Monday, November 21, 2022

ఆడిషన్ స్కిట్స్

 


అమ్మె  ఓ అమ్మే
ఇలా సూడే ... నీ యంకమ్మ    ఎప్పుడూ తపేలాలు తోముతూ కూర్చోవడమే కాని
పెనిమిటి పిలుస్తూన్నాడన్నా భయముందాంట
రాయె ఓపాల రాయే

ఇలా చూడు ఏం తెచ్చానో  పూలూ గాజులు
నీకిష్టమని మిఠాయి బండి దగ్గర గరకోజ్జం
ఉప్పాడ చీర  చూడు చూడు   ఎలా  ఉన్నాయి
ఆ.......ఆ ......
ఓసోస్   ఓ సోస్    నీ యమ్మ నువ్వలా సంబరపడుతుంటే   నా సామిరంగా 

అంతే కాదే  ఇదిగో చెయ్యి చాపు
చెయ్యి చాపమన్నానా  ...ఇదిగో డబ్బు

ఏంటే అలా గుడ్లప్పగించి సూత్తావ్
డబ్బూ మాతల్లి చూడు ఎలా తళతళలాడిపోతున్నాయో
ఎలా రూపరెపలాడి పోతున్నాయో
మరి ఈ రామూడంటే ఏమనుకున్నావో

ఏంటి   డబ్బెక్కడిదా  ....సంబరపడతావనుకుంటే
సతాయిత్తావేంటి
డబ్బెక్కడదని ఆడది అడగకూడదే నోరుమూస్కో
ఇంక మనం ఎద్దుల్ని అమ్మేసే పనిలేదని గంతులేయడం మానేసి  ఓ ......ప్రశ్నలేత్తావేంటే
ఓ సోస్ ....బయలుదేరిందండి వత్తాది
ఈ డబ్బుతో చేలో బోరు మరింత లోతుగా ఏసి  ఎండిన పొలం పండించుకోవచ్చే  ఇయ్యన్నీ నీకెందుకె
ఎల్లి    చల్లట్టుకురా

ఏంటి తడా  ...... ఎక్కడ
తడీ లేదు గిడీ లేదు   నోరుమూసుకోమన్నానా
ఓస్ ఊరుకేవే.... గట్టిగ అరవమాకే అమ్మత్తాది

రక్తమా......రక్తమెందుకుంటాది
నీకు పిచ్చట్టింది.....
ఏంటి.....సూపియ్యాలా
ఊహు చూపియ్యాను నేను చూపియ్యను
ఇదిగో ఉండమన్నానా
ఇదిగో ఉండు  
చూడోద్దే ........చూడోద్దే..............
అలా నెత్తునోరు బాదుకోకే
చెపుతాను అంతా చెపుతాను 
నాకు ఎద్దులంటే ప్రాణమే ఆటితోనే పెరిగినాను
ఆటితోనే ఆడుకున్నాను  నా అయ్య చచ్చిపోతే అవే తండ్రిగా అనుకుని నాన్న నాన్నా అంటూ ఆటిని పిలుస్తూ పెరిగానే

ఇంటిలో అందరూ ఆటిని  అమ్మేసి  పొలంలొ  బోరు ఎద్దామంటే
చచ్చినంత పనైయ్యిందే  చచ్చినంత పనయ్యింది
అందుకే......అందుకే   పట్నంపోయి
పట్నం పోయి  కిడ్నీ  అమ్మేసానే
కీడ్నీ అమ్మేసాను



2


ఎల్దారి ఎల్దారి

ఆ కోటిగాణ్ని చెట్టుకు కట్టి కుక్కను కొట్టినట్టు కొడితే కాని ఆడికి బుద్దిరాదు

ఏంటి ఆడిని కొట్టలంటే ఆడు తప్పే చెయ్యాలేంటిరా

నేను కాలక్షేపానికైనా కొడతాను

ఇది నా రాజ్యం 

ఊరుని నేను దోచుకుతింటున్నానని

ఊరులో కారుకూతలేవో కూసాడట

అది చాలదు ఆడ్ని తన్నడానికి

నేను సర్పంచ్ ని సర్పం అంటే పాము

పంచ అంటే ఐదు అంటే ఐదు తలల పామునన్నమాట

ఈ ఊరుభారన్నంతా నా తలమీద పెట్టుకుని మోత్తఉంటే

గద్దెలాగ ఊరిమీద పడి మేస్తున్నానంటాడా




దొంగ 
అక్కా  అక్కా 
ఏంటక్కా గురుతట్టలేదేంటి నేను
కిట్టుగాణ్ని
నేనేం చేత్తనాన
చట్టలని గౌరవించే పనిచేత్తున్నానక్కా
చట్టూ వందలమంది పోలీసు పహారాతో
ఉంటాను
పొద్దుట టిఫిను మధ్ధేన్నం భోజనం ఏటి రాత్రి భోజనం  అంతా ప్రభుత్వ ఖర్చులే
అబ్బబ్బ   చెప్పలికానక్క  చుట్టూ ఎత్తైన గోడలు
సూరుడు కాని చంద్రుడు కాని కనబడకుండా ఎత్తైన గోడలు
అందులో ఓగది గదిలో కాలుమీద కాలేసుకుని
భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే నాపని
ఇదిగో నిన్ను చూడలని వచ్చినోలేదో
వంద మంది పోలుసులు నా వెనక ఒకటే పరుగులు

అబ్బబ్బా నా సోది వినడం ఆపి
కాస్త హార్లిక్స్ కలుపుకురాక్క



No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...