Monday, January 12, 2026

 గిరిజన (కొమ్మునృత్యం)


భారతీయ సంస్కృతి ప్రపంచంలోని తొలి సంస్కృతులలో ఒకటి, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన గిరిజన తెగలు కారణాల ద నివసింప పురాతన సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండటం విశేషం చిరకాలంగా అజ్ఞాతవాసం చేసిన గిరిజనుల ఆకార, వ్యవహార, విహారాల్లో మరకు గొప్ప జానపదం కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఆటవీ ప్రాంతం ఈ గిరిజన తెగలకు భవాలు ఇక్కడ నివసించే గిరిజనులలో కొండరెడ్ల ప్రధానమైన తెగ. వీరి జీవనశైలిని గమనిస్తే వీరి పండుగలకు, వివాహాలకు చేసే బైసని నృత్యం అతి ప్రధానమైనదిగా కనిపిస్తుంది. దీనినే గొర్రె గేదె నృత్యం అని కొమ్మనృత్యం అని కూడా పిలుస్తూవుంటారు.


గిరిసులు అంటే కొండజాతి వారు వీరు నాగరిక ప్రపంచానికి దూరంగా కొండలలోను; అటవీ ప్రాంతాలలోను, సహజ జీవితాన్ని గడుపుతూవుంటారు. గిరిజనుల జీవవిధానం ఆసక్తికరమైనది మనం గమనించాలిగాని వీది అలవాట్లు, పండుగలు, సంబరాలు, పెళ్ళిళ్ళు, వ్యవహారాలు ఒకటేంటి అన్నీ ఆశ్చర్యకరంగానే ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ గిరిజనులు అత్యధికంగా నివసిస్తుఉన్నారు. వీరిలో కొండరెడ్డి కొయిదొర, కొండవార, కొండకమ్మర వాల్మీకి, కొండరావులు అనే తెగలు ప్రధానంగా కనిపిస్తాయి. వారిలో కొండరెడ్డికులస్థులు.


కొండరెడ్ల జీవితాలలో పండుగలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాయి ప్రతీ పనికి ముందు పండుగలు చోటుచేసుకుంటాయి. వీరిలో మూడనమ్మకాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుచేతనే ప్రతీ పనికి ముందు దేవతను ఆరాధించడం పండుగలు చేయడం వీరికి ఆనవాయితీ. గిరిజనులు ముఖ్యంగా రక్షణ కోసం పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, కొండ దేవతలు తమ తండాలను కాపాడుతూ ఉంటాయని వీరి నమ్మకం వీరి ఆహార్యం నాగరిక సమాజానికి దూరంగానే ఉంటుంది. ఆదిమానవుని రూపురేఖలు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి. బలిష్టమైన శరీరం, సల్లని శరీరఛాయ. పాట్టిగా వుంటు ఈ గిరిజనులు మనకు కనిపిస్తారు. వీరు పండుగలకు పెద్ద పంచె, ధోవతీలను ధరిస్తారు. విల్లంబులు కలిగి ఉంటారు. వీరు అడవి నుంచే ఆహారాన్ని సేకరించుకుంటారు. పండుగలకు గ్రామాలు అన్న కలసి ఒక చోట పండుగ. జరుపుకుంటాయి. ఈ పండుగలో వీరు జీలుగు కల్లును త్రాగి, అడవి జంతులమాసం కడుపునిండా భుజించి చక్కటి గిరిజన నృత్యం అయిన బొమ్మునృత్యాన్ని నూడచక్కగా అభినయిస్తారు. ఈ గౌర్రగేదె నృత్యం చేసేప్పుడు వీరి వేషధారణ ఆసక్తికరంగా ఉంటుంది.


కొమ్మునృత్యంలో దాదాపు 30 నుండి 40 వరకు పాల్గొంటారు. మగవారు సుమారు 20 మంది వరకు ఉండి మెడలో పెద్దడోలును వేలాడదీసుకుంటారు. నెత్తిపై చనిపోయిన గొర్రుగెదె నుండి సేకరించిన కొమ్ములను శుభ్రపరచి తలపాగాలో అచ్చం గేదెకున్నట్లు అమర్చుకుంటారు. రెండు కొమ్ముల మధ్యలో నెమలి పించాలను గుత్తుగా ఉంచుకుంటారు. తలపాగా వెనుకవైపున వ్రేలాడేసుకుంటారు. నడుముకు రంగురంగుచారల లుంగీ వంటిది కట్టుకుంటారు మెడలో పెద్ద డోలును ఎడమ చేతిలో పెద్ద కర్ర ముక్కతో వాయిస్తూ కుడి చేతిలో దరువును వేస్తూ ఉంటే మధ్యలో 1 20 మంది గిరిజన స్త్రీలు చక్కటి గిరిజన జానపద గీతాలు అలపిస్తూ నృత్యం చేస్తారు. ఆడవారు వేషధారణ చూడముచ్చగా ఉంటుంది


నక్కటి ఎర్రని చీరలను గిరిజన శైలిలో కట్టుకుంటారు. వెట్టిన ఎర్రటి రిబ్బను కట్టుకుని పర్మగా పక్షి ఈకలను కట్టుకుంటారు. మగవారు వాయించే బోలు శబ్దాలకు అనుగుణంగా అడుగులువేస్తూ ఒకరి చేతులను ఒక్కదు పట్టుకుని, ఒకసారి నడుములు పట్టుకొని ఒకసారి. భుజాలపై చేతులు ఉంచి ఒడసారి అద్భుతంగా వర్తిస్తారు వీ పాటలలో శృంగారం పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీరి వృత్యలు మధ్యలో జంటలుగా విడిపోయి జతలు జతలుగా డాన్స్ చేస్తారు. బోటును వాయిస్తూ కొర్రగేదెలు యుద్ధం చేసినట్లు యేద పన్నివేసాలను 11 ఇద్దరు. అభినయిస్తుంటే మిగిలిన వారు కోలును తానా స్థాయిలో వాయిస్తూ వారిని ఉత్సాహపడుస్తూ ఉంటాలి. ఈ శాది నృత్యం లేదా

 హరిదాసు


సంక్రాంతి తెలుగువారి పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలలోని అనుభూతిని పొందాలంటే పల్లెలో జరిగే సంక్రాంతి సంబరాలను చూడవలసిందే. సంక్రాంతి పండుగ రెండు నెలల ముందు నుండి జానపదుల పలకరింపులతో మొదలవుతుంది. సంక్రాంతి పండుగలో కనిపించే సాంప్రదాయాలు, సంబరాలు, వేడుకలు అన్ని ఇన్నీ కావు అందుకేనేమో దీనిని పెద్ద పండుగని కూడా అంటారు. నెలగంట పుట్టారంటే ఆడపడుచులు వేసే ముత్యాల ముగ్గులు, బంతిపూల దండలు, ముగ్గుల మధ్యన గొబ్బమ్మలలో వీధి వీధి సుందరంగా తయారవటం చూడముచ్చటగా ఉంటుంది. సులి వెచ్చని సూర్యకిరణాలు మనలను తాకకముందే తెల తెల వారు తుండగా వచ్చే బుడబుక్కల వాడి డక్కా నినాదాలు మేలుకొలుపుతాయి. గంగిరెద్దుల వారి వివ్యాసాలు, జంగం దేవర గంట శబ్దాలు, పగటి వేషగాళ్ళ మనోహర పద్యాలు జానపదులలోని మన తెలుగుదనాన్ని గుర్తు చేస్తూ మనజాతి ప్రాచీనతను మనకు కళ్ళకుకట్టిన్నట్లు చూపిస్తాయి. వీటన్నిటి కంటే ముందుగా మనం గుర్తు చేసుకుని హమయ్య సంక్రాంతి వచ్చేసిందిరోయ్ అనుకునే సందర్భం ఎదయా అంటే మన హరిదాసు చిడతల శబ్దాల మధ్య హరిలోరంగహరి పడుకుంటూ వేగంగా మన వీధిలోంచి నడిచిపోతున్నప్పుడే అంతటి ఘనమైన సంబంధం ఉంది సంక్రాంతికి మన హరిదాసుకు హరిదాసు మన తెలుగు వారి గొప్పదనాన్ని చాటే జానపదుడే.


సంక్రాంతికి శోభను తీసుకు వచ్చే హరిదాసును గూర్చి మన తెలుగు సాహిత్యంలో గుర్తుచేసుకోని కవివర్యులు లేరంటే అతిశయోక్తికాదు. తుమ్మల సీతారామమూర్తి పరిగపంటలోను, పల్లా దుర్గయ్య గంగిరెద్దు కార్యలలోను హరిదాసును గూర్చి సవివరంగా మనకి వర్ణించి చూపారు. హరిదాసు హరినామకీర్తనలు గానం చేస్తూ చక్కని ఆహార్యం కలిగి ఉంటాడు. హరిదాసు తన తలపై అక్షయ పాత్ర నుదుటిపై తీర్చిదిద్దిన తీరునామాలు, చేతిలో చిడతలు అందంగా నేలవరకూ జీరాడే పట్టులెల్లా పంచె, కాళ్ళకు గజ్జెలు, మెదలో పూలహారం, ఎరుపురంగు పల్లెవాటును కలిగి ఉంటాడు. హరిదాసు చేతిలో చెక్కలో చేసిన చిడతలను చక్కని లయగా వాయిస్తూ చక్కటి హరినామకీర్తనకు శృతిగా తంబూర వాయిస్తూ చక్కటి గాత్ర శబ్దాలతో పాడుతూ ఉంటాడు.


ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతూ వస్తున్న హరిదాసుకు పళ్ళెంలో బియ్యం ఫలమారాలు హరిదాసు అక్షయపాత్రలో వేయాలని ఆడపిల్లలు చక్కగా ముస్తాబై ఆ రోజుల్లో వీధులో బారులు తీరేవారని మన తెలుగు కావ్యాలలో స్పష్టంగా చెప్పబడింది కూడా. సంక్రాంతి లక్ష్మికి సాహిత్యం పాడే హరిదాసు రాక మంగళప్రదమని తెలుగు మహిళలు భావిస్తూ ఉంటారు. హరిదాసు ఇంటి దగ్గర ఆగి మోకాళ్ళపై కూర్చొని ఆడపడుచులు వేసే బియ్యాన్ని బిక్షగా స్వీకరించి పైకిలేస్తూ కృష్ణార్పణం, అంటూ మరలా మరో ఇంటికి కీర్తన పాడుకుంటూ పోతు ఉంటాడు. సంక్రాంతి పర్వదినాలలోనే మనకు కనిపించే హరిదాసులు సాధారణంగా వైష్ణవ మతానుమాయిలైన సాకములు, జియ్యరులు, దాసరులు ఈ హరిదాసులుగా కీర్తనలు పాడుతూ బిక్షాటన చేస్తూ ఉంటారు. మన తెలుగు వారి సంక్రాంతి పండగను నిండుగా చూపించే అపురూప జానపదుడు మన హరిదాసుడు.

 పెద్దపులి వేషం


మాట పెద్దపులాట అని పిలువబడే ఈ ప్రాచీన జానపద కళారూపాన్ని గమనిస్తే మానవుడు తను మాటలను నేర్వకముందులను అనుకరిస్తూ వినోదించి ఆనందించిన అంశాలు ఈ పులి వేషంలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా మానవుని అధిక వశము కూడా తెలుపుతుంరీ పెద్ద పులాట పెద్దపులి అడవికి చెందిన అత్యంత క్రూర జంతువు పెద్దపులి యొక్క ప్రతీ కదలికను, తన విధానాన్ని వేటాడే దాని నేర్పరితనాన్ని, నడకను, పరుగును, వేటాడే ముందు పొంచి వుండే విధానాన్ని దాడి చేయడంలోని ఒడుపును. మడుగు దగ్గర వీరు తాగే సన్నివేశం ఆకలి దప్పుల మధ్య దానికి కలిగే ఆక్రోశం ఇతర జంతువులలో కనబడడం, పంజా విసరడం వంటి అద్భుతంగా మన ముందు ఉంచుతుడి పెద్దపులి వేషం, పులిని వేటాడిన తరువాత ప్రజలు ఆనందోత్సాహాలలో ఈ నృత్యాన్ని


చుట్టూ కళాత్మకంగాను, వినోదాత్మకంగాను మలచబడిన కళారూపం పెద్దపులాటలో ఆనందమే కాకుండా సందేశమూ ఉంది. పులి యొక్క లు వేటాడే లక్షణాలు ఆ జంతువు నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే అంశాలు మనకు ఎంతో దోహదపడతాయి. కూడాను. ఈ కళారూపం హిందూ, ముస్లిం ప్రజల ఆదరాభిమానాలను సంపాదించినది...


ఉద్దవులాలకు పెద్దాపురం రాజుల సంస్థానంలో పెద్ద పీట ఉండేది. ఈ పెద్దపులాటను క్రీస్తు శం 1714 నుండి 1734 వరకు పెద్దాపురం సంస్థానాన్ని ఏలిన శ్రీ వత్సవాయి తిమ్మంగజువలే మహారాజు ప్రోత్సహించి దీనికి గొప్ప ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాడు. పెద్దపులాట ఈనాడు. మనకు మన ముధ్య జరిగే ఉత్సవాలలోను పీర్ల సంబరాలలోను జాతరలలోను కనిపిస్తూ ఉంటుంది, 6నుండి 10 దప్పులు విపరీతంగా మోగుతుంటే నాలుగు తాసాలు బరాయి, రామ్ దోబు వినిపిస్తుంటే మధ్యలో క్లారినేట్ ఒకటి చక్కటి స్వరాలు పలుకుతుంటే ఇ దరువుల మధ్య ఈ పులి వేషం లయబద్ధంగా కదులుతూ అభినయంతో పెద్ద పులాట మనలను కట్టిపడేస్తుంది.


పెద్దపులి వేషం మగవారే వేస్తారు. ప్రదర్మంలో ఇద్దరు నుండి అరుగురు వరకు కూడా పాల్గొంటారు. పెద్దపులాట అదే కళాకారులకు మేకప్ వారు రంగులు వేస్తారు. ఈ రంగులు చేయడంలో సిద్ధాపురం మేకప్ మెన్ అంతర్వేది సూర్యనారాయణ 50 సంవత్సరాలనుండి అనుభవం గడించారు. పెద్దపులి వేషానికి రంగులలో మేకప్ చెయ్యడం ఒక ఎత్తు. పులాట కళాకారునికి మేకప్ చెయ్యాలంటే తన సర్పం ఆరుషనర్లు రాతి గరిథంలో పులి కళాకారునికి మేకప్ చేసేవారు. అతరువాత నాలుగు గంటల నుండి కాడు సంగు రాళ్లను నూరి వారి తలలు వేసి పసుపురంగు, నల్లటిరంగులను తయారు చేసేవారు ఈ రంగులు పూసేటప్పుడు కళా దేహం తొలగులు వేస్తారు మార్కెట్లో వేపానికి సంబందించిన రంగులు దొరుకుతున్నాయి.


సంస్థానాన్ని ఏలిన శ్రీ వత్సవాయి అమ్ముంగజ వలె మహారాజు ప్రోత్సహించి దీనికి గొప్ప ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాడు పెద్దపులాట ఈనాడు. మనడు మన ముధ్య జరిగే ఉత్సవాలలోను, వీర్ల సంబరాలలోను, జాతరలలోను కనిపిస్తూ ఉంటుంది. శినుండి 10 కప్పులు వివరీతంగా మాగుతుంటే నాలుగు తాసాలు బకాయి, రామడోలు వినిపిస్తుంటే మధ్యలో క్లారినేట్ ఒకటి చక్కటి స్వరాలు పలుకుతుంటే దరువుల మధ్య ఈ పులి వేము లయబద్ధంగా కదులుతూ అభినయంతో కూడిన పెద్ద పులాట మనలను కట్టిపడేస్తుంది.


పెద్దపులి వేషం మగవారే వేస్తారు ప్రదర్శనలో ఇద్దరు నుండి తిరుగురు వరకు కూడా పాల్గొంటారు. పెద్దవులాట అడే కళాకారులకు మేతస్ వారు రంగులు వేస్తారు ఈ రంగులు వేయడంలో పెద్దాపురం మేకప్ మెన్ అంతర్వేది సూర్యనారాయణ 50 సంవత్సరాలనుండి అనుభవం గడించారు. పెద్దపులి ఇట ఒక ఎత్తయితే ఈ వేషానికి రంగులలో మేకప్ చెయ్యడం ఒక ఎత్తు. పులాట కళాకారునికి మేకప్ చెయ్యాలంటే నాలుగు గంటల నుండి ఆరు గంటలు పడుతుంది పూర్వం ఆకుపసర్లు, రాతి గంథంలో పులి కళాకారునికి మేకప్ చేసేవారు. ఆతరువాత రంగు రాళ్లను మారి వార్నెస్, వాడే అయిల్, కర్పూర తైలం వేసి పసుపురంగు, నల్లటిరంగులను తయారు చేసేవారు. ఈ రంగులు పూసేటప్పుడు. ళాకారులకు రోమాలను తొలగించి వేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో వేషానికి సంబంధించిన రంగులు దొరుకుతున్నాయి.


పులి వేషానికి పెద్దపులి ముఖంలా తయారు చేసిన ముసుగును రంగులు వేసుకున్న కళాకారుడు తన ముఖానికి తగిలించుకుంటాడు. ఈ పులి ముసుగు లేదా పెద్దపులి తల తయారీ పూర్వం జంతు తోలుతో తయారు చేసేవారు. ప్రస్తుతం మేకప్ కళాకారులు అచ్చంగా పులిలా వుండే మునుగును తయారు చేస్తున్నారు. పెద్దపులి తల తయారీకి కళాకారుని శరీర ఆకారాన్ని బట్టి జిగురు మట్టితో తలలా తయారు చేస్తారు దానిపై భాగంలో కాగితాలు చట్టంగా మైదా పిండితో పొరలు పొరలుగా అతికిస్తారు. దానిని ఎండలో పెట్టినండు మూడు రోజులు ఆరనిస్తారు లోపల. మట్టిని తీసివేసి చింతపిక్కల పొడుం ఉడకబెట్టి, రంపం పొట్టు, కలిపి పులి తలకు ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, నాలుక కనుబొమ్మలు, పళ్ళు వగైరా రూపాలను తీర్చి దిద్దుతారు. గుర్రం తోక వెంట్రుకలను పులి మూతి చుట్టూ అతికిస్తారు. స్ప్రింగు వైదుకు గుడ్డ చుట్టి రంపం పొట్టు. చింతపిక్కల గుజ్జుతో తోక తీర్చిదిద్దుతారు. చేతి వంజలు తోలుతో కుట్టించి ఎద్దు కొమ్ము చివర పుల్లిగోల్లుగా చెక్క ఈ తోలుకు ఆగిలిస్తారు. ఈ 'చేతులను పులి కళాకారులు రెండు చేతులకు మోచేతి వరకు తొడుగుకుంటారు. ఈ మొత్తం వేషధారణ నిజమైన పులిలా కనిపిస్తుంది..


పులికి, పులిని చంపిన వాడికి మధ్య జరిగే యుద్ధాన్ని ఈ పెద్దపులాట ద్వారా అందరూ ఆసక్తిగా చూస్తారు ఈ పెద్దపులాటలో సాహన, క్రీడలు కూడా ఉంటాయి పులి మేకను వేటాడి తని నోటితో ఎత్తి దూరంగా విసిరిపారేయడాన్ని కళాకారులు తమ నోటిలో లాఘరంగా చేసి చూపడం ఆశ్చర్యానుభూతులను కలిగిస్తుంది. ఇంకా నోటితో నిండుగా ఉన్న నీళ్ళ బిందెను పళ్ళతో కరిచిపెట్టి పైకి లేపడం, కొన్ని ప్రాంతాలలో సిట్టింగులా చెట్లకొమ్మలను చెట్లగా నాటి వాటి మధ్య పులి, మనిషిని వేటాడం వంటివి కూడా హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఈ ప్రదర్శనలుంటాయి.


ఈ పులాటకు మేకప్ కళాకారులు అంతర్వేది వంటి గుర్తులసుబ్బారావు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు. సంచారు వెంకన్న పులాట కళాకారునిగా మన ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి చెందారు మీరు కళాకేందు ఈగల బంగార్రాజు కూడా ప్రజలు మన్ననలు పొందుతున్నారు. పగటిపూటి పిల్లలకి మంచి సం కళారఈవేశం

 శక్తి వేషం


భయానక రసాన్ని అద్భుతంగా మనకళ్లముందు ప్రదర్శించే కళారూపాలలో శక్తి వేషం ఒకటి కాళికా మాత శక్తి రూపాన్ని ధరించి రాక్షసుణ్ణి లేదా మాంత్రికుడిని మనమధ్యన కకలావికలంగా పరిగెత్తించి కింద పడేసి తనచేతిలోని త్రిసూలంతో పొడవడం అనే కథాంశంగా ఈ ప్రదర్శన సాగుతుంది. జాతరలు, సంబరాలలో ఈ శక్తి వేషం మనకి కనబడుతుంది. సత్తెమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, సంబరాలు జరిగే పెద్దాపురం, కాకినాడ, కాండ్రకోట, చింతలూరు వంటి దేవతల సంబరాలు జరిగే చోట ఈ ప్రదర్శనను మనం తిలకించవచ్చు. శక్తి వేషం కట్టే కళాకారుడు అజానుబాహుడై ఉంటాడు. ఇందు ముందు ఆరడుగులపైగా వుండి బలిష్టంగా వున్న వ్యక్తి తనముఖాన్ని


కాళికామాతలా మేకప్ చేసుకుంటాడు. నోటిలో నుండి ఎర్రని నాలుక బయటకు వచ్చినట్లు రేకుతో చేసిన నాలుకను పళ్ళ కింద బిగించుకుంటాడు. కోరపళ్ళను రంగులతో అటూ ఇటూ దిద్దుకుంటాడు. పొడవైన వెంట్రుకలు కలిగిన జత్తును విరగబూసుకున్నట్లు విగ్గు పెట్టుకుంటాడు. దానిపై రేకుతో చేసిన కిరీటం పెట్టుకుంటాడు. నుదిటిపై ఎర్రని పొడవైన బొట్టు ఉంటుంది. నల్లని కాటుకను కనుబొమ్మలకు కళ్ళ కింద పెట్టుకుంటాడు. ముఖానికి రామనీలా రంగును పులుముకుని అదేరంగుగల సాగే బనేమను చేతుల పొడవునా మొత్తం శరీరమంతా వేసుకుంటాడు. మెడలో నిమ్మకాలదండలు వేసుకుంటాడు చేతిలో త్రిశూలం రేకుతో చేసినది పట్టుకుంటాడు. సడుముకు జనపనార లేదా, వేపరొట్టలు చుట్టూ కుట్టుకుంటాడు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటాడు. మెడలో రేకు డబ్బాలను లేదా ప్లాస్టిక్ డబ్బాలను వంగ కొట్టి వాటికి తెల్లటిరంగు పులిమి పుర్రెల్లాగా వ్రేలాడేసుకుంటాడు. దీనికి ఆరు చేతులు కలిగిన కళ్ళను గిర గిరా తిప్పుతూ నాలికను వేగంగా కట్టుకుంటాడు. ఆడిస్తూ డప్పుల మోతకు తగినట్లు ఊగుతూ ఒక్కసారిగా జనాలను జడిపిస్తూ ప్రదర్శన చూసేవారు భయంతో పరుగులు తీయవలసిందే.


ఈ శక్తి వేషంతో పాటు సహకవేషాలుగా మాంత్రికుడు నాట్యకత్తిలుకుగా ఉంటారు. మొత్తం కళారూపాన్నీ పరుషులే వేస్తారు. మాంత్రికుడు ఒత్తుగా ఉన్న చిలిపిరి జత్తును పెట్టుకుంటాడు. ముఖానికి ఎర్రని తెల్లని రంగు రంగు చీరలు పూసుకుంటాడు నల్లటి నిలువు అంగీవేసుకుని చేతిలో వేపరొట్టలు మెడలో శక్తి చేషంలోలాగా పుర్రెల దండ వేసుకుంటాడు. నాట్య కత్తిలుగా నలుగురు మగవాళ్ళు సింగారించుకుని ఆడవారివలె చక్కగా డప్పులు, తానా వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తు ఉంటారు. ఆశ్చర్య పోవలసిందే వారి మధ్య మాంత్రికుడు శక్తి ముందుకు. వేపరొట్టలు ఝుళిపిస్తూ వెడుతూ మరలా వెనక్కి వస్తూ ఉంటే శక్తి వేషం ఊగుతూ, ఉంటుంది. మాంత్రికుడు దగ్గరకు రాగానే శక్తి వేషం శూలం ఎత్తి కనులు ఎర్రగా చేసి నాలిక ఆడిస్తూ మాంత్రికుడుని తరుముతూ భీకరంగా చుట్టూ పరిగెత్తుస్తుంది. అంతలోనే మరలా శాంతించి దప్పుల మోతలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. ఈ శక్తి వేషానికి అనుబంధంగా ఎలుగుబంట్లు వేషం కూడా కడతారు. గొల్లప్రోలుకు చెందిన నేరూరి అప్పారావు, గుర్రల అప్పారావు ఈ శక్తి వేషాన్ని గత పది సంవత్సరాల నుండీ కడుతూ పిఠాపురం పరిసరప్రాంతాలలో మంచి పేరు సంపాదించుకుంటూ ఇతని బృందంలో మాంత్రికుడిగా పొట్లకాయల చిట్టిబాబు, నాట్యకరైలుగా సప్పారపు యాకోబు, పొట్లకాయల సుబ్రహ్మణ్యం, పొట్ల కాయల రత్నకుమార్, దాకీ సింహాచలం ఉంటూ ఈ శక్తి వేషాన్ని రక్తి కట్టిస్తున్నారు.

Thursday, January 8, 2026

 సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర)


రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్


స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం/ ఆహ్....... సంకెళ్ళు, సంకెళ్ళు.. ఇశ్రాయేలీ జనాంగములోని మహాబలిశాలి సంసోనుకు సంకెళ్ళు, సంకెళ్ళు.... సంకెళ్ళు/ కబోధి, కబోధి..... దాను వంశీయుడు, న్యాయాధిపతి సంసోను ఈరోజుకబోధి కబోధి, సంసోను కబోధి/ ఆహ్..... ఆహ్..... అపహాస్యం, అపహా స్యం... ఓరి పిరికి ఫిలిస్తీయులారా అపహాస్యం చేస్తున్నారా..... మీ దేవాలయంలో సంబరాలు చేసుకుంటున్నారా? ఎందుకురా మీ నవ్వులు ఏమి సాధించారని సంబరాలు చేసుకుంటున్నార్రా? దొంగదెబ్బ తీసి, బంధిం చినందుకురా మీ సంబరాలు?/ సిగ్గులేని జనాంగమా నాదేవదేవుని పట్ల నేను చేసిన మహాపరాధ ఫలితమే ఈ దుస్థితే గాని, మీ దేవత గొప్పదనంరా, మీదేవత గొప్పతనము రాఇది?/


మీ దేవత గొప్పతనం. అనా మీ ప్రగల్భాలు? నా దేవదేవుని శక్తి ముందర... నా దేవదేవుని శక్తి ముందర, మీ దేవతలు ఏ పాటివిరా? మూర్ఖులారా! వాటి శక్తి ఏ పాటిదిరా? నా దేవుని శక్తి ముందు./


అయ్యో.... అయ్యో... ఈదుస్థితి, ఈ దుస్థితి. పాపానికి అమ్ముడుపోయి న పాపినైన నాకు ఆ దేవదేవుడు వేసిన శిక్షరా ఇది? ఆ దేవదేవుడు వేసిన శిక్ష. / ఆజ్ఞాతిక్రమం మహాపాపమని తెలిసి మధాందుడనై నా ప్రభువు పట్ల చేసి మహాపరాధ ఫలితమేరా ఇది ఆ ప్రభువు పట్ల చేసిన మహాపరాధ ఫలితమే./ ఓరి న్నతి లేని జనాంగమా అపుడే మరిచిపోయి నవ్వుతున్నారా? అప్పుడే

Wednesday, October 1, 2025

సినీ కథ లైనులు

 యాక్సడెంట్ లో ప్రాణాలు పోతాయి ఇద్దరికీ

స్నేహితుడే సాక్షి ఇద్దరి చావుకు

కాలంలో ఆస్ట్రెలియా పోతాడు ఫ్రెంఢు

ఓ ముప్పై సంవత్సరాల తరువాత బిజినెస్ మీద వచ్చేప్పటికి యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళతాడు స్మృతిగ 

అక్కడ ట్రాఫిక్ జామ్ లో యాక్సిడెంట్ అయి చనిపోయి మరు జన్మ ఎత్తిన ఇద్దరిని చూస్తాడు

వారు చెరువైపు పోతారు

కలా నిజమో తెలుసు కోవాలనుకుని మొత్తం తిరిగి ఇద్దరినీ వెతికి పట్టుకుని ఇద్దరి మధ్య ప్రెమను పుట్టించి పెళ్ళి చేసి తిగిరి తన దేశం పోతాడు ఫ్రెండు

Tuesday, September 30, 2025

 #అంటరానితనం.. #వెలివేయటం.. 

#మూడురూపాయిలు.. #ఎనిమిదిన్నర_రూపాయల జీతం..

#ఓ_బస్తాడు_ఒడ్లు..#ఓ_బీడీ_ట్ట. #చివరికి_ద్మభూషణ్అ_వార్డ్.

. #గడ్డ కట్టిన_మనుషుల_మధ్యన_జీవించిన #ఒక #మహోన్నతుడి_చరిత్ర.#చదవండి.

◆◆◆

#వడగాడ్పు_జీవితం

*మహాకవి గుఱ్ఱం జాషువా ప్రజ్ఞ బహుముఖీనం. ఆయన కవి, నాటక రచయిత, నేత్రావధాని, చిత్రకారుడు. ఈయన తండ్రి గుఱ్ఱం వీరయ్య యాదవ కులానికి చెందినవాడు. తల్లి లింగమాంబది మాదిగ కులం. మిషను హాస్టల్లో చాట్రగడ్డపాడుకు చెందిన లింగమాంబతో గుర్రం వీరయ్యకు పరిచయం ఏర్పడిరది. లింగమాంబను పెళ్ళి చేసుకొంటానంటే యిరుపక్షాల పెద్దలు అంగీకరించలేదు. 

క్రైస్తవ మతం స్వీకరించాలని షరతు పెట్టి, స్వీకరించిన తరువాత క్రైస్తవ మతాధికారులు వీరి వివాహం జరిపించారు. హిందూమతం, యాదవ కులం రెండూ వదిలేసి ప్రేమకోసం క్రైస్తవ మతాన్ని, మాదిగ కులాన్ని స్వీకరించాడు గుర్రం వీరయ్య. కులాంతర వివాహం చేసుకొన్న ఈ దంపతులు పేదరికం, కులవివక్ష, బంధువుల నిరాదరణలకు గురయ్యారు. నెల్లూరు దగ్గర రామాయపట్నంలో పాస్టరు శిక్షణ పొంది వినుకొండలో పాస్టరుగా పనిచేశాడు వీరయ్య. 

పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోతుండగా 1895 సెప్టెంబర్‌ 28వ తేది ఉదయం వినుకొండలో వూరికి దూరంగా వున్న మిస్సమ్మ తోటలో ఒక మూలన వున్న ఇంట్లో పుట్టాడు జాషువా. జాషువా అంటే ‘‘యెహోవాయే రక్షణ’’ అని అర్థం.

 జాషువాను తల్లిదండ్రులిద్దరూ అబ్బరంగా పెంచారు. చుట్టుపక్కల వాళ్ళు జాషువా కొంటెచేష్టల్ని భరించలేక ఇంత అల్లరి పిల్లవాణ్ణి ఎలా కన్నావమ్మా? యెప్పటికైనా బాగు పడతాడా అంటే తల్లి లింగమాంబ నా కొడుకును మీరు పెంచడం లేదుగా మీకెందుకా బాధ అని సమర్థించుకొనేది.

 వీరయ్యకు గొల్లసుద్దులు వింటే పూనకం వచ్చేది. కరియావలరాజు, పాగ్మ్యం వంటి గొల్లసుద్దుల్ని విని ఉద్వేగానికి లోనయ్యేవాడు. పలనాటి కథలంటే చెవికోసుకొనేవాడు. తండ్రి పాడిన గొల్లసుద్దులు, పలనాటి వీరగాధలు జాషువా మీద ప్రభావం చూపినాయి.

 హరిజనుల పిల్లలకు, సవర్ణుల పిల్లలకు మధ్య ఒక బల్లను అడ్డుగా వుంచిన పరిస్థితుల మధ్య జాషువా హైస్కూలు విద్యాభ్యాసం గడిరచాడు. హైస్కూల్‌ విద్య ముగిసిన తరువాత గుంటూరు జిల్లా బాపట్లలో అమెరికన్‌ బాపిస్టు మిషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో హయ్యర్‌ గ్రేడు టీచర్‌ శిక్షణ పొందాడు. ఆ తరువాత ‘ఉభయ భాషా ప్రవీణ’ చదివాడు.

జాషువా పుట్టిన పదేళ్ళ తరువాత తమ్ముడు ఇజ్రాయేల్‌ పుట్టాడు. జాషువా 15వ ఏట మేనమామ మందా వెంకటస్వామి రెండో కూతురు మేరిని వివాహం చేసుకొన్నాడు. భార్యల్ని అంత మర్యాదగా పిలిచే రోజులు కావవి. కానీ జాషువా తన భార్య మేరిని మెరాయ్‌ అని ప్రేమగా పిలిచేవాడు.

కవితా పరిశ్రమ

భాష మీద పట్టుకోసం ‘‘కంటబడ్డ పద్యకావ్యంబు సాధించి చదువకుండ వదలలేదు’’ ‘‘కవిత చెప్పువాడు గనుపింపనేయంబు సేయకుండ వెడలనీయ లేదు!’’ అని చెప్పుకొన్నాడు జాషువా. అధ్యయనంలో భాగంగా హిందూ పురాణాలు, పద్య కావ్యాలు చదవడం స్వమతస్థుల ఆగ్రహానికి కారణమైంది. హిందూ మతాన్ని ప్రచారం చేసే కథలు, నాటకాలు రాస్తున్నాడని క్రైస్తవ మతాధికారులు ఇంకా కొందరు కలిసి జాషువాను కులం నుండి వెలివేశారు. అందువల్ల తల్లిదండ్రులను, భార్యా బిడ్డలను కూడా విడిచి వూరికి దూరంగా వుండవలసి వచ్చింది. కులం కట్టుబాటు పాటించకపోతే చేస్తున్న ఫాదరీ ఉద్యోగం యెక్కడ పోతుందోనని తండ్రి వీరయ్య కొడుకును ఇంటికి కూడా రావద్దని చెప్పాడు. పగలంతా వూరికి దూరంగా వున్న పాడుబడ్డ మసీదులో వుండి రాత్రి చీకటి కాగానే రహస్యంగా ఇంటికి వచ్చి తల్లి పెట్టిన భోజనం తిని మళ్ళీ మసీదుకు చేరుకొనేవాడు.

రహస్యంగా మిత్రుల సహాయంతో మసీదులో పురాణాలను, ఇతిహాసాలను చదివి భాషను సుసంపన్నం చేసుకొన్నాడు.

 జూపూడి హనుమచ్ఛాస్త్రి అనే బ్రాహ్మణ పండితుడు జాషువాకు కాళిదాస త్రయం బోధించి సంస్కృతం నేర్చుకోవాలనే తపన తీర్చాడు. కాళిదాస త్రయం అంటే మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం.

ఉద్యోగాలూ ` అవమానాలు

 జాషువా తన సొంత ఊరు చాట్రగడ్డ పాడులో టీచరుగా నెలకు మూడు రూపాయల జీతానికి పనిచేశాడు. హిందూ గ్రంథాలను చదవడం, ఆ కథలనే నాటకాలుగా రాయడం మొదలైన కారణాలతో పాటు ఆయన ప్రణయ కలాపాలను కారణంగా చూపి ఆ ఉద్యోగం నుండి తొలగించారు.

 కొప్పరపు కవుల్లో ఒకరైన కొప్పరపు సుబ్బారావు వినుకొండ వచ్చినప్పుడు జరిగిన సభలో ఆయనమీద జాషువా ఒక పద్యం రాసి వినిపించినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. కానీ సభలోని అగ్రకులాల వాళ్ళు అంటరానివాడు యీ సభకు రావడమేమిటని సభనుండి వెళ్ళిపోయారు.

శ్రీశ్రీ రాతల్లోను, మాటల్లోను కిందకులాలను అవమానించడానికి సంకోచించేవాడు కాదు. ముస్లింలను అవమానిస్తూ కసాయిబు అనడం మాల కులాన్ని గురించి మాలవాళ్ళు రెండు రకాలు ` డ్రామాల వాళ్ళు, సినిమాల వాళ్ళు అనడం మనకు తెలిసిందే. జాషువాను ఉపకవి, ద్వితీయ శ్రేణి కవి అన్నాడు శ్రీశ్రీ. ఆయన దృష్టిలో ప్రధమ శ్రేణి కవులంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాధ సత్యన్నారాయణ. వీళ్ళిద్దరి లోనూ వాస్తవికత లేదని, వీరిది వూహాప్రాధాన్యం కలిగిన కవిత్వం అని హేళన చేస్తూ ప్రణయ కవి యొకండు, పాషాణకవి యొకండు అని జాషువా విమర్శించాడు. అందుకే నవ్య సాహిత్య సమితి ప్రచురించిన కవితా సంకలనం ‘‘వైతాళికులు’’లో జాషువా కవిత్వానికి చోటు లేకుండా చేశారు.

 ఇప్పటికీ సాహిత్యకారులు వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో చెళ్ళ పిళ్ళవారు, విశ్వనాధ వారు, దేవులపల్లివారు అని అగ్రకుల కవులను సంబోధిస్తారు. కాని గుర్రంవారు అని ఒక్కడూ అనడు.

1933లో ‘‘కవితా విశారద’’ బిరుదు స్వీకరించడానికి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అందరికీ లోపల భోజనాలు ఏర్పాటు చేసి జాషువాను వరండాలో వేరుగా విస్తరి వేసి భోజనం పెట్టారు. 1957`59 మధ్య కాలంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో స్పోకెన్‌ వర్డ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసినప్పుడు రేడియో కేంద్రంలోని బ్రాహ్మణులు జాషువా ఉనికినే భరించలేక పోయేవారు. చివరకు బీడీలు తాగుతున్నాడనే నెపంతో ఆ ఉద్యోగంలో నుండి తొలగించారు.

ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు అంటరానివారికి ప్రవేశం లేదు అని డప్పుకొట్టి చెప్పేవారు. ఇది తెలిసినా నాటకాల మీద వున్న మోజు కొద్దీ ఒకసారి నాటకానికి వెళ్ళి టిక్కెట్‌ కొనబోతే ‘నువ్వు అంటరాని వాడివి నాటకానికి రాకూడదు’ అని అవమానించారు. ఆ తరువాత రోజుల్లో మహానటుడు, పండితుడు బండారు రామారావు జాషువా రాసిన స్మశాన వాటిక ఖండకావ్యంలోని యెనిమిది పద్యాలను ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలోని కాటిసీనులో పాడినప్పుడు నిరక్షరాస్యులకు కూడా జాషువా కవితా సౌందర్యం తెలిసిపోయింది. కేవలం జాషువా పద్యాలకోసమే తెల్లవార్లు ప్రేక్షకులు ఎదురు చూస్తారు. డి.వి.సుబ్బారావు కాటిసీను పద్యాలతో గ్రామ్‌ ఫోను రికార్డు విడుదల చేసినప్పుడు మరింత ప్రాచర్యుం లభించింది. బండారు బాణీలను జోడిరచి చీమకుర్తి నాగేశ్వరరావు ప్రేక్షకులను జాషువా పద్యాలతో రంజింపచేశాడు.

బండారు రామారావు నీ పద్యాలను చెడగొడుతున్నాడు అని జాషువాకు ఎవరో చాడీలు చెప్పారు. నిజమేమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకుల మధ్యలో వుండి నాటకం చూశాడు. బండారు కమ్మని కంఠం నుండి అద్భుతమైన నటనతో జాలువారిన పద్యాలను విని జాషువా పులకించి పోయాడు. అప్పటికప్పుడు బండారు మీద పద్యం రాసి వినిపించాడు. బండారును ఆయన గురువు అద్దంకి మాణిక్యారావును గట్టిగా కౌగిలించుకొని ‘ఎంత సొగసుగా వున్నాయిరా మీ ముక్కులు. నాకొడకల్లారా ఇంత అందంగా ఎట్టపుట్టార్రా’’ అని ముద్దు పెట్టుకొన్నాడు. ఆ తరువాత వినుకొండలో బండారు రామారావుకు గండ పెండేరం తొడిగి సన్మానించాడు జాషువా.

ఒకరోజు హరిశ్చంద్ర పాత్రధారి డి.వి.సుబ్బారావు విజయవాడలో జాషువా కుమార్తె హేమలతను కలుసుకొని అమ్మా! మీ నాన్నగారి పద్యాలు పాడుకొంటూ పేరు తెచ్చుకొన్నాను. బాగుపడ్డాను. ఈ ఐదువందలూ పుచ్చుకోమ్మా అని చేతిలో పైకం పెట్టాడు.

ఘంటసాలగా పేరొందిన ఘంటసాల వెంకటేశ్వరరావు జాషువా రాసిన ‘‘శిశువు’’ పద్యాలను గ్రామ్‌ఫోన్‌ రికార్డులో పాడాడు. ఒకసారి మద్రాసులో ఘంటసాల ఇంటికి వెళ్ళాడు జాషువా. ఎవరండీ మీరు అని అడిగిన ఘంటసాల భార్యతో గుఱ్ఱం జాషువా వచ్చాడని చెప్పమ్మా అన్నాడు. లోపలికి వెళ్ళి ఘంటసాలకు చెప్పడంతో ఆయన బయటకు వచ్చి ఇక్కడే కూర్చున్నారే లోపలికి రండి అన్నాడు. నేను లోపలికి రాను. నేను బయటే ఉంటాను. ఎందుకంటే నేను అంటరాని వాడిని అన్నాడు జాషువా. భలేవారే అని గట్టిగా కౌగిలించుకొని జాషువాను లోపలికి తీసుకెళ్ళాడు ఘంటసాల.

పేదరికంలో సచేల స్నానం

మిషను స్కూల్లో ఉద్యోగం పోయిన తరువాత రాజమండ్రిలో మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశాడు జాషువా. మొదట నెలకు పదిహేను రూపాయల జీతం యివ్వడానికి ఒప్పుకొన్న సినిమా హాలు యజమాని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండుపూటలా భోజనం వరకు యేర్పాటు చేశాడు. సినిమా హాల్లో పనిచేసే వాళ్ళల్లో జాషువా ఒక్కడే దళితుడు. దళితులకు హోటల్‌లో భోజనం పెట్టరు ఒక స్నేహితుడు భోజనం తీసుకొచ్చేవాడు. చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. కట్టుకున్న జత మినహా రెండో జత బట్టలు లేవు. సెకండ్‌ షో అయిపోయిన తరువాత వెళ్ళి గోదావరినదిలో ఉన్న ఒక్కజతా ఉతుక్కొని అవి ఆరిపోయేదాకా వుండి వాటినే మళ్ళీ వేసుకొనేవాడు. ఆ వుద్యోగం మానుకొన్న తరువాత రాజమండ్రి కోటిలింగాల పాఠశాలలో శ్రీపాద కృష్ణమూర్తి సిఫారసుతో నెలకు ఎనిమిదిన్నర రూపాయల వేతనంతో తెలుగు టీచరుగా చేరాడు.

తాకట్టులో గండపెండేరం

గుంటూరు జిల్లా కొలకలూరులో నూతక్కి అబ్రహం కవి వుండేవాడు. జాషువా గబ్బిలం రాస్తే అబ్రహాం మత్కుణం (నల్లి) పద్య కావ్యం రాశాడు. ‘‘నా అనుంగు శిష్యుడబ్బు రామబ్బురముగా రాసిన మత్కుణం’’ అని జాషువా ముందు మాట రాశాడు. అబ్రహాం కూడా చాలా పేదవాడు. ఒకసారి గుంటూరు జిల్లా రేపల్లెలో శ్రీశ్రీకి, నూతక్కి అబ్రహంకు సన్మానం జరిగింది. శాలువతో సత్కరించారు. సన్మానానికి కృతజ్ఞతలు చెబుతూ... నన్ను సన్మానించినందుకు మీకు నా వందనాలు. కాని ఈ శాలువా ఎంత ఖరీదు చేస్తుందో నాకు తెలీదు. శాలువా కాకుండా ఆ డబ్బులేవో నాకిస్తే కనీసం తెల్లకాగితాలైనా కొనుక్కొనేవాడిని. నాలాంటి పేదవాడికి కావలసింది దుప్పట్లు చప్పట్లు కాదు. ఆ శాలువా ఖరీదు నాకు ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది అన్నాడు నూతక్కి అబ్రహం.

'కమెండో’ ఎడిటర్‌ వినుకొండ నాగరాజు శ్రీశ్రీని రైలు ఎక్కిస్తూ హైదరాబాదులో మీ విగ్రహం వెయ్యాలనుకొంటున్నాను గురువు గారూ అన్నాడు. దానికి శ్రీశ్రీ నువ్వు విగ్రహం ఎక్కడ వేస్తావో చెప్పు అక్కడ నేనే నిలబడతా ఆ విగ్రహం డబ్బు లేవో నాకివ్వు అన్నాడు. శ్రీశ్రీ దగ్గర డబ్బులేక పోవచ్చుకాని జాషువా నూతక్కి అబ్రహంల వంటి పేదవాడు కాదు. వీళ్ళది దుర్భరమైన పేదరికం. ‘రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడెము’ కావాలన్నాడు అల్లసాని పెద్దన. అంటే, అవి కనీస సౌకర్యాలు వారికి, నాకు అవి కూడా చాలవు అన్నాడు కృష్ణశాస్త్రి. కాని ఇంట్లో బస్తా బియ్యం బీడికట్ట ఉంటే చాలు కలాన్ని పరుగులు పెట్టించగలనన్నాడు జాషువా. ఒకసారి నూతక్కి అబ్రహం, జాషువా తెనాలిలో తిరుగుతూ డబ్బు దొరికే మార్గం లేక నీరసించిపోయారు. చివరికి గండపెండేరం తీసుకెళ్ళి తాకట్టుపెట్టి డబ్బు తీసుకురమ్మని అబ్రహంను పురమాయించాడు జాషువా. ‘‘అయ్యా! చూస్తూచూస్తూ గండపెండేరం ఎట్లా తాకట్టు పెట్టాలయ్యా! అన్నాడు అబ్రహం. మన ఆకలి కూడా తీర్చడానికి అది ఉపయోగపడనప్పుడు మనకెందుకురా అది అన్నాడు జాషువా. గండపెండేరం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో అవసరం తీరింది. ఆ తరువాత అబ్రహం కవి మూడు బస్తాలు ధాన్యం అమ్మి గండపెండేరం విడిపించుకొని జాషువాకు అప్పగించాడు.

చిత్రకారుడూ ` నఖచిత్రకారుడు

 ఒకసారి అష్ఠావధానం జరుగుతున్నప్పుడు అవధానికి ఒక సమస్య ఇచ్చాడు జాషువా. సంస్కృతంలో దాని భావం ` ఒక జంతువు నాలుగు రోడ్ల కూడలిలో               వుంది. దానికి ఎనిమిది కాళ్ళు, రెండు ముఖాలు. దానికి సిగ్గు, భయం లేవు. కామంతో ఉంది. ఈ సమస్యను పూరించమన్నాడు జాషువా. ఈ సమస్యను అవధానితో సహా అక్కడున్న వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. చివరకు జాషువా లేచి చాక్‌పీస్‌ తీసుకొని బోర్డుమీద చిత్తకార్తె పిలుపు నందుకొని ప్రణయంలో మునిగి ఉన్న ఆడకుక్క మగకుక్క బొమ్మగీసాడు. అప్పుడు అర్థమయింది అందరికి, రెండు ముఖాలు ఎనిమిది కాళ్ళ జంతువు అంటే.

1952లో ఒక రోజు సాయంత్రం గుంటూరులో మాధవరెడ్డి రాజయ్యగారి ఇంటికి వెళ్ళాడు జాషువా. అక్కడ పిల్లల్ని వెంటతీసుకొని తిరుగుతున్న తల్లికోడి కనిపించింది. టేబుల్‌పైనున్న కార్డు ముక్క తీసుకొని గోటితో కదులుతున్న పిల్లల కోడి దృశ్యాన్ని చిత్రీకరించాడు జాషువా. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. రాజయ్య చూసి కవిగారూ! మీకు నఖచిత్ర కళలో సైతం ప్రావీణ్యమున్నట్లు చాలామందికి తెలియదే! అన్నాడు సంతోషంగా.

భార్య మరణం

 భార్య పిల్లలను ప్రాణంగా చూసుకొనేవాడు జాషువా. భార్య మేరీని ప్రేమగా మెరాయ్‌ అని పిలిచేవాడు. ‘‘ఆమె శరీర వర్ణం పసిడి కాంతులీనుతుంది. ఆమెను భరతమాతగా నటింపచెయ్యాలంటే కిరీటం ధరింపజేస్తే చాలు అని రాశాడు జాషువా శిష్యుడు పెద్ది సత్యనారాయణ. జాషువా యెక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు మంచి జరగాలని భార్య యెదురొచ్చేది. నాకు రైలు అందకపోయినా, దొంగ జేబుకొట్టినా నీవే జవాబు దారీ అని హాస్యమాడేవాడు జాషువా.

భీమవరం సన్మానానికి బయల్దేరి వెళుతున్నప్పుడు నన్నుకూడా తీసుకెళ్ళండి అని భార్య మేరీ అడిగింది. ఈసారి తప్పకుండా తీసుకు వెళ్తాను మెరాయ్‌. ఇప్పుడు ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో అని నచ్చ చెప్పి వెళ్ళాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సన్మానసభలో తన పద్య పఠనంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న సమయంలోనే మేరీ మరణించిదన్న దుర్వార్త జాషువాకు తెలిసింది. భార్య మరణవార్త వినడంతోనే కన్నీరు కట్టలు తెంచుకొంది.

 ‘‘నీ వటు కాటిదిక్కు పనయనించిన నాటి మరుక్షణాన 

 సర్వావయ సంధిబంధనములన్నియు వీడె కవిత్వ భారతీ

 దేవత మూగవోయె సుదతీమణి నాదు కళా స్రవంతియున్‌

 నీ వెనుకన్‌ శ్మశాన ధరణిన్‌ నిదురించినదో ! సతీమణీ !’’

పిల్లలందరిలో హేమలత అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఆమెకు చిన్నప్పుడే సాహిత్యంతో పాటు భరతనాట్యం కూడా నేర్పించాడు. గుంటూరు ఏ.సి. కాలేజీ అసెంబ్లీ హాలులో కనకాభిషేకం చేసిన సన్మానసభకు ముందుగా హేమలత భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఆమె నాట్యం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె లవణం (విజయవాడ నాస్తిక కేంద్రం వ్యవస్థాపకుడు గోరా కుమారుడు) ను కులాంతర వివాహం చేసుకున్నది.

 అయిదవ కుమార్తె !

 లవణం గారికి అర్థాంగి

 సహజ కరుణాన్విత !

 దివ్యాదర్శ భరిత !

 హేమలత !

 మిత్ర ప్రలాప

 ధర్మజ్ఞ సుమా !

 అని తన కుమార్తె గురించి జాషువా రాశాడు.

 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించింది. కానీ అంతలోనే జాషువాకు పక్షవాతం వచ్చింది. కదలలేని స్థితిలో ఉండగా గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఆ బిరుదుకు సంబంధించిన పత్రం ` బహుమతులు చేర్చారు. సిల్కు లాల్చి, పంచె ధరించి జరీ కండువా వల్లె వాటుగా జారవిడిచి పెద్ద పెద్ద అంగలు వేస్తూ మీసాలను సవరించుకొంటూ యెప్పుడూ శిష్యులూ అభిమానులు వెంట రాగా హుందాగా తిరిగిన జాషువా మాట పడిపోయి మంచం పట్టాడు. ఎవరైనా యెలా ఉన్నారూ అని అడిగితే జవాబుగా మీసం మీద చెయ్యివేసి మెలి తిప్పేవాడు. కవితాభిమానులు, బంధువులు, స్నేహితులు జాషువా 75వ జన్మదినాన్ని వైభవంగా జరిపారు.

 ‘‘నరజన్మంబను వ్యాధి బాధల కమోఘంబైన దివ్యౌషధం బరయన్‌ మృత్యువు’’ అని రాసుకొన్న జాషువా జులై 24 ` 1975న గుంటూరులో మరణించినా ప్రజల నాల్కలపై నిలిచే ఉన్నాడు.

◆◆◆

#గుర్రం_జాషువా జీవితాన్ని, కృషిని, కల్పనాశక్తిని, సామాజిక అడ్డంకులను అధిగమించిన దారిని, అలాగే ఆయన కవిత్వ, నాటక, చిత్రకళ, ఉపాధ్యాయతలో చేసిన ప్రతిభను మనం పరిశీలించవచ్చు. దీనిని ఒక సమగ్ర, పాఠక సౌకర్యానికి అనుగుణమైన రూపంలో ఇలా సారాంశంగా చెప్పవచ్చు:

గుర్రం జాషువా: అంటరానితనం గల మహోన్నత వ్యక్తి

#పుట్టినది_కుటుంబ నేపథ్యం

1895 సెప్టెంబర్ 28న వినుకొండలో మిస్సమ్మ తోటలో పుట్టిన జాషువా, అర్థం “యెహోవాయే రక్షణ”. తండ్రి గుఱ్ఱం వీరయ్య (యాదవ కులం), తల్లి లింగమాంబ (మాదిగ కులం) కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమకథ క్రమంలో వారు పేదరికం, సామాజిక నిరసనలు ఎదుర్కొన్నారు.

#విద్యాభ్యాసం

చిన్నప్పటినుంచి జాషువా అల్లరి, అంగవైకల్యంతో కూడిన శక్తివంతమైన మనసున్న వాడు. హైస్కూల్‌ విద్యను పూర్తి చేసి, అమెరికన్ బాపిస్టు మిషన్ ట్రైనింగ్ స్కూల్‌లో హయ్యర్ గ్రేడు టీచర్‌గా శిక్షణ పొందాడు. ఆ తరువాత ‘ఉభయ భాషా ప్రవీణ’ అని భాషాపరంగా ప్రావీణ్యం సంపాదించాడు.

#కవితా_సాహిత్య పరిశ్రమ

భాషాపట్ల ఆసక్తితో కవి, నాటక రచయిత, ఉపన్యాసకారుడు, చిత్రకారుడు అయ్యాడు. భిన్న మత, కులాల మీద నిరసనలు, ప్రణయకళాపాల కారణంగా కులం, మతం పరిమితులు పాటించకపోవడం వల్ల, కుటుంబం నుండి, ఉద్యోగం నుండి కొన్ని సందర్భాల్లో విడిపోయే పరిస్థితి వచ్చింది.

కాళిదాస త్రయం (మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం) ను జూపూడి హనుమచ్ఛాస్త్రి బోధించి సంస్కృతంలో అవగాహన కల్పించాడు. పద్య రచన, నాటక ప్రదర్శనల ద్వారా సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. డి.వి. సుబ్బారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి కళాకారులు జాషువా రచనలను ప్రసిద్ధం చేశారు.

#ఉద్యోగాలు_అవమానాలు

చాట్‌ర్గాడ్డపాడు, వినుకొండ వంటి ప్రాంతాల్లో టీచర్‌గా, సినిమా వ్యాఖ్యాతగా, రేడియో స్పోకెన్‌వర్డ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. క్రీడల వంటి సామాజిక, మత, కుల-based అవమానాలు, జీతాలు తక్కువగా ఉండడం, ఇతర అసౌకర్యాలను అధిగమిస్తూ తన కృషితో జీవనం కొనసాగించాడు.

#చిత్రకళలో_ప్రతిభ

అష్టావధానం, నఖచిత్రకళ, జంతు, పిల్లల దృశ్యాల చిత్రీకరణలలో ప్రతిభ చూపాడు. ప్రత్యేకంగా అబ్రహం కవి, నూతక్కి అబ్రహం వంటి ఇతర కవులతో కలసి కవిత్వ పరస్పర కృషిని ప్రదర్శించాడు.

#వైద్య_కుటుంబ_పరిణామాలు

భార్య మేరీతో ప్రేమగా జీవించాడు. ఆమె మరణం, పక్షవాతం వంటి వ్యక్తిగత కష్టాలను అధిగమించి, కవిత్వం, విద్యాభ్యాసం కొనసాగించాడు. కుమార్తె హేమలతను సాహిత్యం, నాట్యంతో పెంచి, ఆమెను సాహిత్య, నృత్య ప్రతిభతో సన్మానింపజేశాడు.

#పద్మభూషణ్‌_అవార్డు

1970లో భారత ప్రభుత్వం జాషువాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కానీ ఆ సమయంలోనే పక్షవాతం కారణంగా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ, బిరుదుకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.

#మరణం

1975 జులై 24న గుంటూరులో మరణించాడు. కవిత్వ, సాహిత్య ప్రావీణ్యం, సామాజిక ధైర్యం కారణంగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయాడు.

సారాంశం:

గుర్రం జాషువా చిన్న వయస్సు నుండి కవిత్వ, నాటక, చిత్రకళల్లో అసాధారణ ప్రతిభ చూపించిన మహోన్నతుడు. సామాజిక, మత, కుల-based అవమానాలను ఎదుర్కొని, సాహిత్య, విద్యా, కళారంగాల్లో స్థిరమైన గుర్తింపును సంపాదించాడు. అతని జీవితము పేదరికం, వ్యక్తిగత నష్టాల మధ్యన కూడా సృజనాత్మకతను, ధైర్యాన్ని ప్రదర్శించింది.

ALIVI