వజ్ర వలయం జేమ్స్ బాండ్ 007టోక్యో ఎయిర్ ఫోర్టుఎర్లీ మార్నింగ్ 3:30 ఎ. యమ్
విలాసవంతమైన సూపర్ లగ్జరీ ఎయిర్ బస్సులో నుండి మద్రాస్ మహేంద్రన్ తన సెక్యూరిటీ గార్డుల రక్షణలో టోక్యోలో దిగాడు .అంగరక్షకులు రఘువీర్ రెడ్డి, పిళ్ళై పదుకొనేల కళ్ళు పరిసరాలను పరిశోధిస్తున్నాయ్ . అందరిలో ఆరితేరినవాడైన రాయలసీమ రఘువీర్ రెడ్డి పై విపరీతమైన నమ్మకం మద్రాస్ మహేంద్రన్ కి . అండర్ వరల్డ్ ఇజ్రాయెల్ డాన్ ఫ్రాంక్లిన్ బాసియో టోక్యోకు రావొద్దని మద్రాస్ మహేంద్రన్ ను ముందే హెచ్చరించాడు. అయినా తన సెక్యూరిటీ గార్డ్ పై ఉన్న నమ్మకంతో బయల్దేరాడు మద్రాస్ మహేంద్రన్ .
మహేంద్రన్ ఇండియాలోనే కాకుండా ఆసియా ఖండంలోనే గొప్ప కంప్యూటర్ సాఫ్ట్ వేర్ నిపుణుడు మరియు కంప్యూటర్ జీనియస్. ఆసియాలో మద్రాస్ మహేంద్రన్ కి చెందిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ చెర్రీ ఫాజిల్స్ అంటే మంచి పేరు ఉంది . పశ్చిమ దేశాలకు "చెర్రీ పాజిల్స్" కంపెనీ అంటే వ్యాపారపరంగా హడల్.
మహేందన్ ప్రపంచ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సదస్సు కి హాజరవడానికి టోక్యో వచ్చాడు. తన ప్రయోగ ఫలితాలు వివరించి తన కంపెనీకి లాభాల పంట పండించాలని మరియు ప్రపంచ బిజినెస్ కంపెనీలను తమ కంపెనీలో పెట్టుబడి పెట్టమని కోరడం కోసం వచ్చాడు మహేంద్రన్ . ఈ విషయం తెలిసిన ఇజ్రాయెల్ కంప్యూటర్స్ సంస్థ "మెర్రీ చైల్డ్ " సాఫ్ట్వేర్ కంపెనీ మహేంద్రన్ టోక్యో వస్తే తమ కంపెనీ నష్టపోవడం ఖాయమని గ్రహించి మహేంద్రన్ ను తుదముట్టించడానికి అండర్వరల్డ్ ప్రొఫెషనల్ కిల్లర్ ఫ్రాంక్లిన్ బాసియో తో ఒప్పందం కుదుర్చుకుంది.
టోక్యో ఎయిర్ పోర్టు దాటి కూతవేటు దూరం రాగానే బాసియో బృందం మద్రాస్ మహేంద్రన్ కాన్వాయ్ పై మెరుపుదాడి చేస్తుంది . ఎలర్ట్ అయిన సెక్యూరిటీ గార్డ్స్ బాసియో బృందాన్ని ఎదుర్కొంటారు. ప్రాణాలకు తెగించి బాసియో బృందాన్ని సెక్యూరిటీ గార్డ్స్ ఎదుర్కొంటారు. ముఖ్యంగా రఘువీర్ రెడ్డి సాహసంతో ప్రాణాలకు లెక్కచేయకుండా బాసియో బృందాన్ని ఊచ కోత కోస్తాడు.ప్రపంచ అండర్ వరల్డ్ డాన్లు అదిరిపడిపోయేలా రాయలసీమ ఫ్యాక్షన్ తరహా కత్తిపోట్లతో బాసియోను స్వయంగా నరికి పారేస్తాడు.
టోక్యో అంబాసిడర్స్ కాన్ఫేరెన్స్ హాల్
కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రపంచ నిపుణులు అందరూ ఆశ్చర్యంతో మహేంద్రన్ ఉపన్యాసం వింటున్నారు. కంప్యూటర్ వరల్డ్ ఫ్యూచర్ పై మహేంద్రన్ ఇచ్చిన మెసేజ్ అదిరిపోయింది. కొన్ని భవిష్యత్ కార్యక్రమాలను కనుగొన్న కొత్త సాఫ్ట్వేర్ విధానాన్ని పరిచయం చేస్తాడు. సూపర్ అడ్వాన్స్డ్ ప్రోగ్రాంతో ప్రపంచ కంప్యూటర్ రంగాన్ని కుదిపి పారేస్తాడు. ప్రపంచ ప్రయోగాలు మద్రాస్ మహేంద్రన్ ప్రయోగాలు ముందు వెలవెలపోతాయి.
క్షణాల్లో మద్రాస్ మహేంద్రన్ పేరు ప్రపంచ మార్కెట్లో మారుమ్రోగుతుంది. కోటాను కోట్ల డాలర్ల పెట్టుబడులు , షేర్లు వచ్చిపడతాయి. ప్రముఖ కంపెనీలు మాత్రం మహేంద్రన్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయడానికి పోటీ పడతాయి. ఒక్క రోజులోనే ప్రపంచ ధనవంతుల లిస్ట్ లో చేరిపోతాడు మద్రాస్ మహేంద్రన్ . కార్యక్రమం అనంతరం
మద్రాస్ మహేంద్రన్ టోక్యో ఆస్పత్రిలో చిన్నపాటి గాయాలతో చికిత్స పొందుతున్న సెక్యూరిటీ గార్డ్ రఘువీర్ రెడ్డిని పరామర్శిస్తాడు. రఘువీర్ రెడ్డి సాహసం వాళ్ళ కంపెనీకి కోటాను కోట్ల లాభాలు వచ్చేలా చేసిందని పొగుడుతాడు. సంతోషంతో రెండు కోట్లరూపాయల చెక్కును రఘువీర్ రెడ్డికి ఇవ్వబోతాడు. అనాధ అయిన రఘువీర్ రెడ్డి చెక్కును సున్నితంగా తిరస్కరిస్తాడు. ఆంధ్రాలోని రాయలసీమకు చెందిన రఘువీరారెడ్డి కొన్ని ఫ్యాక్షన్ తరహా హత్యలు చేసి తమ కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ప్రాణభయంతో మద్రాసు పారిపోయి రహస్యంగా జీవిస్తుంటాడు. మద్రాస్ మహేంద్రన్ కంపెనీలో వాచ్ మాన్ గా చేరి నమ్మకంతో పనిచేస్తూ తన ధైర్యసాహసాలతో మహేంద్రన్ ని మెప్పించి సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం సంపాదిస్తాడు. కృతజ్ఞతగా మహేంద్రన్ రఘువీర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో పట్టువిడవకుండా తన దగ్గర ఉన్న లాప్టాప్ కంప్యూటర్ ఓపెన్ చేసి ఇంటర్నెట్లో ఈజిప్టు "రాయల్ ఫరో" కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పదివేల కోట్ల బంపర్ లాటరీ టికెట్ ఒకటి రఘువీర్ రెడ్డి పేరు మీద రెండు కోట్లు పెట్టి బుక్ చేస్తాడు.టికెట్ పై రఘువీర్ రెడ్డి ఫింగర్ ప్రింట్ స్కాన్ అయిపోతాయి. రఘువీర్ రెడ్డి మద్రాస్ మహేంద్రన్ కు. కృతజ్ఞతలు తెలుపుతాడు రఘువీర్ రెడ్డి.టోక్యో నుండి మద్రాస్ మహేంద్రన్ విజయగర్వంతో మల్టీ మిలీనియర్ అయిపోయి ఇండియాకి తిరిగి వస్తాడు.
పూణే సైనిక శిక్షణ శిబిరం
రహస్య ప్రదేశంలో ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ల జూనియర్ బ్యాచ్ కి ట్రైనింగ్ క్యాంపు నిర్వహించబడుతూవుంది. సర్దార్ జగ్జీత్ సిన్హ కఠోరంగా శిక్షణ ఇస్తున్నాడు.తన కూతురు జాహ్నవి కూడా సీఐడీ ఏజెంట్ గా జూనియర్ బ్యాచ్ లో శిక్షణ పొందుతూ ఉంటుంది. క్యాంపు మద్యలో సహాయక బృందం సహాయం కోరుతూ పూణే నుండి అత్యవసర మెసేజ్ వస్తుంది. పూణే సిటీలో అంతర్జాతీయ ఆల్-ఖైదా ఉగ్రవాదులు అత్యంత రహస్యంగా సమావేశం నిర్వహిస్తున్నారని తెలుపుతూ వారి మీద ఎటాక్ చేయడానికి సీక్రేట్ ఏజెంట్ సహాయం కావాలని మెసేజ్ వస్తుంది. విషయం తెలుసుకున్న సిన్హా తన కూతురైన జాహ్నవిని అంతర్జాతీయ తీవ్రవాద ముఠాను మట్టికరిపించి రమ్మని రహస్యంగా పంపిస్తాడు.
దేశం దాటి పోవడానికి పూణే సిటీ దాటుతున్న తీవ్రవాదులు ఒక పాత ట్రక్కులో వేగంగా పోతూ ఉంటారు.తీవ్రవాదులు మద్యం సేవిస్తూ వేగంగా ట్రక్కు నడుపుతూ ఉంటారు. జూనియర్ సిఐడి బృందం ఉగ్రవాదులను వెంటాడుతోంది. అనుభవజ్ఞులు అయిన తీవ్రవాదులకు జూనియర్ సిఐడి ఏజెంట్స్ కి మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరుగుతాయి.జూనియర్ ఏజెంట్లలో కొందరిని తీవ్రవాదులు బందిస్తారు. వాళ్ల కోసం జాహ్నవి మరి కొందరు లొంగిపోతారు. వీరందర్నీ ఉగ్రవాదులు గొలుసులతో బంధించి ట్రక్కులో వేసుకుని పూణే సరిహద్దులు దాటి అత్యంత ప్రమాదకరమైన కొండలోయల బాట గుండా ట్రక్కుని పోనిస్తారు. సరిహద్దు దాటే వరకు జూనియర్ ఏజెంట్లను అడ్డుపెట్టుకుని సురక్షితంగా దేశం దాటి పోవాలని తీవ్రవాదులు భావిస్తారు. జూనియర్ ఏజెంట్ల నుండి ఎటువంటి సమాచారం రాకపోయేసరికి కంగారు పడతాడు సర్దార్ సిన్హ. ఇంటెలిజెన్స్ కార్యాలయానికి ఫోన్ చేసి సహాయం కోరతాడు. జేమ్స్ బాండ్ 007 ఒక్కడే మీకు సహాయం చేయగలడని ఇంటెలిజెన్స్ కార్యాలయం తెలపడంతో 007ని కాంటాక్ట్ చేస్తాడు సర్దార్.
అదృష్టం కొద్దీ 007 పూణే ఎయిర్పోర్ట్ కాంపస్ లోనే లేటెస్ట్ బాంబర్ విమానం నడపడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ వెనకే జూనియర్ ఎయిర్ఫోర్స్ బ్యాచ్ కు చెందిన కొందరు సిఐడి ఏజెంట్స్ 007 విమానంను తరుముతూ నడపడం ప్రాక్టీస్ చేస్తుంటారు. విమానం నడుపుతున్న విషయం తెలుసుకున్న 007 ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తన కిట్ సిద్ధం చేయమని కొన్ని వివరాలు చెబుతాడు.ఓ ప్రక్క ట్రక్కు కుదుపులకు ట్రక్ లో ఉన్న జూనియర్ ఏజెంట్స్ నలిగి నలిగి గోలగోల పెడుతుంటారు. మద్యం సేవిస్తూ బండ బూతులు తిడుతూ ఏమీ పట్టనట్లు ట్రక్కును వేగంగా నడుపుతూ పోతుంటారు తీవ్రవాదులు.
ఇంతలో వాయువేగంతో నాలుగు సీట్ల విమానం పసుపురంగుది ఒకటి ట్రక్కు మీదనుండి దాటుకుని కొండల్లోకి పోయి కనుమరుగవుతుంది. తీవ్రవాదులు విమానాన్ని చూసి భయపడతారు.అ ట్రక్కు వేగం తగ్గించి ప్రమాదం ఏమైనా ముంచుకొస్తుందేమోనని తర్కించు కుంటారు. కొంతసేపటికి దారికి అడ్డంగా విమానం పెట్టి చేతిరుమాలు ఊపుతున్న మనిషి కనిపిస్తాడు. అతడు అరబ్ దుస్తుల్లో తీవ్రవాదులకు మల్లె డ్రెస్ వేసుకుని ఉండటం కనిపిస్తుంది. ఓల్డ్ ట్రక్కుని దూరంగా ఆపి ఉగ్రవాదులు ముఠా నాయకుడు తాగిన మత్తులో మాట్లాడుతూ తన అనుచరులను విషయం తెలుసుకు రమ్మని పంపిస్తాడు. ఎదురుగా ఆగిన విమానం దగ్గరకు వెళ్ళిన అనుచరుడు అరబ్ దుస్తుల్లోని వ్యక్తితో అరబిక్ భాషలో ఏదో మాట్లాడతాడు వెనక్కి ఆనందంగా గెంతుకుంటూ వస్తున్న అనుచరుడిని చూస్తాడు తీవ్రవాదుల నాయకుడు . మిలటరీ మనల్ని పసిగట్టి వేలాడుతున్నట్టు సమాచారం తెలుసుకున్న మన సంస్థ కమాండర్ మన కోసం విమానం పంపినట్లు అరబిక్ భాషలో తీవ్రవాదుల నాయకుడికి తెలుపుతాడు అనుచరుడు. ట్రక్కు నుండి కిందకు దూకిన తీవ్రవాదులు జూనియర్ ఏజెంట్లను బండ బూతులు తిడుతూ ట్రక్కు స్టీరింగ్ను కొండలోయల వైపు త్రిప్పి వదిలివేస్తారు. డ్రైవరు లేని ఓల్డ్ ట్రక్కు అటు ఇటు ఊగుతూ ప్రమాదకరంగా అదుపు లేకుండా లోయల వైపు పోతూవుంటుంది. అందులోని జూనియర్ ఏజెంట్లు భయంతో అరుస్తూ ఉంటారు. ఉగ్రవాదులు ఒకవైపు నాలుగు సీట్ల విమానం వైపు పరిగెత్తి విమానం ఎక్కి కూర్చోగానే విమానం ఆకాశంలోకి దూసుకుపోతుంది.అరబ్బీ దుస్తులు ధరించి మారు వేషం వేసుకున్న 007ను ఉగ్రవాదులు తాగిన మైకంలో గుర్తుపట్టరు. 007 విమానంను ఆకాశంలోకి పైపైకి తీసుకుపోతాడు. మెరుపువేగంతో తన భుజాలకు ఫారాష్యూట్ తగిలించుకుని చాకచక్యంగా పైలెట్ సీటు నుండి క్రిందకు దూకెస్తాడు 007. పారాచూట్ సహాయంతో క్రిందికి దిగుతూ దిగుతూ అదుపు తప్పి లోయలోకి పడిపోబోతున్న ఓల్ద్ ట్రక్కు వైపు వేగంగా దిగుతాడు పారాష్యూట్ సాయంతో.
పైలెట్ లేని విమానం ఆకాశంలో గిరికీలు కొడుతూ పెద్ద ప్రేలుడు శబ్దంతో కొండల్లో కూలిపోతుంది. తీవ్రవాదులు మరణిస్తారు.
రాడార్ సిగ్నల్ ద్వారా 007 ప్రయాణించిన విమానం కోల్పోయినట్లు తెలుసుకుంటాడు . సైనిక కమాండర్ సర్దార్ జగ్జీత్ సిన్హ తన సైనికులను 15 జీపులో ఎక్కించుకుని తీవ్రవాదుల ఓల్ద్ ట్రక్కు స్పాట్ వైపు బయలుదేరతాడు. జేమ్స్ బాండ్ లోయలోకి కూలిపోతున్న ఓల్డ్ ట్రక్కును తన దగ్గర ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరికరాలతో లోయలోకి పడిపోకుండా ఆపి జూనియర్ సి ఐ డి బృందాన్ని రక్షిస్తాడు మన జేమ్స్ బాండ్ 007. మెల్లగా ఓల్ద్ ట్రక్కు 007 కంట్రోల్లోకి వస్తుంది. ఓల్డ్ ట్రక్కులోని జూనియర్ ఏజెంట్లకు తననుతాను జేమ్స్ బాండ్ 007 గా పరిచయం చేసుకుంటాడు. కట్లు విప్పి జూనియర్స్ ను ట్రక్కులోనికి ఎక్కించుకుని వస్తుండగా ధూళి రేపు కుంటూ ఓ పదిహేను జీపులు నిండా సైనికులు వెపన్స్ ధరించి వస్తున్న దృశ్యం కంటపడుతుంది.
జాహ్నవిని ఉద్దేశించి అందం ఒక్కటే చాలదని తెలివి కూడా కావాలని 007 ఆట పట్టిస్తాడు. ట్రక్కులో తీవ్రవాదులు ఉన్నారేమో అని భ్రమించిన సైనికులు కాల్పులు ప్రారంభిస్తారు. ఇటువంటి సమయాల్లో ట్రక్కును ఎలా నడపాలో డ్రైవింగ్ చేసి చూపిస్తాను అంటాడు 007. జూనియర్స్ బృందాన్ని సైనికులకు కనిపించకుండా ఉండమని చెప్పి 007 తన డ్రైవింగ్ విన్యాసాలతో సైనికులను ముప్పుతిప్పలు పెడతాడు . సైనికులకు అందకుండా ఓల్డ్ ట్రక్కును పూణే సైనిక శిక్షణ శిబిరం వైపు పోనిస్తాడు మన బాండ్ .సర్దార్ సైనిక హెలికాప్టర్ లో తను ఒక వైపు ఫాలో అవుతాడు. ఓల్డ్ ట్రక్కు సైనిక శిబిరం వైపు దూసుకొస్తున్నది అని తెలుసుకున్న వందలమంది సైనికులు ట్రక్కుని చుట్టుముడతారు.
తీవ్ర నిశ్శబ్ద వాతావరణంలో ఓల్డ్ ట్రక్కు ప్రక్కనుండి జేమ్స్ బాండ్ 007, ఏజెంట్లు మెల్లగ దిగుతారు. . ఉన్న పెట్టిన గొల్లున నవ్వుతూ సైనికులు చప్పట్లతో 007 సాహసాలను అభినందిస్తారు . బాండ్ చిలిపి చేష్టలకు నవ్వుతారు అందరూ. హెలికాప్టర్ నుండి దిగిన సర్దార్ 007 డ్రైవింగ్ ప్రతిభకు విస్తుపోతాడు. తీవ్రవాదుల నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతాడు. బాండ్ సాహసానికి మంత్రముగ్దైన జాహ్నవి 007 పై మనసు పారేసుకుంటుంది.
******************************
మద్రాసు మహేంద్రన్ తన ఫైవ్ స్టార్ హోటల్ లో కొత్తగా తమ కంపెనీ నుండి వజ్రాల వ్యాపారం ప్రారంభిస్తాడు. .ఓపెనింగ్ సెర్మనీ కి ప్రపంచం నలుమూలల నుండి బిజినెస్ మేగ్నెట్స్ ని ఆహ్వానిస్తాడు. ప్రభుత్వం వైపు నుండి కొందరు మంత్రులు హాజరవుతారు. ప్రముఖ టీవీ చానల్స్ లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా ఏర్పాటు చేస్తాడు. పెద్దస్క్రీన్ గల టీవీ తెరపై సూపర్ 40 ఛానల్ ప్రత్యక్ష ప్రసారం అవుతూ ఉంటుంది .
ఓ ప్రఖ్యాత సినీ తార చేతుల మీదగా పదివేల కోట్ల బంపర్ లాటరీ రిజల్ట్స్ వెలువరించ బోతున్నట్లు ప్రకటిస్తుంది బ్రేకింగ్ న్యూస్ గా.
హోటల్ లోని వారంతా క్షణకాలం సూపర్ 40 ఛానల్ వంకే చూస్తూ ఉండిపోతారు. ఇండియాకు చెందిన మద్రాస్ మహేంద్రన్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న రఘవీర్రెడ్డి గెలుచుకున్నట్లు యాంకర్ ప్రకటిస్తుంది . అందరూ స్థాణువులా అయిపోతారు. ఉన్నట్టుండి ఒకటే అలజడి స్థానిక టీవీ చానల్స్ వారు మద్రాసు మహేంద్రన్ వెనుక నిలబడ్డ రఘువీర్ రెడ్డి వెంటపడతారు. బిజినెస్ పీపుల్స్ అందరూ రఘువీరారెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. మహేంద్రన్ పర్సనల్ లేడీ సెక్రటరీలు రఘువీర్ రెడ్డి నీ ముద్దులతో ముంచి చేస్తారు. మద్రాస్ మహేంద్రన్ కార్యక్రమమల్లా రఘువీర్ రెడ్డి అభినందన సభలా తయారవుతుంది. మహేంద్రన్ కంటే రఘువీరారెడ్డి ధనవంతుడు అయినట్లు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచ ప్రముఖ టీవీ చానల్స్ రఘువీరారెడ్డి అదృష్టాన్ని కీర్తిస్దాయి.
విలేకరులు రఘువీర్ రెడ్డిని వదలకుండా ప్రశ్నిస్తూ ఇంత డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. చిన్ననాటినుండి అంతరిక్ష ప్రయోగాలు అంటే ఇష్టమని ప్రైవేటుగా ఇండియాలో తొట్టతొలి టూరిస్ట్ స్పేస్ సెంటర్లో నెలకొల్పాలని ఉందని తెలుపుతాడు. రఘువీరారెడ్డి సంతోషంగా ఈ తతంగాన్ని కోపంతో గమనిస్తున్న మద్రాసు మహేంద్రన్ తన సెక్యూరిటీ గార్డ్ తననే మించిపోయినందుకు ఈర్ష్యపడతాడు. పార్టీకి వచ్చిన వారి ముందే అల్లరి చేసి రఘువీర్ రెడ్డి పై చేయిచేసుకుని ప్రైజ్ మనీ తన కంపెనీకి ఇవ్వ మంటాడు.తన మీద అన్యాయంగా దాడి చేసిన మద్రాస్ మహేంద్రన్ ను రఘువీరారెడ్డి సవాలు చేస్తాడు. వ్యాపారంలో పోటీపడి కంపెనీలన్నీ దివాలా తీయిస్తాను అంటాడు. లాటరీ సొమ్ము తన వేలిముద్ర లేనిదే దక్కించుకోలేరు ఎవరైనా అని అంటాడు రఘువీరారెడ్డి.
చిర్రెత్తి పోయిన మహేంద్రన్ ఆ వెంటనే వ్రేలునరికి సర్జరీ ద్వారా తన చేతికి అతికించుకుంటానని అంటూ మీదకు వస్తాడు . భీకర ఘర్షణలలో మహేంద్రన్ ముఖాన్ని యాసిడ్తో కాల్ఛేస్తాడు రఘువీరారెడ్డి. మహేంద్రన్ ముఖం వికృతంగా తయారవుతుంది. రఘువీర్ రెడ్డి తప్పించుకుని పారిపోతాడు.మద్రాస్ మహేంద్రన్ రఘువీర్ రెడ్డి పై కక్ష పెంచుకుంటాడు.
******************************
ఓ క్లబ్ లో 007 ,జాహ్నవిలు కలుసుకుంటారు. తమ అభిరుచులు పంచుకుంటారు జాహ్నవి తన స్నేహితుల బృందంతో వస్తుంది. 007 తన అల్లరితో జాహ్నవి బృంధాన్ని అల్లరి పట్ఠిస్తాడు. 007 జాహ్నవీలు మోటర్ బైక్ పందెంలాంటివి వేసుకుని దగ్గరవుతూ మనసును పంచుకుంటారు.
******************************
పదివేల కోట్ల అధిపతి అయిన రఘువీర్ రెడ్డి ఇండియాలో తొలి స్పేస్ టూరిస్ట్ స్టేషన్ మొట్టమొదటిసారిగా నెలకొల్పుతాడు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రపంచ ప్రముఖులను ఆహ్వానిస్తాడు .జాహ్నవి తన తండ్రితో వస్తుంది. 007 కూడా ఇంటిలిజెన్స్ డిపార్టుమెంటు నుంచి అతిథిగా హాజరు అవుతాడు.ఈ కార్యక్రమంలో రఘువీర్ రెడ్డి జాహ్నవి అందాన్ని చూసి మనసు పారేసుకుంటాడు.. రెడ్డి జాహ్నవిని ఇష్టపడుతున్న సంగతిని తండ్రి గమనిస్తాడు. వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ తన అల్లుడు అయ్యే అవకాశం వస్తుందని సంతోషిస్తాడు.
జేమ్స్ బాండ్ 007 ఆ కార్యక్రమంలో కలిసి తిరగడం రఘువీర్ రెడ్డికి ఇష్టం ఉండదు. 007ని చితక్కొట్టిమని తన ముఠాని ఆదేశిస్తాడు రహస్యంగా. మొట్టమొదటి టూరిస్టు స్పేస్ షిప్ . ఆకాశంలోకి దూసుకు పోతుంది. ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జాహ్నవిని తనకు కాకుండా చేస్తున్న బాండ్ ని అంతం చేయమని ముఠా సభ్యులను ఓ ప్రక్క పురమాయిస్తాడు రఘువీరారెడ్డి.
రఘువీర్ రెడ్డి స్పేస్ సెంటర్ నెలకొల్పడంతో మరింత కక్ష పెంచుకున్న మద్రాస్ మహేంద్రన్ తన ముఠాను పంపి స్పేస్ సెంటర్ ను బాంబులతో పేల్చివేయాలని ఆదేశిస్తాడు. 007 ఎటాక్ చేయబోయిన రఘువీరారెడ్డి బృందానికి మద్రాస్ మహేంద్రన్ పంపిన బృందం తారసపడి రెండు ముఠాలు ఎదురు కాల్పులు జరుపుకుంటాయి బాండ్ చాకచక్యంగా వీరి నుండి తప్పించుకుంటాడు.
******************************
రఘువీర్ రెడ్డి జాహ్నవిని హిమాలయాల్లో జరిగే స్కేటింగ్ పోటీలకు రమ్మని ఆహ్వానిస్తాడు.
జాహ్నవిని తండ్రి వెళ్ళమని బలవంతం చేస్తాడు. 007 ని తోడుగా రమ్మంటుంది జాహ్నవి రహస్యంగా ఫోన్ చేసి. మంచు పోటీలకు రఘువీర్ రెడ్డి వెళుతున్నట్లు తెలుసుకున్న మద్రాసు మహేంద్రన్ రఘువీర్ రెడ్డిని మట్టు పెట్టడానికి ఓ రౌడీ ఛాంపియన్ న్ని పంపిస్తాడు రఘువీర్ రెడ్డి. 007 న్ని జాహ్నవి ఓప్రక్క ఆహ్వానించింది అని తెలుసుకొని 007 మట్టుపెట్టడానికి మంచి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తాడు రఘువీర్ రెడ్డి. మంచు స్కేటింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమవుతాయి. స్కేటింగ్ పోటీలలో మంచి ప్రావీణ్యం ఉన్న రఘువీర్ రెడ్డి బాండ్ ని నిబంధనలకు విరుద్ధంగా ఢీ కొడతాడు. బాండ్ పక్కకు ఒరిగిపోతాడు .అదే సమయంలో జాహ్నవి వెనుక జరుగుతున్న సంఘటనలు గమనించకుండా ముందుకు పోతుంది. 007 చనిపోయాడు అనుకుని రఘువీరారెడ్డి జాహ్నవితో సరదా పంచుకోవడానికి దూసుకుపోతాడు. అదే సమయంలో రఘువీరారెడ్డి నీ వెనుక నుండి మద్రాస్ మహేంద్రన్ పంపిన రౌడీ ఛాంపియన్ దొంగ దెబ్బ తీస్తాడు. రఘువీర్ రెడ్డి బ్యాలన్స్ తప్పి మంచుకొండల్లో దొర్లుకుంటూపొతాడు
******************************
4 సంవత్సరముల తరువాత
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కార్యాలయం నుండి న్యూఢిల్లీ
యాన్యువల్ రిపోర్ట్ చేతిలో పట్టుకుని ఇంటలిజెన్స్డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరి దేవి అత్యవసర సమావేశంలో అసహనంగా తిరుగుతూ ఉంటుంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అజాగ్రత్త వలన సంఘవిద్రోహ శక్తులు దేశంలో కొన్ని ఘరానా మోసాలకు పాల్పడుతున్న విషయం జ్ఞానేశ్వరిదేవిని నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటు నుండి ఆహ్వానం అందుకున్న 007 ,జాహ్నవి జ్ఞానేశ్వరి దేవి ముందు హాజరవుతారు .
జ్ఞానేశ్వరి దేవి ఫైల్స్ లోని కొన్ని క్లిప్పింగ్స్ సహాయంతో కంప్యూటర్ స్క్రీన్ మీద యాన్యువల్ రిపోర్ట్ డేటాను చూపిస్తూ రఘువీర్ రెడ్డి స్పేస్ సెంటర్ నుండి వెళ్ళిన స్పేస్ షిప్ లు కొన్ని అనుకున్న సమయానికి భూమిని చేరడం లేదని రిపోర్ట్స్ సూచిస్తున్నాయని చెబుతోంది.
జరుగుతున్న ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదో అర్థం కాలేదు అని చెప్తుంది జ్ఞానేశ్వరి. రఘువీర్ రెడ్డి స్పేస్ సెంటర్ నుండి వచ్చిన రిపోర్టులు కేంద్ర ప్రభుత్వం రాడార్ రిపోర్టులు సరిచూసి చూపిస్తుంది. స్పేస్ షిప్ లు భూమిని చేరిన తేదీలలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది దీనిపై రెడ్డి స్పేస్ సెంటర్ వారు కానీ టూరిస్టు బృందం వారు కానీ ఎక్కడా ఫిర్యాదు చేసినట్లు కనిపించడం లేదని చెబుతోంది. ఇటీవలే వెళ్లిన ఒక స్పేస్ షిప్ ఇంకా భూమిని చేరలేదని దాని తరువాత వెళ్లిన మరో స్పేస్షిప్ తిరిగి వచ్చినట్లు రిపోర్ట్స్ చూపిస్తూన్నాయి అంటుంది. తిరిగిరాని స్పేస్ షిప్ ఏమైనట్టు తెలియడం లేదని జ్ఞానేశ్వరి దేవి ఈ విషయమై రెడ్డి స్పేస్ సెంటర్ పై దాడిచేస్తే సాక్ష్యాలను నాశనం చేయవచ్చని లేదా ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని చెబుతూ దీని మిస్టరీని ఛేదించేందుకు 007 సహయం కోరుతుంది జ్ఞానేశ్వరి దేవి. దీని తతంగమంతా రహస్యంగా జరగాలని కోరుతుంది.
జాహ్నవి చేతికి జ్ఞానేశ్వరి దేవి మరో రిపోర్ట్ ఇస్తూ వజ్రాల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా దారుణంగా దెబ్బ తిన్నదని మార్కెట్ అవసరాలకు డిమాండ్ తగ్గిపోయి స్మగ్లింగ్ వజ్రాలు ఎక్కువైందని తెలుస్తుంది. దీని వలన ఒక దేశాన్ని మరొక దేశం అనుమానించే పరిస్థితి వచ్చిందని దీనిపై మన దేశం నుండి స్పెషల్ రిపోర్ట్ కావాలని ఇన్ టర్ ఫోల్ కోరిందని దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి ఇవ్వమని జ్ఞానేశ్వరి దేవి కోరుతుంది.
******************************
వజ్రాల బిజినెస్ లో అపారనష్టాన్ని చవిచూస్తున్న మహేంద్రన్ ముఠా టెక్సాస్ దగ్గర వజ్రాల స్మగ్లింగ్ చేస్తున్న ముఠాపై దాడి చేసి ఒక సభ్యుని బంధిస్తుంది. మహేంద్రన్ తన స్థావరంలో కర్కశంగా బాధిస్తూ అసలు విషయాన్ని కక్కిస్తాడు. విషయం తెలుసుకున్న మహేంద్రన్ అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. కానీ స్మగ్లర్ కి అతి సులువుగా వజ్రాలు ఎలా దొరుకుతున్నాయో అర్థం కాలేదు. బలమైన నెట్వర్క్ కలిగిన మద్రాస్ మహేంద్రన్ కి ఓ రాజకీయ నేత ఫోన్ చేసి సీక్రెట్ ఏజెంట్ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరిపైనో పైనో ఎంక్వైరీ చేయిస్తున్నారని అది మీ మీద కావొచ్చు లేదా రెడ్డి సెంటర్ మీద కావచ్చని మెసేజ్ చేస్తాడు.
అప్రమత్తమైన మహేంద్రన్ జాగ్రత్త పడతాడు .అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా సీక్రెట్ ఏజెంట్ 007 తన స్టైల్లో ప్యారాచూట్ సహాయంతో రెడ్డి స్పేస్ సెంటర్లో దిగుతాడు. రఘువీర్ రెడ్డి పర్సనల్ లేబరేటరీ లోకి అత్యంత చాకచక్యంగా చొరబడి రహస్య పత్రాలను వీడియో సీడీలను ఓ చిన్న కంప్యూటర్ లోనికి ఫీడ్ చేసి కడుపులోకి మింగేస్తాడు. ఆచి కడుపులో ఓ మూడు రోజుల వరకు ఉంటుంది. ఆ తరువాత దానిని తీసివేయాలి. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అవుతుంది . సమయాభావం వల్ల అక్కడ ఉన్న పత్రాలను, సీడీని ,మరికొన్ని ఇంపార్టెంట్ రహస్య పరికరాలను బ్యాగ్ లో వెసుకుని అత్యంత చాకచక్యంగా బయలుదేరతాడు. కానీ ఆఖరి నిమిషంలో ఎవరో స్టేషన్ లోనికి వచ్చినట్లు సెక్యూరిటీ గార్డు కనిపెట్టి అలారం మోగిస్తాడు. బాండ్ పై అత్యంత ఆధునిక తుపాకీలతో దాడి చేస్తూ వెనుకబడతారు సెక్యూరిటీ గార్డులు.
స్పెషల్ కారులో కూర్చుని రిమోట్ తో ఆపరేట్ చేస్తూ వెనకే ఫైరింగ్ చేస్తున్న సెక్యూరిటీ గార్డులను ముప్పుతిప్పలు పెడతాడు. ఉన్నట్టుండి ఓ 5 హెలికాప్టర్ లో నుండి జేమ్స్ బాండ్ మీదకు రెడ్డి స్పేస్ సెంటర్ సెక్యూరిటీ బృందం దాడి చేస్తుంది. ఆ ఆ దాడి నుండి తప్పించుకోవడానికి తన కారుని సముద్రం మీద పొనిస్తాడు. కారు కాస్త బోట్ గా మారిపోతుంది. రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై హెలికాప్టర్ నుండి వాకింగ్ సేఫ్టీ స్మాల్ బోట్లలో సముద్రం పైకి సెక్యూరిటీ సిబ్బంది దిగి ఓ యాభై మంది చుట్టూ ముడతారు. దాదాపు బాండ్ బందీ అయిపోతాడు.కదలలేని పరిస్థితి వస్తుంది. అంతలో అద్భుతం జరిగినట్లు ఓ పెద్ద జలంతర్గామి భీకరమైన శబ్దంతో పైకి వస్తుంది. అందులో నుండి ఓ ఆజానుబాహురాలైన ఓ అందాల సుందరి బాండ్ ని తన జలంతర్గామి లోనికి లాక్కొని క్షణాలలో సముద్రపు నీళ్ళలోకి జలాంతర్గామి తో సహా మునిగి మాయమవుతుంది. రెడ్డి స్పేస్ సెంటర్ సెక్యూరిటీ గార్డ్స్ ఆశ్చర్యపొతారు. అనుకోకుండా తప్పించుకుంటాడు బాండ్.
******************************
జలాంతర్గామి లోనికి వచ్చి పడ్డ 007 ఆశ్చర్యపోతాడు. అందాల సుందరి సెక్సీగా తయారై బాండ్ మీద పడుతుంది. తను మెరైన్ బయాలజీ చదువుతున్నానని, సముద్ర శిలాజాల మీద ప్రయోగాలు చేస్తూ ప్రాజెక్టు వర్క్ నిమిత్తం టూర్ లో ఉన్నానని తెలుపుతుంది .పైన జరుగుతున్న దృశ్యాన్ని మా జలంతర్గామి రాడార్ స్క్రీన్ పై డిస్ప్లే చేసిందని చెబుతోంది .వెంటనే కాపాడాలని అనిపించి వచ్చానని అంటుంది. బాండ్ మగ సిరిని పొగుడుతూ నీవు ఎవరో నాకనవసరమని అంటూ బెడ్ మీదికి లాగి ముద్దుల్లో ముంచి వేస్తుంది. స్త్రీ లోలుడైన బాండ్ అందాల సుందరి ఒడిలో సేద తీరుతాడు.
******************************
ఫ్యాషన్ షోకి హాజరైన రఘువీర్ రెడ్డి అక్కడ జాహ్నవి జడ్జిగా ఉండటం చూసి ఆనందిస్తాడు. పోటీల అనంతరం జాహ్నవి తో మాట కలుపుతాడు .రెడ్డి బిజినెస్ వ్యవహారాలు మీద అప్పటికే సందేహం ఉన్న జాహ్నవి ప్రేమ నటిస్తుంది .
రఘువీర్ రెడ్డి విలాసవంతమైన హోటలుకు తీసుకువెళతాడు జాహ్నవిని. తప్పతాగిన రఘువీర్ రెడ్డి ఓ వజ్రాల నగను బహూకరిస్తారు. సీక్రెట్ ఏజెంట్ జాహ్నవి రఘువీర్ రెడ్డి ని మాటల్లో పెట్టి రఘువీర్ రెడ్డి కారుని అంగుళం అంగుళం వెతుకుతుంది. మతిపోయేలా జాహ్నవికి వజ్రాల డంప్ కారులో కనిపిస్తుంది. జాహ్నవి వెనుక అఘండుడైన రఘువీర్ రెడ్డి మెల్లగా ఫాలో అవుతాడు. జాహ్నవి ఏజెంట్ చర్యని అసహ్యించుకుంటాడు. సీక్రెట్ ఏజెంట్ వైన నువ్వు నాకు సహకరిస్తే ప్రపంచంలో తిరుగులేని అండర్ వరల్డ్ డాన్ అవుతాను అంటాడు. జాహ్నవి చీత్కరించుకుంటుంది. రఘువీర్ రెడ్డి చిర్రెత్తి పోతాడు. జాహ్నవి మీదికి దాడి చేస్తాడు. జాహ్నవి తప్పించుకుని ఇంటికి చేరి తన తండ్రికి జరిగిన విషయం చెబుతోంది. రఘువీర్ రెడ్డి మీద సర్దార్ కి అసహ్యం వేస్తుంది.
అప్పటికే కంగుతిన్న రఘువీర్ రెడ్డి కి పుండు మీద కారం చల్లినట్టు సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసి స్పేస్ సెంటర్లోని రహస్య పత్రాలను 007 తీసుకొని పరారయ్యాడు అన్న విషయం చెబుతాడు. రఘువీర్ రెడ్డికి పిచ్చెక్కినట్టు అవుతుంది. ఇక తన మీద ప్రభుత్వం దాడి చేయడం ఖాయమని తెలుసుకుంటాడు. జాహ్నవి ని తీసుకుని పారిపోవాలని ప్లాన్ చేస్తాడు.
******************************
మద్రాసు మహేంద్రన్ శిబిరంలో ప్రత్యక్షమైన జలాంతర్గామి అందాల సుందరి మహేంద్రన్ ఆంతరంగిక మిత్రురాలు. తననుండి సేకరించిన కొన్ని పత్రాలు, సీడీలు, మహేంద్రున్ కి అందజేస్తుంది. మహేంద్రన్ రహస్య పత్రాలను సి.డిలను తన పరివారంతో పరిశోధించడానికి ఉపక్రమిస్తాడు.
******************************
ఇంటిలిజెన్స్ కార్యాలయంలో తన రిపోర్ట్ పట్టుకుని జ్ఞానేశ్వరి దేవి ముందు హాజరవుతారు. 007 సేకరించిన కంప్యూటర్ చిప్స్ శాస్త్రజ్ఞులు స్టడీచేసి డిస్ ప్లే చేస్తారు. వీడియో క్లిప్పింగ్ చూస్తున్న ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటుకు మతిపోతుంది. రఘువీర్ రెడ్డి స్పేస్ సెంటర్ నుండి వెళ్లిన స్పేస్ షిప్ ఎఫ్ ఎక్స్ 47 గ్రహం పై గల సహజసిద్ధమైన వజ్రాల అపార నిధిని సేకరించడం కనిపిస్తుంది. ఆ పనిని రోబోలు చాకచక్యంగా చేస్తూ కనిపిస్తాయి వీటిని ఆపరేట్ చేస్తూ రఘువీరారెడ్డి శాస్త్రజ్ఞులు కూడా కనిపిస్తారు. కొన్ని వజ్రాల డంప్ కలిగిన మిస్సింగ్ స్పేస్ షిప్ త్వరలో లాండ్ అవుతుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని మహేంద్రన్ తన రహస్య నివాసంలో కూడా కనుగొని గంతు లేస్తాడు.
******************************
జాహ్నవి రఘువీర్ రెడ్డి ఇచ్చిన వజ్రాల నగకు చెందిన ల్యాబ్ కు పంపిన రిపోర్ట్ వస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘువీరారెడ్డిని సాక్ష్యాలతో సహ నిరూపించే అవకాశం దొరికింది. ఇతర గ్రహంపై దొరికిన వజ్రాలను సేకరించి భూమి మీద అతి తక్కువ ధరకే స్మగుల్ చేస్తూ రఘువీర్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గ్రహిస్తుంది.వివిదదేశాల మధ్య విరోదం పెరగడానికి కారణం అవుతున్నట్లు గ్రహిస్తుంది జాహ్నవి. సాక్ష్యాలతో ప్రభుత్వానికి తెలిపి రఘువీర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అరెస్టు వారెంటు పొందుతుంది సిఐడి బృందం. విషయం గ్రహించి రఘువీర్ రెడ్డి అంతరిక్షంలో ఏర్పాటు చేసుకున్న సబ్ స్టేషన్ వద్దకు పోవాలనుకుంటాడు. ఎందుకంటే బీటా ఎఫ్ ఎక్స్ 47 నుండి వస్తున్న స్పేస్ షిఫ్ అక్కడకు చేరుతుంది. అందుకోసం తన స్పేస్ సెంటరులో సిద్దంగా వున్న రాకెట్ ఎక్కడానికి కారులో పారిపోతాడు.
******************************
రఘువీర్ రెడ్డి కాన్వాయ్ వెనకే వందలాది మిలటరీ దళాలు, జేమ్స్ బాండ్ 007 కాల్పులు జరుపుతూ వెంటపడతారు. అదే సమయంలో మద్రాస్ మహేంద్రన్ ముఠా స్పేస్ సెంటరుకు వస్తూ రఘువీరారెడ్డిని ఎటాక్ చేస్తుంది.007 కి ఈ పరిస్దితి మతిపోతుంది. అయినా బాండ్ జోయల్ పరసన్ కాబట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో రఘువీర్ రెడ్డికి జాహ్నవి దొరికిపోతుంది.
******************************
సైనికులు ,బాండ్ ,మద్రాస్ మహేంద్రన్ అందరూ రఘువీర్ రెడ్డి పై ముప్పేట దాడి చేస్తారు. దాడి నుంచి తప్పించుకుని రఘువీర్ రెడ్డి జాహ్నవిని తీసుకుని స్పేస్ స్టేషన్ లోనికి పోతాడు. అక్కడ బాండ్ తో రఘువీరారెడ్డి కనబడతాడు . ఈలోగా మద్రాసు మహేంద్రన్ రాకెట్ లోనికి చొరబడి అక్కడ వున్న రాకెట్ నడిపే వారిని బెదిరించి రాకెట్ స్టార్ట్ చేయిస్తాడు.. ప్రమాదాన్ని గమనించిన రఘువీర్ రెడ్డి జాహ్నవిని అడ్డుపెట్టుకుని బాండ్ దాడి నుంచి తప్పించుకుంటూ మెల్లగా రాకెట్ లోనికి పోతాడు. రాకెట్ లోనికి పోయేముందు రఘువీరారెడ్డి వజ్రాలు మాత్రమే కాకుండా ఈ భూమ్మీద దొరకని అత్యంత ప్రమాదకరమైన ప్రేలుడు పదార్థం ఎఫె ఎక్స్ 47 గ్రహంపై కనుక్కొని తీసుకుని వస్తున్నానని ప్రపంచాన్ని భస్మీపటలం చేసి తన సామ్రాజ్యాన్ని స్దాపిస్తానని అంటూ ఆనందంగా కేరింతలు కొడుతూ రాకెట్ లోపలికీ వెళ్ళిపోతాడు.అదే సమయంలో బాండ్ తెలివిగా ఎటాక్ చేసి తనూ రాకెట్ లోపలికి పోయి స్పేస్ షూట్ ధరిస్తాడు. అందరూ స్పేస్ షూట్లు ధరిస్తారు.రాకెట్ భూఅయస్కాంత పరిధిని దాటి అంతరిక్షంలోనికి దూసుకు పోతుంది క్షణాల్లో. రఘువీర్ రెడ్డి జాహ్నవిని రహస్యగదిలో బందించి రాకెట్ ను తన అధీనంలోకి తెచ్చుకుంటాడు.
బాండ్ జాహ్నవిని వెతికే పనిలో పడతాడు.
జాహ్నవి జాడ కనిపెట్టి విడిపిస్తాడు.
******************************
క్రిందనున్న ఇంటెలిజెన్స్ కార్యాలయం బాండ్ ప్రయాణిస్తున్న రాకెట్ తో సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
******************************
రఘువీర్ రెడ్డి ప్రయాణిస్తున్న రాకెట్ భూకక్ష్యను దాటి అంతరిక్ష స్పేస్ సెంటర్లో చేరుకోగానే ఎదురుగా బీటా ఎఫ్ ఎక్స్ గ్రహం నుండి వస్తున్న రాకెట్ చేరుకుంటుంది. అందులో కోటాను కోట్ల విలువ చేసే వజ్రాలు ఓ వెయ్యి కంటెయినర్ల వరకు ఉంటాయి. అంతే కాకుండా అత్యంత ప్రేలుడు పదార్థ కనీసం ఓ గది నిండా భద్రపరిచి ఉంటుంది.
రఘువీర్ రెడ్డి వచ్చిన రాకెట్ క్యాబిన్ భాగాన్ని ఇతర గ్రహం నుండి వచ్చిన స్పేస్ షిప్ కు అతుక్కునేలా అనుసంధానం చేస్తాడు. భూమి నుండి వచ్చిన రాకెట్ మి సగభాగాన్ని ప్రేల్చే ప్రయత్నం చేస్తాడు రఘువీరారెడ్డి.
అప్పటికే సగ భాగం మంటల్లో చిక్కుకుని తగలబడుతూ ఉంటుంది .రఘువీర్ రెడ్డి జాహ్నవి ని తీసుకుని ఇతర గ్రహం నుండి వచ్చిన రాకెట్ క్యాబిన్ లోనికి చొరబడతాడు. అక్కడ వున్న రోబోలు, హ్యుమనాయిడ్స్ రఘువీర్ రెడ్డికు సహకరిస్తాయి. కానీ ప్రమాదాన్ని పసిగట్టిన జేమ్స్ బాండ్, మహేంద్రన్ రఘువీర్ రెడ్డితో పాటు ఇతర గ్రహం నుండి వచ్చిన రాకెట్లోని దూరేస్తారు . హ్యూమనాయిడ్స్ తీవ్రంగా ప్రతిఘటిస్తాయి.రఘువీర్ రెడ్డి భూకక్ష్యను చేరడానికి సజెషన్స్ ఇవ్వమని హ్యుమనాయిడ్స్ ను కొరతాడు. క్రిందనున్న తన స్థావరంలో బృందాన్ని ఆదేశిస్తాడు. రాకెట్ మెల్లగా భూమిని చేరడానికి బయలుదేరుతుంది. మహేంద్రన్ రాకెట్ను తన ఆధీనంలోకి తెచ్చుకునే భాగంగా అక్కడ ఆపరేటింగ్ చేస్తున్న హ్యుమనాయిడ్ బృందాన్ని నాశనం చేస్తాడు.రఘువీర్ రెడ్డి జేమ్స్ బాండ్ తో వున్న జాహ్నవిని వదిలి మద్రాస్ మహేంద్రన్ పని పట్టాలని మద్రాస్ మహేంద్రన్ మీదకు కలబడతాడు.
అదునుగా భావించిన జేమ్స్ బాండ్ జాహ్నవిని రఘువీర్ రెడ్డి నుండి రక్షించి ఓ సీక్రెట్ క్యాబిన్లోకి కనబడకుండా దాక్కుంటారు. మహేంద్ర రఘువీర్ రెడ్డి భీకరంగా కలబడతారు. మహేంద్రన్ రాకెట్ ఆపరేటింగ్ సిస్టంను నాశనం చేస్తాడు తెలియకుండానే.
******************************
భూకక్ష్య వైపు వస్తున్న రాకెట్ ఒక్కసారిగా తన దిశను మార్చుకుని అనంత అంతరిక్షంలోకి రెక్కలు తెగిన పక్షిలా కొట్టుకుపోతుంది. ఇంటెలిజెన్స్ కార్యాలయంలోను రఘువీర్ రెడ్డి శిబిరంలోనూ ఒకటే అలజడి బయలుదేరుతుంది. స్పేస్ షిప్ ఆపరేటింగ్ సిస్టం పూర్తిగా దెబ్బతిందని అదృష్టం ఉంటే తప్ప రాకెట్ కంట్రోల్ లోనికి వచ్చే అవకాశం లేదని భావిస్తుంది ఇంటెలిజెన్స్ కార్యాలయం. ఈ విషయాన్ని బాండ్ కు ఎలాగన్నా తెలియచేయాలని రాడార్ కేంద్రం కమ్యూనికేషన్ సిస్టంతో ప్రయత్నించి సఫలం అవుతుంది.
రాడార్ కేంద్రంలో ఉన్నట్టు ఉండి తీవ్ర టెన్షన్ నెలకుంటుంది. రాడార్ అనంతాకాశంలోని కృష్ణబిలం వైపు పయనిస్తుందని కృష్ణబిలం అంటే ఐస్కాంత బావి లాంటిది. నక్షత్రం తనలో తాను కుచించుకు పోయినప్పుడు అక్కడ అనంత ఐస్కాంత శక్తి సుడులు తిరుగుతూ ఏర్పడుతుంది. అందులో చిక్కుకున్న ఏ వస్తువు బయటకు రాలేదు. వీళ్ళతో రాడార్ కేంద్రం కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటుంది . రాకెట్టు గల ప్రమాదాన్ని తెలిపి హెచ్చరిస్తుంది. రాడార్ కేంద్రం ఐస్కాంత ప్రభావాన్ని గురవుతున్నప్పుడు స్పేస్ షప్ కుదుపులకు లోనవుతుంది. ఆలస్యం చేయకుండా బాండ్ బయటపడడానికి అన్వేషణ కొనసాగిస్తాడు.
******************************
మద్రాస్ మహేంద్రన్ రఘువీర్ రెడ్డి లు ఒకరి నొకరు చంపుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రోబోలు హ్యుమనాయిడ్స్ నాశనమవుతాయి.007,జాహ్నవిలు రాకెట్ క్యాబిన్లో కి పోయి భూకక్ష్య వైపు రావడానికి ప్రయత్నించి సఫలీకృతం అవుతారు. ఇద్దరినీ రాకెట్ క్యాబిన్లోల్లో చూసిన రఘువీరారెడ్డి గ్రహించి దాడిచేయిబోతాడు. కానీ అప్పటికే రాకెట్ క్యాబిన్ విడిపోయి భూకక్ష్య వైపు ప్రయాణిస్తారు .రఘువీర్ రెడ్డి ఉండిపోయిన రాకెట్ కృష్ణబిలం లోనికి కూరుకు పోవడానికి వేగంగా వెనక పోతూ ఉంటుంది. రఘువీర్ రెడ్డి సపోర్టు ఇంజనును కంట్రోల్ చేయడానికి పిచ్చిపిచ్చిగా అక్కడ ఉన్న బటన్లు నొక్కేస్తూ వుంటాడు. మహేంద్ర ఏమయ్యాడో ఎవరికీ అర్థం కాదు
భూకక్ష్య వైపుకు కొత్త దూరం ప్రయాణించిన 007 రాకెట్ మెల్లగా వెనక్కి పోతున్న సంగతి గ్రహిస్తాడు. రాకెట్ యొక్క శక్తి భూకక్ష్యవైపు ప్రయాణించడానికి సరిపోవడం లేదని గ్రహిస్తారు. ఇదే విషయాన్ని రాడార్ కేంద్రం 007ని హెచ్చరిస్తుంది. 007 ప్రయాణిస్తున్న రాకెట్ కూడా కృష్ణబిలం వైపు వేగంగా బయటకు పోతూ ఉంటుంది.
రఘువీర్ రెడ్డి ఒకప్రక్క రాకెట్ను పని చేయించడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు . ఆ రాకెట్ ఒత్తిడికి చిన్న చిన్న ముక్కలుగా విరిగి పోతుంది 007 నిస్సహయ స్థితికి వస్తాడు. ఏదో ఒకటి చేసి బయటపడని రాడార్ కేంద్రం హెచ్చరిస్తుంది. రాడార్ కేంద్రంలోని జ్ఞానేశ్వరి దేవి అక్కడ ఉన్న పరిస్థితికి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. జాహ్నవికి ఏడుపు తన్నుకొస్తోంది. ప్రయాణిస్తున్న రాకెట్ కి భూకక్ష్యను చేరే శక్తి లేదని గ్రహించిన ఇంటెలిజెన్స్ కార్యాలయంలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. 007 నుండి రాడార్ కేంద్రానికి సంకేతాలు ఆగిపోతాయి.
******************************
కానీ అసాధ్యుడైన 007 తెలివిగా ఆలోచిస్తాడు వేగంగా మెదడుకు పదును పెడతాడు. తను ప్రయాణిస్తున్న రాకెట్ క్యాబిన్లో చిన్న సేఫ్టీ బోట్ ఏదైనా ఉందేమో అని వెతకడం ప్రారంభిస్తాడు. జీరో జీరో సెవెన్ కు ప్రాణం లేచి వస్తుంది . ఆలస్యం చేయకుండా సేఫ్టీ బోట్ ఓపెన్ చేస్తాడు. బాండుకు గుండె ఝల్లుమంటుంది. అందులో మద్రాస్ మహేంద్రన్ వికృతంగా నవ్వుతూ కనిపిస్తాడు. 007 మీదకి లంకిస్తాడు. మహేంద్రన్ సీక్రెట్ గా సేఫ్టీబోట్లో చేరి దాక్కున్నాడు.
ఒకవైపు రఘువీరారెడ్డి చేసిన పిచ్చి ప్రయత్నం ఫలించి రాకెట్ వేగం పుంజుకుని తిరిగి ప్రయాణం సాగిస్తోంది. రఘువీర్ రెడ్డి ఆనందానికి అవధులు ఉండవు. 007 మహేంద్రన్ను చితకబాది స్పేస్ బోట్ లో బంధించి రఘువీర్ రెడ్డి ప్రయాణిస్తున్న రాకెట్ వైపు గురి చూసి వేగంగా స్టార్ట్ చేసి వదిలేస్తాడు. మహేంద్రన్ గుండె జారిపోతుంది.పెడబొబ్బలు పెడుతూ వుంటాడు బోట్ రఘువీర్ రెడ్డి రాకెట్ వైపు దూసుకుపోతుంది. ఎదురుగా వస్తున్న స్పేస్ బోట్ ను చూసి రఘువీరారెడ్డి ముచ్చెమటలు పట్టేస్తాయి. ఆ స్పేస్ బోట్ గాని రాకెట్ ను గుద్దుకుంటే స్పేస్ షిప్ ప్రేలిపోవడం ఖాయమని హడలి పోతాడు. రఘువీర్ రెడ్డి ఏమిచేయాలో అర్థం కాదు.
007 అదే ఆలోచించాడు. రఘువీర్ రెడ్డి రాకెట్ ను కాని ప్రేల్చగలిగితే ఆ ప్రేలుడుకు తిరిగి తన రాకెట్ బ్లాక్ హోల్ ఐస్కాంత ప్రభావం నుండి బయటపడి భూకక్ష్య వైపు వేగంగా నెట్టబడుతుందని ఆలోచించి అక్షరాల అమలు చేశాడు.
మహేంద్రన్ ఉన్న సేఫ్టీబోట్ రఘువీర్ రెడ్డి ప్రయాణిస్తున్న రాకెట్ను క్షణాల్లో గుద్దుకుంటుంది. అక్కడ మహావిస్ఫోటనం సంభవిస్తుంది. ఎందుకంటే బీటా ఎఫ్ ఎక్స్ 47 లోనుండి తెస్తున్న అతిశక్తివంతమైన ప్రేలుడు పదార్దం ప్రేలి విస్పోటనం సంభవించడంవలన. ఆప్రేలుడు శక్తికి బాండ్ ఊహించినట్లే తన రాకెట్ వాయువేగంతో భూకక్ష్య వైపు నెట్టబడుతుంది.
రాకెట్ ను స్పేస్ బోట్ గుద్దుకోవడంతో రఘువీర్ రెడ్డి, మద్రాస్ మహేంద్రన్ తోపాటు వజ్రాల డంప్ మరియు ప్రమాదకరమైన ప్రేలుడు పదార్థం కూడా అంతరిక్షంలో కాలి బూడిద అవుతాయి.
భూకక్ష్య లోనికి వచ్చిన 007 రాకెట్ తో ఇంటెలిజెన్స్ కార్యాలయంలోని రాడార్ కేంద్రం సిగ్నల్స్ అందుకుంటుంది. 007 , జాహ్నవిలు సేఫ్ గా భూకక్ష్య లోకి వచ్చారని తెలియగానే అందరూ హర్షధ్వానాలు చేస్తారు. ప్రమాదకరమైన నేరస్తులనే కాకుండా ప్రపంచానికి జరిగిన పెను ముప్పును తప్పించినందుకు జేమ్స్ బాండ్ 007ను అందరూ అభినందిస్తారు.
రాకెట్ లోనే 007, జాహ్నవి ముద్దుల్లో మునిగి తెలియడంతో జ్ఞానేశ్వరి దేవి రాడార్ స్విచాఫ్ చేస్తుంది నవ్వుకుంటూ.
సిద్దాంతపు బెన్ జాన్ సన్ ( జనశ్రీ )
|
Subscribe to:
Post Comments (Atom)
భార్య, భర్తల మధ్య వాగ్వాదాలు మామూలే. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో భార...
-
మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తప ల్లి గ్రామాలు ( జనశ్రీ) జాంథానీ చీర కట్టుకోని మగువలు, కొత్తపల్లి కొబ్బరి మామిడి తినని భో...
-
నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశు త్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు'' (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేష...
-
నీలి మేఘం (జనశ్రీ) తుషార బిందువులు కవితా సంపుటి నుండి పువ్వల్లే వికసించావు నవ్వల్లే నవ్వించావు కలలల్లే కవ్వించావు పలుకరించుమా ప...
No comments:
Post a Comment