Monday, November 30, 2020

కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం


 కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం




వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

బాలసాహితీ రచయిత

9908953245


జిల్లాలోనే సువిశాలతీరప్రాంతం కలిగిన మండలం తొండంగి మండలం ప్రత్యేకత కలిగి ఉంది. తీరప్రాంతం చోడిపల్లిపేట మొదలు /. యాదవులు,మత్య్సకారులు నివశిస్తా ఉన్నారు.1785 లో మెకంజీ సేకరించిన కైఫియ్యత్తుల్లో ఈ తీరప్రాంతం గురించి వివరంగా ఉంది. కాకినాడకు చెందిన బల్లోజి బాబా రాసిన తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో 

ఒక కైఫియత్తు అంతా దీనిగురించే ఉంది. బల్లోజిబాబా చరితార్దుడు అనడంలో సందేహం లేదు. 

1814 లో రాజమహేంద్రవరం జిల్లాగా ఉండే సమయంలో పిఠాపురం తాలుకాలో కోన అడవి గురించిన ప్రస్ధావన సంబరం కలిగిస్తుంది. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లో కూడా కోనఫారెస్టు అనే పిలుస్తున్నారు కూడా.ఈ కోనఫారెస్టు తూర్పున సముద్రం,పడమర పొన్నాడ, ఉత్తరంలో తొండంగి,వేమయి ( వేమవరం) గ్రామాలు ఉండేవి.ఈ కోన అడవిలో తిరిగే ఎడ్లు మామూలు ఎడ్లుకంటే బలిష్టంగా ఉండే కొమ్ములు తిన్నగా వంకరలేకుండా ఉండేవి. చప్పుడైతే చెంగు చెంగున పరుగులు తీస్తూ ఉండేవి. ఈ ఎడ్లు పగలు అడవిలో మేసి(గడ్డిపేట) రాత్రులు సముద్రపు కెరటాలు తగిలేలా పడుకుని సేదతీరుతూ ఉండేవి. వీటిని వేటాడం ఓ వినోదంగా ఉండేది. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడు, కపిలేశ్వరపురం జమిందారులు, ఫ్రెంచి,బ్రిటీషు కలెక్టర్లు తుపాకీలతో వేటాడేవారు. ఈ అడవిలో పుశిణిగ,దొర్నిగ,గొల్లు లాంటి గుబురు చెట్లు, కుంకుడు చెట్లు( పాత పెరుమళ్ళపురం ప్రాంతంలో చూడవచ్చు) పాలచెట్లు ఉండేవి.

చిన్ని చెట్లు అని పొదలు ఉండేవి. పాలచెట్లు చాలా పొడవుగా వుండేవి. పాలచెట్ల తొర్రలు మనిషి కూర్చునేంత ఉండేవి.ఆ రోజుల్లో ఈ పాలచెట్లు నరికి రైతులు తూములుగా చేసి వ్యవసాయం చేసుకునేవారు. ఈ అడవి అంతా పిఠాపురం జంమిందారు ఏలుబడిలో వుండేది. తేనెపట్లు అధికంగా ఉండేవి.అడవిలోకి వెళ్ళడానికి బయపడేవారు. తేనెటీగల ఝంకారంచేస్తూ గుంపులు గుంపులుగా అడవి అంతా పెద్ద శబ్దం చేస్తూ ముసురుతూ వుండేవి.

            చిన్నపూలచెట్లు పూలు బలే గమ్మతైన పూలు మంచి సువాసన భరితమైన పూలు. తేనెటీగలు ఈ పూలనుండి వరి చేల పువ్వారు నుండి తేనె సేకరించి పాలచెట్లతొర్రల్లో తేనెతుట్టలను పెట్టేవి. అడవి అంతా తేనె తుట్టలే . ఈ తేనె సువాసన భరితమై మహా రుచిగా ఉండేది.ఈ చిన్నపూల చెట్లతేనె నవంబరు మాసంలో దొరికేది. పిఠాపురం జమిందారులు  తేనె సేకరించేవారిని మకాం పెట్టించి తేనె పట్టుకెళ్ళేవారు. అయితే ఈ తేనె ఇప్పటి తేనెలా ఉండేది కాదు దీపావళి సామానుల్లో కలిపే సూరేకారంలా ఉండేది. పలుకులు పలుకులుగా ఉండేది. జమిందారులు మహా ఇష్టంగా తినేవారు. 

    తొండంగి, వేమవరం, పొన్నాడ పరిసరాల్లో వరి బాగా పండేది.  ఆ రోజుల్లో తొండంగి నువ్వుల పంటకు ప్రసిద్ది చెందింది. దేశం నలు మూలలనుండి నువ్వుల కొనుగోలుకు వ్యాపారులు వచ్చేవారు.కోనఫారెస్టులో ఇండ్లకు ఉపయోగించే కలపదొరికేది కాదు. చింతచెట్లు ( చింతకాయలపేట పేరు అందుకే వచ్చి ఉండవచ్చు ), వేపచెట్లు,తుమ్మచెట్లు,అడవి ఎద్దులు,గుబురుగా ఉన్న ముళ్ళపొదలు,తుప్ప అడవి విస్తారంగా ఉండేవి. ఈ వివరాలన్నీ బల్లోజి బాబా రాసిన మెకంజీ తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో దొరుకుతున్నాయి.ఇలాంటి మంచి పుస్తకాలను అందరూ చదవాలి ఆదరించాలి. పాఠశాలల లైబ్రరీలలో తప్పక ఉంచవలసిన పుస్తకం.


తీర గ్రామాలు ఎప్పుడు వచ్చాయి?

మెకంజీ 1814—1815 ఈ కైఫియ్యత్తులు సేకరించాడు. అప్పటికి ఇవి ఓ పదేళ్ళు వెనక రాసి ఉండవచ్చు. అంటే 1800 సంవత్సరానికి కోనప్రాంతం అడవిగానే ఉంది. సువిశాలమైన భూభాగం ,తీరప్రాతం ఉండటంతో దేశంలోని మత్య్సకారుల దృష్టి ఈ ప్రాంతం పై పడింది. ఆ క్రమంలో మెల్లగా వలసలు బర్మా, ఒరిస్సా,పూరి,మచిలీపట్నం,యానం,పాండిచ్చేరి,తమిళనాడు, ఇలా తీరప్రాంతాలనుండి వలసలు పెరిగాయి. మెల్లగా 1850  తరువాత మనం చూస్తున్న గ్రామాలుగా ఏర్పడ్డాయనుకోవచ్చు. ఎడ్లు లెక్కకు మిక్కిలి సహజంగా దొరుకుతున్నాయి కాబట్టి యాదవులు వచ్చి చేరి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఆవులమంద,గడ్డిపేట లాంటి గ్రామాలు ఏర్పడ్డాయనుకోవచ్చు.



 


కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం*


 *కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం*

వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ (జనశ్రీ)

ఆంగ్ల ఉపాధ్యాయులు

బాల సాహితీ రచయిత


  తన నివసిస్తున్న చోటు ఏ నాటిదో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరికీ వెంటాడుతూ ఉంటుంది.తాతముత్తాతల గురించి వింటేనే మనసు పులకరిస్తుంది.ఓ ఉద్వేగం ముసుకుంటుంది. దాని ఆత్మీయత బావన స్పర్శ దేనికీ సాటిరాదు మరి.కొత్తపల్లి మండలం వేల సంవత్సరాల నాటిదే అంటే ఓ క్షణం దిగ్బ్రమ కలగకమానదు. కాని కొంత మంది అవును అంటారు కాని ఏమీ చెప్పలేరు. అయితే మన పూర్వీకులు ఎంత గొప్పవారంటే తాటాకుల పత్రాలలోను, రాగిరేకుల్లో, శాసనాలలోను స్ధానిక చరిత్రలు రాసుకునేవారు. వాటిని దండకవిలెలు అనేవారు. వీటికి విలువ వుండేది కాదు. ఆనాటి సంస్కృతాంధ్ర కవితాఘోషలో వీటి శబ్దం అస్సలు వినిపించేది కాదు. అయినా కరణాలు, జమిందారులు వారి వంశ చరిత్రకోసం రాయించుకునేవారు. అయితే అవి కొంత కాలానికి కనుమరుగయ్యేవి. అవ్వవా  మరి గ్రంధాలయాలు ఉన్నాయా ఏమిటి ఆరోజుల్లో  అయితే ఓ మహానుబావుడుకి ఆ విలువ తెలిసింది అవి అపురూపమనిపించింది. అంతే తన జీతభత్యాలు త్యాగంచేసి వీటిని సేకరించాడు. మామూలుగా కాదు ప్రపంచంలో  ఇప్పటి వరకూ మానవమాత్రుడు ఎవరూ  చేయనంత సేకరణ. ఇప్పటికీ కొన్ని వేల సేకరణలు అలాగే వున్నాయి. పరిశోధకులు నిత్యం పనిచేస్తున్నా తరగడం లేదు. ఆయన ఎవరో కాదు మెకంజీ .స్కాట్లాండు దేశస్దుడు. 1783లో సర్వేయరుగా భారతదేశం వచ్చాడు. ఆయనికి ఈ దండకవిలెలు ఆశ్చర్యమనిపించింది. వీటి సేకరణకు ముందు బ్రిటీష్ వారు నిదులిచ్చినా  ఆ తరువాత ఆపేశారు. సమకాలీకులు పనికిరాని వస్తు సేకరణ అన్నారు. అయితేనో బుర్రయ్య అనే బహుబాషా కోవిదుడిని ప్రక్కన పెట్టుకుని ఊరూర పంపించి సేకరించాడు. ఈదండకవిలలనే  మహ్మదీయులు ఆ తరువాత కఫీయ్యత్తులుగా పిలిచేవారు. ఇది ఉర్దూ పదం నుండి వచ్చింది. కఫియ్యత్ అంటే సంగతులు, విశేషాలు అని అర్దం  వీటికి ఆ పేరే వాడుకలో ఉండి పోయింది.

      మెకంజీ 1784—1790 ప్రాంతంలో రాయలసీమలో ఉన్నాడు. అక్కడ నుండే కఫియ్యత్తులు సేకరించాడు.వాటిలో తూర్పుగోదావరివి 10 ఉన్నాయి. 

వీటిని 600 సంవత్సరంలో కొంకిపర్రు అని,1700 సంవత్సరంలో కాకినాడు అని ఇప్పుడు కాకినాడ  అని పిలిచే కాకినాడలో ఉండే మహానుబావుడు బల్లోజి బాబా వెలుగులోకి తెచ్చాడు.తూర్పుగోదావరి కఫియ్యత్తులు పిఠాపురం,పెద్దాపురం,కాకినాడ పరిసర ప్రాంత గ్రామాల చరిత్రలను జమిందారుల చరిత్రలు  తెలుపుతుంది. ఇందులో కొత్తపల్లి గ్రామం గురించి పెద్దగా తెలియకపోయినా మండలానికి సంబందించి ఓ స్పష్టత మరి కొంత సమాచారం దొరకడం నిజంగా కొత్తపల్లి వాసులం అందరం మెకంజీ మహాశయునికి ఋణపడి వున్నాం.  


         మనం త్రిలింగదేశం మధ్యలో ఉండే ఆంధ్ర ప్రాంతవాసులం.ఈ ప్రాంతం ప్రొలునాడు(పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు,తుని, పెద్దాపురం)  కిమ్మూరులోపరగణాలో ఇసుకపల్లి కొత్తపల్లి.చెల్లూరు పరగాణాలో పొన్నాడ, కొమరిగిరి ఉండేవి. 

     అంతకుముందు చూసుకుంటే1087నుండి 1093 వీరచోడుడు పరిపాలనలో వేంగీరాజ్యంలో ( శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం) మనం ఎక్కువగా పరిపాలించబడ్డాం. 

1182 నాటికే సంపర పేరు కనబడుతుంది. పిఠాపురం కుంతీమాదవస్వామి ఆలయంలోని శాసనంలో 1187 లో నవఖండ్రవాడ,కొండెవరం గ్రామాలను ఏర్పరచి కుంతీ మాధవస్వామికి దానంగా ఇచ్చినట్టుఉంది. బహుశా ఇవి ప్రొలునాడుకు దగ్గరగా ఉండటం వలన కాబోలు.అయితే పూర్వం సంపర నియోకవర్గం అక్కడ కొంత ఇక్కడ కొంత ఎలా ఉండేదో పూర్వం కొత్తపల్లి మండలం కూడా అలాగే వున్నట్టు కనబడుతుంది. ఇసుకపల్లి పూర్తిగా వేరే పరగణాలో ఉండేది. ఉప్పాడ గ్రామం గురించి ఆఖరున తెలుసుకుందాం.


కొమరిగిరి

   1353 లో వేమారెడ్డి తరువాత పెద వెంకప్ప జమిందారీ ఏలుబడిలో కొవ్వాడ ,కొత్తపల్లి,  పొన్నాడ ఉన్నాయి. పెద వెంకప్ప తరువాత విస్సామ అనే మహిళ పరిపాలించింది.1399 లో కొమరగిరికి చెందిన గోగ్గయ రాజు పిఠాపురం కుంతీమాదవస్వామికి బృందావనం చేయించి ఇచ్చాడు. వేంగీరాజ్య పాలకుడు రెడ్డిపరిపాలకుడు కాటమవేమారెడ్డి అతని కుమారుడు కుమారగిరి రెడ్డి పేరు మీద కొమరగిరి 1422 లో ఏర్పడింది. చెల్లూరు పరగణాలో ఉన్న కొమరగిరిని కూమారగిరిరెడ్డి విష్ణుభట్టారకుడు అనే బ్రాహ్మణుడికి కరణీకంగా ఇచ్చాడు.అతను అగ్రహారం కట్టించాడు. ఓ ఐదు బ్రాహ్మణ కుటుంబాలు శొంటివారు,ఆదిరాజు వారు ,వెదురూరు వారు,కంభంపాటి వారు ఉండేవారు. కొండెవరంలో కొంత భూమిని దానం చేసి తామ్రపత్రాలు రాసి వంశపారంపర్య హక్కులిచ్చాడు. ఆంధ్రాకు బ్రాహ్మణులు తమిళనాడు నుండి ఎక్కువగా వచ్చారు. వంద సంవత్సరాల తరువాత అగ్రహారం అగ్నికి ఆహుతి అయ్యింది.మద్దాల అప్పలరాజు అనే ఆయన మరలా ఇళ్ళుకట్టించాడు.కొమరగిరికి ఉత్తరాన చెరువు తవ్వించాడు. దక్షిణం వైపు తమ్మవరం కూడా ఆనాటి నుండి ఉంది. తమ్మసాని ఉండేది మేడలో అందుకే తమ్మవరం అని పేరు వచ్చింది.కొమరగిరి మాదన్న అనే వెలమవారు విష్ణుఆలయాన్ని కట్టించాడు. కొమరగిరిలో మల్యాల వెంకట్రావు ఒక శివాలయం కట్టించాడు.అరవైపుట్ల భూమి కేటాయించి ఉత్సవాలు చేసేవాడు.కొమరగిరిని కుమారగిరిరెడ్డి 14 సంవత్సరాలు పరిపాలించాడు.ఒకప్పుడు మండలానికి తలమానికమై భాసిల్లన గ్రామం మండలం మూలలో నిశ్శబ్దంగా మనుగడ సాగించడం కాలం మార్పుగా భావించవచ్చు. ఈ కఫీయ్యత్తును  చెల్లూరు కరణం శీతన్న రాయిస్తే వెంకటశాస్త్రి రాసినట్లుంది.

నిస్సంకుల నాయన


కపిలేశ్వరపురం రాజు దేవుమహారాజు అనుగ్రహంతో నిస్సంకులనాయన అనే బ్రాహ్మణుడు పొన్నాడ,ఇసుకపల్లి కలిపి 21 గ్రామాలు కరణీకం రాయించుకున్నాడు. అతని దగ్గర గుమాస్తాలుగా పనిచే ముగ్గురు గుమాస్తాలు వడ్డావు మారకొండయ్య,నండూరి తిమ్మరాజు,తోలేటి వీర్రాజు, మోసంచేసి రాజమండ్రికి చెందిన కాటంపల్లి వీరయ్య తో చేతులుకలిపి 21 గ్రామాలను నిస్సంకుల నాయన నుంచి లాక్కుని పంచుకుంటారు. పంపకంలో 1573 లో అయ్యపటనేని మార్కండ్రాజు పొన్నాడకు కరణీకం రాయించుకున్నాడు.

1671—79 లో పిఠాపురం జంమిందారు తెలుగు రాయినంగారు

ప్రోలునాడు పరిపాలిస్తున్నపు అతని ఆఖరి కొడుకు రంగసాయి గొల్కొండ నవాబు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. మంచి చదరంగం ఆటగాడు. ఒకరోజు ఆటలో నవాబు అబ్దుల్ హుస్సేన్ ఓడిపోతే రంగసాయి కత్తితో పొడుకుని స్వామి భక్తిని ప్రదర్శిస్తాడు.హుస్సేన్ రంగసాయి ప్రేమకు ముగ్దుడై అతని అన్నలు రావుచందర్రావు,రావు జగ్గారావు ప్రొలునాడు అప్పగిస్తూ పిఠాపురం కోటను ఇస్తాడు. వీరి హయాంలోనే ఏలేరు నదీ నీళ్ళు కిమ్మూరులో పరగణాలో ఉన్న కొత్తపల్లి, ఇసుకపల్లికి ప్రొలునాడు( పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు) మండలాలకు పంచారు. ఆనాటి నుండి మనం ఏలేరు నీళ్ళు సాగుకు ఉపయోగిస్తున్నాం.


కొత్తపల్లి గ్రామం


కొత్తపల్లి గ్రామం కాకినాడ డివిజన్ లో ఎలా అయితే ఉందో ఆశ్చర్యంగా 1080ఆనాటి నుండి కొంకిపర్రు(కాకినాడ), 1420 చెల్లూరు పరిగణాలోను ఉంటూ వస్తుంది. గజపతులు బెజవాడలో రావు వంశీకులను గానుగ ఆడించి చంపడంతో  పిఠాపురం,పెద్దాపురం సంస్దానాలకు వచ్చేస్తారు.  వీరి చరిత్రను పిఠాపురం పెద్దాపురం, చిత్రాడ  రావు వంశీకుల క్రమాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే కొత్తపల్లి వేయి సంవత్సరాల నుండి ఉన్నా వేంగీ పరిపాలనలోనే ఉంది. ఇక పిఠాపురం పెద మహీపతిరావు పెద్దాపురం వత్సవాయిని ఆడపిల్లలకు కట్నకానుకలుగా కోరడంతో బహుశా కొత్తపల్లిని పెద్దాపురం వత్సవాయి ఇచ్చి ఉండవచ్చు అక్కడ నుండి కొన్ని రావు వారి కుటుంబాలు కొండెవరం, కొమరగిరి, కొత్తపల్లికి17 వ శతాబ్దం మొదటిలో తరలి వచ్చాయి. వీరి రాకతో కొండెవరం పిఠాపురం సంస్దానానికి దగ్గరగా ఉండటంతో కొండెవరం ఒ వెలుగు వెలిగింది. అది చెలికాని రామారావు వరకూ సాగింది.క్రమంగా అక్కడ ప్రభావం చూపేవారు తగ్గిపోవడంతో కొత్తపల్లి 1900 దశకంలో వెలుగులోకి వచ్చింది. ఇసుకపల్లి, పొన్నాడ, కొమరగిరి మెల్లగా ప్రాభవం కోల్పొయాయి. వీరి వంశీకుల చరిత్ర పిఠాపురం, పెద్దాపురం రావు వారి క్రమాన్ని చూస్తే తెలుస్తుంది.

ఉప్పాడ గ్రామం

ఇది కైఫియ్యత్తులో ఎక్కడా కనబడదు. సముద్రతీర ప్రాంతమైన కొమరగిరి అనే కనబడుతుంది.అయితే కైఫియతుల ప్రకారం

కొత్తపల్లి తరువాత సముద్రపు తీర ప్రాంతం వరకు దట్టమైన కీకారణ్యం అని చెప్పబడింది.

ఇది 1700 వరకు కీకారణ్యంగానే ఉంది. పిఠాపురం జంమిందారు ,కలెక్టర్లు తుపాకీతో వేటకు వచ్చేవారని చినపువ్వు తెనే కైఫియత్తులో తెలుస్తుంది. కోన ఫారెస్టు అంటే ఉప్పాడ మొదలు వేమవరం వరకూ అతి భయంకరమైన కీకారణ్యం అని చెప్పబడింది. 17 వ శతాబ్దం చివరలో గ్రామం ఏర్పడినట్లుంది నిర్దారించవచ్చు. బ్రాహ్మణులు కొత్తపల్లి నందు ఆయుర్వేద వైద్యం చేస్తుండేవారు వారిలో పాలంకి వారు ఆయుర్వేదం, సన్నిది రాజు

 వారు పౌరహిత్యం చేస్తూ ఉప్పాడలో స్ధిరపడి వుండవచ్చు. వీరితొ పాటే గ్రామం అభివృద్ది చెంది వుండవచ్చు. ఎందుకంటే 17 వ శతాబ్దం చివరలో సన్నిదిరాజు జగ్గకవి రచించిన కురవంజీ అనే తిన్నడు కధను స్వయంగా రాసి వీధి నాటకంగా ప్రదర్శింపచేసేవాడు. వీరి వంశీకులు ఇప్పటికీ పౌరహిత్యం చేస్తున్నారు.ఇక మత్య్సకారులు 1700 శతాబ్దంలో నుండి పూరి, మచిలీపట్నం, బర్మా,ఒరిస్సా,విశాఖ ప్రాంతాలనుండి వలసలు వస్తూ కొనఫారెస్టు వెంబడి స్దిర నివాసం ఏర్పరచుకున్నట్టు ఖాయంగా కనబడుతుంది.


కృతఙ్ఞతలు

బల్లోజు

తూర్పుగోదావరి జిల్లా

కైఫియ్యత్తులు నుండి




Wednesday, October 28, 2020

ఆత్రేయపుం పూతరేకులు


ఆత్రేయపురం పూతరేకులు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



పట్టుపరికిణీ మల్లే దండల్లో మురిసి పోతున్నారు అను, రత్న. ఇద్దరూ అక్కచెల్లెళ్ళే కాని ఒకటే హృదయం ఇద్దరిదీ.ఇల్లంతా బందుమిత్రులతో సందడి సందడిగా వుంది. గుమ్మాలకు మామిడితోరణాలు వ్రేలాడుతూ ఉన్నాయి. పెళ్ళి బాజాలు శ్రావ్యంగా మ్రోగుతున్నాయి.

అక్కా చెల్లెళ్ళు  ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ ఇంటి ముందర తాటాకు పందిరిలోనికి  ఇంటిగదుల్లోకి ఒకటే పరుగులు. వారు పరిగెడుతుంటే కాళ్ళగజ్జెలు చేసే చప్పుడు పెళ్ళిసందడిని మరింత పెంచుతూవుంది. పెళ్ళి పెద్దలు కిళ్ళీలు నములుతూ అను, రత్నలు చేసే అల్లరికి చిరునవ్వులు చిందిస్తూ కబుర్లాడుకుంటున్నారు. అది అను , రత్నల  పెద్దక్క కనకదుర్గ పెళ్ళి రోజు.చాన్నాళ్ళకు వాళ్ళింటిలో పెళ్ళి జరుగుతుంది. పనులు పురమాయిస్తూ అను ,రత్నల నాన్నగారు శ్రీధర్ హడావిడిగా తిరుగుతున్నారు. "ఏమండోయ్ బావగారు  పెళ్ళి కొడుకుది ఏ ఊరు" అని అడిగాడు పెళ్ళి పెద్దల్లో ఒకరైన గంగాధరం కిళ్ళీ ఊస్తూ. "అబ్బాయిది ఆత్రేయపురం"  అంటూ మరో పనిలో పడ్డాడు పెళ్ళికూతురు తండ్రి శ్రీధర్ . ఆత్రేయపురం అనగానే పెళ్ళి పెద్దల్లో కూర్చున్న ప్రభాకరం అనే ఆయన  "ఒహోహో బలే ఊరు సంబంధం అండి. ఆత్రేయపురం పూత రేకులకు చాలా ప్రసిద్ది" అన్నాడు. "దాని గురించి వివరంగా చెప్పండి" అంటూ మడత కుర్చీలో కూలబడ్డాడు  పెళ్ళి పెద్ద రవిబాబు. పూతరేకుల తయారీ గురించి చెపుతుంటే అను, రత్న పరుగు ఆపి నీలిరంగు కుర్చీల్లో వచ్చి  కూర్చున్నారు. ఇద్దరి బుగ్గలు గిల్లుతూ ఆ పెళ్ళి పెద్ద చెప్పడం మొదలు పెట్టాడు" పూతరేకులు లేనిది పెళ్ళి సారెలు నిండుగా ఉండవు. పూతరేకులు రెండు రకాలు బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు, చెప్పాలంటే బెల్లంతో చేసినవి బాగుంటాయి. బొండా రకపు బియ్యంను నానబెట్టి రుబ్బుతారు. రుబ్బిన పిండిని నీటిలో కలుపుతారు . నీరులా ఉన్న ఆ బియ్యం నీటిలో ఓ చేతిరుమాలంత వస్త్రం ముంచి  ప్రత్యేకమైన మట్టితో తయారుచేసిన కుండపై పూతలా పూస్తారు. ఈ కుండ బోర్లించి ఉంటుంది. ఆ కుండ మూతి వద్ద రధ్రం ఉంటుంది. ఆ రధ్రం నుండి కొబ్బరాకులతో అతి చిన్న మంటను పెట్టి కుండను వేడిచేస్తారు. పూతలా పూసిన బియ్యం నీరు కొద్ది క్షణాలలోనే రేకులుగా తయారవుతుందన్నమాట". అని చెపుతుంటే  రఘురాం అనే ఆయన అందుకుంటూ" ఏమండీ ఇది ఏదైనా పెద్ద పరిశ్రమంటారా? " అని అడిగాడు సందేహంగా. "అబ్బే అదేం లేదండి ఇది కుటీర పరిశ్రమే. దాదాపు మూడు వందల కుటుంబాలు తయారీలో ఉంటాయి" అన్నాడు ప్రభాకరం"బాబాయ్ మరి పూతరేకులు తీయగా ఉంటాయి కదా!" అడిగింది అను. నెయ్యి వాసన కూడా వస్తుంది " అంది రత్న  త్వరగా చెప్పమని అక్కచెల్లెళ్ళు ఇద్దరూ తొందర చేయసాగారు. " ఆగండి ఆగండర్రా చెపుతున్నాను. పూతరేకులు తయారైన తరువాత రేకులు చుట్టండం మరొకరు చేస్తారు". " ఏంటి బాబాయ్  రేకులు చేసినవారు చూట్టరా ? ఆశ్చర్యపోతూ అడిగింది రత్న . "ఆహ లేదమ్మా పూతరేకులు ఒకరు చేస్తే చుట్టడం మరొకరు చేస్తారు. ఎక్కువగా మహిళలు పూతరేకులు చేస్తే చుట్టడం ఎక్కువగా మగవారు చేస్తుంటారు"." బాబాయ్  పూతరేకులు ఎలా చుడతారు?" అడిగింది అను.

"పూతరేకు తీసుకుని అందులో గుమగుమలాడే వేడి నెయ్యిని పూస్తారు ఆ తరువాత బాదం, జీడిపప్పు, బెల్లం పౌడరు జల్లి రెండు అంచులు దగ్గర చేసి మడతపెడతారు . ఈ పనిలో కుటుంబంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకుంటారు.ఇలా రోజుకు వెయ్యి నుండి రెండువేల పూతరేకులు వరకూ ఒకో కుటుంబం తయారు చేస్తుంది. పది పది చొప్పున చక్కటి అట్టపెట్టెల్లో పేర్చి దేశ విదేశాలకు పంపిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఆత్రేయపురం పూతరేకుల తయారీని ప్రొత్సహిస్తూ ఋణాలను మంజూరు చేస్తుంది కూడా". "బలే ఉంది బాబాయ్ తయారీ విధానం" అన్నారు అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ . ఇలా వీరు మాట్లాడుతుండగా లోపలనుండి అను, రత్నల  అమ్మ నీరజ పూతరేకులు పళ్ళెంలో పట్టుకు వచ్చి పందిరిలోని పెద్దలందరికీ పంచి పెట్టింది. అను, రత్నలు గబ గబా తిని " అబ్బా నోటిలో పెట్టుకోగానే ఉత్తినే కరిగిపోతున్నాయ్ " అనగానే పందిరిలో  ఉన్న పెద్దలందరూ పకపకా నవ్వేశారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



పొట్టిక్కలు

 


పొట్టిక్కలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


 కపిలేశ్వరం జంమిందారు కోట చామంతి పూల దండలతో కళకళలాడుతుంది. దసరా పండగ బలే చేస్తారు జమిందారుగారు. కోటలో విందు  జరిగే పందిరి కిటకిటలాడుతుంది. ఫలాహారల సమయం కావడంతో వంటవాళ్ళు వంటలన్నీ వరుసగా పేరుస్తున్నారు. పొట్టిక్కలు, ఇడ్లీలు,మినప గారెలు, పెసరెట్టు, పూరీలు,ఊతప్పాలు, పాయసం,అన్నీ ఉన్నాయి అక్కడ.విందుకు వచ్చిన వారందరూ పొట్టిక్కలను లొట్టలేసుకు తినడంతో ప్రక్కనే ఉన్న ఇడ్లీకి ముఖం మాడిపోయింది.

ఉండబట్టలేక పొట్టిక్కలను సూటిపోటి మాటలతో హేళన చేస్తూ "ఏంటమ్మా పొట్టిక్క పెద్ద ఫోజు కొడుతున్నావ్ నేను ఇడ్లీని తెలుసా. మా పుట్టిల్లు చెన్నై నగరం. సాంబారుతో నన్ను తింటే ఆహా ఓహొ అంటారు అందరూ. కాస్త కారం పొడి నెయ్యి తగించి మరి తింటే ఉంటుందీ ఆ మజాయే వేరు తెలుసా "అంది. పొట్టిక్క చాలా మంచిది. నెమ్మదస్తురాలు. పొట్టిక్క సాంబారు ఇడ్లీతో " సోదరా ఇడ్లీ నన్ను కూడా పొట్టిక్క ఇడ్లీ అనే పిలుస్తారు. మాది కేరళ రాష్ట్రం. కోనసీమ వాసులు కొబ్బరి కాయల వ్యాపారం కోసం నిత్యం మా ప్రాంతానికి వస్తూ పోతూ ఉండటంతో మీ ఆంధ్రాకు కూడా పరిచయమయ్యాను. రావులపాలెం, అంబాజీపేట వాసులు అక్కున చేర్చుకున్నారు. నన్నూ నీలాగే మినపపిండి, ఇడ్లీరవ్వతో చేస్తారు. అయితే ఉత్తి ఆవిరి పట్టరు అదే నా ప్రత్యేకత. నన్ను నాలుగు పసన ఆకులతో చేసిన బుట్టలో వండుతారు. ఆ ఆకులలో వండటం వలన నాకు మంచి రుచి వస్తుంది. నన్ను బొంబాయి చట్నీతో కలిపి తింటే చెప్పానని కాదుకాని మరలా మరలా వడ్డించుకు తింటారు  నువ్వు ఏం కుళ్ళుకోకులే  మనం ఇద్దరం సోదరులమే అంది పొట్టిక్క". 

"బలే బలే ఎంత బాగా మాట్లాడుతున్నావో  

నువ్వు నా లాగే మంచి పేరు తెచ్చుకో  పొట్టిక్క" అంటూ మెచ్చుకుంది ఇడ్లీ.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


 

యానాం కాథలిక్ చర్చి

    యానాం కేథలిక్ చర్చి




సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



ఆ రోజు1996  నవంబరు 6.పాండిచ్చేరి శాసనసభ సమావేశాల్లో తీరికలేకుండా ఉన్న యానాం శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావుగారు పదే పదే మ్రోగుతున్న ఫోను అందుకున్నారు. అవతల నుండి వచ్చిన సమాచారం తీవ్ర ఆవేదన కలిగించింది. హుటాహుటిన హెలీకాప్టరులో యానాం బయలుదేరారు.యానాం సెయింట్ ఆన్స్ రోమన్ కేథలిక్ చర్చి ఫాదర్ జోసఫ్ అనితోథన్ ఓ ప్రక్క చర్చి ఆవరణలోని తన గదిలో గాబరాగా పచార్లు చేస్తున్నారు. ఆయన మనస్సు ఆవేదనతో నిండిపోయి వుంది. బంగాళాఖాతంలో వచ్చిన తీవ్ర తుఫాను యానాం పరిసరప్రాంతాలకు తీవ్ర నష్టం చేకూర్చింది.యానాం చర్చి ఆవరణలో ఫాదర్ గాంగ్ లోఫ్ పెంచిన  బొటానికల్ గార్డెన్ తుడిచిపెట్టుకుపోయింది.ఎంతో కాలంగా కాకినాడ పరిసరప్రాంత విద్యార్ధులకు విజ్ఞానాన్ని అందించిన గార్డెన్ తన హయాంలోనే కనుమరుగవ్వండం ఫాదర్ అనిథోతన్ తట్టుకోలేకపోతున్నారు. తుఫాను చేసిన నష్టం విని చర్చిని చూడడానికి ఎమ్మెల్యే కృష్ణారావుగారు వస్తూండటంతో ఇంకా కంగారుగా ఉంది.ఆలోచనలలోంచి బయటకు రాకుండానే ఎమ్మెల్యేగారు ఫాదర్ ఎదురుగా వచ్చి కూర్చున్నారు. 

 జరిగిన నష్టం వేదన కలిగించడంతో ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకోలేదు. కొంతసేపటికి కృష్ణారావుగారే మాట్లాడుతూ "ఫాదర్ ఈ ఉధ్యానవనంతో నాకు చాలా అనుభందం ఉంది బడి గంట కొట్టగానే పిల్లలందరం పరుగు పరుగున చర్చి దగ్గరకు వచ్చేవారం ఇక్కడ ఫాదర్ గాంగ్ లోఫ్ పిల్లలకు పాలు, పళ్ళు, బిస్కట్లు పంచేవారు  అవి తిని అందరం చీకటి పడేవరకూ ఆడుకుని ఇంటికి వెళ్ళేవారం. అవి ఇక గురుతులుగానే ఉండిపోతాయి." ఎమ్మేల్యే గారి గొంతులో జీర కనపడింది.

ఫాదర్ ఎమ్మేల్యే గారి ఆవేదనను గమనించి మాట మారుస్తూ " సార్ యానాం చర్చి మన దేశంలోని  పురాతనమైన చర్చిల్లో ఇదీ ఒకటి. నీలిమందు వ్యాపారం కోసం వచ్చిన ఫ్రెంచివారు వారి ప్రార్దనలకోసం 1768 నిర్మించారు. అయితే తుఫానుకు చర్చి దెబ్బతినడం ఇదే మొదటిసారి కాదు 1787 లో ఒకసారి కూలిపోయింది. చర్చి నిర్మాణం తిరిగి1835 లో ప్రారంబమై 1846 లో పూర్తయ్యింది. అప్పటి నుండి ఈ తుఫాను వరకూ ఏ నష్టం జరుగలేదు ఇప్పుడు ఇలా జరగడం బాధిస్తుంది.

 ఎమ్మేల్యే కృష్ణారావుగారు మాట్లాడుతూ "  ఫాదర్ ఈ చర్చి మా యానాం పట్టణానికి తలమానికం.  రోమన్ గోథిక్ శైలిలో నిర్మించారు. పర్నీచరు అంతా రంగూన్ టేకుతో చేయబడింది.అందమైన గాజుదీపాలు,అద్దాలు, గంటలు,పూజా సామాగ్రి అంతా ఫ్రాన్సు దేశం నుండే వచ్చింది.ఇది ఓ  చారిత్రక చిహ్నం."

" అవునండి, చర్చి గోపురంలో అమర్చిన గడియారం మరీ ప్రత్యేక మైనది. చర్చికి దూరప్రాంతం నుండి వచ్చేవారు  ఆలయంలోని గోడల పై చుట్టు ఉన్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన క్రీస్తు జీవిత విశేషాల చిత్తరువులు చూస్తూ ఎంత ఆనందిస్తారో "అన్నారు ఫాదర్ .

వాచ్ మన్ తెచ్చిన పొగలు కక్కే టీ కప్పును అందుకుంటూ "నిజంగా ఫాదర్. మనదేశంలో అయితే పుదుచ్చేరి, కారైకల్ ,మాహెలలో కూడా ఇటువంటి నిర్మాణాలున్నాయి. ఫ్రాన్సు దేశంలో ఎక్కువగా ఇటువంటివి కనిపిస్తాయి" అన్నారు ఎమ్మేల్యేగారు. 

 ఫాదర్ అనిథోతన్ కూడా తేనీటిని త్రాగుతూ

"ఈ చర్చి ఆవరణలో ఉన్న లుర్దూ మాతను విశ్వాసులు దర్శించండం ఇటీవల పెరిగింది సార్ "

"అవును ఫాదర్ ఆసంఘటనను మా తాతగారు చెపుతుంటే వినేవాడిని 1943 లో విలియమ్ బి ఒడెన్ అనే పది టన్నుల ఓడ సాక్రమౌంట్ లైట్ హౌస్ దగ్గర యానాం సముద్రం మధ్య ఇసుకలో కూరుకుపోతే ఓడను బయటకు తీయడానికి అమెరికా నుండి వచ్చిన ఇంజనీర్ స్వీని సాధ్యంకాక మేరీమాత పై భారం వేసి ప్రార్దన చేయగా ఓడ అతి సులువుగా కదిలి అందరినీ ఆశ్చర్య పరచిందని "

"అవుసార్ మనం చూస్తున్న రాక్ టెంపుల్  ఆయన భార్య అల్బెర్టా స్వీని దానికి గుర్తుగానే నిర్మించారు. దక్షిణంవైపు  ఉన్న మేరీమాత విగ్రహం మంగుళూరు నుండి రప్పించారండి".

ఫాదర్  స్వరం తగ్గించి "సార్  పురావస్తు శాఖ వారు చర్చికి నిధులు మంజూరు చేస్తారని చెప్పారు పనేమైనా ముందుకు వెళుతుందంటారా సార్ "అని అడిగారు.

మాటలపనిలోపడి అసలు విషయం చెప్పడం మరచిపోయాను పురావస్తుశాఖ నుండి నిధులు మంజూరైయ్యాయి త్వరలోనే ఆలయ పునరుద్దరణ పనులు ప్రారంభమవుతాయి అందుకే కాంట్రాక్టరు డేవిడ్ రాజుకు కబురు పంపాను వస్తూ ఉండవచ్చు"

 అని చెప్పేలోగా మోటారుబైకు ఆపి కాంట్రక్టరు పావులూరి డేవిడ్ రాజు లోపలికి వస్తూ ఎమ్మేల్యేగారికి ఫాదర్ కు నమస్కారం చేసి కూర్చున్నాడు.

ఎమ్మేల్యేగారు రాజు వైపు తిరిగి "రాజు చర్చికి నిధులు మంజూరైయ్యాయి పునరుద్దరణ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. యానాం కేథలిక్ చర్చి పురాతన స్వరూపం మారకుండా మరో రెండువందలయేళ్ళు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మాణం చేయాలి" అని నిధుల మంజూరు ఉత్తర్వులు రాజు చేతిలో పెట్టారు ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుగారు.

ఉత్వర్వులు తీసుకున్న రాజు "మేరీమాతకు సేవ చేసే భాగ్యం దొరికిందనుకుంటానండి  మరలా మార్చి నెలలో జరిగే లుర్దూమాత ఉత్సవాలకు సిద్దం చేస్తాను సార్ "అని వినయంగా చెప్పాడు ఎమ్మేల్యే గారికి.

 ఫాదర్ నవ్వుతూ భక్తిభావంతో కనులు మూసి "ఆమెన్ "  అంటూ పైకి లేచారు .



సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




కొండెవరం యుద్దం

 


             కొండెవరం యుద్దం


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



శ్రీరామనవమి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గరగా ఉన్న కొండెవరంలో బాగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు పేరు పొందిన కళాకారులను రప్పిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. జానపదకళారూపాలు కనీసం ఓ నాలుగురోజులైనా ప్రదర్శిస్తారు. అందులో తప్పెటగుళ్ళు, కోలాటం, డప్పు వాయిద్యం, బుర్రకథ,హరికథ తప్పక ఉంటాయి. ఆ యేడు ఘనంగా  నవమి వేడుకలు నిర్వహించాలని ఆలయ కమిటీ 

మీటింగు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంది. గ్రామ సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఆలయ ధర్మకర్త .ఆయన అధ్యక్షతనే సభ జరుగుతుంది. "భక్తులారా! చుట్టుప్రక్కల ఊళ్ళలో మన ఊరి శ్రీరామనవమి ఉత్సవాలకు ఉన్న మంచి పేరు మీ అందరికీ తెలుసు. ఆ పేరును మరింత పెంచేలా ఈ యేడు  వేడుకలు నిర్వహించాలి. అందుకు ఎలాంటి కార్యక్రమాలు ఉండాలో సూచించండి" అని కూర్చున్నారు. కమిటీ సభ్యుల్లో సత్యనారాయణ లేచినిలబడి అయ్యా మన ఊరి చరిత్ర 300  ఏళ్ళ క్రితం నాటిది. కొండెవరం యుద్దం లేదా చెందుర్తి యుద్దం లేదా చందవోలు యుద్దంగా పిలుస్తారు. ఆనాటి కథను మనకు కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగే వాళ్ళు ఒకరున్నారు వారిని పిలిపిద్దాం అన్నాడు. సభలో ఒకటే అలజడి "ఈ చరిత్ర ఎవరికీ తెలియదు తప్పకుండా పిలిపించండి" అని సభ్యులు గోలచేయసాగారు. "ఆగండి ఆగండి,  గోల చేయడం సభా మర్యాదకాదు నిశ్శబ్దం పాటించాలి " అని  అధ్యక్షుడు గదమాయించి  "సత్యనారాయణ గారు మీరు చెప్పింది బాగుంది వివరాలు చెప్పండి" అన్నారు . సత్యనారాయణ మాట్లాడుతూ "జముకుల కథ చెప్పే వారు ఉన్నారండి వారు కొండెవరం యుద్దం కథాగానం చేస్తారు. మన ఊరి కథను మనవారికి తెలియజేద్దాం" అని ముగించి కూర్చున్నాడు సత్యనారాయణ. "తప్పకుండా జముకుల కథ ఉంటుంది. నవమి మొదటిరోజే ఏర్పాటు చేద్దాం" అని సభ ముగించారు. ఈవిషయం బడిలోని సోషలు మాస్టారు కామేశ్వరరావుగారికి తెలిసింది. ఆయన పిల్లలను ఉద్దేశించి చెపుతూ పిల్లలూ" మీకు నేనిచ్చే ప్రాజెక్టువర్కు ఏంటో తెలుసా?"  "చెప్పండి సార్" పిల్లలు ఒకటే అరుపులు బల్లలపై దరువులు. ఏమిటంటే నవమికి జముకులవారు చెప్పే మన కొండెవరం యుద్దం చరిత్రగానాన్ని విని చక్కగా కథలా రాసి చూపించాలి. అదే ఈ నెల ప్రాజెక్టువర్కు " అని చెప్పగానే  "ఒకే సార్ " అంటూ పిల్లలు బల్లలు చరచసాగారు. 

నవమి కార్యక్రమాలలో  ఆ యేడు జముకుల కథ హైలెట్ అయ్యింది.

పిల్లలు ఆలకించి వీరావేశం పొందారు. ఇంటికి పోయి ప్రాజెక్టువర్కు పూర్తిచేసారు. బడిలొ మాస్టారుకు చూపించారు. సోషలు మాస్టారు  విద్యార్ది రమణ రాసిన ప్రాజెక్టు వర్కును ఎంపిక చేసి తరగతిలో ఇలా చదవడం ప్రారంబించారు.

"అది 1758 సెప్టెంబరు నెల బుస్సీ అధికారంలోని  ఫ్రెంచివారు విజయనగరం రాజులను ఇబ్బందులు పాలుజేస్తున్నారు. యుద్దానికి సై అంటున్నారు. బలహీనుడైన విజయనగరం ఆనందగజపతిరాజు బ్రిటీష్ వారి సహాయం కోరక తప్పలేదు .బ్రిటీష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ కొంతమంది సైనికులను రాబర్ట్ ఫోర్డ్ కు ఇచ్చి యుద్దానికి పంపాడు. ఫ్రెంచివారిని తరిమి కోస్తా ఆంధ్రాపై ఎప్పటినుండో పట్టుసాదిద్దామనుకుంటున్న బ్రిటీష్ సైన్యానికి ఆనందగజపతిరాజు ఆహ్వనం కోతికి కొబ్బరికాయ దొరికినట్లయ్యింది. 


కొండెవరం నుండి చెందుర్తి వరకూ దీనినే ఒకప్పుడు చందవోలు అని పిలిచేవారు ఈ ప్రాంతమంతా ఘోరమైన యుద్దం జరిగింది. ఫ్రెంచివారు ఓడిపోతున్న సమయంలో  ఆనందగజపతిరాజు నుండి, బ్రిటీష్ సేనలనుండి ప్రమాదాన్ని పసిగట్టిన పెద్దాపురం వత్సవాయి గజపతిరాజు ఫ్రెంచివారికి సహయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ యుద్దం విజయనగరం రాజులు, బ్రిటీష్ వారు ఓ ప్రక్క మరియు పెద్దాపురం రాజులు ఫ్రెంచివారు ఓ ప్రక్క ఉండి చేసిన యుద్దం అన్నమాట. బ్రిటీష్ వారు నైజాం రాజులతో సంధి కుదుర్చుకోవడంతో  విజయనగరం ఆనందగజపతరాజు ఓడిపోయాడు. ఇది భారతదేశంలో జరిగిన అతి నిర్ణయాత్మక యుద్దంగా గుర్తించబడింది. అని  మాస్టారు చదవడం ముగించారు. చక్కగా వివరంగా రాసిన రమణను విద్యార్దులు చప్పట్లతో అభినందించారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




జాంథానీ

       

           ఉప్పాడ జాంథానీ చీరలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



       తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్ మీదుగా ఎర్రటి మారుతి కారు ఉప్పాడ గ్రామానికి పరుగులు పెడుతుంది. బీచ్ రోడ్డు పైకి దూసుకు వచ్చే కెరటాలకు ఓ ప్రక్క భయం మరో ప్రక్క ఆనందంగా ఉంది. కారులో ప్రయాణిస్తున్న కృష్ణకు ,లక్ష్మికి విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు .ఇద్దరూ కవలపిల్లలు కూడా కావడంతో ఒకే తరగతి చదువుతున్నారు.లక్ష్మి ఆలోచనలన్నీ చీరల చుట్టూ తిరుగుతున్నాయి. ఎనిమిదవ తరగతి ఆంగ్లపాఠం "ద స్టొరీ ఆఫ్ ఐకత్" చెప్పేప్పుడు విన్నాను ఉప్పాడ జాంథానీ చీరల గురించి, అదే ఆలోచిస్తుంటే సముద్రపు కెరటం ఒకటి కారు అద్దాలను దబ్బున తాకింది. లక్ష్మి కెవ్వున కేక పెట్టి సీటులో కూలబడింది . తల్లి దుర్గావతి వాట్స్ యాప్ చాటింగ్ లోంచి బయటకు వస్తూ ఇద్దరినీ గోలచేయకుండా కూర్చోమని కసిరింది. తండ్రి గంగాధర్ డ్రైవింగ్ చేస్తూ ఎత్తు బ్రిడ్జి దగ్గర కొంతసేపు ఆపి సముద్రం అందాలు చూపించాడు. రాళ్ళ మధ్య నిలబడి సముద్రపు అలలు కనిపించేలా ఫోటోలు తీసుకున్నాం. మరలా ఉప్పాడ వైపు పోనిచ్చాడు కారుని నాన్న. కాకినాడకు  ఉప్పాడకు మధ్య దూరం 20 కి.మీ .



     కృష్ణకు అంత ఆసక్తి లేదుగాని లక్ష్మికి మాత్రం జాంథానీ చీరల తయారీ ఎప్పుడు ఎప్పుడు చూసేద్దామా అని ఉంది. తల్లి దుర్గావతి నాన్నను జాంథానీ చీర ఎప్పుడు కొంటారని పోరుపెట్టడం రోజూ చూస్తునే ఉంది. ఆ చీర చాలా ఖరీదని అమ్మ ఎవరితోనో చెబుతుంటే విన్నది లక్ష్మి. ఒక్కో చీర ఐదువేల నుండి లక్షవరకూ కూడా ఉంటుందని చెప్పడం ఆశ్చర్యమనిపించింది. ఉప్పాడ గ్రామంలోకి ప్రవేశించే సరికి బీచ్ రోడ్డు సెంటరు కనిపించింది. మలుపు తిరిగి పిఠాపురం రోడ్డుకు టర్న్ తీసుకుంది కారు. ఉప్పాడ కొత్తపల్లి జంటగ్రామాలు రెండు గ్రామాలలో చీరలు నేస్తారు కాని ఉప్పాడ చీరలుగానే ప్రసిద్ది. "పూర్వం జైపూర్ మహారాణి ఉప్పాడను ఆనుకుని ఉన్న అమీనాబాదలో వీరరాఘవులు అనే చేనేత కార్మికుడితో చీరలు నేయించుకునేవారట అందుకే ఇది గొప్పవారి చీరగా బావించి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. కాని ఇటీవల దేశవ్యాప్తంగా బాగా పేరుపడింది." కారు నడుపుతూ చెపుతున్నాడు నాన్న. ఉప్పాడ సినిమా సెంటరుకు వచ్చేసరికి ఎక్కడ చూసినా  చీరల షాపులే. ప్రతీ ఇల్లు ఓ బట్టల దుకాణమే . అందుకే అన్నట్టున్నారు చేనేతను కుటీర పరిశ్రమ అని. కారు ఆపితే అందరం దిగాం నాన్న ఎవరికో ఫోను చేస్తే వచ్చి చీరల షాపులకు తీసుకువెళ్ళారు.అమ్మ అతనితో ఒకసారి చీర ఎలా నేస్తారో చూపించమని అడిగింది. అలాగేనంటూ అతను తలాడించి చీరలు నేచే ఇళ్ళకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అమ్మాయిలు చీర నేయడం కనిపించింది. ఓ ప్రక్క కుర్చీలో సేదతీరుతున్న మాస్టర్ వీవరు దగ్గర ఉండి నేయిస్తున్నాడు. చీరకు కావలసిన ముడి సరకునంతా ఇతనే సమకూరుస్తాడు. మా అందరికీ కుర్చీలు వేయించాడు. అక్కడే తిరుగుతున్న ఓ అమ్మాయికి చెవిలో ఏదో చెపితే  అది విని అమ్మాయి హడావిడిగా బయటకు పరిగెత్తింది.

"సార్ చీరలు కొనుగోలుకు వచ్చాం కాని కొనేముందు జాంథానీ చీరల తయారీ దాని విశిష్ఠత తెలుసుకోవాలనుకుంటున్నాం"  అన్నాడు నాన్న మాట కల్పించుకుంటూ . "తప్పకుండా జాంథానీ చీర పుట్టింది బంగ్లాదేశ్ దేశంలో. "జాం "అంటే పూలు "థానీ" అంటే గుత్తి అంటే పూలగుత్తి" అంటుంటే నేను" ప్లవర్ బోకే అన్నమాట " అన్నాను. ఆయన నవ్వేస్తూ "అంతేనమ్మా చీరను చేతిలోనికి తీసుకుంటే ఆ బావన కలుగుతుంది కాబట్టే ఆ పేరు వచ్చింది,  ఏం చదువుతున్నావ్ ?" అని అడిగారు నన్ను మురిపెంగా చూస్తూ మాస్టర్ వీవర్ ." ఎనిదవ తరగతి అండి " అని బదులిచ్చాను. అమ్మ మధ్యలో మాట్లాడకు చెప్పనీ" అంది విసుగు ప్రదర్శిస్తూ. "పరవాలేదండి పిల్లలు ప్రశ్నలు వేస్తూ సందేహాలు తీర్చుకోవాలి." అన్నాడు మాస్టర్ వీవరు. 

       "అతి సున్నితమైన దారపు నూలుపోగులను సన్నని చేతివేళ్ళు కలిగిన చిన్నవయస్సు వారే నేస్తారు. దీనిని పెద్ద వయస్సు వారు నేయలేరు"  అన్నాడు మాస్టరు వీవరు అన్నయ్య నేను ముఖముఖాలు చూసుకున్నాం.  "ఎందుకని ? అడిగాను ఆశ్చర్యం ప్రదర్శిస్తూ. "ఎందుకంటే జాంథానీ దారపు పోగులు అతి సన్నగా సుతి మెత్తగా ఉంటాయి పెద్దవారి చేతులకు దారాలు తెగిపోతాయి అందుకని చిన్నవయస్సు వారే నేస్తారు." చెప్పాడు మాస్టర్ వీవరు. అన్నయ్య కృష్ణ "చీరలు నేచే వాళ్ళను ఏమంటారు? అని అడిగాడు."మగ్గం నేతగాళ్ళు లేదా నేతగాళ్ళు"  అంటారు." "జాంథానీ చీరలు యంత్రాలమీద నేస్తారండీ ?" అని అడిగాడు నాన్న.

"లేదండి పూర్తిగా చేనేత మగ్గం మీదే నేస్తారు. వెండి జరీతో నేయడం వల్ల దీని ఖరీదు ఎక్కవ  అందుకే దీనికి అంత డిమాండ్ కూడా "

" ఏ రకమైన డిజైన్ల చీరలు పేరు పొందాయంటారు? " అమ్మ అడిగింది. 

" కాటను చీరలు, పట్టుచీరలను మగ్గం పై నేస్తారు. ఇక చీరలలో రకాలంటే పల్లులు, అంచు లతలు, ఆల్ ఓవర్ ఉంటాయి. ఇక డిజైన్లు అయితే మల్లెపందిరి,త్రిశూల, మధులత , బోర్డరు చిలకలు, దండా చిలుకలు, దర్బారు, శ్రీలత  పేరుబడ్డాయి". బయటకు వెళ్ళిన అమ్మాయి గబగబా వస్తూ సర్వింగ్ ప్లేటులో బూందీ, ఉప్పాడ కజ్జికాయ స్వీటు తీసుకువచ్చి అందరికీ ఇచ్చింది. నేను అన్నయ్య ఆత్రంగా తింటుంటే అన్నయ్యకు పొలమారింది. అమ్మ హేండ్ బేగ్ లోనుండి వాటర్ బోటిల్ తీసి తాగిపించింది. 

నాన్న మాస్టరు వీవరుతో "బుటా వర్కు అని విన్నాను. ఏమిటి కాస్త వివరంగా చెప్పండి" అని అడిగాడు. "బుటావర్కునే చుక్కతీయడం అంటారు. చిన్న చిన్న ఆకులు, రెమ్మలు, పువ్వులు డిజైన్లుగా చీరమీద ఖచ్చితమైన దూరం, సైజుతో  చీర మీద చేతితో అల్లుతారు. ఈ బుటా పనితనమే జాంథానీకి ప్రత్యేకత తీసుకువచ్చింది." అని ఒకించిత్ గర్వం తొణికిసలాడే స్వరంతో అన్నాడు మాస్టర్ వీవరు.

      "అమ్మా మగ్గం చూపించమనవే"  అంటూ అడిగాను నేను ఖాళీ చేసిన పేపరు ప్లేటును క్రిందపెడుతూ" నా మాట విని మాస్టర్ వీవర్ "రండి చూపిస్తాను" అంటూ కుర్చీలోంచి పైకి లేచాడు. అందరం అతని వెనుకే అనుసరించాము. ఆయనే మగ్గం పనిని వివరిస్తూ "మగ్గాలు గుంట మగ్గాలు,స్టాండు మగ్గాలుగా అని ఉంటాయి. మగ్గంపై ముగ్గురు పనిచేస్తారు. మధ్యలో కూర్చున్నవారు  చిలక లాగుతూ ,సప్పాలు తొక్కుతూ మగ్గాన్ని ఆడిస్తే అటూ ఇటూ ఉన్నవారు  చుక్కతీస్తుంటారు. 

 ఇదిగో చూడండి  ఈ పొడవాటి దారపు పోగులను పడుగు అంటారు. కోర అనే తెల్లటి దారాలకు రంగులు అద్ది తయారుచేస్తారు. అడ్డంగా అల్లే దారాన్ని  పేక అంటారు."

"మగ్గం టకు టికూ మని శబ్దం వస్తుందేమిటండీ" అమాయకంగా అడిగాడు అన్నయ్య. అందరూ నవ్వేశారు " మగ్గానికి క్రిందనున్న సప్పాలతో తొక్కి మగ్గం పైనున్న చిలుకను లాగినప్పుడు  రెండు వరుసలలో ఉన్న పడుగు క్రిందది పైకి పైది క్రిందకు వెడుతుంది అప్పుడు అడ్డునేత నాడి అనే పరికరంలో బిగించిన దారపుకండె అటూ ఇటూ అల్లుతూ ఉంటుంది . ఆ నాడి చేసే శబ్దమే నువు విన్నది "  అన్నాడు మాస్టర్ వీవరు . నాన్న మధ్యలో మాట్లాడుతు "రాట్నం మీద కండెలు చుడతారు ఇందుకేనేమో "అన్నాడు. "నిజం చెప్పారు కండెలు చుట్టేవారు ప్రత్యేకంగా ఉంటారు. పెళ్ళిళ్ళకు ప్రత్యేక ఆర్డరుపై అతి ఖరీదైన చీరలు నేస్తూ ఉంటాం రాజకీయ ప్రముఖులు, సీనీ తారలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ వుంటారు." "నేత పనిలో ఎటువంటి కష్టనష్టాలు ఉన్నాయంటారు ?  అమ్మ అడింగింది మాస్టరు వీవరును. "లేకేం చుక్క తీసేవారికి కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గుంట మగ్గాలలో పని చేసేవారికి దోమల ద్వారా బోదకాలు వంటి రోగాలుకు గురవుతున్నారు." అందరం ముఖాలు చూసుకున్నాం ఇక వెడదామన్నట్టు. "నమస్కారమండి చాలా విషయాలు మాకు తెలియజేసారు. మంచి నాణ్యమైనవి ఓ రెండు చీరలు తీసుకుంటాను చూపించండి" అన్నది అమ్మ. "పదండి మా షాపు మా ఇంటి దగ్గరే ఉంది" అంటూ ముందుకు నడిచాడు మాస్టరు వీవరు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



బషీర్ బీ బీ

 


        బషీర్ బీబీ తీర్ధం( బంగారుపాప)


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




    జానకీరాం మాస్టారుకు తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యింది. పొన్నాడ పేరు చెప్పగానే తోటి ఉపాధ్యాయులు మంచి చరిత్ర ప్రసిద్ది చెందిన ఊరు వెళుతున్నారంటూ అభినందించారు.అక్కడ బషీర్ బీబీ దర్గా ఉందని ,ఉరుస్సు ఉత్సవాలు బాగా నిర్వహిస్తారని ,మతసామరస్యానికి చిహ్నంగా పేరు పొందినదని చెప్పారు. అంతే అంతకు మించి ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. బడిలో చేరిన మాస్టారును పలకరించడానికి అందరూ వస్తున్నారు. వచ్చిన వారిని బషీర్ బీబీ దర్గా విశేషాలు అడుగుతున్నారు మాస్టారు . బంగారుపాప అంటారని, బంగారపాపమ్మ తీర్ధమని పిలుస్తారని చెపుతున్నారు. తీర్దం మూడురోజులు జరుగుతుందని దేశ నలుమూలల నుండి ముస్లీం మతస్ధులు  కుటుంబాలతో వస్తారని, చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన హిందూ మతస్ధులు కూడా దర్గాను దర్శించి తమ ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు జరిగితే చీర,రవిక, గాజులు  మొక్కుగా చెల్లించుకుంటారని ఊరిలో పెద్దలు వారికి తెలిసింది చెప్పారు.

 మధ్యహాన్నం భోజనం ముగించి విరామ సమయంలో దర్గా చూడడానికి వెళ్ళారు మాస్టారు. నిర్మానుష్య ప్రాంతంలో పాడుబడిన పురాతన శిధిల భవనంలా కనిపించింది. అది ముస్లీం ప్రార్ధన మందిరంలా అనిపించలేదు. దర్గా పరిసర ప్రాంతాలలో జనసంచారం కనిపించలేదు కాని దర్గా దర్శనానికి వచ్చిన ఓ రెండు మూడు ముస్లీం కుటుంబాలు ప్రక్కనున్న షెడ్ లో వంట చేసుకుంటూ కనబడ్డాయి. దర్గా మధ్యలో ఓ పెద్ద మర్రివృక్షం ఉంది. దానికి చమ్కీవస్త్రాలు  కట్టి ఉన్నాయి. అవి గాలికి అటూ ఇటూ  ఎగురుతూ ఉన్నాయి .చుట్టూ పరిశీలించి వచ్చేశారు జానకీరాం మాస్టారు.

 తరువాత రోజు బడి దగ్గరకు ప్రక్కస్కూల్ ప్రసాదు మాస్టారు వచ్చారు. మాటల సందర్భంలో బంగారుపాప అని ఎందుకు పిలుస్తారో చెప్పారు. పూర్వం ఇక్కడ ఉండే బంగారుపాప అప్పుల బాధలలో ఎవరైనా ఉంటే  అడగగానే తన బంగారునగలు తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చేదని అందుకే అందరూ బంగారు పాప అని పిలిచేవారని ఇప్పటికీ అలాగే పిలుస్తున్నారని జనం నాలుకలమీద నానే కథను చెప్పారు. అయినా జానకీరాం మాస్టారుకు ఆ సమాచారం తృప్తిని ఇవ్వలేదు. దర్గాకు చెందిన విశేషాలు ఇంకా తెలుసుకోవాలని దగ్గరలో ఉన్న మూలపేట గ్రామం వెళ్ళారు.గ్రామంలో చదువుకున్నవారి దగ్గర సమాచారం ఏదైనా దొరుకుతుందేమోనన్న ఆశతో. అక్కడ ఓ బ్రాహ్మణ కుటుంబం కంటబడింది. మాస్టారు వాకబు చేస్తుంటే లోపలనుండి ఒకాయన వచ్చి మా పూర్వీకులు రాసిన పుస్తకం ఒకటుందని 

‌చెప్పి లోపలకు వెళ్ళాడు. మాస్టారుకు !చెప్పలేని ఉత్సుకత ,ఆనందం కలిగింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయ్యింది. లోపలకు వెళ్ళిన ఆయన ఓ చివికిన పుస్తకం తీసుకు వచ్చి చేతికి ఇచ్చాడు. ఆయన చేతిలో ఓ పాతిక రూపాయలు పెట్టి గబగబా వెనక్కి తిరిగి వచ్చేసారు మాస్టారు.

       స్కూల్ అయిన తరువాత ఇంటికి వెళ్ళి భోజనం ముగించి పుస్తకం చదవడం ప్రారంభించారు. అది చారిత్రక నవల.

70  సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం.పీఠికలో దర్గా కథను రచయిత కలలో కనబడి బంగారుపాప రాయించుకున్నట్టుగా ఉంది.వేయి సంవత్సరాల క్రితం నాటి మాట. 

పొన్నాడ షెహర్ డిల్లీ పాదుషాల ఏలుబడిలో వుండేది. పొన్నాడ షెహర్ శ్రీకాకుళం వరకు ఏలుబడిలొ వుండేది. పొన్నాడను పరిపాలిస్తున్న వజీర్ స్త్రీలోలుడు. అందమైన యువతులను చెరపట్టి ఢిల్లీ పాదుషాలకు భార్యలుగా పంపేవాడు. శ్రీకాకుళంలో నివశిస్తున్న సుందరి, బీషీర్ బీబీ స్నేహితురాళ్ళు. ఇద్దరూ మంచి సౌందర్యవతులు  .సుందరి హిందూమతానికి చెందిన యువతి. బషీర్ బీబీ ముస్లీం వనిత. బషీర్ బీబీకి ఆనాటికే వివాహమైంది. భర్త ఢిల్లీ  ఫాదుషాల దగ్గర  సైనికదళంలో పనిచేస్తూ ఉండేవాడు.  ఢిల్లీ పాదుషాకు ఇక్కడ బషీర్ బీబీ ,సుందరి అనే అందగత్తెలున్నారని కబురు పెడతాడు వజీర్ .అందులో బషీర్ బీబీ మహా అందగత్తే అని చెపుతాడు. ఢిల్లీ పాదుషా బషీర్ బీబీ కోసం పొన్నాడలో మనోహరమైన 7 అంతస్దుల భవనం నిర్మించమని ఆదేశిస్తాడు.  వజీర్ ఆఘమేఘాల మీద పరిసర ప్రాంతం దుర్గాడ  నుండి నల్లరాళ్ళను తెచ్చి భవంతి నిర్మాణం వెంటనే ప్రారంభిస్తాడు.వజీర్ నుండి తప్పించుకోవడం కోసం పొన్నాడ నగరానికే మారువేషాల్లో వస్తారు స్నేహితురాళ్ళు .పొన్నాడ షెహర్ లో వజీర్  ఆడవారి పట్ల చేస్తున్న  దౌర్జన్యాలపై ప్రజలను చెైతన్య పరుస్తారు. ప్రజలకు అడిగిన వారికి తోచిన సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు.ఢిల్లీలో ఉన్న బషీర్ బీబీ భర్త అనారోగ్యం పాలవడంతో ఇంటికి ప్రయాణవుతాడు. చివరకు ఇద్దరు స్నేహితురాళ్ళు వజీర్ సైనికులకు దొరికిపోతారు.ఇంతలో బషీర్ బీబీ భర్త పొన్నాడ మీదుగా శ్రీకాకుళం వెడుతూ పొన్నాడలో మరణిస్తాడు. అది తెలిసి సైనికుల నుండి తప్పించుకుని బషీర్ బీబీ తన భర్త శవంతోపాటు ఢిల్లీ  పాధుషా తనకోసం నిర్మించిన భవంతి పైనుండి అడుగుభాగానికి పోయి సజీవసమాధికి సిద్దపడుతుంది. పై అంతస్దుకు చేరుకున్న సుందరి క్రిందకు చూస్తుంది . భర్త శవం ప్రక్కనే ధ్యాన ముద్రలో ఉన్న బషీర్ బీబీ బంగారుకాంతులు ఈనుతూ కనిపిస్తుంది సుందరికి. అప్రయత్నంగా సుందరి " ఓ బషీర్ బీబీ నా బంగారు పాప" అంటూ పిలుస్తుంది. బంగారుపాప కనులు తెరచి "సుందరీ నా ప్రియమైన మిత్రురాలా ఈ చోటును దర్శించి భక్తితో నన్ను "బంగారుపాప" అని ఎవరు పిలుస్తారో వారి కోరికలు నెరవేస్తాను. మన స్నేహనికి గుర్తుగా ఇక్కడ హిందూ ముస్లీంలు అందరూ కలసి తీర్ధం ఆచరిస్తారని అంటూ ధ్యాన ముద్రలోకి తిరిగిపోతూ కనులు మూసేసుకుంటుంది. ఇంతలో ఉప్పాడ సముద్రం ఉప్పొంగి సునామీలా పొన్నాడపై విరుచుకు పడుతుంది. వజీర్ సైన్యం ఇసుకమేటలలో కూరుకుపోయి చనిపోతారు. ఇసుకమేటలలో బంగారుపాప భవనం చివరి అంతస్దు మాత్రమే కనబడుతూ మిగులుతుంది.. ఆనాటినుండి ఆ చివరి అంతస్ధు భాగం  దర్గాగా పూజలందుకుంటూ ఉంది. నవల చదవడం పూర్తి చేసిన జానకీరాం మాస్టారు గుండె నిండా ఊపిరి పీల్చి మంచి చారిత్రక పుస్తకాన్ని చదివానని ఆనందపడుతూ తృప్తి నిండిన మనస్సుతో బంగారుపాప నవలను ప్రక్కన పెట్టి నిద్రకు ఉపక్రమిస్తారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



     

మత్స్యకారుల జీవన విధానం

 మత్స్యకారుల జీవనం


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



సముద్రతీర ప్రాతం అయిన ఉప్పాడ గ్రామంలో ఓ కుటుంబం నివశిస్తూ ఉండేది. తేజ  ఎనిదవ తరగతి చదువుతున్నాడు.తన తల్లిదండ్రుల పేర్లు దేవయ్య, కటాక్షం. దేవయ్య ఊరిలో మోతుబరి. ఒకరోజు బాగా చీకటి పడింది. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి.ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. రేడియోలో  ప్రకటన వస్తుంది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది అది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవ్వరూ సముద్రం పైకి వేటకు వెళ్ళవద్దని అనౌన్సర్ చదువుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంబం అయ్యింది. అప్పుడే భోజనాలు ముగించి నులకమంచం మీద నడుం వాల్చాడు దేవయ్య . మరో మంచంపై దుప్పటి కప్పుకుని తేజ ఇనప పెట్టె పై పెట్టిన  దీపంబుడ్డి దగ్గరకు వచ్చిన తూనీగతో ఆడుకుంటున్నాడు. కటాక్షం ఇల్లంతా సర్ది తనూ నడుం వాల్చబోయింది. బయట హోరున వర్షం కురుస్తుంది. ఇంతలో వీధి తలుపును ఎవరో తడుతున్నట్టు అనిపించి దేవయ్య దిగ్గున లేచివెళ్ళి వీధి తలుపు గడియ తీసాడు. సుబ్బంపేటలో పేరు మోసిన చేపలవ్యాపారి కాశీబుల్లొడు వర్షానికి బాగా తడిసిపోయి వణుకుతున్నాడు. దేవయ్య కంగారుపడుతూ కాశీబుల్లోడిని లోపలికి ఆహ్వనించి ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకోమని రుమాలు, పంచే ఇచ్చాడు.

కటాక్షం కంగారుపడుతూ కాశీబుల్లోడికి భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటగదిలోనికి పరిగెత్తింది.

"దానవాయిపేట నుండి వ్యాపారం నిమిత్తం సవారి బండి మీద వెళ్ళి వస్తుంటే దారిలో వర్షం ఎక్కువైయ్యి మీ ఇంటి దగ్గర ఆగానని" చెపుతున్నాడు కాశీబుల్లోడు.

ఇంతలో పళ్ళెం నిండా వేరుసెనగకాయలు వేపి 

పట్టుకు వచ్చింది కటాక్షం . తేజ గబగబా గుప్పెడు తీసికుని తినసాగాడు. దేవయ్య కాశీబుల్లోడుతో మాటలు కలుపుతూ  

"ఎప్పటినుండో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మత్స్యకారుల జీవన విధానం గురించి చెప్పండి కాస్త అన్నాడు దేవయ్య

  "తప్పక చెబుతాను " అంటూ  తలను రూమాలుతో రుద్దుకుంటూ చెప్పడం మొదలెట్టాడు కాశీబుల్లోడు. తేజలో ఆసక్తి పెరిగింది ఏం చెపుతారా అని.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహజసిద్దమైన   పొడవైన సముద్రతీర ప్రాంతం ఉంది. ఇచ్చాపురం మొదలు నెల్లూరు జిల్లా తడ వరకూ ఈ తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ తీరప్రాంతాన్ని ఆనుకుని  మత్స్యకారులు నివసించే వందలాది గ్రామాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో  అగ్నికుల క్షత్రియులు వీరినే పల్లీలు అని పిలుస్తారు, వాడబలిజ, జాలరి,గంగపుత్రులు వంటి మత్స్యకార తెగలవారు నివసిస్తూ ఉన్నారు."

"వీరి జనాభా ఎంత ఉంటుందంటారు ?"

అడిగాడు దేవయ్య

"వీరి జనాభా సంఖ్య దాదాపు 60 లక్షలువరకూ ఉండవచ్చు.వీరు మొదటిలో వ్యవసాయం చేసినప్పటికి  ఆ తరువాత కాలంలో చేపలు పట్టే వృత్తిని స్వీకరించారు.కొంత మంది ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు .ప్రధానంగా చేపలవేట మీదే వీరు జీవిస్తూ ఉన్నారు. సముద్రం,నదులు,కాలువలు,చెరువులు, కుంటలలో వీరు చేపలను పట్టి అమ్ముతూ జీవిస్తారు. "

"పురాణాలలో వీరి గురించి ప్రస్తావన ఏముంది?"  అడిగాడు దేవయ్య

" మహాభారత పురాణ హితిహాసాలకాలం నుండి వీరి మనుగడ ప్రస్తావన ఉంది.వీరిని గంగపుత్రులు అనికూడా పిలుస్తారు. వీరి ప్రధాన ఆధాయ వనరు సముద్రపువేట."

"మరి కుటుంబ జీవనం ఎలా వుంటుంది" అని అడిగాడు దేవయ్య.

‌  "మత్స్యకారులది ఎక్కువగా ఉమ్మడి కుంటుంబ వ్యవస్ద. ఇప్పటికీ వీరిలో కులకట్టుబాట్లు అధికం. కుటుంబంలోని మగవారు ఆడపిల్లల బాధ్యతను చేపడతారు వీలు కుదరకపోతే గ్రామంలోని అన్ని కుటుంబాలు బాధ్యతను పంచుకునే అపురూపమైన సమిష్టి జీవనవిధానం ఇంకా వీరిలో అమలవుతూ ఉండటం ఆశ్చర్యం అభినందనీయం."

"నిజమేనండి ఎంత మంచి కట్టుబాటు" 

ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేసాడు దేవయ్య 

కాశీబుల్లోడు చెపుతూ"ఒక కుటుంబంలోని మగవారు అందరూ చేపలవేటకు వెళతారు తెచ్చిన చేపలను ఆడవారు బజారుకు పట్టుకు వెళ్ళి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తారు."


"అంకుల్  చేపలవేటకు ఏం ఉపయోగిస్తారు?" ఆసక్తిగా అడిగాడు తేజ


‌ "చేపలవేటకు వీరు వలలను ఉపయోగిస్తారు. కుంటలలో చేపలు పట్టడానికి చేతులు ఉపయోగిస్తారు. దీనిని "తడుముకోవడం" అంటారు.చెరువులలో "కొంటె వల"ద్వారా చేపలు పడతారు. నదులలోను, సముద్రపు ఉప్పుటేరులలోనూ మూడు కర్ర దుంగలను ఒకటిగా కట్టిన "తెప్ప పడవ" వాడతారు."మోచేతి వల"ద్వారా పట్టిన చేపలను తాటాకుతో చేసిన "బుంగ"లో వేసుకుంటారు."

"ఇంకే ఉపయోగిస్తారు"  అడిగాడు దేవయ్య

‌     కాశీబుల్లోడు  చేతిలోని వేరుసేనగకాయ పగులకొట్టి పల్లీ వలిసి నోటిలో వేసుకుని నమూలుతూ   "పడవ,బోటు, మరబోటులను సముద్రపు వేటకు ఉపయోగిస్తారు. పడవ ముందుకు వెళ్ళడానికి నీటిని వెనక్కి నెట్టే తెడ్డులను ఉపయోగిస్తారు.సముద్రపువేటలో సూదూరం ప్రయాణిస్తారు. దాదాపు పక్షం రోజులు వరకూ సముద్రంమీదే వేట కొనసాగిస్తారు మత్స్యకారులు."

"వలలు ఎలా తయారవుతాయి చెప్పండి కాశీబుల్లోడు గారు" అడిగాడు దేవయ్య


"పూర్వం వలలను మత్స్యకారులే తయారుచేసుకునేవారు. నూలుదారాలను "వగ్గావు" అనే ప్రత్యేక సాధనంతో నులిపెడతారు. నూలు దారం తయారైనాక ఆడవారు వలలను అల్లుతారు. వలల అల్లికల మధ్య ఖాళీని" పేతు" అని పిలుస్తారు. ఈ పేతు అంగుళం రెండగుళాలు సైజులతో ఉంటాయి.


"అలా ఎందుకు సైజులుగా ఉంటాయి అంకుల్ " అడిగాడు తేజ 

కాశీబుల్లోడు నవ్వుతూ  "మంచి ప్రశ్న. ఈ పేతు సైజును బట్టే రకరకాల చేపలు వలలో పడతాయి. 

త్వరత్వరగా వంట సిద్దం చేస్తున్న కటాక్షం అన్నీ వింటుంది వంటగది గుమ్మం దగ్గర నిలబడి అన్నయ్యగారు జిగురు వాడతారనుకుంటాను"  అని అడిగింది

 కాశీబుల్లోడు నవ్వుకుంటూ "ఎంతైనా మా ఉప్పాడ అమ్మాయి కదా కొంతైనా తెలియకుండా ఉంటుందా !" అంటూ చెప్పడం ప్రారంబించాడు

"తయారైన వల మన్నిక కోసం తుమ్మ చెక్క తుమ్మజిగురును గూనల్లో పోసి వేడిచేస్తారు.గోరువెచ్చని రంగులో వలను నానబెట్టి ఎండబెడతారు . దానితో వలకు పటుత్వం వస్తుంది.

" త్వరగా వండు కటాక్షం కాశీబుల్లోడు గారు ఎప్పుడు తిన్నారో ఏంటో ఏం కూర చేస్తూన్నావ్ అని అడిగాడు దేవయ్య 

"నాటుకోడి గ్రుడ్లు, ఉల్లి తురుము అండి" అంటూ కూర కలపడానికి వెళ్ళింది కటాక్షం. మరలా సంభాషణలోనికి వస్తూ 

"బుల్లొడు గారు అలివి గురించి చెప్పండి కాస్త"

అడిగాడు దేవయ్య

"తప్పకుండా   సముద్రపు వేటలొ "అలివి" అనే ప్రత్యేక విధానం వుంది. ధ్వని శాస్త్ర నిపుణుడు లాంటి "సడిగాడు"అనే వ్యక్తి ముందుగా పడవపై సముద్రంలోనికి వెళ్ళి  "సడికత్తావు" అనే తెడ్డును సముద్రపు నీటిలో ముంచి సడికత్తావు మరో కొనను చెవిదగ్గర పెట్టుకుంటాడు. ఆ సడికత్తావు నుండి చేపలు గుంపులుగా ఎక్కడ తిరుగుతున్నాయో అవి చేసే శబ్దతరంగాలను ఇట్టే  గ్రహించి అక్కడ వలవేయమని  చేతిరుమాలును ఊపుతాడు .అలివి యజమాని "సరంగి"కి చెపుతాడు. అప్పుడు సరంగి పడవపై ఒక కిలోమీటరు మేర తాడును వదులుతూ వెళతాడు దానిని" కొడి ఇవ్వటం" అంటారు.  ఆ తరువాత రెండు కిలోమీటర్లమేర రెండు అడుగుల వలను వదులుతారు. మధ్యలో పెద్దదైన మధ్యవల లేదా "మైపాల" ను వదులుతూ ఆంగ్ల అక్షరం "U " ఆకారంలో పడవను నడుపుతు వలను సముద్రంలో వదులుతారు . ఇప్పుడు రెండు కొసలను ఓ నలభైమంది "రైతులు" అనే పిలవబడే కూలీలు వలను అటూ ఇటూ  లాగుతూ అలివలో పడిన చేపలను ఒడ్డుకు చేరుస్తారు."

"అబ్బో అలివి వెనుక పెద్ద కథే ఉందన్నమాట"

ఆశ్చర్యపోతూ అన్నాడు దేవయ్య


"అంకుల్ మత్స్యకారుల ఆచారవ్యవహారాలు గురించి చెప్పండి?" దుప్పటి ముసుగు మరింత దగ్గరకు బిగిస్తూ అడిగాడు తేజ.


"మత్స్యకారులు దేవతలను ఆరాధిస్తారు. కాశమ్మోరు,నూకాలమ్మ,బంగారమ్మ, గంగమ్మ వీరి ప్రధానదేవతలు. క్రొత్త అమావాస్య రోజున వీరు ఒకరి దగ్గరనుండి మరోకరి దగ్గరకు పనిలోకి కుదురుతూ వుంటారు.హిందూ సాంప్రదాయ పద్దతిలోనే వివాహాలు చేసుకుంటారు.


"ఏదేమైనా నీటి మీద జీవనం ప్రమాదమే సుమండీ"అని సానుభూతిని వ్యక్తం చేస్తూ అన్నాడు దేవయ్య

"అవును దేవయ్యగారు తుఫానులు, సూనామీలు సంభవించి నప్పుడు ప్రాణనష్టం సంభవిస్తుంది. ఇప్పుడిప్పుడే శాస్త్రసాంకేతికతలను ఉపయోగించి చేపలు పట్టడం నేర్చుకుంటున్నారు."

భోజన పళ్ళెం పట్టుకువస్తూ "రండి అన్నయ్యగారు భోజనం చేసాక మాట్లాడుకుందాం అలా చూస్తారే అన్నయ్యగారికి చేతులు కడుగుకోటానికి నీళ్ళివ్వండి" అంటూ హడావిడి చేసింది కటాక్షం. 




 సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



కాకినాడ కాజా

 కాకినాడ కోటయ్య కాజ


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న కాలం. ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ భరతమాత స్వేచ్చా వాయువులకోసం భారతవీరులు కరవాలాలు ఝళిపిస్తున్నారు  . ఆదే కాలంలో భారతదేశం అద్భుత ప్రతిభావంతులకు జన్మనిస్తున్న సమయం కూడా. తెలుగువీరుల గడ్డ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చిన్నపరిమి గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబం ఓ ప్రతిభావంతుడికి జన్మనిచ్చింది.అతడే చిట్టిపెద్ది కోటయ్య .చిన్ననాటి నుండి కోటయ్యను తండ్రి తనకూడా పొలానికి తీసుకుపోవాలని ఆరాటపడేవాడు. పొలంపని అస్సలు ఇష్టం ఉండేది కాదు కోటయ్యకు . పదేళ్ళ వయస్సుకే  కోటయ్యలో నూతన ఆలోచనలు గజి బిజి చేయసాగాయి. అమ్మ పిండివంటలు చేస్తున్నప్పుడల్లా ఎంతో సంబర పడిపోయేవాడు.తనూ కూడా ఉండలు ఒత్తుతూనో , గరెటెలతో వండినవి పెనం నుండి దించుతుంటేనో  చెప్పలేని ఆనందం కలిగేది కోటయ్యకు.

 పొలంపనికి కోటయ్య రావటంలేదని ఆరోజు పెద్ద రాద్దాంతం చేసాడు కోటయ్య తండ్రి. పొలం పని ఇష్టంలేని కోటయ్య పదేళ్ళవయస్సులో అర్దరాత్రి ఇంటినుండి పారిపోయేడు. కన్నవారు కోటయ్య కోసం వెతకని ఊరులేదూ వెతకని చోటూలేదు. కోటయ్య పోయి పోయి తిరుపతి చేరుకున్నాడు. ఎలా బ్రతకాలో బ్రతకడానికి ఏంచెయ్యాలో తెలియని వయస్సు కోటయ్యది. దూరంగా ఏడుకొండలు కనిపిస్తూ ఉన్నాయి. అమ్మ ఏడుకొండలవాడా అంటూ పూజలు చేయడం గుర్తుకు వచ్చింది. ఇంతలో తన ముందర నుండి భక్తులగుంపు " ఏడుకొండలవాడా  వెంకటరమణా "  అంటూ కొండ ఎక్కడం చూసాడు.తను కూడా" ఏడుకొండలవాడా వెంకటరమణా " అంటూ  నడవడం మొదలెట్టాడు కోటయ్య . కొంత సేపటికి తిరుపతి కొండ ఎక్కలేక ఓ చెట్టు క్రింద కూలబడిపోయాడు. ఓ ప్రక్క ఆకలి దంచేస్తుంది. ఇంతలో ఓ భక్తుల బృందం కొండ దిగుతూ ఉంది. అందులో ఓ ముసలావిడ అలసిపోయి ఆకలితో దిగులుగా కూర్చున్న కోటయ్య దగ్గరకు వచ్చి చేతిలో తిరుపతి లడ్డు పెట్టింది. గబా గబా సగం తినేసాడు. అబ్బ ఎంత రుచిగా వుందో అనేలోపు లడ్డూతీపిలోని మాధుర్యానికి కోటయ్య  కనులు మెల్లగా మూతలు పడ్డాయి. కనులు తెరచి చూసే సరికి చెన్నపట్టణం అంటే ఇప్పుడు చెన్నై నగరంలో మంచం మీద పడుకుని ఉన్నాడు. వంటపాత్రల చప్పుడుకు మెలకువ వచ్చి గబ గబా మంచం దిగి గది బయటకు వచ్చి చూసాడు. అక్కడ చాలామంది పనివాళ్ళు రకరకాల మిఠాయిలు చేస్తూ ఉన్నారు. అక్కడ కుర్చీలో జారబడి వినసకర్ర విసురుకుంటూ ఉన్న బామ్మ కనబడింది. ఆ బామ్మే తనకు చేతిలో లడ్డు పెట్టిన బామ్మ అని గుర్తు పట్టాడు కోటయ్య . బామ్మ  కోటయ్యను చూడగానే లేచి దగ్గరకు వచ్చింది. "ఏం నాయనా ఇప్పటికి కళ్ళు తెరచావా. నీకు లడ్డూ పెట్టగానే తింటూనే  నిద్రపోయావు. నువు ఎవరో ఏంటో ఎవరిబిడ్డవో తెలియదు .అందుకే అక్కడ నిన్ను వదిలేయలేక తీసుకువచ్చాను మా ఇంటికి" అంటూ కోటయ్యకు గాలి విసురుతూ చెపుతుంది. కోటయ్యకు మెల్లగా అర్దమయ్యింది. బామ్మగారి బుగ్గన ముద్దుపెట్టాడు. బామ్మగారి మనస్సు వెన్నలా కరిగిపోయింది. తన వృత్తాంతమంతా చెప్పాడు బామ్మగారికి. "పాలుగారేలా ఉన్నావు నిన్ను కొడతాడా మీ నాన్న  వద్దులే అక్కడకు పోవద్దు ఇదిగో మా మిఠాయి దుకాణంలో రకరకాల వంటలు నేర్చుకుంటూ ఇక్కడే ఉండిపో" అంది. కోటయ్యకు బామ్మగారి ప్రేమాభిమానాలు మిఠాయి దుకాణం ఎంతో నచ్చేసింది. కోటయ్య నెల తిరిగేలోపే అన్ని రకారకాల మిఠాయిలు వండటం నేర్చేసుకున్నాడు. పన్నెండేళ్ళు గిర్రున తిరిగాయి. ఇరవై రెండేళ్ళ వయస్సు వచ్చేసరికి చిట్టిపెద్ది కోటయ్యకు ఇంటి వైపు మనసు లాగింది. అమ్మా నాన్నలను చూడాలనిపించింది. మెల్లగా బామ్మ దగ్గరకు పోయి " మా ఇంటికి వెళతాను" అని బామ్మతో చెప్పాడు. బామ్మకు ఏడుపు  ఆగలేదు కోటయ్య పట్ల ప్రేమ పెంచుకుంది మరి. బామ్మ కన్నీళ్ళు తుడుచుకుని "వెళ్ళు కోటయ్య మీ అమ్మ నీకోసం ఎంత ఏడుస్తుందో, ఎంత బెంగ పెట్టుకుందో" అంటూ గబగబా లోపలికి వెళ్ళి డబ్బులమూట తెచ్చి చేతిలో పెడుతూ దీవించి పంపింది.

  చెన్నపట్టణం మద్రాసుగా మారింది. మద్రాసు నగరం నుండి తెనాలి చేరి తన ఊరు చిన్నపరిమి చేరుకున్నాడు. ఇంటి ముందుకు వెళ్ళి "అమ్మా ! నాన్నా !" అంటూ బిగ్గరగా పిలిచాడు కోటయ్య. ఎన్నాళ్ళగానో  ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్న కోటయ్య తల్లిదండ్రులు గబగబా బయటకు వచ్చి నూనూగు మీసాల కోటయ్యను చూసి గుర్తుపట్టి  కౌగిలించుకున్నారు. ఒళ్ళంతా తడుముతూ ముద్దాడుతూ తనివితీరా ఏడ్చారు. క్షమించమని తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అమ్మా నాన్నల కాళ్ళకు నమస్కరించి లోపలికి నడిచాడు కోటయ్య.

          కోటయ్యకు తల్లిదండ్రులు అనసూయతో పెండ్లి జరిపించారు. కోటయ్య తెనాలిలో మిఠాయి దుకాణం తెరిచాడు. అనతికాలంలోనే మంచి మిఠాయి దుకాణంగా పేరుతెచ్చుకుంది. అయితే ప్రతిభావంతులు ఎప్పుడూ చేతులు కట్టుకు కూర్చోరు. తన పనిలో గొప్పదనం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కోటయ్య మనస్సు నూతన ఆవిష్కరణకు ప్రయత్నిస్తుంది. ఒక రోజు పిండితో కుస్తీ పడుతున్న కోటయ్యను చూసి భార్య "ఏం చేస్తున్నారండి" అంది. "అనసూయ మనం అమ్మే తినుబండారాలు అందరి దగ్గరా దొరికేవే నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అందుకు ఓ కొత్తరకం వంటకు ప్రయత్నిస్తున్నాను" అన్నాడు కోటయ్య "అసలు మీ ఆలోచన ఏంటో చెప్పవచ్చుకదా " " ఏం లేదు అనసూయ కొరికితే పాకం కారాలి  దానిని చూస్తుంటే  లోపల పాకం ఉన్నట్టు కనబడకూడదు నొక్కితే గట్టిగా ఉండాలి" అన్నాడు కోటయ్య. "ఏంటి ఏంటి విడ్డూరంగా ఉందే "బుగ్గలు నొక్కుకుంటూ కళ్ళు పెద్దవి చేస్తూ కోటయ్య ప్రక్కన పీట వేసుకు కూర్చుంది అనసూయ. "ఏలా చేస్తారు మరి"  "ఏం చేస్తానంటే  ఇదిగో మైదాపిండి  కేజి తీసుకున్నాను దీనికి  ఓ వంద గ్రాములు పచ్చి సెనగపిండి కలుపుతాను." "మైదాలో సెనగపిండి బలేగుందండి"  "అనసూయ నిన్న నువు తయారుచేసిన గుమగుమలాడే నెయ్యి తీసుకురా" అన్నాడు కోటయ్య. అనసూయ లేడిలా వంటగదిలోకి పరిగెత్తి నెయ్యి డబ్బా తెచ్చింది. కోటయ్య అందుకుంటూ  ఇందులో వందగ్రాముల నెయ్యి వేస్తాను. వేసి ఇదిగో నెయ్యితో పిండిని పాలిష్ చేసినట్టు కలుతాను. అంటూ రెండు చేతులలోనికి పిండిని తీసుకుని నలపడం మొదలెట్టాడు. ఓ పదినిమిషాలు

నెయ్యిని మొత్తం పిండికి పట్టించాడు.

"ఆ తరువాత ఏం చేస్తారు"  ఆతృతగా అడిగింది అనసూయ. "వంటసోడా ఓ ఇరవై గ్రాములు వేస్తాను". "నాకు తెలుసు వంటసోడా వేస్తే పొంగుతాయి కదా" అన్నది అనసూయ . "ఆ అవును అందుకే వేస్తాను. వేపినప్పుడు కరకరలాడడానికి కాస్త డాల్డ కూడా కలుపుతాను."  "మీ బుర్రే బుర్రండీ" మెచ్చుకుంటూ సాయంచేస్తుంది కోటయ్యకు భార్య అనసూయ. "కాస్త  నీళ్ళుపొయ్యి "అన్నాడు. అనసూయ  పిండిలో ఇత్తడి చెంబులో ఉన్న నీళ్ళు పోసింది. "ఇప్పుడు పిండిని కలిపి కలిపి ముద్దలా చేస్తాను చేయడమే కాదు ఓ అరగంటసేపు పిండిముద్దను ఎత్తి కుదేస్తాను" అంటూ పళ్ళెం కేసి బాదడం మొదలెట్టాడు కోటయ్య .  ఇలా చేస్తున్నాడే కాని అలా వండాలని కోటయ్యకూ తెలియదు ప్రయత్నిస్తూన్నాడంతే. కోటయ్యకు చేతులు నొప్పి పుట్టాయి. అనసూయ  కోటయ్య అలసిపోవడం చూసి "పైకి లేవండి బాదింది చాలుగాని చేతులు కడుక్కొని భోంచేయండి అంది." కోటయ్య అవస్దను చూసి నవ్వుకుంటూ . వంటగదిలోకి వెళ్ళి భోజనం పళ్ళెం తెచ్చి పీటమీద పెట్టింది. కలిపిన పిండి ముద్దను ప్రక్కన పెట్టి  దానిపై గుడ్డను కప్పాడు కోటయ్య. కోటయ్యకు తెలియదు అలా కొంత సేపు  పిండిముద్దను కదపకుండా ఉంచితే చక్కగా మృదువుగా అవుతుందని.

"భోజనం చేస్తున్నాడే గాని కోటయ్య "తరువాత ఏంచేయాలి ? అని ఆలోచిస్తుంటే ఒక్కసారిగా పొలమారింది కోటయ్యకు. అనసూయ కోటయ్యకు మంచి నీళ్ళ చెంబు అందిస్తూ "  నాకు తెలుసు మన కాకినాడ చూట్టాలే తలుచుకుంటున్నారు. మొన్న దీపావళికి వచ్చినప్పుడు నాతో చెప్పారు.  కాకినాడలో మంచి మిఠాయి దుకాణం ఏదీ లేదు మీరు అక్కడకు వచ్చేయవచ్చు కదా. తెనాలి బాగా చిన్నఊరు  కాకినాడ అయితే మీవ్యాపారం పెద్దదవుతుందని " అంటూ చుట్టాలు సలహ ఇవ్వడం చెప్పింది కోటయ్యకు. భోజనం ముగించిన కోటయ్య చేయి కడుగుకుంటూ  "నాకు అలాగే అనిపిస్తుంది అనసూయ మద్రాసులో చూసాను కదా  ఎంత పెద్దనగరమైతే వ్యాపారం అంత పెద్దగా సాగుతుంది. వెళదాము గాని ముందు మనకంటూ ఓ ప్రత్యేకమైన వంటకం ఉండాలి. నేను అనుకున్న వంటకం బాగా వస్తే రేపే ప్రయాణం " అన్నాడు కోటయ్య. "ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టండి" అంది అనసూయ సంబరపడిపోతూ. పిండిముద్దను పీటపై వేసుకున్నాడు" ఏం చెయ్యాలి ఇప్పుడు  చేసేది ఏదైనా నేతి వంటకమే ఉండాలి అలాగే చేతిలో ఇమడాలి అంటే వ్రేలంత పొడవుంటే చాలు  అనుకుని ఒక్కసారిగా వచ్చిన ఆలోచనతో  "అనసూయ  ముందు పొయ్యి వెలిగించి పెనం మీద కళాయి పెట్టి నెయ్యి మరిగించు" అన్నాడు. "అదేంటండి నెయ్యంతా మరిగిస్తే రేపు వంటలకో" అంది అనసూయ . "మాట్లాడకు మన దశ తిరగబోతుంది బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది." అంటూ కోటయ్య పిండిముద్దను సన్నని గొట్టంలా చేసి ముక్కలు ముక్కలుగా ఇనపరేకు తో కోసాడు. ఇంతలో కళాయిలో నెయ్యి వేడెక్కింది. కోటయ్య పిండి ముక్క తీసుకుని వేలితో ఓ నొక్కు నొక్కి అప్పడాలు వత్తే కర్రతో అదిమి ఆ పిండి ముక్కను మరిగే నెయ్యిలో వేసాడు. అంతే  బుడగలాగ పొంగింది. కోటయ్య అనుకున్నది వచ్చేసింది. భార్య అనసూయ "ఇదేంటండి గొట్టంలా వుంది" అంది. "అవును గొట్టాలే " గబగబా ఓ యాబై గొట్టాలు తయారు చేసాడు కోటయ్య. " అనసూయ గొట్టాలు బంగారు రంగులోకి మారేసరికి గరిటె బెట్టి గొట్టాలు పళ్ళెంలోకి తీసేయ్ " అన్నాడు . అనసూయ కంగారుపడుతూ గొట్టాలను కళాయినుండి తీసి పళ్ళెంలో వేసింది.. "అదేంటండి అప్పుడే దించేయమన్నారు." " చెపుతాను గాని  నువ్వు  

కేజి పంచదార తీసుకుని దానికి సమానమైన నీరు పోసి పంచదార పాకం పట్టు " అన్నాడు.  అనసూయ కోటయ్య చెప్పినట్టే పంచదార పాకం పట్టింది మారు మాట్లాడకుండా. ఇంతలో కోటయ్య గొట్టాలు అన్నీ ఒకేసారి  మరలా నెయ్యికళాయిలో వేసి గరెటెతో త్రిప్పుతూ గొట్టాలను ఎగరేస్తూ ఉన్నాడు. "అనసూయ అదేంటండి అలా ఎగరేస్తున్నారు మతిగాని పోయిందా" అంది కోటయ్య చేసేది అర్దంకాక." "నాకు మతి పోలేదోయ్  ఎందుకు ఎగరేస్తున్నానంటే గొట్టాలు గలగల శబ్దం చేసే వరకూ వేగాలని"  అంత గట్టిగా వేపితే పాకం ఎలా పడుతుంది అని మనస్సులో అనుకుంటూ "బాగానే ఉంది కాని పాకం వేడి తగ్గిపోతుంది" అంది అనసూయ. 

"తగ్గితేనే మంచిది అనసూయ గొట్టాలు వేడిగా పాకం వేడితక్కువగా ఉంటే గొట్టాలలోకి పాకం ఎక్కువ పడుతుంది" అన్నాడు కోటయ్య. 

భర్త కోటయ్య అనుకున్నది సాధించినట్టే ఉన్నాడనిపించింది అనసూయకు. 

"అనసూయ రాత్రి నువు పడుకున్నాక జార అని తయారు చేసాను అది బయట అరుగుమీద ఉంది పట్టుకురా" అన్నాడు. ఇదెప్పుడు చేసాడు రాత్రంతా నిద్రపోలేదన్నమాట అనుకుంటూ భర్త ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తూ ఉంది అనసూయ. గరెటెలో మైదాపిండితో చేసిన గొట్టాలు గలగలలాడుతున్నాయ్  కోటయ్య ముఖం ఆనందంతో విప్పారింది. గొట్టాలను పంచదారపాకంలో వేసి జారతో ఓ నిమిషం నొక్కి బయటకు తీసాడు చిట్టిపెద్ది కోటయ్య.

     భార్య అనసూయ ముఖం చిన్నబోయింది . గొట్టం గొట్టంలాగే వుంది  ఏం ప్రత్యేకత వుంది ఇందులో అనుకుంది. కోటయ్య భార్యకు ఓ గొట్టం ఇచ్చి తినమన్నాడు. భర్త శ్రమను చూసి వద్దనలేక వంటకం సరిగా రాలేదు పాపం అనుకుంటూ  గొట్టాన్ని పళ్ళమధ్య పెట్టి కొరికింది.  అంతే ఒక్కసారిగా నోటినిండా పాకం జలజలా కారింది. అనసూయ ఆశ్చర్యానికి అంతులేదు. కోటయ్య అనుకున్నది సాధించాడు. బయటకు మామూలుగా గట్టిగా కనిపిస్తుంది గొట్టం కాని నిండా పాకమే. పాకం గొట్టం లోపలికి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. బలే వంటకం."ఏమండీ దీనికి ఏం పేరు పెడతారు ? " అని అడిగింది. "అనసూయ దీనికి " కాజ "అని పేరు పెడతాను. "గొట్టం కాజా అంటారా" " లేదు ఇది కాకినాడ కాజా " అని ప్రసిద్ది చెందుతుంది అన్నాడు కోటయ్య . భర్త ఉద్దేశ్యం అర్దమయ్యింది కాకినాడలో అమ్మడం మొదలు పెడతారన్నమాట అని అనుకుంది అనసూయ.  భర్తను మురిపెంగా చూస్తూ "ఏమండి మీరు తయారు చేసిన ఈ వంటకం వందేళ్ళపాటు ప్రపంచ ప్రసిద్ది చెందుతుంది "అంటూ భర్త కోటయ్య నుదిటికి పట్టిన చెమటను పైట చెంగుతో తుడిసింది అనసూయ. 

  1891  కాకినాడ కోటయ్య కాజా  దుకాణం తెరవడానికి కాకినాడ మెయిన్ రోడ్డులో అడుగు పెట్టాడు మన కోటయ్య. అలా కాకినాడ కాజాను ఐదు తరాలనుండి వారి వంశీకులు తయారు చేస్తూనే ఉన్నారు. దేశ విదేశాలలోని ప్రజలు నిత్యనూతన స్వీటుగా  పెళ్ళిళ్ళలోను, పండగలకు, విందు వినోదాలలోను కాకినాడ కోటయ్య కాజాను ఆదరిస్తూనే ఉన్నారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


       

పాకం గారెలు


కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


    జాను, రాములు సముద్రపు ఒడ్డున పీతలతో ఆడుకుంటున్నారు. పీతలు కన్నాలలోకి వస్తూ పోతూ ఉంటే సరదా పడి పోతూ ఆడుకుంటున్నారు.

"ఒరే జాను నీ చొక్కామీద ఆ మరకలేమిటిరా?"

అడిగాడు రాములు. "నిన్న మా అక్క కొత్త పెరుమాళ్ళపురం నుండి పాకం గారెలు తెచ్చిందిరా అవి తింటుంటే పాకం కొద్దిగా చొక్కా మీద పడింది" అన్నాడు శీను.

పాకం గారెలు మాట వినగానే రాములు నోరు ఊరింది. "జాను మీ అక్కను పరిచయం చేస్తావా మీ ఇంటికి వస్తాను" అన్నాడు రాములు." నాకు తెలుసులేరా నువ్వు ఎందుకు మా ఇంటికి వస్తానంటున్నావో మా అక్క కోసం కాదులే పాకం గారెలకోసం" అంటూ కిలకిల నవ్వేశాడు జాను. "పోరా నువ్వు నన్ను అలాగే ఆటపట్టిస్తావు" అంటూ సిగ్గు పడిపోయాడు రాములు. 

  జాను, రాములు గబా గబా అంగలు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. అక్కడ అమ్మలిక్కలందరూ జాను అక్కయ్య ప్రేమతో ముచ్చటిస్తూ ఉన్నారు. వారి సంభాషణ వింటూ చప్పుడు చేయకుండా అరుగుమీద కూర్చున్నారు స్నేహితులిద్దరూ.జాను అక్క  ప్రేమావతి కొత్తపెరుమాళ్ళపురం పాకం గారెల గురించి చెపుతూ " కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు బలే తీపిగా ఉంటాయి. మనం ఇళ్ళల్లో చేసుకునే పద్దతే అయినా వీటి ప్రత్యేకతే వేరు.  నానబెట్టిన మినుములను మెత్తగా రుబ్బి చిట్టి చిట్టి మినపగారెలుగా వేసి దోరదోరగా వేయిస్తారు. కట్టెల పొయ్యి మీద సన్నని సెగమీద వండుతారు.కొద్దిసేపటి తరువాత పంచదార పాకంలో వేసి తీస్తారు. గారెలలోనికి పాకం ఊరి తినగానే పసందైన రుచిని కలిగిస్తుంది. వేడి వేడి గారెలు తినడానికి చాలా మంది సుదూరం ప్రయాణించి వస్తూఉంటారు. ఇక రాష్ట్రంలో జరిగే పెద్ద పెద్ద సభలలొ జరిగే విందుల్లో కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు ఉండవలసిందే. కాకినాడ బీచ్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు స్టాల్ పెట్టి అమ్ముతూ ఉంటారు కూడా. పది రూపాయలకు మూడు గారెలు ఇస్తారు. ఇంతకీ  ఇదేదో పెద్ద మిఠాయి దుకాణం అనుకున్నారు ఓ చిన్న పూరిపాకలో ఓ ముసలమ్మ  తన కూతురు కలసి వండే వంటకం  అంటే ఆశ్చర్యపోవలసిందే మరి " అంటూ చుట్టూ చేరిన వారికి తలో ఒక పాకం గారె పంచి పెట్టింది ప్రేమావతి. రాములు గబా గబా అందుకుని  గుట్టుక్కున బుగ్గలో పెట్టి నమిలేస్తూ బాగుందని తలాడించాడు జానుని చూసి నవ్వుతూ.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


Monday, October 26, 2020

నన్ను ఒకాయనన్నాడు  మీరు సాదారణ స్కూల్ ను డిస్టబెన్స్ చేస్తున్నారని


నేనన్నాను



లెనిన్  

భగత్ సింగ్  

అల్లూరి

గాంధీ

కందుకూరి



అందరూ డిస్టబెన్స్ గాళ్ళే

అందులో నేనూ ఒకడిని అని😊

నా అనుభవాలు 1

 లా జవాబు నహీ


నేను ఒక ఊరి బడికి బదిలీపై వెళ్ళాను. నా ప్రతిభతో అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాను. నా వయస్సు సీనియారిటీని బట్టి నన్ను అన్నిటిలో  ముందు ఉంచేవారు. అది నచ్చని ఓ జూనియరు టీచరకు నేనంటే గిట్టేది కాదు. ఒక రోజు అందరూ  స్టాఫ్ రూంలో కూర్చునుండగా నేను అర్జంటగా అవసరమై సెలవు పెట్టి వెడుతుంటే  ఆ జూనియరు టీచరు

అందరూ నవ్వేలా  "రాజు వెడలే రవితేజము లదరగా" అంటూ పాడపాడాడు.  అది నా కోసమే హేళనగా పాడాడని తెలుసు. నేను మౌనం వహించాను . కాలమే సమాధానం చెపుతుందని అనుకున్నాను.  అందరం బదిలీలపై వేరే బడులకు వెళ్ళాం. ఆ జూనియరు టీచరు  బదిలీపై వెళ్ళిన బడిలో  పదవ తరగతి అమ్మాయిని వేదిస్తూ అర్దరాత్రి సరాసరి ఇంటికి పోతే ఆ జూనియరు టీచరును చెట్టుకు కట్టి కుక్కను కొట్టినట్లు కొట్టారని తెలిసింది . బదిలిపై పోవలసిందిగా గ్రామస్తులు హుకుం జారీచేసారని కూడా తెలిసింది. తరువాత బదిలి పై వెడుతూ రిలీవింగ్ తీసుకుంటుంటే  జూనియరు టీచరు సెల్ కు నేను  ఇలా మెసేజ్ పెట్టాను "రాజు వెడెలె రవితేజము లదరగ"

Wednesday, August 19, 2020

రమ్య కథ

       

                   ఓ  రమ్య కథ

              (దివ్యాంగుల కథ)



      వేసవి సెలవులు ముగిసిన తరువాత  బడులు ప్రారంబమై అప్పుడే రెండునెలలు కావస్తుంది. క్లాసు మాస్టారు చెపుతున్నారు ఇలా ఈరోజు బడిలోకి  రమ్య అనే అమ్మాయి  చేరుతుందని మన ఔ తరగతిలోనే చేరిందని తను  కూర్చుంటానికి చోటు ఇమ్మని చెప్పగానే పిల్లల్లో ఒకటే అలజడి బయలుదేరింది.క్రొత్తగా వచ్చే అమ్మాయి  మా బెంచీలో కూర్చోవాలంటే మా బెంచీలో కూర్చోవాలని పోటీపడసాగారు. 

  రెండవ పీరియడు ప్రారంబమైయ్యింది . పిల్లల తలంపులన్నీ క్రొత్తగా చేరిన అమ్మాయి మీదే ఉన్నాయి.ఎదురు చూపులతో విసుగొచ్చింది అందరికి. తలదించి  నోట్సులు రాసుకుంటున్న పిల్లలకు గుమ్మందగ్గర చప్పుడైతే ఒక్కసారిగా తలెత్తి చూసారందరూ. అక్కడ దృశ్యం చూసి నోటమాటరాలేదు ఎవ్వరికీ. కాళ్ళు చచ్చుబడిన అమ్మాయిని రెండు చేతులతో ఎత్తుకుని ఉన్న తండ్రిని చూసారు. ఆ అమ్మాయి దివ్యాంగురాలు.

పిల్లలకు నిరూత్సాహం ఆవరించింది. అందమైన ఆరోగ్యంగా వుండేవాళ్ళు వస్తారనుకుంటే దివ్వాంగురాలు తమ తరగతి గదిలో చేరడంతో ఏమీ పాలుపోలేదు పిల్లలకు. అప్పటివరకూ మా బల్లంటే మా బల్ల అన్నవారు చోటు ఇష్వటం మానేసారు . మెల్లగా తండ్రివెళ్ళి ఆఖరున ఖాళీ బల్లపై కూర్చోబెట్టి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లలెవ్వరూ రమ్య వంక కన్నెత్తి చూడలేదు పలకరించలేదు.

 రమ్య బడిలో చేరి నాలుగు రోజులు గడిచిపోయాయి ఎవరూ దగ్గరకు వెళ్ళి పలుకరించలేదు.

ఒకరోజు ఇంగ్లీషు టీచరు రమ్య ఎవరు అని అడిగింది. రమ్య నేనే టీచర్ అని చెప్పింది. ఇంగ్లీష్ రైటింగ్ చాలా బాగుంది క్లాసులో అందరికంటే చాలా అందగా వ్రాసావు  దస్తూరి బాగుంది అని మెచ్చుకుంది. టీచరు రమ్యను మెచ్చుకునే సరికి  పిల్లలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు . 

  తరువాత రోజు లెక్కలు మాస్టారు బోర్డుమీద లెక్క ఇచ్చి చేయమన్నారు . రమ్య క్షణంలో చేసి చూపించింది. తరగతి గదిలో పిల్లలకు మతి పోయింది. మేస్టారు రమ్య దగ్గరు వెళ్ళి రమ్య ప్రక్కన కూర్చుని చాలా సేపు కబుర్లాడారు.

అది తరగతిలోని పిల్లలకు ఆశ్చర్యమనిపించింది. ఇన్నాళ్ళు ఎప్పుడూ ఎవరి ప్రక్కన కూర్చోని మాస్టారు రమ్య ప్రక్కన కూర్చుని మాట్టాడే సరికి రమ్య సామాన్యమైంది కాదని మెల్లగా అర్దమయ్యింది. డ్రాయింగ్ టీచరు బొమ్మఇస్తే టీచరు కంటే బాగావేసి చూపింది రమ్య.ఇలా ప్రతీరోజూ ప్రతీ అంశంలో రమ్య ముందుంటంతో రమ్య పట్ల తమ అభి ప్రాయాన్ని మెల్లగా మార్చుకోసాగారు అందరూ.           ఒకరోజు ఇంటర్వువెల్ సమయంలో కొంతమంది మెల్లగా వెళ్ళి రమ్య తో మాట్లాడారు. మెల్ల మెల్లగా అందరూ చుట్టూ చేరారు. రమ్య చేతిలో కాగితం బొమ్మ చూసి సరదా పడిపోయారు. నీకు కాగితం బొమ్మలు చేయటం వచ్చా మాకు నేర్పవా అంటూ పోటీ పడ్డారు. వాళ్ళ సరదా చూసి రమ్యకు ముచ్చటేసి అందరికీ ఓపికగా చిలకలు, విమానాలు, గులాబీలు, పడవలు చేసి ఇచ్చింది .

   .  బాలల దినోత్సవానికి పాటలు పోటీ పెట్టింది క్రాప్ట్ టీచరు . తరగతిలో పిల్లలెవరూ పాడడానికి ముందుకూ రాకుండా  సిగ్గుపడుతుంటే  రమ్మ నేను పాడతానంటూ  తీయటి కంఠంతో " కోడి ఒక కోనలో"  అని గొంతెత్తి పాడింది. గది చప్పట్లతో మారుమోగింది. తరగతి గదిలో పిల్లలకు నోట మాటరాలేదు. రమ్య దివ్యాంగురాలు తనకు ఏమీ రాదని చదువుకు పనికి రాదని అనుకున్న పిల్లలకు  బాలల దినోత్సవంలో రమ్య  అన్నింటిలో మొదటి బహుమతులు గెలుచుకోవడంతో తీవ్రంగా ఆలోచనలో పడ్డారందరూ.రమ్య పట్ల తప్పుడు బావన కలిగినందుకు చింతించారు.

      బాలలదినోత్సవం తరువాత రోజు  తరగతి గదిలో పిల్లలందరూ కొట్టుకున్నంతగా  గొడవ పడుతున్నారు. రమ్యను ఎత్తుకుని తీసుకువచ్చిన తండ్రి దగ్గరకు పోయి మా బల్లపై కూర్చోపెట్టాలంటే మా బల్లపైన అంటూ గొడవ చేయసాగారు.

        సహచర పిల్లలో వచ్చిన మార్పుకు ఆనందపడిన రమ్య రోజుకు ఒకరి బల్లపై కూర్చుంటానికి అంగీకరించింది. వైకల్యం శరీరానికే కాని ప్రతిభకు, మనసుకు కాదని పిల్లలందరూ గ్రహించారు. అప్పటినుండి రమ్యను తమతో సమానంగా చూసుకుని స్నేహం చేస్తూ రమ్యకు అన్ని విషయాలలో సహయం చేయసాగారు. రమ్య పుట్టినరోజుకు  గిప్ట్ గా దివ్యాంగుల సైకిలు కొనిచ్చారు స్నేహితులందరూ.

   


Thursday, April 9, 2020


నిను తరుముతుంది ఎవరు?
నువు రౌడీవి కదా
నువు గుండావి కదా
నువ్వే హంతకుడివి కదా
నిను తరుముతుంది ఎవరు ?
ఏవి నీ టాటా సుమోలు
ఏవీ  నీ కడప కత్తులు
ఏవీ నీ భూకబ్జాలు
ఏవు నీ దందాలు
చైనా వాడి కరోనా కత్తి
దొరుకుతుందట కావాలా ?
నిను తరుముతుంది ఎవరు ?
నువు పెద్ద రేపిస్టువి
నువు పేద్ద స్మగర్ వి
నువు పెద్ద గేంబ్లర్ వీ
నువు పెద్ద రోబర్ వి
నిన్నే తరుముతుంది ఎవరు ?
నీ చుట్టూ బౌన్స్ ర్లు నీ మాస్కు
చూసి జడుసుకుంటున్నారట
ఏమయ్యింది ! ఏం జరిగింది !
నువు పేద్ద  హీరోలకే హీరోవట
గాల్లోకి వందమందిసి తన్నేత్తావట
రైలును ఒంటిచేతితో ఆపేత్తావట
నీ ప్యాన్స్ నీ షేక్ హేండ్ అంటే
లగెత్తుతున్నారట ఏంజరిగింది !
నీ హోర్డింగ్లు నీ రిబ్బన్ కటింగ్లు
నీ శంకుస్దాపనలు నీ సంబరాలు
ఏవీ? ఏంజరిగింది  ! ఏం తరుముతుంది !
నీకేదో పదవి ఉందంట  పెద్ద పోటుగాడివట
నీ వీధిలో నీ ఊళ్ళో నీజిల్లాలో
ఊడబోడిచేస్తావట తెల్లారీ తెల్లారకుండా
నీ ఇంటి ముందు జనం నిలబడాలట
 ఏమయ్యింది నీ ఇల్లు శ్మసానంలా వుందంట
ఎవరో తరుముతుంటే లోపలేవున్నావట
చైనా ఓడి కరోనాకత్తి గిర్రన తిరుగుతుందట
కొంపతీసి దానికి జడుసుకున్నావా ఏంటి ?
మా పరువు పోద్ది సుమా
వద్దు వద్దు నువు పెద్ద పుడింగ్ వని తెలుసు
ఇప్పుడు వెనక్కి వెడితే బాగుండదు
కరోనాకు నీ మగతనం చూపించు
రా ముందికిరా నువు నా నాయకుడివి
నువు నా హీరోవి నువు నా రౌడీవి
నేను నీ అభిమానిని ప్లీజ్ ప్లీజ్ రా 
ఒక్కసారి కరోనాని కౌగలించుకో
సిద్దాంథపు బెన్ జాన్ సన్ ( జనశ్రీ )
ఉప్పాడ కొత్తపల్లి 
తూర్పు గోదారవి జిల్లా
9908953246


Thursday, April 2, 2020

పరమత సహనాల మేడ ఉప్పాడ

పరమత సహనాల మేడ ఉప్పాడ
పరమత సహనాల నీడ ఉప్పాడ

కొత్తపల్లి కొంగు బంగారం ఉప్పాడ
కాకినాడకు ఉపవాడ ఉప్పాడ

బంగాళాఖాతాన్ని ఆనుకున్న గోడ ఉప్పాడ
స్వాతంత్ర్య సమరాన ఠీవితో
నిలిచిన ఉప్పు ఓడ ఉప్పాడ
మగ్గాలలో పగ్గాలు లేకుండా 
అటు ఇటూ తిరిగే బీడ ఉప్పాడ
చూడచక్కని చేనేత చీరలోని
 వెండి జరీజాడ ఉప్పాడ
జాంథానీ చీరలోని అల్లికలజిలిబిలి
 చిత్తరువు ఉప్పాడ
కొత్తపల్లి కొబ్బరి పులుపుల తలుపు ఉప్పాడ

సముద్రపు అలలు మత్యపు వలలు
నిరంతరం తిరిగే రాట్నాలు
సువార్తల సువాసనలు
పట్టు వస్త్రాల తళతళ
చారిత్రిక సంఘటనల నిఘంటువు
కవికోకిల సన్నిధిరాజు కురవంజి
నటగాయక వైతాళిక ఉప్పాడ
మా ఉప్పాడ
పరమత సహనాల నీడ ఉప్పాడ



కరోనా కవిత ( ప్రజాశక్తి )

Wednesday, January 15, 2020

మా ఊరి కథలు 2 ( జనశ్రీ ) మా ఊరి నవాబు నాగూర్

మా ఊరి కథలు 2 ( జనశ్రీ )

మా ఊరి నవాబు నాగూర్

                     1950 ప్రాంతంలో ఉప్పాడ  సముద్రం హోరు ఎలా వుండేదంటే  ఇంటిలోనే కెరటం విరిగి పడిందా అనేంతగా వుండేది. క్రొత్తగా పొరుగూరు నుండి వచ్చిన చుట్టాలు ఆ శబ్దానికి హడలిపోయేవారు. ఎందుకంటే ఆరోజుల్లో చాలా నిశ్శబ్దంగా  ఉండేది ఊరంతా. వాతావరణ కాలుష్యం కానీ      శబ్ద కాలుష్యం గానీ ఉండేది కాదు. అందువల్ల కెరటాల చప్పుడే కాదు పిఠాపురం పేసింజరు రైలు కూత కూడా వినబడేది ఉప్పాడ వరకూ. ఉప్పాడ ఊరు నిండా తాటాకులు ఇళ్ళు ఉండేవి. అక్కడక్కడ  మాత్రమే బంగ్లా ఇళ్లు ఉండేవి.  మత్స్యకారులు అందరూ  పెద్దగా  సంపాదన లేకుండా  పేదరికంలోనే ఉండేవారు ఆ రోజుల్లో.




గంపల అప్పయ్యమ్మ, భూలోక మ్మ ఉప్పు చేపల వ్యాపారం చేసేవారు ఉప్పాడలో.  ధవళేశ్వరం, నక్కపల్లి ప్రాంతాలలో ఉప్పు చేపలు , ఎండు చేపలు పట్టుకెళ్లి వ్యాపారం చేసేవారు. వీళ్ళ కొడుకు గంపల అప్పారావు  గంపల అప్పారావు కు ఒకే ఒక్క కొడుకు నాగూరు .  ఇతనే మన కథా నవాబు .

తెల్లటి మల్లె పువ్వు లాంటి బట్టలు వేసుకుని మెడలో బంగారం గొలుసు, రెండు చేతులకూ ఉంగరాలు , నోట్లో రెడ్ హిల్స్  సిగరెట్  , అల్లంత దూరం వినబడే జావా బండి హారన్ ఉప్పాడ రోడ్డు మీద 1960 ప్రాంతంలో నాగూర్ హవా  పరిగెత్తింది.  ఉప్పాడలోని వారందరూ  నాగూర్ ని సెలెబ్రేటిగా చూసిన రోజులవి. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ ఆ రోజుల్లో  గంపల నాగూర్ .
ఉప్పాడ చేపల వ్యాపారానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చింది నాగూర్ అంటే ఎవరూ కాదనలేని సత్యం.
చిన్న చిన్న  ఉప్పు చేపలు,ఎండు చేపల వ్యాపారం చేసుకునే మత్స్యకారులుకు రొయ్యల వ్యాపారం నేర్పి ఉప్పాడ మత్స్యకారుల జీవితదశాదిశలను మార్చిన గొప్ప వ్యాపారి  నాగూరు.  ఉప్పాడ నుండి సీతారామాంజనేయ బస్సు సర్వీస్ , అలాగే ఎల్లాజి బస్సు సర్వీస్  లు ఉప్పాడ రొడ్లమీద దుమ్ము రేపుకుంటా కాకినాడ పోయిన రొజులవి. వాటిమీద కాకినాడ వెళ్ళి ఉప్పు చేపలు ,ఎండు చేపలవ్యాపారం చేసిన నాగూర్ కి పూరిలోని సాంబాబు (య.స్ . ఆర్ .సి చౌదరి ) రొయ్యల వ్యాపారంలోని కిటుకులన్ని నేర్పాడు. నాగూరు పిఠాపురం రైల్వే స్టేషన్లో బొగ్గు ఇంజను పై నడిచే పేసింజరు రైలు ఎక్కి తెల్లారేక పూరిలో దిగేవాడు.  నాగూరు జట్టీలు ఇక్కడనుండి కొన్ని తెరచాపనావల్లో  సరుకులు నావల్లో నింపుకుని సముద్రం మీద 5 నుండి 10 రొజుల్లో పూరి చేరుకునేవారు. సాంబాబు(య.ఆర్ .సి చౌదరి ) బర్ఫ్ నుండి మద్రాసు,కలకత్తా నగరాలకు 40 కౌంటు రొయ్యలు ఎగుమతి అయ్యేవి. అవి నాగూరుకు చెందిన నావల్లో పడ్డావే ఎక్కువ ఉండేవి. నాగూరు ప్రక్కనే దాసరి బంగారయ్య, సూరాడరాజారావు, చొక్కా సత్తిబాబు వుండేవారు. మంచి మిత్రులు కూడా.నాగూరు సరదాలన్నీ వీళ్ళతోనే. పూరిలో వేటగాళ్ళు చేపలవేటకు పోయి వచ్చే వరకూ స్నేహితులలో పేకాటలో గడపడం, అప్పుడప్పుడూ మెడ్కాల్ బ్రాంది తో పార్టీ చేసుకొనేవాడు. పార్టీల్లో పావురం వేపుడు మందులో నంజుకు వుండవలసిందే. ఇలా అక్టోబరు నుండి జూలై వరకు పూరీలో వుండి వస్తువుండేవాడు. అలా 10 సంవత్సరాలు పూరీలో వ్యాపారం జరిగింది.
ఉప్పాడ వస్తే జావా లేదా బుల్లెట్ పై స్నేహితులను తీసుకుని కాకినాడ సినిమాలకు పోయేవాడు మన నాగూరు.
ఉప్పాడలో చిన జజారు చివరన బర్ప్ పెట్టి  మద్రాసుకి , కలకత్తాకు  40  కౌంటు రొయ్యలు ఊప్పాడ నుండే  ఎగుమతి వ్యాపారం ప్రారంబించాడు. ఆ తరువాత ఇంటిదగ్గరే బర్ప్ పెట్టాడు. వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. పెద్దబ్బాయి కిళ్ళికొట్టు వీధి చివర భూలోకమ్మ భవనం అనే పేరు మీద మేడ కట్టాడు. దానినే ఆ తరువాత ఊరోళ్ళందరూ నాగూరూ మేడ అనేవారు. చీపూరు బుల్లబ్బాయి పొలం దగ్గర నాలుగెకరాలు  భూమి కొన్నాడు. డబ్బులు చేతిలో బాగా ఆడడంతో ఐసు ప్యాక్టరీ కట్టాలనుకున్నాడు. ఎందుకంటే అప్పటివరకూ ఐసు అనాకాపల్లి లేదా పూరీలనుండి లారీల్లో తెచ్చుకునేవారు. ఓ ప్రక్క చిన్న చిన్న వ్యాపారులు పుట్టుకురావడంతో ఐసుకు ఉప్పాడలో  డిమాండ్ ఏర్పడీంది.
 ఐసు ప్యాక్టరీ కడదామనుకునేలోగా సినిమా థియేటర్ అయితే బాగుంటుందని మిత్రుల దగ్గర నుండి ఉప్పు అందడంతో ఉప్పాడలో శ్రీనివాస థియేటర్ కు రాయి పడింది. మిత్రులమధ్య పొరపొచ్చాలతో ఆ ప్రక్కనే ధనరాజు థియేటర్ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరిగాయి.
ఏదైతేనో నాగూరు సినిహాలు టూరింగు టాకీస్ గా
ప్రారంబమయ్యింది 1974 లో. మొదటి సినిమా కన్నడ కంఠీరవ  రాజ్ కుమార్ శ్రీ కాళహస్తి మహత్యం.
నాగూరు జీవితంలో విలాసాలు ఓప్రక్క దానధర్మాలు ఓ ప్రక్క ఎలా చెప్పుకునే వారికి అలాగ ఓ వెలుగు వెలిగింది. నాగూరు పేరు మోత మోగింది ఉప్పాడ చుట్టు ప్రక్కల.నాగూరుకు చిన్నాన్న కొడుకు  గంపల రమణ అయినా ఒకే తల్లిబిడ్డలుగా కనిపిస్తారు ఊళ్ళో వాళ్ళకు.

ఇలా పట్టిందల్లా బంగారం తరుణంలో నాగూరు  ఒక ఆపదొచ్చి పడింది.  నాగూరుకి ఇద్దరు అబ్బాయిలు ఉమ ఒక్కగాని ఒక అమ్మాయి. ఉమపుట్టిందే కాని టి.బి మహ్మమ్మారి పీక్కుతినేసింది.  జబ్బు నయంకావడానికీ తిప్పని చోటూ లేదూ వెళ్ళని నగరమూ లేదు. చివరకి 4 సంవత్సరాలప్పుడు చనిపొయింది ఉమ.  తన పొలంలోనే  ఉమ నిలువెత్తు బొమ్మ చేసి ఆలయంలా కట్టి మనోవేదన తగ్గించుకుంటానికి ప్రయత్నించాడు మన నవాబు నాగూరు. ఆ రోజుల్లొ అదో సంచలనం గుడి కట్టడం.

జల్సా జీవితం గడుపుతున్న నాగూరిని ఈ సంఘటన క్రుంగదీసింది. మెడ్కాల్ బ్రాంది , రెడ్ హిల్స్ సిగరెట్టు దగ్గరకు చేరడం ప్రారంబమయ్యింది. ఇంతలో దివిసీమ ఉప్పెన బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేసేసింది. ఉప్పాడ ప్రాంతంలో రొయ్యల పడేవి కావు. వ్యాపారం సన్నగిల్లింది.
200 తెరచాప పడవులు ,వేటగాళ్ళను ఒక్కక్కరికీ 5000  జీతం ఇచ్చి పూరీలో రొయ్యల వేటకు బయలు దేరాడు.
పూరీ లోను సేమ్ సీన్ రొయ్యలు లేవూ  వ్యాపారమూ లేదు. అప్పులు చేసి వేటగాళ్ళ జీతాలు చెల్లించ వలసి వచ్చీంది. ఉన్నది ఊడ్చుకుపోయింది.



వేటగాళ్ళమీద 7 లక్షలు వదిలేయవలసి వచ్చింది. నాగూరు
మెల్లగ మెడ్కాల్ బ్రాందికీ, రెడ్ హిల్స్ సిగరెట్లకు బానిసయ్యూడు. రోగాలు మీదపడంతో అన్ని మాని
గతఙ్ఞాపకాలతో తన మేడలోనే నివసిస్తూ  ఉన్నాడు మన తొలి ఉప్పాడ సెలబ్రెటీ.

సిద్ధాంతపు బెన్ జాన్సన్ (జనశ్రీ)
ఉప్పాడ కొత్తపల్లి
9908953245

Tuesday, January 14, 2020

చిన్నప్పటి నా అల్లరి కథ

*చిన్నప్పుడు నేను చేసిన అల్లరి పని*

 క్షవరం చేసుకోవాలంటే ఇప్పటిలా క్షౌరశాలలు ఉండేవి కాదు మన చిన్నప్పుడు.  మంగలి ఇంటికి వచ్చి క్షవరం చేసేవాడు.
  ఒక రోజు ఇలాగే మా దగ్గర బంధువు మంగలిని పిలిచే క్షవరం చేసుకుంటూ ఉన్నాడు. చిన్నప్పుడు సెలవు వచ్చిందంటే ఎదురు బద్దకు పురుకూస కట్టి విల్లు తయారు చేసుకునే వాళ్ళం. జబ్బలకు విల్లు తగిలించుకుని  చేతిలో చీపురు పుల్లలు బాణలుగా పట్టుకుని  అటూ ఇటు ఇటూ వేస్తూ ఆడుకునేవాళ్ళం. అలా నేను బాణాలు వేస్తూ వేస్తూ క్షవరం చేయించుకుంటున్న వ్యక్తి వీపుకు గురిచూసి బాణం వదిలాను. అంతే చురుకున్న గుచ్చుకుందేమో ఆ వ్యక్తి కెవ్వున కేక పెట్టాడు.  అతని ఊపుకు పాపం మంగలి వెన్నక్కి పడ్డాడు. ఈ తతంగమంతా దూరం నుండి చూస్తున్న నేను నా ప్రక్కనున్న పిల్లలం వెన్నక్కి చూడకుండా పరుగెత్తి  పరిగెత్తి పారిపోయి సాయంత్రంవరకూ ఊరిబయట గడిపి చీకటి పడిన తరువాత  ఇంటికి చేరుకున్నాం. తెల్లవారేక అందరం కలసి మెల్గగా క్షవరం చేయుంచుకున్న వ్యక్తి ఇంటి పరిసరాలలో కొంత సేపు తచ్చాడాం. గొడవ ఏంలేదని నిర్దారించుకుని  దూరంగా పోయి పగలబడి నవ్వుకున్నాం. అప్పుడప్పుడూ అందరం కలసి నప్పుడు ఈ సరదా సంఘటన తలుచుకుని నవ్వుకుంటూఉంటాం

క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్

క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్ భారతదేశం నుండి పారద్రోలతాయనడం అనడం ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం.
క్రైస్తవులలో ఉన్న ఈ నమ్మకం అతి పెద్ద అపోహ. దీనిని దైవ సేవకులు వాటేసుకోవడం ఇందులో అతి పెద్ద ట్విస్ట్.

ఈ భారతదేశం నుండి క్రైస్తవ మతాన్ని హిందూ సమాజం ఎన్నటికీ పారద్రోల లేదు. క్రైస్తవ మతం హిందూ సమాజానికి ఒక వరంవంటిది. ఇప్పుడున్న పెద్ద ఆర్థిక రంగాలు, పరిశ్రమలన్నీ హిందూ సమాజం ఆక్రమించుకుని ఉన్నాయి. ఆ రంగాలలోనికి వెళ్లడానికి క్రైస్తవమతం అనుమతించడం లేదు. అది అతిపెద్ద పాపంగా బోధిస్తూ ఉంటారు దేవాలయాల్లో. అది హిందూ సమాజానికి వరంగా మారింది. క్రైస్తవమతాన్ని ఆదరించేది భారతదేశంలో అత్యధిక శాతం షెడ్యూల్డ్ కులాలవారు. ఈ బహుజనులు అందరూ క్రైస్తవమతం స్వీకరించడం వల్ల అనేక రంగాలలోనికి వీరు ప్రవేశించలేకపోతున్నారు.  ఉదాహరణకు అత్యంత ఆకర్షణీయమైన మైనటువంటి ఆర్థికరంగాలు  సినిమా, టెలివిజన్, మీడియా, సంగీతం, నాట్యం, రచనరంగం, నాటకరంగం, వ్యాపారరంగం (మద్యపానం,),. ప్రస్తుతం ఈ రంగాలు భారతదేశంపై అత్యంత ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ రంగాలు రాజకీయాలపై కూడా అత్యంత ప్రభావాన్ని చూపుతున్నాయి. షెడ్యూల్డ్ కులాలకు ఈ రంగాలలో బలమైన వ్రేళ్ళు లేక రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం దుర్లభంగా మారింది. టెలివిజన్ చానళ్ళు వచ్చాయి అవేం చెపుతున్నాయి క్రైస్తవ భోదనలే. టెలివిజన్ ఉన్నా దళితులకు వనగూరేదేముంది.

క్రైస్తవ మతం బోధిస్తున్న లేదా నిరోధిస్తున్న కొన్ని బోధనలు

ఇహలోక సంబంధమైనవాటికి అంత ప్రాధాన్యత లేదు పరలోక రాజ్యానికి సంబంధించినది మాత్రమే ప్రధానమైనది .
సినిమా ,నాటకం ,టెలివిజన్, నృత్యం చేయడం ,పాటలు పాడటం, ఏదైనా క్రైస్తవుడి తలాంతులు అన్నీ దైవ సేవకే వాడబడాలి. పైవన్నీ సాతాను క్రియలుగా దైవజనులు భోధిస్తువుంటారు.
ఈ అంశాలతో షెడ్యూల్ కులాలవారిని క్రైస్తవ మతం  బాహ్య ప్రపంచంలోనికి వెళ్లనీయకుండా నిరోధిస్తూ  ఉన్నాయి.
కానీ ఏ క్రైస్తవుడు సినిమాలు చూడకుండా ఉండటం లేదు, , టెలివిజన్లో వచ్చే కార్యక్రమాన్ని చూడకుండా ఉండటం లేదు, మద్యపానం తాగకుండా ఉండటం లేదు,
సిని హీరో వెనకాల వీళ్లు ప్రచారసభలకు పరిగెత్తకుండా ఉండటం లేదు , రాజకీయ రంగాలగురించి మాట్లాడకుండా ఉండడం లేదు, సినిమా పాటలపై పేరడీలు వాడుకోకుండా ఉండడం లేదు, అన్ని క్రైస్తవ సమాజం పరోక్షంగా వీటిని  అనుసరిస్తుంది, వీక్షిస్తున్నది కూడా.
బయట రంగాలలో రాణించటానికి సరిపడిన విద్వత్తును స్వీకరించడానికి క్రైస్తవమతం షెడ్యూల్ కులాలవారికి అడ్డుగా నిలుస్తుంది. సంగీత రంగంలో ఇప్పుడున్న గాయకులకు తీసిపోని విధంగా క్రైస్తవ సంగీతంలో పాటలు పాడే మహాగాయకులు ఉన్ననూ వారు దేవుని స్తుతించుచూ పాటలు పాడడానికి పరిమితం కావడం వల్ల  సినిమా పరిశ్రమ హిందూ సమాజానికి మాత్రమే పరిమితమై వారు ఆర్థిక బలోపేతం కావడానికి తోడ్పడుతుంది. ఆర్దిక స్దొమతుకలిగిన కళాకారులు  ప్రజాప్రతినిధులుగా నెగ్గుతున్నారు.అదే క్రమంలో క్రైస్తవ మతం షెడ్యూల్డ్ కులాల దీన పరిస్థితికి అడ్డుగోడగా నిలుస్తోంది.ఇది కాదనలేని సత్యం. అయితే విదేశాలనుండి ఎంతో సహయాన్ని ఇస్తున్నాం అంటూ వాదిస్తారు. కాని గ్లామర్ ప్రపంచానికి తద్వారా రాజ్యాధికారానికి దూరం చేస్తున్న సంగతిని దాచెస్తారు.
అద్భుతమైనటువంటి నాట్యం చేసే కళాకారులు ఎందరో ఉన్నారు వారి నాట్యం క్రిస్మస్ సందర్భాలలో మాత్రమే ఉపయోగపడేలా క్రైస్తవ మతం వాడుకుంటుంది, ఎదగనీయకుండా  నిలువరిస్తుంది. అత్యధికంగా ఆర్థిక వెసులుబాటు కల్పించే రంగాలలోనికి వెళ్లడానికి తలాంతులు ఉన్ననూ వెళ్ళలేని పరిస్థితి షెడ్యూల్డ్ కులాలకు  ఈ క్రైస్తవ మతం అడ్డుగా ఉన్నది. అద్భుతమైనటువంటి రచయితలు ఉన్ననూ ఇవి దేవుని పాటలు ,దేవుని వాక్య వివరణ గ్రంధాలు రచించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఒక్క సినిమా పాట రాసే సినిమా రచయితకు ఒక్కపాటకు 12  లైన్స్ రాస్తే పాట ఒక్కంటికీ  మూడులక్షల రూపాయలు రెవెన్యూ మా రేషన్ అందుకుంటున్నారు. అటువంటి ఆర్థిక వెసులుబాటును షెడ్యూలు కులాలు కోల్పోతున్నారు. సినీ నటుడిగా వెళ్లి   పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఆ పేరును ఉపయోగించి రాజకీయ రంగంలో స్థిరపడిన అగ్రకులాలను  మనం చూస్తూనే ఉన్నాం మరి క్రైస్తవులు అయినటువంటి షెడ్యూల్డ్ కులాలవారు అటువంటి సినిమా నటుడికి జేజేలు పలుకుతూ వారి వెంట పరిగెడుతున్న  సంఘటనలు చూస్తూనే ఉన్నాం. దళితులను వారిని  ఎదగనీయకుండా క్రైస్తవ మతం అడ్డుగోడగా నిలుస్తుంది. మద్యపానం వ్యాపారంలో కోటానుకోట్ల రూపాయల రాబడి ఉంటుంది అగ్రకులాలు హిందూ సమాజం ఈ వ్యాపార రంగంలోనికి చొరబడి కోటానుకోట్ల రూపాయలు సంపాదించి ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని పొందుతువుంది. క్రైస్తవ మతం షెడ్యూల్డ్ కులాలవారిని ఈ రంగంలోనికి వెళ్లనీయకుండా అడ్డుగోడగా నిలుస్తున్నది. తద్వారా బలమైన సామాజికవర్గంగా దళిత క్రైస్తవులు ఎదగలేకపోతున్నారు.
దూరదర్శన్ వంటి ప్రభుత్వ టీవీ చానల్స్ లో ప్రవేశాలకు అర్హతలేని పరిస్దితి షెడ్యూల్డ్ కులాలకు ఉన్నది. కానీ అన్ని తలాంతులు కలిగినటువంటి ఈ యొక్క కులాలు క్రైస్తవ మతం స్వీకరించడం వల్ల ఆధునిక ప్రపంచంలో బహుజనులగానే మిగిలిపోతున్నారు. బలమైన సామాజిక వర్గంగా రూపొందలేకపోతూ ఉన్నారు.ఈ దేశాన్ని నడిపించేటటువంటి రాజకీయరంగంలో ఎదగాలంటే పై రంగాలలో షెడ్యూల్డ్  కులాల వారు విస్తృతంగా ప్రవేశించి వలసిన అవసరం ఉంది. కానీ క్రైస్తవ ఆలయాలు వీరికిఅడ్డుగోడగా ఉన్నాయి.
కానీ క్రైస్తవ సమాజం , క్రైస్తవ మత బోధకులు  ఇలా అంటూవుంటారు  హిందూ సమాజం, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు క్రైస్తవ మతాన్ని భారతదేశంలో లేకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నాయని గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి క్రైస్తవ మతం మరీ ఎదగనీయకుండా  చేయడానికి అప్పుడప్పుడు ఈ బిజెపిలాంటి పార్టీలు నిధులు రాకుండా నిరోధిస్తున్న మాట వాస్తవమే అయినా అవి పైకి కనపడకుండా నిరోధించడానికి చేస్తున్న  ప్రయత్నాలే  తప్పించి క్రైస్తవ మతాన్ని ఈ భారతదేశం నుండి వెళ్లగొట్టడానికి వాళ్ళకి ఎంత మాత్రము కూడా ఇష్టముండదు. ఎందుచేతనంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి అనేక రంగాలలో షెడ్యూల్డ్ కులాలవారు లేని సంగతి వారికి నిక్కచ్చిగా తెలుసు. అందుచేత క్రైస్తవ మతాన్ని గాని ఒకవేళ భారతదేశం నుండి పంపినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ కులాలవారు హిందూ సమాజంలోని హిందువులుగా ప్రవేశించి పై రంగాలను కబ్జా చేసే శాసించే పరిస్థితి ఉన్న సంగతి అగ్రకులాలైన హిందూసమాజంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎప్పటికీ  హిందూ సమాజం క్రైస్తవ సమాజాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నించదు, క్రైస్తవసమాజం ,క్రైస్తవ సమాజంలోని బోధనలు హిందూ సమాజానికి ఒక వరం వంటివి.
క్రైస్తవ సమాజం షెడ్యూల్డ్  కులాలు ఉద్ధరించిన మాట వాస్తవమే అయినా ఓప్రక్క మరలా కొన్ని నిబంధనలు పేరు చెప్పి ఆదే క్రైస్తవ సమాజంలోనే కొట్టుమిట్టాడేలా చేయడం ఇక్కడున్న ప్రధానమైనటువంటి లోపం. ఆధునిక సమాజంలో భారతదేశ రాజ్యాధికారాన్ని చేరుకోవడానికి షెడ్యూల్డ్ కులాలవారికి వారి ఓట్లను వారు వేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేకపోవడానికి కారణం గ్లామర్ గ్లామర్ ప్రపంచం. అగ్రకులాల వారి ఓట్లను పొందలేక పోవడానికి కారణం  షెడ్యూల్డ్ కులాలలో అగ్ర కులాలను ఆకర్షించే గ్లామర్ వ్యక్తులు లేకపోవడం. గ్లామర్ ఎలా వస్తుంది గ్లామర్ ప్రపంచంలో వుంటే. కాని దళితులకు వారి మతం పాపం అని భోధిస్తుంది.నిజానికి గ్లామర్ అనేది  కులాలకు సంబంధం లేకుండా ప్రతిభను బట్టి విద్వత్తును బట్టి సంపాదించుకునే వ్యక్తిగతమైనది. ఇందులో ప్రస్తుతం క్రికెట్ , భారతదేశంలో సినీ , టెలివిజన్, మ్యూజిక్ , నాట్యం, నటన , దర్శకత్వం, రంగాలు రాజ్యమేలుతున్నాయి.  ఇటువంటి పరిస్దితిని షెడ్యూల్డ్ కులాలువారు అర్థం చేసుకున్నప్పుడు సాధ్యం అవుతుంది.
షెడ్యూల్డ్  కులాలవారు భారతదేశ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే అగ్రకులాలవారు కూడా వీరి వెంట పరిగెత్తే పరిస్దితి తెచ్చుకోవాలి. ఆ పరిస్దితి గ్లామర్ రంగానికి వుంది. నూటికి 90 మంది క్రైస్తవులు అయినటువంటి షెడ్యూల్డ్ కులాల వారు క్రైస్తవ మతం స్వీకరించడం వలన
దానికున్న కట్టుబాట్లను బట్టి ఈ గ్లామర్ ప్రపంచంలోనికి రాలేక అధికారాన్ని రాజ్యాధికారాన్ని కోల్పోతున్న మాట ముమ్మాటికీ వాస్తవం. అక్కడక్కడ రిజర్వేషన్లు ఫలితంగానే వ్యక్తిగత మైనటువంటి వ్యక్తిగత పలుకుబడితో ఒకరిద్దరు  రాగలిగినప్పటికీ  రాజ్యాధికారాన్ని, అగ్రకులాలు లేదా హిందూ సమాజానికి సంబంధించిన ఓట్లను కొల్లగొట్టడానికి  క్రైస్తవమతం అడ్డుగోడగా నిలుస్తుంది.
కానీ వాస్తవాన్ని మరిచి దళితులైన మమ్మలన్నీ ఇతరులు చిన్నచూపు చూస్తున్నారని ,దళితులను ఓట్ల బ్యాంకుగా చూస్తున్నారని, దళితులు ఎప్పుడూ కూడా అగ్రకులాలు నిర్మించే సినిమాలు చూస్తూ వారికి జేబులు నింపే వారిగా ఉన్నారని నిందలు వేస్తూ ఉంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి క్రైస్తవ మతమే హిందూసమాజానికి ఒక వరమైన ఉన్న సంగతిని వీరు గ్రహించకపోవడం దురదృష్టకరం.  అమెరికా, లండన్ వంటి దేశాలలో ఇటువంటి రంగాల్లో ఉన్న వారందరూ  క్రైస్తవులే అయినప్పటికీ కూడా గ్లామర్ ప్రపంచంలో వుంటారు. హాలీవుడ్ సినీపరిశ్రమ అంతా కూడా క్రైస్తవులే.ఇక్కడ  క్రైస్తవులు బిజెపి వచ్చేసింది, ఆర్. ఎస్.ఎస్  ఉందీ క్రైస్తవ మతాన్ని  భారతదేశంలో లేకుండా చేసేస్తారని అంటూవుంటారు అది వాస్తవమేనా? క్రైస్తవదేశాలలో వృత్తులు వృత్తులుగా చూస్తారు. మతాన్ని మతంగా  చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవమత బోధకులు , ,క్రైస్తవ దేవాలయాలు షెడ్యూల్డ్  కులాలవారిని  వాక్య నిబంధనలు పెట్టి షెడ్యూల్డ్ జాతిని ఎదగనీయకుండా చేస్తున్న సంగతి బాధాకరమైన విషయంగా తోస్తుంది.  మేధావి వర్గం  ఏమీ చేయలేని పరిస్దితి .
క్రైస్తవులైన షెడ్యూల్డ్ కులాలవారికి ఇది విచిత్రమైన పరిస్దితే. అంబేద్కర్ వంటి మహనీయుడు క్రైస్తవమతం స్వీకరించకపోవడానికి  మూడమైన క్రైస్తవ నిభందనలు కూడా ఒక కారణం కాదా? .  అంబేద్కర్ క్రైస్తవ మతం స్వీకరించి వుంటే ప్రతీ చర్చిలో అతను దేవుడుతో సమానంగా కొలువుతీరేవాడని వ్యాసకర్తతో అనేక మంది చెప్పడం తెలుసు.కాని క్రైస్తవమతం ఇహలోకమైన వాటికి ప్రాధాన్యతను ఇవ్వనప్పుడు దళితుల బాదలు ,రాజ్యాధికారం ఎలా సాధ్యమతుందనుకుని అంబేద్కర్ బౌద్దమతం స్వీకరించాడు.
క్రైస్తవమతస్తులైన షెడ్యాల్డ్ కులాలవారు ఓ అడుగుముందుకేసి  అగ్రవర్ణాలవారిగా భావించుకుని అనేకచోట్ల మసలుతూ వుండడం  బావదారిధ్యం. ఏదిఏమైనా దళితులకు రాజ్యాధికారం , ఆర్ధిక ప్రగతి రాకుండా చేయడానికి హిందూ సమాజం క్రైస్తవ మతాన్ని తప్పక ప్రోత్సహిస్తుంది.
అందుచేత క్రైస్తవులందరికీ క్రైస్తవమతాన్ని భారతదేశం నుండి రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం భోధకులు చేస్తున్న తప్పుడు ప్రచారమే.దళితులు అణగారినవర్గాలుగా ఉంటేనే అగ్రవర్ణాలు మనగలుగుతాయి అందుకు క్రైస్తవమతం తప్పనిసరి .లేదంటే అత్యంత ప్రతిభావంతులైన దళితులు గ్లామర్ రంగాలను శాసించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోగలుగుతారు.






    

Friday, January 10, 2020

జాన్ ..పద గీతం( జనశ్రీ)


జాన్ ..పద గీతం( జనశ్రీ)
తాంబరికాయ తమ్మయ్య
తుమ్మెదంటి తుంటరోడే
తమలపాకు చూడంటూ
దురదాకు పామాడే
తాంబరికాయ తమ్మయ్య
తుమ్మెదంటి తుంటరోడే
తమలపాకు చూడంటూ
దురదాకు పామాడే
తాంబర కాయ మీటుకుంటూ
తనువును పొడిచాడు తూట్లు తూట్లు
గుళ్లో గుంచం పాట అంటూ
గుండెకు పెట్టాడు గాట్లు గాట్లు
వాడి పాటంటే పసిపిల్లల పరికిణీ వేస్తది
వాడి జంగాలమ్మ పాటంటే
జనమంతా నవ్వలేక  పాట్లు పాట్లు
మంచాలమ్మ పాటంటే 
మనసుకైన వేస్తాడే మాట్లు మాట్లు
వాడి పాటవింటే
పావురాలు పాపిడిలే తీస్తాయి
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా
వాడి జంగాలమ్మ పాటంటే
జనమంతా నవ్వలేక  పాట్లు పాట్లు
మంచాలమ్మ పాటంటే 
మనసుకైన వేస్తాడే మాట్లు మాట్లు
వాడి పాటవింటే
పావురాలు పాపిడిలే తీస్తాయి
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


కిలం......కిలం......కిలం( జన శ్రీ)


కిలం......కిలం......కిలం( జన శ్రీ)
భవిష్యత్తు అంతా బూడిదల్లే ఎగిరితే
ఆ మేఘం ఎందుకు కలుపుకోదు?
ఆ మెరుపులు ఎందుకు పలకరించవు?
ఆ ఉరుములకెందుకు అంతా విసుగు ?
ఏ శరాఘాతానికో  కన్నీటి కుండ 
బళ్ళున  బద్దలయితే
ఆ నీటినిఎందుకు కడలి కలుపుకోలేదు ?
ఆ కన్నీటిని ఎందుకు కాలువ ముట్టుకోదు ?
విషపు  చినుకుల్లో హృదయపు అద్దం తడిసిపోతుంటే ఎంత తుడిచినా
చినుకులు ఆగవేమీ ?
ముచ్చెమటల్లో గుచ్చుకున్న ముళ్ళలా
ప్రతి ఉదయం
చిద్రమైనహృదయంలా .......
ఏ గొంతో పిసికిన రాగంలా.......
పగిలి పోయిన దీపపు చిమ్నీలా.......
కిలం....కిలం....హృదయాలన్నీ కిలం....కిలం....కిలం
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245(
తూర్పు గోదావరి జిల్లా


ప్రేమ రథం (జనశ్రీ)


ప్రేమ రథం (జనశ్రీ)
తుషార బిందువుల కవితా సంపుటి నుండి
ప్రేమ రథము కదిలించగా రావా
మనసారా నడిపించగా రావా
ఓ మంచు తునకా అపరంజి నాయక
ఎద ముంగిట ముచ్చటగా మెరిసేముత్యాల ముగ్గులు ముసిముసిగా నవ్వక ముందే
నీలిమబ్బుల చాటున తెల్లగ మెరిసే మెరుపులు
కసికసిగా నవ్వక ముందే
మనసారా నడిపించగరావా
మన ప్రేమ రథం కదిలించగ రావా
బాధలన్నీ ఓర్చి పూల బండిని తెచ్చా
అది నడిచే దారిలో పూబంతులు పరిచా
మల్లెమాలలే కళ్ళెంగా
గులాబీలే గుర్రాలుగా నడిచే
మన ప్రేమరథం కదిలించగా రావా
మనసారా నడిపించరావా
తుషార బిందువు లు కవితా సంపుటిని ప్రముఖ సాహితీ వేత్త ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల మహాసభలలో ఆవిష్కరించారు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


నీలి మేఘం (జనశ్రీ)


నీలి మేఘం (జనశ్రీ)
తుషార బిందువులు కవితా సంపుటి నుండి
పువ్వల్లే వికసించావు
నవ్వల్లే నవ్వించావు
కలలల్లే కవ్వించావు
పలుకరించుమా ప్రతి పుష్పమా
నా నింగిలో నడిచే
నిర్మల నీలి మేఘమా
చిగురించిన చిగురుటాకు పై
చినుకువై రాలిన హిమబిందా
మనసునే మెలి పెట్టావు
తీపి గురుతులకు ముడిపెట్టావు
ఒక క్షణం హృదయ ఘోషను
అరమోడ్పు కన్నులతో ఆపేసావు
అందని అగాధాలలో తోసేశావు
మిల మిల తారవై చూస్తుంటావు
ఎగసి రావా ఉషోదయ మై
కనిపించవా కాంతిపుంజమై
వినిపించవా మువ్వల నాదమై
చిరు గాలల్లే తిప్పించావు
సవ్వడి లేని చిరు వాగులల్లే నడిపించావు
ఒంటరినై ఒడలి ఉన్నాను
కురిపించవా పూల జల్లును
పంపించవా నీ చల్లని చిరునవ్వును
ఆర్పేసావు నా చిద్విలాస జ్యోతిని
కాల్చేసావు  నా కలల వాహినిని
ఏం చేస్తావు వంటరి దానవై
ఏం చేస్తావు ఎండమావి వై
గూడు లేని గువ్వలా నీవున్నావు
దాపు లేని దీపాన్నైనేనున్నాను
దారి లేదా నిన్ను చేరే మార్గం
మరిరాదా ఇంకెంతకాలం
చూపులకు చుట్టానివా
లోకానికి చుక్కానివా
చిలుకావే చిరునవ్వును
చింపావే నా నవ్వును
కొన్నాళ్ళే ఈ జీవితం
కన్నీళ్లే నాకంకితం
నవ్వాలే ప్రతిక్షణం
నీ ఉండాలే ప్రతి యుగం
నీ నవ్వుల్లో నేనుండాలి
నా నిలువెల్లా నీవు ఉండాలి
కనులారా కనిపించవే
వేదన తొలగించవేన
హృది దివ్వెను వెలిగించవే
కలకాలం కనిపించవే
మరీ మరీ ఏడిపించకు
కన్నీరైనా కాస్తుండనీ
వాటినైనా  తోడుండాలని
తుషార బిందువులు కవితా సంపుటిని ప్రముఖ సాహితీ వేత్త ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


మల్లె పొద (జన శ్రీ)


మల్లె పొద (జన శ్రీ)
తుషార బిందువుల కవితా సంపుటి నుండి
గుండె గిరులలో నీ రూపే నిండినే
మనసు కోయిలై ప్రేమ కూతలు కోసనే
నీ పిలుపే గిరుల పై ఏరులై పారేనే
మరు మల్లె పొదలలో నీ అందే ఘల్లుమంది
పరిమళ సుమ భరితమై అది పాటై సాగెనే
ఆ పాటే నా ఊహా రేఖకు తొలిచిత్రకల్పన
నా తొలి చిత్రం విచిత్రం
నీ రూపమే దానికి ప్రాణం
తడారిన తనువు తటాకం
నీ పలుకు జల్లుతో హొరు జోరుగానిండినే
నీ చూపే సూర్యోదయమై
కలలో నిదుర లే పెనే
నీ చిరునవ్వే చిగురులు తొడిగి
కలతల పొల్లే చెరెగెనే
తుషార బిందువుల కవితా సంపుటిని ప్రముఖ సాహితీ వేత్త సినీ నటులు తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు.
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...