రచన రంగవల్లులు RACHANA RANGAVALLULU

JANASRI

Wednesday, January 15, 2020

మా ఊరి కథలు 2 ( జనశ్రీ ) మా ఊరి నవాబు నాగూర్

మా ఊరి కథలు 2 ( జనశ్రీ )

మా ఊరి నవాబు నాగూర్

                     1950 ప్రాంతంలో ఉప్పాడ  సముద్రం హోరు ఎలా వుండేదంటే  ఇంటిలోనే కెరటం విరిగి పడిందా అనేంతగా వుండేది. క్రొత్తగా పొరుగూరు నుండి వచ్చిన చుట్టాలు ఆ శబ్దానికి హడలిపోయేవారు. ఎందుకంటే ఆరోజుల్లో చాలా నిశ్శబ్దంగా  ఉండేది ఊరంతా. వాతావరణ కాలుష్యం కానీ      శబ్ద కాలుష్యం గానీ ఉండేది కాదు. అందువల్ల కెరటాల చప్పుడే కాదు పిఠాపురం పేసింజరు రైలు కూత కూడా వినబడేది ఉప్పాడ వరకూ. ఉప్పాడ ఊరు నిండా తాటాకులు ఇళ్ళు ఉండేవి. అక్కడక్కడ  మాత్రమే బంగ్లా ఇళ్లు ఉండేవి.  మత్స్యకారులు అందరూ  పెద్దగా  సంపాదన లేకుండా  పేదరికంలోనే ఉండేవారు ఆ రోజుల్లో.




గంపల అప్పయ్యమ్మ, భూలోక మ్మ ఉప్పు చేపల వ్యాపారం చేసేవారు ఉప్పాడలో.  ధవళేశ్వరం, నక్కపల్లి ప్రాంతాలలో ఉప్పు చేపలు , ఎండు చేపలు పట్టుకెళ్లి వ్యాపారం చేసేవారు. వీళ్ళ కొడుకు గంపల అప్పారావు  గంపల అప్పారావు కు ఒకే ఒక్క కొడుకు నాగూరు .  ఇతనే మన కథా నవాబు .

తెల్లటి మల్లె పువ్వు లాంటి బట్టలు వేసుకుని మెడలో బంగారం గొలుసు, రెండు చేతులకూ ఉంగరాలు , నోట్లో రెడ్ హిల్స్  సిగరెట్  , అల్లంత దూరం వినబడే జావా బండి హారన్ ఉప్పాడ రోడ్డు మీద 1960 ప్రాంతంలో నాగూర్ హవా  పరిగెత్తింది.  ఉప్పాడలోని వారందరూ  నాగూర్ ని సెలెబ్రేటిగా చూసిన రోజులవి. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ ఆ రోజుల్లో  గంపల నాగూర్ .
ఉప్పాడ చేపల వ్యాపారానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చింది నాగూర్ అంటే ఎవరూ కాదనలేని సత్యం.
చిన్న చిన్న  ఉప్పు చేపలు,ఎండు చేపల వ్యాపారం చేసుకునే మత్స్యకారులుకు రొయ్యల వ్యాపారం నేర్పి ఉప్పాడ మత్స్యకారుల జీవితదశాదిశలను మార్చిన గొప్ప వ్యాపారి  నాగూరు.  ఉప్పాడ నుండి సీతారామాంజనేయ బస్సు సర్వీస్ , అలాగే ఎల్లాజి బస్సు సర్వీస్  లు ఉప్పాడ రొడ్లమీద దుమ్ము రేపుకుంటా కాకినాడ పోయిన రొజులవి. వాటిమీద కాకినాడ వెళ్ళి ఉప్పు చేపలు ,ఎండు చేపలవ్యాపారం చేసిన నాగూర్ కి పూరిలోని సాంబాబు (య.స్ . ఆర్ .సి చౌదరి ) రొయ్యల వ్యాపారంలోని కిటుకులన్ని నేర్పాడు. నాగూరు పిఠాపురం రైల్వే స్టేషన్లో బొగ్గు ఇంజను పై నడిచే పేసింజరు రైలు ఎక్కి తెల్లారేక పూరిలో దిగేవాడు.  నాగూరు జట్టీలు ఇక్కడనుండి కొన్ని తెరచాపనావల్లో  సరుకులు నావల్లో నింపుకుని సముద్రం మీద 5 నుండి 10 రొజుల్లో పూరి చేరుకునేవారు. సాంబాబు(య.ఆర్ .సి చౌదరి ) బర్ఫ్ నుండి మద్రాసు,కలకత్తా నగరాలకు 40 కౌంటు రొయ్యలు ఎగుమతి అయ్యేవి. అవి నాగూరుకు చెందిన నావల్లో పడ్డావే ఎక్కువ ఉండేవి. నాగూరు ప్రక్కనే దాసరి బంగారయ్య, సూరాడరాజారావు, చొక్కా సత్తిబాబు వుండేవారు. మంచి మిత్రులు కూడా.నాగూరు సరదాలన్నీ వీళ్ళతోనే. పూరిలో వేటగాళ్ళు చేపలవేటకు పోయి వచ్చే వరకూ స్నేహితులలో పేకాటలో గడపడం, అప్పుడప్పుడూ మెడ్కాల్ బ్రాంది తో పార్టీ చేసుకొనేవాడు. పార్టీల్లో పావురం వేపుడు మందులో నంజుకు వుండవలసిందే. ఇలా అక్టోబరు నుండి జూలై వరకు పూరీలో వుండి వస్తువుండేవాడు. అలా 10 సంవత్సరాలు పూరీలో వ్యాపారం జరిగింది.
ఉప్పాడ వస్తే జావా లేదా బుల్లెట్ పై స్నేహితులను తీసుకుని కాకినాడ సినిమాలకు పోయేవాడు మన నాగూరు.
ఉప్పాడలో చిన జజారు చివరన బర్ప్ పెట్టి  మద్రాసుకి , కలకత్తాకు  40  కౌంటు రొయ్యలు ఊప్పాడ నుండే  ఎగుమతి వ్యాపారం ప్రారంబించాడు. ఆ తరువాత ఇంటిదగ్గరే బర్ప్ పెట్టాడు. వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. పెద్దబ్బాయి కిళ్ళికొట్టు వీధి చివర భూలోకమ్మ భవనం అనే పేరు మీద మేడ కట్టాడు. దానినే ఆ తరువాత ఊరోళ్ళందరూ నాగూరూ మేడ అనేవారు. చీపూరు బుల్లబ్బాయి పొలం దగ్గర నాలుగెకరాలు  భూమి కొన్నాడు. డబ్బులు చేతిలో బాగా ఆడడంతో ఐసు ప్యాక్టరీ కట్టాలనుకున్నాడు. ఎందుకంటే అప్పటివరకూ ఐసు అనాకాపల్లి లేదా పూరీలనుండి లారీల్లో తెచ్చుకునేవారు. ఓ ప్రక్క చిన్న చిన్న వ్యాపారులు పుట్టుకురావడంతో ఐసుకు ఉప్పాడలో  డిమాండ్ ఏర్పడీంది.
 ఐసు ప్యాక్టరీ కడదామనుకునేలోగా సినిమా థియేటర్ అయితే బాగుంటుందని మిత్రుల దగ్గర నుండి ఉప్పు అందడంతో ఉప్పాడలో శ్రీనివాస థియేటర్ కు రాయి పడింది. మిత్రులమధ్య పొరపొచ్చాలతో ఆ ప్రక్కనే ధనరాజు థియేటర్ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరిగాయి.
ఏదైతేనో నాగూరు సినిహాలు టూరింగు టాకీస్ గా
ప్రారంబమయ్యింది 1974 లో. మొదటి సినిమా కన్నడ కంఠీరవ  రాజ్ కుమార్ శ్రీ కాళహస్తి మహత్యం.
నాగూరు జీవితంలో విలాసాలు ఓప్రక్క దానధర్మాలు ఓ ప్రక్క ఎలా చెప్పుకునే వారికి అలాగ ఓ వెలుగు వెలిగింది. నాగూరు పేరు మోత మోగింది ఉప్పాడ చుట్టు ప్రక్కల.నాగూరుకు చిన్నాన్న కొడుకు  గంపల రమణ అయినా ఒకే తల్లిబిడ్డలుగా కనిపిస్తారు ఊళ్ళో వాళ్ళకు.

ఇలా పట్టిందల్లా బంగారం తరుణంలో నాగూరు  ఒక ఆపదొచ్చి పడింది.  నాగూరుకి ఇద్దరు అబ్బాయిలు ఉమ ఒక్కగాని ఒక అమ్మాయి. ఉమపుట్టిందే కాని టి.బి మహ్మమ్మారి పీక్కుతినేసింది.  జబ్బు నయంకావడానికీ తిప్పని చోటూ లేదూ వెళ్ళని నగరమూ లేదు. చివరకి 4 సంవత్సరాలప్పుడు చనిపొయింది ఉమ.  తన పొలంలోనే  ఉమ నిలువెత్తు బొమ్మ చేసి ఆలయంలా కట్టి మనోవేదన తగ్గించుకుంటానికి ప్రయత్నించాడు మన నవాబు నాగూరు. ఆ రోజుల్లొ అదో సంచలనం గుడి కట్టడం.

జల్సా జీవితం గడుపుతున్న నాగూరిని ఈ సంఘటన క్రుంగదీసింది. మెడ్కాల్ బ్రాంది , రెడ్ హిల్స్ సిగరెట్టు దగ్గరకు చేరడం ప్రారంబమయ్యింది. ఇంతలో దివిసీమ ఉప్పెన బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేసేసింది. ఉప్పాడ ప్రాంతంలో రొయ్యల పడేవి కావు. వ్యాపారం సన్నగిల్లింది.
200 తెరచాప పడవులు ,వేటగాళ్ళను ఒక్కక్కరికీ 5000  జీతం ఇచ్చి పూరీలో రొయ్యల వేటకు బయలు దేరాడు.
పూరీ లోను సేమ్ సీన్ రొయ్యలు లేవూ  వ్యాపారమూ లేదు. అప్పులు చేసి వేటగాళ్ళ జీతాలు చెల్లించ వలసి వచ్చీంది. ఉన్నది ఊడ్చుకుపోయింది.



వేటగాళ్ళమీద 7 లక్షలు వదిలేయవలసి వచ్చింది. నాగూరు
మెల్లగ మెడ్కాల్ బ్రాందికీ, రెడ్ హిల్స్ సిగరెట్లకు బానిసయ్యూడు. రోగాలు మీదపడంతో అన్ని మాని
గతఙ్ఞాపకాలతో తన మేడలోనే నివసిస్తూ  ఉన్నాడు మన తొలి ఉప్పాడ సెలబ్రెటీ.

సిద్ధాంతపు బెన్ జాన్సన్ (జనశ్రీ)
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
at January 15, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, January 14, 2020

చిన్నప్పటి నా అల్లరి కథ

*చిన్నప్పుడు నేను చేసిన అల్లరి పని*

 క్షవరం చేసుకోవాలంటే ఇప్పటిలా క్షౌరశాలలు ఉండేవి కాదు మన చిన్నప్పుడు.  మంగలి ఇంటికి వచ్చి క్షవరం చేసేవాడు.
  ఒక రోజు ఇలాగే మా దగ్గర బంధువు మంగలిని పిలిచే క్షవరం చేసుకుంటూ ఉన్నాడు. చిన్నప్పుడు సెలవు వచ్చిందంటే ఎదురు బద్దకు పురుకూస కట్టి విల్లు తయారు చేసుకునే వాళ్ళం. జబ్బలకు విల్లు తగిలించుకుని  చేతిలో చీపురు పుల్లలు బాణలుగా పట్టుకుని  అటూ ఇటు ఇటూ వేస్తూ ఆడుకునేవాళ్ళం. అలా నేను బాణాలు వేస్తూ వేస్తూ క్షవరం చేయించుకుంటున్న వ్యక్తి వీపుకు గురిచూసి బాణం వదిలాను. అంతే చురుకున్న గుచ్చుకుందేమో ఆ వ్యక్తి కెవ్వున కేక పెట్టాడు.  అతని ఊపుకు పాపం మంగలి వెన్నక్కి పడ్డాడు. ఈ తతంగమంతా దూరం నుండి చూస్తున్న నేను నా ప్రక్కనున్న పిల్లలం వెన్నక్కి చూడకుండా పరుగెత్తి  పరిగెత్తి పారిపోయి సాయంత్రంవరకూ ఊరిబయట గడిపి చీకటి పడిన తరువాత  ఇంటికి చేరుకున్నాం. తెల్లవారేక అందరం కలసి మెల్గగా క్షవరం చేయుంచుకున్న వ్యక్తి ఇంటి పరిసరాలలో కొంత సేపు తచ్చాడాం. గొడవ ఏంలేదని నిర్దారించుకుని  దూరంగా పోయి పగలబడి నవ్వుకున్నాం. అప్పుడప్పుడూ అందరం కలసి నప్పుడు ఈ సరదా సంఘటన తలుచుకుని నవ్వుకుంటూఉంటాం
at January 14, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్

క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్ భారతదేశం నుండి పారద్రోలతాయనడం అనడం ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం.
క్రైస్తవులలో ఉన్న ఈ నమ్మకం అతి పెద్ద అపోహ. దీనిని దైవ సేవకులు వాటేసుకోవడం ఇందులో అతి పెద్ద ట్విస్ట్.

ఈ భారతదేశం నుండి క్రైస్తవ మతాన్ని హిందూ సమాజం ఎన్నటికీ పారద్రోల లేదు. క్రైస్తవ మతం హిందూ సమాజానికి ఒక వరంవంటిది. ఇప్పుడున్న పెద్ద ఆర్థిక రంగాలు, పరిశ్రమలన్నీ హిందూ సమాజం ఆక్రమించుకుని ఉన్నాయి. ఆ రంగాలలోనికి వెళ్లడానికి క్రైస్తవమతం అనుమతించడం లేదు. అది అతిపెద్ద పాపంగా బోధిస్తూ ఉంటారు దేవాలయాల్లో. అది హిందూ సమాజానికి వరంగా మారింది. క్రైస్తవమతాన్ని ఆదరించేది భారతదేశంలో అత్యధిక శాతం షెడ్యూల్డ్ కులాలవారు. ఈ బహుజనులు అందరూ క్రైస్తవమతం స్వీకరించడం వల్ల అనేక రంగాలలోనికి వీరు ప్రవేశించలేకపోతున్నారు.  ఉదాహరణకు అత్యంత ఆకర్షణీయమైన మైనటువంటి ఆర్థికరంగాలు  సినిమా, టెలివిజన్, మీడియా, సంగీతం, నాట్యం, రచనరంగం, నాటకరంగం, వ్యాపారరంగం (మద్యపానం,),. ప్రస్తుతం ఈ రంగాలు భారతదేశంపై అత్యంత ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ రంగాలు రాజకీయాలపై కూడా అత్యంత ప్రభావాన్ని చూపుతున్నాయి. షెడ్యూల్డ్ కులాలకు ఈ రంగాలలో బలమైన వ్రేళ్ళు లేక రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం దుర్లభంగా మారింది. టెలివిజన్ చానళ్ళు వచ్చాయి అవేం చెపుతున్నాయి క్రైస్తవ భోదనలే. టెలివిజన్ ఉన్నా దళితులకు వనగూరేదేముంది.

క్రైస్తవ మతం బోధిస్తున్న లేదా నిరోధిస్తున్న కొన్ని బోధనలు

ఇహలోక సంబంధమైనవాటికి అంత ప్రాధాన్యత లేదు పరలోక రాజ్యానికి సంబంధించినది మాత్రమే ప్రధానమైనది .
సినిమా ,నాటకం ,టెలివిజన్, నృత్యం చేయడం ,పాటలు పాడటం, ఏదైనా క్రైస్తవుడి తలాంతులు అన్నీ దైవ సేవకే వాడబడాలి. పైవన్నీ సాతాను క్రియలుగా దైవజనులు భోధిస్తువుంటారు.
ఈ అంశాలతో షెడ్యూల్ కులాలవారిని క్రైస్తవ మతం  బాహ్య ప్రపంచంలోనికి వెళ్లనీయకుండా నిరోధిస్తూ  ఉన్నాయి.
కానీ ఏ క్రైస్తవుడు సినిమాలు చూడకుండా ఉండటం లేదు, , టెలివిజన్లో వచ్చే కార్యక్రమాన్ని చూడకుండా ఉండటం లేదు, మద్యపానం తాగకుండా ఉండటం లేదు,
సిని హీరో వెనకాల వీళ్లు ప్రచారసభలకు పరిగెత్తకుండా ఉండటం లేదు , రాజకీయ రంగాలగురించి మాట్లాడకుండా ఉండడం లేదు, సినిమా పాటలపై పేరడీలు వాడుకోకుండా ఉండడం లేదు, అన్ని క్రైస్తవ సమాజం పరోక్షంగా వీటిని  అనుసరిస్తుంది, వీక్షిస్తున్నది కూడా.
బయట రంగాలలో రాణించటానికి సరిపడిన విద్వత్తును స్వీకరించడానికి క్రైస్తవమతం షెడ్యూల్ కులాలవారికి అడ్డుగా నిలుస్తుంది. సంగీత రంగంలో ఇప్పుడున్న గాయకులకు తీసిపోని విధంగా క్రైస్తవ సంగీతంలో పాటలు పాడే మహాగాయకులు ఉన్ననూ వారు దేవుని స్తుతించుచూ పాటలు పాడడానికి పరిమితం కావడం వల్ల  సినిమా పరిశ్రమ హిందూ సమాజానికి మాత్రమే పరిమితమై వారు ఆర్థిక బలోపేతం కావడానికి తోడ్పడుతుంది. ఆర్దిక స్దొమతుకలిగిన కళాకారులు  ప్రజాప్రతినిధులుగా నెగ్గుతున్నారు.అదే క్రమంలో క్రైస్తవ మతం షెడ్యూల్డ్ కులాల దీన పరిస్థితికి అడ్డుగోడగా నిలుస్తోంది.ఇది కాదనలేని సత్యం. అయితే విదేశాలనుండి ఎంతో సహయాన్ని ఇస్తున్నాం అంటూ వాదిస్తారు. కాని గ్లామర్ ప్రపంచానికి తద్వారా రాజ్యాధికారానికి దూరం చేస్తున్న సంగతిని దాచెస్తారు.
అద్భుతమైనటువంటి నాట్యం చేసే కళాకారులు ఎందరో ఉన్నారు వారి నాట్యం క్రిస్మస్ సందర్భాలలో మాత్రమే ఉపయోగపడేలా క్రైస్తవ మతం వాడుకుంటుంది, ఎదగనీయకుండా  నిలువరిస్తుంది. అత్యధికంగా ఆర్థిక వెసులుబాటు కల్పించే రంగాలలోనికి వెళ్లడానికి తలాంతులు ఉన్ననూ వెళ్ళలేని పరిస్థితి షెడ్యూల్డ్ కులాలకు  ఈ క్రైస్తవ మతం అడ్డుగా ఉన్నది. అద్భుతమైనటువంటి రచయితలు ఉన్ననూ ఇవి దేవుని పాటలు ,దేవుని వాక్య వివరణ గ్రంధాలు రచించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఒక్క సినిమా పాట రాసే సినిమా రచయితకు ఒక్కపాటకు 12  లైన్స్ రాస్తే పాట ఒక్కంటికీ  మూడులక్షల రూపాయలు రెవెన్యూ మా రేషన్ అందుకుంటున్నారు. అటువంటి ఆర్థిక వెసులుబాటును షెడ్యూలు కులాలు కోల్పోతున్నారు. సినీ నటుడిగా వెళ్లి   పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఆ పేరును ఉపయోగించి రాజకీయ రంగంలో స్థిరపడిన అగ్రకులాలను  మనం చూస్తూనే ఉన్నాం మరి క్రైస్తవులు అయినటువంటి షెడ్యూల్డ్ కులాలవారు అటువంటి సినిమా నటుడికి జేజేలు పలుకుతూ వారి వెంట పరిగెడుతున్న  సంఘటనలు చూస్తూనే ఉన్నాం. దళితులను వారిని  ఎదగనీయకుండా క్రైస్తవ మతం అడ్డుగోడగా నిలుస్తుంది. మద్యపానం వ్యాపారంలో కోటానుకోట్ల రూపాయల రాబడి ఉంటుంది అగ్రకులాలు హిందూ సమాజం ఈ వ్యాపార రంగంలోనికి చొరబడి కోటానుకోట్ల రూపాయలు సంపాదించి ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని పొందుతువుంది. క్రైస్తవ మతం షెడ్యూల్డ్ కులాలవారిని ఈ రంగంలోనికి వెళ్లనీయకుండా అడ్డుగోడగా నిలుస్తున్నది. తద్వారా బలమైన సామాజికవర్గంగా దళిత క్రైస్తవులు ఎదగలేకపోతున్నారు.
దూరదర్శన్ వంటి ప్రభుత్వ టీవీ చానల్స్ లో ప్రవేశాలకు అర్హతలేని పరిస్దితి షెడ్యూల్డ్ కులాలకు ఉన్నది. కానీ అన్ని తలాంతులు కలిగినటువంటి ఈ యొక్క కులాలు క్రైస్తవ మతం స్వీకరించడం వల్ల ఆధునిక ప్రపంచంలో బహుజనులగానే మిగిలిపోతున్నారు. బలమైన సామాజిక వర్గంగా రూపొందలేకపోతూ ఉన్నారు.ఈ దేశాన్ని నడిపించేటటువంటి రాజకీయరంగంలో ఎదగాలంటే పై రంగాలలో షెడ్యూల్డ్  కులాల వారు విస్తృతంగా ప్రవేశించి వలసిన అవసరం ఉంది. కానీ క్రైస్తవ ఆలయాలు వీరికిఅడ్డుగోడగా ఉన్నాయి.
కానీ క్రైస్తవ సమాజం , క్రైస్తవ మత బోధకులు  ఇలా అంటూవుంటారు  హిందూ సమాజం, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు క్రైస్తవ మతాన్ని భారతదేశంలో లేకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నాయని గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి క్రైస్తవ మతం మరీ ఎదగనీయకుండా  చేయడానికి అప్పుడప్పుడు ఈ బిజెపిలాంటి పార్టీలు నిధులు రాకుండా నిరోధిస్తున్న మాట వాస్తవమే అయినా అవి పైకి కనపడకుండా నిరోధించడానికి చేస్తున్న  ప్రయత్నాలే  తప్పించి క్రైస్తవ మతాన్ని ఈ భారతదేశం నుండి వెళ్లగొట్టడానికి వాళ్ళకి ఎంత మాత్రము కూడా ఇష్టముండదు. ఎందుచేతనంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి అనేక రంగాలలో షెడ్యూల్డ్ కులాలవారు లేని సంగతి వారికి నిక్కచ్చిగా తెలుసు. అందుచేత క్రైస్తవ మతాన్ని గాని ఒకవేళ భారతదేశం నుండి పంపినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ కులాలవారు హిందూ సమాజంలోని హిందువులుగా ప్రవేశించి పై రంగాలను కబ్జా చేసే శాసించే పరిస్థితి ఉన్న సంగతి అగ్రకులాలైన హిందూసమాజంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎప్పటికీ  హిందూ సమాజం క్రైస్తవ సమాజాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నించదు, క్రైస్తవసమాజం ,క్రైస్తవ సమాజంలోని బోధనలు హిందూ సమాజానికి ఒక వరం వంటివి.
క్రైస్తవ సమాజం షెడ్యూల్డ్  కులాలు ఉద్ధరించిన మాట వాస్తవమే అయినా ఓప్రక్క మరలా కొన్ని నిబంధనలు పేరు చెప్పి ఆదే క్రైస్తవ సమాజంలోనే కొట్టుమిట్టాడేలా చేయడం ఇక్కడున్న ప్రధానమైనటువంటి లోపం. ఆధునిక సమాజంలో భారతదేశ రాజ్యాధికారాన్ని చేరుకోవడానికి షెడ్యూల్డ్ కులాలవారికి వారి ఓట్లను వారు వేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేకపోవడానికి కారణం గ్లామర్ గ్లామర్ ప్రపంచం. అగ్రకులాల వారి ఓట్లను పొందలేక పోవడానికి కారణం  షెడ్యూల్డ్ కులాలలో అగ్ర కులాలను ఆకర్షించే గ్లామర్ వ్యక్తులు లేకపోవడం. గ్లామర్ ఎలా వస్తుంది గ్లామర్ ప్రపంచంలో వుంటే. కాని దళితులకు వారి మతం పాపం అని భోధిస్తుంది.నిజానికి గ్లామర్ అనేది  కులాలకు సంబంధం లేకుండా ప్రతిభను బట్టి విద్వత్తును బట్టి సంపాదించుకునే వ్యక్తిగతమైనది. ఇందులో ప్రస్తుతం క్రికెట్ , భారతదేశంలో సినీ , టెలివిజన్, మ్యూజిక్ , నాట్యం, నటన , దర్శకత్వం, రంగాలు రాజ్యమేలుతున్నాయి.  ఇటువంటి పరిస్దితిని షెడ్యూల్డ్ కులాలువారు అర్థం చేసుకున్నప్పుడు సాధ్యం అవుతుంది.
షెడ్యూల్డ్  కులాలవారు భారతదేశ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే అగ్రకులాలవారు కూడా వీరి వెంట పరిగెత్తే పరిస్దితి తెచ్చుకోవాలి. ఆ పరిస్దితి గ్లామర్ రంగానికి వుంది. నూటికి 90 మంది క్రైస్తవులు అయినటువంటి షెడ్యూల్డ్ కులాల వారు క్రైస్తవ మతం స్వీకరించడం వలన
దానికున్న కట్టుబాట్లను బట్టి ఈ గ్లామర్ ప్రపంచంలోనికి రాలేక అధికారాన్ని రాజ్యాధికారాన్ని కోల్పోతున్న మాట ముమ్మాటికీ వాస్తవం. అక్కడక్కడ రిజర్వేషన్లు ఫలితంగానే వ్యక్తిగత మైనటువంటి వ్యక్తిగత పలుకుబడితో ఒకరిద్దరు  రాగలిగినప్పటికీ  రాజ్యాధికారాన్ని, అగ్రకులాలు లేదా హిందూ సమాజానికి సంబంధించిన ఓట్లను కొల్లగొట్టడానికి  క్రైస్తవమతం అడ్డుగోడగా నిలుస్తుంది.
కానీ వాస్తవాన్ని మరిచి దళితులైన మమ్మలన్నీ ఇతరులు చిన్నచూపు చూస్తున్నారని ,దళితులను ఓట్ల బ్యాంకుగా చూస్తున్నారని, దళితులు ఎప్పుడూ కూడా అగ్రకులాలు నిర్మించే సినిమాలు చూస్తూ వారికి జేబులు నింపే వారిగా ఉన్నారని నిందలు వేస్తూ ఉంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి క్రైస్తవ మతమే హిందూసమాజానికి ఒక వరమైన ఉన్న సంగతిని వీరు గ్రహించకపోవడం దురదృష్టకరం.  అమెరికా, లండన్ వంటి దేశాలలో ఇటువంటి రంగాల్లో ఉన్న వారందరూ  క్రైస్తవులే అయినప్పటికీ కూడా గ్లామర్ ప్రపంచంలో వుంటారు. హాలీవుడ్ సినీపరిశ్రమ అంతా కూడా క్రైస్తవులే.ఇక్కడ  క్రైస్తవులు బిజెపి వచ్చేసింది, ఆర్. ఎస్.ఎస్  ఉందీ క్రైస్తవ మతాన్ని  భారతదేశంలో లేకుండా చేసేస్తారని అంటూవుంటారు అది వాస్తవమేనా? క్రైస్తవదేశాలలో వృత్తులు వృత్తులుగా చూస్తారు. మతాన్ని మతంగా  చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవమత బోధకులు , ,క్రైస్తవ దేవాలయాలు షెడ్యూల్డ్  కులాలవారిని  వాక్య నిబంధనలు పెట్టి షెడ్యూల్డ్ జాతిని ఎదగనీయకుండా చేస్తున్న సంగతి బాధాకరమైన విషయంగా తోస్తుంది.  మేధావి వర్గం  ఏమీ చేయలేని పరిస్దితి .
క్రైస్తవులైన షెడ్యూల్డ్ కులాలవారికి ఇది విచిత్రమైన పరిస్దితే. అంబేద్కర్ వంటి మహనీయుడు క్రైస్తవమతం స్వీకరించకపోవడానికి  మూడమైన క్రైస్తవ నిభందనలు కూడా ఒక కారణం కాదా? .  అంబేద్కర్ క్రైస్తవ మతం స్వీకరించి వుంటే ప్రతీ చర్చిలో అతను దేవుడుతో సమానంగా కొలువుతీరేవాడని వ్యాసకర్తతో అనేక మంది చెప్పడం తెలుసు.కాని క్రైస్తవమతం ఇహలోకమైన వాటికి ప్రాధాన్యతను ఇవ్వనప్పుడు దళితుల బాదలు ,రాజ్యాధికారం ఎలా సాధ్యమతుందనుకుని అంబేద్కర్ బౌద్దమతం స్వీకరించాడు.
క్రైస్తవమతస్తులైన షెడ్యాల్డ్ కులాలవారు ఓ అడుగుముందుకేసి  అగ్రవర్ణాలవారిగా భావించుకుని అనేకచోట్ల మసలుతూ వుండడం  బావదారిధ్యం. ఏదిఏమైనా దళితులకు రాజ్యాధికారం , ఆర్ధిక ప్రగతి రాకుండా చేయడానికి హిందూ సమాజం క్రైస్తవ మతాన్ని తప్పక ప్రోత్సహిస్తుంది.
అందుచేత క్రైస్తవులందరికీ క్రైస్తవమతాన్ని భారతదేశం నుండి రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం భోధకులు చేస్తున్న తప్పుడు ప్రచారమే.దళితులు అణగారినవర్గాలుగా ఉంటేనే అగ్రవర్ణాలు మనగలుగుతాయి అందుకు క్రైస్తవమతం తప్పనిసరి .లేదంటే అత్యంత ప్రతిభావంతులైన దళితులు గ్లామర్ రంగాలను శాసించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోగలుగుతారు.






    
at January 14, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, January 10, 2020

జాన్ ..పద గీతం( జనశ్రీ)


జాన్ ..పద గీతం( జనశ్రీ)
తాంబరికాయ తమ్మయ్య
తుమ్మెదంటి తుంటరోడే
తమలపాకు చూడంటూ
దురదాకు పామాడే
తాంబరికాయ తమ్మయ్య
తుమ్మెదంటి తుంటరోడే
తమలపాకు చూడంటూ
దురదాకు పామాడే
తాంబర కాయ మీటుకుంటూ
తనువును పొడిచాడు తూట్లు తూట్లు
గుళ్లో గుంచం పాట అంటూ
గుండెకు పెట్టాడు గాట్లు గాట్లు
వాడి పాటంటే పసిపిల్లల పరికిణీ వేస్తది
వాడి జంగాలమ్మ పాటంటే
జనమంతా నవ్వలేక  పాట్లు పాట్లు
మంచాలమ్మ పాటంటే 
మనసుకైన వేస్తాడే మాట్లు మాట్లు
వాడి పాటవింటే
పావురాలు పాపిడిలే తీస్తాయి
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా
వాడి జంగాలమ్మ పాటంటే
జనమంతా నవ్వలేక  పాట్లు పాట్లు
మంచాలమ్మ పాటంటే 
మనసుకైన వేస్తాడే మాట్లు మాట్లు
వాడి పాటవింటే
పావురాలు పాపిడిలే తీస్తాయి
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

కిలం......కిలం......కిలం( జన శ్రీ)


కిలం......కిలం......కిలం( జన శ్రీ)
భవిష్యత్తు అంతా బూడిదల్లే ఎగిరితే
ఆ మేఘం ఎందుకు కలుపుకోదు?
ఆ మెరుపులు ఎందుకు పలకరించవు?
ఆ ఉరుములకెందుకు అంతా విసుగు ?
ఏ శరాఘాతానికో  కన్నీటి కుండ 
బళ్ళున  బద్దలయితే
ఆ నీటినిఎందుకు కడలి కలుపుకోలేదు ?
ఆ కన్నీటిని ఎందుకు కాలువ ముట్టుకోదు ?
విషపు  చినుకుల్లో హృదయపు అద్దం తడిసిపోతుంటే ఎంత తుడిచినా
చినుకులు ఆగవేమీ ?
ముచ్చెమటల్లో గుచ్చుకున్న ముళ్ళలా
ప్రతి ఉదయం
చిద్రమైనహృదయంలా .......
ఏ గొంతో పిసికిన రాగంలా.......
పగిలి పోయిన దీపపు చిమ్నీలా.......
కిలం....కిలం....హృదయాలన్నీ కిలం....కిలం....కిలం
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245(
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

ప్రేమ రథం (జనశ్రీ)


ప్రేమ రథం (జనశ్రీ)
తుషార బిందువుల కవితా సంపుటి నుండి
ప్రేమ రథము కదిలించగా రావా
మనసారా నడిపించగా రావా
ఓ మంచు తునకా అపరంజి నాయక
ఎద ముంగిట ముచ్చటగా మెరిసేముత్యాల ముగ్గులు ముసిముసిగా నవ్వక ముందే
నీలిమబ్బుల చాటున తెల్లగ మెరిసే మెరుపులు
కసికసిగా నవ్వక ముందే
మనసారా నడిపించగరావా
మన ప్రేమ రథం కదిలించగ రావా
బాధలన్నీ ఓర్చి పూల బండిని తెచ్చా
అది నడిచే దారిలో పూబంతులు పరిచా
మల్లెమాలలే కళ్ళెంగా
గులాబీలే గుర్రాలుగా నడిచే
మన ప్రేమరథం కదిలించగా రావా
మనసారా నడిపించరావా
తుషార బిందువు లు కవితా సంపుటిని ప్రముఖ సాహితీ వేత్త ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల మహాసభలలో ఆవిష్కరించారు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

నీలి మేఘం (జనశ్రీ)


నీలి మేఘం (జనశ్రీ)
తుషార బిందువులు కవితా సంపుటి నుండి
పువ్వల్లే వికసించావు
నవ్వల్లే నవ్వించావు
కలలల్లే కవ్వించావు
పలుకరించుమా ప్రతి పుష్పమా
నా నింగిలో నడిచే
నిర్మల నీలి మేఘమా
చిగురించిన చిగురుటాకు పై
చినుకువై రాలిన హిమబిందా
మనసునే మెలి పెట్టావు
తీపి గురుతులకు ముడిపెట్టావు
ఒక క్షణం హృదయ ఘోషను
అరమోడ్పు కన్నులతో ఆపేసావు
అందని అగాధాలలో తోసేశావు
మిల మిల తారవై చూస్తుంటావు
ఎగసి రావా ఉషోదయ మై
కనిపించవా కాంతిపుంజమై
వినిపించవా మువ్వల నాదమై
చిరు గాలల్లే తిప్పించావు
సవ్వడి లేని చిరు వాగులల్లే నడిపించావు
ఒంటరినై ఒడలి ఉన్నాను
కురిపించవా పూల జల్లును
పంపించవా నీ చల్లని చిరునవ్వును
ఆర్పేసావు నా చిద్విలాస జ్యోతిని
కాల్చేసావు  నా కలల వాహినిని
ఏం చేస్తావు వంటరి దానవై
ఏం చేస్తావు ఎండమావి వై
గూడు లేని గువ్వలా నీవున్నావు
దాపు లేని దీపాన్నైనేనున్నాను
దారి లేదా నిన్ను చేరే మార్గం
మరిరాదా ఇంకెంతకాలం
చూపులకు చుట్టానివా
లోకానికి చుక్కానివా
చిలుకావే చిరునవ్వును
చింపావే నా నవ్వును
కొన్నాళ్ళే ఈ జీవితం
కన్నీళ్లే నాకంకితం
నవ్వాలే ప్రతిక్షణం
నీ ఉండాలే ప్రతి యుగం
నీ నవ్వుల్లో నేనుండాలి
నా నిలువెల్లా నీవు ఉండాలి
కనులారా కనిపించవే
వేదన తొలగించవేన
హృది దివ్వెను వెలిగించవే
కలకాలం కనిపించవే
మరీ మరీ ఏడిపించకు
కన్నీరైనా కాస్తుండనీ
వాటినైనా  తోడుండాలని
తుషార బిందువులు కవితా సంపుటిని ప్రముఖ సాహితీ వేత్త ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

మల్లె పొద (జన శ్రీ)


మల్లె పొద (జన శ్రీ)
తుషార బిందువుల కవితా సంపుటి నుండి
గుండె గిరులలో నీ రూపే నిండినే
మనసు కోయిలై ప్రేమ కూతలు కోసనే
నీ పిలుపే గిరుల పై ఏరులై పారేనే
మరు మల్లె పొదలలో నీ అందే ఘల్లుమంది
పరిమళ సుమ భరితమై అది పాటై సాగెనే
ఆ పాటే నా ఊహా రేఖకు తొలిచిత్రకల్పన
నా తొలి చిత్రం విచిత్రం
నీ రూపమే దానికి ప్రాణం
తడారిన తనువు తటాకం
నీ పలుకు జల్లుతో హొరు జోరుగానిండినే
నీ చూపే సూర్యోదయమై
కలలో నిదుర లే పెనే
నీ చిరునవ్వే చిగురులు తొడిగి
కలతల పొల్లే చెరెగెనే
తుషార బిందువుల కవితా సంపుటిని ప్రముఖ సాహితీ వేత్త సినీ నటులు తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు.
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

సందె మెరుపు ( జనశ్రీ )


సందె మెరుపు  (  జనశ్రీ )
తుషారబిందువులు కవితాసంపుటి నుండి
సందె మెరుపులో  పలికే నాదము
మువ్వల వీణపై పలికిన రాగము
ఆ రాగం చెలి పిలుపో
ఆ పిలుపే కొసమెరుపో
నా ప్రేమ కు తొలి గెలుపో
చీకటి ఒడిలో నిదురించే తామరం
భాను నీ రాకతో బరువుగా తెరిచే నేత్రం
వెన్నెల వెలుగులోవిరిసే కమలం
భ్రమరం కోసమే చిందే మధురం
ఉషోదయంలో భానుడు  ఊహించని రీతిలో
చల్లని వేళ బ్రమరానికి కలిగిన బ్రాంతిలో
మైమరచి చిందేసే పాడే గీతము
మనసు ఉండక పాడితి నీ కోసము
తుషార బిందువుల కవితా సంపుటిని ప్రముఖ సాహితీ వేత్త, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

నిండు నెల (జనశ్రీ)


నిండు నెల (జనశ్రీ)
తుషార బిందువులు కవితా సంపుటి నుండి
మాట్లాడు
ఏదైనా మాట్లాడు!
దూరాన మంచుతెరల్లో
మెరిసే నారింజ రంగు నక్షత్రంలా
కమ్మని గీతంలో మధురిమలా
మాట్లాడు
ఏదైనా మాట్లాడు
చూడు
నా వైపే చూడు
చలువరాళ్లు సొంపుల్లో జారే
జలపాత అలల పయ్యద మెత్తని స్పర్శలా
చూడు
నా వైపే చూడు
నవ్వు
నాకోసం నవ్వు
సాగరమధనంలో మెరిసే
ఎర్రమందారం కాంతులతో
కదిలే రవికిరణంలా
ఏ తీరాలకు పోయి ఏడ్చే తిమిరం
మరి ఏడ్చేలా
నువ్వు
నాకోసం నవ్వు
నడు
నాతో నడు
సోలి సోలి చిగురాకు మెత్తల్లో
పవళించి నుదుట మీద రాలి పోయిన
తుషార బిందువు చల్లదనంలా
నడు
నా తో నడు
ఇవ్వు
నా ముద్దుని ఇవ్వు
అరబిక్ కడలి ఒడ్డున
ఒరిగిన బరువైన అంజూర గెలలోని తీపిలా
మన ప్రేమకు సాక్షాన్ని నా ముద్దుని
తిరిగి నా చేతుల్లోనికి
ఇవ్వు
నా ముద్దు నీ
నాముద్దుల పాపనీ
తుషార బిందువుల కవితాసంపుటిని
ప్రముఖ సాహితీవేత్త ప్రముఖ, సినీ నటులు తనికెళ్ల భరణి గారు ప్రపంచ రచయితల మహాసభలలో ఆవిష్కరించారు.
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

నీటి బుగ్గ ( జనశ్రీ )


నీటి బుగ్గ ( జనశ్రీ )
నేను ప్రేమగాలైనప్పుడు
నీవు ముత్యపు చినుకువు కాదా
స్వాతి చినుకువు నీవైతే
ఆలు చిప్పగా మారి నిన్ను కౌగిట్లో బంధించి
అగాద జలాల లోనికి తీసుకు పోనా
నీవు ఆణిముత్యమై మెరుస్తున్న వేళ
మైమరచి చూస్తూ ఉండి పోనా చెలి
కొండవాగుల్లో జాలువారిన వంపుసొంపుల
జల రాణి నీ అందం సుగంధం
నీ చూపే ప్రబంధం నీవువేసేవు
తీయని బంధం
ఓ చెలి .............
నీ బుగ్గ విరహ ఎడారిలో దొరికిన నీటిబుగ్గ కాదా!
సిద్ధాంతపు బెన్ జాన్సన్
9908953245
ఉప్పాడ కొత్తపల్లి
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

నీ పంతం నా సొంతం (జనశ్రీ)


నీ పంతం నా సొంతం (జనశ్రీ)
తుషార బిందువులు కవితా సంపుటి నుండి
పంతంతో పయనించే పావురమా
పౌరుషంగా పాలపుంతలకెగరకుమా
గాలి లేక రెక్కలు ఆడ లేవు
ఊసు లేక ఊహలు ఊగ లేవు
కోపం ఇంక చాలు కానీ
వెచ్చని గూటిలోకి వేగంగా రావమ్మా
అనుకున్న దేమీ లేదే అక్కడ
అమృతధార ఒడిలో ఇక్కడ
కౌగిలింతగా కమ్ముకుంది
మనసునిండా అలముకుంది
నా మాట విని కలతలు మాని
అదరం చేరి అమృత మందుకో
మినుగురు ని గూటిలో దీపంగా వెలిగించా
మంచు చినుకులను మల్లెపూలుగ చల్లా
సూరీడు చూడకుండా వెన్నెలమ్మ వెళ్లకుండా
గూడు చేరి గుండెనిండా మత్తుజల్లుకో
తుషార బిందువుల కవితా సంపుటి సినీ నటులు సాహితీవేత్త తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
9908953245
ఉప్పాడ కొత్తపల్లి
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

అమృత చినుకు (జనశ్రీ)


అమృత చినుకు (జనశ్రీ)
తుషార బిందువు లు కవితా సంపుటి నుండి
పలుక అది అమృత చినుకా
పలుకే అది లేత పూలరేకే
తొలి పూతల తీపి కోతల కోయిల కూతే
హిమసాగర ప్రయాస భరిత పయనంలో
తోడొచ్చిన ప్రణయ వాయు తరంగమా
హరివిల్లు కురిపించిన  సితార సునాదంలో వినిపించిన రంగుల రమణీయ సంగీతమా వర్ణనాతీత వధనమా  పులకింతల తొలి పుష్యమా సెక్స్ శరదృతు సుఖసంగమమా
మలయాద్రి తీపి చుంబనమా
వినువీధిని విహరించే మేఘ మాలికలు
విలపించే విషాద గీతికలకు తొలి ప్రాణమా శ్రీనాథుడు సృష్టించిన శృంగారతరంగ తాళంలో నర్తించిన తొలి ఊహల మోహనరాగమా నిట్టూర్పుల నిలయమా పడిగాపులే తుది పంతమా రంగస్థల రాగరంజితమా
పసి మనసుల ప్రేమ మందిరమా
తుషారబిందువులు కవితా సంపుటిని ప్రముఖ సినీ నటులు సాహితీవేత్త తనికెళ్ల భరణి గారు ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు.
సిద్ధాంతపు బెన్ జాన్సన్
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

కనుల దివిటీలు (జనశ్రీ)


కనుల దివిటీలు (జనశ్రీ)
కొమ్మల నుండి పువ్వులు దూసి
దోసిట నిండుగా తూసి
కనులే దివిటీలుగ చేసి
తోడు కోసం జపిస్తూ
జగమంత గాలిస్తూ
సాగిస్తున్నా నా ప్రేమ యాత్ర
గోదావరి గుండెలు చీల్చి చూస్తా
హిమాలయాలను పెకలించి తీస్తా
చెలి రూపం మనసులో గీస్తా
ఎక్కడ ఉన్నా చెలిపై పువ్వులు పోసి పూజలు చేస్తా చనిపోయే వరకు పోషిస్తా ప్రణయయాత్ర  జలాశయాలు జడిపించిన
జపిస్తూ జాడలు కనుగొనంట
ధూళిమేఘాలు దాడిగా పిడుగులు కురిపించిన ప్రణయ గీతం రాసుకుంటూ
ప్రేమ తంబుర మీటుకుంటూ
పోషిస్తున్న నా ప్రణయపాత్రకు
నక్షత్రాలే ఈ ప్రేక్షకులు
నా ప్రేమకు వాళ్ళే సాక్షులు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

చూపుల చుట్టం (జన శ్రీ )


చూపుల చుట్టం (జన శ్రీ )
చూపులకు చుట్టానివా
శోకానికి చుక్కాని వా
చిలికావే చిరునవ్వుని
చింపావే నా నవ్వుని
కొన్నాళ్లే ఈ జీవితం
కన్నీళ్లే నాకు అంకితం
నవ్వాలే ప్రతిక్షణం
నీ నీవుండాలే ప్రతి యుగం
నీ నవ్వుల్లో నేనుండాలి
నా నిలువెల్లా నీ ఉండాలి
కనులారా కనిపించవే
మనోవేదన తొలగించవే
హృదిలో దివ్వే వెలిగించాలి
కలకాలం కనిపించవే
మరీ మరీ ఏడిపించకు
కన్నీరైనా కాస్తుండనీ
వాటినైనా తోడు ఉండని
సిద్ధాంతపు బెన్ జాన్సన్
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

పాపం భారతమ్మ (జనశ్రీ)


పాపం భారతమ్మ (జనశ్రీ)
క్షుద్బాద తాళ జాలక
డొక్కారిన బడుగు విప్రుడు
బొంగురు గొంతుకతో బావురుమంటూ
అర్ధరాత్రి ఆకలితో అరుస్తున్నాడని
భారతమ్మ ఆత్రంగా అరేబియా 
తోయము తో పాదములు పరిశుభ్ర పరుచుకుని
అంటార్కిటికా మంచు పీటలు వేసి
నింగిలోకి చూపు చారించామని
ఆకాశపు పళ్లెంలోకి చుక్కల మెతుకులు ఏరి
వెన్నెలమ్మను పెరుగు కూడా వేసి
గోరుముద్దలు వేసి చిరిగిన పైట చెంగుతో
చల్లగాలి విసరుచుండ
విప్రునకు పొలమారి సలిలం  కొరకు
పోరు పెట్టుచుండ పాపం భారతమ్మకు
దిక్కుతోచక దవళ మేఘముల దలచి
ఒక్క నీటి చుక్క అరువివ్వమని అదే పనిగా అడుగుతున్నా మేమే పిపాసులమై పడియుండ
నీరు ఎక్కడ అని ఆవేశంగా  
పశ్చిమ కనుమలలో కి పోయి 
కనులు మూస్తున్నాయి మబ్బులు. 
భారతమ్మ నిరాశగా మోకాళ్లపై కూలబడి
పైట చెంగు తలపై కప్పుకుని 
శూన్యం లోనికి చూస్తుంది .
నోరారిన బడుగు  విప్రుడు
పిపాసియై పృథ్విలో తలదాచుకునె



సిద్దాంతపు బెన్ జాన్ సన్
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

నేను రాను పల్లెటూరి పిల్ల (జనశ్రీ)


నేను రాను పల్లెటూరి పిల్ల (జనశ్రీ)

అవును నేను పల్లెటూరి అబ్బాయినే
అవును నేను అబ్బు గాడినే
అమెరికా పోయినందుకు నాకేం ఫోజు లేదు.
ఉగాది వస్తుంది వస్తావా అని అడుగుతూ ఉంటావ్
ఆస్తమాను ఓ పల్లెటూరి పిల్ల !
ఓ మాట  అడుగుతా
నిజం చెప్పు దాచకుండా
సూటు బూటు నీకు గొప్ప కావచ్చు
అవి సూట్ కేస్ అంత బరువుగా తోస్తాయి నాకు
నేను వస్తే పల్లెటూరి పిల్ల పొద్దున్నే లేస్తాను
నాకు నువ్వు కలువ పువ్వులా ఉండే
బ్రహ్మ జెమ్ముడు పూలు చూపించాలి మరి
పోగులు పోగులుగా పేర్చి శిలా పెంకు డబ్బులతో పూలు కొనుక్కునే పిల్లల ఆటలు చూపించాలి మరి
లేత తాటాకు తో సీతమ్మోరి పళ్ళు కలిపి
తమలపాకులా నమలి నమిలి నోరు పండిందో లేదో అని ఒకరి నోరు ఒకరు చూసుకునే పిల్లల సరదాలు చూపించాలి మరి
రెడ్డి గారి చింతతోపులో దోర ముగ్గిన  చింత బొట్లను దొంగచాటుగా రాళ్లతో కొట్టి  రాల్చి
రాలిన బొట్లను లటుక్కున పట్టుకు పారిపోయే పిల్లల గుంపులను చూపిస్తావా మరి వస్తాను
వస్తాను గాని పల్లెటూరి పిల్ల మామిడి తోట దగ్గరకు
రమ్మంటే రాను నాకు తెలుసు
నేను వస్తే  అక్కడకు రమ్మంటావూ అని
అల్లంత దూరంలో ఉండగానే తెలిసిపోతుంది నాకు ఝూంమ్మంటున్న  కందిరీగల రొద
అక్కడ కందిరీగల గుంపులు ఉంటాయి
అవును పల్లెటూరి పిల్ల అలాగే ఉన్నాయా కందిరీగలు
తరిమేశారు రా మీరు
కందిరీగల జాడ ఎక్కడా కనబడడం లేదు.
నువ్వు విసుక్కున్నా నన్ను ఇసుక దిబ్బ దగ్గరకు తీసుకుపోవాలి మరి
అక్కడ కుర్రాళ్ళ గుంపులు ఉంటాయి
భుజాలకు వెదురు బద్దల బాణాలు తగిలించుకొని
ఇసుక దిబ్బలకు  అటు కొందరు ఇటు కొందరు 
తెల్లదొరల తో యుద్ధం చేస్తున్న
అల్లూరి సీతారామరాజులా ఫోజులు పోతున్న 
కుర్రాళ్ల గుంపులను చూపిస్తావా మరి పల్లెటూరి పిల్ల.
చౌదరి గారి రైస్ మిల్లు దగ్గర ధాన్యం తిని ఉన్నపళంగా గుంపుగా ఎగిరిపోయే పిచ్చుకల గుంపులను చూపిస్తావా మరి
మన ఊరి బడి దగ్గర చెట్టు తొర్రలో  అందమైన రామచిలుకలు చూపిస్తాం అంటే రాక చస్తానా మరి
బుల్లబ్బాయి చేలోని కాలువల్లో గాలంతో చేపలు పట్టుకునే కుర్రాళ్ళను చూపిస్తే చాలు నాకు
ఆ కాలువలో పరిగెత్తుకు వచ్చి దూకి బుటకలేసే పిల్లలును చూపించినా చాలు నాకు.
ఊరి చివర పొలిమేరల్లోకి నన్ను రమ్మని పిలవకు
నాకు భయం అక్కడ రాబందుల గుంపులు ఉంటాయి
చచ్చిన గొడ్లను పీక్కు తింటుంటాయ్
భయంగా ఉన్నా వాటిని చూస్తుంటే భలే సరదాగా ఉంటుంది పల్లెటూరి పిల్ల !
అవునూ ఇప్పుడవి  ఎక్కడా కనబడటం లేదంట !
నువ్వు నన్ను తాటాకు ఆట ఆడటానికి రమ్మంటే నేను రాను నాకు కోపం  చిర్రెత్తుకొస్తుంది మరి
పోలేరమ్మ గుడి దగ్గర  గాడిదల మందలు ఉంటాయి
పాపం అవి ఏమి చేశాయని వెధవ కుర్రాళ్ళు వాటితో  తోకలకు  తాటాకు కట్టి మంట పెడతారు. గాడిదలు గాండ్రించి పరిగెడుతుంటే ఎగురుతూ వెనకాలే పోతారు
అవును పల్లెటూరి పిల్లా
ఇంకా గాడిద మందులు అలాగే ఉన్నాయా ?లేవా?
వాటితో సెల్ఫీ దిగి నాకు ఒకటి పంపు
నువ్వు వాటిని చూపిస్తే వచ్చేస్తాను.
తూనీగల గుంపులు, గొల్లభామలు, బావురు పిల్లిలు, నత్తలు, చేలలోని ఎండ్రకాయలు, వెలగపండ్లు ,సీమ చింతకాయలు ,గచ్చకాయలు, గురివింద గింజలు,
ఉప్పర బుట్టలు, ఒక్కటి మిస్ అవకుండా చూపిస్తాను
అంటే ఆగకుండా వచ్చేస్తాను సుమా
అయినా మొన్న వచ్చాను కదా మరలా రమ్మంటావేం పల్లెటూరి పిల్ల
నీకు నాకు -పెద్ద తేడా ఏముంది
అమెరికాకు నీకు పెద్ద తేడా ఏమీలేదు
కందిరీగలు ఏవి అంటే  అందరి చేతుల్లోనూ సెల్ఫోన్లు చూపించావు
తూనీగలు ఏవి అంటే అందరి ఇళ్ళల్లోని టీవీలు చూపించావు.
గాడిదల మందులు ఏవి అంటే హీరో హోండాలను చూపించావు
చింత బొట్టలు ఏవి అంటే పిజ్జాలు బర్గర్లు చూపించావు
ఎందుకు రావాలి చెప్పు నేను
అమెరికా పిల్లకు నీకు తేడా ఏముంది
నువ్వు మారిపోయావు
మీ దగ్గర అన్ని మాయమైపోయాయి
నేను రాను ....రమ్మంటే రాను
ఉగాది వస్తే మాత్రం ఏముంది గొప్ప
కవితా గానం చేసే కవులు కూడా
కవితా గానం వినకుండా సెల్ఫోనే చూసుకుంటున్నారు
నేనురాను పిల్ల ....నా పూర్వీకుల జాడలన్నీ మాయమైపోతున్నాయి
నేను ఒంటరి వాడిని అయిపోతున్నాను
పల్లెటూర్లలో అమ్మ జాడులు ఉండేవి
అమ్మ లేని చోట నేను ఉండలేను
నేను రాను పిల్లా నేనురాను
సిద్దాంతపు బెన్ జాన్ సన్
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

నా సంస్కృతి ప్రపంచానికి కాగడా కావాలి


నా సంస్కృతి ప్రపంచానికి కాగడా కావాలి
నూనె కాగడా కాగడా లోని మన సంస్కృతి,
నీటి కాంతుల్లో కాగి కరిగి ఆవిరై పోతుంది.
బర్రె గొర్రె అరుపులను అదిలించినా పిల్లనగ్రోవి సంస్కృతి ,
తప్పెటగుళ్ల శబ్దాల్లో గుడ్లప్పగించి చూస్తోంది.
తందానో తానేనా తానే తందాన ఆలాపన
బొంగురు గొంతుకతోబాధలు పడుతుంది.
హైలో హైలెస్సా హైలో హైలెస్సా జాలరి పాట
నడి సముద్రంలో మునిగి గుటకలు వేస్తుంది.
చిమ్మ చీకటిని జడుచుకునేలా తైతక్కలాడిన డమరుకం తెల్లారి వెలుగుల్లో తెల్లారిపోతుంది.
పగటి వేషం మీసం  విరిగిన గదలా హార్మోనియం మెట్ల పై అడుక్కు తింటుంది.
గంగిరెద్దుల వచ్చినోడి కల్లా ఓట్లేసిన గంగిరెద్దు సన్నాయి చావుకోసం చూస్తుంది.
పడి పడి నవ్వించిన తోలు బొమ్మ గందేలుగాడు ముడతలు పడిన ముఖంలా గీతలు లెక్కిస్తున్నాడు
గరగాటలోని గజ్జలు జలజలా రాలి ఓహోం ఓహోం హాయ్  అంటూ పల్లకీ మోస్తున్నం అనుకుని పాడె మోస్తున్నాయి.
ఏది నా సంస్కృతి  ఇదేనా నా సంస్కృతి
దేవతకు నాకు అడ్డుగా నిలిచిన
శ్లోకం కాదు నా సంస్కృతి
నేరుగా నోరారా బాధలు చెప్పుకుని
ఏడ్చిందే నా సంస్కృతి  మా సంస్కృతి
నా సంస్కృతిని అనాకారిని చేసిందెవరు? పాశ్చాత్యపు పై చెప్పు సెలైన్ ఎక్కిస్తున్నది ఎవరు? నా సంస్కృతి యువతరానికి నిలువుటద్దం కావాలి మన సంస్కృతి  ప్రపంచానికి  కాగడా కావాలి
సిద్దాంతపు బెన్  జాన్  సన్ 
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

సంస్కృతి పై సంస్కృతి


సంస్కృతి పై సంస్కృతి
బ్రహ్మాండపు దుమ్ము ధూళి
రాయి రప్ప  ఘనీభవించి
పురుడు పోసుకున్న పుడమిలో
అరవిరిసిన  విరజాజి నాసంస్కృతి
తాటాకు పువ్వారపు సువాసన
గొడుగు ,చాప, చేదై పలకరిస్తుంది
ధూప దీప నైవేద్యాలు శ్రవణానందపు
సంస్కృత శ్లోకాలు జప మై ,తపమై
ఘోషిస్తుంది గోదారిలా నా సంస్కృతి
జేజమ్మ జుట్టు ముడిని ఊడ గొట్టే
డప్పుల దరువే నా సంస్కృతి
సుతిమెత్తని అరిటాకు నా సంస్కృతి
పసుపు ముద్దయిన, నలుగు పిండై
సున్నిపిండైనా, అరిసైనా ,బూరై
నా సంస్కృతి ఆప్యాయత ముందు
ప్రపంచ సంస్కృతి దిగదుడుపే సుమా
ఘమ ఘమ నేతి పప్పు బువ్వ
ఆవకాయ, అప్పడం ,సన్నన్నం, భుక్తాయాసపు
అపసోపానాలనుసులువుగా నమిలే
తమలపాకుసంస్కృతి నా సంస్కృతి
వడియాలైనా,  వడ్డాణాలైనా, పావలా అంత బొట్టైనా ,జడ గంటైనా తలెత్తుకుని
నిలుస్తుంది నా సంస్కృతి
పిపిప్పీ సన్నాయి ,కొబ్బరాకు ,మామిడాకు,
పసుపు తాళి, తలంబ్రాలు తరగని సాంప్రదాయం నిధి నా సంస్కృతి
తాటికల్లు ,చెమట వాసన ,తలపాగా ,మట్టి ,తట్ట, బుట్ట ,పలుగు ,పార, కావిడి, నాగలి కలిసి భూమిని బ్రద్దలు చేసే పొగరైన విత్తనం నా సంస్కృతి
నా భాష యాస సంస్కృతికి
భొమికలు విరురుగుతున్నాయి
నయా నయాగరా జలపాతపు భాషా ఘోషల్లో గొల్లుమంటోంది నా మన సంస్కృతి
తరతరాలకు నా సంస్కృతి
నవీన సంస్కృతి కావాలి
సిద్దాంతపు బెన్ జాన్ సన్
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

ఎర్ర పాళీ (జన శ్రీ)


                                            ఎర్ర పాళీ (జన శ్రీ)

కలలే కొడవళ్లుగా మలచండోయ్
కవికోకిలలారా
పాత పాళీ పారేసి ఎర్రపాళీ తోడగండోయ్
కవికోకిలలారా
ఎముకల గూడు ఎల్లన్న గాడు
ఇనుపగుండు ఎత్తినాడు
శక్తినంతా కూడగట్టి
దొర్లించి తన్నినాడు
దోర్లుకుంటూ వస్తుంది దొరలను నలపగ
అరే  ఉరుముకుంటూ వస్తుంది ఉరిలేతీయగా
నల్లరంగు నాగన్నలు
అడవిలో తిరుగుతున్నాయి
పటపటా పళ్లు కొరికి
పచార్లు కొడుతున్నయ్
అది కాలకూట విషంకక్క కాచుకుకూర్చుంది
అరె తోక తొక్కినావురోయ్
ఎర్ర టోపీ ఎంకులు
నీకు నూరేళ్ళు నిండాయిరోయ్
నూకలు చెల్లాయ్ రోయ్ ఎంకులు
ఎర్ర ధూళి మేఘం లోకి పావురాయి ఎగిరింది
ఎర్ర ధూళి మేఘం లోకి పావురాయి ఎగిరింది
ఎర్రదూళి కప్పుకొని ఆకాశంలో తిరుగుతుంది
రక్తాన్ని రెట్టలుగా భూమి పైన వేసింది
రుధిరమంత పాకి పాకి భూమినంత తడుపుతుంది
దున్నినంత దున్నరా
నీ వంతు నీదిరా నా వంతు నాది రా
నడుములు వాల్చేటి యువతకు నమస్కారం
పిడికిలి బిగించే నవతరానికి ఆహ్వానం
ఎముకల్లో ఇంకు పోసి భూమిపై రాస్తున్నాం
కాళ్ళతో చెరిపేస్తే మన కాళ్లతో నలిపేద్దాం
కనులెర్ర చేస్తే కళ్ళు రెండూ పీకేద్దాం
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

ప్రజాస్వామ్యంలో పంచదారఎక్కువైంది(జనశ్రీ)


                 ప్రజాస్వామ్యంలో పంచదారఎక్కువైంది(జనశ్రీ)

ప్రజాస్వామ్యంలో పంచదార ఎక్కువైంది
నానాటికీ వెగటుపుట్టి  వాంతోచ్చేట్టుంది
ప్లీజ్ ప్రజాస్వామ్యానికి సవరణ పాలు కలపండి
స్వాతంత్ర్యం తొలినాళ్లలో ప్రజాస్వామ్యంఔ
మండు వేసవిలో ఏసీ గదిలా చల్లగా ఉండేది ఈరోజు దేశమంతా మంచు కురుస్తోంది
ప్లీజ్ ప్రజాస్వామ్యపు  ఏసీని తగ్గించండి
ప్రజాస్వామ్యం తండ్రి లేని పిల్లాడిలా
ప్రజాస్వామ్యం పిచ్చోడి చేతిలో రాయిలా
క్రమశిక్షణ లేక ఇస్టారాజ్యం గా తిరుగుతుంది
ప్లీజ్ ప్రజాస్వామ్యాన్ని సవరణ దత్తత ఇవ్వండి
ప్రజాస్వామ్యం తొలినాళ్లలో ఆదిమ జాతి స్త్రీలా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉండేది
ఈ నాటి స్త్రీ కట్టు బొట్టూ నేర్చింది
ప్లీజ్ ప్రజాస్వామ్యానికి సవరణ చీర చుట్టండి
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

జా(స్మి)సన్ మొగ్గలు


జా(స్మి)సన్  మొగ్గలు
*******************
వీధి వాకిట మల్లే జడతో కనుగీటే
కాంతకు కనుటీకటి కాసులపేరు
జారత్వం తప్పని జాడ్యం
******************************
భార్య,పిల్లలు,పరువు ప్రతిష్టకోసం
నడుము విరిగేలా కాయకష్టంచేసేభర్త
సంసారం  ఓ చదరంగం
**********************************
పదిరూపాయలకు జీవంతీసే
కర్కోటకులు వీధి రౌడీలు
వీధి బ్రతుకులు దుర్బరం
***********************************
కక్ష,కార్పణ్యాలు,పగ,ప్రతీకారాలతో
కత్తులు బాకులు విలవిలలాడాయి
పగ మానవత్వ వినాశనం
మొగ్గలు......కవితాప్రక్రియ
సిద్దాంతపు బెన్ జాన్ స న్
9908953245
ఉప్పాడ కొత్తపల్లి
తూ గో జి


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

కృష్ణా పుష్కరిణి (జనశ్రీ)


కృష్ణా పుష్కరిణి (జనశ్రీ)
నా కృష్ణవేణమ్మ !
మా కృష్ణవేణమ్మ !
పుష్కర పావనీ జననీ
సహ్యాద్రి సంచారిణీ
కృష్ణ పుష్కరిణి
దుష్కర్మ సంహారిణి
సకల పాప హరిణి
అన్నపూర్ణ స్వరూపిణి
ఓ కృష్ణ పుష్కరిణి
పాహిమాం !పాహిమాం!
అమరావతి సిగన
జాలువారే ఓ సిరి దండ
నాగార్జునుని మానస సరోవర తిమ్మెర వీచిక
సకల దేవళాల కుంకుమ సుగంధ పరిమళ వేణి
ఓ కృష్ణవేణి !
విశ్వనాధుని కవితా ఝురికి
నడక సొగసులద్దిన కిన్నెరసాని
దుర్గమ్మ భుజాన అలా అలా అలలా
ఎగిరే చీరచెంగువి నీవు కదా కృష్ణవేణమ్మ
ఓ కృష్ణవేణి
నమోన్నమః
మాకు తెలుసు తల్లి నీవు ఒంటరిగా రావని
గంగమ్మను తోడ్కొని వస్తావని
అందుకే మాకు నీవంటే అంత ఆత్రం
ఆరు నదుల సంగమ విరిబోణివి నీవు
తెలుగింటి వెలసిన మా సిరి ఓణీవి నీవు
ఓ జీవనది  !
మా  జీవితాలను పావనం చేసే పుష్కరిణి
పండ్రెండు వసంతాల తరువాత వస్తుంటే
ఏం జరుగుతుందోనని ఓసింత ఆశ
జల జగడాలతో  నీ జలధార
కృషీవలుని ఇంట అశ్రుధారలు కాదు కదా
మరి బిరబిరా కృష్ణమ్మవే
నీ భీకర సుందర రూపం చూడగలమా !
నువ్వు నిండా వుంటే తెలుగింటి పట్టు చీర
చీరచెంగులా  నిండుగా ఉంటుంది
ఇప్పుడేంటి నేత చీర చిన్నదైపోయింది !
అర్ధమయ్యింది లే కృష్ణవేణి
నీవు వస్తూ వస్తూనే
నయీం (అండర్ వరల్ఢ్ డాన్ )పాపాల చిట్టాలను ఉతికి ఆరేసిన నప్పుడే
నీ పుష్కరాలు రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అంత ఘనంగా మోత మోగింది సుమా !
ఇంకా నయా నయీంలు
ఎందరు కలుగుల్లో  నక్కారో
వారు ఇప్పుడు తప్పించుకోవచ్చు కృష్ణా పుష్కరిణి
నువ్వు బృహస్పతితో వస్తూనే ఉంటావు
వాళ్ల పాపాలను కడిగేస్తూనే ఉంటావు
ఓమారు కృష్ణా పుష్కరిణి
నీ ప్రవాహంలో ప్రహసనంగా మారిన
రాజకీయ రాబందుల పాపాల పుట్టల
పని పడతావ్ ఏంటి ?
ఓ కృష్ణా పుష్కరిణి !
రా రా రా మళ్లీ మళ్లీ రా రా....
పుష్కరిణి నీవు సృష్టి ఉన్నంతకాలం రా రా.....
కృష్ణా పుష్కరాలు సందర్భంగా
తెలుగు భాషా సంఘం వారు నిర్వహించిన ఆ కవిసమ్మేళనంలో రాజమండ్రిలో చదివిన కవిత
పొట్లూరి వారి సన్మాన తాంబూలం
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
తూర్పు గోదావరి జిల్లా
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

ఉప్పాడ కొత్తపల్లి క్రిస్మస్ క్రికెట్ కప్



                                                                            మా ఊరి కథలు  1


అసలు సిసలు క్రికెట్ టోర్నమెంట్ ఉప్పాడ కొత్తపల్లి క్రిస్మస్ క్రికెట్ కప్


1982 ప్రాంతంలో ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రక్కనున్న రవీంద్రపురం గ్రామానికి మా కుటుంబం కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి వచ్చి చేరింది. అది మా తల్లిదండ్రులు చేసినటువంటి గొప్ప పని. వారు నాకు విద్యకు సరిపడా ఇంటి దగ్గర  ప్రయివేటులాంటిది ఏదీ నాకు
చెప్పకపోయినా ఆ పరిసరాల్లో నన్ను ఉంచడం వారు నా పట్ల తీసుకున్న శ్రద్దకు నిదర్శనం.  హైస్కూల్ని ఆనుకునే మా ఇల్లు ఉండడంతో   పొద్దుట , సాయంత్రం  గ్రౌండులో ఆడుకునే క్రీడాకారులందరూ మా ఇంటి పెరటిలో  క్రీడాపరికరాలను  దాచుకునేవారు.  అది టీవీలు ,సెల్ ఫోన్లులేని కాలం కాబట్టి తప్పకుండా ప్రతీ కుర్రవాడు స్కూల్ గ్రౌండ్లోనే  కాలం గడిపేవాడు . అలా నేను వారితో చేరి ఆడుతూ  వాళ్లకి బంతి అందించే వాడిగా ఉండేవాడిని. ఏ ఆట నాకు పూర్తిగా వచ్చేది కాదు.
నాకు ఇంక ఏ ఆట పూర్తిగా రాదని అనుకునే సమయంలొ   క్రికెట్ఆట తెలుగు గ్రామాల్లోకి ప్రవేశించింది . 1984లో కపిల్ దేవ్ ఇంగ్లాండులో ప్రపంచకప్ గెలుచుకుని  రావడంతో గ్రామాల్లో  క్రికెట్ కు ప్రజాదరణ పెరిగింది . కొత్తపల్లికి చెందిన క్రీడాకారులు రావు మాధవరావు, రావు రాజేష్ ఉప్పాడ నుంచి దంగేటి ప్రసాదు, వాళ్ల మిత్రులందరూ ఒక టీమ్ గా ఏర్పడి హైస్కూల్ గ్రౌండులో క్రికెట్ ఆడటం ప్రారంబించారు. మాధవ,ప్రసాదు ఫాస్ట్ భౌలర్స్ . పిఠాపురం నుంచి నాని, రెడ్డి లాంటి  క్రీడాకారులతో కూడిన  క్రికెట్ జట్టును ఆహ్వానిస్తూ మ్యాచ్లు ఆడుతూ ఉండేవారు. నాని పిఠాపురం స్టార్  బ్యాట్స్ మన్ .వారితో హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేసే  ప్రేమ్ కుమార్ మాస్టారు కూడా బౌలింగ్ వేస్తూ క్రికెట్ ఆడుతూ ఉండేవారు. అదొక కొత్త ఆట ఆ రోజుల్లో. చాలా ఖరీదైన  ఆట కూడా.  క్రీడా పరికరాలు కాకినాడలో తప్ప ఎక్కడా దొరికేవి కావు. నేను ఆటగాళ్ళు మా ఇంటి దగ్గర దాచుకున్న కిట్ తో సాధన చేసేవాడిని.
హైస్కూల్ కి చెందిన  రెండున్నర ఎకరాల ఖాళీ స్థలం  క్రికెట్ ఆడటానికి చాలా అనువుగా ఉండేది. క్రికెట్ ఆట నన్ను చాలా బాగా ఆకర్షించింది. బ్యాటింగ్ స్టైల్ గా అనిపించేది. కొత్తపల్లికి చెందిన  ఆటగాళ్ళందరూ రోజు ఉదయాన్నే ప్రాక్టీస్ చేస్తుంటే నేను వెళ్లి చూసేవాడిని. బంతి అందివ్వడానికీ ఫీల్డింగ్ చేయమని అడిగేవారు.  నేను చురుకుగా గ్రౌండ్లో కదలలేకపోయేవాడిని.రోజంతా ఫీల్డింగ్ చేసినా నా వంతు బ్యాటింగ్  రాగానే ఒక్క బంతికే అవుటై పోయేవాడిని.  బ్యాటింగ్ చేయడం వచ్చేది కాదు.ఆ రోజుల్లో క్రికెట్ ఆడేవాళ్ళు చాలా తక్కువమంది ఉండేవారు. హైస్కూల్ గ్రౌండ్ ఇంటి ప్రక్కనే ఉండడంతో ప్రతి మ్యాచ్ లోనూ ఎవరో ఒకరు రాకపోయే సరికి నన్ను 11 వ ప్లేయర్ గా తీసుకునేవారు . అలా రోజూ మ్యాచ్ లు ఆడే సరికి ఆట వంటబట్టింది. క్రికెట్ కిట్ లోని పేడ్లును కాళ్ళుకు కట్టుకుని,  గ్లౌజులు చేతికి వేసుకుని, బ్యాట్ పట్టుకొని గాల్లోకి రకరకాల షాట్లు  యొక్క భంగిమల్ని ప్రాక్టీస్ చేసేవాడిని. బాలు ఉండేది కాదు. బౌలింగ్ చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు.  ఎలాగైనా ఆట బాగా ఆడాలని నిర్ణయించుకుని  ఆలోచనలొపడ్డాను.అప్పుడు
నాకూడా అమీనాబాదకు చెందిన కుర్రాళ్ళు భూషణం, సత్తిబాబు, సుధీరు, పాలేటి నాగేశ్వరరావు ఉండేవారు.నేను నేర్చు కొవాలంటే కొందరికి నేర్పాలి అలా అయితేనే నాకు ఆట వస్తుందని ఆలొచించి వాళ్ళను అడిగాను. సరే అన్నారు. కొత్తపల్లి ఆటగాళ్ళు ఆరుగంటలకి వచ్చేలోపు ప్రొద్దుటే నాలుగు గంటలకి అమీనాబాద సైకిల్ పై  క్రికెట్ కిట్  తీసుకెళ్లి వాళ్లతో ఆడేవాడిని. ఎందుకంటే ఆరోజుల్లో కిట్ కొనలేని స్దితి మాది.


నేను కాకినాడ పి.ఆర్ కాలేజీలో డిగ్రీ చదవడం మొదలు పెట్టిన తర్వాత  మెల్లగా ఆటకు సంబంధించిన పరికరాలు కొని తెచ్చేవాడిని.
కార్క్ బాల్ అని ఉండేది. చాలా బరువుండేది. అది బాగా తక్కువ రేటు  పది రూపాయలుకు వచ్చేది . గ్లొరెక్స్ లెదర్ కట్ బాల్స్ అయితే  బాల్  60 రూపాయలు ఉండేది.  కార్క్  బాల్ తో బౌలింగ్ చేస్తున్నప్పుడు  నా బాలు కి  పాలేటి నాగేశ్వరరావు మూతికి తగలడంతో రెండు పళ్ళు లోపలికీ పోయాయి. ఇలా ప్రతిరోజు కాళ్లకు చేతులకు దెబ్బలు తగ్గించుకుని ఆట నేర్చుకున్నాం. ప్రాక్టీస్ లో మొదట నేనే బ్యాటింగ్ చేయాలన్న తలంపుతో  రవీంద్రపురం నుంచి కాళ్లకు పేడ్లు కట్టుకుని సైకిల్ పై అమీనాబాద పోయేవాడిని.  అలాగే వెళతావుంటే  ఊళ్ళో వాళ్ళు వింతగా చూసేవారు. ఉప్పాడ పరిసర ప్రాంతాలకు క్రికెట్ ను  నేనే  పరిచయం చేశాను .నాకు తెలియకుండానే.
ఇలా క్రికెట్ ఆడుతున్న సందర్భంలో మూలపేటలో ఓ నలుగురు క్రీడాకారులు  క్రికెట్ ఆడటం ప్రారంబించారు.  రవీంద్రపురంలో తాతపూడి రాజేష్ , సుకుమారు, రాంమూర్తి  తయారయ్యారు.
కొత్తపల్లిలొ బట్టురాజ , బోసుకొండ వెంకన్న, లెప్ట్ హేండ్ శ్రీను, వంశీ , రాంపండు , ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఇలా ఆటగాళ్ళు అన్ని వీదులనుండి పుట్టుకొచ్చారు. సీనియరు ఆటగాళ్ళు మాధవ, రావు రాజేష్ , సానా రాంబాబు, మలిశెట్టి శ్రీను, కొమరగిరి నుండి , ఇసుకపల్లి నుండి కొందరు ఆటగాళ్ళు కలిపి పెద్ద టీం ఉండేది. వీళ్ళు కాకినాడ ,తుని ప్రాంతాలు వెళ్ళి టొర్నమెంటులు ఆడేవారు. కొత్తపల్లి టీంగా పిలవబడేది. కొత్తపల్లి శ్రీరామక్లబ్ వారు పెద్ద టొర్నమెంటును  1989 లొ నిర్వహించారు. దానికి డ్రాలో ఒక టీమ్ తక్కువైతే నన్ను పిలిచి టీమ్  కట్టమన్నారు.  బయపడుతూనే సరే అని మూలపేట, అమీనాబాద ఆటగాళ్ళం కలిసి టీమ్ కట్టాము . నేను కెప్టెన్ ని కొత్తపల్లి టీం తరువాత ఇతర ఆటగాళ్ళు గాని,  ఒక టీమ్ కాని ఆడటం అదే మొదటి సారి.అప్పటివరకు కొత్తపల్లి  టీమ్  తప్ప మరో టీమ్ ఉండేదికాదు.  శ్రీరామ క్లబ్ వారు నిర్వహించిన టోర్నమెంటు విజయవంతం అవడంతో ఫైనల్ రోజున కొత్తపల్లికి చెందిన కొంతమంది ఊరి పెద్దలు వేసవికాలంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నప్పుడు  క్రిస్మస్ కి ఒక టోర్నమెంట్  మీరు నిర్వహిస్తే బాగుంటుంది కదా అని నన్ను అడిగారు. ఆలోచన బాగుందనిపించడంతో అమీనాబాదకు  చెందిన భూషణం, సుధీరు, సత్తిబాబు, నాగేశ్వరరావు తాతపూడి రాజేష్ అందరం ఆలోచించుకుని క్రిస్మస్ క్రికెట్ కప్ అనే పేరుమీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మొదలు పెట్టాము. 1987 మొదలుకొని 1999 వరకు ఈ క్రిస్మస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగీంది. శ్రీరామ క్లబ్ వారు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ వాళ్లు నిర్వహించడం  మానేయడంతో  క్రిస్మస్ క్రికెట్ కప్ (సి.సి.సి) టోర్నమెంట్ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇటు విశాఖపట్నం నుండి గుంటూరు వరకూ  పేరు మోసిన క్రీడాకారులు అందరు కూడా వచ్చి టోర్నమెంట్ ఆడేవారు. టెంట్ లు నూకరాజు, షద్రక్ బాబు లాంటి వారు తక్కువ రేటుకి ఇచ్చి ప్రొత్సహించేవారు. హరినాధ్ , శేషగిరి డాక్టరుగార్లు ,బుల్గబ్బాయి రెడ్డి, కొవ్విరి చిన్న ,రైసుమిల్లు రాంబాబు వంటివారు ధనసహాయం చేసేవారు. యస్ బాబు లాంటి పేరుపొందిన ఆటగాళ్ళు వచ్చి  ఆడేవారు. వీరికి భోజనాలు పేట్టేవారం. కప్ లన్నీ క్రిస్మస్ రోజున యేసూ ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చిలోనే  ఇచ్చేవారం.
సిక్స్ లు  , ఫోర్ లకు డబ్బులు ఇచ్చేవారం. టొర్నమెంటులో ఎంట్రీల కోసం ఎగబడేవారు. ఊళ్ళోపెద్దలు పనులు మానుకొని మరి చూసేవారు.
తాతపుడి రాజేష్ , శైలేష్ లు భ్లేజర్స్ వేసుకొని ఎంఫైరింగ్ చేసేవారు.రావు చిన్నారావుగారు,బందన రాంబాబు మరియు గ్రామ పేద్దలు బహుమతులు అందజేసేవారు.టోర్నమెంట్ మొత్తం ఆ రోజుల్లొనే వీడియోలు తీసేవారం. వర్షాలు ఉన్నట్టుండి రాత్రి మీద కురిసేసేవి.  సెల్ ఫోన్లులేని కాలం కబురు చెప్పడానికి వుండేది కాదు. తెల్లవారాతే టీమ్ లు వచ్చేసేవి. మిత్రులందరం గ్రౌండులోని వర్షం నీరు బకెట్లతో తోడేసేవాళ్ళం. సత్తిపండు కొట్టు దగ్గర స్పాంజి ముక్కలు కొని నీరు తోడేవాళ్ళం. రాత్రంతా టెంటులు దొంగలు పట్టుకు పోతారేమో అని చీకట్లొ భయం భయంగానే గ్రౌండులొనే పడుకునే వాళ్ళం. ఆరోజులు గుర్తు చేసుకుంటుంటే మనసుకు ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది.  బలే ఙ్ఞాపకాలవి. ఉప్పాడకు క్రికెట్  ఆట జిల్లా వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చింది అనడం లో అతిశయోక్తి లేదు.  చాలా మంచి మ్యాచ్ లు జరిగేవి .గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఆడేవారు. ఆ తరువాత  అనేకమంది క్రికెట్ ఆటను ప్రేమించారు. ఫిషర్ మన్ పిల్లలు పిరమళ్ళ లక్మీవారాయణ, బందన సురేష్ ,  మల్లిబాబు టీమ్ లు తయారు చేసారు. వీవర్స్ పిల్లలు మెల్లగా ఆ వెనుకే వచ్చారు. పిచ్చుక రఘు ,జానరాజు, మల్లిబాబు టీమ్ లు తయారు చేసారు.  వీళ్ళందరికి క్రిస్మస్ వస్తుందంటే పండగే. గ్రౌండు నెల రోజులపాటు  ప్రాక్టీస్ లతో హొరు మోతెక్కేది. ఇప్పుడు సరదాకి కూడా పిల్లలు ఆడడం లేదు.మేము ఆడినవి ఆడించినవి కట్ బాల్స్ తోనే. ఇప్పుడు రబ్బరు బాలు, టెన్నిస్ బాలుతో ఆడుతుంటె నిలబడి చూడబుద్ధేయడం లేదు. ఆలనాటి  గ్రౌండూ లేదూ  ఆ ఆనాటి నాణ్యమైన ఆట లేదు.  ఆ కేరింతలూ లేవు .ఒట్టి ఙ్ఞాపకాలు తప్ప.



సిద్దాంతపు బెన్ జాన్ సన్  ( జనశ్రీ )
ఉప్పాడ కొథ్తపల్లి
9908953245 
ReplyForward
at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

శతాబ్దాల కడలి అలల మధ్య ఉప్పాడ ఉనికి

                                                 శతాబ్దాల కడలి అలల మధ్య ఉప్పాడ ఉనికి


నిరంతరం తిరిగే రాట్నాలు, చేపల వలలు, సముద్రపు అలలు నింపుకున్న వాడ ఉప్పాడ. చూడచక్కని చేనేత చీరలోని వెండి జరీ  జాంధానీ జాడ ఉప్పాడ. అనేకానేక చారిత్రకాంశాలను దాచుకున్న మౌన కడలి గర్భం ఉప్పాడ. భారతావనిలో  శైవమతం బాగా ప్రాచుర్యం పొందిన
నాటి రోజుల నుండి ఉప్పాడ చరిత్రలో తన పేరును ఘనంగానే లిఖించుకుంది. వీరనాట్యం శైవ మతానికి చెందిన జానపద కళారూపం. ఈ నాట్యాన్ని బాగా ఆదరించిన వారు దేవాంగులు. అనాదిగా దేవాంగులు ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తూవున్నారు. చేనేత రంగానికి సొగసులద్దిన దేవాంగులు శైవ మతారాధికులు. ఈనాటికి వీర కుమారులను ఆహ్వానించి తమ ఇండ్లలో జరిగి శుభకార్యాలకు వీరనాట్యం కట్టించుకోవడం పరిపాటి.
పురాణ ఇతిహాసంలో దక్షుని సంహారానికి పోయిన వీరభధ్రులకు చెందినది వీరనాట్యం. ఇది అతిప్రాచీనమైనది కావడంతో దేవాంగులు యొక్క ప్రాచీనతను మనకు తెలియజేస్తుంది. ఇటీవల ఉప్పాడ సముద్ర గర్భం నుండి ఉద్భవించినదిగా చెప్పబడుతున్న శివలింగం, వినాయక రూపు కలిగిన శిల  ఉప్పాడనందు పరిడవిల్లిన శైవమత ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. పురాతన ఉప్పాడ గ్రామాలు ఐదు నుండి ఆరు గ్రామాల వరకు సముద్రగర్భంలో కలిసిపోయాయని పెద్దలు చెబుతూ ఉంటారు.25 సంవత్సరాల క్రితం ఉన్న ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసి పోవడం వ్యాసకర్త కనులారా చూసినదే. ఏనాడో మహా పూజలందుకుని శిధిలమైన శివాలయము నుండి మౌన ముద్ర దారియై అనేక సంవత్సరాలు కడలి ఒడిలో నిలిచి భక్తులను కనువిందు చేయడానకా ! అన్నట్లు గంగపుత్రుల క్రొత్తవలలో నుండి దరికి చేరిన శివలింగ రూపం ఆశ్చర్య అనుభూతులకు లోను చేస్తూ ఆధ్యాత్మిక తీరాలకు చేర్చడం ఒకింత ఆశ్చర్యమే.
ఉప్పాడ నందు శైవమతం ఉచ్చస్డితిలో ఉండేదనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సతీసమేతుడైన భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి రూపంలో ఈనాడు మనకు కనిపించే ఉప్పాడ సముద్రపు ఒడ్డున గల ఆలయం  ఐదువందల సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన సన్నిధి రాజ వంశస్థులు అభివృద్ధి చేసినదే. అదీ సముద్రగర్భంలో కలసి పోయి మూలవిరాట్టు క్రొత్తగ నిర్మించిన ఆలయంలో పూజలందుకుంటుంది.
సన్నిధిరాజు వంశానికి చెందిన శ్రీ సన్నిధి రాజు జగ్గరాజు  కవి 16- 17 శతాబ్దాల మధ్య ఉప్పాడలో  నివసించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జగ్గకవి శివుని వృత్తాంతంతో కూడిన  "చోగాడి కలాపం" ( బహుశా భక్తకన్నప్ప కథ అయ్యుండవచ్చు ) అనే కురవంజి (వీధి నాటకం) ని రచించి ఉప్పాడకు ఆంధ్ర తెలుగు సాహిత్యంలో చోటు కల్పించడం ఆనందించవలసిన విషయం. 15వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు గొప్పగాప్రదర్శితమైన వీధి నాటకం కురవంజి. 18 19 శతాబ్దాలలో అదే యక్షగానం అయ్యింది. ఈనాడు కలాపం రూపంలో దర్శనమిస్తున్న పురాతన వీధి నాటకం కురవంజి. ”జీవ ఎరుకల కురవంజి” అనే వేదాంత కురవంజినికూడా  రచించిన జగ్గకవి ఉప్పాడ లో శైవమతానికి గల ప్రాముఖ్యతను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాడు అనడంలో సందేహం లేదు.
మహాకవి శ్రీనాథుడు 15వ శతాబ్దం తొలినాళ్ళలో ఉప్పాడలో సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ పండితుల ఉవాచ. మన జిల్లాలోని పది సంవత్సరాలపాటు ఉన్నా రాజమహేంద్రపుర రాజుల దర్శన భాగ్యం కలగలేదు శ్రీనాధుడికి. బెండపూడి సంస్థానాధీశుల సహచర్యంతో ద్రాక్షారామం నందే ఉండి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ  భీమ ఖండాన్ని రచించే ముందు పిఠాపురంలోని మహారాజు దర్శనం అనంతరం  పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని  దర్శించి ఉప్పాడ సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఉప్పాడ సముద్ర స్నానాలకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిది మరి. ఉప్పాడ పరిసర గ్రామాలు వేలాది సంవత్సరాల చరిత్ర కలిగి మనల్ని పలకరిస్తూ ఉంటాయి.
ఉప్పాడను అనుకున్న పొన్నాడ గ్రామం వెయ్యి సంవత్సరాలకు పూర్వం మహమ్మదీయుల ఏలుబడిలో " పొన్నాడ షెహర్ గా"  పిలవబడేది. దానికి ఆనవాళ్లుగా ఉప్పాడ చుట్టుపక్కల గ్రామాలు ముస్లిం పేర్లు కలిగి ఉన్నాయి. అమీనాబాద్, అమర్ వల్లి ( అమరవల్లి ), మెహదీపట్నం ( మాయా పట్నం ) . పొన్నాడ నందు ప్రసిద్ధి చెందిన ముస్లీంసోదరి  "బషీర్ బీబీ "   నివసించే దని అడిగిన వారికల్లా తన బంగారాన్ని అరువుగా ఇచ్చి కష్టాలలో ఆదుకునే దని  , బషీర్ బేబీ సౌందర్యానికి ముగ్ధుడై న ఢిల్లీ పాదుషా  చెరపట్టాలని తలచి పొన్నాడ పైకి దాడి చేసిన వెంటనే  మహా అపురూప సౌందర్యవతి అయిన బషీర్ బీబీ తనకు తానుగా తన నివసిస్తూ ఉన్న భవనాన్ని భూమిలోనికి కూరుకుపోయేలా  శపించుకుని జీవసమాధి అయిపోయిందని జనాల నాలుకలపై నానుతున్న చారిత్రక కధనం. ఆ వెంటనే ఉప్పాడ సముద్రం సునామీలా విరుచుకుపడి ఢిల్లీ పాదుషా సైన్యాలను ముంచి వేసిందని అందుకే బషీర్ భీభీ  ఆలయం చుట్టూ ఇసుక మేటలు ఇంకా కనిపిస్తున్నాయని అంటారు. ఇప్పటికీ భవనం పై అంతస్తు   మసీదులా మనల్ని పలకరిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బషీర్ బిభీ ఆలయం కులమతాలకు అతీతంగా పూజలందుకుంటుంది. దేశం  నలుమూలల నుండి వచ్చే ముస్లిం సోదరులే  కాకుండా, చుట్టుపక్కల హిందూ సోదరులు కూడా తమ ఇళ్లల్లో ఆడపడుచులకు శుభం జరగాలని ఇక్కడ పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఉప్పాడ లో అనుకున్న కొండెవరం గ్రామంలో 1758లో జరిగిన కొండెవరం యుద్ధం లేదా చందుర్తి యుద్ధం గా పిలవబడే యుద్ధం మొట్టమొదటి భారత సంగ్రామంగా చరిత్రలో లిఖించబడింది. ఫ్రెంచి వారు ,పెద్దాపురంరాజులు ఒక ప్రక్క, ఆంగ్లేయులు విజయనగరం రాజులు  ఒక ప్రక్కగా ఉండి చేసిన మహా యుద్ధం చెందుర్తి మహా యుద్ధం.  అప్పటికి ఈ కొండ వరం గ్రామం ,చందుర్తి గ్రామాం పిఠాపురం మహారాజుల ఏలుబడిలో ఉండేవి. ఆనాటి నుండే పిఠాపురం రాజులు వెలుగు లోనికి రావడం ప్రారంభమైంది. బొబ్బిలి రాజుల ఆడపడుచు పిఠాపురం రాజును వివాహం చేసుకోవడంతో రావు వారి వంశీకులు ఉప్పాడ కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉప్పాడ కొత్తపల్లి ,గొర్స వంటి పలు గ్రామాలలో ఆలయాలు నిర్మించి ధర్మకర్తలుగా కొనసాగి పునీతులైనారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఉప్పాడ గ్రామం శతాబ్దాల  అలల మధ్య నుండి తన ఆనవాళ్లను అప్పుడప్పుడూ బయలు పరచడం విశేషం.



వ్యాసకర్త (  జనశ్రీ )
సిద్దాంతపు బెన్ జాన్ సన్
ఉప్పాడ కొత్త పల్లి
9908953245 
ReplyForward
at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

భార్య, భర్తల మధ్య వాగ్వాదాలు మామూలే. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో భార...

  • మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తపల్లి గ్రామాలు
    మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తప ల్లి గ్రామాలు (  జనశ్రీ)    జాంథానీ చీర కట్టుకోని మగువలు, కొత్తపల్లి కొబ్బరి మామిడి తినని భో...
  • SCHOOL BUILDING SUPARESTION
     
  • గుంటూరు శేషేంద్ర శర్మ
      నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశు త్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు'' (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేష...

Blog Archive

  • ►  2024 (16)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (1)
    • ►  June (2)
    • ►  April (2)
    • ►  February (1)
  • ►  2023 (4)
    • ►  June (3)
    • ►  May (1)
  • ►  2022 (59)
    • ►  December (1)
    • ►  November (19)
    • ►  September (1)
    • ►  August (5)
    • ►  July (2)
    • ►  June (9)
    • ►  May (11)
    • ►  April (10)
    • ►  February (1)
  • ►  2021 (9)
    • ►  July (3)
    • ►  June (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ▼  2020 (48)
    • ►  November (2)
    • ►  October (11)
    • ►  August (1)
    • ►  April (3)
    • ▼  January (31)
      • మా ఊరి కథలు 2 ( జనశ్రీ ) మా ఊరి నవాబు నాగూర్
      • చిన్నప్పటి నా అల్లరి కథ
      • క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్
      • జాన్ ..పద గీతం( జనశ్రీ)
      • కిలం......కిలం......కిలం( జన శ్రీ)
      • ప్రేమ రథం (జనశ్రీ)
      • నీలి మేఘం (జనశ్రీ)
      • మల్లె పొద (జన శ్రీ)
      • సందె మెరుపు ( జనశ్రీ )
      • నిండు నెల (జనశ్రీ)
      • నీటి బుగ్గ ( జనశ్రీ )
      • నీ పంతం నా సొంతం (జనశ్రీ)
      • అమృత చినుకు (జనశ్రీ)
      • కనుల దివిటీలు (జనశ్రీ)
      • చూపుల చుట్టం (జన శ్రీ )
      • పాపం భారతమ్మ (జనశ్రీ)
      • నేను రాను పల్లెటూరి పిల్ల (జనశ్రీ)
      • నా సంస్కృతి ప్రపంచానికి కాగడా కావాలి
      • సంస్కృతి పై సంస్కృతి
      • ఎర్ర పాళీ (జన శ్రీ)
      • ప్రజాస్వామ్యంలో పంచదారఎక్కువైంది(జనశ్రీ)
      • జా(స్మి)సన్ మొగ్గలు
      • కృష్ణా పుష్కరిణి (జనశ్రీ)
      • ఉప్పాడ కొత్తపల్లి క్రిస్మస్ క్రికెట్ కప్
      • శతాబ్దాల కడలి అలల మధ్య ఉప్పాడ ఉనికి
      • మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తపల్లి గ్రామాలు
      • moggalu
      • nora my darling
      • సమూహమే తీయని సమూహమే song
      • వజ్ర వలయం జేమ్స్ బాండ్ 007
      • చింతకూర గంప గంగమ్మ ( జనశ్రీ) మన ఊరి కథలు - 3

Labels

  • ఉప్పాడ పై తోట్టతొలి కవిత

Report Abuse

Followers

  • Home

Search This Blog

Awesome Inc. theme. Theme images by molotovcoketail. Powered by Blogger.