Sunday, April 5, 2026
Saturday, April 4, 2026
జయహో అమరావతి
జయహో అమరావతి
గీత రచన
బెన్ జాన్సన్
బాలసాహితీ రచయిత
ఆంధ్రుడా అదిగదిగో
చూడవోయి
మన ఆంధ్రుల రాజధాని అమరావతీ
జయహో
జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధానీ
మా అమరావతి
జయహో జయ జయహో
జయహో జయజయహో
అమరావతీ
ఆంధ్రుల పురోగతి నీవే
ఓ పూర్ణకుంభం ధారి
మా అమరావతి
నీ పేరు నిలవాలి
ఆ చంద్రతారార్కం
నీ కీర్తి అజరామరం
నీ కీర్తి ఇక అజరామరం
తరతరాల నీ పాలన
ఆంధ్రులకు నవజీవనం
జయహో
జయ జయహో అమరావతి
ఆంధ్రుల విజయశిఖరం
మా అమరావతి
జయహో
జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధాని
మా అమరావతి
ఆంధ్రుల పురోగతి
మా అమరావతి
అభిమాన ధని
మా అమరావతి
నీ పేరు నిలవాలి
ఆ చంద్రతారార్కం
నీ కీర్తి అజరామరం
నీ కీర్తి ఇక అజరామరం
తరతరాల నీ పాలన
ఆంధ్రులకు నవజీవనం
జయహో జయ జయహో
జయహో జయ జయహో
నాగార్జునగిరి సిగన
మా మల్లె పూదండ
మా అమరావతి
నాగార్జునగిరి సిగన
మా మల్లె పూదండ
మా అమరావతి
కృష్ణవేణి పాదాల
విరిబోణి మా అమరావతి
కృష్ణవేణి పాదాల
విరిబోణి మా అమరావతి
ఆంధ్రుల రాజధాని
మా అమరావతి
మా రాజధాని
అమరావతి
జయహో జయజయహో
అమరావతి
జయహో జయహో అమరావతి
వర్దిల్లు వర్దిల్లు అమరావతి
ఆంధ్రుల అన్నపూర్ణ అమరావతీ
తెలుగుజాతి అక్షరమై
చిరకాలం వర్దిల్లు వర్దిల్లు
బుద్దుని శాంతి పలుకులతల్లి
మా అమరావతి
రండి ఆంధ్రులారా
మన అమారావతి కీర్తిని పాడుదాం
రండి ఆంధ్రులారా
మన అమరావతి కీర్తిని పాడుదాం
జయహో జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధాని మా అమరావతి
Thursday, March 19, 2026
కొండేపూడి
ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజర్వేషను ఫలాలు ఏభై ఏళ్ళుగ 56 ఉపకులాలు కలిగిన షెడ్యూల్డ్ కులంలో ఒక వర్గమే ఎక్కువభాగం పొందుతుంటే రిజర్వేషను ఫలాలను పెరియార్ మహాశయుని స్పూర్తితో వెనుకబడిన కులాలు( బి సి ) వర్గీకరించుకున్న రీతిగానే మాకు వర్గీకరించండని మాదిగ జాతిలో కొందరు అరవైయవ దశకంలో గొంతు సవరించుకున్నప్పుడు అప్పుడే అడవుల్లో ప్రతిధ్వనించే ఓ కేక మందకృష్ణ రూపంలో శంఖారావం పూరిస్తుంటే యువ నాయకత్వం హృదయచెవులకు బలంగా వినపడింది. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర జిల్లాలన్నిటిలో సువిశాలమైనది.అమలాపురం నుండి కోటనందూరు వరకునూ,రాజమండ్రి నుండి రంపచోడవరం వరకు రాజకీయ చైతన్యం కలిగిన ప్రసిద్దజిల్లా.ఈ జిల్లా నుండి ఎందరో దోశోద్దారకులు జన్మించారు.కాని వారితొ పాటు ఓ జాతోద్దారుకుడు జన్మిస్తాడని కాలం కలగనలేదు.సాతంత్ర్య సముపార్జనలో భగత్ సింగ్ బాంబులు వేసినందుకు.అల్లూరి బ్రిటీష్ వారిని ఎదురించినందుకు.నెహ్రు జైలు జీవితం గడిపినందుకు వారు చేసిన ఒక్కొక్క త్యాగానికి వారిని స్మరిస్తుఉన్నాం మరి ఒక జాతోద్దరణకు జీవితం అర్పించి ముప్పై ఏళ్ళు కుటుంబాన్ని వదిలి లక్షలాది కీలోమీటర్లు పయనించి మిలెటెంటుగ మారి బస్సు దహనాలలో పాల్గొని జైలు జీవితం గడిపి అన్నీ అనుభవించిన మహోన్నతమూర్తిని ఆ జాతి ఎంత హృదయంలో పెట్టుకుంటుంది.మాదిగ జాతోద్దారకుడు కొండేపూడి శ్యాంబాబును యావత్తు మాదిగజాతి దిగ్గజనేతగ తమ గుండెల్లో నిలుపుకున్న చరిత్రను చదవడం ప్రతీ మాదిగ బిడ్డల కర్తవ్యం. కీ॥శే కొండేపూడి శ్యాంబాబు ( శ్యామన్న)చరిత చిరస్మరణీయం
కుటుంబ చరిత్ర
స్వతంత్ర వ్యక్తిత్వం గల నాయకుడు
దృశ్యాల దొంతర
ఉత్తణ్ణ
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
నీ మెడలో నల్లని వస్త్రం
అది ఉరుములు ఉరిమే కంఠం
నీ మెడలో నల్లని వస్త్రం
అది ఉరుములు ఉరిమే కంఠం
మందకృష్ణ రారా
మా మాదిగ విజయం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా ప్రేమను మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా.
మా ప్రేమను మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా.
మా గుండెల నిండా విజయం
ఉప్పొంగెను చూతువు రారా
మందకృష్ణ రారా
మా మాదిగ విజయం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్యకృష్ణ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
నుదుటిన తిలకం దిద్ది
నీ చేతికి గంధం పూసి
వీధి వీదుల హారతి పట్టి
నీ పల్లకి మోస్తాం రారా
నీ పల్లకి మోస్తాం రారా
మా నవ్వులు దండగ గుచ్చి
నీ మెడలో వేసేద రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పొగడి పాడెదరా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పొగడి పాడెదరా
కేరింతల గజ్జెలు కట్టి
మా నవ్వును దరువుగ చరిచి
కేరింతల గజ్జెలు కట్టి
మా నవ్వును దరువుగ చరిచి
నిను దీవిస్తున్నాం రారా
మా నవ్వులు పూలుగ జల్లి
నిను దీవిస్తున్నాం రారా
వీధి వీధిన హారతి పట్టి
నీ పాదం మా నెత్తిన పెట్టి
వీధి వీధిన హారతి పట్టి
నీ పాదం నెత్తిన పెట్టి
డప్పుల దరువులు వేసి
నిను దీవిస్తున్నం రారా
వీరబాహు చిందులు తొక్కి
నిను దీవిస్తున్నాం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్యకృష్ణ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా మాదిగ విజయం రారా
మా మాదిగ విజయం నీవేరా
మా మాదిగ విజయం నీవే నీవే నీవేరా
1874 ప్రాంతంలో మిషనరీలు వచ్చే వరకు విద్య సామాన్య జనానికి చేరువకాలేదని తెలిసిందే .అనేక అసమానతలు మబ్బుపట్టినట్లు కమ్ముకున్న సమయం. వీధి బడులు నిర్వహిస్తున్న చదువు ఎందుకు అవసరమేంటి అనే ఆలోచన బలంగా ఉన్న రోజుల్లో చదువుకి ప్రాధాన్యత లేని కాలంలో మిషనరీలు ఉవ్వెత్తున భారతావనిపై దండెత్తినట్టు నలుదిశలా తెలుగు నేలపై అడగిడడం ఓ నూతన శకారంభంగానే భావించాలి.మిషనరీలైన జాన్ మెక్లారిన్ మరియు స్మిత్ లు తూర్పుగోదావరిలో సామర్లకోట,పెద్దాపురం,పిఠాపురం,కాకినాడ,రామచంద్రాపురంలలో పాఠశాలలు చర్చిలు స్దాపించారు.1925 లో కొత్తపల్లి మండలంలో అమినాబాదలో పాఠశాల ను హానోకు మాస్టారుచే ప్రారంబించారు.
మెకంజీ సేకరించిన కఫియత్తుల్లో తొండంగి మండలం మనకు స్పష్టంగ కనబడుతుంది.11 వ శతాబ్దం నుండి అక్కడ గ్రామాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది.శైవ వైష్ఞవ గొడవల్లో తమిళనాడు నుండి బ్రాహ్మణులు రావడం వారికి పెరూమాళ్ళపురంలో ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తుంది.సర్పవరం లో గల ఆలయంలో అర్చకత్వం వహించడానికి వారికి అనుమతి వచ్చినట్లు తెలుస్తుంది.ఇక పిఠాపురం సంస్దానం ఆధీనంలో ఉన్న రోజుల్లో అద్దరిపేట మొదలు మూలపేట వరకు గల ప్రాంతాన్ని కోనఫారెస్టుగ నమోదైయినట్లు కైఫియత్తుల్లో కగొనవచ్చు. కోనఫారెస్టును ఏనుగుల పుంత అని కూడా పిలిచేవారు.పిఠాపురం సంస్దానం వారి సైనిక పఠాలం ఇక్కడే ఉండేది
సమరయ స్త్రీ
స్ర్తీ ఏకపాత్ర*
(వేదిక మధ్యలో స్ర్తీ కూర్చుని ఉంటుంది తన ముందర ఉన్న మంచినీటి కూజా ఇంచుమించు ఒడిలో పొదివికున్నట్టు ఉంటుంది.కూజా మూతిపై చేతులు చాపి ఆ చేతులులో తలను వాల్చి ఉంటుంది.)
తెర తీయబడగానే ......మెల్లగా తలను పైకి ఎత్తి నిద్ర మత్తు కళ్ళను ప్రదర్శిస్తూ ఆవలించి ,వళ్ళు విరిచుకుంటూ నిద్రలో తన ప్రియునితొ సరసాలాడిన రీతిని ఊహించుకుంటూ పగలబడి నవ్వుతూ నవ్వుతూ లేచి వేదిక కుడి మూలన వరకు ఎవరో తనను కౌగిలించుకుని వదిలి పెట్టిన భావన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అనిపించి వదలమన్నట్టు నటిస్తు నవ్వి ఆగి.....ఒక్కసారిగా కొంటే చూపులు చూస్తూ వయ్యారపు నడకతో కుడి నుండి ఎడమ మూలవరకు నడచి నడుస్తున్నప్పుడు నా అంత అందెగత్తె లేదు అన్నట్టు భావించుకుంటూ వెను తిరిగి మధ్యలో వరకు వచ్చి మరో సారి కొంటే నవ్వు విసిరి కనులు ఎగరేసి తలను వాల్చి కురులు ముందుకులాగి మరలా కనులు ఎగరేసి
ఓ రెండు నాట్యభంగిమలు ప్రదర్శించి)
**సమరయ స్ర్తీ ఏకపాత్ర*
(వేదిక మధ్యలో సమరయస్ర్తీ కూర్చుని ఉంటుంది తన ముందర ఉన్న మంచినీటి కూజా ఇంచుమించు ఒడిలో పొదివికున్నట్టు ఉంటుంది.కూజా మూతిపై చేతులు చాపి ఆ చేతులులో తలను వాల్చి ఉంటుంది.)
తెర తీయబడగానే ......మెల్లగా తలను పైకి ఎత్తి నిద్ర మత్తు కళ్ళను ప్రదర్శిస్తూ ఆవలించి ,వళ్ళు విరిచుకుంటూ నిద్రలో తన ప్రియునితొ సరసాలాడిన రీతిని ఊహించుకుంటూ పగలబడి నవ్వుతూ నవ్వుతూ లేచి వేదిక కుడి మూలన వరకు ఎవరో తనను కౌగిలించుకుని వదిలి పెట్టిన భావన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అనిపించి వదలమన్నట్టు నటిస్తు నవ్వి ఆగి.....ఒక్కసారిగా కొంటే చూపులు చూస్తూ వయ్యారపు నడకతో కుడి నుండి ఎడమ మూలవరకు నడచి నడుస్తున్నప్పుడు నా అంత అందెగత్తె లేదు అన్నట్టు భావించుకుంటూ వెను తిరిగి మధ్యలో వరకు వచ్చి మరో సారి కొంటే నవ్వు విసిరి కనులు ఎగరేసి తలను వాల్చి కురులు ముందుకులాగి మరలా కనులు ఎగరేసి
ఓ రెండు నాట్యభంగిమలు ప్రదర్శించి)
*
* పట్టి కాలి బొటన వ్రేలు నేలను రాస్తూ) సుఖారు గ్రామ కుర్రాళ్ళు ఇది విన్నారా ! ఆహ విన్నారాంట ( విసుగు ప్రదర్శించి ) విని ఉండరులే మీకు నన్ను ఎలా పొందాలనే ఆశే కాని ఈ సమరయ ప్రాంతంలో ఇంత అందగత్తే ( క్రిందనుండి పైకి తన చేతిని చూపిస్తు) లేనే లేదట తెలుసాంట ... ( అరచేతిని నోటి పై ఉంచి ఒకింత వగలపు నవ్వు నవ్వుతూ ) ఇప్పటికే నా వంపుసొంపులకు సమరయ ప్రాంతంలో పేరు మోసిన వాళ్ళు కాళ్ళా వేళ్ళా పడి దాహం తీర్చుకుని ..... తీర్చుకుని ( కళ్ళు పెద్దవి చేసి ఎవరో అడిగినట్టు ) ఊ .... ఎలాగో చెప్పనా..ఊ.... ఎవరిదని చెప్పనూ ( కళ్ళుత్రిప్పి గట్టిగా నవ్వి భర్తలాగ మగవానిగా నటిస్తూ గొంతు గంభీరంగా పెట్టి ) ఓ సుమరమణీ ...నీ నవ్వు నా హృదయాన్ని గాయం చేసింది చూడు నీ ఒడిలో నా తలను వాల్చనివ్వవూ...( పగలబడి గర్వం తొణికిసలాడే నవ్వు గట్టిగా ) మరోకడిదా ఏయ్ పిల్లా ఏం నడకే బాబు నీది ....నీవు అనుమతిస్తే నీ అడుగుల్లో అడుగు వేసి పువ్వుల్లో పెట్టి చూస్తాను ( నవ్వి నవ్వి నవ్వుతూనే ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడి మోసపోయిన దానిని గుర్తుచేసుకుంటుంది
... ఏడ్చి ఏడ్చి .... ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టు ....కన్నీళ్ళు తుడుచుకుని )
అయ్యో అప్పుడే పన్నెండుగంటలయ్యింది . ఎండ చుర్రుమంటుంది .ఇదే సమయం యాకోబు బావి నుండి నీళ్ళు తేవడానికి. నా తలరాత ఇలా తగలడింది .బయటకు వెళితే చాలు హేళన మాటలు వినలేక చావాలనిపిస్తుంది ,సూటిపోటిమాటలలతో ప్రాణం తీస్తారు ఈ పాడు జనం. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానే. వీరి సంపదేమైనా ఎత్తుకు పోయానా ఏంటి.నా బడి ఏడుస్తూ ఉంటారు...సరేలే.... ఈ సమయమైతేనే జనం తక్కువ ఉంటారు నీళ్ళు తేవడానికి ( అంటూ కూజాను సంకన ఉంచి బయలు దేరుతుంది .)
(రెండడుగులు వేసిందో లేదో . వీధిలో ఓ సైనికుడు సమరయ స్ర్తీని చులకనగా చూస్తూ చేయిని పట్టుకున్నట్టు తన చేతిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ )
దారి తప్పుకో సైనికుడా.... అడ్డులే నన్ను వెళ్ళనివ్వు..నేను సమరయ స్ర్తీని నేనేం నిన్న మొన్నటి నుండి ఇక్కడ ఉంటున్న దానినేం కాదు .సమరయ స్ర్రీని ఒమ్రీ రాజు కట్టించిన పట్నంలో అస్సూరు రాజు ఆజ్ఞతో నివశిస్తున్న సమరయ జాతి స్త్రీని. ఏం అంటున్నావు సంకరజాతి దాన్ననా ,అంటరాని దాన్ననా. మా తాతలు దొంగలా అయితే అయి ఉండవచ్చు ముందు అడ్డు తొలగు...... వదులు చేయి . ఆ చెట్ల క్రింద దేశదిమ్మరుంటారు వెళ్ళి దాని చెయిపట్టుకో వదలమన్నాన.....ఛీ...... చేయి వదులు ( చేయిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ముఖం పై ఉమ్మి వేసినట్లు నటించి ముందుకు వెళుతూ దారి ప్రక్కనున్న గ్రామదేవత విగ్రహం ముందు ఆగి కూజాను ప్రక్కన పెట్టి మోకాళ్ళపైబడి పూజిస్తున్నట్టు నటించి మరలా కూజాను చంకనబెట్టుకుని బయలుదేరుతుంది )
వచ్చేసాను ....హమ్మయ్య... అదిగో యాకోబు బావి యాకోబు యేసేపుకు కట్టించిన బావి . ఆ నుయ్యి లో నీళ్ళు ఎంత తీయగా ఉంటాయి . ఎంత మధురంగా ఉంటాయి. ఎంత చల్లగా ఉంటాయి ( అని అనుకుంటూ ఒక్కసారిగా ఆశ్చర్యం నటిస్తూ .....ముఖం చిట్లించి... బావి దగ్గర ఎవరో కూర్చున్నట్టు గమనించి) .........ఎవరు .... ఎవరైయుంటారు.......ఎవరో తెల్లని అంగీ ధరించిన తేజస్సు కలిగిన వ్యక్తి ..బావి గట్టున కూర్చుని ఉన్నాడు...నేను చూస్తుంది నిజమేనా అతను యూదుడు కాదుగదా ..నేను దగ్గరకు వెళ్ళవచ్చో లేదో . అంటరానివాళ్ళు , దోపిడీ దొంగలు "విచ్చలవిడిగా బ్రతికే వ్యభిచారులు నివశించే ఈ సమరయ ప్రాంతానికి యూదులు ఏనాడో రావటం మాని గలలియ వైపు పోతున్నారు.మరి ఇతనెవరు చూస్తే యూదుడులాగే ఉన్నాడు. ఏదైతే అదే జరిగింది దగ్గరగా వెళతాను.........
( దగ్గరగా వెళ్ళినట్లు నాలుగు అడుగులు వేసి )
అయ్యా ........ఎవరు మీరు ఈ మిట్టమధ్యహాన్నం ఇంత ఎండలో అంత ప్రశాంతంగా కూర్చున్నారు .చూస్తుంటే యూదుజాతివానిగా కనబడుతున్నారు . నేను చూస్తుంది నిజమేనా .....( అవతలి నుండి నిజమే నువు చూస్తుంది అనే జవాబు విని దూరంగా వెనకకు పరిగెత్తి భయం నటిస్తూ )
అయ్యా మన్నించండి ! మీరు చూస్తుంటే యూదులులా ఉన్నారు. నేను సమరయ స్త్రీని అంటరాని జాతిలో పుట్టిన దానిని మీరు ఈ యాకోబు బావి దగ్గరకు ఎందుకు వచ్చారు ? నేను పుట్టి ఉండగా ఓ యూదుడు ఇలా సమరయ ప్రాంతం రావటం ఇదే .మీకు నన్ను చూస్తుంటే అసహ్యం కలగడంలేదా?
(ఆశ్చర్యం నటిస్తూ చంకన ఉన్న కూజా క్రింద ఉంచి )
అయ్యా ఏమిటి మీరంటున్నది దాహానికి నీరు ఇమ్మంటున్నారా ? నేను చేదతో తోడి మీకు నీరు పోస్తే త్రాగుతారా ? సమరయ స్ర్రీ తాకిన నీటిని మీరు త్రాగుతారా ? మీరు ఈ పాపుల మార్గానికి రావటమే వింతగా ఉంది. మీరు దాహం తీర్చమంటున్నారు .నేను ఎవరో మీకు తెలిసే మాట్లాడుతున్నారా !
(సంబ్రమాశ్చర్యాలకు లోనై )
అయ్యా ! ఏమిటి మీరంటున్నది ( మోకాళ్ళ పై కూలబడి ) నాకు ఐదుగురు భర్తలని ఆరవ భర్తతో ఉంటున్నానని నాకు తప్ప మరెవరికీ తెలియదు .నా అంతరంగ రహస్యాలు మీకెలా తెలిసాయి. అంతరంగ రహస్యాలు తెలిసేది దేవునికే కదా ! నేను నమ్మలేకుండా ఉన్నాను.మీరు సామాన్యులుగా కనబటంలేదు .సాక్షాత్తు దైవస్వరూపులుగా ఉన్నారు.
అయ్యా ! మనం అందరం యాకోబు దేవుని బిడ్డలమే కదా ! సమరయులను ఎందుకు అంటరానివారిగా చూస్తున్నారు . మనుషులందరూ ఒకటే కదా !ఎందుకు ఈ తారతమ్యాలు. మిమ్మలను చూస్తుంటే మీరు సమరయుల పట్ల ప్రేమ కలిగిఉన్నట్లు ఉన్నారు . యూదులు గొప్పవారు కదా ఈ సమరయస్ర్రీ ఇచ్చే నీరు నిజంగా త్రాగుతారా!
(ఏదో ఆశ్చర్యంగా అర్దంకానట్లు ముఖం పెట్టి )
జీవజలము ఇస్తారా ? ఏమిటి మీరనేది .తోడుకో డానికి చేదలేదు కదా మరి నాకు జీవజలం ఎలా ఇస్తారు?
మీ మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగి పోతుంది. మీరు ఎవరు ? మీ పేరేంటి ? నా పాపాలు తెలిసేది దేవునికే కదా నా హృదయమెందుకు భారంగా ఉంది.మిమ్ములను చూస్తున్నా , మీ మాటలు వింటున్నా నిత్యజీవం, నిత్యరక్షణ,నిత్యరాజ్యం లోకి పిలుస్తున్నట్టు ఉంది.మన తండ్రి అయిన యాకోబు కంటే మీరు గొప్పగా ఉన్నారే . పాపుల రక్షకుడు మెస్సయ్య వస్తాడని లేఖనాలలో తెలుసుకున్నాను.
అయ్యా ! ఏమిటి మీరంటున్నది.మనం అందరం దేవుని వారసులమా .ఆయన ఇచ్చు రక్షణ అందరికీ సమానమేనా ,యూదులని ,సమరయులని,పాపులని ,నీతిమంతులని భేదాలేలేవా అందరికీ ఆయన రక్షణ ఇస్తాడా !
అయ్యా ! నేను ఎన్నో పాపాలు చేసాను,విగ్రహారాధన చేసాను, నన్ను క్షమిస్తాడా! ఈ పాపిని క్షమిస్తాడా ( గుక్కపట్టి ఏడుస్తుంది )
(కొంతసేపటికి తేరుకుని )
అయ్యా మీ పేరు ఏమిటి ?
ఏమిటి మెస్సయ్య ! మేం ఎదురు చూసే మెస్సయ్య మీరేనా !అయ్యా నన్ను మన్నించండి!ఈ పాపిని క్షమించండి! అయ్యా మీరు నన్ను అమ్మా అని పిలుస్తున్నారా !నేను ధన్యురాలని అయ్యా ధన్యురాలిని !మెస్సయ్య వచ్చాడని మా సమరయులందరికీ చెప్పాలి . ( కంగారుగా ముందుకు పరిగెడుతూ వెనక్కి వస్తూ ) ఊరి వారందరికీ ఈ శుభవార్త చెప్పాలి .అయ్యా ఇక్కడే ఉండండి . మీరు అస్సలు కదలోద్దు . నేను పోయి మా ఊరి వారందరినీ తీసుకుని వస్తాను. ఇక్కడే ఉండండి ....ఇక్కడే ఉండండి
ఓయ్ .. ఓయ్ మిమ్మల్నె వింటున్నారా...(తన ముసుగు చెంగును నోటిలో సుతి మెత్తగా పంటి బిగిన పట్టి కాలి బొటన వ్రేలు నేలను రాస్తూ) సుఖారు గ్రామ రసికాగ్రేసులారా ఇది విన్నారా ! ఆహ విన్నారాంట ( విసుగు ప్రదర్శించి ) విని ఉండరులే..... నా యవ్వన సిరులు దోచుకోవలనే ఆశే కాని ఈ సమరయ ప్రాంతంలో ఇంత రూపవతి శృంగారదేవత ( క్రిందనుండి పైకి తన చేతిని చూపిస్తు) లేనే లేదనే విషయం మీకు తెలుసాంట ... ( అరచేతిని నోటి పై ఉంచి ఒకింత వగలపు నవ్వు నవ్వుతూ ) ఇప్పటికే నా లావణ్య రేఖావిలాసాలు సమరయ ప్రాంతంలో పేరు మోసిన దిగ్జజాలదగ్గర ఉన్నాయని వాళ్ళు కాళ్ళా వేళ్ళా పడి సేదతీరి.....అవసరం తీరాక ముఖం చాటేస్తారని ,వారి రహస్యజీవితాలు నా గుప్పెటలో బందీ అని అందుకే నన్ను వేనొళ్ళ పొగుడుతారని తెలుసా ( కళ్ళు పెద్దవి చేసి ఎవరో అడిగినట్టు ) ఊ .... ఎలాగో చెప్పనా.(గట్టిగా ఎగతాళి నవ్వు ).ఊ.... ఎవరిదని చెప్పనూ ( కళ్ళుత్రిప్పి గట్టిగా నవ్వి భర్తలాగ మగవానిగా నటిస్తూ గొంతు గంభీరంగా పెట్టి ) ఓ సుమరమణీ ...నీ నవ్వు నా హృదయారవిందాన్ని ఎంత గాయం చేసిందో చూడు నీ ఒడిలో ఒక్కసారి నా తలను వాల్చనివ్వవూ... ( పగలబడి వేళాకోళం కలగలిపిన తొణికిసలాడే నవ్వు గట్టిగా నవ్వుతూ ) మరోకప్రియునిదా ఏయ్ సౌందర్యరాశి ఏం లావణ్యమే నీది ....నీవు అనుమతిస్తే నీ అడుగుల్లో అడుగులు వేస్తాను .పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను వదలనంటే వదలను నిన్ను ( నవ్వి నవ్వి నవ్వుతూనే ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడి మోసపోయిన దానిని గుర్తుచేసుకుంటుంది.. ఏడ్చి ఏడ్చి .... ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టు ....కన్నీళ్ళు తుడుచుకుని )
అయ్యో అప్పుడే మిట్ట మధ్యహాన్నం అయ్యింది . ఎండ చుర్రుమంటుంది .ఇదే సమయం యాకోబు బావి నుండి నీళ్ళు తేవడానికి. నా తలరాత ఇలా తగలడింది మరి .బయటకు వెళితే చాలు హేళన మాటలు వినలేక చావాలనిపిస్తు ఉంటుంది . సూటిపోటి మాటలలతో ప్రాణం తీస్తారు ఈ పాడు జనం. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానే. వీరి సంపదేమైనా ఎత్తుకు పోయానా ఏంటి. నా బడి ఏడుస్తూ ఉంటారు...సరేలే.... ఎప్పుడూ ఉండే సొదే.... ఈ సమయమైతేనే జనం తక్కువ ఉంటారు బావి దగ్గర .( అంటూ కూజాను సంకన ఉంచి బయలు దేరుతుంది .)
(రెండడుగులు వేసిందో లేదో . వీధిలో ఓ సైనికుడు సమరయ స్ర్తీని చులకనగా చూస్తూ చేయిని పట్టుకున్నట్టు తన చేతిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ) ఎయ్ చేయి వదులు ...,,,దారి తప్పుకో సైనికుడా.... అడ్డులే నన్ను వెళ్ళనివ్వు....ఏమిటా వెకిలి నవ్వు.....నేను సమరయ స్ర్తీని . నేనేం నిన్న మొన్నటి నుండి ఇక్కడ ఉంటున్న దానినేం కాదు . ఒమ్రీ రాజు కట్టించిన పట్నంలో అస్సూరు రాజు ఆజ్ఞతో నివశిస్తున్న సమరయ జాతి స్త్రీని. ఏం అంటున్నావు ? సంకరజాతి దానిననా ,అంటరాని దాన్ననా. మా తాతలు దొంగలా అయితే అయి ఉండవచ్చు .....ముందు అడ్డు తొలగు...... బావి వద్దకు పోవాలి ... చేయి వదులు ముందు . ఆ చెట్ల మాటున దేశదిమ్మరులుంటారు వెళ్ళి దాని చెయిపట్టుకో వదలమన్నాన.....ఛీ...... చేయి వదులు ( చేయిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ముఖం పై ఉమ్మి వేసినట్లు నటించి కోపంగా చూస్తున్నట్టు ముందుకు వెళుతూ బయలుదేరుతుంది నాలుగు అడుగులు వేసి )
( యాకోబు బావిని దూరం నుండి చూసి నట్లు నటించి) ....హమ్మయ్య... అదిగో యాకోబు బావి యాకోబు యేసేపుకు కట్టించిన బావి . ఆ నుయ్యి లో నీళ్ళు ఎంత తీయగా ఉంటాయి . ఎంత మధురంగా ఉంటాయి. ఎంత చల్లగా ఉంటాయో చెప్పలేను ( అని అనుకుంటూ ఒక్కసారిగా ఆశ్చర్యం నటిస్తూ .....ముఖం చిట్లించి.. ... బావి దగ్గర ఎవరో కూర్చున్నట్టు గమనించి) ....అమ్మో ఎవరో బావి వద్ద ఉన్నారు.....ఎవరైఉంటారు .... బావి అంచున కూర్చుంది ..ఎవరైయుంటారో.....ఎవరో యూదుడులా అంగీ వేసుకుని ఉన్నాడు..బావి గట్టునే కూర్చుని ఉన్నాడు...నేను చూస్తుంది నిజమేనా అతను యూదుడు కాదుగదా ఆ తేజస్సు ఆ గంభీరతా యూదులకే సొంతం సుమా మరెవరికి ఉంటుంది ఆ దర్పం .....నేను దగ్గరకు వెళ్ళవచ్చో లేదో . ..(గర్వపు గొంతుతో ).......ఆ నాకేం భయం యూదులకు మా సమరయులకు బద్ద వైరం ఉన్నమాట ఎవరు కాదనగలరు . .....అతను యూదుడైతే నాకేంటట , .....ఉండనీ నాకేం భయం. సమరయులు దేనిలో తీసిపోతారు ...యూదుల గొప్పేంటో ( తనలో తను మాట్లాడుకుంటూ....... బుగ్గలు నొక్కుకుంటూ దిగ్బ్రమకు లోనై ) దోపిడీ దొంగలు "విచ్చలవిడిగా బ్రతికే వ్యభిచారులు నివశించే ఈ సమరయ ప్రాంతానికి యూదులు ఏనాడో రావటం మాని యూదయ నుండి చుట్టూ తిరిగి గలలియ పోతున్నారు.మరి ఇతనెవరు చూస్తే యూదుడులాగే ఉన్నాడు. (నిట్టూర్చి ) ఏది జరిగితే అదే జరుగుతుంది .........దగ్గరగా వెళతాను.. నా పని నేను చేసుకుంటాను.......( అని బావి వద్దకు వెళ్ళినట్లు నాలుగడుగులు వేసి కూజాను క్రింద పెడుతుంది ఇంతలో మెస్సీయా దాహాం తీర్చమని నీళ్ళు అడుగుతాడు అది విని ఆశ్చర్యం నటిస్తూ ..) ఏంటేంటి ....దాహానికి నీరు ఇమ్మంటున్నావా ? నువు యూదుడవే కదా !
నేను చేదతో తోడి నీకు నీరు పోస్తే త్రాగుతావా ? సమరయ స్ర్రీ తాకిన నీటిని నువు త్రాగుతావా ? .నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా ! యూదులు మేము వండినవి తినరట , మా చేతి నీరు త్రాగరట ,మాతో సంబాషించడానికే ఒప్పుకోరట . మరి నువేంటి త్రాగడానికి నీళ్ళడుగుతున్నావు.
నువు యూదుడవైతే......ఏషర్హద్దోన్ మిమ్మల్ని అస్సూరు రాజ్యం తీసుకుపోయాడుగా అక్కడే ఉండక ఈ సమరయ ప్రాంతంతో నీకేం పని ఇలా వచ్చావ్ .... ఏం మాట్లాడవేం ....పోనీలే అని విగ్రహారాధన మాని మన దేవుడైన యెహోవాను పూజిస్తే నెహేమ్యా ఊరుకున్నాడా మా సమరయులను సంకరజాతంటూ కలవవద్దని నిభందన పెట్టాడు . అయితేనేం మేము దేవుడిని విడిచి పెట్టలేదు. లేఖనాలు చదువటం మానలేదు . గెరీజీము కొండపై ఆలయం కట్టుకుని మెస్సీయ వస్తాడని ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని మీ యూదులు కలవనివ్వక పోతేనేం మేము గొప్పగానే బ్రతుకుతున్నాం , మరి మా సమరయ ప్రాంతంతో నీకేం పనో .ఏం మాట్లాడవేం . అందరిలాగే యూదయా నుండి చూట్టూ తిరిగి గలలియ పోలేక పోయావా మా సమరయ ప్రాంతంలోకి వచ్చావ్.........నీళ్ళు కావాలట నీళ్ళు ( గుడ్లురుమి నట్లు చూసి ....దగ్గరగా వెళ్ళినట్లు నాలుగు అడుగులు వేసి )
.ఇంతకూ.......ఎవరు నువ్వు ఈ మిట్టమధ్యహాన్నం ఇంత ఎండలో అంత ప్రశాంతంగా కూర్చున్నావ్ దేనికోసమో తెలుసుకోవచ్చా .చూస్తుంటే యూదు జాతివానిగానే కనబడుతున్నావు . నేను చూస్తుంది నిజమేనా ....( అవతలి నుండి నిజమే నువు చూస్తుంది అనే జవాబు విని ఆశ్చర్యాన్ని చూపిస్తూ )
ఆ అవునా ! యూదుడవే... ( కాస్త నెమ్మదైన గొంతుతో ) నేను ఎవరో తెలుసా ! సమరయ స్త్రీని అంటరాని జాతిలో పుట్టిన దానిని . మీరు ఈ యాకోబు బావి దగ్గరకు ఎందుకు వచ్చారు ? నేను పుట్టి ఉండగా ఓ యూదుడు ఇలా సమరయ ప్రాంతంలో అడుగు పెట్టడం ఇదే ప్రధమం . ఈ పాపుల మార్గాన రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. మా సమరయులు చూస్తే ఏదైనా గొడవ జరుగుతుందేమో అన్న భయం మీకులేదా ? నన్ను చూసి నవ్వుతూ శాంత వదనులై మాట్లాడుతున్నారు ( ఒకింత చెవులు నిక్కించి వింటున్నట్లు నటించి సంబ్రమాశ్చర్యాలకు లోనై )
అయ్యా ! ఏమిటి మీరంటున్నది ( మోకాళ్ళ పై కూలబడి ) ఏమిటి... ఏమిటీ..నేను వినేది నిజమేనా . నాకు ఐదుగురు భర్తలని ఆరవ భర్తతో ఉంటున్నానని అంటున్నారా ! నాకు తప్ప మరెవరికీ ఈ అంతరంగిక విషయం తెలియదు. మీకెలా తెలిసింది. నా అంతరంగ రహస్యాలు మీకెలా తెలిసాయి నమ్మలేకపోతున్నాను ?. నా అంతరంగ రహస్యాలు తెలిసేది దేవునికే కదా ! నేను నమ్మలేకుండా ఉన్నాను. మీరు సామాన్యులుగా కనబటంలేదు .సాక్షాత్తు దైవస్వరూపులుగా ఉన్నారు. నిజం చెప్పండి ఎవరు మీరు ?
చూస్తుంటే మీరు సమరయుల పట్ల ప్రేమ జాలి కలిగి ఉన్నట్లు ఉన్నారు . పాపులను క్షమించే వారిగా ప్రేమించే వారిగా కనబడుతున్నారు . యూదులు గొప్పవారు కదా ఈ సమరయస్ర్రీ ఇచ్చే నీరు నిజంగా త్రాగుతారా! నిజం చెప్పండి (ఏదో ఆశ్చర్యంగా అర్దంకానట్లు ముఖం పెట్టి )
ఏంటి జీవజలములా ..జీవజలములు..ఇస్తారా? ఏమిటి మీరనేది తోడుకోడానికి చేదలేదు కదా మీ దగ్గర , మరి నాకు జీవజలం ఎలా ఇస్తారు? మీ మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగుతుంది. అసలు మీరు ఎవరు ? మీ పేరేంటి ? నా పాపాలు తెలిసేది దేవునికే కదా. .మీరు ఎవరో తెలుసుకోవాలని ఉంది.
ఈ రోజు నా హృదయమెందుకో భారంగా ఉంది. మీతో మాట్లాడుతుంటే హృదయంలో పశ్చత్తాపం కలుగుతుంది . మిమ్ములను చూస్తున్నా , మీ మాటలు వింటున్నా నిత్యజీవం, నిత్యరక్షణ,నిత్యరాజ్యం లోకి పిలుస్తున్నట్టు ఉంది. మన తండ్రి అయిన యాకోబు కంటే మీరు గొప్పగా ఉన్నారే . పాపుల రక్షకుడు మెస్సయ్య వస్తాడని లేఖనాలలో తెలుసుకున్నాను. ఆయన కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఇంతకూ మీరు ఎవరో చెప్పటం లేదు ? ( కొంతసేపు ఆగి వినినట్లు నటించి )
అయ్యా ! ఏమిటి మీరంటున్నది.మనం అందరం దేవుని వారసులమా .ఆయన ఇచ్చు రక్షణ అందరికీ సమానమేనా ,యూదులని ,సమరయులని,పాపులని ,నీతిమంతులని భేదాలే లేవా అందరికీ ఆయన రక్షణ ఇచ్చేవాడు ఉన్నాడా !
అయ్యా ! ( రోదిస్తూ ) ఎన్నో పాపాలు చేసాను, విగ్రహారాధన చేసాను, నన్ను క్షమిస్తాడా! ఈ పాపిని క్షమిస్తాడా వచ్చే మెస్సియ్యా ( గుక్కపట్టి ఏడుస్తుంది ) పాపపు జీవితమని తెలిసీ తప్పులు చేసాను . ఇహలోక వాంచలకు లొంగిపోయాను . నేను ఘోర పాపిని ...ఘోర పాపిని ( దుఃఖపడి కొంతసేపటికి తేరుకుని లేచి నిలబడి దీన వదనురాలై )
అయ్యా మీ పేరు ఏంటో చెప్పనేలేదు? ( మెస్సీయ అని పేరు వినగానే ఆశ్చర్యం తో పరవశురాలై దిగ్బ్రమ చెంది స్దానువురాలై )
ఏమిటి మెస్సయ్య ! లోకరక్షణార్దం ఈ భువిలో వెలసే మెస్సియ్యె నా మీరు . మేం ఎదురు చూసే మెస్సయ్య మీరేనా ! అయ్యా నన్ను మన్నించండి!ఈ పాపిని క్షమించండి! అయ్యా మీరు నన్ను అమ్మా అని పిలుస్తున్నారా ! నేను ధన్యురాలని అయ్యా ధన్యురాలిని !
పాపపు ఊబిలో దిగజారిన నా బ్రతుకులో అశాంతి ఊపిరాడనివ్వడంలేదు .దూరంనుంచి చూసినప్పుడే అనుకున్నాను ఈ పాపపు బ్రతుకు ఇక ముగియబోతుందని. గొంగళి పురుగు లాంటి నా జీవితం మీ చల్లని మాటతో రెక్కలు తొడిగింది.....అయ్యా నా పాపపు జీవితాన్ని విడనాడి ఈనాడే రూపాంతర అనుభవం పొందుతాను . మీరు ఇస్తానన్న జీవజలం పొందుతాను . ( కంగారు నటిస్తూ కనులు తుడుచుకుంటూ )
అయ్యా ఇక్కడే ఉండండి . మీరు అస్సలు కదలోద్దు . నేను పోయి మా ఊరి వారందరికీ పాపుల రక్షకుడు వచ్చాడని చెప్పి వస్తాను. ఇక్కడే ఉండండి ....ఇక్కడే ఉండండి ( అని కూజాను విడిచి ఊరివైపు వెళుతూ .....కంగారుగా నటిస్తూ..... పరిగెడుతూ వెనక్కి వస్తూ ఏమి పాలుపోని దానివలె ఆనంద పరవశురాలై నవ్వుతూ )
మెస్సయ్య వచ్చాడని పాపాలతో కొట్టుమిట్టులాడుతున్న మా సమరయులందరికీ చెప్పాలి . అంటరానివారిగా చూడబడుతున్న మా సమరయ జనాంగాన్ని ఇంట చేర్చుకునే స్నేహితుడు వచ్చాడని చెప్పాలి మెస్సియ్య పరిశుద్దమైన మాటలు వినడానికి రమ్మని స్వయంగా పిలుస్తాను . ప్రభు రాకను ప్రకటిస్తాను . ధన్యురాలిని మెస్సియ్యా . ధన్యురాలును ఈ సమరయ స్ర్రీ ఇక నుండి పాపాలను విడిచి రక్షణ పొందిన విశ్వాసురాలని ప్రకటిస్తాను. నేను మెస్సియ్య ఇచ్చే జీవజలములు పొందానని కేకలు వేసి మరీ చెపుతాను ఊరి వారందరికీ ఈ శుభవార్త చెప్పాలి మన పాపాలను పరిహరించడానికి మెస్సియ్య వచ్చాడని తెలుపుతాను పాపపు కడవను మోసిన ఈ సమరయ స్ర్రీ తన హృదయంలో జీవజలము బావిని పొందిందని సాక్ష్యమిస్తు బ్రతుకుతాను ..... హల్లెలూయ ( సంతోషకరమైన నవ్వు ..... ఆనందబాష్పాలు ) .
సమాధాన కర్త!ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా? అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా? నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా? నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా? భయపడొద్దు! పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు. ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.ఆయనకి నీవుకావాలి! ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు. ఆయన వద్దకు వస్తావా? వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు. అట్టి కృప మనందరికీ కలుగును గాక!ఆమెన్!(సశేషం)
సమరయ స్త్రీ
రెండవ బాగముప్రియ సహోదరీ/సహోదరులారా! మధ్యాహ్నం ఇంచుమించు 12గంటల సమయంలో యేసుప్రభులవారు సమరయ ప్రాంతంలో సుఖారు గ్రామ పొలిమేరల్లో గల యాకోబు బావి దగ్గర అలసియున్న రీతినే కూర్చోన్నట్లు చదువుకొన్నాం. యోహాను 4: 6,7 వచనాలు. అప్పుడు సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు రాగా యేసు- దాహమునకిమ్మని ఆమెనడిగెను.ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నం పూట ఈ సమరయస్త్రీ నీరుకోసం బావిదగ్గరకు వచ్చింది. పల్లెటూర్లలో (పూర్వకాలం) స్త్రీలు వేకువఝామున లేచి మంచినీరుకోసం బావి దగ్గరకు వెళ్ళడం సర్వసాధారణం. అయితే ఉదయం 7గంటల తర్వాత ఎవరు బావికి రారు. ఆ సమయానికి ఆ రోజుకి సరిపడే నీళ్ళు తెచ్చేసుకొని వంట కార్యక్రమాలు కొనసాగించేవారు. కాని ఇక్కడ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం రావడానికి కారణం ఏమిటి?1.తెచ్చుకొన్న నీరు అయిపోయిందా? తర్వాత వచనాలు ప్రకారం ఎంతమాత్రము కాదు.2. Privacy కోసమా? ఒంటరితనం కోసమా? ఏమో తెలియదు. ఒకవేళ ఒంటరితనం ఆశిస్తే ఏ కారణాల వలన?3. ఆ సమయంలో ఎవరూ బావి దగ్గర ఉండరని తెలిసా? ఏం ఎందువల్ల?4. తన పాపపు జీవితం కొనసాగించడానికి అదే మంచి సమయమనా? ఏమో! మనకి తెలియదు.5. *లేక తనజీవితాన్ని ఎరిగియున్న ఊరిజనం తనని సూటిపోటి మాటలతో భాదిస్తున్నందువలన వారిని తప్పించుకోడానికి ఆ సమయంలో వచ్చిందా?* మనకి తెలియదు.పూర్వకాలంలో ఒక విషయం ఊరంతా తెలియాలంటే నీలాటిరేవు(బావి)దగ్గర చెబితే కొంతసేపటకి ఊరంతా ప్రాకిపోతుంది, ఉన్నదానికి ఇంకొంచెం కలిపి చెప్పేవారు!! ఈమె గూర్చి కూడా అలా చెప్పుకోన్నారేమో!!6. లేక ప్రజలకి తన జీవితం ఎలాంటిదో తెలియక పోయినా తన అంతరాత్మ గద్దింపుతో ప్రజలకి తన ముఖం చూపించలేక మధ్యాహ్నం వచ్చిందేమో!!ఒకవేళ ప్రియ చదువరీ! నీవుకూడా అదే పరిస్తితిలో నున్నావా? చింతపడకు! ఇలాంటి స్తితిలో నున్న ఒక స్త్రీని రక్షించడానికి యేసయ్య అలసిపోయినా సరే ఆ బావి దగ్గర ఆగి ఆస్త్రీతో మాట్లాడారు. ఈలోకంలో ఎవరికీ మనజీవిత రహష్యాలు తెలియకపోయినా నిన్ను నన్ను పుట్టించిన ఆ సృష్టికర్తకు తెలుసు.ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో అక్కడకు వస్తుందని తెలిసే యేసయ్య అక్కడికి వెళ్లి రక్షణను అందించారు.నాయీను గ్రామంలో విధవరాలి ఏకైక కుమారుడు చనిపోయాడని ఎరిగి ఒక రాత్రంతా నడచి (కపెర్నహూము నుండి నాయీను కి సుమారు 32 కి.మీ.) ఉదయాన్నే ఆ గ్రామం చేరుకొని ఆ విధవరాలి కుమారున్ని బ్రతికించి ఇచ్చారు.యేసయ్యని చూడాలని ఎప్పటినుంచో ఆశిస్తున్న పొట్టి జక్కయ్య కోసం ఆ ఊరు వచ్చి మేడిచెట్టు ఎక్కి కూర్చొన్న జక్కయ్యను పేరుపెట్టి మరీ పిలచి అంటున్నారు – జక్కయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బసచేయవలసి ఉంది.మనం చేసే ప్రతీ ఆక్రందన ప్రతీ ప్రార్ధన ఆయనకు వినబడుతుంది. నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను. నశించిపోయే స్తితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య, జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.అయితే గమనించ వలసినది ఏమిటంటే “దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.” దురదృష్టవశాత్తూ మనం అడిగిన వెంటనే పని జరిగిపోవాలి అని ఆశిస్తాము. కాని దేవుడు తన సమయంలో కార్యం చేస్తారు. మన ప్రణాళిక ప్రకారం పని జరిగితే ఆ సమస్య అప్పటికి తీరినా మరల వస్తుంది. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం జరిగితే అది శాశ్వత పరిష్కారం.కాబట్టి బెదరిపోకు! అలసిపోకు! సోలసిపోకు! దేవుడు నిన్ను త్వరలో దర్శించబోతున్నారు.సమరయ స్త్రీని రక్షించడానికి మధ్యాహ్నం వేల కలసిన దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నారు.ఆమెన్!దైవాశీస్సులు!!(సశేషం)
సిద్దాంతపు వారి వంశ చరిత్ర
సిద్దాంతపు ఇంటి పేరు కలిగిన వారు .మండపేట నియోజకవర్గంలోని ప్రసిద్ద ఏడిద గ్రామ నివాసులు .వ్యవసాయకూలీలుగాను ప్రెంచి వారు దగ్గర పనివారు గాను ఉండేవారు.ప్రెంచి వారు నిర్మించే లూథరిన్ చర్చిలకు కూలీలుగ 250 సంవత్సరముల క్రితం పనిచేసారు.ప్రెంచివారు ద్వారా క్రైస్తవ మతం స్వీకరించిన తొలి క్రైస్తవ కుటుంబాలు.యానం చర్చి కూలీలుగ పనిచేసారు.బ్రిటీష్ వారు రాకకంటే ముందు వచ్చిన ప్రెంచి వారు ద్వారా క్రైస్తవ మతం స్వీకరించారు.ఏడిద సీతానగరం గ్రామంలో సిద్దాంతపు పుల్లయ్య నిర్మించిన లూథరన్ చర్చి దీనికి ప్రత్యక్ష్య సాక్ష్యం.ఇది ఈనాడు పునరుద్దరించబడింది.లూథరన్ చర్చిగానే కొనసాగుతున్నది.
1850 ప్రాంతంలొ నిజాం నవాబు సీతానగరం గ్రామంలో మాదిగ మాన్యం ఐదు ఎకారాలు ఇచ్చి గ్రామ కరణాల దగ్గర సహయకులుగ సిద్దాంతపు వారిని నియమించాడు.అలా ఏడిద సీతానగరం వలసపోయిన కుటుంబాలలో సిద్దాంతపు పుల్లయ్య ఒకడు.అతనికి ఐదుగురు కొడుకులు యేసేపు,బెంజమీను ,దేవానందం,సుందరరావు,ప్రభుదాసు, ఒక కూతురు కూతురు పేరు దీనమ్మ ( ప్రసవ సమయంలో సరైన వైద్యం లేక చనిపోయింది).ఏడిద ,దుళ్ళ అండ్రంగి,కపిలేశ్వరపురం వంటి గ్రామాలతో బందుత్వం కలిగి ఉన్నారు.సిద్దాంతపు వారి కుటుంబాలలో మొదటి విద్యావంతుడు సిద్దాంతపు దేవయ్య ( దేవానందం ) రెండవవాడు ప్రభుదాసు,మొదటి ప్రభుత్వ ఉద్యోగం పొందినవాడు సిద్దాంతపు దేవానందం.
ౌౌ
ఉపాధ్యాయ వృత్తిలో నేను సాధించిన ఫీట్లు
ఏకోపాధ్యాయ పాఠశాలను
ప్రాధమిక పాఠశాలగ మార్పు
ప్రాధమికపాఠశాలను ప్రాధమికోన్నతగ మార్పు
ప్రాధమికొన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగ మార్పు
ఉన్నతపాఠశాలను బాలురు బాలికల ఉన్నత పాఠశాలగ మార్పు
భాధ్యతలలో అరుదైన ఘనత
ఏకోపాధ్యాయ పాఠశాల నిర్వహణ
ప్యూరల్ పాఠశాల నిర్వహణ
ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు
మోడల్ స్కూలు పి యస్ ప్రధానోపాధ్యాయుడు
సెంటరు సెక్రేటరీ
చెక్కుహోల్డర్
ఎమ్ ఆర్ పి
మండల జిల్లా స్టేట్ రీసోర్స్ పర్సన్
ఎడిటోరియల్ బోర్డు మెంబర్
హేబిటేషన్ ఆఫీసర్
నిరంతర విధ్యాకేంద్రం కన్వీనర్
రిక్షా
రిక్షా
చీకటి పడింది.మాదిగ పేట గూంగుర ఎండుకక్కలు కూర తిని నిద్రపోతూఉంది.రాజులమ్మ గిన్నెలు తోమి తాతబ్బాయి ఇంకా రాలేదని చూస్తుంది.ఇంతలో ఇసుక దారి లో రిక్షాను లాగుతు వస్తున్నాడు తాతబ్బాయి.రిక్షా హేండిల్ కి కట్టిన మువ్వలు చప్పుడు చాకలొళ్ళ ఇళ్ళదగ్గర ఉన్న ఉసిరిచెట్టు దాటగానే వింది రాజులమ్మ .ప్రాణం లేచి వచ్చింది.చెక్కముక్కలు అద్దాలతో చేసిన లాంతరులో కిరసనాయిలు బుడ్డితీసి వత్తి పెద్దది చేసి తాతబ్బాయి రిక్షాకు ఎదురెళ్ళింది.తాటికల్లు వాసన గుప్పున వస్తుంది. ఆ రోజుల్లో భర్త రోజంతా కష్టపడి తాగివచ్చిన పల్లెత్తు మాట అనేది కాదు భార్య .సర్దుకుపోయేది.సార కల్లు వాసనే సెంటు వాసన అనుకునేది అది జీవిత భాగస్వామి ఇచ్చే గౌరవం. రిక్షా వెనక్కి వెళ్ళి రిక్షా కదలటానికి సాయంచేసింది రాజులమ్మ.ఇంటి ముందు రిక్షా పెట్టి నల్లటి దారంతో చేసిన తాడును బ్రేకుకు బిగించి కల్లు సీసాను రిక్షా సీటు కింద తొట్టిలోంచి తీసి అదే చేతితో మూర మల్లెపూలు కట్ట తీసి రాజులమ్మకు ఇచ్చాడు తాతబ్బాయి.పండు వెన్నెల చల్లటి తెల్లటి వెన్నెల
తాటాకు చేదతో నూతిలో నుండి చల్లటి నీళ్ళతో తానమాడి తుమాలుతో తుడుచుని పీట మీద కూర్చున్నాడు తాతబ్బాయి.ముందు చెక్కపీట పెట్టి అల్యూమినియం గిన్నెనిండా అన్నంపెట్టి అన్నం ఎంత ఉందో అంత గూంగూర ఎండుకక్కల కూర వేసి తెచ్చింది.ఆ రోజు జరిగిన కబుర్లన్నీ చెపుతూ తింటున్నాడు తాతబ్బాయి. గంటకు పైగా కల్లుతాగుతూ ముద్దలు తింటు మాట్లాడుతుంటే కునుపాట్లు పడుతూ ఊకొడుతుంది రాజులమ్మ.అన్నం తిని నులకమంచం మీద సాగోరోడు మన తాతబ్బాయి.కిరసనాయిలు దీపం వత్తి తగ్గించి తాతబ్బాయి తెచ్చిన మల్లెపూలు పెట్టుకుని పక్కకు వచ్చి పడుకుంది రాజులమ్మ.
1960 నుండి 1990 వరకు మాదిగల జీవితాలలో రిక్షా ఓ భాగమయింది.బ్రతుకు తెరువయ్యింది.బాదలు పంచుకుంది.పిల్లల పెళ్ళిళ్ళు చేసింది.అనారోగ్యాలలో ఆదుకుంది.మాదిగలు చెప్పులు కుట్టింది తక్కువే ఒకటో రెండు కుటుంబాలు చెప్పులు కుట్టటం మీదే ఆదార పడేవి మిగతా కుటుంబాలన్ని రిక్షామీదే బ్రతుకీడ్చాయి.రిక్షా నడుస్తున్నంత సేపు నవ్వులు చిందాయి మాదిగల జీవితాలలో.పెళ్ళి వచ్చిందంటే చాలు రిక్షాను పెళ్ళికూతురు కంటే బాగ ముస్తాబు చేసేవాడు మన మాదిగ రిక్షా కూలి.రోడ్డు మీద ఓ పదో పదిహేనో రిక్షాలు వరుసగ పెట్టి ఉండేవి.ఊరిలో నుండి బాపనోళ్ళు,కాపులు,రెడ్లు ,చదువుకున్న కుటుంబాలు రిక్షాలోనే తిరిగేవారు.ఓ ముప్పై సంవత్సరాలు రిక్షా మువ్వల చప్పుడు ప్రతీ విధిలో వినబడింది.
మా అనురాగ దీపం
అమరుడా మా అప్పలస్వామి
నీవు లేని రోజుంటుందని
ఊహించలేదు
మేము ఊహించలేదు
నీ చల్లని సాన్నిహిత్యం
నీ నులి వెచ్చని ఆదరణ
మేమెలా మరతుము
ఓ ఆపద్బాందవా
ఓ ప్రేమామయి ఓ స్వామి
నినీ మరువలేమయా
నిను విడువలేమయా
ఓ అనురాగదీపమా
మా అప్పలస్వామి
ఆనందానికి రూపం మా అప్పలస్వామి
మా కుటుంబ కాపరి ఓ స్వామి నేస్తమా
బందువులంటే నీకెంతో ఆపేక్ష
అన్నదమ్ములనిన తరగని ప్రేమ
నీతో గడిపిన క్షణాలు
మేము మరువం
నీ ఙ్ఞాపకాలు మా మదిలో
పదిలం పదిలం
ఓ ఆపద్బాందవా
ఓ ప్రేమామయి ఓ స్వామి
నినీ మరువలేమయా
నిను విడువలేమయా
ఓ అనురాగదీపమా
మా అప్పలస్వామి
నిను ప్రేమించిన భార్యకు ప్రేమను పంచావు
నిను ప్రేమించే బిడ్డలకు ఆదర్శ తండ్రివైనావు
నీ నిస్వార్ద ప్రేమకు సాక్ష్యాలే మేము
నీవెక్కడ ఉన్నా చల్లగా ఉండు తండ్రి
నీ చల్లని చూపులు నీ దీవెన హస్తాలు
మా వంశాలకు వెలుగు నింపాలి
ఓ ఆపద్బాందవా
ఓ ప్రేమామయి ఓ స్వామి
నినీ మరువలేమయా
నిను విడువలేమయా
ఓ అనురాగదీపమా
మా అప్పలస్వామ
చాకలి వాళ్ళ మీద రెడ్ల దాడి
3 నెలల పసికందును కాళ్ళతో త్రొక్కి
చంపిన సంఘటన దిగ్బ్రమ కలిగిస్తుంది
సాధించాం సాధించాం అనుకుటుంన్నాం
ఈ సంఘటన మన భాధ్యతను గుర్తు చేస్తుంది
ఈ సంఘటన నా చిన్నతనంలో జరిగిన నా బాల్యపు మరకను గుర్తు చేస్తుంది.ఇది 1977 లో జరిగింది.నేను దివిలి గ్రామంలో ఉండేవాళ్ళం. హైస్కూల్లో ఆరవతరగతి చదువుతున్న రోజులు
హైస్కూలు విడిచిపెట్టారు .అందరం ఇంటికి వస్తున్నాం దివిలి గ్రామం నడిబోడ్డున పెద్ద కాలువ ఉంటుంది ఆ కాలువ గట్టునుండి ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఆ రోజు ఊరి జనం అంతా నిలబడి ఉన్నారు ఏదో సినిమా సీనులా అక్కడ తెల్ల పంచులు కట్టుకున్న ఓ ఐదుగురు చెక్క కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.అందులో మధ్యలోని వ్యక్తి అస్తమాను మీసం తిప్పుకుంటున్నాడు.ఆ ఐదుగురు చేతుల్లో చేతికర్రలున్నాయి.కొంత సేపటికి ఊరులో నుండి ఇంటికి పోవడానికి బట్టలమూట పట్టుకుని ఓ ముసలమ్మ వచ్చింది వాళ్ళను దాటుకుని వెళతా ఉంటే మధ్యలోని వ్యక్తి ఉన్నపళంగా లేచి బంలంగా బాదేసాడు ముసలిదాన్ని వెర్రి కేకలు పెట్టుకుంటూ ఏడుస్తూ పారిపోయింది.ఇంతలో ఓ వ్యక్తి సైకిలు పై మూటను పట్టుకు వచ్చాడు ముగ్గురు లేచి ఇష్టవచ్చినట్లు కొట్టారు.అతను దణ్ణం పెడుతున్నా వినలేదు.అలా చీకటి పడేవరకు బయటకు వెళ్ళి ఇళ్ళకు వస్తున్న చాకలి కుటుంబాలను చితకబాదారు లంజాకొడుకులు
తలుచుకుంటుంటే అప్పుడు భయంతో కొట్టుకున్న గుండే ఇప్పుడు ఆవేశంతో కొట్టుకుంటుంది ఎంత దురాగతాలను భరించారు
యాభై ఏళ్ళైనా చాకళ్ళ పరిస్దితి మారలేదు.మందకృష్ణే లేకపోతే మన జాతి పరిస్దితి ఏంటి. ఏంత ధైర్యంగా ఉన్నాం మహానుభావుడువలన
తమ్మయ్యపేట చింతచెట్టు
సినిమారంగానికి ప్రత్యేకమైన ప్రదేశాలంటే ఎంతో తగని మక్కువ.స్దానికులకు కూడా ఆ ప్రాంత గొప్పదనం తెలియదు కాని సినిమా పరిశ్రమ ఆ ప్రాంత గొప్పదనాన్ని గుర్తించడమే కాదు అక్కున చేర్ఛుకోవడమే కాదు ప్రసిద్ది పొందేలా చేస్తుంది .అటువంటి అరుదైన ప్రదేశమే తమ్మయ్యపేట చింతచెట్టు.కొత్తపల్లి మండలంలో ఓ మారు మూల కుగ్రామం తమ్మయ్యపేట.కాని సినీ పరిశ్రమకు ప్రకృతి ప్రసాదించిన అరుదైన అపురూపమైన సహజ సుందర సినీ సెట్టింగు మన తమ్మయ్యపేట చింతచెట్టు .సినీ పరిశ్రమ తమ్మయ్యపేట చింత చెట్టును తమ కెమెరాలలో ఎంతో అందంగ చిత్రీకరిస్తూన్నాయి. పురాతన చింత చెట్టు ఆ చింత చెట్టు చుట్టూ రచ్చబండ, పారే ఉప్పుటేరు,వందల పడవలు పయనిస్తూ వెళ్ళటం ,చిన్న పడవల పై చేపలు పట్టే జాలరులు , ఆ సుందర దృశ్యం చూసి తీరవలసిందే.అందుకే ప్రముఖ దర్శకులు క్రిష్ లాంటివారిని వెబ్ సీరిస్ తీసేలా చేసింది.మత్య్సకారుల జీవన విధానం పై చిత్రీకరణ జరపాలంటే తమ్మయ్యపేట చింత చెట్టు ప్రాంతానికి మించినదిలేదు.ఎందరో ప్రముఖనటులు ఈ చింతచెట్టుక్రింద రచ్చబండ సీనుల్లో నటించి పేరుతెచ్చుకున్నారు. తమ్మయ్యపేట గ్రామస్తులు మెల్లగ షూటింగులకు అలవాటు పడ్డారు.నటులకు సహకరించడం, షూటింగు అవసరాలు తీర్చడం,పడవులు వలలు సమకూర్చడం చేస్తూ కాస్తో కూస్తో షూటింగుల ద్వారా సంపాదించడం నేర్చుకున్నారు.షూటింగులకు వచ్చే వారికి చేపల కూరలు వండి పంపిస్తూ ఆనందిస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ హిరో శాసన సభ్యులుగ ఉన్న నియోజకవర్గంలోనే ఉంది తమ్మయ్యపేట.ఇటువంటి ప్రసిద్ది పొందిన తమ్మయ్యపేట చింతచెట్టు మరికొద్ది రోజుల్లో కనుమరుగు కానుండటం విచారించవలసిన విషయం.ఉప్పుటేరు కోత వలన తమ్మయ్యపేట చింతచెట్టు ప్రమాదంలో పడింది.యేటిగట్టు ఇసుక ఉప్పుటేరు ఆటు పోట్లకు అండలు అండలుగ జారిపోతుంది.స్దానిక ప్రజా ప్రతినిధులకు,అధికారులు కళాపోషకులు కాకపోవడం వలన తమ్మయ్యపేట చింత చెట్టు ప్రాధాన్యత తెలియటం లేదని సినీ పరిశ్రమకు చెందినవారు వాపోతున్నారు.స్దానిక సినీ కళాకారులు ముక్తకంఠంతో పిఠాపురం శాసన సభ్యులు ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి యేటి గట్టు రక్షణకు నిధులు మంజూరు చేయవలసినదిగ విఙ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు షూటింగు చేయడానికి మాత్రమే పనికి వస్తుందని అదే యేటిగట్టును బలపరచడం వలన చింత చెట్టు చుట్టూ షూటింగ్ చేయడానికి వీలు పడుతుందని సినీ దర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రహదారి మార్గం అభివృద్ది చేయవలసినదిగ కోరుతున్నారు. దీనివలన పెద్ద సినిమాలు కూడా షూటింగులు జరుపుకునే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
మహర్
మహర్ అంటే మాల ఏది నిజం
అంబేద్కర్ రాసిన అంటరానివారు ఎవరు
పుస్తకంలో మహారాష్ట్రలో మహర్ లు చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉన్నారు క్రీ శ 600 వందల సంవత్సరం నుండి ఇది ఉంది.అక్కడ మహర్లు చచ్చిన గొడ్డు గురించి తగువులాడి మరీ తీసుకునేవారు.ఇక్కడ ఆంధ్రలో మాదిగలు ఇదే హక్కు కలిగి ఉన్నారు.అయితే అంబేద్కర్ నిర్దారించిన దాని ప్రకారం ఆవు మాంసమే అంటరాని తనాన్ని సృష్టించింది.యఙ్ఞాలలో ఆవులను పరిశుభ్రమైన తాజా మాంసాన్ని తినే బ్రాహ్మణులు క్రీ శ 600 నుండి తినడం మానివేసారు.కాని ఊరు చివర పేదరికంలో బ్రతికే వారు దీనిని మానుకోలేదు సరికదా తాజ మాంసం తినే సంపద వారి దగ్గరలేదు.అందుకని చనిపోయీన గొడ్డు గురించి గొడవ పడి అది హక్కుగ పొందే లా చేసుకున్నారు.అది అపరిశుభ్రత అసహజం నుండి అంటరాని తనానికి దారి తీసింది.ఆపును మరింత పవిత్ర జంతువును చేయడంతో ఈ అంటరాని తనం మరింత ముదిరింది.మహరాష్ట్రలో మహర్ లు దీనిని హక్కుగ కలిగి ఉన్నారని అంబేద్కర్ రాసారు.అయితే మహర్ లు కూలీలుగ కుల వృత్తిలేని వారిగలేరు.వారు చర్మశుద్ది చేసారు.ఇక్కడ మాదిగలు అదే హక్కు కలిగి చర్మ వృత్తి కలిగి ఉన్నారు.ఇక్కడ మాలలు కుల వృత్తిలేకుండా వుండి కూలీలుగ ఉన్నారు. అంబేద్కర్ పశుమాంశ భక్షణను తీవ్రంగ వ్యతిరేకించారు.తినవద్దని మహర్ లను కోరారు.ఆయనకు దక్షిణాది రాష్ట్రాలలో ఏం జరుగుతుందో తెలియదు అని రాసారు.ఆయనకు అన్ని రాష్ట్రాల షెడ్యూలు తెగల జీవన విధానంపై స్పష్టమైన అవగాహనలేదని అన్నారు.ఎందుకంటే సమాచార వ్యవస్ద అప్పటికి ఏం మాత్రం అభివృద్ది చెందలేదని మనకు తెలియందు కాదు.ఆయనకు మహర్ లు పశుభక్షణ చేయటం ఇష్టంలేదు.మరి మాలలు ఎందుకు మహర్ లు మాలలు అంటున్నారో అర్దం కాలేదు.అంబేద్కర్ తన కులాన్ని చర్మకార వృత్తి కలిగినదిగా చెప్పుకుంటానికి ఒకరకంగా ఒప్పుకోలేదు.అందుకే మాలలు మహర్లను ఒక గాటిన కట్టి అందులో ఉంచాడు.అందుకే మాలలు ఆయనను మా వాడు మా మాల వాడు అంటున్నారు.కాని అంబేద్కర్ మహర్ లు చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉన్నారు అన్నారు.మరి మాలలు చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉండటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.లేదంటే మహర్లు మాదిగలు ఒకటే అని ఒప్పుకుంటే బాగుంటుంది
ఓ మనస్సా
ఓ మనస్సా ఎందుకు
తలపులలో తూగుతున్నావు
తొలిగాయపు ఆనవాలును
గాలిపటంలా ఎందుకు
వెతుకుతున్నావు
ఓ మనస్సా ఎందుకు
తలపులలో తూగుతున్నావు
తొలిగాయపు ఆనవాలును
గాలిపటంలా ఎందుకు
వెతుకుతున్నావు
ఆకులు రాలిన అడవిని
ఎందుకు గురుతు చేస్తున్నావు
సోలిన పూలదారిన
ఓ మనస్సా ఎందుకు నడుస్తున్నావు
ఆకులు రాలిన అడవిని
ఎందుకు గురుతు చేస్తున్నావు
సోలిన పూలదారిన
ఓ మనస్సా ఎందుకు నడుస్తున్నావు
ఓ మనస్సా ఎందుకు
తలపులలో తూగుతున్నావు
తొలిగాయపు ఆనవాలును
గాలిపటంలా ఎందుకు
వెతుకుతున్నావు
ఓ మనస్సా ఎందుకు
తలపులలో తూగుతున్నావు
తొలిగాయపు ఆనవాలును
గాలిపటంలా ఎందుకు
వెతుకుతున్నావు
చిరునవ్వుల పలువరసను
చిరునవ్వుల పలువరసను
పలువరసల పదాలతో కొలుస్తున్నావు
ఓ మనస్సా నీకెందుకంత ముస్తాబు
ఓ మనస్సా నీకెందుకంత ముస్తాబు
మంచుకలసిన మకరందంలా
ఊహలపల్లకి తిరిగిన చోటును
ఓ మనస్సా ఎందుకు పలవరిస్తావు
మంచుకలసిన మకరందంలా
ఊహలపల్లకి తిరిగిన చోటును
ఓ మనస్సా ఎందుకు పలవరిస్తావు
ఓ మనస్సా ఎందుకు పలవరిస్తావు
మరచిన వలపు చల్లని మేఘంలా
నా మనసును ఎందుకు పిలుస్తుంది
పదాలు ఆవిరైన చీకటి దారిలో
పెదవులు తడుపుతున్న తుషారబిందువులా
నా మనస్సెందుకు ఉరుకుతుంది
మరచిన వలపు చల్లని మేఘంలా
నా మనసును ఎందుకు పిలుస్తుంది
పదాలు ఆవిరైన చీకటి దారిలో
పెదవులు తడుపుతున్న తుషారబిందువులా
నా మనస్సెందుకు ఉరుకుతుంది
దేనిని వెతుకుపోతుందీ ఈ నడక
మతిలేని నడకకు నిదురేలేదు
పచ్చని కొనలు కునుకుతీస్తున్నాయి
దేనిని వెతుకుపోతుందీ ఈ నడక
పచ్చని కొనలు కునుకుతీస్తున్నాయి
లోయ దారి హాయిని పరిచి రమ్మంది
వనదేవత నా నడకను చూసి మురిస్తుంది
వనదేవత నా నడకను చూసి మురిస్తుంది
తొలి తలపు లేవకముందే
తెలవారుతున్న తీరానికి
చేరుకుంటానులే మనస్సా
తొలి తలుపు తెరవకముందే
ఏ తూనీగలు ఎగరకముందే
తెనే చుక్కలు రాలకముందే
తొలి కిరణం చేరకముందే
నిశ్శబ్దంగా నడుస్తు చేరుకుంటానులే
నిశ్శబ్దంగా నడుస్తు నిను చేరుకుంటానులే
మాదిగల పై చివరి సందేశం
మాదిగ జనమా వర్దిల్లు
వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు
ప్రపంచ పటమే నీ రూపం
ఇక వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు
మాదిగ జనమా వర్దిల్లు
వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు
ప్రపంచ పటమే నీ రూపం
ఇక వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు
మాదిగ జాతి ఎగబాకు
దిగువ నుంచి ఎగువకు ఎగబాకు
ఎగబాకు పై పైకి ఎగబాకు
నీ తెగువే నీ ఊతం
ఎగబాకు ఎగబాకు ఎగబాకు
విద్య నీ పాదాక్రాంతం కావాలి
విద్యలన్నీ నీ పాదాక్రాంతం కావాలి
వింద్య హిమాచలం కావాలి
సంపదలో సాగరాన్ని మించిపోయ్
లే లే మాదిగ జనమా లే లే
నీ చరిత్రను నువ్వే తవ్వి తీసేయ్
నీ చరిత్రను నువ్వే రాస్తూ పోవోయ్
మాదిగ జనమా వర్దిల్లు
వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు
ప్రపంచ పటమే నీ రూపం
ఇక వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు
మాదిగ జనమా వర్దిల్లు
నీ చూపు ఇక సంపాదనపై నిలవాలి
బంగారంపు గనులలో నువు వాలాలి
నీ ఇల్లు ధనరాశులతో తులతూగాలి
మాదిగ జాతి వర్దిల్లు వర్దిల్లు
వర్దిల్లు వర్దిల్లు వర్దిల్లు
ఈ దేశపు భూమి నీదేనోయ్ నీదేనోయ్
ఈ భూమి మన జాంభవునిది
ఈ కొండలు కోనలు చేలు చెలములు
ఆక్రమించు ఆక్రమించు ఆక్రమించు
శ్రమిస్తూ ఆక్రమించు ఆక్రమణకై శ్రమించు
ఈ దేశపు మట్టి నీదేనోయ్ నీదేనోయ్
మాదిగ జనమా లే లే లే
తిను తిను తిను కావలసినంతా తిను
ఈ దేశపు పంట నీదేనోయ్ నీదేనోయ్
మాదిగ జనమా లే లే లే
తిను తిను తిను కావలసినంతా భుజించు
ఈ దేశపు పంట నీదేనోయ్ నీదేనోయ్
ఈ పండ్లు గింజలు నీవేనోయ్ నీవేనోయ్
పొదుపుతో ఆక్రమించు క్రమంగా ఆక్రమించు
పొదుపే నీ పని నీ ధ్యాస నీ శ్వాస
ఆక్రమించెయ్ ఈ దేశం నీదే
ఆక్రమించు శ్రమిస్తూ తపిస్తూ
ఆక్రమించు క్రమంగా ఆక్రమించెయ్
రాజులలో ప్రధముడివి
శూరత్వం నీ ఇంటిపేరు
చేపట్టెయ్ చేపట్టేయ్
అందిన పదవులు చేపట్టేయ్
అందినంతా అదిమి పట్టేయ్
మాదిగ జాతి వర్దిల్లు వర్దిల్లు
నిలబడు నిలబడు నిలుస్తు కలబడు
అంతా నీదే అంతా నీదే
ఓ మాదిగ జాతి వెలుగులు చిందేయ్
వెలుగుల్లో నీ జాతిని వెలిగించేయ్
వెలుగుల్లో నీ జాతిని వెలిగించేయ్
ఉగాది 2026 కవిత
పరాశురభాణం
ఉగాది కవిత
రచన బెన్ జాన్సన్
బాల సాహితీ రచయిత
పరాభవం పరాభవం
మానవజాతి మానవత్వానికి
అహింసా చేతి కర్రకు పరాభవం
ప్రపంచ లేత చిగురుల మొలకలను
యుద్దోన్మాదపు కారుమేఘాలు కాల్చేస్తున్నాయి
పనిలేని ఆక్రమణ ఉన్మాదం గీతలు దాటేస్తుంది
పరాభవం మానవ హితిహాసాల
పరాభవాలకు ట్రంకు (ట్రంపు ) పెట్టె దొరికింది
దాని తాళం తగులబెట్టే తాండవం ఎక్కడుంది
మహానుభావులందరు ఆదిమానవులై
అడవుల్లో రాతిగుహల్లో దాకున్నారేమో
రాజ్యోన్మాదపు నగలు గలగలలాడుతూ
వికృత రూపంలో గజ్జెల శబ్దం చేస్తున్నాయి
మేధావుల పిడికిలి పిరికిదైపోయిందేమో
గర్జలను గెద్దలు ఎత్తుకు పోయాయేమో
ఓ ప్రపంచ గొంతుకా బొంగురు గొంతుకతొ
దురాక్రమణలపై గీతాలు అల్లుకో
గ్రీష్మపు ఎండల గీరలు తెరలు తెరలుగ గీరెక్కి
ముందుగానే ప్రపంచాన్ని గీరేస్తున్నాయి
ఆకులు పూలు రాలే కాలంలో
మత విధ్వంసాలు ప్రపంచమంతా
హోలీ రంగులు పులుము కుంటున్నాయి
పరాభవం ప్రేమభావనకు పరాభవం
పరాభవం సోదర ప్రేమకు పరాభవం
దిక్కులు పిక్కటిల్లే బాంబుల మోతలకు
శాంతికపోతాలు ఏ దిక్కులకో ఎగిరిపోతున్నాయి
పరాభవం శాంతిని కోరే మనసులకు
మనుషులకు మమతలకు ఘోర పరాభవం
ఏ పరా శురుడో రావాలి
ఏ పరాశురభాణమో సంధించాలి
ప్రపంచ అశాంతి రాకాసి మూకల
కుత్తుకలు తెగనరికి వేల వేల కాంతి
సంవత్సరాల దూరాలకు విసిరి పారేయాలి
సామ్రాజ్యవాదపు దురాశల దుర్నీతిని
పచ్చడి పచ్చడి చేసేయాలి
మానవ వికాస ఆనందాలకోసం
ప్రపంచ శాంతిని జన్మింపజేయాలి
పావన నవజీవన బృందావన
సౌందర్యం వెల్లివిరియాలి
అదే ఉన్నతమైన జన్మ
అదే అసలైన పరాభవనామ సంవత్సరం
అదే అసలైన పరాభవ నామ సంవత్సరం
మిత్రులందరికీ
ఉగాది శుభాకాంక్షలు
Tuesday, January 27, 2026
Saturday, January 17, 2026
అది 1971 తారు రోడ్లు అంతగాలేని కాలం.
అమీనాబాద మా అమ్మమ్మగారి ఊరు .అమ్మ తొండంగిలో టీచరుగా పనిచేసేది.వేసవి సెలవులకు నన్ను తీసుకుని ఉప్పాడ శివారు అమీనాబాద అమ్మమ్మ ఇంటికి తీసుకు వచ్చేది. అమీనాబాద గ్రామం మొదల్లో రెండు నుయ్యిలు , రెండు దేవతల గుళ్ళు, మధ్యలో రావిచెట్టు ఉండేవి.ఎక్కడైనా మాదిగపేట ఊరు చివరన ఉంటుంది.ఇక్కడ ఊరు మొదల్లోనే ఉండేది. అందువలనేమో అమీనాబాద మాదిగపేటటంటే చుట్టు ప్రక్కల గ్రామాలకు గౌరవం ఉండేది. ఊరులోకి వెళ్ళేప్పుడు ఎడమ ప్రక్క మామిడి తోట ఉండేది. అందులో సీతాఫలం చెట్లు అక్కడక్కడ రెండు కొబ్బరిచెట్లు.జిల్లేడు, రక్కీసు,సీతమ్మోరు పొదలు,పల్లేరు పాదులు ఉండేవి.తోట మధ్యలో నీటి గుంటలు ఉండేవి. చుట్టూ అంతా ఇసకక్షక్ష
క్ష
క్ష
క్షహక్ష
ౄ కోరడి ఉండేది.దాని మీద బ్రహ్మజెమ్ముడు మట్టలు గుచ్చి ఉండేవి అవి చాలా ఎత్తుగా పెరిగేవి. వాటికి కమల పువ్వులాంటి పూలు గుత్తు గుత్తులుగా ఉండేవి. వాటి వాసన బలే గమ్మత్తుగా ఉండేది.అక్కడక్కడ కనకంబరం పొదలు కొరడి వారల్లో ఉండేవి.కుడి ప్రక్కన మాదిగపేట ఉండేది.మధ్యలో ఇసకబాట ఉండేది.మాదిగ పేటకు అమీనాబాద వాడపేటకు మద్యలో బారికి వీరన్న జామతోట ఉండేది. రాత్రి ఏడు ఎనిమిది అయ్యిందంటే మాదిగపేట దాటి వాడపేటలోని వెళ్ళడానికి బయపడేవారు.మాదిగపేటదాటి సీకోటి భూలోకు ఇంటివరకు దెయ్యాల్లాంటి తాటి చెట్లతో నిర్మానుష్యంగా బిక్కు బిక్కుమంటూ ఉండేది. కిరసనాయిలు బుడ్డీ పెట్టిన లాంతర్లు పట్టుకుని వెడితే కాని దారి కనబడేది కాదు అప్పటికి కరెంటు లేదు.ఉప్పాడలో కరెంటు స్ధంబాలు ఉన్నా 60 వాట్ల గాజు బల్బులు వెలుగుతూ ఉండేది. ఆ వెలుగు ఆ స్ధంబం కిందే ఉండేది.నేను నా వయస్సు వారైన రక్థసంబందీకుల స్నేహితులతో ఆడుకునేవాడిని. ఆ రోజుల్లో వెన్నెల పట్టపగలంత కాంతి వంతంగా ఉండేది. చందమామ వెలుగు కళ్ళల్లో జిగేలు మనేది.స్వచ్చమైన కాలుష్యం ఎరుగని వాతావరణం అది . మంచుకి వెన్నెల వెలుగుకూ చలివేసేది.దానికి తోడు పాదాలు మునిగేంత లోతైన ఇసక ఊరంతా ఉండేది.ఆ ఇసకలో పిల్లలం గూళ్ళు కట్టుకుని ఆడుకునేవాళ్ళం.ఆకలి మరచి ఆడుకునేవాళ్ళం ఊరంతా తాటాకు ఇళ్ళే ఇళ్ళమద్యన పరిగెడెతూ ఆడుకునేవాళ్ళం.ఇళ్ళమధ్య పరిగెడుతూంటే ప్రతీ ఇంటి దగ్గర కూరల పులుసుల వాసన గుమాయించేది. చేపల పులుసు, ఎండు చేపల పులుసు, ఎండుకక్కల కూర,కరుగులు సమురు వాసన ముక్కుపుటాలను అదరగొట్టేవి. ఒకొ ఇంటి దగ్గర కమ్మటి కల్లు వాసన వచ్చేది. ఆడపిల్లలు మగపిల్లలం కలసి ఆడుకునేవాళ్ళం.చాలా సేపు ఆడుకునేవాళ్ళం. నేను ఊరునుండి వచ్చేవాడిని కాబట్టి ప్రతీ కుటుంబం ప్రేమగా చూసేవారు. పెద్దవాళ్ళయితే ముద్దలు తినిపించేవారు. ఎవరో ఒకరి ఇంటి దగ్గర తినేసేవాడిని.అప్పుడప్పుడు మాదిగ మాష్టీల ఆడపిల్లల డాన్సు ప్రొగ్రాం ఉంటుండేది. హర్మోనియం, డోలుకుతో మగాడు పాట పాడుతుండే ఆడపిల్ల మోకాళ్ళు దాకా గౌను వేసుకుని బలే ఢాన్సు చేసేది.తరువాత మాదిగలు పెట్టే భోజనం తినే పోయేవారు.
నేను ఆడుకుని ఆడుకుని ఇంటికి పోయేవాడిని మా ఇల్లు పేటకు చివరన పుంతకు ఆనుకుని ఉండేది.నేను పుంతలోకి చూసేవాడిని కాదు ఎందుకంటే పుంతలో కొండికికాయల చెట్టు ఉండేది.దాని మీద దెయ్యం ఉంటుందేమోనని భయం వేసేది.వెన్నెల వెలుగుకి చెట్టు నీడతో పుంత చీకటిగా ఉండేది. ఆడవారు ఇద్దరు ముగ్గురు కలసి చెంబులు పట్టుకుని మరుగుదొడ్డిగి పుంతంటే వెళ్ళేవారు. వెడుతూ వెడుతూ బయట నులకమంచం మీద కుర్చుని తలదువ్వించుకునే మా అమ్మను పలకరించి పోతుండేవారు. రాత్రి పది దాటిందంటే ఊరంతా నిద్రలోకి జారుకునేది. రెండు నులక మంచాలు వేసి ఇంటి ముందు వాకిట్లోనే వెన్నెల చల్లదనంలో పడుకునే వాళ్ళం. దోమలు లేని కాలం అది. హాయిగా గురకపెట్టి పడుకునే కాలం. అమ్మ త్వరగానే నిద్రలోకి జారుకునేది .నేను మా అమ్మమ్మ గంగమ్మ మంచంలోకి పోయి పడుకునేవాడిని. ఎందుకంటే మా మామ్మ మంచం క్రింద వెచ్చటి కుంపటి ఉండేది .దాని వెచ్చదనం బలే ఉండేది. తొందరగా నిద్రవచ్చేది. మా మామ్మ చుట్ట కాల్చేది. ఆ లంక పొగాకు వాసన బలే మత్థుగా ఉండేది.మా మామ్మ మా అమ్మ చూడకుండా చుట్ట కాల్చమని ఇచ్చేది . నేను గబ గబా పొగలాడేవాడిని .పొగ ఎలా వదలాలో తెలియక ఉక్కరి బిక్కిరి అయ్యోవాడిని. కళ్ళవెంట నీళ్ళు వచ్చేవి. మామ్మ కంగారు పడి చేవండి చెంబుతో నీరు తాగించేది. మెల్లగా ముసుగు వేసి పడుకునే లోగా ఎక్కడి నుండో అరుస్తూ అరుస్తూ తీతుకు పిట్ట కీచుపెట్టుకుంటు ఇంటి మీద నుండి ఎగురుతూ అటూ ఇటూ తిరిగేది.దాని అరుపంటే ఆ రోజుల్లో అందరూ భయపడి చచ్చేవారు. అది ఇంటి మీదనుండి ఎగిరితే
ఆ ఇంటిలో కాని ఆ పేటలోకాని ఎవరో ఒకరు చనిపోతారని నమ్మకం. మా అమ్మమ్మ దాని అరుపు విని తుళ్ళి పడిలేచి ఆ తీతుకు పిట్టను నానా భూతులు తిట్టేది. నానా శాపనార్దాలు పెట్టేది.మా అమ్మమ్మ తిడుతుంటే దుప్పట్లో భయపడి దాకునేవాడిని. భయంతో హడలిపోయేవాడిని. నా ఇల్లే దొరికిందంటే దొంగముండా నీకు, నా మనవడు లేకలేక వస్తే మా మంచం మీద ఎగురుతున్నావు నీకు పోయేకాలం వచ్చిందంటే అని తిడితూ నన్ను ఒడిలో పొదిమికొని దుప్పటి కప్పి పడుకొబెట్టేది మా అమ్మమ్మ. ఇఫ్పుడు తీతీకు పిట్టలేదు. దాని అరుపు విందామన్నా లేదు.ఎక్కడికి పోయాయో ఎంటో .ఆ జాతి పిట్టలు అది నల్లగా ఉంటుందంట.దాని తోక పొడపుగా ఉండి చివర కత్తెరలా ఉంటుందట. దానిని కత్తిరి పిట్టఅని కూడా అనేవారు ఆ రోజుల్లో.
Thursday, January 15, 2026
దొమ్మరాట
గ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ఈల వేస్తూ హౌరియా, హౌరియా అంటూ వేగంగా మొగ్గలు వేస్తూ వినోదాన్ని వంచే వారు పలురకాలుగా చేసే విన్యాసాలలో కూడినదే ఈ దొమ్మరాట, దొమ్మరలు ఈ దొమ్మరాటను కడతారు. సంక్రాంతి పర్వదినాలలోనూ. కోతల సమయంలోను మనకు కనిపించే ఈ కళారూపం ఆంధ్రనాట అతి ప్రాచీన కళారూపంగా దొమ్మర సాములు అని పిలవబడే బొమ్మరి కుటుంబాలలోని ఆడపడుచులు ప్రధాన ఆకర్షణ నిలిచి ఈ బొమ్మరాటను రక్తికట్టిస్తారు. మనం ఈనాడు సర్కస్ అని పిలువబడుతున్న దానికి మూలం ఈ బొమ్మరాటే అంటారు. ఇందులో సర్కస్ మనం చూసే విన్యాసాల మొగ్గలు, ఊయాలూగడం, తీగపై గెడసహాయంతో నడవడం. తీగమీద సైకిలు నడపడం, గెడను తలకిందకు పెట్టి పైర్ ఎక్కడం, బండరాళ్ళను మోచేతిలో పగలగొట్టం వంటి విన్యాసాలతో ఈ దొమ్మరాట మా సేవారిని కదలనీయకుండా చేస్తుంది.
13వ శతాబ్దంనాటి సాహిత్య చరిత్రలో తన పేరును ప్రముఖ కవులలో ఘనంగానే ఈ దొమ్మరాట రాయించుకుంది. పాల్కూరి సోమనాథుడుతన పంచదారాధ్య చరిత్రలోనూ, శ్రీనాధుడు శృంగార నైషదైరిలోను నాచన సోమన ఉత్తర హరివం శరిలోనూ, చంద్రశేఖ చరిత్ర లోను ఈ దొమ్మలాటను గురించి రాయబడింది. విజయనగర రాజుల కాలంలోనూ మహార్నవమి ఉత్సవాలలోనూ దొమ్మరి వారు క్రూరమృగాలలో వళ్ళు గగుర్పాటు చేటల్ల విద్యాసాలు ప్రదర్శించే వారని కూడా అరబుల్క్ అనే విదేశీయుడు రాసాడు.
బొమ్మరి విద్య వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఈ దొమ్మరి కుటుంబాలలోని వారు చిన్ననాటి నుండే ఈ విద్యలో తర్పీదు పొందుతూ ఉంటారు. దొమ్మరాట కట్టే వారు గ్రామంలోనికి పోయి గ్రాము పెద్దల అనుమతి కోరతారు. అనుమతి అభించగానే ఓ పెద్ద వెదురు గడను ఊరి మధ్య నిలబెట్టి దానిని నలువైపులావ తాళ్ళతో లాగి కడతారు. వెదురు గడ చివర ఇనుప ఊచ ఉంటుంది. అదే గెడకు దూరంగా మరో గెడను నిలిపి గెడకు ఈ గెడకు మధ్య బలమైన ఇనుప తీగను కడతారు.
బొమ్మరాటకు ముందు డప్పు, డోలు, బుల్బుల్ లేదా హార్మోనియం ఉపయోగించి హుషారెత్తించే పాటలు పాడతారు. దానికి తగ్గట్టు చిన్న పిల్లలు వాని పడుచుయువతులు రాని డాన్సు కడతారు. పడుచులు కిట్టి బస్సును చూసి యువకులు హుషారుగా ఈలలు వేస్తూ ప్రదర్శన చుట్టూ గుమిగూడతారు. మొగ్గలుతో ప్రారంభమయ్యే దొమ్మరాటకు చక్కిలి గింతలు పెట్టే వాత్యానంలో దొమ్మరాటను ఆడించే పెద్ద ఒక్కోవిన్యాసాన్ని ప్రవేశపెడతాడు. మనిషి దూరలేని గూడ్రటి ఇసుప చట్రాన్ని తీసుకుని అందులోంచి వరుసగా యువతీ యువకులు సులువుగా దూరం నుండి పరిగెత్తుకువచ్చి మొగ్గలేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
బొమ్మరి బృందంలోని బలమైన యువకుడు, ఆనచేతికి గుడ్డను చుట్టుకొని బండరాయిని ముక్కలు ముక్కలుగా చేయడం ఓ విన్యాసం. వీరి ఆటలోని ఆఖరి అంశం సాని గెడ ఎక్కడం చేతిలో దాదాపు పాతిక అడుగుల పొడవైన గెడపట్టుకుని ముందుగా అటూ ఇటూ కదలకుండా పొడవైన ఎదురు కర్రలకు బిగించిన ఇనుపతీగపై ఒదువుగా నడుస్తుంటూ చూసే ప్రక్షలు ఈలలు వేయకుండా ఉండలేరు. తీగపై ముందుకు పరిచిన యువతి మరలా అలాగే వెనక్కితిరిగి కొంత సేపు తీగపై నడుస్తుంది. ఆతరువాత మధ్యలో నిలబెట్టిన వెదరు గడను కణుపుల వద్ద కాలి వేళ్ళను నొక్కి పెట్టి నిచ్చెనొక్కి నట్లు పైకి ఎక్కి ఆస బొడ్డు దగ్గర బిగించుకున్న ఇనుప బిళ్ళలో గెడకుగల ఇనుప ఊచను ఉంచి గాలిలో పదుకుని డప్పు మోత ఉదృతంగా వినిపిస్తుంటుగా గిర్రున తిరుగుతూ సంబ్రమచ్చర్యాలకు గురి చేస్తుంది. ఒక్కొర్టు సారి ప్రేక్షలు గెడసాని కింద విడిపోతుందేమోనని బయంతో కేకలు కూడా వేస్తుంటారు.
చిన్న పిల్లలు చేసే కసరత్తులు బలే సరదా అనిపిస్తాయి. ప్రదర్శన చివరిలో చుట్టూ చేరిన వారి నుండి డబ్బు యాచిస్తారు. గ్రామంలో 3 నాలుగు ప్రదర్శనన్చి మరో గ్రామం పోతూ సంచార జీవనం గడుపుతూ ఉంటారు ఈ దొమ్మరాట ఆడేవారు. దొమ్మరాట ఆడేవారు పెద్దాపురం. రాజానగరం వంటి ప్రాంతాలలో మన జిల్లానందు నివసిస్తూ ఉన్నారు.
పిట్టల దొర
పోన్య సంబాషణా చాతుర్యంతో ఇంటిసారిని కడుపు వున్న నవ్వించే కళారూపం పిట్టలదొర జాతీయ అంతర్జాతీయ స్థానిక విశేషాలను కోడి అబద్దాలను Cలుగా మాట్లాడుతున్న వేషగానిపై ఏమాత్రం కోసం చూపించకుండా కళారూపాన్ని ప్రేక్షకులు అస్వాదించడం ఈ కూరు ఎంటోనీ ప్రత్యేకత. ఈ వేషాల్ని పగటి వేషాలలో మనం ప్రముఖంగా చూడగలం, ఈ పిట్టల దొర వేషాన్ని వివిధ ప్రాంతాలలో రకరకాలు పేర్లతో పిలుస్తారు. వైర లత్కోరుబ్ బుద్దర్ ఖాన్ ముపాచీనాయడం అని అంటారు. ఈ వేషం పగటిపూలే కడతారు. ఈ వేషం కూడా.
అనాదికాలం నుంచీ గ్రామీణులకు మత సాంఘించ విషయాలపై ఆసక్తిని కలిగించడం సత్యాలక్షవం, సామాజిక మేలుకొలుపులే ప్రధాన ఉద్దేశ్యంతో రూపొందిన సరస హాస్యపాత్రగా పిట్టలదొర వేషం మిలచబడింది. పల్లెల్లో స్వేచ్ఛగా తిరుగుతూ వినసొంపుగా అశువుగా మాటలు అల్లుకుంటూ బహు వేగంగా పదాలు దొర్తిస్తూ సమకాలీన సమాజంలోని లొసుగులను తమాషాగా వర్లిస్తూ ఈ వేషం దక్తి కట్టిస్తుంది. ఆలోచింప.
పిట్టల దొర వేషంలో గొప్పలు చెప్పకుంటూ ఉపన్యసిస్తూ అభినందనలు మాలో వారి ఈ వేషం మనిషి పేరడిని పోలి ఉంటుంది. బహుశా 1. బ్రిటీష్ వారు మనదేశంలో స్థిర పడుతున్న రోజుల్లో ఈ వేషం ప్రాచుర్యంపొంది బండవచ్చు ఖాకీ వేషధారణ, ప్యాంటు తిరుగులతో కూడిన కోటు దొవటోపి, రంగు చొక్యా టక్ చేస్తాడు. బూట్లు వేసుకుంటాడు. హిట్లరు మీసం ఉంటుంది. చేతిలో చెక్క తుపాలీ ఉంటుంది మెడలో సుమాలు కబ్బుకుంటాడు. గ్రామంలోకి రాగానే సంతోషములుముకుని ఆనందపడుతూ ఉంటారు. ముఖానికి బూడిద పులుముకుని బొగ్గుతో మీసాలు రుద్దుకుంటాడు. ఈ వేషగాడు గ్రాములలోకి రాగానే ఎక్కడ ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరిపోతారు అతని వెంట గ్రామమంగా తిరిగి సంబరపడుతూ ఉంటారు. పిట్టల దొర వెంటపడే కుక్కల పైన, పిల్లలపైన జోకులు వేస్తూ ఇంటింటికి తిరిగి ఘరానాగా యాచన (రాయల్ గంగ్) చేస్తాడు. ఈ దేవదు ఏ గ్రామం వెళ్లిన పిన్నలు పెద్దలు ఆసక్తికనబరచి ఆదరించేవారు. వీరిని ఆనందపరచడానికి అన సంభాషణా బాతుర్యాన్ని ఇలా వినిపిస్తూ తన కళా ప్రదర్వన మొదలెడతాడు.
గుడ్ మార్నింగ్ సాద్, అదేమిటిలా ఆశ్చర్యపోతున్నారు? నేను సాత్ పిట్టల దొరని, మా తాత గుట్టల దొర మానాన్ని తట్టల చొరనాధ్ మీ తాత దగ్గర మా తాత మూడు పూళ్ళు అప్పు తీసుకున్నాడు సార్ అది అలాగ అలాగ వెదు ఊళ్లలయ్యిందిసాద్ అరువు బరువు చేటని ఆ వెడువూరు తట్టలో పెట్టుకుని నెత్తిన మోసుకుంటూ వస్తుంటే ఇస్సాదియ్యా కాకి వచ్చి తిట్టతో సహా కాళ్లతో తన్నుకు పోయింది సార్.
అన్నట్టు మీ లాంటి గొప్పవారు అలా చేసారేమిటి సార్! మా నాయనమ్మ మూడో పెళ్ళికి రమ్మని కాకి వెంట కాడి, కాకి వెంట కారి జొప్పున వంద కాకులను పంపించానుసార్ కాకి తిరిగొచ్చిన పాపానపోలేదు సార్, మీద లేవలేక ఇక్కడే కాపురం పెట్టమని తరువాత తెలిసిందిసార్.
మీరు రాకపోయే సరికి మీ కోసం నేనే పద్దామని బయలు దేదాను సార్, ఇంతకీ నా సంగతి మీకే ముందే తెలుసుంటుంది సార్. నా పెళ్ళికి బెల్లు గంగాళంలో అన్నం పంచానుసార్, ముళ్ళలో చేసిన స్వీట్లు తిని చుట్టాలందరూ మెచ్చుకున్నారుసార్ చేస్తే పిట్టలదొర పెళ్ళిలో చేసిన స్వీటులాగే చేసుకోవాలని చుట్టు పక్కల గ్రామాల వాళ్ళందరూ తీర్మానించుకున్నారు సార్, నేను కట్టించిన సముద్రంపైన వంతెన తొలకరి కల్లులనే కొట్టుకుపోవడంతో ప్రపంమంతా నస్సు ఒక మెచ్చుకుందిసార్ నేను తప్పిన ముయ్యిలు ఎండాకాలం నిండిపోయి, స్నానాలకు పోయిన వారిళ్ళంతా మునిగిపోయిన ఆంధ్రా అంతా అల్లకల్లోలమయ్యింది. సార్. ఈ పాటికి నేను మీకు పూర్తిగా తెలుసుంటాను సార్..
మీ దగ్గరకు రావాలని విమానమీదొద్దామంటే పల్టీలు కొట్టి పడి పోయేమోనని, రైలు మీడొద్దామంటే పట్టాలు తప్పుతుందేమోనని, కారు మీదొద్దామంటే దేనికైనా గుడ్డు కుంటుందేమోనని, బండి మీదొద్ది మంటే బోల్తాపడుతుందేమోనని ఓడయితే ముగిపోతుందని ఆలోచించి ఎందుకొచ్చిన బాధని కాలినడకన ముక్కు సూటిగా బయలదేరి ముచ్చలగుంటికి దక్షిణంగా తిరిగి కాకులు దూరని కావడవి, భీమలు దూరని గండభేరుండాలు, విలుగులు, పులుగులు మద్దులు, మారేళ్ళు, వెళ్ళళ్ళు, రొయ్యల పీతలు, కెల్లల మీదుగా ఏడేడు సప్త సముద్రాలు దాటి రగదూళిగా రానే వచ్చే సానుసార్ తమ యింటికి కారి నదకన వచ్చానని చిన్న మాపు చూడకండిసార్ మాయింట్లో బొల్లంత బంగారం వుంది.సార్. మొన్న గుమ్మడి కామంత బంగారాన్ని కుక్క ముట్టిందని గోడవతల పారేసుసాద్
సార్ మీదౌత్తరని భూదేవత పందిరి, ఆకాశమంత అరుగు నేయించానుసార్, ఎన్ని వంటలు చేయించాను సార్: ఎన్ని కూరలు చేయించాననుకున్నారుసాద్, పట్ కరారు పచ్చడి, ఉమ్మెతపూల ఇగుడు, ఇటుక రాళ్ళ వేపుడు, తాలూకు రము, లారీల కొద్ది పులిహోరా, చెరువుల కొద్దీ సాంచారు. జల్లేదు. పాల పెరుగు చేయించాను సారీ సార్ ఏమాట కామట చొప్పుకోవాలి గాని సార్ చూసిన వాద్యగాని తిన్న వాళ్ళు లేమోసార్, పిట్టల దొర వేషానికి ఖచ్చితమైన సాహిత్యరచన అంటూ ఏటీలేదు. ఎవరిలోచనట్లు వారు స్క్రిప్ట్ వారే తయారుచేసుంటారు. ఉందులో కళాకారుని సమయస్ఫూర్తి కూడా ప్రతిబించి స్తూ ఉంటుంది ఈ వేషం కట్టేకళాకారుడు సమకాలీన అంశాల పైన, సామాజిక అంశాలపైన పట్టు కలిగి ఉండాలి. అప్పుడే ప్రదర్శనను రసపత్తరంగా ఇవ్వగలుగుతాడు. పిట్టల దొర వేషం కట్టిన వారిలో నుర్రా రాఘన రెడ్డి కర్నాటి లక్ష్మీనరసయ మంచి ప్రదర్శన తారులుగా మన్ననలు పొందారు. ఈ వాటికీ అనేక వేదికల పైన పిట్టల దొర ఏకపాత్రాభినయంగా వేసే కళాకారులు ప్రథమ బహుమతులు గెలుచుకోవడం మనం చూస్తూ ఉంటున్నాము. పగటివేషాల స్క్రిప్ట్ రచయితలుగా అయ్యివు వెంకటకృష్ణ రరగు తాతాచారి.. సంగారాను కోటిరెడ్డి, ఆంధ్రనాట పెరెనావన్నారు. ఈ పిట్టలు దొరకు జానపదుల్లో వేటికీ మంచి ఆదరణ ఉంది.
పండరీ భజన
మన ఆంధ్రదేశంలో ఆ మూభాగం చుట్టివచ్చినవి, అందరినీ కదిలించినవీ భజన దళాలే అంటారు. ఇవి జానపద కళారూపాలకు చెందుతాయి. అందులో పండరీభజనకు ప్రత్యేక స్థానముంది మన జిల్లాలో గొల్లల మామిడాడ చాలా ప్రసిద్ధి చెందినది శ్రీ పదాల సత్యనారాయణరెడ్డి గురువుగా పరిసరప్రాంతాలలో చాలా మంది శిష్యులను తయారు చేసారు. ప్రస్తుతం రాజుపాలెం లంకలోని శ్రీ కురుల కొండయ్య దళం. పండనీభజనలో ఆంధ్రదేశమంతటా తమ ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
విందరీభజన మహారాష్ట్రా నుంచి వచ్చిన కళారూపం పండరి పుణ్యక్షేత్రంలోని విఠలేశ్వరునిపై భక్తితో పాడేపాటలు, నృత్యాలు, సయనానందకరంగా ఉంటాయి. ఈ బజన చేసే కళాకారులు కాషాయి వస్త్రాలు ధరించి, కాషాయ తలపాగా, మెడలో పూలదండలు, కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటారు. చేతిలో పొడవైన కర్రకు రెండంచుల జెండా ఎరుపు లేదా, కషాయి రంగు, పసుపు పచ్చరంగుది ఆడతారు. భజనలో కృష్ణలీలలను గానం చేసారు.
50 మంది భోజన కారుల వరకు వలయంగా నిలబడి గురువు పాడే పాటకు అనుగుణంగా అడుగులు వేస్తు వర్తిస్తారు. 10-16 మధ్య నున్న పిల్లలు కూడా భజన బృందాలుగా ఏర్పడి భజన చేస్తారు. వీరు గురువు దగ్గర 'లయ' 'స్వర' పరిభజనంతో పాటు అవసరమైన సంగీతాన్ని అభ్యసిస్తారు. మధ్యలో గురువు పాడుతంలో హార్మోనియం, డోలక్, సంజీర, లేదా తబలా, పిల్లన గ్రోవి వంణ సహలాద్యుల సహకారంతో భజన రాత్రి 8 గంటలనుండి ప్రారంభమవుతుంది.
జెండా లేదా బెడాతే జాయేంగే పండారి జాయాగే అని పాడుతూ నృత్యం చేస్తుంటే కళాకారులు అడుగుల విన్యాసానికి అబ్బుర పడవలసిందే. ఇక ఎంత దూరమో ఎరుగామే పండారి" అనే పాటకు భజన కళాకారులు చేసే విన్యాసాలు చక్కని రసస్ఫూర్తిని కల్గిస్తూ చూపరులను పులకింపజేస్తాయి. ఈ పండరీ భజనలను దేవీ నవరాత్రులకు గణపతి నవరాత్రులకు గృహ ప్రవేశాలకు, తిరుపతి వెళ్ళే మొక్కుబడులు చెల్లించుకునే వారు ఈ ప్రదర్శనలను ఏర్పాటుచేస్తారు. పిండుదామా పిండుదామా ఆనంద గోపుపాలు పిండుదామా గోవింద గోపాల మదనగోపాలని గోవిందుడే గోపాలుడే మన ఆ కోరికను దెబ్బ కోవాలంగుడే అని బృందం చమటలు కక్కుతూ నృత్యం చేస్తుంటూ అందరు భజన తిలకిస్తూ ఆనందిస్తారు. యువజనుల శారీరక విన్యాసాలలో ప్రదర్శించే పండరీ భజన చూసి తీరవలసిందే. పెద్దాపురం మండలం చదలవాడా గ్రామం కూడా గొప్ప భజనలు చేసేది. ప్రస్తుతం వ్రేళ్ళమీద లెక్కపెట్టగలిగే ఈ పందరీభజన కళారూపం భజనలో తల మాచికమైనది.
కర్ర సాము
ప్రాచీన జానపదకళలకు చెందిన వాటిలో కొన్ని యుద్ధకళలకు చెందినవి ఉన్నాయి. వాటిలో మన ఆంధ్రదేశాన కత్తిసామూ, కర్రసాము ప్రధానమైనది. కర్రసాము ఈ నాటికి పల్లెల్లో మనకు కనిపిస్తూనే ఉంది. కర్రసామును వయస్సులో ఉన్న యువకులు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. సాయంత్రం సమయాల్లో గ్రామాలలో యువకులందరూ చేసి ఒక గురువు దగ్గర ఈ విద్యను నేర్చుకుంటారు. తన బలిష్టమైన పిడికిలితో కథ మధ్యగా పట్టుకుని గిర్రుమని తిప్పుతూ ఒక చేతి నుండి మరొక చేతిలోనికి మార్చుకుంటూ, ఒడుపు కలిగిన అడుగులు వేస్తూ కర్రసామును ప్రదర్శిస్తారు. ఈ కర్రసాము తిప్పేప్పుడు అనేక విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కర్ర సాధారణంగా మనం పొలం పనులకు పోయే రైతుల చేతులలో ఉండేది. ఈ కర్రసు బానా కర్ర అని కూడా అంటారు. ఇంచుమించు అడుగుల పొడవు ఉంటుంది.
పూర్వం రక్షణ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని రోజులలో గ్రామాలలోని యువకులే గ్రామరక్షణకు ఈ కర్రసాము విద్యను నేర్చుకుని రాత్రిసమయంలో గ్రామ రక్షణకు బయలు దేరేవారు. దేవాలయాలను దోపిడీ దొంగల బారి నుండి కాపాడడానికి, బందిపోటులు గ్రామంలో ప్రవేశంచకుండా వీరు కర్రసాము విద్య ద్వారా అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. ఈ కర్ర సాము విద్య తెలిసిన వారిని పూర్వం జమిందారలు తమ ఉద్యోగస్థులుగా నియమించుకునేవారు. వీరుముష్టి వారు, హరిజనులు, నాయక తెగలకు చెందిన వారు ఈ కర్రసాము ప్రదర్శించడంలో నిష్ణాతులు.
కర్ర సామును 10 నుండి 15 మంది ప్రదర్శిస్తారు. డప్పులు, తనా వంటి వాయిద్యాలు మోగుతుండగా కర్రలను ఇడువుగా పట్టుకుని 15 మంది ఒకేసారి గిర్రున తిప్పుతారు. కొంత సేపయిన తరువాత ఒక యువకుడు రెండు చేతులలో రెండు కర్రలను మధ్యలో పట్టుకుని తన భుజబలంతో కర్ర కనబడనంత వేగంగా తిప్పుతూ ఉంటే ప్రేక్షకులు ఉద్వేగభరితులవుతారు. పూర్వం యుద్ధాలలో ఇదే విధంగా కర్ర సాము ప్రదర్శిస్తూ తిరుగుబాటు సైన్యాలను చెల్లా చెదురు చేసేవారని అంటారు. తరువాత ఇద్దరు చెరోకర్ర తీసుకుని ఒకరి తరువాత ఒకరు కర్రను జుళివుస్తుంటే మరొకరు ఒడుపుగా కాసుకుని, తిరిగి తనూ కర్రను జుళిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఉత్సవాల సందర్భంగాను, సంబరాలలోను ఈ కర్రసాము ప్రదర్వన ఏర్పాటు చేయడం రివాజు. ప్రధాన కూడలిలో ఊరేగింపును ఆపి ఈ ప్రదర్వన ఏర్పాటు చేస్తు ఉంటారు. కర్రసాము వ్యాయామానికి చెందిన విద్యకూడాను. ఈ విద్యను నేర్చుకున్న యువకుల చేతులు బలిష్టంగా ఉండడమే కాకుండా శరీర ఆకృతి
పగటి వేషం
నన్నెతకం నవలాదూపాలలో సగటి వేషం ఒకటి తెలుగులో వేషం వేయడమంటే పాత్రకు తగినట్లుగా అలంకరణ చేసుకోవడం నగటిపాటి నగటి పూటనే గ్రామాలలో తాము ప్రదర్శించనున్న వేషాన్ని ఎన్నుకుని అభినయించడం. ఇది ప్రాచీన కాలంలో ఎంతో ప్రజాధనం పొందిన కళ పగటి వేషాలు అనే దూటలోనే బహువచనం ఉంది. నలుగురు లేక ఐదుగురు ఒక పరాణకథను ఎన్నడ బభినయిస్తూ ఇంటి ఇంటి ముందు మూడు నాలుగు రోజుల దాకా ప్రదర్శిస్తారు ఇంటిలోని వారే వీరికి ప్రేక్షకులు.
తెలుగువాని అపూర్వ జానపద కళా సంపదలోని పగటి వేషం యొక్క అవిర్భావ కాలాన్ని నిర్ణయించే చాటి ఆధారం లభ్యం కాని పోయినా తెలుగు సాహిత్యంలో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుంది. దీనికి వేముల వాడము కట్ సాక్ష్యం ఇతని కాలం క్రీ. శ 1121 ప్రాంతంగా నిర్ణయించబడింది. వేముల వాడ భీమకవి కళాంగ రాజావారి వెళ్ళాడు. కళింగ రాజు గంగుకు తను వచ్చిన సంగతి కబురంపాడు రాజు. వేముల వాడ మతని భాదను పట్టించుకోకపోవడంలో కోపోద్రేకుడైన భీమకవి కళింగ గంగును శపిస్తాడు. శాపం తగిలిన గంగుసు శత్రురాజులు దండిత్తి వచ్చి పోడిస్తారు కళింగ గంగు పారిపోయి బికారిగా తయారయ్యి వీడుల వెంట తిరుగుతూ ఓపాతర గోతిలో పడి ఏడుస్తుంటారు. ఇంతలో అలుప్రకగా పోతున్న వేముల వాడే భీమకవి కలింగ గంగు పరిస్థితి గమనించి జాలిపడి శాపతిమాచన కలిగిస్తాడు.
శాప విముకుడైన కళింగ గంగు దారినపోతున్న పగటి వేషగాళ్ల గుంపులో చేరతాడు. వారు తిన్నగా కళింగ దేశం చేరి అక్కడ పరిపాలిస్తున్న రాజు దగ్గత ప్రదర్శన ఇవ్వ గోరతారు. అక్కడి రాజు తన చేతిలో ఓడి పోయి పారిపోయిన కళింగ గంగు వేషం వేసుకుని పగటి పూట రమ్మంటాడు జగుంపులోని కళింగ గంగు తానే ఆ వేషం కట్టి పగటిపూట ప్రదర్శన యిస్తూ రాజు ముందుకు నెడతాడు. ప్రదర్వన చేస్తూ రాజును సమీపించి ఒక్క వేటున అతని శిరస్సును నరికి తిరిగి రాజవుతాడు. తెలుగు సాహిత్యంలో మొదటిగా పగటి వేషం ఇలా కనిపిస్తుంది.
ప్రాచీసతి గలిగిన జానపదకళ 20వ శతాబ్ది తొలి దశలో కూడా దేదీప్యమానంగా వెలిగింది. మైసూరు నుండి వచ్చిన తెలుగు బ్రాహ్మణుడు శ్రీ జిల్లా వరుఘుల వెంకటరామయ్య గారు తన పరివారంలో ఆంధ్రదేశం వచ్చి కృష్ణా జిల్లా వీరంకిలాకు దగ్గర హనుమంతాపురం రగ్రహారంలో అయ్యంగాళ్లు అనే పీఠాన్ని స్థాపించి పగటి వేషాలు నేర్పేవాడు. కష్టాతికష్ట మయిన విద్య ఆంధ్రదేశమందు కూచిపూడి వంశాలలో తొలుత అవతరించిందనికూడా చెప్పుకుంటారు. గోదావరి మండల యండలి కాకపుర్రు గ్రామం ఈ విద్యకు ప్రసిద్ధి చెందింది.
పగటి వేషాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. 1 రామసవేషం 2 సాత్వీకవేషం ఈ వేషాలను బ్రాహ్మణులే కాకుండా యాదవులు. బంగాలవారు, విశ్వబ్రాహ్మణులు, తదితర ఇతర కులాలకు చెందిన వారు కూడా అభ్యసించి ప్రదర్శనలిస్తున్నారు. ఈపగటి వేషాలలోని ప్రక్రియ ముఖ్యంగా వేషంలో భాషలో, నడకల్లో, చేష్టల్లో లోకంలోని కొందరిని అనుకరించడం. గొప్పగా ఆరూపంలోని అతుక్కుపోవడమే ప్రత్యేకత ఆయా వేషాల ద్వారా సామాన్యులకి సంఘంలోని దురాచాల్ని గెలిగింతలు పెట్టి హాస్యంతో వ్యంగ్యంగా ఎత్తి చూపించడం యిందులోని ఉన్న మౌలిక సూత్రం వినోదం, విజ్ఞానం కలిగిన ఈ వేషాలను మగవాలేళ్ళవేస్తారు.
పగటి వేషాలు 32 వరకు ఉన్నాయి. వీనిలో బుడబుక్కలు, లంబాడీలు, చోడెమ్మలు, సోమయాజులు, సోమి వేదుల వాళ్ళు, దేవమ్మ, భద్రోజులు, గొల్లపాలుడు, మందుల వాళ్లు, సాకాని వైష్ణువులు, పిట్టలదొర, కొమ్మ దాసుడు. బారీ బైరాగి, సిద్ది కంపెనీ, అర్థవారివ్వ శక్తి బేతాళ దేవరపిట్టి మొదలైనవి సుప్రస్తి వేషాలు. ఈ పగటి వేషాల ప్రదర్శనకు సంగీతం, నృత్యం, వాచికం, ధన్యనుకరణ (మిమిక్రీ), అభినయా వంటివి. వన్నె తెచ్చే అంశాలు హార్మోనిస్ట్, వాయిద్య కారులు వారి వెంట తిరుగుతూ వాయిద్య సహకారాన్ని అందిస్తారు. గ్రామాల్లో ప్రజలతోపాటు ఆయా పాత్రలకు సంబంధించిన వారు కూడా ఆనందించి పగటి వేషాగాత్మకి కానుకలు ఇస్తారు. వారమంతా ప్రతీరోజూ వేషం గట్టి తిరిగిన ప్రదర్శనకారులు ఆఖరిరోజు ప్రతీ ఇంటికీ తిరిగి కానుకలు అర్పిస్తారు.
రాజమండ్రికి చెందిన విభూది భూనీ లింగం ఈ ప్రదర్శనల జనరజలకంగా ప్రదర్శిస్తూ ఈకళ అంతరించి పోకుండా కాపాడుతూ ఉన్నారు. ఈ కళను నమ్ముకుని రాజమండ్రి పెద్దాపురం తదితర ప్రంతాలలో కళా కారులు జీవిస్తూ ఉన్నారు, వీరు సంక్రాంతి పండగలప్పుడు, ఈ వేషాలను కడుతూ కనిపిస్తారు. నిజానికి ఒకనాడు మన పల్లె జనాలకి విజ్ఞానాన్ని అందజేసినవి చాలా వరకూ ఈ జానపద కళారూపాటే. ఇప్పుదిని ఆదరణ లేక క్షీణదశకు చేరుకున్నాయి. వీనిని పునరుద్ధరించడం అంటేమన సంస్కృతిని పునరుద్ధరించుకోవడమే దీనికి ప్రజలు. ఆయా! రంగాలలోని కళాకారులు బాధ్యత తీసి పరిరక్షించాలి. మన సంస్కృతీ చరిత్ర కోసమన్నా వీటిని విడియోలలోని, కేసెట్లలోను భద్రపరచాలి. భావితరాల వారికి కనీసం మ్యూజియం వస్తువుగా నైనా అందజేయడం మనందరి ముందున్న కర్తవ్యం.
పంబకథ
సత్తెమ్మ సంబరాలలో అంబరానే జగదంబరానే అంటూ అమ్మవారిని సంజనాదంతో మేలుకొలుపుతూ ఈ సంబనవదులు కనిపిస్తూ ఉంటారు. సాంబ్రాణి దూపాలతో సంబరాళ్ళు సత్తెమ్మ ఆదిశక్తిని, సృష్టి ఆవిర్భావమని, సత్తెమ్మ మహత్యాలు గూర్చి ఈ పంబకడ వెలుతుంటారు. విజాపురం దగ్గర రథాల పేటలోని పంబ కళాకారుల బృందం నాయకుడు వీరబ్బాయిని సంబకథ గురించి విశేషాలు తెలుపమని అడగగా మనకి అనేక విషయాలు తెలియజేస్తున్నారు.
రెండు సన్నని చిన్న వీరణాలు వంటివి కలిసి కట్టబడి రెండు వైపులా మేకతోలుతో మూయబడి ఉండే వాయిధ్యమే వియివారం ఒక వైపు ఒక నెదురు పుల్లతో వాయిస్తూ మరొక వైపు చేతిలో మంద్ర స్థాయిలోనూ, తారాస్థాయిలోను వాయిస్తుంటే కలిగే శబ్దం వెంకటక్యం పంబలర్యం అని వస్తుంది వందవాయిద్యాయినికి సహవాయిధ్యంగా జముకు, తంబూరా కూడా ఉంటుంది. పాట పాడే గురువు కాలికి గజ్జెలు కట్టుకుని చెంపలకు గంధం పూసుకుని ఎగురుతూ చిందులేస్తూ రథ పాడుతుంటే మిగిలిన ఇద్దరు వంతలు తమ వాయిద్యాలలో శృతి కలుపుతూ. పాడతారు. ఈ వాయిధ్య గాళ్ళు చెవిదగ్గర చేయిఉంచి ఆ అంటూ రాగం తీస్తు వంత పాడతారు.
మొక్కుబడులు చెల్లించకునేవారు, సంబరాలు, ఉత్సవాలు జరిపేవారు వీరిని ఆహ్వానించి పాట పాడించుకుంటారు. తెల్లవార్లు పాట పాడిన తరువాత చీట తీసుకుని అందులో అమ్మవారిలా పిండితో చేసిన బొమ్మను తయారు చేసి చేటలో ఉంచి వంబవాదం వాయిస్తూ సత్తెమ్మ ఎవరి ఇలవేలుపో వారి తలపై ఈ పాపవేటను ఉంచి దీవిస్తారు అనంతరం ఊరవతలకు తీసుకెళ్ళి మేక కాని కోడిని కాని కోసి దిష్టి తీన వేటలో ఉంచిన అమ్మవారిన సాగనంపుతారు. దీవింపజేసుకున్న వారు సంబల వారికి చేటలో కాసుకలు చేస్తారు.
సత్తెమ్మ తల్లిని సాగనంపేప్పుడు సత్తెమ్మ తల్లి గుడి ముందర పద్మం వంటి ముగ్గును వేస్తారు. ఆపద్మం వంటి ముగ్గులో మేకపోతు రక్తంలో అలంకరిస్తారు. ముగ్గురు ఒక కొత్త కుండలోనికి ఎత్తుతారు. ఆకడవను కత్తెర కడవ అంటారు. తమలో ఒకరికి కొత్తకోర, కొత్తరవిక తొడిగి నెత్తికి ఎత్తుతారు. మేక పేగులు తీసి అతనికి ఎడజందెం. పెద్ద జందెం వేసి అతనిని సత్తెమ్మగా భావిస్తూ వీదుల వెంట ఊరేగి ఎంపుగా తీసుకువెళతారు. ఊరు చివరికి వచ్చేసరికి సత్తెమ్మ తల్లిని ఉద్దేశించి
"ఆనందమమ్మా - ఆనందమే సంతోషమమ్మా - సంతోషమే ముత్యాల ముగ్గుల్లోన నీకనమ్మ వజ్రాల వెన్నెల నీకే నమ్మా సనివిడి, వడపపు సాయి గంథాలు నీకేనమ్మా. కారుకోళ్ళు, మేకలు నీకేనమ్మా"
అని సన్నసన్నగా పాడుతూ ఊరుదాటగానే బండబూతుల పాటలు ప్రారంభిస్తారు అలా పాడడం సత్తెమ్మ తల్లికి ఇష్టమంటారు వీరు. శ్రీనాథుడు క్రీడాభిరామంలో పేర్కొన్న భవానీలు అనబడేవారు వీరే, వీరు కులానికి పంబ కులానికి చెందిన వారు, ఈ సత్తెమ్మ తల్లి జాతరులు పసలపూడి, కాకినాడ, వందలపాక వంటి గ్రామాలలో ప్రసిద్ధి చెందాయి. దానమ్మ సంబధాలని తాడేపల్లిగూడెం వద్ద బాగా జరుగుతాయి. దానిలో దానమ్మ కద చెబుతారు. ఇది మందాతరాజు కథ. అలాగే శెనగల కథ చెబుతారు. ఇది బలే సరదాగా ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు పెనగతోట పెంచుతాంటారు. పెద్ద వాడు మంచి బుద్ధిగలిగిన వాడు చిన్నవాడు పిసినారి. ఒకరోజు సత్తెమ్మ చిన్న వాడిని ఆటపట్టిస్తాడు. అమ్మవారు అలిగి చిన్నవాడిని చంపబోతుండగా పెద్దవాడు వచ్చి అమ్మవారిని శరణు వేడతాడు అమ్మవారు శాంతించి కోవలతో ఊరవతల: కూర్చుంటుంది. ఇక పెద్దవాడు అమ్మవారిని ఏం కోరితే ఊరిలోనికి వస్తానని అడిగితే చిన్నవాడి ముఖం మీద పది ఉమ్ములు ఉస్తానంటుంది. పెద్దవాడు పోయి తమ్ముడిని అడగడం మరలా అమ్మవారు మరోకోరిక కోరడం ఇలాసాగుతుంది. కథ దానమ్మ, సత్తెమ్మ, తలుపులమ్మ, మాదిగల కులవేల్పు గొతేలమ్మ వంటి జాతరులలో ఈ పంబ కథ చెప్పబడుతూ ఉంటుంది. ఈ వంటి కళాకారులు చేసేవి ఇల వేల్పులు, కులవేల్పు సంబరాలు పిఠాపురం రథాల పేటలో ఈ వంబ కథ చెప్పే పంబ కులస్థులు ఉన్నారు. వారిలో శివకంచి వీరబ్బాయి. సంబకథాగానం చేయడంలో మానిపిట్ట ఇతనికి శివరంచి ఏసు తంబూరా వాయిస్తూనే, వారే చంద్రరావు జముడు వాయిస్తూ సహగానం చేస్తున్నారు. వీరుపాడే దోనెపాట, శెట్టిబలిజ గానవాసం, స్వామి వారి విద్యలు పంబకథలు జానపదారళా విశిష్టతను తెలియజేస్తూనే ఉంటాయి.
-
చరవాణి, ముఖపుస్తకం లో మునిగిపోయిన కుటుంబాలు అనుబందాలు ఆప్యాయతలుశూన్యం తనదికాని లోకాన నోరుజారి నాలిక కరుచుకున్న జీవితం ...
-
క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్ భారతదేశం నుండి పారద్రోలతాయనడం అనడం ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం. క్రైస్తవులలో ఉన్న ఈ నమ్మకం అతి పెద్ద అప...
-
సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర) రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్ స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం...













.jpg)

















