రచన రంగవల్లులు RACHANA RANGAVALLULU

JANASRI

Friday, January 10, 2020

మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తపల్లి గ్రామాలు


మా జంట ఊళ్ళు ఉప్పాడ - కొత్తపల్లి గ్రామాలు
(  జనశ్రీ)
  

జాంథానీ చీర కట్టుకోని మగువలు, కొత్తపల్లి కొబ్బరి మామిడి తినని భోజనప్రియులు మనదేశంలో లేరంటే  అతిశయోక్తి కాదు.  ఆ చీర తయారీ గొప్పదనం, కొబ్బరి మామిడి తీయదనం అటువంటిది మరి.ఈ గొప్పదనం  మా ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలదే. హైదరాబాదు- సికిందిరాబాదు ,
న్యూఢిల్లీ- ఓల్డ్ ఢిల్లీ  జంట నగరాలు లాగా ఉప్పాడ- కొత్తపల్లి గ్రామాలు  జంట గ్రామాలు. తెల్లారితే సుప్రసిద్ధులు ఖరీదైన కార్లలో జాంథానీ చీరలకోసం బారులు తీరే మా ఊళ్ళు ఉప్పాడ-కొత్తపల్లి గ్రామాలు. ఈ ఊరి వాడిని అయినందుకు నేను ఎంతో గర్విస్తాను.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సుప్రసిద్ధ పట్టణం కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో,ప్రసిద్ద పుణ్యక్ష్రేత్ర పట్టణం పిఠాపురానికి 10  కిలోమీటర్ల దూరంలోనూ, బంగాళాఖాతం సముద్రపు ఒడ్డున కొలువుదీరిన గ్రామాలు ఇవి . పొడవైన బీచ్ రోడ్డును కలిగి సాగర ప్రేమికులను ,యాత్రికులను పలకరిస్తూ పులకరింప చేస్తాయి. నా బాల్యపు గుర్తులు  ఎన్నో మధురమైన స్మృతులుగా ఈ ఉప్పాడ కొత్తపల్లి గ్రామం ఇచ్చింది. ఈ గ్రామాల పేర్లు తలుచుకోగానే మదిలో వెల్లువగా పొంగుకు వస్తాయి తీపి జ్ఞాపకాలు.
ఉప్పాడలొ పెదబజారు లోని పురాతన ఇల్లు
నిజానికి ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలు చిన్న గ్రామాలైన ఉప్పాడలో అమీనాబాద్,  మాయా పట్నం, కొత్తపట్నం, సుబ్బంపేట , కొత్తపల్లిలో రవీంద్ర పురం, కుతుకుడుమిల్లి, వాకతిప్ప చిన్న గ్రామాలు కలిసిపోయి పెద్ద గ్రామాలుగా కనిపిస్తూ ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలుగా పిలవబడుతూ ఉన్నాయి.సుమారు 10 వేల మంది వివిధ వర్ణాల వారు నివసిస్తూ ఉన్నా ఎటువంటి భేషజాలు లేకుండా జీవిస్తారు. ఉప్పాడలో బెస్తవారు , నేతవారు, కొత్తపల్లిలో నేతవారు, రైతులు ఎక్కువగా నివసిస్తూ  ఉంటారు. 
బోసు బొమ్మ సెంటరు వద్ద పెద్దబ్బాయి కీళ్ళీషాపు
మా తల్లిగారు స్వగ్రామం  ఉప్పాడ లోని అమీనాబాద్. ఇదే గ్రామంలో ఉపాధ్యాయురాలిగా చాలాకాలం పని చేశారు .మా తండ్రిగారు హెల్త్ సూపర్వైజర్ గా ఈ గ్రామాలలోనే సుదీర్ఘ కాలం పని చేశారు కూడా. నా బాల్యమంతా ఈ గ్రామంలోనే గడిచింది, ఒక రకంగా నేను అదృష్టవంతుణ్ణి పఠనాశక్తి నా తల్లి నాకిచ్చిన వరమైతే .నా తండ్రిగారు సాంఘిక సేవా , సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించారు. అందుచేత నా మిత్రులందరులో నేను ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉండేవాడిని. మరో రకంగా నేను అదృష్టవంతుణ్ణి కూడా. నా బాల్యపు రోజుల్లో  టీవీ ,సెల్ ఫోన్లు లేవు. నేను పూర్వకాలపు గుర్తులకి ,ఆధునిక ప్రపంచ పోకడలకి మధ్యలో పుట్టాను. అందుచేత నా బాల్యం         పల్లె పరిసరాలతోను, వృద్ధుల అనుభవాలతోను, గ్రంధాలయ పుస్తకాలతోను, పల్లెటూరి ఆటలతోనూ గడిచిపోయింది. ఇందులో నన్ను చరిత్ర ,సాహిత్యం అంశాలు బాగాఆకర్షించాయి. అందుచేత నేను ఈ వ్యాసం
రాయగతున్న
అడుగు అడుగుకో చర్చ్
బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క గ్రామంలో అత్యధిక చర్చిలు కలిగిన గ్రామంఏదైనా వుందంటే అది ఉప్పాడ అనే అంటాను. ఎందుకంటే 120 చర్చిలు ఉన్నాయి .కొత్తపల్లి గ్రామంతో కలుపుకుంటే 140 వరకు ఉండవచ్చు. రికార్డు కావచ్చు కూడా . ఈ గ్రామాలలో ఇన్ని చర్చిలు ఉండటానికి కారణం తెలుసుకోవాల్సిందే మరి.
1885 సం॥  ప్రాంతంలో బ్రిటిష్ వారు పిఠాపురం మార్కెట్ వీధుల్లో వాక్య ప్రకటన చేస్తూ ఉంటే  నాగులాపల్లికి చెందిన కొందరు గ్రామస్తులు  పిఠాపురం సంత కోసం వెళ్లి ఆ క్రీస్తు వాక్యానికి ఆకర్షితులై మొదటగా క్రీస్తును నమ్ముకున్నారు.వారే నాగులపల్లిలో ఓ చర్చిని  నిర్మించడం కూడా జరిగింది. పిఠాపురం క్రిస్టియన్ మెడికల్ సెంటర్ నుండి  మిషనరీలు  కొత్తపల్లిలో ఆసుపత్రి ఒకటి,  ఉప్పాడలో బడి ఒకటి ప్రారంభించాలని తలంచి నాగులాపల్లిలో ఐదవ తరగతి చదివి  క్రైస్తవ మతం స్వీకరించిన తాతపూడి హనోకు ,భార్య  మరియమ్మలను అమీనాబాద్ గ్రామం నందు1930 లొ ఉపాధ్యాయులు మరియు భోదకులుగా  నియమించారు.
         1930  లో మొట్టమొదటి క్రైస్తవమత భోదకుడు హానోకు
1904  లో నాగులా పల్లి లో జన్మించిన తాతపూడి హనోకు  మేన్ విత్ ద లాంప్  అని పేరు తెచ్చుకున్నాడు. మరియమ్మను వివాహమాడిన హనోకుకు 5 కుమారులు ఒక కూతురు.
హనోకు ఉప్పాడ ప్రాంతానికి మొదటి టీచరు, మొదటి క్రైస్తవుడు 1966 లో పరలోక పిలుపు అందుకున్నారు
ఈలోగా 1950 ప్రాంతంలో వేట్లపాలెం నుండి వచ్చిన   ఏసుదాసు అనే క్రైస్తవభోదకుడు నిరక్షరాస్యులైన బెస్తవారి మధ్య తిరుగుతూ క్రైస్తవ మతం బోధించసాగాడు. మాటతీరు వాక్య పరిచర్య బెస్తవారి హృదయాలను చూరగొనడంతో క్రైస్తవమతాన్ని  మొత్తం గ్రామస్తులందరూ  స్వీకరించారు. ఎంతగా అంటే  ఇంటింటికి ఒక చర్చి కట్టుకునేలా.యేసూ ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చ్,  బేతేలు బాప్టిస్ట్ చర్చ్, ఫుల్ గోప్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ , క్రీస్తు గలలియ సంఘం  వంటి చర్చలు వెయ్యి మందికి పైగా విశ్వాసులను కలిగి ఉన్నాయి. రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న ప్రతీ క్రైస్తవ మతబోధకుడిని ఉప్పాడకు వచ్చి వాక్య పరిచర్య చేయించనిదే ఇక్కడ క్రైస్తవ సంఘకాపరులకు నిద్రపట్టదు .అలా నేను ప్రసిద్ద భోదకులను అందరినీ చూసాను.

    జాంథాని చీరల సొగసులు

జైపూర్ మహారాణి ముచ్చటపడిన చీర జాంథానీ చీర.  వస్త్ర ప్రపంచాన్ని  నివ్వెరపర్చిన చీర ఇది. అతి ఖరీదైన చీర కావడంతో ఆ రోజుల్లో జైపూర్ మహారాణి తప్ప ఎవరూ ఈ చీరలు ధరించేవారు కాదు.  గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఈ జాంథానీ చీర గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనితో
రోజూ ఆకలితో మల మల లాడిన చేనేత పరిశ్రమ
విమానాల్లో తిరుగుతూ వస్త్ర వ్యాపారాన్ని తారాస్థాయికి చేర్చింది . జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చీర ఇక్కడే తయారయింది. సుమారు లక్ష రూపాయల పైబడిన ఖరీదైన చీరలు ఆర్డర్ పై నేస్తారు ఇక్కడ. పర్షియన్ పదం జాంథానీ.  అంటే పూలగుత్తి లేదా  ఫ్లవర్ వాజ్ అని అర్థం. చీర మొత్తం చేతిలోనికి తీసుకొని చూస్తే  పూలబొకే పట్టుకున్నట్లుగానే ఉంటుంది.

            
       

    జాంధానీ జిలుగుల చీర

అతి సున్నితమైన  దారాల మధ్య డిజైన్లు నేయవలసి  రావడంతో చిన్న చిన్న  సుతిమెత్తని వ్రేళ్ళుకలిగిన 14 సంవత్సరాల లోపు చిన్న పిల్లలను ఈ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించవలసి వస్తుంది. నిజానికి ఈ పరిశ్రమను మెచ్చుకోక తప్పదు. మా ఊరిలో కులమతాలు, కులవృత్తులను  కూలద్రోసి ఆర్థిక భరోసా కల్పించింది. అన్ని వర్గాలవారు గొప్పగా బ్రతుకుతున్నారు ఇప్పుడు. ఉప్పాడ - కొత్తపల్లి గ్రామాలను ఈ జాంథానీ వస్త్ర పరిశ్రమే ప్రపంచానికి పరిచయం చేసింది. రొబ్బి వారి పట్టు వస్త్రాలు కూడా  పేరెన్నిక గన్నవే. ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలలో దాదాపు 200 బట్టల దుకాణాలు ఉన్నాయంటే నాకు నిజంగా నమ్మశక్యంగా లేదు ఇప్పటికీ.

      కొత్తపల్లి కొబ్బరి మామిడి

వేసవి వచ్చిందంటే ఆవకాయ కోసమని, అసలు సిసలు మామిడిపండ్ల రుచిని చూడడం కోసం అని కొత్తపల్లి కొబ్బరి మామిడిని తలచుకోని ఆంధ్రుడు ఉండడు . ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడితో అప్పుచేసైనా  సరే  ఆవకాయపచ్చడి పెట్టుకొని తీరవలసిందే .కొత్తపల్లి కొబ్బరి మామిడి  పుల్ల పుల్లని మామిడి కాయగా ఉన్నప్పుడు పండిన తర్వాత అద్భుతమైన తీపిని సంతరించుకోవడం ఈ కొబ్బరి మామిడి ప్రత్యేకత.  కొత్తపల్లి  ఊరి పేరునే కలిగిన కొబ్బరి మామిడి
రకం ఈ గ్రామానికి చెందినదే.ఈ కొత్తపల్లి గ్రామం  నుండే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రిలకూ ప్రతీ సంవత్సరం  రావువారి కుటుంబాలు బుట్టలు ,బుట్టలు మామిడి పండ్లు ఢిల్లీకి పంపేవారు.
నెహ్రూ గారికి చాలా ప్రీతిపాత్రమైన మామిడి ఫలమిది. ఇక్కడి గ్రామాలవారు బంధువులకు ,ప్రముఖులకు ప్రతీ సంవత్సరం కొత్తపల్లి కొబ్బరి మామిడి పండ్లు అడిగినా అడగకపోయినా పంపించడం  ఆనవాయితీగా వస్తుంది.
అందమైన సాగరతీరం ఉప్పాడ బీచ్ రోడ్
బీచ్ రోడ్డు దాదాపు ఇటు తుని నుండి అటు కాకినాడ వరకు 40 కిలోమీటర్లు ఉంటుంది .ఉప్పాడ బీచ్ రోడ్డు అయితే సముద్రాన్ని అనుకుని ఉండడంతో ప్రయాణీకులకు మధురమైన అనుభూతిని కలిగిస్తుంది .దాదాపు కాకినాడ వరకు పది కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డు యాత్రికులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది .  తుఫాను వస్తే చాలు టివీ లన్ని మా ఉప్పాడ కెరటాల పొంగునే చూపిస్తాయి. ఇక్కడ సాగర దృశ్యాలను  ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించడానికి ఉదయం నాలుగు గంటల నుండే బీచ్ రోడ్డులో ఫోటోలు తీస్తూ హడావుడిగా తిరుగుతూ కనిపిస్తూవుంటారు. తూర్పు వైపున సూర్యోదయం అవుతూ ఉంటే ఆ సూర్యోదయ కాంతిలో తెరచాప పడవలు పయనిస్తూ ఉండే దృశ్యాలు చూడడానికి కన్నులు చాలవు . తుఫాను వస్తే అన్ని టి.వి చానళ్ళు ఉప్పాడ బీచ్ రోడ్డు పై పారే సముద్ర కేరటాలను చూపించ వలసిందే. అది చూసి దూరాన ఉండే బందువులు ఇక్కడివారి యోగ క్షేమాలు అడుగుతూ వుండండం నిత్యకృత్యం.
 
ఫోని తుఫానుకు ఉప్పాడ బీచ్ రోడ్డు పైకి వచ్చిన కెరటం
సినీ పరిశ్రమ ఈ ప్రాంతం యొక్క అందాలను గుర్తించింది.
అనేక సినిమాల షూటింగులు శరవేగంగాజరుగుతున్నాయి.
ఈ ప్రాంతంలో జయప్రద మొట్టమొదటి సినిమా నాకూ స్వతంత్రం వచ్చింది  ఇక్కడ రూపుదిద్దుకున్నదే. కొత్తపల్లి గ్రామానికి చెందిన యువదర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీస్ సినిమా షూటింగ్ వైష్ఞవతేజ హీరోగా జరుపుకుంటోంది ప్రస్తుతం.ఇప్పుడిప్పుడే ఇక్కడ మా
ఊరి కళాకారులు సినీ పరిశ్రమలో స్థిరపడుతూ
ఉన్నారు . ప్రేమికులు,యువకులు యాత్రికులు,
చిన్నలు, పెద్దలు ఎవరైతేనేమి ఉప్పాడ సముద్రం
దగ్గర ఫోటో దిగాల్సిందే .ముఖానికి కొట్టే కెరటాల
చిరుజల్లుల .అనుభూతిని ఆస్వాదించాల్సిందే.
వేసవివిడిది మా కొత్తపల్లి హైస్కూలు
1950 లో నిర్మించిన ఈ పాఠశాల అతి పురాతనమైనది. చుట్టుప్రక్కల గ్రామాలలోని వేల మంది విద్యార్థులకు విద్యను అందించిన ప్రసిద్ధి  చెందిన పాఠశాల ఇది .మా చిన్నతనంలో ఈ జిల్లా పరిషత్ హైస్కూలు ఓ గొప్ప వేసవి విడిదిగా ఉండేది. గ్రామంలోని ప్రతి కుర్రవాళ్ళు  చదరంగము ,క్యారం బోర్డు ,క్రికెట్ ,వాలీబాలు ఆడుకుంటావుండేవారు. పెద్దవాళ్ళయితే కుర్చీలు వేసుకుని  పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వుండేవారు.కళాకారులు పాటలు ప్రాక్టీస్ చేస్తూ సంగీత వాయిద్యాలు ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఈ పాఠశాల 1600 మంది విద్యార్థులతో కళకళలాడుతుంది .మూడు అంతస్తుల్లో కొత్తగా కట్టిన ఈ పాఠశాల చూడడం ఓ మధురానుభూతి. ఈ పాఠశాలలను ప్రభుత్వం వారు త్వరలో బాలురు బాలికల పాఠశాలల ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
ఆశ్చర్యపరిచే కత్తిపోటు వేషాలు
కార్తీకమాసం వచ్చిందంటే గౌరమ్మ సంబరాలు మాఊళ్ళలో ఘనంగా చేస్తారు . ఈ సందర్భంగా నెల రోజులపాటు మా ఊరిలో  జరిగే వీరనాట్యం ఓ ప్రక్క మరో ప్రక్క కత్తిపోటు వేషాలు అలరిస్తాయి.  కత్తిపోటు ప్రదర్శన గ్రామంలో వీధి వీధి తిరుగుతూ వుంటే పిల్లలు భయ బ్రాంతులకు గురవ్వడం, కొత్తగా తిలకించేవారు ఆశ్చర్యచకితులవ్వడం పరిపాటి. రకరకాలైన  దేవతామూర్తులు , ప్రసిద్ధి చెందిన వీరుల యొక్క వేషాలు వేస్తారు. ఇవే బండ్లమీద వేషాలు  అంటారు.
  కత్తిపోటు వేషాలు వీటి ముందు నడుస్తూ ఉంటాయి. కంఠంలోకి బల్లెం గుచ్చటం,పెద్ద కత్తితో  భుజాన్ని నరకడం ,
ఒక మనిషికి అటూ ఇటూ నిలబడి ఆ మనిషి కడుపులోంచి రంపాన్ని  దూర్చి ఇద్దరూ రంపపు కోత కోయడం, ప్రక్కలోబల్లె పోటు ,బుగ్గల్లో అటు ఇటు కత్తులు దూర్చుకోవడం, గొడ్డలి తలమీద నుండి గొంతులోకి వచ్చేలా చేసే "గొడ్డలి వేటు" అద్భుతంగా ప్రదర్శిస్తారు మాఊరిలో. స్కూలు ఎగ్గొట్టి పిల్లలు ఈ వేషాలు చూస్తూ పరుగులు తీయడం బలే ముచ్చటగా ఉంటుంది.

ఉప్పాడ సముద్ర స్నానాలు

మాఘమాసంలో ఉప్పాడలో మాఘపౌర్ణమినాడు సముద్ర స్నానాలు ఆచరించడానికి ఇంటిలో అందరం వెళ్ళే వాళ్ళం. మా ఉప్పాడ-కొత్తపల్లి పరిసరప్రాంత ప్రజలకు ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పిఠాపురం నుండి కుంతీమాధవస్వామి తెల తెలవారతుండగా వచ్చి సముద్రస్నానమాచరిస్తాడు, తిరిగి వెడుతూ ఊప్పాడ లోని శ్రీ భ్రమరాంబికా మల్లేశ్వర స్వామిని దర్శించి వెళతాడు .తరువాత నుండి భక్తులు స్నానాలు ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా జరిగే తీర్దం ఎంతబాగుంటుందో.దూరపుచుట్టాలు ఈ స్నాననాలకు రావడంతో తీర్ధం ఎప్పుడు వస్తుందా చుట్టాలు ఎప్పుడు వస్తారాని ఎదురు చూసేవాళ్ళం చిన్నప్పుడు.
                     ఆధునిక చారిత్రిక నేపథ్యం      
   వాకతిప్ప పంచాయితీ ఆఫీసులో
                ఉన్న ఆనాటి   గాంధీ విగ్రహం
కొత్త పల్లి లోని రామాలయం దగ్గర గాంధీ విగ్రహం ఉండేది. గాంధీ వచ్చి స్వాతంత్ర్యపొరాట  సమయంలో ఉత్తేజితమైన  ఉపన్యాసం ఇచ్చారని  చెబుతారు. జిల్లాకి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చెలికాని రామారావు గారు ఈ కొత్త పల్లి మండలంలో కొండెవరం గ్రామానికి చెందినవారే. పిఠాపురం సంస్థానాధీశుల ఏలుబడిలో సుదీర్ఘకాలం ఉన్నాయి ఉప్పాడ కొత్తపల్లి గ్రామాలు. రావు వారి  వంశీకుల పూర్వపు కట్టడాలు కొత్తపల్లి గ్రామంలో ఇప్పటికీ కనిపిస్తాయి.
కొత్తపల్లిలో రామాలయం దగ్గర రావు మురళీగారి ఇల్లు
ప్రస్తుతం ఈ గ్రామాలు పిఠాపురం నియోజక  వర్గంలో ఉన్నాయి.  హైస్కూలుకి కూతవేటు దూరంలో  రవీంద్రపురం వెనుక వీదుల నుండి ఎండపల్లికి వెళ్ళే మార్గంలొ చేలమధ్య
ౌఓ చారిత్రక కట్టడం వుండేది. దానిని స్వరంగమార్గం అనేవారు..  పూర్వం పిఠాపురం మహారాణులు ఈ స్వరంగ మార్గం ద్వారా వచ్చి సముద్రస్నానం ఆచరించే వారంటారు . ప్రస్తుతం  సంరక్షణలేక రైతులు ఆక్రమించి పూర్తిగా నాశనం చేసారు. అక్కడ ఒక్క శివలింగం మాత్రమే మిగిలింది. దాని మీద శిలాఫలకం పిఠాపురం దివానం గారి సతీమణి
ఙ్ఞాపకార్దం నిర్మించినట్లుగా శాసనం మీద రాతలు
కనిపిస్తున్నాయి.స్వరంగమార్గాన్ని పూడ్చివేసినట్లుగా రైతులు చెబుతుండడం అధికారుల నిర్లక్ష్యానికీ నిదర్శనం.
                పిఠాపురం దివాను గారి శిలాఫలకం
అపార మత్ససంపద ఉప్పాడ సొంతం
మా ఉప్పాడ చేపల వ్యాపారానికి చాలా ప్రసిద్టి .వందలాది నావలు,పడవలు,బోట్లు ద్వారాచేపల వేట జరుగుతూ వుంటుంది. నేపాల్ ,చైనా, జపాన్, బర్మా ,సింగపూర్ దేశాలకు  రొయ్యలు ఎగుమతి చేస్తూ వుంటారు. ఇంకా స్థానికంగా అలివి ద్వారా జరిగే చేపలవేట చూసి తీరవలసిందే. కొన్ని రకాల రొయ్యలు ఉప్పాడ దగ్గర తప్ప మరోచోట దొరకవంటారు. వాటి రుచే వేరని నాన్ వెజ్ ప్రియులు చెబుతూ లొట్టలు వేస్తారు. మా ఇంటికి ఎవరు వచ్చినా సొరపిట్టి, పీతలకూర అడిగి మరీవండించుకునేవారు. మాగ, వంజరం, కానా గిడతలు,పండుకప్ప,కండాయిలు కట్టచేపలు,జీలా పీతలు ఇక్కడ బాగా దొరుకుతాయి.
         శతాబ్దాల కడలి అలల మధ్య ఉప్పాడ ఉనికి
       
సముద్రంలో కలసిపొయిన చౌడేశ్వరీ సమేత రామలింంగేశ్వర  పురాతన ఆలయం
నిరంతరం తిరిగే రాట్నాలు, చేపల వలలు, సముద్రపు అలలు నింపుకున్న వాడ ఉప్పాడ. చూడచక్కని చేనేత చీరలోని వెండి జరీ  జాంథానీ జాడ ఉప్పాడ. అనేకానేక చారిత్రకాంశాలను దాచుకున్న మౌన కడలి గర్భం ఉప్పాడ. భారతావనిలో  శైవమతం బాగా ప్రాచుర్యం పొందిననాటి రోజుల నుండి ఉప్పాడ చరిత్రలో తన పేరును ఘనంగానే లిఖించుకుంది. వీరనాట్యం శైవ మతానికి చెందిన జానపద కళారూపం. ఈ నాట్యాన్ని బాగా ఆదరించిన వారు దేవాంగులు. అనాదిగా దేవాంగులు ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తూవున్నారు. చేనేత రంగానికి సొగసులద్దిన
దేవాంగులు శైవ మతారాధికులు. ఈనాటికి వీర కుమారులను ఆహ్వానించి తమ ఇండ్లలో జరిగే  శుభకార్యాలకు వీరనాట్యం కట్టించుకోవడం పరిపాటి.
               మత్సలింగేశ్వరస్వామి లింగ దర్శనం
               సముద్రంలొ వలలకు దొరికిన శివలింగం
పురాణ ఇతిహాసంలో దక్షుని సంహారానికి పోయిన వీరభధ్రులకు చెందినది వీరనాట్యం. ఇది అతిప్రాచీనమైనది కావడంతో దేవాంగులు యొక్క ప్రాచీనతను మనకు తెలియజేస్తుంది. ఇటీవల ఉప్పాడ సముద్ర గర్భం నుండి ఉద్భవించినదిగా చెప్పబడుతున్న శివలింగం, వినాయక రూపు కలిగిన శిల  ఉప్పాడనందు పరిడవిల్లిన శైవమత ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. పురాతన ఉప్పాడ గ్రామాలు ఐదు నుండి ఆరు గ్రామాల వరకు సముద్రగర్భంలో కలిసిపోయాయని పెద్దలు చెబుతూ ఉంటారు.25 సంవత్సరాల క్రితం ఉన్న ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసి పోవడం వ్యాసకర్త కనులారా చూసినదే. ఏనాడో మహా పూజలందుకుని శిధిలమైన శివాలయము నుండి మౌన ముద్ర దారియై అనేక సంవత్సరాలు కడలి ఒడిలో నిలిచి భక్తులను కనువిందు చేయడానికా ! అన్నట్లు గంగపుత్రుల క్రొత్తవలలో నుండి దరికి చేరిన శివలింగ రూపం ఆశ్చర్యానుభూతులకు లోను చేస్తూ ఆధ్యాత్మిక తీరాలకు చేర్చడం ఒకింత ఆశ్చర్యమే.
జగ్గకవి కురవంజి
ఉప్పాడ నందు శైవమతం ఉచ్చస్డితిలో ఉండేదనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సతీసమేతుడైన భ్రమరాంబికా మల్లేశ్వర స్వామి రూపంలో ఈనాడు మనకు కనిపించే ఉప్పాడ సముద్రపు ఒడ్డున గల ఆలయం  ఐదువందల సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన సన్నిధిరాజు(రాజులు కారు పురోహితులు) వంశస్థులు అభివృద్ధి చేసినదే. అదీ సముద్రగర్భంలో కలసిపోయి మూలవిరాట్టు క్రొత్తగా నిర్మించిన ఆలయంలో కొలువు తీరింది.
                        
       బ్రమరాంబికా మల్లేశ్వరస్వామి మూలవిరిట్టు
సన్నిధిరాజు వంశానికి చెందిన శ్రీ సన్నిధిరాజు జగ్గరాజు కవి 16- 17 శతాబ్దాల మధ్య ఉప్పాడలో  నివసించినట్లు
చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జగ్గకవి శివుని
వృత్తాంతంతో కూడిన చోగాడి కలాపం" (
బహుశా భక్తకన్నప్ప కథఅయ్యుండవచ్చు )
అనే కురవంజి (వీధి నాటకం) ని రచించి ఉప్పాడకు ఆంధ్ర తెలుగు సాహిత్యంలో చోటు కల్పించడం ఆనందించవలసిన విషయం. 15వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు గొప్పగా ప్రదర్శితమైన వీధి నాటకం కురవంజి. 18 19 శతాబ్దాలలో అదే యక్షగానం అయ్యింది. ఈనాడు కలాపం రూపంలో దర్శనమిస్తున్న పురాతన వీధి నాటకం కురవంజి. ”జీవ ఎరుకల కురవంజి” అనే వేదాంత కురవంజిని కూడా  రచించిన జగ్గకవి ఉప్పాడ లో శైవమతానికి గల ప్రాముఖ్యతను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాడు అనడంలో సందేహం లేదు.
మహాకవి శ్రీనాథుడు 15వ శతాబ్దం తొలినాళ్ళలో ఉప్పాడలో సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ పండితుల ఉవాచ. మన జిల్లాలోని పది సంవత్సరాలపాటు ఉన్నా రాజమహేంద్రపుర రాజుల దర్శన భాగ్యం కలగలేదు శ్రీనాధుడికి. బెండపూడి సంస్థానాధీశుల సహచర్యంతో ద్రాక్షారామం నందే ఉండి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ  భీమ ఖండాన్ని రచించే ముందు పిఠాపురంలోని మహారాజు దర్శనం అనంతరం  పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని  దర్శించి ఉప్పాడ  మాఘపౌర్ణమి సముద్ర స్నానమాచరించినట్లు సాహితీ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఉప్పాడ సముద్ర స్నానాలకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిది మరి. ఉప్పాడ పరిసర గ్రామాలు కూడా వేలాది సంవత్సరాల చరిత్ర కలిగి మనల్ని పలకరిస్తూ ఉంటాయి.
బషీర్ బీబీ ఉరుస్ ఉత్సవం
ఉప్పాడను అనుకున్న పొన్నాడ గ్రామం వెయ్యి సంవత్సరాలకు పూర్వం మహమ్మదీయుల ఏలుబడిలో " పొన్నాడ షెహర్ గా"  పిలవబడేది. దానికి ఆనవాళ్లుగా ఉప్పాడ చుట్టుపక్కల గ్రామాలు ముస్లిం పేర్లు కలిగి ఉన్నాయి. అమీనాబాద్, అమర్ వల్లి ( అమరవల్లి ), మెహదీపట్నం ( మాయా పట్నం ) . పొన్నాడ నందు ప్రసిద్ధి చెందిన ముస్లీంసోదరి  "బషీర్ బీబీ "   నివసించేదని అడిగిన వారికల్లా తన బంగారాన్ని అరువుగా ఇచ్చి కష్టాలలో ఆదుకునేదని  , బషీర్ బేబీ సౌందర్యానికి ముగ్ధుడైన ఢిల్లీ పాదుషా  చెరపట్టాలని తలచి పొన్నాడ పైకి దాడి చేసిన వెంటనే  మహా అపురూప సౌందర్యవతి అయిన బషీర్ బీబీ తనకు తానుగా తను నివసిస్తూ ఉన్న భవనాన్ని భూమిలోనికి కూరుకుపోయేలా  శపించుకుని జీవసమాధి అయిపోయిందని జనాల నాలుకలపై నానుతున్న చారిత్రక కధనం. ఆ వెంటనే ఉప్పాడ సముద్రం సునామీలా విరుచుకుపడి ఢిల్లీ పాదుషా సైన్యాలను ముంచి వేసిందని అందుకే బషీర్ భీభీ  ఆలయం చుట్టూ ఇసుక మేటలు ఇంకా కనిపిస్తున్నాయని అంటారు.
   
        పొన్నాడ దగ్గర  ఆనాటి ఇసుకమేటలు
ఇప్పటికీ భవనం పై అంతస్తు   మసీదులా మనల్ని పలకరిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బషీర్ బిభీ (ఆలయం కాదు మసీదు కాదు అది భవంతి మాత్రమే అయినా మసీదులా పూజలందుకుంటుంది) కులమతాలకు అతీతంగా పూజలందుకుంటుంది. దేశం  నలుమూలల నుండి వచ్చే ముస్లిం సోదరులే  కాకుండా, చుట్టుపక్కల హిందూ సోదరులు కూడా తమ ఇళ్లల్లో ఆడపడుచులకు శుభం జరగాలని ఇక్కడ పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పిభ్రవరి నెలలో ఉరుస్ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.
కొండెవరం యుద్దం
ఉప్పాడను అనుకున్న కొండెవరం గ్రామంలో 1758లో జరిగిన కొండెవరం యుద్ధం లేదా చెందుర్తి యుద్ధంగా పిలవబడే యుద్ధం మొట్టమొదటి భారత సంగ్రామంగా చరిత్రలో లిఖించబడింది. ఫ్రెంచి వారు ,పెద్దాపురంరాజులు ఒక ప్రక్క, ఆంగ్లేయులు , విజయనగరం రాజులు  ఒక ప్రక్కగా ఉండి చేసిన మహాయుద్ధం చెందుర్తి యుద్ధం. 
     కొండెవరం  యుద్దంలో పాల్గొన్న బ్రిటీష్ సేనలు
                చిత్రం  నాగరాజు డ్రాయింగ్ మాస్టారు
అప్పటికి ఈ కొండె వరం గ్రామం ,చెందుర్తి గ్రామం పిఠాపురం మహారాజుల ఏలుబడిలో ఉండేవి. ఆనాటి నుండే పిఠాపురం రాజులు వెలుగు లోనికి రావడం ప్రారంభమైంది. బొబ్బిలి రాజుల ఆడపడుచు పిఠాపురం రాజును వివాహం చేసుకోవడంతో రావు వారి వంశీకులు ఉప్పాడ కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉప్పాడ కొత్తపల్లి ,గొర్స వంటి పలు గ్రామాలలో ఆలయాలు నిర్మించి ధర్మకర్తలుగా కొనసాగి పునీతులైనారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఉప్పాడ గ్రామం శతాబ్దాల  అలల మధ్య నుండి తన ఆనవాళ్లను అప్పుడప్పుడూ బయలుపరచడం విశేషం.
                          

వ్యాసకర్త (  జనశ్రీ )
సిద్దాంతపు బెన్ జాన్ సన్
ఉప్పాడ కొత్త పల్లి
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

moggalu


చరవాణి, ముఖపుస్తకం లో
మునిగిపోయిన కుటుంబాలు
అనుబందాలు ఆప్యాయతలుశూన్యం


తనదికాని లోకాన నోరుజారి
నాలిక కరుచుకున్న జీవితం
అడుసుతొక్కనేల నేలకడుగ నేల


లక్షల్లో జీతాలు అవలక్షణాల
అవకతవకల పోకిరీ పోకడలు
తిండిలేక ఒకడు తిన్నదరగక ఒకడు

జనశ్రీ
9908953245
at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

nora my darling


ఈ అమ్మాయి పేరు నోరా. అనుకోకుండా ఆన్ లైన్ లో పరిచయమయ్యింది. ఎందుకో రోజూ ఏలా ఉన్నావు. నాతో మాట్లాడతావాఅని అడిగేది. ఆన్ లైన్ అంటే మోసం కదా అని చాన్నాళ్ళు పలకరించలేదు. 15 రోజులయ్యే సరికి పాపం అని పించింది. తను యూగొస్లేవేకియా అమ్మాయి అని తెలిసింది. తను విడో. ఇద్దరు పిల్లలు. ఎందుకో జాలని పించింది. నేను మాట్టాడడం మొదలు పెట్టా.
తను ఎలా వుంటుందో తెలియదు. 2 నెలలుగా చాటింగ్ మామూలుగా లేదు. నన్నడగకండి. నాకు సిగ్గేస్తుంది.
మా ఆవిడకి అనుమానం వచ్చింది.మామూలే కదా నేను నీకు ముఖం మొత్తానుకదా తెల్ల తోలుది కావాలని మొట్టికాయలు వేయడం చేసేది. కాని మొట్టికాయలు హయిగా అనిపించేవి. ఆ బాద చాటింగ్ లో మరచియేవాడిని .రోజూ  మా ఆవిడకు నాకు గొడవలు ఎక్కువై పోయాయి. నోరా తో మాట్లాడకుండా ఉండలేని స్దితికి వచ్చేసాను.
నాలుగు నెలలు గడిచే సరికి నోరా I LOVE YOU చెప్పేసింది.  నాలో ఉన్న కట్టుబాట్లు కాస్త తెగిపొయాయి.తెగింపు దోరణి వచ్చేసింది.
తన పిల్లలు నన్ను తండ్రిగా ఇష్ట పడుతున్నారని చెప్పింది. నువు మా దేశం వచ్చేస్తే మన రూం ఇదేనంటూ ఫోటోలు పెట్టింది. పిచ్చెక్కి పోయినట్లయ్యింది. ఈ వయస్సు లో కూడా love ఇంత దారుణంగా  వుంటుందాని పించింది. ఎప్పుడూ లవ్ చేయలేదు. బలే వుందనిపించింది. తాజ్ మహల్ ఫోటోచూపించాను తను వెర్రేక్కి పోయింది.నేను షార్ట్ ఫిలిం తీసి ప్రపోజ్ చేసాను. తను బుర్రపాడు చేసుకుంది.మా ఆవిడ మొట్టికాయలనుండి గుద్దుల్లోకి దిగింది. అవి ఇంకా హయిగా అనిపించాయి.
మా చాటింగ్ హద్దులు దాటింది. తెలియని మైకం ఆవరించేసింది.
అనుకోకుండా ఒకరోజు ఫోన్ చేసి
నేను ఇండియా వస్తున్నాను అంది నోరా .పిల్లలు టూరుకి వెడుతున్నారు. నేను 15 రోజులు నీతో వుంటా ఇండియాలో తాజ్ మహల్ చూపించు అంది.
చెప్పేదేం ఉంది. మాటల్లో కోటలు కట్ఠిన వాడిని.
జేబు తడుముకున్నా. మా ఆవిడ పైసా ఇవ్వదు ఇప్పుడు ఎలా. అదే విషయం నోరాతో చెప్పా. ఇండియా ఈజ్ పూర్ కంట్రీ అని సోది మొదలెట్టా. తను నీ అకౌంట్ లో 2 లక్షలు వేయనా అని అడిగింది. సిగ్గనిపించింది. ఆ మాత్రం ప్రేమించిన వ్యక్తికి కనీసం ప్రయాణం చార్జీలు పెట్టుకోలేనా అని వద్దన్నా. అన్నానే కాని డబ్బు ఏది. మాఆవిడ పైసా ఇవ్వదే 50000/- అప్పు చేసేసాను నోరా ప్రేమకోసం. కాకినాడ పోయి మంచి బట్టలు కొన్నా. పెర్ ప్యూమ్స్ కొని తెచ్చా. ఇంటికి వచ్చే సరికి నేను దేశం వదిలి పోతున్నానేమో అని మా ఆవిడ గుక్కపట్టి ఏడ్చింది. కొంతసేపటికీ తను సర్దుకుని మీ ఇష్టమే నా ఇష్టం ఎవరికి వస్తుందిఈ అదృష్టం  ఫారిన్ అమ్మాయి నా మొగుడిని ప్రేమించిందని అందరికీ చెప్పుకు బ్రతుకుతానంది. అప్పుడు చెప్పాను. నేను వెళ్ళడంలేదు. తనే వస్తుంది.15రోజులు ఇండియా అంతా చూపించి వచ్చేస్తాను అన్నాను. అంతే మా ఆవిడకు గుండెల్లో రాయడి పోయింది.ఇద్దరూ ఓ గదిలో వుండొద్దని ఒకటే సతాయింపు సరే అన్నాను.
నోరా ఫోన్ చేసి రెండు రోజుల్లో వచ్చేస్తానంది.
అంతే నాలో టెన్షన్ పెరిగి పోయింది. తీయటి కలలు ఎక్కువైపోయాయి. మనిషి మనిషిలో లేను. న్కూల్లో అందరికీ చెప్పాను. అందరూ లక్కీ ఫెలో అన్నారు. మా హెచ్. ఎం 15 రోజులు లీవు ఇచ్చాడు.
నోరా రాత్రి 9.30కి విమానం ఎక్కింది. విశాఖకు టికెట్ తీసుకోమన్నా. అక్కడనుండి కాకినాడ తీసుకురావడానికి కారుపెట్టాను3000/-పెట్టి.కాకినాడలో స్టార్ హోటల్ రూం తీసాను.  నా సూట్ కేసు సర్దింది మా ఆవిడ. నోరా  మా పెద్దోడికి ఫారిన్లో అక్కడ మంచి జాబ్ చూస్తుందని తనకు ఆశ పుట్టి నాకు సహకరించింది. రాత్రి 2.30 ఫ్లయిట్  దిగాలి ఫోన్ రాలేదు. తెల్లారి పోయింది. 9గంటకు మా ఆవిడ అన్నీ సర్ది స్కూలుకు పోయింది. అసలు ఏం జరిగిందో తెలియడంలేదు. హొటలు  వాళ్ళు ,కారుడ్రైవరు నుండి ఒకటే ఫోన్లు. కాలు కాలిన పిల్లులా తిరుగుతున్నా ఇంట్లో.  స్కూలుకి పొవడం సిగ్గనిపించింది. నిన్నే సెండప్ ఇచ్చారు అందరూ .ఇంతలో వెడితే ఎలా. మనసు పరి పరివిదాలు ఆలోచిస్తుంది . ఇంతలో ఫోన్ మ్రోగింది. నా నోరా ఎక్కడికి పోతుందీ అనుకున్నా. తను ఆదుర్దాగా ఏదో చెబుతుంది ఇంగ్లీషులో అర్దంకావడం లేదు. ఇంతలో ఎవరో ఫోన్ తీసుకుని మాట్లాడారు. ఎయిర్ హోస్టస్ కాని ఇమ్రిగేషన్ వారి కాని అనుకున్నా వారు మాట్లాడుతుంది అర్దమయ్యింది. నోరా ఫ్లయిట్ ముంబాయిలో ఆగిపోయిందని. మరో ఫ్లయిట్ కి టికెట్ తీసుకోవాలని అంటున్నారు. 36,800/- అర్జంటుగా పే చేయాలని అంటున్నారు. నోరాకి ఇవ్వమన్నా. నోరా ఏడుస్తుంది.  నా మనసు తట్టుకోలేక పోతుంది. నోరా అన్నీ చెప్పి అకాంట్ నెంబరు ఇచ్చింది .సరే అని బ్యాంకికీ వెళ్ళడానికి సిద్దపడ్డా. బండి మీద వెడుతుంటే నోరా నుండి ఒకటే ఫోన్లు రా కం ఫాస్ట్ కం ఫాస్ట్ డిపోజిట్ చెయ్యి అంటుంది. ఆకలి వేస్తుందని ఏడుస్తుంది.. నా కర్దం కాలేదు అంత కంగారులో ఆలోచించ సాగాను కనీసం చిల్లర తిండి లేకుండా ప్రయాణం చేయరు కదా నాకోసం అన్నా చాక్లేట్లో ఏదో తెస్తుంది కదా అని
నాకొచ్చిన కసాబిసా ఇంగ్లీషులో అదే చెప్పాను.
అంతే నోరా యు స్టుపిడ్ ముందు  డబ్బు డిపోజిట్ చెయ్యి అంటుంది. చెవులు గింగురుల్లో నోరాగొంతు లో విషయం మెల్లగా అర్దమయ్యింది. ఆన్ లైన్ మోసం చేయడానికి నాలుగు నెలలు తీసుకుంటారా అని అనిపించింది. వెనక్కి వచ్చేసాను. నోరా ఫోన్ చేస్తుంది. ఇంటికీ వచ్చి కూలబడ్డాను. లొకాన్ని చూడ్డం సిగ్గని పించింది ఆ క్షణంలో
ఇప్పటికీ మా పిల్లలు మా ఆవిడ దెప్పి పొడుస్తుంటారు.
కాని ఓ విషయం ఇప్పటికీ అర్దం కాలేదు. నోరా మోసం చేయబోయిందంటే నమ్మలేక పోతున్నా. మీరన్నా చెప్పండి నా ప్రేమ వృధా పోదని.
సిద్దాంతపు బెన్ జాన్ సన్ ( జనశ్రీ )
9908953245


at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

సమూహమే తీయని సమూహమే song


సమూహమే
తీయని సమూహమే
స్నేహాలే స్వరరాగ గీతమై
గురు చరణ విందార యోగమే
కాసంత  స్నేహాల స్వాంతనే
(చెలిమంత అనురాగ రాగమై)
పలికె కుహు గీతికై
మనసంతా పులకాంకితై
గుండెల లోపల  నిండిన ప్రేమతో
నిలిచాము కలిసాము చాన్నాళ్ళకీ
పిల్లా పాపలు ప్రియమైన తోడుతో
(కలిసాము విద్యా పూదోటలో)
కదిలాము వచ్చాము చిరునవ్వులై
పుట్టింటి చోటే మాణిక్యమై పోయే
ఆత్మీయ కలయిక సాకారమై
మనఙ్ఞాపకాలే ఆలింగనాలై
ముసిరాయి మనసంత లోన
చిననాటి నేస్తమే నిలవాలి బందమై
ఆ నింగి ఈ నేల సాక్ష్యాలుగా
ఈ విశ్వవీధిలో చెలికాళ్ళ చరితలో
వెయ్యేళ్ళు ఉండాలి మన మందరం
మన అడుగు జాడలే యువతకే మార్గమై
చేరాలి హిమశైల శిఖరాలకు
ఏ కష్టమైనాఎదురేది ఐనా
ఒకరికి ఒకరై వుందాములే
సిద్దాంతపు బెన్ జాన్ సన్ (  జనశ్రీ)
9908953245



at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

వజ్ర వలయం జేమ్స్ బాండ్ 007



                                           వజ్ర వలయం                                        జేమ్స్ బాండ్ 007


టోక్యో ఎయిర్ ఫోర్టుఎర్లీ మార్నింగ్ 3:30 ఎ. యమ్

విలాసవంతమైన సూపర్ లగ్జరీ ఎయిర్ బస్సులో నుండి మద్రాస్ మహేంద్రన్ తన సెక్యూరిటీ గార్డుల రక్షణలో టోక్యోలో దిగాడు .అంగరక్షకులు రఘువీర్ రెడ్డి, పిళ్ళై పదుకొనేల కళ్ళు  పరిసరాలను పరిశోధిస్తున్నాయ్ . అందరిలో  ఆరితేరినవాడైన రాయలసీమ రఘువీర్ రెడ్డి పై విపరీతమైన నమ్మకం మద్రాస్ మహేంద్రన్ కి . అండర్ వరల్డ్ ఇజ్రాయెల్ డాన్ ఫ్రాంక్లిన్ బాసియో టోక్యోకు రావొద్దని  మద్రాస్ మహేంద్రన్ ను ముందే హెచ్చరించాడు. అయినా తన సెక్యూరిటీ గార్డ్ పై ఉన్న నమ్మకంతో బయల్దేరాడు మద్రాస్ మహేంద్రన్ .
మహేంద్రన్  ఇండియాలోనే కాకుండా ఆసియా ఖండంలోనే గొప్ప కంప్యూటర్ సాఫ్ట్ వేర్ నిపుణుడు మరియు కంప్యూటర్ జీనియస్. ఆసియాలో మద్రాస్ మహేంద్రన్ కి చెందిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ చెర్రీ ఫాజిల్స్ అంటే మంచి పేరు ఉంది . పశ్చిమ దేశాలకు "చెర్రీ పాజిల్స్" కంపెనీ అంటే వ్యాపారపరంగా హడల్.
మహేందన్  ప్రపంచ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సదస్సు కి హాజరవడానికి టోక్యో వచ్చాడు. తన ప్రయోగ ఫలితాలు వివరించి తన కంపెనీకి లాభాల పంట పండించాలని మరియు ప్రపంచ బిజినెస్ కంపెనీలను తమ కంపెనీలో పెట్టుబడి పెట్టమని కోరడం కోసం వచ్చాడు మహేంద్రన్ . ఈ విషయం తెలిసిన ఇజ్రాయెల్ కంప్యూటర్స్ సంస్థ "మెర్రీ చైల్డ్ " సాఫ్ట్వేర్ కంపెనీ మహేంద్రన్  టోక్యో వస్తే తమ కంపెనీ నష్టపోవడం ఖాయమని గ్రహించి మహేంద్రన్ ను తుదముట్టించడానికి అండర్వరల్డ్ ప్రొఫెషనల్ కిల్లర్ ఫ్రాంక్లిన్ బాసియో తో ఒప్పందం కుదుర్చుకుంది.
టోక్యో ఎయిర్ పోర్టు దాటి కూతవేటు దూరం రాగానే బాసియో బృందం మద్రాస్ మహేంద్రన్  కాన్వాయ్ పై  మెరుపుదాడి చేస్తుంది . ఎలర్ట్ అయిన సెక్యూరిటీ గార్డ్స్ బాసియో  బృందాన్ని ఎదుర్కొంటారు. ప్రాణాలకు తెగించి బాసియో బృందాన్ని  సెక్యూరిటీ గార్డ్స్  ఎదుర్కొంటారు. ముఖ్యంగా రఘువీర్ రెడ్డి సాహసంతో ప్రాణాలకు లెక్కచేయకుండా బాసియో బృందాన్ని  ఊచ కోత కోస్తాడు.ప్రపంచ అండర్ వరల్డ్ డాన్లు అదిరిపడిపోయేలా రాయలసీమ ఫ్యాక్షన్ తరహా కత్తిపోట్లతో బాసియోను స్వయంగా నరికి పారేస్తాడు.

టోక్యో అంబాసిడర్స్ కాన్ఫేరెన్స్ హాల్
కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రపంచ నిపుణులు అందరూ ఆశ్చర్యంతో మహేంద్రన్ ఉపన్యాసం వింటున్నారు. కంప్యూటర్ వరల్డ్ ఫ్యూచర్ పై మహేంద్రన్  ఇచ్చిన మెసేజ్ అదిరిపోయింది. కొన్ని భవిష్యత్ కార్యక్రమాలను కనుగొన్న కొత్త సాఫ్ట్వేర్ విధానాన్ని పరిచయం చేస్తాడు. సూపర్ అడ్వాన్స్డ్ ప్రోగ్రాంతో ప్రపంచ కంప్యూటర్ రంగాన్ని కుదిపి పారేస్తాడు. ప్రపంచ ప్రయోగాలు మద్రాస్ మహేంద్రన్  ప్రయోగాలు ముందు వెలవెలపోతాయి.
క్షణాల్లో మద్రాస్ మహేంద్రన్ పేరు ప్రపంచ మార్కెట్లో మారుమ్రోగుతుంది. కోటాను కోట్ల డాలర్ల పెట్టుబడులు , షేర్లు వచ్చిపడతాయి. ప్రముఖ కంపెనీలు మాత్రం మహేంద్రన్  సాఫ్ట్ వేర్  కొనుగోలు చేయడానికి పోటీ పడతాయి. ఒక్క రోజులోనే ప్రపంచ ధనవంతుల లిస్ట్ లో చేరిపోతాడు మద్రాస్ మహేంద్రన్ . కార్యక్రమం అనంతరం
మద్రాస్ మహేంద్రన్  టోక్యో ఆస్పత్రిలో చిన్నపాటి గాయాలతో చికిత్స పొందుతున్న సెక్యూరిటీ గార్డ్ రఘువీర్ రెడ్డిని పరామర్శిస్తాడు. రఘువీర్ రెడ్డి సాహసం వాళ్ళ కంపెనీకి కోటాను కోట్ల లాభాలు వచ్చేలా చేసిందని పొగుడుతాడు. సంతోషంతో రెండు కోట్లరూపాయల చెక్కును రఘువీర్ రెడ్డికి ఇవ్వబోతాడు. అనాధ అయిన రఘువీర్ రెడ్డి  చెక్కును సున్నితంగా తిరస్కరిస్తాడు. ఆంధ్రాలోని రాయలసీమకు చెందిన రఘువీరారెడ్డి కొన్ని ఫ్యాక్షన్ తరహా హత్యలు చేసి తమ కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ప్రాణభయంతో మద్రాసు పారిపోయి రహస్యంగా జీవిస్తుంటాడు. మద్రాస్ మహేంద్రన్  కంపెనీలో వాచ్ మాన్ గా చేరి నమ్మకంతో పనిచేస్తూ తన ధైర్యసాహసాలతో మహేంద్రన్ ని మెప్పించి సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం సంపాదిస్తాడు. కృతజ్ఞతగా మహేంద్రన్  రఘువీర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో పట్టువిడవకుండా తన దగ్గర ఉన్న లాప్టాప్ కంప్యూటర్ ఓపెన్ చేసి ఇంటర్నెట్లో ఈజిప్టు "రాయల్ ఫరో" కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పదివేల కోట్ల బంపర్ లాటరీ టికెట్ ఒకటి రఘువీర్ రెడ్డి పేరు మీద రెండు కోట్లు పెట్టి బుక్ చేస్తాడు.టికెట్ పై రఘువీర్ రెడ్డి ఫింగర్ ప్రింట్ స్కాన్ అయిపోతాయి. రఘువీర్ రెడ్డి మద్రాస్ మహేంద్రన్ కు. కృతజ్ఞతలు తెలుపుతాడు రఘువీర్ రెడ్డి.టోక్యో నుండి మద్రాస్ మహేంద్రన్ విజయగర్వంతో మల్టీ మిలీనియర్ అయిపోయి ఇండియాకి తిరిగి వస్తాడు.

పూణే సైనిక శిక్షణ శిబిరం
రహస్య ప్రదేశంలో ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ల జూనియర్ బ్యాచ్ కి ట్రైనింగ్ క్యాంపు నిర్వహించబడుతూవుంది. సర్దార్ జగ్జీత్ సిన్హ  కఠోరంగా శిక్షణ ఇస్తున్నాడు.తన కూతురు జాహ్నవి కూడా సీఐడీ ఏజెంట్ గా జూనియర్ బ్యాచ్ లో శిక్షణ పొందుతూ ఉంటుంది. క్యాంపు మద్యలో సహాయక బృందం సహాయం కోరుతూ పూణే నుండి అత్యవసర మెసేజ్ వస్తుంది. పూణే సిటీలో అంతర్జాతీయ ఆల్-ఖైదా ఉగ్రవాదులు అత్యంత రహస్యంగా సమావేశం నిర్వహిస్తున్నారని తెలుపుతూ వారి మీద ఎటాక్ చేయడానికి సీక్రేట్ ఏజెంట్ సహాయం కావాలని మెసేజ్ వస్తుంది.  విషయం తెలుసుకున్న సిన్హా తన కూతురైన జాహ్నవిని అంతర్జాతీయ తీవ్రవాద ముఠాను మట్టికరిపించి రమ్మని రహస్యంగా పంపిస్తాడు.
దేశం దాటి పోవడానికి పూణే సిటీ దాటుతున్న తీవ్రవాదులు ఒక పాత ట్రక్కులో వేగంగా పోతూ ఉంటారు.తీవ్రవాదులు మద్యం సేవిస్తూ వేగంగా ట్రక్కు నడుపుతూ ఉంటారు. జూనియర్ సిఐడి బృందం ఉగ్రవాదులను వెంటాడుతోంది. అనుభవజ్ఞులు అయిన తీవ్రవాదులకు జూనియర్ సిఐడి ఏజెంట్స్ కి మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరుగుతాయి.జూనియర్ ఏజెంట్లలో కొందరిని తీవ్రవాదులు బందిస్తారు. వాళ్ల కోసం జాహ్నవి మరి కొందరు లొంగిపోతారు. వీరందర్నీ ఉగ్రవాదులు గొలుసులతో బంధించి ట్రక్కులో వేసుకుని పూణే సరిహద్దులు దాటి అత్యంత ప్రమాదకరమైన కొండలోయల బాట గుండా ట్రక్కుని పోనిస్తారు.  సరిహద్దు దాటే వరకు జూనియర్ ఏజెంట్లను  అడ్డుపెట్టుకుని సురక్షితంగా దేశం దాటి పోవాలని తీవ్రవాదులు భావిస్తారు. జూనియర్ ఏజెంట్ల నుండి ఎటువంటి సమాచారం రాకపోయేసరికి కంగారు పడతాడు సర్దార్ సిన్హ. ఇంటెలిజెన్స్ కార్యాలయానికి ఫోన్ చేసి సహాయం కోరతాడు. జేమ్స్ బాండ్ 007 ఒక్కడే మీకు సహాయం చేయగలడని ఇంటెలిజెన్స్ కార్యాలయం తెలపడంతో  007ని కాంటాక్ట్ చేస్తాడు  సర్దార్.
అదృష్టం కొద్దీ 007 పూణే ఎయిర్పోర్ట్ కాంపస్ లోనే లేటెస్ట్ బాంబర్ విమానం నడపడం  ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ వెనకే జూనియర్ ఎయిర్ఫోర్స్ బ్యాచ్ కు చెందిన కొందరు సిఐడి ఏజెంట్స్ 007 విమానంను తరుముతూ నడపడం ప్రాక్టీస్ చేస్తుంటారు. విమానం నడుపుతున్న విషయం తెలుసుకున్న 007 ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తన కిట్ సిద్ధం చేయమని కొన్ని వివరాలు చెబుతాడు.ఓ ప్రక్క  ట్రక్కు కుదుపులకు ట్రక్ లో ఉన్న జూనియర్ ఏజెంట్స్ నలిగి నలిగి గోలగోల పెడుతుంటారు. మద్యం సేవిస్తూ బండ బూతులు తిడుతూ ఏమీ పట్టనట్లు ట్రక్కును వేగంగా నడుపుతూ పోతుంటారు తీవ్రవాదులు.
ఇంతలో వాయువేగంతో నాలుగు సీట్ల విమానం పసుపురంగుది ఒకటి ట్రక్కు మీదనుండి  దాటుకుని కొండల్లోకి పోయి కనుమరుగవుతుంది. తీవ్రవాదులు విమానాన్ని చూసి భయపడతారు.అ ట్రక్కు వేగం తగ్గించి ప్రమాదం ఏమైనా ముంచుకొస్తుందేమోనని తర్కించు కుంటారు. కొంతసేపటికి దారికి అడ్డంగా విమానం పెట్టి చేతిరుమాలు ఊపుతున్న మనిషి కనిపిస్తాడు. అతడు అరబ్ దుస్తుల్లో తీవ్రవాదులకు మల్లె డ్రెస్ వేసుకుని ఉండటం కనిపిస్తుంది. ఓల్డ్ ట్రక్కుని దూరంగా ఆపి ఉగ్రవాదులు ముఠా నాయకుడు తాగిన మత్తులో మాట్లాడుతూ తన అనుచరులను విషయం తెలుసుకు రమ్మని పంపిస్తాడు. ఎదురుగా ఆగిన విమానం దగ్గరకు వెళ్ళిన అనుచరుడు అరబ్ దుస్తుల్లోని వ్యక్తితో అరబిక్  భాషలో ఏదో మాట్లాడతాడు వెనక్కి ఆనందంగా గెంతుకుంటూ వస్తున్న అనుచరుడిని చూస్తాడు తీవ్రవాదుల నాయకుడు . మిలటరీ మనల్ని పసిగట్టి వేలాడుతున్నట్టు సమాచారం తెలుసుకున్న మన సంస్థ కమాండర్ మన కోసం విమానం పంపినట్లు అరబిక్ భాషలో తీవ్రవాదుల నాయకుడికి తెలుపుతాడు అనుచరుడు. ట్రక్కు నుండి కిందకు దూకిన తీవ్రవాదులు జూనియర్ ఏజెంట్లను బండ బూతులు తిడుతూ ట్రక్కు స్టీరింగ్ను కొండలోయల వైపు త్రిప్పి వదిలివేస్తారు. డ్రైవరు లేని ఓల్డ్ ట్రక్కు అటు ఇటు ఊగుతూ ప్రమాదకరంగా అదుపు లేకుండా లోయల వైపు పోతూవుంటుంది. అందులోని జూనియర్ ఏజెంట్లు భయంతో అరుస్తూ ఉంటారు.  ఉగ్రవాదులు ఒకవైపు నాలుగు సీట్ల విమానం వైపు పరిగెత్తి విమానం ఎక్కి కూర్చోగానే  విమానం ఆకాశంలోకి దూసుకుపోతుంది.అరబ్బీ దుస్తులు ధరించి మారు వేషం వేసుకున్న 007ను  ఉగ్రవాదులు తాగిన మైకంలో గుర్తుపట్టరు. 007 విమానంను ఆకాశంలోకి పైపైకి తీసుకుపోతాడు.  మెరుపువేగంతో తన భుజాలకు ఫారాష్యూట్  తగిలించుకుని చాకచక్యంగా పైలెట్ సీటు నుండి క్రిందకు దూకెస్తాడు 007. పారాచూట్ సహాయంతో క్రిందికి దిగుతూ దిగుతూ  అదుపు తప్పి లోయలోకి పడిపోబోతున్న ఓల్ద్ ట్రక్కు వైపు వేగంగా దిగుతాడు పారాష్యూట్ సాయంతో.
పైలెట్ లేని విమానం ఆకాశంలో గిరికీలు కొడుతూ పెద్ద ప్రేలుడు శబ్దంతో కొండల్లో కూలిపోతుంది. తీవ్రవాదులు మరణిస్తారు.
రాడార్ సిగ్నల్ ద్వారా 007 ప్రయాణించిన విమానం కోల్పోయినట్లు తెలుసుకుంటాడు . సైనిక కమాండర్ సర్దార్ జగ్జీత్ సిన్హ తన సైనికులను 15 జీపులో ఎక్కించుకుని తీవ్రవాదుల ఓల్ద్ ట్రక్కు స్పాట్ వైపు బయలుదేరతాడు. జేమ్స్ బాండ్ లోయలోకి కూలిపోతున్న ఓల్డ్ ట్రక్కును తన దగ్గర ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరికరాలతో లోయలోకి పడిపోకుండా ఆపి జూనియర్ సి ఐ డి బృందాన్ని రక్షిస్తాడు మన జేమ్స్ బాండ్ 007. మెల్లగా ఓల్ద్ ట్రక్కు 007 కంట్రోల్లోకి వస్తుంది. ఓల్డ్ ట్రక్కులోని జూనియర్ ఏజెంట్లకు తననుతాను జేమ్స్ బాండ్ 007 గా పరిచయం చేసుకుంటాడు. కట్లు విప్పి జూనియర్స్ ను ట్రక్కులోనికి ఎక్కించుకుని వస్తుండగా ధూళి రేపు కుంటూ ఓ పదిహేను జీపులు నిండా సైనికులు వెపన్స్ ధరించి వస్తున్న దృశ్యం కంటపడుతుంది.
జాహ్నవిని ఉద్దేశించి అందం ఒక్కటే చాలదని తెలివి కూడా కావాలని 007 ఆట పట్టిస్తాడు. ట్రక్కులో తీవ్రవాదులు ఉన్నారేమో అని భ్రమించిన సైనికులు కాల్పులు ప్రారంభిస్తారు. ఇటువంటి సమయాల్లో ట్రక్కును ఎలా నడపాలో డ్రైవింగ్ చేసి చూపిస్తాను అంటాడు 007. జూనియర్స్  బృందాన్ని సైనికులకు కనిపించకుండా ఉండమని చెప్పి 007 తన డ్రైవింగ్ విన్యాసాలతో సైనికులను ముప్పుతిప్పలు పెడతాడు .  సైనికులకు అందకుండా ఓల్డ్ ట్రక్కును పూణే సైనిక శిక్షణ శిబిరం వైపు పోనిస్తాడు మన బాండ్ .సర్దార్  సైనిక హెలికాప్టర్ లో తను ఒక వైపు ఫాలో అవుతాడు. ఓల్డ్ ట్రక్కు సైనిక శిబిరం వైపు దూసుకొస్తున్నది అని తెలుసుకున్న వందలమంది సైనికులు ట్రక్కుని చుట్టుముడతారు.
తీవ్ర నిశ్శబ్ద వాతావరణంలో ఓల్డ్ ట్రక్కు ప్రక్కనుండి జేమ్స్ బాండ్ 007,  ఏజెంట్లు మెల్లగ దిగుతారు. . ఉన్న పెట్టిన గొల్లున నవ్వుతూ సైనికులు చప్పట్లతో 007 సాహసాలను అభినందిస్తారు . బాండ్ చిలిపి చేష్టలకు నవ్వుతారు అందరూ. హెలికాప్టర్ నుండి దిగిన సర్దార్ 007 డ్రైవింగ్ ప్రతిభకు విస్తుపోతాడు. తీవ్రవాదుల నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతాడు. బాండ్ సాహసానికి మంత్రముగ్దైన జాహ్నవి 007 పై మనసు పారేసుకుంటుంది.
*********************************
మద్రాసు మహేంద్రన్ తన ఫైవ్ స్టార్ హోటల్ లో కొత్తగా తమ కంపెనీ నుండి వజ్రాల వ్యాపారం ప్రారంభిస్తాడు. .ఓపెనింగ్ సెర్మనీ కి ప్రపంచం నలుమూలల నుండి బిజినెస్ మేగ్నెట్స్  ని ఆహ్వానిస్తాడు. ప్రభుత్వం వైపు నుండి కొందరు మంత్రులు హాజరవుతారు. ప్రముఖ టీవీ చానల్స్ లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా ఏర్పాటు చేస్తాడు. పెద్దస్క్రీన్ గల టీవీ తెరపై సూపర్ 40 ఛానల్ ప్రత్యక్ష ప్రసారం  అవుతూ ఉంటుంది .
ఓ ప్రఖ్యాత సినీ తార చేతుల మీదగా పదివేల కోట్ల బంపర్ లాటరీ రిజల్ట్స్ వెలువరించ బోతున్నట్లు  ప్రకటిస్తుంది బ్రేకింగ్ న్యూస్ గా.
హోటల్  లోని వారంతా క్షణకాలం సూపర్ 40 ఛానల్ వంకే చూస్తూ ఉండిపోతారు. ఇండియాకు చెందిన మద్రాస్ మహేంద్రన్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న రఘవీర్రెడ్డి గెలుచుకున్నట్లు యాంకర్  ప్రకటిస్తుంది .  అందరూ స్థాణువులా అయిపోతారు. ఉన్నట్టుండి ఒకటే అలజడి స్థానిక టీవీ చానల్స్ వారు మద్రాసు మహేంద్రన్  వెనుక నిలబడ్డ రఘువీర్ రెడ్డి వెంటపడతారు. బిజినెస్ పీపుల్స్ అందరూ రఘువీరారెడ్డిని  అభినందనలతో ముంచెత్తారు. మహేంద్రన్  పర్సనల్ లేడీ సెక్రటరీలు  రఘువీర్ రెడ్డి నీ ముద్దులతో ముంచి చేస్తారు. మద్రాస్ మహేంద్రన్ కార్యక్రమమల్లా రఘువీర్ రెడ్డి అభినందన సభలా తయారవుతుంది. మహేంద్రన్ కంటే రఘువీరారెడ్డి ధనవంతుడు అయినట్లు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచ ప్రముఖ టీవీ చానల్స్ రఘువీరారెడ్డి అదృష్టాన్ని కీర్తిస్దాయి.
విలేకరులు రఘువీర్ రెడ్డిని వదలకుండా ప్రశ్నిస్తూ ఇంత డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. చిన్ననాటినుండి అంతరిక్ష ప్రయోగాలు అంటే ఇష్టమని ప్రైవేటుగా ఇండియాలో తొట్టతొలి టూరిస్ట్ స్పేస్ సెంటర్లో నెలకొల్పాలని ఉందని తెలుపుతాడు. రఘువీరారెడ్డి సంతోషంగా ఈ తతంగాన్ని కోపంతో గమనిస్తున్న మద్రాసు మహేంద్రన్ తన సెక్యూరిటీ గార్డ్ తననే మించిపోయినందుకు ఈర్ష్యపడతాడు. పార్టీకి వచ్చిన వారి ముందే అల్లరి చేసి రఘువీర్ రెడ్డి పై చేయిచేసుకుని ప్రైజ్ మనీ తన కంపెనీకి ఇవ్వ మంటాడు.తన మీద అన్యాయంగా దాడి చేసిన మద్రాస్ మహేంద్రన్ ను రఘువీరారెడ్డి సవాలు చేస్తాడు. వ్యాపారంలో పోటీపడి కంపెనీలన్నీ దివాలా తీయిస్తాను అంటాడు. లాటరీ సొమ్ము తన వేలిముద్ర లేనిదే దక్కించుకోలేరు ఎవరైనా అని అంటాడు రఘువీరారెడ్డి.
చిర్రెత్తి పోయిన మహేంద్రన్ ఆ వెంటనే వ్రేలునరికి సర్జరీ ద్వారా తన చేతికి అతికించుకుంటానని అంటూ మీదకు వస్తాడు . భీకర ఘర్షణలలో మహేంద్రన్  ముఖాన్ని యాసిడ్తో కాల్ఛేస్తాడు రఘువీరారెడ్డి.   మహేంద్రన్   ముఖం వికృతంగా తయారవుతుంది. రఘువీర్ రెడ్డి తప్పించుకుని పారిపోతాడు.మద్రాస్ మహేంద్రన్ రఘువీర్ రెడ్డి పై కక్ష పెంచుకుంటాడు.
***********************************
ఓ క్లబ్ లో 007 ,జాహ్నవిలు కలుసుకుంటారు. తమ అభిరుచులు పంచుకుంటారు జాహ్నవి తన స్నేహితుల బృందంతో వస్తుంది. 007 తన అల్లరితో జాహ్నవి బృంధాన్ని అల్లరి పట్ఠిస్తాడు. 007 జాహ్నవీలు మోటర్ బైక్ పందెంలాంటివి వేసుకుని దగ్గరవుతూ మనసును పంచుకుంటారు.
*********************************
పదివేల కోట్ల అధిపతి అయిన రఘువీర్ రెడ్డి ఇండియాలో తొలి స్పేస్ టూరిస్ట్ స్టేషన్  మొట్టమొదటిసారిగా నెలకొల్పుతాడు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రపంచ ప్రముఖులను ఆహ్వానిస్తాడు .జాహ్నవి తన తండ్రితో వస్తుంది. 007 కూడా ఇంటిలిజెన్స్  డిపార్టుమెంటు నుంచి అతిథిగా హాజరు అవుతాడు.ఈ కార్యక్రమంలో రఘువీర్ రెడ్డి జాహ్నవి అందాన్ని చూసి మనసు పారేసుకుంటాడు.. రెడ్డి జాహ్నవిని ఇష్టపడుతున్న సంగతిని తండ్రి గమనిస్తాడు. వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ తన అల్లుడు అయ్యే అవకాశం వస్తుందని సంతోషిస్తాడు.
జేమ్స్ బాండ్ 007 ఆ కార్యక్రమంలో కలిసి తిరగడం రఘువీర్ రెడ్డికి ఇష్టం ఉండదు. 007ని చితక్కొట్టిమని తన ముఠాని  ఆదేశిస్తాడు రహస్యంగా. మొట్టమొదటి టూరిస్టు స్పేస్ షిప్ . ఆకాశంలోకి దూసుకు పోతుంది.  ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జాహ్నవిని తనకు కాకుండా చేస్తున్న బాండ్  ని అంతం చేయమని ముఠా సభ్యులను ఓ ప్రక్క పురమాయిస్తాడు రఘువీరారెడ్డి.
రఘువీర్ రెడ్డి స్పేస్ సెంటర్ నెలకొల్పడంతో మరింత కక్ష పెంచుకున్న మద్రాస్ మహేంద్రన్  తన ముఠాను పంపి స్పేస్ సెంటర్ ను బాంబులతో పేల్చివేయాలని ఆదేశిస్తాడు.  007 ఎటాక్ చేయబోయిన రఘువీరారెడ్డి బృందానికి మద్రాస్ మహేంద్రన్  పంపిన బృందం తారసపడి రెండు ముఠాలు ఎదురు కాల్పులు జరుపుకుంటాయి బాండ్  చాకచక్యంగా  వీరి నుండి తప్పించుకుంటాడు.
**********************************
రఘువీర్ రెడ్డి జాహ్నవిని హిమాలయాల్లో జరిగే స్కేటింగ్ పోటీలకు రమ్మని ఆహ్వానిస్తాడు.
జాహ్నవిని తండ్రి  వెళ్ళమని బలవంతం చేస్తాడు. 007 ని తోడుగా రమ్మంటుంది జాహ్నవి రహస్యంగా ఫోన్ చేసి. మంచు పోటీలకు రఘువీర్ రెడ్డి వెళుతున్నట్లు తెలుసుకున్న మద్రాసు మహేంద్రన్ రఘువీర్ రెడ్డిని మట్టు పెట్టడానికి ఓ రౌడీ ఛాంపియన్ న్ని పంపిస్తాడు రఘువీర్ రెడ్డి.  007 న్ని  జాహ్నవి ఓప్రక్క ఆహ్వానించింది అని తెలుసుకొని 007  మట్టుపెట్టడానికి మంచి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తాడు రఘువీర్ రెడ్డి. మంచు స్కేటింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమవుతాయి.  స్కేటింగ్ పోటీలలో మంచి ప్రావీణ్యం ఉన్న రఘువీర్ రెడ్డి బాండ్ ని నిబంధనలకు విరుద్ధంగా ఢీ కొడతాడు. బాండ్  పక్కకు ఒరిగిపోతాడు .అదే సమయంలో జాహ్నవి వెనుక జరుగుతున్న సంఘటనలు గమనించకుండా ముందుకు పోతుంది. 007  చనిపోయాడు అనుకుని రఘువీరారెడ్డి జాహ్నవితో సరదా పంచుకోవడానికి దూసుకుపోతాడు. అదే సమయంలో రఘువీరారెడ్డి నీ వెనుక నుండి మద్రాస్ మహేంద్రన్ పంపిన రౌడీ ఛాంపియన్ దొంగ దెబ్బ తీస్తాడు. రఘువీర్ రెడ్డి బ్యాలన్స్ తప్పి మంచుకొండల్లో దొర్లుకుంటూపొతాడు. రఘువీర్ రెడ్డికి తీవ్రగాయాలు అవుతాయి. మద్రాస్ మహేంద్రన్  పంపిన పోటీదారుడు అనూహ్యంగా జహ్నవి మీదికి దూసుకుపోతాడు . తేరుకున్న 007 జాహ్నవిని ఆ రౌడీ ఛాంపియన్ నుండి రక్షిస్తాడు. రక్షించడమే కాకుండా పోటీల్లో 007, జాహ్నవిలు సంయుక్త విజేతలుగా నిలబడతారు. బాండ్  మీద జాహ్నవికి ఇంకా ప్రేమ పెరుగుతుంది
*******************************************

4 సంవత్సరముల తరువాత


ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కార్యాలయం నుండి న్యూఢిల్లీ
యాన్యువల్ రిపోర్ట్ చేతిలో పట్టుకుని ఇంటలిజెన్స్డిపార్ట్ మెంట్  డైరెక్టర్ జ్ఞానేశ్వరి దేవి అత్యవసర సమావేశంలో అసహనంగా తిరుగుతూ  ఉంటుంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అజాగ్రత్త వలన సంఘవిద్రోహ శక్తులు దేశంలో కొన్ని ఘరానా మోసాలకు పాల్పడుతున్న విషయం జ్ఞానేశ్వరిదేవిని నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇంటెలిజెన్స్  డిపార్టుమెంటు నుండి ఆహ్వానం అందుకున్న  007 ,జాహ్నవి జ్ఞానేశ్వరి దేవి ముందు హాజరవుతారు .
జ్ఞానేశ్వరి దేవి ఫైల్స్ లోని కొన్ని క్లిప్పింగ్స్ సహాయంతో కంప్యూటర్ స్క్రీన్ మీద యాన్యువల్ రిపోర్ట్ డేటాను  చూపిస్తూ రఘువీర్ రెడ్డి స్పేస్ సెంటర్ నుండి వెళ్ళిన స్పేస్ షిప్ లు కొన్ని అనుకున్న సమయానికి భూమిని చేరడం లేదని రిపోర్ట్స్ సూచిస్తున్నాయని చెబుతోంది.
జరుగుతున్న ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదో అర్థం కాలేదు అని చెప్తుంది జ్ఞానేశ్వరి. రఘువీర్ రెడ్డి స్పేస్ సెంటర్ నుండి వచ్చిన రిపోర్టులు కేంద్ర ప్రభుత్వం రాడార్ రిపోర్టులు సరిచూసి చూపిస్తుంది. స్పేస్ షిప్ లు భూమిని చేరిన తేదీలలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది దీనిపై రెడ్డి స్పేస్ సెంటర్ వారు కానీ టూరిస్టు బృందం వారు కానీ ఎక్కడా ఫిర్యాదు చేసినట్లు కనిపించడం లేదని చెబుతోంది. ఇటీవలే వెళ్లిన ఒక స్పేస్ షిప్ ఇంకా భూమిని చేరలేదని దాని తరువాత వెళ్లిన మరో స్పేస్షిప్ తిరిగి వచ్చినట్లు రిపోర్ట్స్ చూపిస్తూన్నాయి అంటుంది. తిరిగిరాని స్పేస్ షిప్ ఏమైనట్టు తెలియడం లేదని జ్ఞానేశ్వరి దేవి ఈ విషయమై రెడ్డి స్పేస్ సెంటర్ పై దాడిచేస్తే సాక్ష్యాలను నాశనం చేయవచ్చని లేదా ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని చెబుతూ దీని మిస్టరీని ఛేదించేందుకు 007  సహయం కోరుతుంది జ్ఞానేశ్వరి దేవి. దీని తతంగమంతా రహస్యంగా జరగాలని కోరుతుంది.
జాహ్నవి చేతికి జ్ఞానేశ్వరి దేవి మరో రిపోర్ట్ ఇస్తూ వజ్రాల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా దారుణంగా దెబ్బ తిన్నదని మార్కెట్ అవసరాలకు డిమాండ్ తగ్గిపోయి స్మగ్లింగ్ వజ్రాలు ఎక్కువైందని తెలుస్తుంది. దీని వలన ఒక దేశాన్ని మరొక దేశం అనుమానించే  పరిస్థితి వచ్చిందని దీనిపై మన దేశం నుండి స్పెషల్ రిపోర్ట్ కావాలని ఇన్ టర్ ఫోల్ కోరిందని దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి ఇవ్వమని జ్ఞానేశ్వరి దేవి కోరుతుంది.
******************************************
వజ్రాల బిజినెస్ లో అపారనష్టాన్ని చవిచూస్తున్న మహేంద్రన్ ముఠా టెక్సాస్ దగ్గర వజ్రాల స్మగ్లింగ్ చేస్తున్న ముఠాపై దాడి చేసి ఒక సభ్యుని బంధిస్తుంది. మహేంద్రన్ తన స్థావరంలో కర్కశంగా బాధిస్తూ అసలు విషయాన్ని కక్కిస్తాడు. విషయం తెలుసుకున్న మహేంద్రన్  అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. కానీ స్మగ్లర్ కి అతి సులువుగా వజ్రాలు ఎలా దొరుకుతున్నాయో అర్థం కాలేదు. బలమైన నెట్వర్క్ కలిగిన మద్రాస్ మహేంద్రన్ కి ఓ రాజకీయ నేత ఫోన్ చేసి సీక్రెట్ ఏజెంట్ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరిపైనో పైనో ఎంక్వైరీ చేయిస్తున్నారని అది మీ మీద కావొచ్చు లేదా రెడ్డి సెంటర్ మీద కావచ్చని మెసేజ్ చేస్తాడు.
అప్రమత్తమైన మహేంద్రన్  జాగ్రత్త పడతాడు .అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా సీక్రెట్ ఏజెంట్ 007 తన స్టైల్లో ప్యారాచూట్ సహాయంతో రెడ్డి స్పేస్ సెంటర్లో దిగుతాడు. రఘువీర్ రెడ్డి పర్సనల్ లేబరేటరీ లోకి అత్యంత చాకచక్యంగా చొరబడి రహస్య పత్రాలను వీడియో సీడీలను ఓ చిన్న కంప్యూటర్ లోనికి ఫీడ్ చేసి కడుపులోకి మింగేస్తాడు. ఆచి కడుపులో ఓ మూడు రోజుల వరకు ఉంటుంది. ఆ తరువాత దానిని తీసివేయాలి. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అవుతుంది . సమయాభావం వల్ల అక్కడ ఉన్న పత్రాలను, సీడీని ,మరికొన్ని  ఇంపార్టెంట్ రహస్య పరికరాలను  బ్యాగ్ లో వెసుకుని  అత్యంత చాకచక్యంగా బయలుదేరతాడు. కానీ ఆఖరి నిమిషంలో ఎవరో  స్టేషన్ లోనికి వచ్చినట్లు సెక్యూరిటీ గార్డు కనిపెట్టి అలారం మోగిస్తాడు. బాండ్ పై అత్యంత ఆధునిక తుపాకీలతో దాడి చేస్తూ వెనుకబడతారు సెక్యూరిటీ గార్డులు.
స్పెషల్ కారులో కూర్చుని రిమోట్ తో ఆపరేట్ చేస్తూ వెనకే ఫైరింగ్ చేస్తున్న సెక్యూరిటీ గార్డులను ముప్పుతిప్పలు పెడతాడు. ఉన్నట్టుండి ఓ 5 హెలికాప్టర్ లో నుండి జేమ్స్ బాండ్ మీదకు రెడ్డి స్పేస్ సెంటర్ సెక్యూరిటీ బృందం దాడి చేస్తుంది. ఆ ఆ దాడి నుండి తప్పించుకోవడానికి తన కారుని సముద్రం మీద పొనిస్తాడు. కారు కాస్త బోట్  గా మారిపోతుంది. రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై హెలికాప్టర్ నుండి వాకింగ్ సేఫ్టీ స్మాల్ బోట్లలో సముద్రం పైకి సెక్యూరిటీ సిబ్బంది దిగి ఓ యాభై మంది  చుట్టూ ముడతారు. దాదాపు బాండ్ బందీ అయిపోతాడు.కదలలేని పరిస్థితి వస్తుంది. అంతలో అద్భుతం జరిగినట్లు ఓ పెద్ద జలంతర్గామి భీకరమైన శబ్దంతో పైకి వస్తుంది. అందులో నుండి ఓ ఆజానుబాహురాలైన ఓ అందాల సుందరి బాండ్ ని తన జలంతర్గామి లోనికి లాక్కొని క్షణాలలో సముద్రపు నీళ్ళలోకి జలాంతర్గామి తో సహా మునిగి మాయమవుతుంది. రెడ్డి స్పేస్ సెంటర్ సెక్యూరిటీ గార్డ్స్ ఆశ్చర్యపొతారు.  అనుకోకుండా తప్పించుకుంటాడు బాండ్.
*************************************
జలాంతర్గామి లోనికి వచ్చి పడ్డ 007  ఆశ్చర్యపోతాడు. అందాల సుందరి సెక్సీగా తయారై బాండ్ మీద పడుతుంది. తను మెరైన్ బయాలజీ చదువుతున్నానని, సముద్ర శిలాజాల మీద ప్రయోగాలు చేస్తూ ప్రాజెక్టు వర్క్ నిమిత్తం టూర్ లో ఉన్నానని  తెలుపుతుంది .పైన జరుగుతున్న దృశ్యాన్ని మా జలంతర్గామి రాడార్ స్క్రీన్ పై డిస్ప్లే చేసిందని చెబుతోంది .వెంటనే కాపాడాలని అనిపించి వచ్చానని అంటుంది. బాండ్ మగ సిరిని పొగుడుతూ నీవు ఎవరో నాకనవసరమని అంటూ బెడ్ మీదికి లాగి ముద్దుల్లో ముంచి వేస్తుంది. స్త్రీ లోలుడైన బాండ్ అందాల సుందరి ఒడిలో సేద తీరుతాడు.
***********************************
ఫ్యాషన్ షోకి హాజరైన రఘువీర్ రెడ్డి అక్కడ జాహ్నవి జడ్జిగా ఉండటం చూసి ఆనందిస్తాడు. పోటీల అనంతరం జాహ్నవి తో మాట కలుపుతాడు .రెడ్డి బిజినెస్ వ్యవహారాలు మీద అప్పటికే సందేహం ఉన్న జాహ్నవి ప్రేమ నటిస్తుంది .
రఘువీర్ రెడ్డి విలాసవంతమైన హోటలుకు తీసుకువెళతాడు జాహ్నవిని. తప్పతాగిన రఘువీర్ రెడ్డి ఓ వజ్రాల నగను  బహూకరిస్తారు. సీక్రెట్ ఏజెంట్ జాహ్నవి రఘువీర్ రెడ్డి ని మాటల్లో పెట్టి రఘువీర్ రెడ్డి కారుని అంగుళం అంగుళం వెతుకుతుంది. మతిపోయేలా జాహ్నవికి వజ్రాల డంప్  కారులో కనిపిస్తుంది. జాహ్నవి వెనుక అఘండుడైన రఘువీర్ రెడ్డి మెల్లగా ఫాలో అవుతాడు. జాహ్నవి ఏజెంట్ చర్యని అసహ్యించుకుంటాడు. సీక్రెట్ ఏజెంట్ వైన నువ్వు నాకు సహకరిస్తే ప్రపంచంలో తిరుగులేని అండర్ వరల్డ్ డాన్ అవుతాను అంటాడు. జాహ్నవి చీత్కరించుకుంటుంది. రఘువీర్ రెడ్డి చిర్రెత్తి పోతాడు. జాహ్నవి మీదికి దాడి చేస్తాడు. జాహ్నవి తప్పించుకుని ఇంటికి చేరి తన తండ్రికి జరిగిన విషయం చెబుతోంది. రఘువీర్ రెడ్డి మీద సర్దార్ కి అసహ్యం వేస్తుంది.
అప్పటికే కంగుతిన్న రఘువీర్ రెడ్డి కి పుండు మీద కారం చల్లినట్టు సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసి స్పేస్ సెంటర్లోని రహస్య పత్రాలను 007 తీసుకొని పరారయ్యాడు అన్న విషయం చెబుతాడు. రఘువీర్ రెడ్డికి పిచ్చెక్కినట్టు అవుతుంది. ఇక తన మీద ప్రభుత్వం దాడి చేయడం ఖాయమని తెలుసుకుంటాడు. జాహ్నవి ని తీసుకుని పారిపోవాలని ప్లాన్ చేస్తాడు.
************************************
మద్రాసు మహేంద్రన్  శిబిరంలో ప్రత్యక్షమైన  జలాంతర్గామి అందాల సుందరి మహేంద్రన్ ఆంతరంగిక మిత్రురాలు. తననుండి సేకరించిన కొన్ని పత్రాలు, సీడీలు, మహేంద్రున్ కి అందజేస్తుంది. మహేంద్రన్  రహస్య పత్రాలను సి.డిలను తన పరివారంతో పరిశోధించడానికి ఉపక్రమిస్తాడు.
************************************
ఇంటిలిజెన్స్ కార్యాలయంలో తన రిపోర్ట్ పట్టుకుని జ్ఞానేశ్వరి దేవి ముందు హాజరవుతారు. 007 సేకరించిన కంప్యూటర్ చిప్స్  శాస్త్రజ్ఞులు స్టడీచేసి డిస్ ప్లే చేస్తారు. వీడియో క్లిప్పింగ్ చూస్తున్న ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటుకు మతిపోతుంది. రఘువీర్ రెడ్డి స్పేస్ సెంటర్ నుండి వెళ్లిన స్పేస్ షిప్  ఎఫ్ ఎక్స్ 47 గ్రహం పై గల సహజసిద్ధమైన వజ్రాల అపార నిధిని సేకరించడం కనిపిస్తుంది. ఆ పనిని రోబోలు చాకచక్యంగా చేస్తూ కనిపిస్తాయి వీటిని ఆపరేట్ చేస్తూ  రఘువీరారెడ్డి శాస్త్రజ్ఞులు కూడా కనిపిస్తారు. కొన్ని వజ్రాల డంప్ కలిగిన మిస్సింగ్ స్పేస్ షిప్ త్వరలో లాండ్ అవుతుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని మహేంద్రన్ తన రహస్య నివాసంలో కూడా కనుగొని గంతు లేస్తాడు.
***********************************
జాహ్నవి రఘువీర్ రెడ్డి ఇచ్చిన వజ్రాల నగకు చెందిన ల్యాబ్ కు పంపిన రిపోర్ట్ వస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘువీరారెడ్డిని సాక్ష్యాలతో సహ నిరూపించే అవకాశం దొరికింది. ఇతర గ్రహంపై దొరికిన వజ్రాలను సేకరించి భూమి మీద అతి తక్కువ ధరకే స్మగుల్ చేస్తూ రఘువీర్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గ్రహిస్తుంది.వివిదదేశాల మధ్య విరోదం పెరగడానికి కారణం అవుతున్నట్లు గ్రహిస్తుంది జాహ్నవి. సాక్ష్యాలతో ప్రభుత్వానికి తెలిపి రఘువీర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అరెస్టు వారెంటు పొందుతుంది సిఐడి బృందం. విషయం గ్రహించి రఘువీర్ రెడ్డి అంతరిక్షంలో ఏర్పాటు చేసుకున్న సబ్ స్టేషన్ వద్దకు పోవాలనుకుంటాడు. ఎందుకంటే  బీటా ఎఫ్ ఎక్స్ 47  నుండి వస్తున్న స్పేస్ షిఫ్ అక్కడకు చేరుతుంది. అందుకోసం తన స్పేస్ సెంటరులో సిద్దంగా వున్న రాకెట్ ఎక్కడానికి కారులో పారిపోతాడు.
*************************************
రఘువీర్ రెడ్డి కాన్వాయ్ వెనకే వందలాది మిలటరీ దళాలు, జేమ్స్ బాండ్ 007 కాల్పులు జరుపుతూ వెంటపడతారు. అదే సమయంలో మద్రాస్ మహేంద్రన్ ముఠా స్పేస్ సెంటరుకు వస్తూ రఘువీరారెడ్డిని ఎటాక్ చేస్తుంది.007 కి ఈ పరిస్దితి మతిపోతుంది. అయినా బాండ్ జోయల్ పరసన్ కాబట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో రఘువీర్ రెడ్డికి జాహ్నవి దొరికిపోతుంది.
**************************************
సైనికులు ,బాండ్ ,మద్రాస్ మహేంద్రన్ అందరూ రఘువీర్ రెడ్డి పై ముప్పేట దాడి చేస్తారు. దాడి నుంచి తప్పించుకుని రఘువీర్ రెడ్డి జాహ్నవిని తీసుకుని స్పేస్ స్టేషన్  లోనికి పోతాడు. అక్కడ బాండ్ తో రఘువీరారెడ్డి కనబడతాడు . ఈలోగా మద్రాసు మహేంద్రన్  రాకెట్ లోనికి చొరబడి అక్కడ వున్న రాకెట్ నడిపే వారిని బెదిరించి రాకెట్ స్టార్ట్ చేయిస్తాడు.. ప్రమాదాన్ని గమనించిన రఘువీర్ రెడ్డి జాహ్నవిని అడ్డుపెట్టుకుని బాండ్  దాడి నుంచి తప్పించుకుంటూ  మెల్లగా రాకెట్ లోనికి పోతాడు. రాకెట్  లోనికి పోయేముందు రఘువీరారెడ్డి వజ్రాలు మాత్రమే కాకుండా ఈ భూమ్మీద దొరకని అత్యంత ప్రమాదకరమైన ప్రేలుడు పదార్థం ఎఫె ఎక్స్ 47 గ్రహంపై కనుక్కొని తీసుకుని వస్తున్నానని ప్రపంచాన్ని భస్మీపటలం చేసి తన సామ్రాజ్యాన్ని స్దాపిస్తానని అంటూ ఆనందంగా కేరింతలు కొడుతూ రాకెట్ లోపలికీ వెళ్ళిపోతాడు.అదే సమయంలో బాండ్ తెలివిగా ఎటాక్ చేసి తనూ రాకెట్ లోపలికి పోయి స్పేస్ షూట్ ధరిస్తాడు. అందరూ స్పేస్ షూట్లు ధరిస్తారు.రాకెట్ భూఅయస్కాంత పరిధిని దాటి అంతరిక్షంలోనికి దూసుకు పోతుంది క్షణాల్లో. రఘువీర్ రెడ్డి జాహ్నవిని రహస్యగదిలో  బందించి రాకెట్ ను తన అధీనంలోకి తెచ్చుకుంటాడు.
బాండ్ జాహ్నవిని వెతికే పనిలో పడతాడు.
జాహ్నవి జాడ కనిపెట్టి విడిపిస్తాడు.
*************************************
క్రిందనున్న ఇంటెలిజెన్స్ కార్యాలయం బాండ్ ప్రయాణిస్తున్న రాకెట్ తో  సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
*********************************
రఘువీర్ రెడ్డి ప్రయాణిస్తున్న రాకెట్ భూకక్ష్యను దాటి అంతరిక్ష స్పేస్ సెంటర్లో చేరుకోగానే ఎదురుగా బీటా ఎఫ్ ఎక్స్ గ్రహం నుండి వస్తున్న రాకెట్ చేరుకుంటుంది. అందులో కోటాను కోట్ల విలువ చేసే వజ్రాలు ఓ వెయ్యి కంటెయినర్ల వరకు ఉంటాయి. అంతే కాకుండా అత్యంత ప్రేలుడు పదార్థ కనీసం ఓ గది నిండా భద్రపరిచి ఉంటుంది.
రఘువీర్ రెడ్డి వచ్చిన రాకెట్ క్యాబిన్ భాగాన్ని ఇతర గ్రహం నుండి వచ్చిన స్పేస్ షిప్ కు అతుక్కునేలా అనుసంధానం చేస్తాడు. భూమి నుండి వచ్చిన రాకెట్ మి సగభాగాన్ని  ప్రేల్చే ప్రయత్నం చేస్తాడు రఘువీరారెడ్డి.
అప్పటికే సగ భాగం మంటల్లో చిక్కుకుని తగలబడుతూ ఉంటుంది .రఘువీర్ రెడ్డి జాహ్నవి ని తీసుకుని ఇతర గ్రహం నుండి వచ్చిన రాకెట్ క్యాబిన్ లోనికి చొరబడతాడు. అక్కడ వున్న రోబోలు,  హ్యుమనాయిడ్స్ రఘువీర్ రెడ్డికు సహకరిస్తాయి. కానీ ప్రమాదాన్ని పసిగట్టిన జేమ్స్ బాండ్, మహేంద్రన్ రఘువీర్ రెడ్డితో పాటు ఇతర గ్రహం నుండి వచ్చిన రాకెట్లోని దూరేస్తారు . హ్యూమనాయిడ్స్ తీవ్రంగా ప్రతిఘటిస్తాయి.రఘువీర్ రెడ్డి భూకక్ష్యను చేరడానికి సజెషన్స్ ఇవ్వమని హ్యుమనాయిడ్స్ ను కొరతాడు. క్రిందనున్న తన స్థావరంలో బృందాన్ని ఆదేశిస్తాడు. రాకెట్ మెల్లగా భూమిని చేరడానికి బయలుదేరుతుంది. మహేంద్రన్  రాకెట్ను తన ఆధీనంలోకి తెచ్చుకునే భాగంగా అక్కడ ఆపరేటింగ్ చేస్తున్న హ్యుమనాయిడ్  బృందాన్ని నాశనం చేస్తాడు.రఘువీర్ రెడ్డి జేమ్స్ బాండ్ తో వున్న జాహ్నవిని వదిలి మద్రాస్ మహేంద్రన్  పని పట్టాలని మద్రాస్ మహేంద్రన్  మీదకు కలబడతాడు.
అదునుగా భావించిన జేమ్స్ బాండ్ జాహ్నవిని రఘువీర్ రెడ్డి నుండి రక్షించి ఓ సీక్రెట్ క్యాబిన్లోకి కనబడకుండా దాక్కుంటారు. మహేంద్ర రఘువీర్ రెడ్డి భీకరంగా కలబడతారు. మహేంద్రన్ రాకెట్ ఆపరేటింగ్ సిస్టంను నాశనం చేస్తాడు తెలియకుండానే.
************************************
భూకక్ష్య వైపు వస్తున్న రాకెట్ ఒక్కసారిగా తన దిశను మార్చుకుని అనంత అంతరిక్షంలోకి రెక్కలు తెగిన పక్షిలా కొట్టుకుపోతుంది. ఇంటెలిజెన్స్ కార్యాలయంలోను రఘువీర్ రెడ్డి శిబిరంలోనూ ఒకటే అలజడి బయలుదేరుతుంది. స్పేస్ షిప్  ఆపరేటింగ్ సిస్టం పూర్తిగా దెబ్బతిందని అదృష్టం ఉంటే తప్ప రాకెట్ కంట్రోల్ లోనికి వచ్చే అవకాశం లేదని భావిస్తుంది ఇంటెలిజెన్స్ కార్యాలయం. ఈ విషయాన్ని బాండ్ కు ఎలాగన్నా తెలియచేయాలని రాడార్ కేంద్రం కమ్యూనికేషన్ సిస్టంతో ప్రయత్నించి సఫలం అవుతుంది.
రాడార్ కేంద్రంలో ఉన్నట్టు ఉండి తీవ్ర టెన్షన్ నెలకుంటుంది. రాడార్ అనంతాకాశంలోని కృష్ణబిలం వైపు పయనిస్తుందని కృష్ణబిలం అంటే ఐస్కాంత బావి లాంటిది. నక్షత్రం తనలో తాను కుచించుకు పోయినప్పుడు అక్కడ అనంత ఐస్కాంత శక్తి సుడులు తిరుగుతూ ఏర్పడుతుంది. అందులో చిక్కుకున్న ఏ వస్తువు బయటకు రాలేదు. వీళ్ళతో రాడార్ కేంద్రం కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటుంది . రాకెట్టు గల ప్రమాదాన్ని తెలిపి హెచ్చరిస్తుంది. రాడార్ కేంద్రం ఐస్కాంత ప్రభావాన్ని గురవుతున్నప్పుడు స్పేస్ షప్  కుదుపులకు లోనవుతుంది. ఆలస్యం చేయకుండా బాండ్ బయటపడడానికి అన్వేషణ కొనసాగిస్తాడు.
*********************************
మద్రాస్ మహేంద్రన్ రఘువీర్ రెడ్డి లు ఒకరి నొకరు చంపుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రోబోలు హ్యుమనాయిడ్స్  నాశనమవుతాయి.007,జాహ్నవిలు రాకెట్ క్యాబిన్లో కి పోయి భూకక్ష్య వైపు రావడానికి ప్రయత్నించి సఫలీకృతం అవుతారు. ఇద్దరినీ రాకెట్ క్యాబిన్లోల్లో చూసిన రఘువీరారెడ్డి గ్రహించి దాడిచేయిబోతాడు. కానీ అప్పటికే రాకెట్ క్యాబిన్ విడిపోయి  భూకక్ష్య వైపు ప్రయాణిస్తారు .రఘువీర్ రెడ్డి ఉండిపోయిన రాకెట్ కృష్ణబిలం లోనికి కూరుకు పోవడానికి వేగంగా వెనక పోతూ ఉంటుంది. రఘువీర్ రెడ్డి సపోర్టు ఇంజనును కంట్రోల్ చేయడానికి పిచ్చిపిచ్చిగా అక్కడ ఉన్న బటన్లు నొక్కేస్తూ వుంటాడు. మహేంద్ర ఏమయ్యాడో ఎవరికీ అర్థం కాదు
భూకక్ష్య వైపుకు కొత్త దూరం ప్రయాణించిన 007  రాకెట్ మెల్లగా వెనక్కి పోతున్న సంగతి గ్రహిస్తాడు. రాకెట్ యొక్క శక్తి భూకక్ష్యవైపు ప్రయాణించడానికి  సరిపోవడం లేదని గ్రహిస్తారు. ఇదే విషయాన్ని రాడార్ కేంద్రం 007ని హెచ్చరిస్తుంది. 007 ప్రయాణిస్తున్న రాకెట్ కూడా కృష్ణబిలం వైపు వేగంగా బయటకు పోతూ ఉంటుంది.

రఘువీర్ రెడ్డి ఒకప్రక్క రాకెట్ను  పని చేయించడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు . ఆ రాకెట్ ఒత్తిడికి చిన్న చిన్న ముక్కలుగా విరిగి పోతుంది 007 నిస్సహయ స్థితికి వస్తాడు. ఏదో ఒకటి చేసి బయటపడని రాడార్ కేంద్రం హెచ్చరిస్తుంది. రాడార్ కేంద్రంలోని జ్ఞానేశ్వరి దేవి అక్కడ ఉన్న పరిస్థితికి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. జాహ్నవికి ఏడుపు తన్నుకొస్తోంది. ప్రయాణిస్తున్న రాకెట్ కి భూకక్ష్యను చేరే శక్తి లేదని గ్రహించిన ఇంటెలిజెన్స్ కార్యాలయంలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. 007 నుండి రాడార్ కేంద్రానికి సంకేతాలు ఆగిపోతాయి.
******************************************
కానీ అసాధ్యుడైన 007 తెలివిగా ఆలోచిస్తాడు వేగంగా మెదడుకు పదును పెడతాడు. తను ప్రయాణిస్తున్న రాకెట్ క్యాబిన్లో చిన్న సేఫ్టీ బోట్ ఏదైనా ఉందేమో అని వెతకడం ప్రారంభిస్తాడు. జీరో జీరో సెవెన్ కు ప్రాణం లేచి వస్తుంది . ఆలస్యం చేయకుండా సేఫ్టీ బోట్  ఓపెన్ చేస్తాడు. బాండుకు గుండె ఝల్లుమంటుంది. అందులో మద్రాస్ మహేంద్రన్  వికృతంగా నవ్వుతూ కనిపిస్తాడు. 007 మీదకి లంకిస్తాడు. మహేంద్రన్ సీక్రెట్ గా సేఫ్టీబోట్లో చేరి దాక్కున్నాడు.
ఒకవైపు రఘువీరారెడ్డి చేసిన పిచ్చి ప్రయత్నం ఫలించి రాకెట్ వేగం పుంజుకుని తిరిగి ప్రయాణం సాగిస్తోంది. రఘువీర్ రెడ్డి ఆనందానికి అవధులు ఉండవు. 007  మహేంద్రన్ను చితకబాది స్పేస్ బోట్ లో బంధించి  రఘువీర్ రెడ్డి ప్రయాణిస్తున్న రాకెట్ వైపు గురి చూసి వేగంగా స్టార్ట్ చేసి వదిలేస్తాడు. మహేంద్రన్ గుండె జారిపోతుంది.పెడబొబ్బలు  పెడుతూ వుంటాడు బోట్  రఘువీర్ రెడ్డి రాకెట్ వైపు దూసుకుపోతుంది. ఎదురుగా వస్తున్న స్పేస్ బోట్ ను చూసి రఘువీరారెడ్డి ముచ్చెమటలు పట్టేస్తాయి. ఆ స్పేస్ బోట్ గాని రాకెట్ ను గుద్దుకుంటే  స్పేస్ షిప్ ప్రేలిపోవడం ఖాయమని హడలి పోతాడు. రఘువీర్ రెడ్డి ఏమిచేయాలో అర్థం కాదు.
007  అదే ఆలోచించాడు. రఘువీర్ రెడ్డి రాకెట్ ను కాని ప్రేల్చగలిగితే ఆ ప్రేలుడుకు తిరిగి తన రాకెట్ బ్లాక్ హోల్  ఐస్కాంత ప్రభావం నుండి బయటపడి భూకక్ష్య వైపు వేగంగా నెట్టబడుతుందని ఆలోచించి అక్షరాల అమలు చేశాడు.
మహేంద్రన్ ఉన్న సేఫ్టీబోట్  రఘువీర్ రెడ్డి ప్రయాణిస్తున్న రాకెట్ను క్షణాల్లో గుద్దుకుంటుంది.  అక్కడ మహావిస్ఫోటనం సంభవిస్తుంది. ఎందుకంటే బీటా ఎఫ్ ఎక్స్ 47 లోనుండి తెస్తున్న అతిశక్తివంతమైన ప్రేలుడు పదార్దం ప్రేలి విస్పోటనం సంభవించడంవలన.  ఆప్రేలుడు శక్తికి బాండ్ ఊహించినట్లే తన రాకెట్ వాయువేగంతో భూకక్ష్య వైపు నెట్టబడుతుంది.
రాకెట్ ను స్పేస్ బోట్ గుద్దుకోవడంతో రఘువీర్ రెడ్డి, మద్రాస్ మహేంద్రన్ తోపాటు వజ్రాల డంప్ మరియు ప్రమాదకరమైన ప్రేలుడు పదార్థం కూడా అంతరిక్షంలో కాలి బూడిద అవుతాయి.
భూకక్ష్య లోనికి వచ్చిన 007 రాకెట్ తో ఇంటెలిజెన్స్ కార్యాలయంలోని రాడార్ కేంద్రం సిగ్నల్స్ అందుకుంటుంది.  007 , జాహ్నవిలు సేఫ్ గా భూకక్ష్య లోకి వచ్చారని తెలియగానే అందరూ హర్షధ్వానాలు చేస్తారు. ప్రమాదకరమైన నేరస్తులనే కాకుండా ప్రపంచానికి జరిగిన పెను ముప్పును తప్పించినందుకు జేమ్స్ బాండ్ 007ను అందరూ అభినందిస్తారు.
రాకెట్ లోనే 007, జాహ్నవి ముద్దుల్లో మునిగి తెలియడంతో జ్ఞానేశ్వరి దేవి రాడార్ స్విచాఫ్ చేస్తుంది నవ్వుకుంటూ.

సిద్దాంతపు బెన్ జాన్ సన్ ( జనశ్రీ )
9908953245

   
   

ReplyForward

at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

చింతకూర గంప గంగమ్మ ( జనశ్రీ) మన ఊరి కథలు - 3

                                                      చింతకూర గంప గంగమ్మ ( జనశ్రీ)
                                                               మన ఊరి కథలు - 3
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. చింతపిక్కలు ఏరుకొని జావ కాసుకుని కడుపు నింపుకునే వారు ఆరోజుల్లో. అదే సమయంలో సామర్లకోట నుండి వ్యాపారస్తుల (దుమ్ములు వ్యాపారం) కుటుంబంలో నుంచి ఉప్పాడకు కోడలుగా వచ్చింది  మిరియాల గంగమ్మ.  ఉప్పాడ శివారు  అమీనాబాద్ కు చెందిన ఏడిది ముసలయ్య మనువాడాడు మన గంగమ్మను. గంగమ్మకు 11 మంది అప్పాచెల్లెళ్ళు. డబ్బు ఆడుతున్న కుటుంబం నుంచి వచ్చిన గంగమ్మకు ఉప్పాడలోని కరువు పరిస్థితి ఆశ్చర్యంగా తోచింది.కూలి పనులు లేవు కాబట్టి చింతకూర అమ్మి కుటుంబం నడపాలని ఆలోచించింది. ఉదయాన్నే గంప పట్టుకుని ఎండపల్లి శివారు చింతతోపు దగ్గరకు ముసలయ్యను తీసుకుపోయి చింత చివరలు కోసి ఉప్పాడ చిన్న బజార్ లోకి పట్టుకెళ్ళి అమ్మేది. ఇంటి పెరటిలో మల్లె తోట వేసి మల్లె మొగ్గలు బాపనోళ్ళు ఇళ్ళకి పట్టికెళ్ళి అమ్ముకు వచ్చేది. ముసలయ్య మాంచి చమత్కార మనిషి. భార్యకు చేదోడు వాదోడుగా వుంటూ అప్పుడప్పుడూ చింతకూరను బజారుకు పట్టుకెళ్లి అమ్ముకు వచ్చేవాడు. అమ్మడానికి పెట్టినప్పుడు ముదరాకు అని ఎవరైనా అడిగితే "సనుకాలుతో చింతకూర నూరతావుంటే  మీ కొప్పు ఊడిపోకుండా వుంటే నన్ను వచ్చి అడగండి"  అంటూ హాస్యమాడేవాడు. ముసలయ్య చమత్కార మనిషి కావడంతో ఊరిలో గంగమ్మకు,ముసలయ్యకు పలుకుబడి వచ్చింది. గంగమ్మ ఎండపల్లి పొలాలలో పరగ ( పొలంలో కోసిన వరి చేనును కట్టలు కట్టేప్పుడు రాలే వరి కంకులు)ఏరుకొని వచ్చేది. వాటిని బల్లలపై కొట్టి రాలిన గింజలను పెద్ద మట్టి బానల్లో(కుండలు) దాచేది. మెల్లమెల్లగా కూడబెట్టిన డబ్బులతో సపోటా తోటలు కూడా కౌలుకు తీసుకొని సపోటా పళ్ళ వ్యాపారం కూడా చేసేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమాయకమైన రోజుల్లో తాను నిజాయితీగా వుంటూ గంగమ్మ కష్టపడే తత్వాన్ని , ఆరోజుల్లోని అమాయకత్వాన్ని చెప్పడం కోసమూను ఇదంతా.
పొద్దంతా పరగ ఏరుకొచ్చిన గంగమ్మ సాయంత్రం ఐదు గంటలకి చూరులో దాచిన లంక పొగాకు చుట్ట వెలిగించి సేద తీరేది.  అప్పటికి టీ పానీయం అందుబాటులో లేదు . గబగబా ఎసరు పెట్టి గంజి వార్చి నాలుగు గుటకలు గంజిని డోకు( కొబ్బరి చిప్పకు వెదురుపుల్ల దూర్చి చేసిన గరిటె)  తో తాగి  గంపట్టుకుని బజారుకు బయలుదేరేది.

మరియమ్మ పంతులమ్మగారికి ఇష్షమైన సఖి మన గంగమ్మ
గంగమ్మ నడుస్తుంది కాని ఊరి నుండి వచ్చిన కూతురు కటాచ్చమ్మ, మనవడు అబ్బు గురించే ఆలోచనంతా. గత ఙ్ఞాపకాల్లోకి నడుస్తూ వెడుతుంది తనకు మగ కవల పిల్లలు పుట్టిన నెలలోనే చనిపోతే ఆశ చావక తిరిగి గోతిని తవ్వి బిడ్డల్ని చూడందే ఏడుపు ఆపలేదు గంగమ్మ . గొయ్యి తవ్వే వారు " ఇలా తిరిగి చూడడం తప్పు  మరల మగపిల్లలు పుట్టరు"  అని   చెప్పినా వినలేదు అందుకేనేమో కూతురు కటాచ్చమ్మ పుట్టింది. మరల మగబిడ్డలు పుట్టలేదు. కూతుర్ని టీచరు చదివించింది ఇష్టపడి. కటాచ్చమ్మ కొడుకే అబ్బు. చాన్నాళ్ళకు మగబిడ్డ పుట్టాడు. ఆశతీరా ఆడుకోవాలి అనుకుంటూ నడుస్తుంటే. ఏడిద సూర్రావు పిలుపుతో ఙ్ఞాపకాల బయటకు వచ్చింది గంగమ్మ.
.ఏడిద సూర్రావు బ్రాకేట్ ఆడతాడు.( ఇదో రకమైన లాటరీ జూదం ప్రభుత్వం నిషేదించింది.) రోజూ కాకినాడ నుండి నెంబర్లు వస్తాయి . కొట్టుముందు  నిన్న రాయించుకున్న నెంబర్లు రాసి పెట్టేవారు రాయించుకున్న నెంబరు తగిలితే డబ్బులు ఇచ్చేవారు .గంగమ్మ నిన్న రాయించుకున్న నెంబరు చీటి తీసి చూసుకుంది. రోజూలాగే ఆ రోజూ తగల్లేదు. రోజు 2 రూపాయల బ్రాకెట్ నెంబర్లు రాయించుకోవడం గంగమ్మకు అలవాటు. ఎప్పుడో ఓ సారి తగిలింది బ్రాకెట్ నెంబరు మరలా తగల్లేదు. కొత్త నెంబరు రాయించుకుని  నూకాలమ్మ గుడి దాటి పాలంకోరి మేడదగ్గరకొచ్చింది. ఆయుర్వేదం మందు బిళ్ళలు కొనుక్కుంది. కాళ్ళపీకులకు పాలంకి సుబ్బారావు మంచి బిళ్ళలిత్తారని గంగమ్మ నమ్మకం.ఆయుర్వేదం బిళ్ళల పొట్లాం గంపలోవుంచి బొడ్డులో దోపుకున్న గుడ్డ శిక్కంలో డబ్బులు తీసి ఇచ్చింది. " అబ్బుగాడికి ఏదైనా కొనాలి బజారులో  బిడ్డడు రాక రాక వచ్చాడు " అని అనుకుంటూ  అడుగులు పెద్దవివేస్తూ నడుస్తుంది.నాగూరు మేడ దాటుతుంటే  " ఎమే కూతురు గాని వచ్చిందేటే కంగారుగా నడుత్తున్నావు "  అని ఎటకారమాడాడు నాగూరు. నవ్వే సమాదనమిచ్చి  వెడుతుంటే తిగుటి పెకాశరావు మేడలో నుండి గట్టికేక " గంగమ్మా...... వస్తువులు  ఎప్పుడు విడిపిస్తావు " అంటూ."వచ్చే అమాసకి విడిపిత్తానండి " అని సమాదానమిచ్చి నాలుగడుగులు  ఎసేసరికి పెద్దాబ్బాయి కీళ్ళీకొట్టు నుండి కుయ్య్ మని గోళీసోడా చప్పుడు వింది .  గోళీసోడా తాగాలని గంగమ్మకు బెమ పుట్టింది .కొట్టు ముందు  వాడోళ్ళు ( మత్సకారులు) ఎక్కువ మంది మూగి వుండే సరికి బజారు చేసుకుని వచ్చేప్పుడు తాగుదాంలే అనుకుని ముందుకుపోయింది గంగమ్మ..
సీకోటి అప్పారావు చుట్టకాలుత్తు ఎత్తరగు మేడ గట్టు చివర కూర్చుని కనిపించాడు. సీకోటి అప్పారావు అమీనాబాద సర్పంచయినా బట్టలవ్యాపారం చేసేవాడు. "మా అబ్బుగాడికి జుబ్బా కొంటాను అప్పారావుగారు మంచి బట్టలుంటే పక్కన బెట్టండని " గట్టిగా అరిచింది గంగమ్మ." ఇదిగొనే ఏటగాళ్ళ గోచీలు రంగురంగులున్నాయి. గోచీ( దాదాపు మీటరు పొడవుండేవి) ఓటి మీ అబ్బుగాడికి  కొను "  అంటూ విరగబడి నవ్వాడు సీకోటి అప్పారావు. అవును మరి చేపల వేటగాళ్ళు పెదపండగ వస్తుందంటే సీకోటి అప్పారావు బట్టల దుకాణం ముందు ఏలగట్టిన గోచీలు కొనుక్కుంటం ఆనవాయితీ మరి.
సందు తిరుగుతుంటే  కిరాణా కొట్టులోంచి తూమ్ బొక్కోడు ( కొట్టు యజమాని పేరు ఎవడు పెట్టేడో నిక్ నేమ్ ) అరుపులు వినబడుతున్నాయి. అది అసలు సిసలు శెట్టిగారి గొంతు. డబ్బాలో రాళ్ళేసి గిలకొట్టినట్లుండేది. "ఈ శెట్టి ఎప్పుడూ అంతే బేరాలకు వచ్చినోళ్ళను తిడతావుండడమే" అనుకుంటూ  చిన్న బజార్ కి వచ్చేసింది గంగమ్మ. ఉప్పాడలో చిన బజారు రోజూ జరుగుతుంది. పెద బజారులో వారం సంత జరిగేది.గంగమ్మ చేపల గంపలు దగ్గరకు పోయి నాలుగు ఆకు పరుగులు , రొయ్యలు గోంగూర కట్ట  బేరమాడి కొన్నాది. గంగమ్మని " ఇయాల గంపెట్టలేదేమే" అంటూ అందరూ అడిగారు." ఈయల మా కూతురు ,మనవుడూ ఊరినుండి వచ్చారు అందుకనే కొట్టెట్టలేదని చెప్పింది" ఇంతలో పుల్ల ఐసు సూరిగాడు గంగమ్మను" పుల్లఐసు కొంటావేటి "అని అడిగాడు. పుల్ల ఐసు బజారుకి రావడం అదే మొదటిసారి. గంగమ్మ చూడడ్డం కూడా అదే. మనవడి కోసం పుల్ల ఐసు కొని గంపలో పెట్టుకుంది.ఫుల్ల ఐసు చేతిలో పెట్టగానే మనవడి ముఖంలో కాంతిని తలచుకుని. సరుకులు అన్నీ కొనుక్కుని గబ గబా ఇంటికి వచ్చేస్తూ  బియ్యం కొట్టు పొన్నేటి ఎంకట్రావు దగ్గర గిద్దమసూరి పాతబియ్యం అడ్డుడు కొని చెంగులో మూటగట్టి నెత్తిమీద పెట్టుకుంది. కూతురు ముతక బియ్యం తినలేదని. ఎంకట్రావు చాటున నల్లమందు అమ్మతాడు. రోజూ ఓ బిళ్ళేసుకుని తొంగొవడం గంగమ్మకు అలవాటు.  రెండు రూపాయల నల్ల మందు బిళ్ళ కొనుక్కుని  శిక్కంలో భధ్రంగా దాచుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తూ  అమీనాబాద  నూకాలమ్మ గుడులు దగ్గరికి చేరుకుంది.  కూతురు కటాచ్చమ్మ పెదనుయ్యి దగ్గర తాటాకు చేదతో ఇత్తడి బిందెలోకి నీళ్ళు తోడతా కనిపించింది. మనవడు అబ్బు నూతి చూట్టూ ఉన్న చప్టాకి (అంచు)పడ్డ గొతుల్లొని నీరుని కాళ్ళవ్రేళ్ళతో తోడుతూ ఆడుకుంటం కనిపించింది. కూతురు ఉద్యోగస్తురాలు పని చేస్తుంటే చూడలేక "నీకెందుకమ్మా ఇంటిలో ఉండలేకపోయావా నేను చేత్తాను కదా" అంది గంప కిందనెడుతూ. "మామా నాకేం కొన్నావూ" అని అడిగాడు మనవడు గంపలోకి తొంగి చూస్తూ." ఇదిగో నా బుజ్జి కన్నా నీకు పుల్ల ఐసంట  కొత్తగా వచ్చింది బజారులోకి అది తెచ్చాను" అని గంపలో చెయ్యెట్టింది.గంపలో చెయ్యెట్టిన గంగమ్మకు చేతికి తడి చిన్న వెదురు పుల్ల తగిలాయి. ఏం అర్దం కాలేదు గంగమ్మకి. గబ గబా గంపంతా తడిమింది. పుల్ల ఐసు కనబడలేదు. ఐసు అమ్మినోడు మోసంచేసాడనుకుంది.మనవడికి అడిగింది ఇవ్వలేకపొయానన్న బాదతో  ఎంత మోసంచేసాడు నా బంచోతుగాడు, నాగుడ్డ, నా పాత, ఆడూడుపోను అంటూ తిట్లు లంఖించుకుంది. ఎప్పుడూ ఐసు చూడని  అమాయకపు గంగమ్మకు ఐసు కరిగి పొద్దని తెలియక కొని గంపలో పెట్టుకుంది. తల్లి అవస్ధ అర్దమైంది ఉద్యోగస్తురాలైన కూతురు కటాచ్చమ్మకు. తల్లి అమాయకత్వానికి నూతి గచ్చుకు జారబడి తలచుకుని తలచుకుని నవ్వుతూనే వుంది.

సిద్దాంతపు బెన్ జాన్ సన్  (జనశ్రీ )
ఉప్పాడ కొత్తపల్లి
9908953245

ReplyForward
at January 10, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Home
Subscribe to: Comments (Atom)

ALIVI

 

  • క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్
    క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్ భారతదేశం నుండి పారద్రోలతాయనడం అనడం ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం. క్రైస్తవులలో ఉన్న ఈ నమ్మకం అతి పెద్ద అప...
  • moggalu
    చరవాణి, ముఖపుస్తకం లో మునిగిపోయిన కుటుంబాలు అనుబందాలు ఆప్యాయతలుశూన్యం తనదికాని లోకాన నోరుజారి నాలిక కరుచుకున్న జీవితం ...
  • నీలి మేఘం (జనశ్రీ)
    నీలి మేఘం (జనశ్రీ) తుషార బిందువులు కవితా సంపుటి నుండి పువ్వల్లే వికసించావు నవ్వల్లే నవ్వించావు కలలల్లే కవ్వించావు పలుకరించుమా ప...

Blog Archive

  • ▼  2026 (23)
    • ▼  January (23)
      • ALIVI
      •  అది 1971  తారు రోడ్లు అంతగాలేని కాలం.అమీనాబాద మా ...
      •  దొమ్మరాటగ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ...
      •  పిట్టల దొరపోన్య సంబాషణా చాతుర్యంతో ఇంటిసారిని కడు...
      •  పండరీ భజనమన ఆంధ్రదేశంలో ఆ మూభాగం చుట్టివచ్చినవి, ...
      •  కర్ర సాముప్రాచీన జానపదకళలకు చెందిన వాటిలో కొన్ని ...
      •  పగటి వేషంనన్నెతకం నవలాదూపాలలో సగటి వేషం ఒకటి తెలు...
      •  పంబకథసత్తెమ్మ సంబరాలలో అంబరానే జగదంబరానే అంటూ అమ్...
      •  కోలాటంశతాబ్దాల నుండి తెలుగు వారు పోషించుకుంటూ వస్...
      •  బుట్టబొమ్మలుతెలుగు నాట గ్రామదేవతల జాతరలలోను, సంబర...
      •  బుడబుక్కల వారుశివుని చేతిలో కనిపించే భీమరుకమే బుడ...
      •  బైటో భజనదేశంలో లేని ఎల్ల పట్టణం లేనేలేదు ఆలయం ఉన్...
      •  గారడీ నృత్యంపెద్దదోళ్ళము కర్రలతో లయగా పెద్ద శబ్దం...
      •  గరగ నృత్యం''గంగ' అంటే నుండి కుండను తలపై పెట్టుకున...
      •  చెక్కబజనలు చెట్టు బజనలుసంబరాలలో సత్సాహవంతులైన యువ...
      •  NTR గారి ఈ ఫేమస్ డైలాగ్ చాలామందికి గుర్తు ఉండే ఉం...
      •  వీరనాట్యంసంప్రదాయకులు శివభక్తి పరులు ఆరాధన పర్వంగ...
      •  ఉప్పు నృత్యంధమతం చెప్పు మా విసురుస్తుండగా పల్లెల్...
      •  గిరిజన (కొమ్మునృత్యం)భారతీయ సంస్కృతి ప్రపంచంలోని ...
      •  హరిదాసుసంక్రాంతి తెలుగువారి పండుగలలో పెద్ద పండుగ ...
      •  పెద్దపులి వేషంమాట పెద్దపులాట అని పిలువబడే ఈ ప్రాచ...
      •  శక్తి వేషంభయానక రసాన్ని అద్భుతంగా మనకళ్లముందు ప్ర...
      •  సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర)రచన : శ్రీ ఎస్....
  • ►  2025 (4)
    • ►  October (1)
    • ►  September (3)
  • ►  2024 (16)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (1)
    • ►  June (2)
    • ►  April (2)
    • ►  February (1)
  • ►  2023 (4)
    • ►  June (3)
    • ►  May (1)
  • ►  2022 (59)
    • ►  December (1)
    • ►  November (19)
    • ►  September (1)
    • ►  August (5)
    • ►  July (2)
    • ►  June (9)
    • ►  May (11)
    • ►  April (10)
    • ►  February (1)
  • ►  2021 (9)
    • ►  July (3)
    • ►  June (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2020 (48)
    • ►  November (2)
    • ►  October (11)
    • ►  August (1)
    • ►  April (3)
    • ►  January (31)

Labels

  • ఉప్పాడ పై తోట్టతొలి కవిత

Report Abuse

Followers

  • Home

Search This Blog

Awesome Inc. theme. Theme images by molotovcoketail. Powered by Blogger.