కొయి శిలాశాసనాలలో ఉంది. అయితే వారు ఇంద్రుణ్ణి 'ఇందర్' అన్నారు. ఇందర్ అన్నా నీరే, సముందర్ (సముద్రం) అన్నా నీరే. బందర్ గాహ్ అంటే సముద్రపు ఒడ్డు. అంటే బందర్ కూడా నీటికి సంబంధించిన మాటే, ఇక్కడ బందర్ అంటే కోతి కాదు. (బహుశా, మన తెలుగు రాష్ట్రంలో ఉన్న బందరుకు కూడా పేరు ఆ విధంగానే వచ్చి ఉంటుంది) అందువల్ల ఇక్కడ భారతదేశంలో బావుల్ని చూసి వారు, వాటిని ఇంద్రాగార్ (ఇంద్ర-ఆగార్) అని అన్నారు. ఆగార్ అంటే ఖజానా. బావులంటే నీటి ఖజానాలని వారు భావించారు. ఇంద్రాగార్ అపభ్రంశమై అనేక రకాలుగా మార్పులు చెందింది.ఉత్తర భారతదేశంలో చాలాచోట్ల బావులను బోజ్పురి ఇంకా ఇతర ప్రాంతీయ మాండలికాల్లో ఇనారా/ఇనార్/ఇందారా అని అంటున్నారు.ఇవన్నీ ఇంద్రాగార్కు మారు రూపాలే (వికృతి)
తొలిసారి హఖీమని వంశం వారు భారతదేశంలో ఏనుగులను చూసి 'హస్తీమృగ' అన్నారు. హస్తం ఉన్న జంతువు అని అర్థం.తొండాన్ని వారు చేయిగా భావించారు. అలాంటి అవయవం మరే జంతువుకు లేదు.ఇరాక్, ఇరాన్ ప్రాంతాలలో ఏనుగులు ఉండవు గనక అది వారికి ఒక చిత్రమైన ప్రాణి (మృగహస్తీన్) మృగ అని ఎందుకు అన్నారంటే- మృ అంటే మట్టి గ అంటే గమనం. మట్టి మీద తిరిగేవి. మనిషితో పాటు భూమి మీద సంచరించేవన్నీ మృగాలే. చెట్లమీద తిరిగే కోతులను శాఖామృగ అని అన్నారు. అలాగే ఖగ-ఖ అంటే ఆకాశం. గ అంటే గమనం. ఆకాశంలో విహరించేవి. పక్షులు అలాగే చూడండి.భూగోళానికి ఎదురుగా ఉన్నది. ఖగోళం అని అంటు న్నాం కదా? ఇది మట్టి గోళమయితే, అది ఆకాశగోళమని అర్థం. వాడుకలో ఏనుగు 'హాథీ (చేయగలది) అయిపోయింది.
ఇరాన్ ప్రాంతంలో ఖర్జూర (తమరే) చెట్టు తప్ప, చింతచెట్లు ఉండవు. ఆర్యులు మొదటిసారి ఇంత పెద్ద చెట్టు చూసి విన్మయ చకితులయ్యారు. దాని పండు రుచిచూస్తే తియ్యగా, పుల్లపుల్లగా ఉంది. అది వారికి ఖర్జూరం లాగా అనిపించింది. అందుకే 'తమరే ఐ హింద్' (ఇండియా ఖర్జూరం) అని పేరు పెట్టారు. ఖర్జూర ఫలాలను వారు తమరే అని పిలుస్తారు కాబట్టి. తమరే ఐ హింద్ అన్నారు. ఇరాన్ ప్రాంతం నుండి ఇంగ్లీషు వారు ఆ పదాన్ని తీసుకుని 'టామర్-ఇండ్' (ఇండియా ఖర్జూరం) అని అన్నారు. ఆ పదమే వాడుకలో టామరిండ్' (TAMAR- IND) అయ్యింది.
దేశంలోకి ఆర్యులు చొరబడ్డాక, వారు చేస్తూ వచ్చిన అరాచకాలకు లెక్కలేదు. అయితే కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుకుందాం! చాలామంది ఇంటి ముఖద్వారానికి గుమ్మడికాయ కట్టుకుంటారు. ఎందుకూ? దిష్టి తగల కుండా అని చెపుతారు. దిష్టి అనేది నమ్మకం మాత్రమే. అది నిరూపణ కాలేదు. అది ఒక మూఢనమ్మకంగా కొనసాగుతోంది. అసలు ఆచారం ఎలా మొదలైంది? అని గతంలోకి వెళ్లి చూస్తే వళ్లు గగుర్పొడిచే నిజం బయట పడుతుంది. శృంగ వంశం వారు (185-72 BCE ) బౌద్ధాన్ని నాశనం చేయడం ప్రారంభించారని మనకు తెలుసు. బౌద్ద భిక్షుల తలలు నరికి తెచ్చిన వారికి పుష్యమిత్ర శృంగుడు (185-149 BCE) బహుమానాలు అందించే వాడని కూడా మనకు తెలుసు. ఆ సాంప్రదాయాన్నే ఆ తర్వాత వచ్చిన వైదిక మతాభిమానులైన రాజులు కొన సాగించారు. వీరి ఆగడాలు తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడానికి బౌద్ధులు చుట్టుపక్కల దేశాలకు పారి పోయారు. అదంతా మళ్లీ వేరే విషయం. ఆ సమయం నుండే తాము ఒక బౌద్ధ భిక్షువు తల నరికామని గర్వంగా ప్రకటించుకోవడానికి కొందరు తమ ఇండ్ల ముఖద్వారాలకు తల ఆకారంలో ఉండే గుమ్మడికాయను కట్టుకునేవారు. తాము తమ పాలకుల దృష్టిలో పడాలనీ, వారి గుర్తింపు పొందాలనీ తాపత్రయపడేవారన్నమాట! ఆ విధంగా అది ఒక ఆనవాయితీ అయ్యింది. తలలు నరకడమనే హింసాత్మకమైన కారణాన్ని కప్పిపుచ్చడానికి ఆర్య బ్రాహ్మణులు దిష్టిని ప్రవేశపెట్టారు. ఇతరుల దిష్టి తగలకుండా తమ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవాలన్న ఒక ముఢాచారాన్ని వారు ప్రచారం చేశారు. అదే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఈ కాలానికి అవసరం లేనివి పాటించడం అవసరమా? అన్నది సమకాలీనంలో మనం ఆలోచించుకోవాలి కదా?
గతంలో కొన్ని వందల యేండ్ల క్రితం రాజులు, జమిందారులు, దేశ్ముఖులు, సమాజంలోని ప్రముఖులు వేటకు వెళ్లేవారు. వారు వేటలో చంపిన జంతువుల గుర్తులు అంటే జింక చర్మాలు, దుప్పికొమ్ములు వగైరా తెచ్చి దివాన్ ఖానాలోనో, ముందు హాల్లోనో డాబుగా ప్రదర్శించుకునేవారు. పులిగోరు లభిస్తే దాన్ని బంగారు గొలుసుకు అమర్చి, ఒక మెడల్లా మెడలో ధరించేవారు. ఇంటికొచ్చిన అతిధులు తమ ఘనతను గుర్తించాలని అలా చేసేవారు. అదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కదా? ఎవరైనా, ఏదో ఒక విషయంలో విజయం సాధిస్తే, దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేదా ఫొటో, డ్రాయింగ్ రూంలో పెట్టుకుంటున్నాం కదా?అలాగేనన్నమాట! ఒకా నొకప్పుడు బౌద్ధ భిక్షు తలనరికామని గర్వంగా చెప్పుకోవడానికి సంకేతంగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టు కునేవారు. లక్షలాది బౌద్ధ సన్యాసుల రక్తంతో ఈనేల ఇంకిపోయిందని గుర్తుచేస్తున్నట్టుగా ఉంది- ఇంటి ముఖ ద్వారానికి వేలాడుతున్న గుమ్మడికాయ!
బౌద్ధుల కాలంలో సిద్ధార్థుడి తల్లి మహామాయ శిల్పాల్ని ఆనాటి శిల్పులు చెక్కుకున్నారు. ఆ మహా మాయ శిల్పంలో ఆమె పద్మాసనంపై కూర్చుని ఉంటుంది. రెండు వైపుల నుండి రెండు ఏనుగులు తొండాలు ఆర్చ్లాగా ఎత్తి ఆమె మీద నీళ్లు పోస్తుం టాయి. అంటే అభిషేకమన్నమాట! మహా మాయ కాళ్ల దగ్గర పెద్ద కాడలున్న పువ్వులు చెక్కి ఉంటాయి. పూర్తిగా ఆ శిల్పాన్ని కాపీకొట్టి, వైదిక మతస్థులు శ్రీలక్ష్మి చిత్రపటానికి రూపకల్పన చేసుకున్నారు. లక్ష్మీదేవి చిత్రపటాలు కానీ, పెయింటింగ్స్ కానీ 120 ఏండ్లకు ముందు లేవు. అంతకు ముందు లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు-మహామాయ శిల్పంలోలాగే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని ఉంటుంది. దూరం నుండి రెండు ఏనుగులు చెంబులతో లక్ష్మీదేవి మీద నీళ్లుపోస్తుంటాయి. ఆ విధంగా విదేశీ ఆర్య బ్రాహ్మ ణులు ఒక పెద్ద కుంభకోణం చేసి మొత్తం భారతదేశాన్ని మోసం చేశారు. మీరు ఎప్పుడైనా హిందూ దేవీ దేవతల ఆలయాలకు వెళ్లినపుడు ముఖద్వారానికి పైన మహామాయ శిల్పం కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించండి, తెలుస్తుంది. ఎందుకంటే తొలి శిల్పులు బౌద్ధులు, మొదట కట్టబడ్డవి బౌద్ధరామాలు. వాటిని శివాలయాలు, విష్ణు ఆల యాలుగా మార్చుకున్నారనడానికి నూటికి నూరుశాతం ఆధారాలు కనిపిస్తున్నాయి. 120 ఏండ్లకు ముందు లక్ష్మీదేవి శిల్పాలు, పెయింటింగ్స్, చిత్రపటాలు ఏవైనా ఉన్నాయని వైజ్ఞానిక పద్ధతుల ద్వారా నిరూపిస్తే, తప్పదు మనం ఒప్పుకోవాల్సిందే- కానీ, వాళ్లు ఆ పని చేయలేరు. కారణం అవి లేనేలేవు గనక!
బుద్ధుని తల్లి మహామాయ కోసం కట్టుకున్న పద్దెనిమిది మందిరాలను 'అష్టాదశ శక్తి పీఠాలు'గా మార్చు కున్నారు. అలాగే బుద్ధుడి పన్నెండు మందిరాలను 'జ్యోతిర్లింగాలు'గా మార్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చిట్టా చాలా పెద్దదే అవుతుంది. శ్రీలంకలోని మహామాయను కూడా హిందూ దేవతగా మార్చుకుని 'శక్తిమాత మట్టెలుండే చోటు' అని ప్రచారం చేసుకుంటున్నారు.
ఇలాంటిదే మరో విషయం ఉంది. ఆలయ నిర్మాణ వైశిష్ట్యం గూర్చి గొప్పగా చెపుతారు. పూజారులు ఉచ్ఛరించే వేద మంత్రాలు గాలీ, వెలుతురూ చొరబడని గర్భగుడిలోని నాలుగు గోడల్ని తాకి-మధ్యలో ఉన్న దేవతా విగ్రహాన్ని లేదా శివలింగాన్ని తాకి, ఒక శక్తి ఉత్పన్నమౌతుందనీ, అది బయటికి వచ్చి భక్తుల మీద ప్రస రించి పాజిటివ్ ఎనర్జీ అందిస్తుందనీ-సూడోసైన్స్ ప్రచారం చేస్తున్నారు. ఇలా మాటలు చెప్పేవారు ఉట్టి మాటలు కట్టి పెట్టి-వైజ్ఞానిక పరికరాలు ఉపయోగించి నిరూపించాల్సి ఉంటుంది. దాంతో వారు మూర్ఖులు కారు. వైజ్ఞానిక ఆవగాహన ఉన్నవారేనని మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది.
బ్రాహ్మణార్యులు ప్రతి విషయంలో మోసం చేస్తూనే వచ్చారు. బుద్ధుడి జన్మస్థలమైన లుంబినిని అశోకుడు దర్శించాడనీ, అక్కడ ఒక స్థూనం నిర్మించాడని చరిత్ర చెపుతోంది. ఇప్పటికీ ఆ స్థూపం అక్కడ ఉంది. స్థూపం దగ్గర ఉన్న ఫలకం మీద 'దేవానాం పియ పియ దస్సి' అని రాసి ఉంది. 'పియదస్సి' అంటే అశోకుడు. దేవతలకు ప్రియమైన రాజు. ఆశోకుడు King Piyadassi The belved of Gods అని. అర్థం మార్చి ప్రచారం చేశారు! అసలైతే, ఆఫ్ఘనిస్తాన్ నంచి ఇక్కడ దక్షిణ భారతదేశం దాకా ఉన్న లక్షలాది అశోక స్థంబాల మీదగానీ, అశోకుని శిలా శాసనాలలో గానీ, చారిత్రక గ్రంథాలలో గాని ఎక్కడా ఇతర దేవీ దేవతల పేర్లు కనబడవు. ఇక్కడ దేవా అంటే బుద్ధ దేవుడనే అర్థం. పాలిభాషలో వాళ్లు దేవ- అని రాసుకున్నారంటే, ఆది బుద్ధ దేవుడిని ఉద్ధేశించి రాసుకున్నదే! అందువల్ల 'దేవానం పియ పియదస్సి' అంటే బుద్ధ దేవుడికి ప్రియమైన రాజు ఆశోకుడుగా మనం అర్థం చేసుకోవాలే తప్ప - అక్కడ ఇతర దేవీదేవతల ప్రసక్తి ఉన్నట్టు కాదు. ఇతర దేవతలకు ప్రియమైన రాజు అని వైదిక మతస్థులు చెసింది కేవలం దుష్ప్రచారమే!
- సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్ నుంచి)
- డాక్టర్ దేవరాజు మహారాజు

Monday, September 2, 2024

సమరయ స్ర్రీ

 


*సమరయ స్ర్తీ*(ఏకపాత్ర)


*సమరయ స్ర్తీ  ఏకపాత్ర*

(వేదిక మధ్యలో సమరయస్ర్తీ కూర్చుని ఉంటుంది తన ముందర ఉన్న మంచినీటి కూజా ఇంచుమించు ఒడిలో పొదివికున్నట్టు ఉంటుంది.కూజా మూతిపై చేతులు చాపి ఆ చేతులులో తలను వాల్చి ఉంటుంది.)

తెర తీయబడగానే ......మెల్లగా తలను పైకి ఎత్తి నిద్ర మత్తు కళ్ళను ప్రదర్శిస్తూ ఆవలించి ,వళ్ళు విరిచుకుంటూ  నిద్రలో తన ప్రియునితొ సరసాలాడిన రీతిని ఊహించుకుంటూ పగలబడి నవ్వుతూ నవ్వుతూ లేచి  వేదిక కుడి మూలన వరకు ఎవరో తనను కౌగిలించుకుని వదిలి పెట్టిన భావన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు  అనిపించి వదలమన్నట్టు నటిస్తు  నవ్వి   ఆగి.....ఒక్కసారిగా కొంటే చూపులు చూస్తూ వయ్యారపు నడకతో కుడి నుండి ఎడమ మూలవరకు నడచి నడుస్తున్నప్పుడు నా అంత అందెగత్తె లేదు అన్నట్టు భావించుకుంటూ వెను తిరిగి మధ్యలో వరకు వచ్చి మరో సారి కొంటే నవ్వు విసిరి కనులు ఎగరేసి తలను వాల్చి కురులు ముందుకులాగి మరలా  కనులు ఎగరేసి 

ఓ రెండు నాట్యభంగిమలు ప్రదర్శించి)


ఓయ్ ..  ఓయ్ మిమ్మల్నె  వింటున్నారా...(తన ముసుగు చెంగును నోటిలో సుతి మెత్తగా పంటి బిగిన పట్టి  కాలి బొటన వ్రేలు నేలను రాస్తూ) సుఖారు గ్రామ రసికాగ్రేసులారా ఇది విన్నారా ! ఆహ విన్నారాంట ( విసుగు ప్రదర్శించి )  విని ఉండరులే.....  నా యవ్వన సిరులు దోచుకోవలనే ఆశే కాని ఈ సమరయ ప్రాంతంలో ఇంత రూపవతి శృంగారదేవత   ( క్రిందనుండి పైకి తన చేతిని చూపిస్తు)  లేనే లేదనే విషయం మీకు తెలుసాంట ...  ( అరచేతిని నోటి పై ఉంచి ఒకింత వగలపు నవ్వు నవ్వుతూ ) ఇప్పటికే నా లావణ్య రేఖావిలాసాలు సమరయ ప్రాంతంలో పేరు మోసిన దిగ్జజాలదగ్గర ఉన్నాయని  వాళ్ళు కాళ్ళా వేళ్ళా పడి  సేదతీరి.....అవసరం తీరాక ముఖం చాటేస్తారని ,వారి రహస్యజీవితాలు నా గుప్పెటలో  బందీ అని అందుకే నన్ను వేనొళ్ళ పొగుడుతారని తెలుసా ( కళ్ళు పెద్దవి చేసి ఎవరో అడిగినట్టు ) ఊ   .... ఎలాగో  చెప్పనా.(గట్టిగా ఎగతాళి నవ్వు ).ఊ.... ఎవరిదని చెప్పనూ ( కళ్ళుత్రిప్పి గట్టిగా నవ్వి  భర్తలాగ మగవానిగా నటిస్తూ గొంతు గంభీరంగా పెట్టి )  ఓ సుమరమణీ ...నీ నవ్వు నా హృదయారవిందాన్ని ఎంత గాయం చేసిందో చూడు నీ ఒడిలో  ఒక్కసారి నా తలను వాల్చనివ్వవూ... ( పగలబడి వేళాకోళం కలగలిపిన తొణికిసలాడే నవ్వు గట్టిగా నవ్వుతూ ) మరోకప్రియునిదా    ఏయ్ సౌందర్యరాశి ఏం లావణ్యమే నీది ....నీవు అనుమతిస్తే నీ అడుగుల్లో అడుగులు వేస్తాను .పువ్వుల్లో  పెట్టి చూసుకుంటాను  వదలనంటే వదలను నిన్ను ( నవ్వి నవ్వి   నవ్వుతూనే  ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడి మోసపోయిన దానిని గుర్తుచేసుకుంటుంది.. ఏడ్చి ఏడ్చి .... ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టు ....కన్నీళ్ళు తుడుచుకుని )  

అయ్యో అప్పుడే మిట్ట మధ్యహాన్నం అయ్యింది .  ఎండ చుర్రుమంటుంది .ఇదే సమయం యాకోబు బావి నుండి నీళ్ళు తేవడానికి. నా తలరాత ఇలా తగలడింది మరి .బయటకు వెళితే చాలు హేళన మాటలు వినలేక చావాలనిపిస్తు ఉంటుంది . సూటిపోటి మాటలలతో ప్రాణం తీస్తారు ఈ పాడు జనం. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానే. వీరి సంపదేమైనా ఎత్తుకు పోయానా ఏంటి. నా బడి ఏడుస్తూ ఉంటారు...సరేలే....  ఎప్పుడూ ఉండే సొదే.... ఈ సమయమైతేనే జనం తక్కువ ఉంటారు బావి దగ్గర .( అంటూ కూజాను సంకన ఉంచి బయలు దేరుతుంది .) 

(రెండడుగులు వేసిందో లేదో . వీధిలో ఓ సైనికుడు సమరయ స్ర్తీని చులకనగా చూస్తూ చేయిని పట్టుకున్నట్టు  తన చేతిని  సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ) ఎయ్ చేయి వదులు  ...,,,దారి తప్పుకో  సైనికుడా.... అడ్డులే  నన్ను వెళ్ళనివ్వు....ఏమిటా వెకిలి నవ్వు.....నేను సమరయ స్ర్తీని . నేనేం నిన్న మొన్నటి నుండి  ఇక్కడ ఉంటున్న దానినేం కాదు . ఒమ్రీ రాజు కట్టించిన పట్నంలో అస్సూరు రాజు ఆజ్ఞతో నివశిస్తున్న సమరయ జాతి స్త్రీని. ఏం అంటున్నావు ? సంకరజాతి దానిననా ,అంటరాని దాన్ననా. మా తాతలు దొంగలా  అయితే అయి ఉండవచ్చు .....ముందు అడ్డు తొలగు...... బావి వద్దకు పోవాలి  ... చేయి వదులు ముందు  . ఆ చెట్ల మాటున  దేశదిమ్మరులుంటారు  వెళ్ళి దాని చెయిపట్టుకో  వదలమన్నాన.....ఛీ...... చేయి వదులు ( చేయిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ముఖం పై ఉమ్మి వేసినట్లు నటించి కోపంగా చూస్తున్నట్టు   ముందుకు వెళుతూ  బయలుదేరుతుంది  నాలుగు అడుగులు వేసి ) 

( యాకోబు బావిని దూరం నుండి చూసి నట్లు నటించి)  ....హమ్మయ్య...  అదిగో యాకోబు బావి   యాకోబు యేసేపుకు కట్టించిన బావి . ఆ నుయ్యి లో నీళ్ళు ఎంత తీయగా ఉంటాయి . ఎంత మధురంగా ఉంటాయి. ఎంత చల్లగా ఉంటాయో చెప్పలేను ( అని అనుకుంటూ ఒక్కసారిగా ఆశ్చర్యం నటిస్తూ  .....ముఖం చిట్లించి.. ... బావి దగ్గర ఎవరో కూర్చున్నట్టు గమనించి) ....అమ్మో ఎవరో బావి వద్ద ఉన్నారు.....ఎవరైఉంటారు   .... బావి   అంచున కూర్చుంది ..ఎవరైయుంటారో.....ఎవరో యూదుడులా అంగీ వేసుకుని ఉన్నాడు..బావి గట్టునే కూర్చుని ఉన్నాడు...నేను చూస్తుంది నిజమేనా  అతను యూదుడు కాదుగదా ఆ తేజస్సు ఆ గంభీరతా యూదులకే సొంతం సుమా మరెవరికి ఉంటుంది ఆ దర్పం .....నేను  దగ్గరకు వెళ్ళవచ్చో లేదో . ..(గర్వపు గొంతుతో ).......ఆ నాకేం భయం  యూదులకు మా సమరయులకు బద్ద వైరం ఉన్నమాట ఎవరు కాదనగలరు . .....అతను యూదుడైతే నాకేంటట , .....ఉండనీ నాకేం భయం. సమరయులు దేనిలో తీసిపోతారు ...యూదుల గొప్పేంటో (  తనలో తను మాట్లాడుకుంటూ....... బుగ్గలు నొక్కుకుంటూ దిగ్బ్రమకు లోనై ) దోపిడీ దొంగలు "విచ్చలవిడిగా బ్రతికే వ్యభిచారులు నివశించే ఈ సమరయ ప్రాంతానికి యూదులు ఏనాడో రావటం మాని యూదయ నుండి చుట్టూ తిరిగి గలలియ పోతున్నారు.మరి  ఇతనెవరు చూస్తే యూదుడులాగే ఉన్నాడు. (నిట్టూర్చి )  ఏది జరిగితే అదే జరుగుతుంది .........దగ్గరగా వెళతాను.. నా పని నేను చేసుకుంటాను.......( అని బావి వద్దకు వెళ్ళినట్లు నాలుగడుగులు వేసి కూజాను క్రింద పెడుతుంది  ఇంతలో మెస్సీయా దాహాం తీర్చమని నీళ్ళు అడుగుతాడు అది విని  ఆశ్చర్యం నటిస్తూ  ..) ఏంటేంటి  ....దాహానికి నీరు ఇమ్మంటున్నావా ? నువు యూదుడవే కదా !

నేను చేదతో తోడి నీకు నీరు పోస్తే త్రాగుతావా ? సమరయ స్ర్రీ తాకిన నీటిని నువు త్రాగుతావా ?   .నేను ఎవరో  తెలిసే మాట్లాడుతున్నావా ! యూదులు మేము వండినవి తినరట , మా చేతి నీరు త్రాగరట ,మాతో సంబాషించడానికే ఒప్పుకోరట  . మరి నువేంటి త్రాగడానికి నీళ్ళడుగుతున్నావు.

నువు  యూదుడవైతే......ఏషర్హద్దోన్ మిమ్మల్ని అస్సూరు రాజ్యం తీసుకుపోయాడుగా  అక్కడే ఉండక  ఈ సమరయ ప్రాంతంతో నీకేం పని ఇలా వచ్చావ్ ....  ఏం మాట్లాడవేం ....పోనీలే అని  విగ్రహారాధన మాని మన దేవుడైన యెహోవాను పూజిస్తే నెహేమ్యా  ఊరుకున్నాడా మా సమరయులను సంకరజాతంటూ కలవవద్దని నిభందన పెట్టాడు .  అయితేనేం  మేము దేవుడిని విడిచి పెట్టలేదు. లేఖనాలు చదువటం మానలేదు . గెరీజీము  కొండపై ఆలయం కట్టుకుని  మెస్సీయ వస్తాడని ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని మీ యూదులు కలవనివ్వక పోతేనేం  మేము గొప్పగానే బ్రతుకుతున్నాం , మరి మా సమరయ ప్రాంతంతో నీకేం పనో  .ఏం మాట్లాడవేం . అందరిలాగే యూదయా నుండి చూట్టూ తిరిగి గలలియ పోలేక పోయావా  మా సమరయ ప్రాంతంలోకి వచ్చావ్.........నీళ్ళు కావాలట నీళ్ళు ( గుడ్లురుమి నట్లు చూసి ....దగ్గరగా వెళ్ళినట్లు నాలుగు అడుగులు వేసి )

     .ఇంతకూ.......ఎవరు నువ్వు  ఈ మిట్టమధ్యహాన్నం  ఇంత ఎండలో అంత ప్రశాంతంగా కూర్చున్నావ్  దేనికోసమో తెలుసుకోవచ్చా  .చూస్తుంటే  యూదు జాతివానిగానే కనబడుతున్నావు . నేను చూస్తుంది నిజమేనా ....( అవతలి నుండి నిజమే నువు చూస్తుంది అనే జవాబు విని ఆశ్చర్యాన్ని చూపిస్తూ )

  ఆ అవునా ! యూదుడవే... ( కాస్త నెమ్మదైన గొంతుతో )  నేను ఎవరో తెలుసా ! సమరయ స్త్రీని  అంటరాని జాతిలో పుట్టిన దానిని . మీరు ఈ యాకోబు బావి దగ్గరకు ఎందుకు వచ్చారు ? నేను పుట్టి ఉండగా ఓ యూదుడు ఇలా సమరయ ప్రాంతంలో అడుగు పెట్టడం ఇదే ప్రధమం . ఈ పాపుల మార్గాన రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది.  మా సమరయులు చూస్తే ఏదైనా గొడవ జరుగుతుందేమో అన్న భయం మీకులేదా ?  నన్ను చూసి   నవ్వుతూ శాంత వదనులై మాట్లాడుతున్నారు ( ఒకింత చెవులు నిక్కించి వింటున్నట్లు నటించి సంబ్రమాశ్చర్యాలకు లోనై )

అయ్యా  ! ఏమిటి మీరంటున్నది (  మోకాళ్ళ పై కూలబడి ) ఏమిటి... ఏమిటీ..నేను వినేది నిజమేనా .   నాకు ఐదుగురు భర్తలని  ఆరవ భర్తతో ఉంటున్నానని  అంటున్నారా ! నాకు తప్ప మరెవరికీ  ఈ అంతరంగిక విషయం తెలియదు. మీకెలా తెలిసింది. నా అంతరంగ రహస్యాలు మీకెలా తెలిసాయి నమ్మలేకపోతున్నాను ?. నా అంతరంగ రహస్యాలు తెలిసేది దేవునికే కదా ! నేను నమ్మలేకుండా ఉన్నాను. మీరు సామాన్యులుగా కనబటంలేదు .సాక్షాత్తు దైవస్వరూపులుగా ఉన్నారు. నిజం చెప్పండి ఎవరు మీరు ?

  చూస్తుంటే మీరు సమరయుల పట్ల ప్రేమ జాలి కలిగి ఉన్నట్లు ఉన్నారు . పాపులను క్షమించే వారిగా ప్రేమించే వారిగా కనబడుతున్నారు . యూదులు గొప్పవారు కదా ఈ సమరయస్ర్రీ ఇచ్చే నీరు నిజంగా త్రాగుతారా!  నిజం చెప్పండి (ఏదో ఆశ్చర్యంగా అర్దంకానట్లు ముఖం పెట్టి )

ఏంటి జీవజలములా   ..జీవజలములు..ఇస్తారా?  ఏమిటి మీరనేది తోడుకోడానికి చేదలేదు కదా మీ దగ్గర , మరి నాకు జీవజలం ఎలా ఇస్తారు? మీ మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగుతుంది.  అసలు మీరు ఎవరు ? మీ పేరేంటి ? నా పాపాలు తెలిసేది దేవునికే కదా. .మీరు ఎవరో తెలుసుకోవాలని ఉంది. 

 ఈ రోజు నా హృదయమెందుకో భారంగా ఉంది.   మీతో మాట్లాడుతుంటే  హృదయంలో పశ్చత్తాపం కలుగుతుంది . మిమ్ములను చూస్తున్నా , మీ మాటలు వింటున్నా నిత్యజీవం, నిత్యరక్షణ,నిత్యరాజ్యం లోకి పిలుస్తున్నట్టు ఉంది. మన తండ్రి అయిన యాకోబు కంటే మీరు గొప్పగా ఉన్నారే . పాపుల రక్షకుడు మెస్సయ్య వస్తాడని లేఖనాలలో తెలుసుకున్నాను. ఆయన కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఇంతకూ మీరు ఎవరో చెప్పటం లేదు ?  (  కొంతసేపు ఆగి వినినట్లు నటించి )

అయ్యా ! ఏమిటి మీరంటున్నది.మనం అందరం దేవుని వారసులమా .ఆయన ఇచ్చు రక్షణ అందరికీ సమానమేనా ,యూదులని ,సమరయులని,పాపులని ,నీతిమంతులని భేదాలే లేవా  అందరికీ ఆయన రక్షణ ఇచ్చేవాడు ఉన్నాడా !

అయ్యా !  (   రోదిస్తూ )  ఎన్నో పాపాలు చేసాను, విగ్రహారాధన చేసాను, నన్ను క్షమిస్తాడా!  ఈ పాపిని క్షమిస్తాడా వచ్చే మెస్సియ్యా ( గుక్కపట్టి ఏడుస్తుంది   ) పాపపు జీవితమని తెలిసీ తప్పులు చేసాను . ఇహలోక వాంచలకు లొంగిపోయాను . నేను ఘోర పాపిని ...ఘోర పాపిని ( దుఃఖపడి కొంతసేపటికి తేరుకుని  లేచి నిలబడి దీన వదనురాలై )

అయ్యా  మీ పేరు ఏంటో చెప్పనేలేదు?               ( మెస్సీయ అని పేరు వినగానే ఆశ్చర్యం తో పరవశురాలై దిగ్బ్రమ చెంది స్దానువురాలై ) 

ఏమిటి  మెస్సయ్య  ! లోకరక్షణార్దం ఈ భువిలో వెలసే మెస్సియ్యె నా మీరు . మేం ఎదురు చూసే మెస్సయ్య మీరేనా  ! అయ్యా నన్ను మన్నించండి!ఈ పాపిని క్షమించండి! అయ్యా మీరు నన్ను అమ్మా అని పిలుస్తున్నారా ! నేను ధన్యురాలని అయ్యా ధన్యురాలిని !   

పాపపు ఊబిలో దిగజారిన నా బ్రతుకులో అశాంతి ఊపిరాడనివ్వడంలేదు .దూరంనుంచి చూసినప్పుడే అనుకున్నాను ఈ పాపపు బ్రతుకు ఇక ముగియబోతుందని. గొంగళి పురుగు లాంటి నా జీవితం మీ చల్లని మాటతో రెక్కలు తొడిగింది.....అయ్యా నా పాపపు జీవితాన్ని విడనాడి ఈనాడే రూపాంతర అనుభవం పొందుతాను . మీరు ఇస్తానన్న జీవజలం పొందుతాను . ( కంగారు నటిస్తూ కనులు తుడుచుకుంటూ )

అయ్యా ఇక్కడే ఉండండి  . మీరు అస్సలు కదలోద్దు . నేను పోయి మా ఊరి వారందరికీ    పాపుల రక్షకుడు వచ్చాడని   చెప్పి వస్తాను.  ఇక్కడే ఉండండి ....ఇక్కడే ఉండండి  ( అని కూజాను విడిచి ఊరివైపు వెళుతూ  .....కంగారుగా నటిస్తూ..... పరిగెడుతూ వెనక్కి వస్తూ  ఏమి పాలుపోని దానివలె  ఆనంద పరవశురాలై నవ్వుతూ   )

మెస్సయ్య వచ్చాడని   పాపాలతో కొట్టుమిట్టులాడుతున్న మా సమరయులందరికీ చెప్పాలి . అంటరానివారిగా చూడబడుతున్న మా సమరయ జనాంగాన్ని ఇంట చేర్చుకునే స్నేహితుడు వచ్చాడని చెప్పాలి  మెస్సియ్య పరిశుద్దమైన మాటలు వినడానికి రమ్మని స్వయంగా పిలుస్తాను . ప్రభు  రాకను ప్రకటిస్తాను . ధన్యురాలిని మెస్సియ్యా . ధన్యురాలును ఈ సమరయ స్ర్రీ ఇక నుండి పాపాలను విడిచి రక్షణ పొందిన విశ్వాసురాలని ప్రకటిస్తాను. నేను మెస్సియ్య ఇచ్చే జీవజలములు పొందానని కేకలు వేసి మరీ చెపుతాను  ఊరి వారందరికీ ఈ శుభవార్త చెప్పాలి మన పాపాలను పరిహరించడానికి మెస్సియ్య వచ్చాడని తెలుపుతాను  పాపపు కడవను మోసిన ఈ సమరయ స్ర్రీ  తన హృదయంలో జీవజలము బావిని పొందిందని సాక్ష్యమిస్తు బ్రతుకుతాను  ..... హల్లెలూయ ( సంతోషకరమైన నవ్వు ..... ఆనందబాష్పాలు )  .

Monday, August 26, 2024

 *నేను చరిత్రకారుడిని*

*నేను మాదిగ చరిత్రకారుడిని*

నన్ను చరిత్రకారుడిని చేసిన మందకృష్ణకు వందనం పాదాభివందనం

అరకోటి మాదిగలలో నేను చరిత్రకారుడిని బక్కపలచని వ్యక్తి కంచు కంఠంతో రిజర్వేషను దోపిడీని ప్రశ్నిస్తూ ఎ బి సిడి అంటుంటే మాదిగ వెలుగులు ఊహించిన చరిత్రకారుడిని నేను

డమ డమ డప్పుల శబ్దం దేశం నలుమూలలా మ్రోగిస్తున్నప్పుడే గొంతు సవరించుకున్న చరిత్రకారుడిని నేను 

నేను మాదిగ చరిత్రకారుడిని నేను

మాదిగ పదం మలినం అంటున్న రోజుల్లో మాదిగ పల్లెల్లో ఎండుకక్కలవాసన,మూలగుల జుర్రుడు చప్పుడు వినటానికి ఎదురెళ్ళిన చరిత్రకారుడిని నేను  నేను మాదిగ చరిత్రకారుడిని నేను

చిమ్మ చీకటిలో చుట్ట కాలుస్తూ దిగులుగా పడుకున్న సమాజానికి మహానీయుడు కబురును చెప్పి లేపి నడిపించిన చరిత్రకారుడిని నేను

నేను మాదిగ చరిత్రకారుడిని నేను

తొలితరం నాయకుల గొంతులకు చప్పట్లుకొట్టి పాటలు కట్టి డప్పు చరిచి చిందులు వేయించిన చరిత్రకారుడిని నేను నేను మాదిగ చరిత్రకారుడిని

పొరాటం పోతూ ఉంటే సిగ్గుపడి ఇంటిలో దూరిన వాడిని కాను,రూపాయి దాచుకున్న మనిషినీ కాదు నేను మాదిగ చరిత్రకారుడిని నేను

నన్ను చరిత్రకారుడిని చేసిన మందకృష్ణ అన్నకు వందనం పాదాభివందనం

సుప్రీంకోర్టు తీర్పులో నా శ్రమకావ్యం ఉందన్న  ఊహ పులకించిపోతుంది నేను నా రూపాయిని దాచుకోలేదు అందుకునేను చరిత్రకారుడిని నేను

నేను మాదిగ చరిత్రకారుడిని

నెలల పిల్లాడిని బాలింత భార్యను వదిలి

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్దిల్లాలి

అంటూ  ఉరుకురికి పోయిన చరిత్రకారుడి నేను 

నేను మాదిగ చరిత్రకారుడిని

కారు చీకటి ఇరవై యేళ్ళు కమ్మేస్తే ఎదిగన నా కొడుకునీ  నాతో పోరాటానికి తీసుకుపోయిన చరిత్రకారుడిని నేను

 *నేను మాదిగ చరిత్రకారుడిని నేను*







Sunday, June 16, 2024

 

గోప్యతని దృష్టిలో ఉంచుకుని యాప్‌లో అనేక గోప్యతా ఆధారిత ఫీచర్‌లు కూడా అందించబడ్డాయి. అలాంటి ఒక ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్. దీని కారణంగా, రిసీవర్, పంపిన వారి చాట్‌ల నుండి మేసేజ్ లు డిలీట్ అయిపోతాయి.

కానీ, ఇది తొలగించబడిన మేసేజ్ ల జాడను వదిలివేస్తుంది. కొన్ని మేసేజ్ లు పంపబడినట్లు, తొలగించబడినట్లు చూపుతుంది. చాలా మంది డిలీట్ అయిన మెసేజ్ లలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడం ప్రమాదకరం. అందువల్ల Android ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు చూద్దాం, దీని ద్వారా తొలగించబడిన మెసేజ్ లను చదవవచ్చు.

తొలగించబడిన టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే దీని ద్వారా చెక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఫోటోలు లేదా ఆడియో సందేశాలకు ఉపయోగపడదు. అలాగే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11, అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

డిలీట్ అయిన మెసేజ్ లను ఇలా చదవండి:

ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

తర్వాత నోటిఫికేషన్‌లపై నొక్కండి.

దీని తర్వాత మరిన్ని సెట్టింగ్‌లకు(More settings) వెళ్లండి.

ఆపై నోటిఫికేషన్‌ల చరిత్రకు(Notifications history) వెళ్లండి.

ఆపై స్క్రీన్‌పై కనిపించే టోగుల్‌ను ఆన్ చేయండి.

ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, మీరు మళ్లీ Nnotifications ద్వారా నోటిఫికేషన్‌ల హిస్టరీకి వెళ్తారు. దీని ద్వారా మీరు 24 గంటల్లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసేజ్ లను చూస్తారు.

 ఏప్రిల్ 17, 2023న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారు కడ్డీలు, విదేశీ కరెన్సీని మోసుకెళ్లే ఎయిర్‌కార్గో కంటైనర్‌లో నకిలీ పత్రాలను ఉపయోగించి సురక్షిత నిల్వ కేంద్రం నుంచి దొంగిలించబడిందని పోలీసులు తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి టొరంటోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీలు వచ్చింది. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన కాసేపటికే, కార్గోను ఆఫ్ లోడ్ చేసి ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. కానీ ఆ మరుసటి రోజే అది కనిపించకుండా పోయిందని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఆరోజున 6600 బార్‌ల 9999 శాతం స్వచ్ఛమైన బంగారం 400 కిలోగ్రాములు.. 20 మిలియన్ కెనడా డాలర్లు, 5 మిలియన్ల విదేశీ కరెన్సీని ఎయిర్‌పోర్ట్‌లోని ప్రత్యేక ప్రదేశానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Friday, April 19, 2024

 రాచరికపు ఆనవాలు

అందనంత అనంత లోకాలకు పోయింది

రాజకీయ ఓనమాలు

అనంతవాయువుల్లో సేదతీరుతుంధి

రావు రాజుల మీసాలు

మెలివేకుని మెలివేసుకుని అలసిపోయాయి

దవళవర్ణపు దోతీలు

బీరువాలలో దిక్కులేక దుఖిఃస్తున్నాయి

చోక్కా చాటున చిక్కాలు

రోజూ సృశించే దాతృత్వపు చేతులకోసం ఎదురుచూస్తున్నాయి

సాంగత్య సమూహాలు

బిక్కు బిక్కుమంటూ గుండెలు 

అలిసేలా రోదిస్తున్నాయి

కొత్తపల్లి రాజకీయ ప్రభలు

ఉన్నపళంగా గుప్పున ఆరిపోయాయి

పెద్దరికపు గౌరవ చిహ్నాలు

గోడల చిత్రపటాలకే పరిమితమైపోయాయి

రాజకీయ రణరంగ చతురతలు

నడిపే సారధిలేక మూలన కూలబడ్డాయి

అల్పాహార విందులు

వెన్నువిరిగి గిల గిలలాడుతున్నాయి


రాచరికపు ఆనవాలు

అందనంత అనంత లోకాలకు పోయింది

రాజకీయ ఓనమాలు

అనంతవాయువుల్లో సేదతీరుతుంధి

రావు రాజుల మీసాలు

మెలివేకుని మెలివేసుకుని అలసిపోయాయి

దవళవర్ణపు దోతీలు

బీరువాలలో దిక్కులేక దుఖిఃస్తున్నాయి

చోక్కా చాటున చిక్కాలు

రోజూ సృశించే దాతృత్వపు చేతులకోసం ఎదురుచూస్తున్నాయి

సాంగత్య సమూహాలు

బిక్కు బిక్కుమంటూ గుండెలు అలిసేలా రోదిస్తున్నాయి

కొత్తపల్లి రాజకీయ ప్రభలు

ఉన్నపళంగా గుప్పున ఆరిపోయాయి

పెద్దరికపు గౌరవ చిహ్నాలు

గోడల చిత్రపటాలకే పరిమితమైపోయాయి

రాజకీయ రణరంగ చతురతలు

నడిపే సారధిలేక మూలన కూలబడ్డాయి

అల్పాహార విందులు

వెన్నువిరిగి గిల గిలలాడుతున్నాయి



























విజయ్ సినిమా

గుండుబోయిన రఘునందనరావు  అన్నదమ్ములు అందరూ ఒకేచోట నివసిస్తున్నారు.రఘునందనరావు తన వంశీకుల పత్రాలను కాపాడుతూ ఉంటుంటాడు.సంక్రాంతి పండగకు ఇల్లంతా సందడిగా ఉంటుంది .బోగి మంటల్లో రఘునందనరావు తల్లి కాగితాలను కాలుస్తూ చలిమంట కాగుతూ  ఉండటం చూస్తాడు .గబగబా తను దాచిన పత్రాలను వెతుకుతాడు కనబడవు.తల్లి తనెంతో భద్రంగా దాచిన వాటిని మంటల పాలుచేసిదని ఆవేశంగా బోగి మంటల కట్టేలతో కొడతాడు .తల్లి భోగిమంటల్లో పడి చనిపోతుంది.ఇంతలో పత్రాలున్న తోలు సంచి తెచ్చి భార్య మంగాదేవి ఇల్లు సర్దుతూ దాచిన సంగతి చెప్పి రఘునందనరావుకు ఇస్తుంది.తను చేసిన పనికి తలబాదుకుని ఏడుస్తుంటాడు. పండగకు వచ్చిన తమ్ముళ్ళు ఆవేశం పట్టలేక రఘునందనరావుని తుపాకీతో కాల్చి చంపేస్తారు.అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటారు.ఇల్లు వల్లకాడవుతుంది. గుండుబోయినవారి ఆడవాళ్ళు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరిచేత పట్టుకుని కొంతమంది తప్పించుకుని పారిపోతారు.ఇల్లు మంటల్లో తగలబడిపోతుంది.

80 సంవత్సరాల తరువాత

ఆ ఇల్లును కొంటాడు చెత్త పాతసామాన్లు వ్యాపారం చేసే హనుమంతు . ఇల్లు శుభ్రంచేస్తూ కొడుకు వీరేష్ ఓ తోలు సంచిలాంటిది చెక్కపెట్టెనుండి తీసి పాతసామాన్లు కొనే వాడికి అమ్మేస్తాడు.ఆ తోలు సంచి తిరిగి తండ్రి హనుమంతు దుకాణం చేరుతుంది.

జీవితంలో ఆటు పోట్లను తట్టుకుని విధి లీలలకు బలైన తండ్రి కొడుకులు.ఇద్దరు చెళ్ళుళ్ళు.

తండ్రి హనుమంతు పాత సామాన్ల దుకాణం నడుపుతూ పనిచేస్తూ ఉంటాడు. కొడుకు వీరేష్ బాగా చదువుకున్నా చెళ్ళిళ్ళ పెళ్ళి భాధ్యతలకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు.ఇద్దరూ కలిసి సంపాధించిన సొమ్ముతో ఓ పాత ఇల్లు కొనుక్కుంటారు. అదే రఘునందనరావు ఇల్లు చేతులు మారి మారి హనుమంతుకు చేరుతుంది

చెళ్ళిళ్ళను కాలేజికీ దిగబెట్టి ఆటోలో కొట్టుకు పోతుంటాడు రోజూ వీరేష్. వీరేష్ బందువులందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు . హనుమంతు పరిస్దితికి బందువులు సరైన గౌరవం ఇవ్వరు.రోడ్డు పైనయితే అసలు పలుకరించరు.వేడుకలలో సరేసరి.

అవమానాలు వారికి మామూలైయ్యింది. అలవాటు చేసేసుకున్నారు.మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి కొడుకులు.వీరేష్ సరదా మనిషి, ఎంత అవమానించినా పోనీలే మన పరిస్దితి ఇంతే అనుకుని వీరికి దేవుడే బుద్ది చెపుతాడనుకునే మనిషి. ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఓ అమ్మాయిని ఇష్టపడతాడు కూడా.తనతో ఆటలు పాటలు .

ఓ సాయంత్రం వచ్చిన పాత సామాన్లు పేపరులో తోలుతో చుట్టిన పాత కాగితాల కట్ట కనిపిస్తుంది తండ్రి హనుమంతుకు. మామూలూగా చిన్నపాటి విలువైనవి ప్రక్కన పెట్టి వేరే రేటికి అమ్ముతూ ఉంటాడు హనుమంతు.అలాంటివి ఓ వీధి రౌడీ కొంటూ ఉంటాడు. అలా ప్రక్కన పెట్టిన కాగితాల కట్టను ఇంటికి తీసుకువెళతాడు. పిల్లలు నిద్రపోతున్నప్పుడు కట్టను విప్పి కాగితాలను చదువుతున్నప్పుడు ఓ విలువైన కాగితం ఆశ్చర్యపరుస్తుంది.మిగతా కాగితాలు విలువైనవిగా కనబడతాయి కూడా. అవి బద్రపరుస్తాడు. 

ఉదయం కొట్టుకెళ్ళినప్పుడు పాత సామాన్లు కొనే వీధి రౌడి దగ్గర పనిచేసే పైడిరాజు అనేవాడు నిన్న అమ్మే వాటిలో  ప్రక్కన పెట్టింది ఏమిటి వివరాలు చెప్పమంటాడు.హనుమంతు చెప్పడు .వెళ్ళి వీధి రౌడీతో చెపుతాడు పైడిరాజు. వీధి రౌడీ వచ్చి అల్లరి చేస్తాడు.ఎక్కడో ఉన్న కొడుకు వీరేష్  రౌడీలను సర్ది చెప్పి పంపిస్తాడు.తండ్రిని కారణం చెప్పమంటాడు వీరేష్ . తండ్రి చెప్పడు.

హనుమంతు రోజూ రాత్రుళ్ళు  పేపర్లు చదవడం. ఉదయమే పొరుగూర్లు పోవడం.కొట్టు పని వీరేష్ మీద పడేసి పోతుండటం చేస్తుంటాడు. వీరేష్ తండ్రి చేస్తుందేమిటో అర్దం కాక తలపీక్కుంటాడు.

సామాన్లు కోనే పైడిరాజు  కొట్టులో లేకుండా హనుమంతు రోజూ పొరుగూర్లు తిరగడం ఏదో ఉందన్న విషయం వీధి రౌడీకి చెపుతారు. వీధి రౌడీ హనుమంతుని ఫాలో అవుతాడు.అదే సమయంలో వీరేష్  తండ్రి ఎక్కడికి పోతున్నాడో తెలుసుకోవాలని వెనకే వెళతాడు.

వెంకటాపురం గ్రామంలో ఓ ఇంటి ముందు బాగా వృద్దురాలైన ఆడ మనిషితొ మాట్లాడుతూ ఉండగా వీధి రౌడీ వాహనాలతో చుట్టిముట్టి ఘర్షణ పడి హనుమంతుని ఇష్టాను సారం కొడుతుంటే మధ్యలోకి వెళ్ళి హనుమంతుని రక్షించబోతాడు వీరేష్ .ఓ రౌడీ కత్తిపుచ్చుకుని హనుమంతుని పొడి చేస్తాడు.

కంగారు పడిన వీరేష్  తండ్రిని తీసుకుని పట్నంలోని ఆసుపత్రకి తీసుకువస్తాడు. హనుమంతు కొడుకు వీరేష్ కు రహస్యం చెప్పబోయి చనిపోతాడు.

తండ్రి కర్మకాండలు పూర్తి చేసిన వీరేష్ కు హఠాత్తుగా ఒకటి గుర్తుకు వచ్చి బైకుపై కంగారుగా వెంకటాపురం వైపు పోతాడు.

అక్కడ ముసలావిడ చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. ఆ ఇంటి వాళ్ళు ముసలావిడతో మాట్లాడడానికి ఒప్పుకోరు. అందులో పెద్దాయన నేను ప్రక్కన ఉంటాను మీరు అందరూ బయటకు పొండి అని తలుపు దగ్గరకు వేసి మాట్లాడమంటాడు. ముసలావిడ అతి కష్టంమీద హనుమంతు చెప్పింది చెపుతుంది. ముసలావిడ బందువు పెద్దాయన కూడా వింటాడు. అది విన్న వీరేష్ ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చి చూసే సరికి రౌడీలు ఇల్లంతా చిందరవందరచేసి ఇంటికి నిప్పు పెట్టేసి పోతారు.చెళ్ళిళ్ళు ఇల్లు తగలబటం చూసి ఏడుస్తూ ఉంటారు. తగలబడే ఇంటిలోనికి వీరేష్ వెళ్ళి తండ్రి రోజూ చదివే కాగితాలున్న తోలు సంచిని వెతికి పట్టుకుని బయటకు వస్తాడు. చెళ్ళిళ్ళను తోలుసంచిని తీసుకుని  తగలబడుతున్న ఇంటిని వదిలి భారంగా పట్నం వైపు బయలుదేరతాడు.హైదరాబాదు వీరికి ఆహ్వానం పలుకుతుంది .

బిజెనెస్ మాగ్నేట్  రావు మాధవరావు బొంబాయి నగరాన్ని శాసించే సత్తా కలిగినవాడు. అతని చేయని బిజినెస్ లేదు.రాజకీయ నాయకులతో నిత్యం ఢీల్స్ చేసే వ్యక్తి.

హైదరాబాదులోని అతని కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు

 వీరేష్ .చెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తాడు. పెళ్ళిళ్ళకు రమ్మని బందువులను ఆహ్వానించినా రారు. పెదవి విరుస్తారు. పెళ్ళిళ్ళలో  రావు మాధవరావు కూతురు వీరేష్ తో టచప్ పెట్టుకుని మనసు పెంచుకుంటుంది. వీరేష్ భాధ్యతలు తీరడంతో  తండ్రి వదిలిన కార్యం పై దృష్టి పెట్టి ఫైలు తీస్తాడు.

వెంకటాపురం వెళ్ళి చనిపోయిన ముసలావిడ బందువును కలుస్తాడు. వివరాలన్నీ చెప్పి తను కూడా తీసుకువచ్చిన కాగితాలు ఆధారం చూపిస్తాడు.తను సహకరిస్తానంటాడు. అతని పేరు రామరాజు .రామరాజు వీరేష్ ని తీసుకుని వెళ్ళి తన బందువులందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు.రామరాజుని బందువులను ఎతైన కొండ పైకి తీసుకువెళ్ళి తను చేయబోయేది చూపిస్తాడు వీరేష్ .

వీరేష్  స్నేహితుడు రాఘవ టీ కేఫ్ లో కలుస్తాడు. తనని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. తను చేయబోయే ప్రాజెక్టులో సహకరించమని కోరతాడు. 

హీరోయిన్ తో రొమాన్సు జరుగుతుండగా

MRO గా పని చేస్తున్న మిత్రుడు కలుస్తాడు వీరేష్ కు.తన దగ్గర ఓ సమాచారముందని దానికి సహాయం చేయమని కోరతాడు. స్నేహితుడు mro  మల్లేష్  ఒప్పుకుంటాడు.

అదే రోజు సాయంత్రం వీరేష్ మల్లేష్ ఇరువురూ కలుస్తారు.

తోలు సంచి విప్పి కాగితాలు చూపిస్తాడు.

కాగితాలు చదువుతున్న మల్లేష్ కు బుర్ర తిరిగిపోతుంది.ఇది నిజమా అబద్దమా అంటూ

వీరేష్ ను నువు దాస్తుంది ఏంటో తెలుసా ఓ పెద్ద నిధి తాలూకు సమాచారం. అది విన్న వీరేష్ నిధి ఎక్కడుంది అని అడుగుతాడు. మల్లేష్ నిధి కాదు నిధి కంటే గొప్పది అని నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను అంటు షేక్ హేండ్ ఇస్తాడు. రేపే మన పని మొదలు పెడుతున్నామంటూ బయలు దేరతారు.

 లేండ్ లార్డ్  వేల ఎకరాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్దాపించి ప్రభుత్వాలను కనుసన్నలలో నడిపించే రావు మాధవరావు అంటే వెంకటాపురం ప్రాంతాలలో హడల్ .చోటా మోటా రౌడీలు దారి తప్పిన అధికారులు తను విసిరిపారేసే మామూళ్ళకు బానిసలు.

ఆ సామ్రాజ్యాన్ని కూల్చడానికి బయలు దేరారు. అది వీరికీ తెలియదు . మాధవరావుకు తెలియదు .మల్లేష్ వీరేష్  ముందు వారు వేసుకున్న మొదటి ప్లేన్  వీరేష్ వెంకటాపురం mro  గా బదిలీపై రావడం.దానికి వాళ్ళ మిత్రురాలు జిల్లా కలెక్టరు మౌనికా శర్మను కలుస్తారు. తను వీరేష్ ను వెంకటాపురం MRO గా నియమిస్తుంది.

వెంకటాపురం వస్తాడు వీరేష్ .వీరేష్ రావడం 

రౌడీ గ్యాంగ్ కి తెలిసి పోతుంది. రహస్యంగా వీరేష్ ఏం చేస్తున్నాడో గమనిస్తారు . రైతు రామరాజు ఇంటికి వెళ్ళి మంతనాలు చేయడం గమనిస్తారు. ఈ విషయం స్దానిక రౌడీ మూకద్వారా మినిష్టర్ వాసూరావుకు తెలుస్తుంది. అందరినీ ఓ కన్నేసి ఉంచమని చెపుతాడు.

రైతు రామరాజు వీరేష్ చాలా మంది రైతు కుటుంబాలను కలసి మంతనాలు చేస్తారు. వీరేష్ చెప్పినట్టే కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు.వీరేష్ పనిని మల్లేష్ కు అప్పజెప్పి హైదరాబాదు వచ్చేస్తాడు. మల్లేష్ రైతు రామరాజును తీసుకుని బయలు దేరతాడు.

రావు మాధవరావు మినిస్టర్ వాసూరావు

రోజువారి సిట్టింగ్ లో మాదవరావు వాసూరావును అడుగుతాడు వెంకటాపురంలో ఎవడికోసమో వెతకమన్నావట నాకు చెప్పకూడనిదా అంటాడు. అదేం లేదు సమయం వచ్చినప్పుడు చెపుతానంటాడు. వాసూరావు మీద చిందులేస్తాడు మాధవరావు.

హైదరాబాదు చేరుకున్న మల్లేష్ వీరేష్ ను కలసి వీరేష్ ఇచ్చిన సమాచారం మేరకు వాటి వివరాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న ఆధారంతో మొత్తం రికవరీ చేసుకునే వీలుంది అంటాడు.

వీరేష్ , Mro ,  రైతు రామరాజు మాధవరావు పొలాలలోనికి పోయి మాట్లాడు కోవడం  ఈ విషయం మాధవరావుకు తెలుస్తుంది



Sunday, February 18, 2024

 అది మారుమూల కొండ ప్రాంత ఆ గ్రామం జగ్గంపేట.అక్కడ ఒక కాన్వెంట్ నడుస్తూ ఉంది.లిల్లీ గ్రేస్ ఆ కాన్వెంట్ ప్రిన్సిపాల్ .  ప్రిన్సిపల్ లిల్లీ గ్రేస్ చాలా స్ట్రిక్ట్ .

 అదే ఊర్లో ఈ యువకుడికి పాలు పోసే అమ్మాయి కృష్ణవేణి పరిచయం పెంచుకుంటుంది కృష్ణవేణికి తల్లిదండ్రులు లేరు చిన్నాన్న దగ్గర పెరుగుతూ ఉంటుంది చిన్నమ్మ బాధలు పడతా ఉంటది అయినప్పటికీ నవ్వుతూ చలాకీగా గ్రామంలో బాధలు భరిస్తూ సంతోషంగా ఉంటారు కృష్ణవేణి చలాకితనం నచ్చిన స్కూల్ టీచర్ మధుబాబు ఆమెను ప్రేమిస్తాడు కృష్ణవేణి కూడా ప్రేమిస్తే కృష్ణవేణి ప్రేమని తెలుసుకున్న చిన్నమ్మ ఇంట్లో చాలా బాధలు పడుతది మరియమ్మ మధుబాబు కృష్ణవేణి ప్రేమను గమనిస్తూ ఉంటుంది కృష్ణవేణి చిన్నాన్న మధుబాబు ప్రేమనే చాటింగ్ గమనిస్తూ ఉంటాడు మనసులో ఇద్దరి ప్రేమలే అంగీకరిస్తాడు ఆయన ఏ ఊరిలో దూరపు చట్టమైన వెంగళరావు మధుబాబు కృష్ణవేణి ప్రేమలని మధుబాబుని హెచ్చరిస్తాడు వెంగళరావు స్కూల్ చెరపట్టాలని ప్రయత్నిస్తా ఉంటాడు వాగులు ప్రేమ ముదురుపోద్ది అది సహించని కృష్ణవేణి చిన్నమ్మ ఊర్లో ఉన్న వాళ్ళ చుట్టాల దగ్గర పోయి కృష్ణవేణి పరువు తీస్తుంది మధుబాబుని ఎలాగైనా సరే ముట్టు పెట్టాలని ప్రయత్నిస్తది ఈ విషయం అన్న చిన్నాన్న ఇద్దరినీ కార్యక్రమం ఇద్దరినీ పారిపొమ్మని చాటుగా ఇద్దరినీ రైలు ఎక్కించేస్తాడు ఇద్దరూ రైలు ఎక్కి హిందీ మాట్లాడుకునే ప్రాంతం ఎల్లిపోతారు ఏరా ట్రైన్ ఎక్కిన తర్వాత మధుబాబు బ్యాగు చూసుకుంటే బ్యాగులో పిల్లల పేపర్ కట్టలు ఉండిపోతాయి పేపర్ కట్ లో ఇవ్వకపోతే ప్రిన్సిపల్ ఇబ్బంది పడతాదని బాధపడతాడు పేపర్ కట్టాలని జాగ్రత్తగా పెడతాడు మధుబాబు లో ఒక చిన్న ఫ్యాక్టరీలో కూలికి కుదురుతారు అక్కడ అమ్మాయి ఇద్దరికీ పరిచయం అవుతుంది ఇద్దరినీ ఆదరిస్తుంది అక్కడ వాళ్ళు అలా ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండగా ఊర్లో విషయాలు ఎలా ఉన్నాయని తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు మాట్లాడుతూ మాట్లాడుతూ హెడ్ మాస్టారు పేపర్ కట్టలే ఒక హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేశారు అన్న విషయం తెలుస్తుంది పేపర్ కట్ లో కూడా తీసుకొచ్చిన అంత ఎంతో బాధపడి మధుబాబు నాగన్న ప్రిన్సిపల్ ఉద్యోగం తిరిగి చేసేలా చేయాలని ప్రయత్నించకు బయలుదేరుతాడు కృష్ణవేణి మూగమ్మాయి దగ్గర అప్పగించి రైలు ఎక్కుతాడు


రామాపురం చేరుకున్న మధుబాబు కట్టలని ప్రిన్సిపాల్ కి అందజేస్తాడు ఈ విషయం తెలిసిన కృష్ణవేణి చిన్నమ్మ మధుబాబుని పట్టు బంధిస్తుంది ఆ గ్రామంలో భూస్వామి ప్రిన్సిపల్ మరియమ్మ గమనించి ఇదే సమయంగా మరియం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు మరియమ్మ పిల్లల్ని భూస్వామికి అప్పగించడానికి మధుబాబుని వదిలేయమని ప్రాధేయపడుతుంది కృష్ణవేణి చిన్నమ్మకు మాయ మాటలు చెప్పి భూస్వామి మధుబాబుని వదిలేస్తాడు మరియమ్మనే అనుభవిస్తాడా కృష్ణవేణి చిన్నమ్మ భూస్వామి చేసిన పనిని పసిగట్టి బాబుని పట్టుకుంటానికి జనాలనిపిస్తుంది ఎలాగోలాగా తప్పించుకునే రైలు ఎక్కిస్తాడు

అక్కడ మూగమ్మాయి దగ్గర ఉన్న కృష్ణవేణిని ఆ ఫ్యాక్టరీ యజమాని చరబట్టాలని చూస్తాడు ఎక్కడ మూగమ్మాయి నోరు విప్పి మాట్లాడుతుంది మాట్లాడటం ఆశ్చర్యపోయిన కృష్ణవేణి తెలుగు అమ్మాయి అని సంతోషిస్తుంది మూగమ్మాయి తన కథను చెప్తుంది ఇలాగే ప్రేమించి నమ్మించి తీసుకొచ్చి విషయం చెబుతూ నీ భర్త కూడా మధుబాబు కూడా అలా చేశాడని చెప్పి నమ్మిస్తుంది మధుబాబు మీద కృష్ణవేణికి కోపం పెరుగుతుంది తన ఊరికి పంపించమని సహాయం చేయమని కోరుతుంది కృష్ణవేణి ఈ విషయం తెలిసిన ఫ్యాక్టరీ యజమాని కృష్ణవేణి నేను పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు మూగమ్మాయి యాజమాన్యం నుంచి నేను తెప్పించే ట్రైన్ ఎక్కిస్తుంది

కృష్ణవేణి ఎక్కిన ట్రైన్ మధుబాబీ ట్రైను ఒక ఊరి దగ్గర గురవుతాయి అక్కడ వందలాది సవాల్లో కృష్ణవేణి మధుబాబు లో శవాలు కూడా ఉంటాయి ఈ శవాలను కూర్చోపెట్టే క్రమంలో కృష్ణవేణి మధుబాబుల సవాల్ ని చేస్తా సవాలను బూతులోకి విసిరేస్తారు ఆ సేవలో పూడ్చివేత కార్యక్రమంలో పాల్గొన్న మధుబాబు స్నేహితుడు కృష్ణవేణి మధుబాబు శవాలను గుర్తుపడతాడు కృష్ణవేణి మధుబాబులు మెలకువలోకి వచ్చి ఒకరినొకరు గుర్తు పెట్టి ఆ బూతులు ఏడుస్తా ఉంటారు ఈలోగా పోర్చడానికి ప్రక్కలైనారు వచ్చేసి మట్టిని తోసేస్తుంది మట్టి పడుకోవడంతో ఉన్నటువంటి ఎమ్మార్వో ని తన స్నేహితుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ప్రాధేయపడతాడు వెంటనే అక్కడ నుంచి కృష్ణవేణి మధుబాబును తీసి కృష్ణవేణి మధుబాబుల ప్రేమ సుఖాంతం అవుతుంది

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...