భవిష్యత్తు అంతా బూడిదల్లే ఎగిరితే
ఆ మేఘం ఎందుకు కలుపుకోదు?
ఆ మెరుపులు ఎందుకు పలకరించవు?
ఆ ఉరుములకెందుకు అంతా విసుగు ?
ఏ శరాఘాతానికో కన్నీటి కుండ
బళ్ళున బద్దలయితే
ఆ నీటినిఎందుకు కడలి కలుపుకోలేదు ?
ఆ కన్నీటిని ఎందుకు కాలువ ముట్టుకోదు ?
విషపు చినుకుల్లో హృదయపు అద్దం తడిసిపోతుంటే ఎంత తుడిచినా
చినుకులు ఆగవేమీ ?
ముచ్చెమటల్లో గుచ్చుకున్న ముళ్ళలా
ప్రతి ఉదయం
చిద్రమైనహృదయంలా .......
ఏ గొంతో పిసికిన రాగంలా.......
పగిలి పోయిన దీపపు చిమ్నీలా.......
కిలం....కిలం....హృదయాలన్నీ కిలం....కిలం....కిలం
ఆ మేఘం ఎందుకు కలుపుకోదు?
ఆ మెరుపులు ఎందుకు పలకరించవు?
ఆ ఉరుములకెందుకు అంతా విసుగు ?
ఏ శరాఘాతానికో కన్నీటి కుండ
బళ్ళున బద్దలయితే
ఆ నీటినిఎందుకు కడలి కలుపుకోలేదు ?
ఆ కన్నీటిని ఎందుకు కాలువ ముట్టుకోదు ?
విషపు చినుకుల్లో హృదయపు అద్దం తడిసిపోతుంటే ఎంత తుడిచినా
చినుకులు ఆగవేమీ ?
ముచ్చెమటల్లో గుచ్చుకున్న ముళ్ళలా
ప్రతి ఉదయం
చిద్రమైనహృదయంలా .......
ఏ గొంతో పిసికిన రాగంలా.......
పగిలి పోయిన దీపపు చిమ్నీలా.......
కిలం....కిలం....హృదయాలన్నీ కిలం....కిలం....కిలం
No comments:
Post a Comment