Friday, November 4, 2022

పీర్ల పండుగ జానపదకళారూపాలు8

పీర్ల పండుగ ఓ జానపదం

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com





మొహర్రం పండుగ పీర్లపండుగతోనే మొదలవుతుంది. పది రోజుల వరకు ఈ పీర్ల పండుగ ప్రతీ పల్లె పల్లెన జరుగుతుంది. ఎక్కువగా మహ్మదీయులు నివసించే చోట జరుగుతుంది. తెలుగు వారు కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ పీర్ల పండుగలో పాల్గొంటారు. హిందూ ముస్లింల ఆత్మీయతకు చిహ్నమైనది ఈ పీర్ల పండుగ. పీర్ల పండుగ శైలిలో జనపదం మనకు కనిపిస్తుంది. అందుకే దీనిని జానపద కళగానే గుర్తించారు. పీర్లు, దేవి అమరవీరుల త్యాగానికి చిహ్నమైనది. వీటిని హిందూ ముస్లింలు ఎత్తుకుని గ్రామమంతా ఊరేగిస్తారు. దీనినే పీర్ల సంబరం అనికూడా అంటారు. పెద్దాపురం రాజుల ఏలుబడిలో అనేక శతాబ్దాల క్రితం నుండి మన ప్రాంతంలో పీర్ల సంబరాలు ఘనంగానే జరుగుతూ వస్తున్నాయి.

యజీద్ నిరంకుశ పాలకుడు పవిత్ర ధర్మరక్షణ కొరకు యజీద్ యొక్క నిరంకుశత్వాన్ని త్యాగంతో ఎదురించి నేలకొరిగిన వీర సోదరులు మహమ్మద్ ముసేస్, హుసేన్ లను గుర్తు తెచ్చుకోవడానికి పీర్ల పండుగ జరుగుతుంది. వీరు అమర వీరులుగా, అల్లా ప్రతినిధులుగా చరిత్రలో నిలిచిపోయారు. వీరు జరిపిన పవిత్ర యుద్ధాన్ని గ్రామీణుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మధ్య యుగంలో ఈ అమరవీరుల త్యాగాన్ని పీర్లును సాహేబ్లు గ్రామాలలోనికి తీసుకుపోయారు. వీరు పీర్లను ఎత్తుకుని గ్రామంలో తిరుగుతూ కుల మత బేధాలు వద్దని, ఆధ్యాత్మిక సాంతన అవసరమని జానపదులలో పాడుతూ ఉండేవారు. పీర్లు అనేవి రేకుతోగాని, వెండితో గాని చేయబడిన పవిత్ర చిహ్నాలు. వెదురుగడలకు తగిలించి ఊరేగించే పీర్లు త్రిశూలం ఆకారంలోగాని, అర్ధచంద్రాకారంలో గాని మలచబడి వెదురుగడకు తగిలించబడి ఉంటాయి. దానికి రంగు రంగులు దట్టీలు, చెమ్కి దండల వంటి వ్రేలాడదీస్తారు.

ఈ పీర్లను ఊరేగించడానికి వాయిద్యాలను కూడా వాడతారు డప్పులు, తాళాలు, షెహనాయి, లేదా సన్నాయి వాయిద్యాలు ఉంటాయి. పీర్లకు దట్టీలు కడతారు. దట్టీలు అంటే మొక్కుబడులు చెల్లించే వారు మొక్కు తీరిన తరువాత గుర్తుగా పట్టీలను పీర్లకు కడతారు. వీటికి కానుకలు కూడా సమర్పించుకుంటారు. ఈ పీర్లను ఊరేగించేప్పుడు ఎక్కువగా హిందువులే ఎత్తుకుంటుంటారు. ఎత్తుకున్న వ్యక్తి పూనకంతో ఊగిపోతూ ఉంటారు. దూదులా అని నినదించుకుంటూ అందరూ ఈ పీర్లను ఊరేగిస్తారు. ఈ పీర్లను పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువగా జరుపుకుంటారు.

పీర్లను సంవత్సరానికి ఒకసారి ఊరేగిస్తారు. పీర్లను ఉంచే చోటును కొట్టాం అని అంటారు. ఈ కొట్టం నుండి పీర్లను ఊరేగించుకుంటూ ఇంటింటికి వెడతారు. పీర్లను ఎత్తుకున్న వ్యక్తి ఆహ్వానించిన వారి ఇంటి ముందు అగి పూనకంతో ఊగిపోతూ ఇంటిలోని వారందరికి ఊదును పూస్తాడు. చంటి పిల్లలు జడుపులలో కాని ఉంటే వీపుపై అల్లాను స్మరిస్తూ ఒక దెబ్బ చరుస్తాడు. కొరులతో కొట్టుమంచి వారిచ్చే కానుకలు తీసుకొని ముందుకు కదులుతారు. పీర్లకు రూపాయి నుండి వంద రూపాయల వరకూ గుచ్చిన నోట్లను దండలుగా వేస్తారు..
ఈ పీర్ల పండు సందర్భంగా బెల్లం కూడా సమర్పించుకుంటారు. కొందరు బెల్లం నీళ్ళను నైవేద్యంగా సమర్పించుకుంటారు. రాత్రి సమయంలో పీర్ల కొట్టానికి ఎదురుగా పీర్లను ఉపవాస దీక్షతో ఎత్తుకున్న వ్యక్తి అగ్నిగుండంలో పూనకంతో నడుస్తాడు. దీనిని అల్ఫా అంటారు. ఈ రీతిగా కార్యక్రమానికి గ్రామంలోని చిన్న పెద్ద హాజరవుతారు . నిష్కలంక వీరత్వానికి గానికి గుర్తులైన దీర్ల పండుగను శతబ్దాల నుండి ఆచరిస్తున్న నపదులలోని నర్స శోధనను మనం ఈ పండుగ ద్వారా గ్రహించగలుతాము. ఈ పేర్ల పండుగలు భారతదేశంలోనే జరుగుతాయి మరెక్కడ

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...