మా ఊరి కథలు 1అసలు సిసలు క్రికెట్ టోర్నమెంట్ ఉప్పాడ కొత్తపల్లి క్రిస్మస్ క్రికెట్ కప్
1982 ప్రాంతంలో ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రక్కనున్న రవీంద్రపురం గ్రామానికి మా కుటుంబం కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి వచ్చి చేరింది. అది మా తల్లిదండ్రులు చేసినటువంటి గొప్ప పని. వారు నాకు విద్యకు సరిపడా ఇంటి దగ్గర ప్రయివేటులాంటిది ఏదీ నాకు
చెప్పకపోయినా ఆ పరిసరాల్లో నన్ను ఉంచడం వారు నా పట్ల తీసుకున్న శ్రద్దకు నిదర్శనం. హైస్కూల్ని ఆనుకునే మా ఇల్లు ఉండడంతో పొద్దుట , సాయంత్రం గ్రౌండులో ఆడుకునే క్రీడాకారులందరూ మా ఇంటి పెరటిలో క్రీడాపరికరాలను దాచుకునేవారు. అది టీవీలు ,సెల్ ఫోన్లులేని కాలం కాబట్టి తప్పకుండా ప్రతీ కుర్రవాడు స్కూల్ గ్రౌండ్లోనే కాలం గడిపేవాడు . అలా నేను వారితో చేరి ఆడుతూ వాళ్లకి బంతి అందించే వాడిగా ఉండేవాడిని. ఏ ఆట నాకు పూర్తిగా వచ్చేది కాదు.
నాకు ఇంక ఏ ఆట పూర్తిగా రాదని అనుకునే సమయంలొ క్రికెట్ఆట తెలుగు గ్రామాల్లోకి ప్రవేశించింది . 1984లో కపిల్ దేవ్ ఇంగ్లాండులో ప్రపంచకప్ గెలుచుకుని రావడంతో గ్రామాల్లో క్రికెట్ కు ప్రజాదరణ పెరిగింది . కొత్తపల్లికి చెందిన క్రీడాకారులు రావు మాధవరావు, రావు రాజేష్ ఉప్పాడ నుంచి దంగేటి ప్రసాదు, వాళ్ల మిత్రులందరూ ఒక టీమ్ గా ఏర్పడి హైస్కూల్ గ్రౌండులో క్రికెట్ ఆడటం ప్రారంబించారు. మాధవ,ప్రసాదు ఫాస్ట్ భౌలర్స్ . పిఠాపురం నుంచి నాని, రెడ్డి లాంటి క్రీడాకారులతో కూడిన క్రికెట్ జట్టును ఆహ్వానిస్తూ మ్యాచ్లు ఆడుతూ ఉండేవారు. నాని పిఠాపురం స్టార్ బ్యాట్స్ మన్ .వారితో హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేసే ప్రేమ్ కుమార్ మాస్టారు కూడా బౌలింగ్ వేస్తూ క్రికెట్ ఆడుతూ ఉండేవారు. అదొక కొత్త ఆట ఆ రోజుల్లో. చాలా ఖరీదైన ఆట కూడా. క్రీడా పరికరాలు కాకినాడలో తప్ప ఎక్కడా దొరికేవి కావు. నేను ఆటగాళ్ళు మా ఇంటి దగ్గర దాచుకున్న కిట్ తో సాధన చేసేవాడిని.
హైస్కూల్ కి చెందిన రెండున్నర ఎకరాల ఖాళీ స్థలం క్రికెట్ ఆడటానికి చాలా అనువుగా ఉండేది. క్రికెట్ ఆట నన్ను చాలా బాగా ఆకర్షించింది. బ్యాటింగ్ స్టైల్ గా అనిపించేది. కొత్తపల్లికి చెందిన ఆటగాళ్ళందరూ రోజు ఉదయాన్నే ప్రాక్టీస్ చేస్తుంటే నేను వెళ్లి చూసేవాడిని. బంతి అందివ్వడానికీ ఫీల్డింగ్ చేయమని అడిగేవారు. నేను చురుకుగా గ్రౌండ్లో కదలలేకపోయేవాడిని.రోజంతా ఫీల్డింగ్ చేసినా నా వంతు బ్యాటింగ్ రాగానే ఒక్క బంతికే అవుటై పోయేవాడిని. బ్యాటింగ్ చేయడం వచ్చేది కాదు.ఆ రోజుల్లో క్రికెట్ ఆడేవాళ్ళు చాలా తక్కువమంది ఉండేవారు. హైస్కూల్ గ్రౌండ్ ఇంటి ప్రక్కనే ఉండడంతో ప్రతి మ్యాచ్ లోనూ ఎవరో ఒకరు రాకపోయే సరికి నన్ను 11 వ ప్లేయర్ గా తీసుకునేవారు . అలా రోజూ మ్యాచ్ లు ఆడే సరికి ఆట వంటబట్టింది. క్రికెట్ కిట్ లోని పేడ్లును కాళ్ళుకు కట్టుకుని, గ్లౌజులు చేతికి వేసుకుని, బ్యాట్ పట్టుకొని గాల్లోకి రకరకాల షాట్లు యొక్క భంగిమల్ని ప్రాక్టీస్ చేసేవాడిని. బాలు ఉండేది కాదు. బౌలింగ్ చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. ఎలాగైనా ఆట బాగా ఆడాలని నిర్ణయించుకుని ఆలోచనలొపడ్డాను.అప్పుడు
నాకూడా అమీనాబాదకు చెందిన కుర్రాళ్ళు భూషణం, సత్తిబాబు, సుధీరు, పాలేటి నాగేశ్వరరావు ఉండేవారు.నేను నేర్చు కొవాలంటే కొందరికి నేర్పాలి అలా అయితేనే నాకు ఆట వస్తుందని ఆలొచించి వాళ్ళను అడిగాను. సరే అన్నారు. కొత్తపల్లి ఆటగాళ్ళు ఆరుగంటలకి వచ్చేలోపు ప్రొద్దుటే నాలుగు గంటలకి అమీనాబాద సైకిల్ పై క్రికెట్ కిట్ తీసుకెళ్లి వాళ్లతో ఆడేవాడిని. ఎందుకంటే ఆరోజుల్లో కిట్ కొనలేని స్దితి మాది.
నేను కాకినాడ పి.ఆర్ కాలేజీలో డిగ్రీ చదవడం మొదలు పెట్టిన తర్వాత మెల్లగా ఆటకు సంబంధించిన పరికరాలు కొని తెచ్చేవాడిని.
కార్క్ బాల్ అని ఉండేది. చాలా బరువుండేది. అది బాగా తక్కువ రేటు పది రూపాయలుకు వచ్చేది . గ్లొరెక్స్ లెదర్ కట్ బాల్స్ అయితే బాల్ 60 రూపాయలు ఉండేది. కార్క్ బాల్ తో బౌలింగ్ చేస్తున్నప్పుడు నా బాలు కి పాలేటి నాగేశ్వరరావు మూతికి తగలడంతో రెండు పళ్ళు లోపలికీ పోయాయి. ఇలా ప్రతిరోజు కాళ్లకు చేతులకు దెబ్బలు తగ్గించుకుని ఆట నేర్చుకున్నాం. ప్రాక్టీస్ లో మొదట నేనే బ్యాటింగ్ చేయాలన్న తలంపుతో రవీంద్రపురం నుంచి కాళ్లకు పేడ్లు కట్టుకుని సైకిల్ పై అమీనాబాద పోయేవాడిని. అలాగే వెళతావుంటే ఊళ్ళో వాళ్ళు వింతగా చూసేవారు. ఉప్పాడ పరిసర ప్రాంతాలకు క్రికెట్ ను నేనే పరిచయం చేశాను .నాకు తెలియకుండానే.
ఇలా క్రికెట్ ఆడుతున్న సందర్భంలో మూలపేటలో ఓ నలుగురు క్రీడాకారులు క్రికెట్ ఆడటం ప్రారంబించారు. రవీంద్రపురంలో తాతపూడి రాజేష్ , సుకుమారు, రాంమూర్తి తయారయ్యారు.
కొత్తపల్లిలొ బట్టురాజ , బోసుకొండ వెంకన్న, లెప్ట్ హేండ్ శ్రీను, వంశీ , రాంపండు , ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఇలా ఆటగాళ్ళు అన్ని వీదులనుండి పుట్టుకొచ్చారు. సీనియరు ఆటగాళ్ళు మాధవ, రావు రాజేష్ , సానా రాంబాబు, మలిశెట్టి శ్రీను, కొమరగిరి నుండి , ఇసుకపల్లి నుండి కొందరు ఆటగాళ్ళు కలిపి పెద్ద టీం ఉండేది. వీళ్ళు కాకినాడ ,తుని ప్రాంతాలు వెళ్ళి టొర్నమెంటులు ఆడేవారు. కొత్తపల్లి టీంగా పిలవబడేది. కొత్తపల్లి శ్రీరామక్లబ్ వారు పెద్ద టొర్నమెంటును 1989 లొ నిర్వహించారు. దానికి డ్రాలో ఒక టీమ్ తక్కువైతే నన్ను పిలిచి టీమ్ కట్టమన్నారు. బయపడుతూనే సరే అని మూలపేట, అమీనాబాద ఆటగాళ్ళం కలిసి టీమ్ కట్టాము . నేను కెప్టెన్ ని కొత్తపల్లి టీం తరువాత ఇతర ఆటగాళ్ళు గాని, ఒక టీమ్ కాని ఆడటం అదే మొదటి సారి.అప్పటివరకు కొత్తపల్లి టీమ్ తప్ప మరో టీమ్ ఉండేదికాదు. శ్రీరామ క్లబ్ వారు నిర్వహించిన టోర్నమెంటు విజయవంతం అవడంతో ఫైనల్ రోజున కొత్తపల్లికి చెందిన కొంతమంది ఊరి పెద్దలు వేసవికాలంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నప్పుడు క్రిస్మస్ కి ఒక టోర్నమెంట్ మీరు నిర్వహిస్తే బాగుంటుంది కదా అని నన్ను అడిగారు. ఆలోచన బాగుందనిపించడంతో అమీనాబాదకు చెందిన భూషణం, సుధీరు, సత్తిబాబు, నాగేశ్వరరావు తాతపూడి రాజేష్ అందరం ఆలోచించుకుని క్రిస్మస్ క్రికెట్ కప్ అనే పేరుమీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మొదలు పెట్టాము. 1987 మొదలుకొని 1999 వరకు ఈ క్రిస్మస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగీంది. శ్రీరామ క్లబ్ వారు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ వాళ్లు నిర్వహించడం మానేయడంతో క్రిస్మస్ క్రికెట్ కప్ (సి.సి.సి) టోర్నమెంట్ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇటు విశాఖపట్నం నుండి గుంటూరు వరకూ పేరు మోసిన క్రీడాకారులు అందరు కూడా వచ్చి టోర్నమెంట్ ఆడేవారు. టెంట్ లు నూకరాజు, షద్రక్ బాబు లాంటి వారు తక్కువ రేటుకి ఇచ్చి ప్రొత్సహించేవారు. హరినాధ్ , శేషగిరి డాక్టరుగార్లు ,బుల్గబ్బాయి రెడ్డి, కొవ్విరి చిన్న ,రైసుమిల్లు రాంబాబు వంటివారు ధనసహాయం చేసేవారు. యస్ బాబు లాంటి పేరుపొందిన ఆటగాళ్ళు వచ్చి ఆడేవారు. వీరికి భోజనాలు పేట్టేవారం. కప్ లన్నీ క్రిస్మస్ రోజున యేసూ ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చిలోనే ఇచ్చేవారం.
సిక్స్ లు , ఫోర్ లకు డబ్బులు ఇచ్చేవారం. టొర్నమెంటులో ఎంట్రీల కోసం ఎగబడేవారు. ఊళ్ళోపెద్దలు పనులు మానుకొని మరి చూసేవారు.
తాతపుడి రాజేష్ , శైలేష్ లు భ్లేజర్స్ వేసుకొని ఎంఫైరింగ్ చేసేవారు.రావు చిన్నారావుగారు,బందన రాంబాబు మరియు గ్రామ పేద్దలు బహుమతులు అందజేసేవారు.టోర్నమెంట్ మొత్తం ఆ రోజుల్లొనే వీడియోలు తీసేవారం. వర్షాలు ఉన్నట్టుండి రాత్రి మీద కురిసేసేవి. సెల్ ఫోన్లులేని కాలం కబురు చెప్పడానికి వుండేది కాదు. తెల్లవారాతే టీమ్ లు వచ్చేసేవి. మిత్రులందరం గ్రౌండులోని వర్షం నీరు బకెట్లతో తోడేసేవాళ్ళం. సత్తిపండు కొట్టు దగ్గర స్పాంజి ముక్కలు కొని నీరు తోడేవాళ్ళం. రాత్రంతా టెంటులు దొంగలు పట్టుకు పోతారేమో అని చీకట్లొ భయం భయంగానే గ్రౌండులొనే పడుకునే వాళ్ళం. ఆరోజులు గుర్తు చేసుకుంటుంటే మనసుకు ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. బలే ఙ్ఞాపకాలవి. ఉప్పాడకు క్రికెట్ ఆట జిల్లా వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చింది అనడం లో అతిశయోక్తి లేదు. చాలా మంచి మ్యాచ్ లు జరిగేవి .గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఆడేవారు. ఆ తరువాత అనేకమంది క్రికెట్ ఆటను ప్రేమించారు. ఫిషర్ మన్ పిల్లలు పిరమళ్ళ లక్మీవారాయణ, బందన సురేష్ , మల్లిబాబు టీమ్ లు తయారు చేసారు. వీవర్స్ పిల్లలు మెల్లగా ఆ వెనుకే వచ్చారు. పిచ్చుక రఘు ,జానరాజు, మల్లిబాబు టీమ్ లు తయారు చేసారు. వీళ్ళందరికి క్రిస్మస్ వస్తుందంటే పండగే. గ్రౌండు నెల రోజులపాటు ప్రాక్టీస్ లతో హొరు మోతెక్కేది. ఇప్పుడు సరదాకి కూడా పిల్లలు ఆడడం లేదు.మేము ఆడినవి ఆడించినవి కట్ బాల్స్ తోనే. ఇప్పుడు రబ్బరు బాలు, టెన్నిస్ బాలుతో ఆడుతుంటె నిలబడి చూడబుద్ధేయడం లేదు. ఆలనాటి గ్రౌండూ లేదూ ఆ ఆనాటి నాణ్యమైన ఆట లేదు. ఆ కేరింతలూ లేవు .ఒట్టి ఙ్ఞాపకాలు తప్ప.
సిద్దాంతపు బెన్ జాన్ సన్ ( జనశ్రీ )
ఉప్పాడ కొథ్తపల్లి
9908953245
|
Subscribe to:
Post Comments (Atom)
భార్య, భర్తల మధ్య వాగ్వాదాలు మామూలే. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో భార...
-
మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తప ల్లి గ్రామాలు ( జనశ్రీ) జాంథానీ చీర కట్టుకోని మగువలు, కొత్తపల్లి కొబ్బరి మామిడి తినని భో...
-
నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశు త్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు'' (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేష...
-
నీలి మేఘం (జనశ్రీ) తుషార బిందువులు కవితా సంపుటి నుండి పువ్వల్లే వికసించావు నవ్వల్లే నవ్వించావు కలలల్లే కవ్వించావు పలుకరించుమా ప...
No comments:
Post a Comment